
వరుస ఫ్లాపులతో ఉన్న రవితేజ.. గతేడాది అమర్‌అక్బర్‌ఆంటోని చిత్రంతో పలకరించినా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాడు. రొటీన్ మాస్ మసాలా చిత్రాలను చేస్తూ చేతులు కాల్చుకున్న రవితేజ డిఫరెంట్ స్టోరీతో వచ్చేందుకు రెడీ అయ్యాడు. మాస్ మహారాజ్ ప్రస్తుతం సోషియో ఫాంటసీ మూవీ(డిస్కోరాజా)ని చేస్తున్న సంగతి తెలిసిందే.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఫస్ట్ షెడ్యుల్‌ను పూర్తి చేసేసింది. ఆగష్టు నాల్గో తేదీ నుంచి ఢిల్లీలో ఓ షెడ్యూల్‌ను ప్లాన్ చేసినట్లు, అది పూర్తైన తరువాత స్విట్జర్లాండ్‌లో మరో షెడ్యుల్‌ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న పాయల్ రాజ్‌పుత్.. రవితేజతో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో సునీల్, ‘వెన్నెల’ కిశోర్, సత్య, రామ్‌కీ తదితరులు నటిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి వీఐ. ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment