
డిస్కో రాజా ముగ్గురు హీరోయిన్లతో జోడీ కట్టనున్నారు. ఆల్రెడీ ఇద్దరు హీరోయిన్లు సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు మూడో రాణి కూడా తోడయ్యారు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘డిస్కో రాజా’. పాయల్ రాజ్‌పుత్, నభా నటేశ్ కథానాయికలు. రామ్ తాళ్లూరి నిర్మాత. ఈ సినిమాలో మూడో హీరోయిన్‌గా తాన్యా హోప్ ఎంపికయ్యారు. ఇది వరకు ‘నేను శైలజా, అప్పట్లో ఒకడుండేవాడు, పటేల్ సార్’ వంటి సినిమాల్లో నటించారామె. త్వరలోనే షూటింగ్‌లో జాయిన్ కానున్నారు తాన్య.
Comments
Please login to add a commentAdd a comment