
నెల్లూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన జిల్లా పర్యటనలో ప్రజలకు పెను ప్రమాదం తప్పింది. నారంపేటలోని ఎమ్ఎస్ఎమ్ఈ పార్క్ వద్ద అధికారులు ఏర్పాటు చేసిన ఆర్చి కుప్పకూలింది. అప్పటికే చంద్రబాబు, ప్రజలు వెళ్లిపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. ప్రజావేదిక వద్ద ఉదయమే ఏర్పాటు చేసిన ఆర్చి.. సాయంత్రం కల్లా కుప్పకూలడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆర్చి కూలే సమయంలో అక్కడ ఎవరూ లేరని, లేకపోతే పెద్ద ప్రమాదమే జరిగేదని స్థానికులు చెబుతున్నారు.

ఈరోజు(గురువారం) నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటించారు. ప్రజావేదిక పేరుతో జరిగిన సభకు సీఎం హాజరయ్యారు. ఈ క్రమంలోనే భారీ ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లు భాగంగా ఏర్పాటు చేసిన ఒక ఆర్చ్ కుప్పకూలింది. అది జనాలు ఎవరూ లేని సమయంలో కూలడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.
