రాజీపడని రాజా | Bobby Simha role in Disco Raja | Sakshi
Sakshi News home page

రాజీపడని రాజా

Published Fri, Nov 8 2019 3:04 AM | Last Updated on Fri, Nov 8 2019 3:04 AM

Bobby Simha role in Disco Raja - Sakshi

రవితేజ

ప్రేక్షకుల మందుకు సరికొత్తగా వచ్చేందుకు కొత్త విడుదల తేదీని ఖరారు చేసుకున్నారు ‘డిస్కో రాజా’. రవితేజ హీరోగా వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ఇది. ఇందులో పాయల్‌ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్‌ కథానాయికలుగా నటించారు. ఈ చిత్రంలోని బుర్మ సేతు అనే పాత్రలో నటిస్తున్నారు తమిళ నటుడు బాబీ సింహా. సాయి రిషిక సమర్పణలో రామ్‌ తాళ్లూరి, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు.

‘డిస్కో రాజా’ చిత్రాన్ని జనవరి 24న విడుదల చేయనున్నట్లు గురువారం నిర్మాత రామ్‌ తాళ్లూరి వెల్లడించారు. ఈ నెల 18తో షూటింగ్‌ మొత్తం పూర్తవుతుంది. ఈ చిత్రం టీజర్‌ను డిసెంబరు మొదటి వారంలో విడుదల చేస్తారు. ‘‘ఈ సినిమాలో గ్రాఫిక్స్‌ కీలకమైనవి. మేం రాజీపడాలనుకోవడం లేదు. అందుకే సినిమా విడుదలను వాయిదా వేయక తప్పలేదు’’ అన్నారు రామ్‌ తాళ్లూరి. ఇంతకుముందు ఈ సినిమాను డిసెంబరు 20న రిలీజ్‌ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement