
రవితేజ
పాత బస్తీ వీధుల్లో విలన్లను ఇరగ్గొట్టారు రాజా. మరి..రాజా ఉతుకుడు ఏ లెవల్‌లో ఉందో ‘డిస్కోరాజా’ సినిమాలో తెలుస్తుంది. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ, ఒక్క క్షణం’ వంటి చిత్రాలను తెరకెక్కించిన వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందుతున్న సినిమా ‘డిస్కో రాజా’. ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. మరో కథానాయిక ఎంపిక కావాల్సి ఉంది. రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్నారు. ఇటీవల రవితేజ, ‘వెన్నల’ కిశోర్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించిన టీమ్ లేటెస్ట్‌గా హైదరాబాద్‌లోని పాత బస్తీలో షూటింగ్‌ను పూర్తి చేశారు. అక్కడ కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. బాబీ సింహా, సత్య, సునీల్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment