
మలయాళీ నటి పార్వతి నాయర్ వివాహ బంధంలో అడుగుపెట్టారు.

హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త ఆశ్రిత్ అశోక్‌ను ఫిబ్రవరి 10న వివాహమాడారు.

తమది ప్రేమ వివాహమని తెలిపిన పార్వతి.. అశ్రిత్‌కు సినిమా పరిశ్రమతో ఎలాంటి సంబంధం లేదని చెప్పింది.

2012లో ‘పాపిన్స్’ అనే మలయాళ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఆమె ఇప్పటి వరకు సుమారు 30కి పైగా చిత్రాల్లో నటించింది

అజిత్‌తో ఎంతవాడు గానీ, ఉత్తమ విలన్, ది గోట్, ఓవర్ టేక్ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది.

తెలుగులో నాని 'జెండాపై కపిరాజు' చిత్రంలో ఆమె నటించింది.

అబుదాబిలో హైస్కూల్ వరకూ చదివిన ఈ బ్యూటీ ఆ తరువాత తన ఉన్నత విద్యను కర్ణాటకలో పూర్తిచేశారు.

ఆ తరువాత మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన పార్వతీ మిస్ కర్ణాటక అందాల పోటీలో పాల్గొని కిరీటాన్ని గెలుచుకున్నారు.

అజిత్ హీరోగా నటించిన ఎన్నై అరిందాల్ చిత్రంలో అరుణ్‌విజయ్‌కు జంటగా నటించి మంచి గుర్తింపు పొందారు.








