అది ఫేక్‌ ఫోటో.. క్లారిటీ ఇచ్చిన మూవీ టీం | Director VI Anand Says Ravi Teja Disco Raja Look Fake | Sakshi
Sakshi News home page

అది ఫేక్‌ ఫోటో.. క్లారిటీ ఇచ్చిన మూవీ టీం

Published Sun, Aug 25 2019 12:06 PM | Last Updated on Sun, Aug 25 2019 1:50 PM

Director VI Anand Says Ravi Teja Disco Raja Look Fake - Sakshi

పెరుగుతున్న టెక్సాలజీ సినీ రంగాన్ని ఇబ్బందుల పాలు చేస్తోంది. ఇప్పటికే పైరసీ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సినీ పరిశ్రమకు, ఇప్పుడు మొబైల్స్‌, యాప్స్‌ వల్ల కూడా సమస్యలు ఎదురవుతున్నాయి. తాజాగా రవితేజ చేస్తున్న డిస్కోరాజా సినిమస్ను ఫేస్‌ యాప్‌ ఇబ్బందుల్లో పడేసింది. డిస్కోరాజా సినిమాలో రవితేజ లుక్‌ అంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అయ్యింది.

రవితేజ 25 ఏళ్ల కుర్రాడిగా కనిపిస్తున్న ఈ ఫోటోపై పలువురు సినీ ప్రముఖులు కూడా స్పందించారు. అయితే ఫైనల్‌ గా ఈ ఫోటోపై చిత్రయూనిట్‌ స్పందించారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్న ఫోటో అఫీషియల్‌ కాదని, త్వరలోనే అధికారిక ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేస్తామని దర్శకుడు వీఐ ఆనంద్‌ వెల్లడించారు. దీంతో రవితేజ యంగ్‌ లుక్‌పై క్లారిటీ వచ్చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement