![Rasi phalalu: Daily Horoscope On 11 Feb 2025 In Telugu](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/Tuesday.jpg.webp?itok=FMdI8oO-)
గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, తిథి: శు.చతుర్దశి రా.7.02 వరకు, తదుపరి పౌర్ణమి, నక్షత్రం: పుష్యమి సా.6.55 వరకు, తదుపరి ఆశ్లేష, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ఉ.8.51 నుండి 9.39 వరకు, తదుపరి రా.11.02 నుండి 11.50 వరకు, అమృత ఘడియలు: ప.12.28 నుండి 2.03 వరకు; రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు, యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు, సూర్యోదయం: 6.34, సూర్యాస్తమయం: 5.55.
మేషం.... కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో కొంత సర్దుబాటు చేసుకుంటారు. శ్రమపడ్డా ఫలితం కనిపిస్తుంది. వృత్తి, వ్యాపారాలు నిదానిస్తాయి.
వృషభం... శ్రమ ఫలిస్తుంది. ఉద్యోగయత్నాలు సానుకూలం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వృత్తి, వ్యాపారాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది..
మిథునం.... మిత్రుల నుంచి ఒత్తిడులు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పనులలో కొంత జాప్యం. వృత్తి, వ్యాపారాలలో కొంత అనుకూలత.
కర్కాటకం... పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. వాహనయోగం. ఆలయ దర్శనాలు.. చర్చలు సఫలం. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
సింహం.... పనులలో స్వల్ప ఆటంకాలు. దైవదర్శనాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధుమిత్రుల నుంచి పిలుపు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
కన్య... కొత్త మిత్రులు పరిచయం. వాహనాలు కొంటారు. ముఖ్య సమావేశాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.
తుల... నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ధనప్రాప్తి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.
వృశ్చికం... పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి. బాధ్యతలు పెరుగుతాయి. బంధువులతో చర్చలు. వృత్తి, వ్యాపారాలు కొంత ఉత్సాహాన్నిస్తాయి..
ధనుస్సు..... శ్రమాధిక్యంతో పనులు పూర్తి. దైవదర్శనాలు. పలుకుపడి పెరుగుతుంది. కొన్ని బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.
మకరం... వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
కుంభం... కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. భూవివాదాల పరిష్కారం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
మీనం.... బంధువర్గం నుంచి కీలక సమాచారం. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో కొన్ని ఇబ్బందులు. వాహనయోగం. చర్చలు సఫలం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహాన్నిస్తాయి..
Comments
Please login to add a commentAdd a comment