‘డిస్కోరాజా’ ఎక్కడున్నాడు? | Ravi Teja And VI Anand Disco Raja on hold | Sakshi
Sakshi News home page

‘డిస్కోరాజా’ ఎక్కడున్నాడు?

Published Sat, May 4 2019 10:28 AM | Last Updated on Sat, May 4 2019 10:29 AM

Ravi Teja And VI Anand Disco Raja on hold - Sakshi

సీనియర్ హీరో, మాస్‌ మహరాజ్‌ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం డిస్కోరాజా. వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సోషియో ఫాంటసీ సినిమాను ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. గతంలో రవితేజ హీరోగా నేలటిక్కెట్టు సినిమాను నిర్మిస్తున్న ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్మెంట్స్‌కు నష్టాలు రావటంతో రవితేజ అదే బ్యానర్‌లో మరో సినిమా చేసేందుకు అంగీకరించాడు.

ఇటీవల ప్రారంభమైన ఈ సినిమాకు సంబంధించి తరువాత ఎలాంటి అప్‌డేట్స్‌ బయటకు రాలేదు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయినట్టుగా ప్రచారం జరుగుతోంది. బడ్జెట్‌ విషయంలో నిర్మాత, దర్శకుల మధ్య వచ్చిన అభిప్రాయ బేధాల కారణంగా ప్రాజెక్ట్‌ ఆగిపోనట్టుగా ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో డిస్కోరాజా కథ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఓ బేబి కథ ఒకే విధంగా ఉంటాయన్న వార్తలు కూడా సినిమా ఆగిపోవటానికి కారణం అన్న ప్రచారం జరుగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement