kanaka durga
-
ఇంద్రకీలాద్రి : అంగరంగ వైభవంగా దుర్గమ్మకు జ్యోతుల ఉత్సవం (ఫొటోలు)
-
దుర్గగుడిలో శాకంభరి ఉత్సవాల రెండవ రోజు (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఆషాఢ మాస సారె మహోత్సవం (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రిపై వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
-
దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
-
సరస్వతీదేవిగా దుర్గమ్మ దర్శనం
సాక్షి, ఇంద్రకీలాద్రి: శరన్నవరాత్రి అలంకరణల్లో ఐదవ రోజైన పంచమి తిథినాడు నేడు బెజవాడ కనకదుర్గమ్మ సరస్వతీదేవిగా దర్శనమిస్తే శ్రీశైల భ్రమరాంబ స్కందమాతగా దర్శనమిస్తుంది. సకల విద్యలకు, కళలకు, సకల ఙ్ఞానానికి సరస్వతీ మాత చిహ్నం. హంసవాహినిగా, వీణాపాణిగా ఈమెను కొలుస్తుంటారు. ఇక స్కందుడు అంటే కుమారస్వామి తల్లిగా పద్మాసనంలో విరాజిల్లే రూపంగా దర్శనమిచ్చే అవతారం స్కందమాత. ఈ తల్లి కమలాసనంపై శ్వేతపద్మంతో విరాజ్లిల్లుతుంది. తనను నమ్మిన భక్తులకు పతనం లేకుండా కాపాడు తుంది. చేతులలో చెరకు గడ, విల్లు, పాశాంకుశాలు ధరించి, కుడి, ఎడమ వైపులలో లక్ష్మీ, సరస్వతీ దేవిలను కలిగి ఉండి సకల లోకాలకు మాతృస్వరూపం తో దర్శనమిచ్చే రూపం స్కందమాతది. స్కందమాతను నీలం రంగు వస్త్రంతో అలంకరించి గోధుమ రవ్వతో చేసిన కేసరి, మిరియాల పొంగలి నివేదన చేయాలి. సరస్వతీదేవికి తెల్లని లేదా పసుపు రంగు వస్త్రాలు సమర్పించి, బెల్లం అన్నం, ముద్దపప్పు నైవేద్యంగా సమర్పించాలి. స్కందమాత శ్లోకం: సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కర్వయా! శుభదాస్తు సదాదేవి స్కందమాతా యశస్వినీ !! దసరా శరన్నవ రాత్రి మహోత్సవాలలో ఐదో రోజున అమ్మవారిని శ్రీ సరస్వతీ దేవిగా అలంకరిస్తారు. మూలా నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం. మహాకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వతీ శక్తి స్వరూపాలలో దుష్టసంహారం చేసిన శ్రీదుర్గాదేవి, తన నిజ స్వరూపంతో సాక్షాత్కరింపచేయడమే మూలా నక్షత్రం విశిష్టత. విద్యార్థిని, విద్యార్థులకు సరస్వతి అమ్మవారంటే అమితమైన ఇష్టం. అమ్మవారి అనుగ్రహం కోరుతున్న వారికి నిర్మలమైన దరహాసంతో సద్విద్యను శ్రీ సరస్వతీ దేవి ప్రసాదిస్తుంది. మూలా నక్షత్రం నాటి నుంచి విజయదశమి విశేష పర్వదినాలుగా భావించి శ్రీ దుర్గమ్మను ఆరాధిస్తారు. భక్తజనుల ఆజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞాన జ్యోతిని వెలిగించే జ్ఞానప్రదాయినీ శ్రీ సరస్వతీదేవి. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షీ పద్మకేసరవర్ణినీ నిత్యం పద్మాలయాందేవి సామాం పాతు సరస్వతీ శ్రీసరస్వతీ స్తోత్రం సరస్వతీ త్వయం దృష్ట్యా వీణా పుస్తకధారిణీ హంస వాహన సమాయుక్తా విద్యాదాన కరీమమ సర్వసిద్ధి కరీ తస్య ప్రసన్నా పరమేశ్వరీ సామేవసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతీ -
రేపటి నుంచి భక్తులకు కనకదుర్గమ్మ దర్శనం
-
తీన్ మార్?
కొత్త సినిమా కోసం రవితేజ మళ్లీ ఖాకీ డ్రెస్ వేసి లాఠీ చేతపట్టి పోలీస్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ తాజా చిత్రానికి ‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీమేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ‘కనకదుర్గ’ అనే మాస్ టైటిల్‌ను చిత్రబృందం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. తమిళంలో హిట్ సాధించిన విజయ్ ‘తేరీ’ చిత్రానికి ఇది తెలుగు రీమేక్. ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలు ఉన్నట్లే తెలుగులోనూ ఇద్దరి హీరోయిన్స్ ఉన్నారు. ‘క్యాథరీన్’ ఒక హీరోయిన్గా చాన్స్ కొట్టేశారు. ఇప్పుడు మరో కథానాయికగా కాజల్ అగర్వాల్‌ను టీమ్ ఎంపిక చేసిందని సమాచారం. ఇంతకుముందు ‘వీర, సారొచ్చారు’ చిత్రాల్లో రవితేజ–కాజల్ జంటగా నటించారు. ఇప్పుడు కొత్త సినిమాలో ‘తీన్’ మార్ స్టెప్పులేయబోతున్నారన్నమాట. ఈ చిత్రం విజయవాడ నేపథ్యంలో ఉంటుందని తెలిసింది. రవితేజ కెరీర్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘కృష్ణ’ విజయవాడ నేపథ్యంలోనే ఉంటుందని గుర్తుండే ఉంటుంది. ఇంతకుముందు ‘విక్రమార్కుడు, మిరపకాయ్, పవర్’ వంటి హిట్ చిత్రాల్లో పోలీస్ పాత్రలో నటించి, మెప్పించారు రవితేజ. -
రవితేజ హీరోగా ‘కనకదుర్గ’
ప్రస్తుతం మాస్ మహరాజ్ రవితేజ టైం ఏమంత బాలేదు. రాజా ది గ్రేట్ తరువాత రవితేజ హీరోగా తెరకెక్కిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచాయి. టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు, అమర్ అక్బర్ ఆంటొని సినిమాలు బోల్తా పడటంతో తదుపరి చిత్రాల విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాడు రవితేజ. ప్రస్తుతం వీఐ ఆనంద్ దర్శకత్వంలో డిస్కోరాజా సినిమాలో నటిస్తున్న రవితేజ తరువాత చేయబోయే సినిమాను కూడా ఫైనల్ చేశాడు. కోలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన తేరి సినిమాను సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. తమిళ్లో విజయ్ హీరోగా తెరకెక్కిన సినిమాను తెలుగు నేటివిటీ, రవితేజ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా మార్పులు చేసి రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు కనకదుర్గ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో రవితేజ సరసన కాజల్ అగర్వాల్, కేథరిన్ థ్రెస్సాలు హీరోయిన్లుగా నటించనున్నారు. -
అమ్మ సొమ్ము అప్పనంగా!
సాక్షి, విజయవాడ : దుర్గగుడి అభివృద్ధి కోసం భూసేకరణ చేసి భూ యజమానులకు నష్టపరిహారం ఇచ్చే విషయంలో అమ్మ సొమ్మును అప్పనంగా కరిగించేశారు. అధికార పార్టీ నేతలు, రెవెన్యూ, దుర్గగుడి అధికారులు కలిసి అనర్హులుకు కూడా రూ.కోట్లు ఇచ్చారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ సమయంలో జరిగిన అవినీతి వల్ల నష్టపోయిన వారు ఇప్పుడు న్యాయ పోరాటానికి దిగుతున్నారు. ఆస్తి ఒకరిది.. పరిహారం మరొకరికి.. మల్లికార్జునపేటలో ఓ వృద్ధురాలికి పిల్లలు లేరు. దీంతో ఓ బాబును పెంచుకుంది. ఆమెకు ఉన్న 151 గజాల స్థలం పెంపుడు కొడుకుకు ఇచ్చింది. ఆ తర్వాత కొడుకు పెళ్లి విషయంలో తల్లికొడుకుల మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో తల్లి ఇచ్చిన స్థలాన్ని ఆమెకు వెనక్కు ఇచ్చేస్తూ కొడుకు రిజిస్ట్రేషన్ చేయించాడు. ఆ తరువాత తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఇది జరిగిన కొద్ది రోజులకు ఆ వృద్ధురాలు చనిపోయింది. అయితే అదే స్థలాన్ని నకిలీ పత్రాలు సృష్టించి పెంపుడు కొడుకు మరొకరికి విక్రయించాడు. అయితే ఈ విషయాలను పట్టించుకోకుండా రెవెన్యూ అధికారులు స్థలం కొనుక్కున వ్యక్తే అసలైన యజమాని అని నిర్ణయించి గజానికి రూ.63 వేల చొప్పున రూ.95.13 లక్షలు నష్ట పరిహారంగా చెల్లించారు. ఎవరైనా ఆస్తి కొనుక్కునేటప్పుడు ఈసీని పరిశీలిస్తారు. ఇక్కడ అధికారులు కనీసం ఈసీలను పరిశీలించడం కానీ, న్యాయవాదుల సలహాలు తీసుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై తర్వాత వివాదమైంది. చివరకు సీబీఐ వరకు వెళ్లడంతో వారు వచ్చి విచారణ చేశారు. ఈ విధంగా అసలైన అర్హుల్ని గుర్తించకుండా చెల్లింపులు చేయడం వెనుక టీడీపీ నాయకుల హస్తం ఉందని ప్రచారం జరుగుతోంది. టీడీపీ నేతలకు రూ.లక్షలు ముట్టడంతో వారు అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి నష్ట పరిహారం ఇప్పించేశారు. ప్రస్తుతం ఈ విషయంపై ఆ వృద్ధురాలి బంధువులు న్యాయపోరాటం చేస్తున్నారు. ప్రభుత్వ స్థలానికి రూ.30 లక్షలు భూసేకరణలో భాగంగా జాతీయ రహదారి పక్కనే ఉన్న మరుగుదొడ్లను కూల్చివేశారు. ఆ తరువాత ఆ భూమి తమదేనంటూ ఒకరు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి తీసుకువచ్చారు. దీంతో ఆ వ్యక్తి కోర్టుకు వెళ్లతాడని భావించిన అధికారులు పుష్కరాలకు పనులు ఆలస్యం అవుతాయంటూ ఆ పత్రాల ఆధారంగా అమ్మవారి సొమ్ము రూ.30 లక్షలు చెల్లించినట్లు అప్పట్లో ఇళ్లు కోల్పోయిన వారు చెబుతున్నారు. నాయకులు సిఫార్సుల మేరకు రెవెన్యూ అధికారులు ధ్రువీకరించడం, దుర్గగుడి అధికారులు కళ్లుమూసుకొని నష్టపరిహారం చెల్లించేశారు. రూ.60 కోట్లు ఖర్చు చేసినా.. అమ్మవారి మూలధనం పుష్కలంగా ఉండటంతో అప్పట్లో రూ.60 కోట్లు కరిగించి స్థల సేకరణ చేశారు. ఆ తరువాత కేవలం అర్జున వీధిని కొద్దిగా విస్తరించడం మినహా ఏమీ చేయలేకపోయారు. అప్పట్లో దుర్గగుడి అధికారులు తగు జాగ్రత్తలు తీసుకొని ఉంటే కోట్లాది రూపాయల అమ్మవారి సొమ్ము కాపాడేందుకు అవకాశం ఉండేదని దుర్గమ్మ భక్తులు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అప్పట్లో ఇచ్చిన విజిలెన్స్ నివేదికను పరిశీలించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవడమే కాకుండా అనర్హుల నుంచి అమ్మ సొమ్ము రికవరీలు చేయాలని భక్తులు కోరుతున్నారు. -
తరిగిపోతున్న దుర్గమ్మ మూలధనం!
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో రెండో పెద్ద దేవాలయమైన కనకదుర్గమ్మ దేవస్థానం నిధులు నానాటికీ కరిగిపోతున్నాయి. కొండలా పెరగాల్సిన నిధులు..ప్రవాహంలా కొట్టుకుపోతున్నాయి. అమ్మవారికి భక్తులు సమర్పించే కానుకల్ని అధికారులు పప్పుబెల్లాల్లా ఖర్చు చేయడం.. అందుకు సంబంధించి ప్రభుత్వం ఒక్కపైసా విదల్చకపోవడమే దీనికి కారణమని విమర్శలొస్తున్నాయి. రూ.215 కోట్ల నుంచి రూ.92 కోట్లకు.. ఐదేళ్ల క్రితం దుర్గమ్మకు రూ.215 కోట్ల డిపాజిట్లు ఉండేవి. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు చంద్రశేఖర్ ఆజాద్ కార్యనిర్వహణాధికారి(ఈవో)గా ఉన్నప్పుడు దేవాలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇంద్రకీలాద్రిపై దేవాలయాలు తప్ప మిగిలిన భవనాలను కూల్చివేశారు. లక్షలు విలువ చేసే భవానీమండపం, అడ్మినిస్ట్రేటివ్ భవనం, అన్నప్రసాద భవనం, ప్రసాదాల తయారీ భవనాలు నేలమట్టమయ్యాయి. భవనాలు కూల్చిన ప్రదేశంలో గ్రీనరీ పెంచుతామన్నారే తప్ప కార్యరూపం దాల్చలేదు. కాగా అదే సమయంలో అర్జున వీధిలో భూమి సేకరణ ప్రారంభించారు. సుమారు రూ.42 కోట్లు ఖర్చు చేసి భూమి సేకరించారు. అంతేకాకుండా రూ.10 కోట్లు ఖర్చు చేసి సీవీరెడ్డి చారిటీస్ స్థలంలో భక్తులకు తాత్కాలిక కాటేజ్‌లు నిర్మించారు. ఇక రోడ్ల నిర్మాణాలకు, హంగు, ఆర్భాటాలకు నిధులు మంచినీళ్లలా ఖర్చు చేశారు. దీంతో దేవస్థానం నిధులు తరిగిపోయి ప్రస్తుతం రూ.92 కోట్లకు చేరాయని దేవస్థానం అధికారులే చెబుతున్నారు. వచ్చే ఆదాయమంతా ఖర్చులకే.. దుర్గగుడికి హుండీలు, ఆర్జిత సేవలు, కానుకల ద్వారా ప్రతి నెలా రూ.9 కోట్ల ఆదాయం వస్తుంది. ఇందులో రూ.8 కోట్ల వరకు ఖర్చులయిపోతున్నాయి. ఇందులో సిబ్బంది జీతాలు రూ.3 కోట్లు పోగా, మిగిలిన వ్యయం నిర్వహణ ఖర్చులు. పవిత్ర సంగమం వద్ద జరిగే కృష్ణమ్మ హారతులకు ప్రతి నెలా రూ.5 లక్షలు చెల్లిస్తున్నారు. దత్తత దేవాలయల నుంచి ఆదాయం రాకపోయినా.. ప్రతి నెలా వాటి నిర్వహణకు రూ.లక్ష చెల్లిస్తున్నారు. ఇక రాజధానిలో ప్రభుత్వం నిర్వహించే పూజా కార్యక్రమాల వ్యయాన్ని దుర్గమ్మ ఖాతాలోనే వేస్తూ ఉండటంతో వ్యయం నానాటికీ పెరిగిపోతోంది. కొత్త నిర్మాణాలకు నిధులు నిల్.. భక్తుల కోసం గొల్లపూడిలో ఐదు అంతస్తుల భవనం నిర్మించాలని దేవస్థానం అధికారులు భావిస్తున్నారు. అలాగే అన్నదానం భవనం నిర్మించాల్సి ఉంది. అయితే మూలధనం తరిగిపోతూ ఉండటంతో ఈ ప్రతిపాదనలను పక్కన పెట్టారు. దాతలు సహకరిస్తేనే వీటిని నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు. భక్తుల అవసరాలకు కాకుండా ప్రభుత్వ పెద్దల అవసరాల కోసం ఖర్చు చేయడంపై భక్తుల నుంచి తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దసరా ఉత్సవాలకు రూ.8 కోట్ల వ్యయం.. దసరా ఉత్సవాలకు సుమారు రూ.8 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఇందులో సుమారు రూ.5 కోట్లు ఇతరశాఖల సిబ్బంది సేవలు వినియోగించుకున్నందుకు చెల్లిస్తున్నారు. దసరా ఉత్సవాలను రాష్ట్ర పండగగా నిర్వహిస్తున్నందున అన్ని శాఖలు ఉచితంగా సేవలు అందించాలి. ఉత్సవాలకు అయ్యే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి.అయితే ఈ భారమంతా దేవస్థానంపైనే వేస్తున్నారు. గత మూడేళ్లలో రూ.10 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాలని దేవస్థానం లెక్కలు చెబుతున్నాయి. అయినా ప్రభుత్వం ఇంతవరకు ఒక్క పైసా విదల్చ లేదు. -
ప్లాస్టిక్ ఫ్రీ టెంపుల్‌గా దుర్గగుడి
విజయవాడ: ప్లాస్టిక్ ఫ్రీ టెంపుల్‌గా విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయాన్ని తీర్చిదిద్దుదామంటూ నూతన ఈవో పద్మ సలహా ఇచ్చారు. దుర్గ గుడి నూతన ఈవోగా నియమితులైన ఎం.పద్మ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మాడపాటివారి సత్రంలో దుర్గగుడి పాలకమండలి సమావేశం ఏర్పాటు చేశారు. బాధ్యతల స్వీకరణ అనంతరం ఆమె అద్యక్షతన మొట్టమొదటి పాలకమండలి సమావేశం సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. ఫిబ్రవరి చివరి వారంలో శివాలయం తెరుద్దామని అనుకుంటున్నామని చెప్పారు. దుర్గ గుడిలో రేట్లు గురించి కూడా చర్చించామని వెల్లడించారు. త్వరలో ఈ విషయం గురించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. శివరాత్రికి శివాలయ దర్శనం ఇవ్వాలని అనుకున్నాం..కానీ మూహూర్తలు లేనందువల్ల ఫిబ్రవరిలో నెలాఖరులో శివాలయం దర్శనం కల్పించేలా చూస్తామని చెప్పారు. భక్తులు మనోభావాలు దెబ్బతినకుండా, అగమ శాస్త్రం అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటానని వెల్లడించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ఎండీగా, దుర్గగుడి ఈవోగా రెండు బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తానని చెప్పారు. ఈ సమావేశంలో పాలకమండలి సభ్యులు పలు సూచనలు, సలహాలు ఇచ్చారని, దేవస్థానంలో ఆఫీసు ఏర్పాటు చెయ్యాలని ప్రతిపాదించారు..అలా చెయ్యటం వల్ల దేవాలయంలో అవినీతి తగ్గి భక్తులకు మెరుగైన సేవలు అందుతాయని చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న కార్యక్రమాలు అధ్యయనం చేసి ఇక్కడ కూడా అడ్మినిస్ట్రేషన్ పారదర్శకంగా ఉండే విధంగా అమలు చేయ్యటం జరుగుతుందన్నారు. ప్రతి నెల మొదటి వారంలో పాలకమండలి సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. -
కనకదుర్గ కళారూపం
-
కనక దుర్గ ప్లైఓవర్‌కు నిర్లక్ష్యపు గ్రహణం
-
దుర్గమ్మ చీరలు మాయం
-
దుర్గమ్మ చీరలు మాయం
విజయవాడ: కనక దుర్గమ్మ ఆలయంలో ఇంటిదొంగల చేతివాటంతో అమ్మవారి సొమ్ము పక్కదోవ పడుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులు తమ మొక్కులు చెల్లింపుల్లో భాగంగా దుర్గమ్మకు చీరెలు సమర్పించుకుంటారు. ఈ చీరెలను ఆలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్ లో దేవాదాయశాఖ అధికారులకు అప్పగించి, భక్తులు ఈ మేరకు రసీదులు స్వీకరిస్తారు. ఈ రకంగా వచ్చిన చీరెలను ఆలయ అధికారులు టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లు పాడుకునేందుకు వీలు కల్పిస్తారు. తాజాగా అమ్మవారికి వచ్చిన వందలాది చీరెలను మూటలుగా కట్టి ఆలయంలోని మహామంటపంలో భద్రపరిచారు. అయితే అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ ఆలయంలో పనిచేసే కాంట్రాక్ట్ సిబ్బంది ఒకరు గుట్టుచప్పుకు కాకుండా చీరెలు భద్రపరిచిన ప్రాంతానికి వెళ్లి రెండు మూటలను తస్కరించాడు. సీసీ కెమేరాల్లో ఈ చోరీ విజువల్స్ రికార్డయ్యాయి. అయితే ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లిన చోరీ సంగతి బయటపడనివ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. తీరా విషయం మీడియా దృష్టికి కూడా రావడంతో ఆలయ ఈఓ సూర్యకుమారి సిబ్బంది చేతివాటంపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు. కాంట్రాక్టర్ పరిధిలో వున్న చీరెలను కాంట్రాక్ట్ సిబ్బంది చోరీ చేశాడని చెప్పి ఈ ఘటనను చిన్నదిగా చూపేందుకు ఆలయంలోని అధికారులు ప్రయత్నిస్తుండటం విశేషం. ఇదే తరహాలో ఆలయంలో అమ్మవారికి భక్తులు సమర్పించిన ప్రతి వస్తువు ఇంటిదొంగల చేతివాటానికి గురవుతోందనే ఆరోపణలున్నాయి. ఆలయ ఈఓ పర్యవేక్షణా లోపం వల్లే ఇటువంటి సంఘటనలు వరుసగా పునరావృత్తం అవుతున్నాయని భక్తులు ఆరోపిస్తున్నారు. భవానీదీక్షల విరమణ సందర్బంగా కూడా అమ్మవారి ఖజానాకు చేరాల్సిన రూ. 5 లక్షల రూపాయల విలువైన భక్తులు సమర్పించిన బియ్యం, పూజాద్రవ్యాలు కూడా ఇలాగే సిబ్బంది చేతివాటంతో పక్కదోవ పట్టాయి. ఈ సంఘటనపై తీసుకున్న చర్యలు నామమాత్రం. తాజాగా చీరెల చోరీ. ఇప్పటికైనా ఆలయ అధికారుల చిత్తశుద్దితో వ్యవహరించకపోతే అమ్మవారి సొమ్ము దొంగల పాలు అయ్యే ఘటనలు మరింత పెరుగుతాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
దుర్గమ్మను తాకిన పెద్ద నోట్ల ప్రభావం
-
దుర్గమ్మను తాకిన పెద్ద నోట్ల ప్రభావం
విజయవాడ: పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మవారిపై పడింది. రూ. 500, 1000 నోట్లు చెల్లుబాటు కాకపోవ డంతో దుర్గమ్మ సన్నిధికి వస్తున్న భక్తుల రద్దీ తగ్గింది. నిత్యం భక్తులతో కిటకిటలాడే ఇంద్రకీలాద్రి భక్తులు లేకపోవడంతో బోసిపోయింది. అమ్మవారి దర్శనానికి గంటల కొద్ది క్యూలో నిల్చోవాల్సి వచ్చేదని ప్రస్తుతం వచ్చిన వెంటనే దర్శన భాగ్యం లభిస్తుందని కొందరు భక్తులు అంటున్నారు. -
5వ రోజు అలంకారం శ్రీ కాత్యాయనీ దేవి
ఈ రోజు అమ్మవారిని శ్రీ కాత్యాయనీదేవి రూపంలో అలంకరిస్తారు. మార్కండేయ పురాణంలో చెప్పినట్లు పూర్వం కాత్యాయనుడనే మహర్షి గొప్ప తపఃఫలంతో అమ్మవారిని తన పుత్రికగా పొందగలిగాడు. అందువల్ల ఈమెను కాత్యాయని అని పిలుస్తారు. యువతీ యువకులు గనక ఇంద్రకీలాద్రి పర్వతంపై వెలసిన కనక దుర్గాదేవిని కాత్యాయనీ రూపంలో దర్శించినా, వారి శక్త్యానుసారం పూజించినా, సద్గుణవంతులైన అందమైన జీవితభాగస్వామిని పొందుతారని ప్రతీతి. దంపతులుగా కాత్యాయనీదేవి రూపాన్ని దర్శిస్తే సుఖజీవనం సాగించగలరని భక్తుల విశ్వాసం. శ్లోకం: చంద్రహాసోజ్జ్వల కరా శార్దూల వర వాహనా కాత్యాయనీ శుభం దద్యాద్దేవీ దానవ ఘాతిని భావం: పులి వాహనంపై పున్నమినాటి చంద్రుడివలె ప్రకాశిస్తూ రాక్షస సంహారం చేసిన ఓ కాత్యాయనీ మాకు శుభాలను ప్రసాదించుము తల్లీ! నివేదన: అరటిపండ్లు, పాలు, చక్కెరతో పాయసం ఫలమ్: వివాహ సంబంధమైన చిక్కులు తొలగి మంచి జీవిత భాగస్వామి లభిస్తాడు. - దేశపతి అనంత శర్మ -
చేతివాటం చూపబోయి దొరికిపోయాడు
టీకప్పులో బంగారు చైను, మంగళసూత్రాలు తరలిస్తూ పట్టుబడిన కాంట్రాక్టు ఉద్యోగి లక్ష రూపాయల విలువైన హుండీ సొత్తు స్వాధీనం ఇంద్రకీలాద్రి : కనకదుర్గమ్మ హుండీ సొత్తును లెక్కించేందుకు వచ్చిన కాంట్రాక్టు సిబ్బందిలో ఒకరు మంగళసూత్రాలు, గొలుసు దొంగిలించేందుకు యత్నిస్తూ భద్రతా సిబ్బందికి పట్టుబడ్డాడు. గురువారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. దుర్గామల్లేశ్వర స్వామివార్లకు భక్తులు సమర్పించిన కానుకలు, మొక్కుబడుల లెక్కింపు కార్యక్రమాన్ని గురువారం భవానీదీక్షా మండపంలో నిర్వహించారు. ఇందులో ఆలయ సిబ్బందితోపాటు కేశఖండనశాలలో పనిచేసే కాంట్రాక్టు సిబ్బంది పాల్గొన్నారు. ఉదయం సుమారు 10.10 గంటలకు ఒక్కొక్కరూ బయటకు వచ్చి టీ తాగుతున్నారు. దుర్గాఘాట్‌లోని కేశఖండనశాలలో కాంట్రాక్టు పద్ధతిపై పనిచేసే ఎం.రామసుబ్బారావు కూడా వారిలో ఉన్నాడు. రామసుబ్బారావు టీ తాగుతూ మధ్యలో లోనికి వెళ్లి, కానుకలు లెక్కించేందుకు కూర్చున్నాడు. కొద్దిసేపటి తరువాత కాలకృత్యాలు తీర్చుకునేందుకు టీకప్పుతో సహా కిందకు దిగేందుకు యత్నించాడు. రిజిస్టర్లో సంతకం చేసి వెళ్లాలని అక్కడ ఉన్న ఎస్పీఎఫ్ సిబ్బంది సూచించారు. దీంతో టీకప్పును మెట్ల పక్కనే ఉన్న గోడ వద్ద పెట్టి రిజిస్టర్లో సంతకం చేశాడు. తరువాత ఎస్పీఎఫ్ సిబ్బంది తనిఖీ చేసి పంపారు. అతడు నేరుగా కిందకు వెళ్లకుండా మెట్ల పక్కన ఉంచిన టీకప్పును తీసుకువెళ్లేందుకు యత్నించాడు. మెట్ల వద్ద విధుల్లో ఉన్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ టి.శివప్రసాద్‌కు అతడి తీరుపై అనుమానం వచ్చింది. మరోమారు తనిఖీ చేసేందుకు రామసుబ్బారావును వెనక్కి పిలిచాడు. దీంతో అతడు టీకప్పును మెట్ల మధ్యలో పెట్టి పైకి వచ్చా డు. తనిఖీ చేసిన తరువాత కిందకు దిగేందుకు రామసుబ్బారావు కంగారు పడుతున్నాడు. టీకప్పు పైకి తీసుకురావాలని ఎస్పీఎఫ్ సిబ్బంది పిలవగా, అతడు లెక్కచేయకుండా వేగంగా కిందకు దిగేందుకు యత్నించాడు. శివప్రసాద్ వెంటపడి టీకప్పుతో సహా అతడిని పైకి తీసుకువచ్చాడు. కప్పును తనిఖీ చేయగా, మంగళసూత్రాలు, బంగారు గొలుసు కనిపించాయి. దీంతో భద్రతా సిబ్బంది ఆలయ కార్యనిర్వహణాధికారికి సమాచారం అందించారు. ఆయన వచ్చి సీసీ టీవీల పుటేజీని పరిశీలించారు. అనంతరం రామసుబ్బారావును విచారణ చేశారు. అతడు చోరీ చేసేందుకు యత్నించిన 40 గ్రాముల బంగారు గొలుసు విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుందని నిర్ధారించుకున్నారు. అనంతరం రామసుబ్బారావును పోలీస్ అవుట్‌పోస్టులో అప్పగించగా, అక్కడి సిబ్బంది వన్‌టౌన్ స్టేషన్‌కు తరలించారు. ఆలయ అధికారుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు స్టేషన్ సిబ్బంది తెలిపారు. -
భర్త మందలించాడని..
మనస్తాపంతో భార్య ఆత్మహత్య గాజువాక : భర్త మందలించాడని మనస్తాపంతో భార్య ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన శుక్రవారం అర్ధరాత్రి కణితి రోడ్డు కైలాసనగర్‌లో చోటుచేసుకుంది. గాజువాక పోలీసుల కథనం ప్రకారం.. గాజువాకలో టపాసుల తయారీ సంస్థ నిర్వహిస్తున్న కొర్రేటి శ్రీమన్నారాయణ కైలాసనగర్‌లో భార్య, పిల్లలతో నివసిస్తున్నాడు. అతడి భార్య కె.భాగ్యలక్ష్మి కనకదుర్గ(33) చాలా కాలంగా గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతూ మందులు వాడుతోంది. ఇది చాలా ఇబ్బందిగా ఉందంటూ తన తండ్రికి, కుటుంబ సభ్యులకు చెబుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో తాను ఉన్నా లేకపోయినా పిల్లలను బాగా చూసుకోవాలని భర్తకు చెప్పింది. ఎవర్నీ ఇబ్బంది పెట్టకూడదని పిల్లలకు కూడా చెప్పింది. పిల్లల ముందు అలా మాట్లావద్దని ఆమెను భర్త మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన ఆమె శుక్రవారం అర్ధరాత్రి సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరిపోసుకొంది. దీనిపై ఆమె తండ్రి దవ్వ నాగేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ ఈశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రాగాలజిస్ట్
ఆ చేతి వేళ్లు రోగుల నాడిని పరిశీలిస్తాయి. ఈ వీణను శ్రుతి చేస్తాయి. విశ్వవ్యాప్త రుగ్మతలకు దివ్యౌషధమైన అద్భుత సంగీతంతో సేదదీరుస్తాయి. విశాఖ సెవెన్‌హిల్స్ ఆస్పత్రి రేడియాలజిస్టుగా చిరపరిచితుడైన ఈ రాగాలజిస్టు వీణ వాయిద్యకారునిగా దేశవ్యాప్త గుర్తింపు పొందారు. ఆయనే డాక్టర్ భమిడిపాటి కనక దుర్గాప్రసాద్. విశాఖపట్నం ఆర్కేబీచ్లో ఓ ఆదివారం. తూర్పు తలుపు తోసుకుని సూరీడు బయటికొస్తున్నాడు. కెరటాలు ఎగసిపడుతున్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణం. వాకర్లు మౌనంగా ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. అప్పుడే రాజీవ్ స్మృతి భవన్లో డాక్టర్ కనక దుర్గాప్రసాద్ వీణవాయిద్య కచేరీ మొదలైంది. సాగరతీరమంతా అమర్చిన మైకుల్లో మంద్రంగా వినిపిస్తోంది. సంగీత ప్రియుల హృదయం ఆనంద సాగరంలో తేలియాడుతోంది. సాగర ఘోషకు తోడుగా వీణ వాయిద్యం లయబద్ధంగా సాగుతోంది. అరవై నిమిషాల సమయం అర క్షణంలా కరిగిపోయింది. మధుర సంగీత వర్షం నిలిచిపోయింది. సాగర తీరంలో చిత్తరువుల్లా మారిపోయిన వాకర్లలో మళ్లీ చలనం మొదలైంది. బాల్యం నుంచే... చిన్నప్పటి నుంచి శాస్త్రీయ సంగీతాన్ని కనక దుర్గాప్రసాద్ విపరీతంగా ఇష్టపడేవారు. అతని ఆసక్తిని గమనించిన తండ్రి డాక్టర్ బి.ఎస్.వి.శాస్త్రి సంగీత కళాప్రపూర్ణ పప్పు పద్మావతి దగ్గర వీణపై శిక్షణ ఇప్పించారు. ఆమె శిష్యరికంలో దుర్గాప్రసాద్ అతి తక్కువ సమయంలోనే వీణపై లాఘవంగా రాగాలు పలికించడంలో దిట్టయ్యారు. అప్పుడే కుటుంబ సన్నిహితుడైన విఖ్యాత వీణ విద్వాంసుడు, వైణిక సార్వభౌమ చల్లపల్లి చిట్టిబాబు దృష్టిలో పడ్డారు. దీంతో ప్రముఖ గ్రామ్‌ఫోన్ రికార్డింగ్ కంపెనీ హెచ్ఎంవీ వారి కోసం రూపొందిస్తున్న ‘టెంపుల్ బెల్స్’ సంగీత ఆల్బమ్ రికార్డింగ్ ఆర్కెస్ట్రాలోకి తీసుకున్నారు. 1985లో విడుదలైన ఈ ఆల్బమ్ రూపకల్పనలో వీణపై సహకరించిన కనక దుర్గాప్రసాద్ పద్నాలుగేళ్లకే దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. రాష్ట్రపతి అవార్డు కనక దుర్గా ప్రసాద్ ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్నప్పుడు ఆలిండియా రేడియో నిర్వహించిన జాతీయస్థాయి సంగీత పోటీల్లో ప్రథమ స్థానం దక్కించుకుని అప్పటి రాష్ట్రపతి అవార్డు పొందారు. దీంతో ఆలిండియా రేడియో అధికారులు ఆడిషన్ టెస్ట్ కూడా నిర్వహించకుండానే కళాకారునిగా ఆయనను నియమించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించిన నాద నీరాజనం కార్యక్రమంలో రెండుసార్లు, చెన్నైలో జరిగిన జాతీయ వీణ ఫెస్టివల్లో భాగంగా నారద గాన సభలో వీణ కచేరీలు ఇచ్చారు. ఎమ్డీ చదువు పూర్తయ్యాక విజయనగరంలోని మిమ్స్‌లో రేడియాలజీ విభాగం ప్రొఫెసర్‌గా పనిచేశారు. అదే సమయంలో ఆయన సంగీత ప్రతిభకు గుర్తింపుగా ముంబయ్‌కి చెందిన సుర్సింగార్ సంసద్ సంస్థ సుర్మణి, ఆంధ్ర వైద్య కళాశాల వైద్యులు, విద్యార్థులు నాద తపస్వి బిరుదులు ప్రదానం చేశారు. ‘‘వ్యాధులు తగ్గాలంటే కచ్చితంగా మందులు వాడాలి... ఆ మందులు చక్కగా పనిచేయాలంటే మంచి సంగీతం వినాలి’’ అంటారు డాక్టర్ కనక దుర్గా ప్రసాద్. - ఎ. సుబ్రహ్మణ్యశాస్త్రి (బాలు) సంగీతం దివ్యౌషధం ఒత్తిడి జీవితానికి మంచి ఔషధం సంగీతం. ప్రస్తుతం ఎటుచూసినా ఉరుకులు, పరుగుల జీవితమే. ఇది విద్యార్థులు, ఉద్యోగులు, అన్ని రంగాల వారిని తీవ్ర ఒత్తిడికి గురిచేస్తోంది. ఇలాంటి వారు సంగీతం వింటే వృత్తిలో రాణిస్తారు. పిల్లలకు గాత్రంలో శిక్షణ ఇవ్వడం మంచిది. అందువల్ల వారి ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. వాయుకాలుష్యం నుంచి విముక్తి పొందుతారు. - డాక్టర్ భమిడిపాటి కనక దుర్గా ప్రసాద్. ఎమ్‌డి, -
బాలల హక్కుల పరిరక్షణకు కృషి
గజ్వేల్: బాలల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తామని లీగల్ సర్వీస్ అథారిటీ జిల్లా కార్యదర్శి కనకదుర్గ పేర్కొన్నారు. గురువారం గజ్వేల్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో బాలల న్యాయ సలహా కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ బాలబాలికలు హింసకు గురికాకుండా ఈ కేంద్రం ద్వారా భద్రత కల్పిస్తామన్నారు. ఇబ్బందుల్లో ఉన్న వారు కేంద్రాన్ని సందర్శించి న్యాయాన్ని పొందాలని సూచించారు. లీగల్ సెల్ అథారిటీ, జడ్జి, పోలీసుల సమన్వయంతో కేంద్రం పనిచేస్తుందన్నారు. రైతు ఆత్మహత్యలపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. క్షణికావేశంలో రైతులు ఆత్మహత్యల బారిన పడుతున్నారన్నారు. కష్టాల్లో ఉన్న రైతులకు లీగల్ సర్వీస్ అథారీటీ అండగా ఉంటుందన్నారు. ఎవరైనా నేరుగా వచ్చి సమస్యలను చెప్పుకోవచ్చని తెలిపారు. సమావేశంలో గజ్వేల్ సీఐ అమృతరెడ్డి, నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, ఎస్ఐ జార్జి, ఎస్ఐ-2 స్వామి, నగర పంచాయతీ కౌన్సిలర్లు నరేందర్‌రావు, బోస్, శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు నారాయణరెడ్డి, ఆకుల దేవేందర్, రామచంద్రాచారి తదితరులు పాల్గొన్నారు. బాల్యవివాహలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు జగదేవ్‌పూర్: ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలంటే అందరూ చిన్నచూపు చూస్తున్నారని, దేశం ఎంత ప్రగతి సాధించినా సామాజిక రుగ్మతలు కొనసాగుతున్నయని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కనకదుర్గ పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలో ఐసీడీఎస్ అధ్వర్యంలో జరిగిన బేటీ బచావో-బేటీ పడావో కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కనకదుర్గ మాట్లాడుతూ దేశంలో రోజు రోజుకు బాలికల నిష్పత్తి తగ్గుతోందన్నారు. తప్పుడు భావనలే ఇందుకు మూలమన్నారు. ఆడపిల్ల పుట్టక ముందే భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారన్నారు. దీనిని ఆరికట్టడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఆడపిల్లల రక్షణ కోసమే ప్రభుత్వాలు ఆడపిల్లను బతికిద్దాం..ఆడపిల్లను చదవిద్దాం అనే పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. పేదరికం వల్ల గ్రామాల్లో బాలికలను బడికి పంపకుండా, చిన్నతనంలోనే పెళ్లిళ్లు చేస్తున్నారన్నారు. బాల్యవివాహాలు చేసినా, లింగవివక్షకు పాల్పడినా చట్టం ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. బాలికల కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోందన్నారు. బాలల హక్కులను సంరించేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. చదువుతోనే సమాజంలో మార్పు వస్తుందన్నారు. అందుకే ఆడ మగ తేడా లేకుండా తల్లిదండ్రులు చదివించాలని సూచించారు. కార్యక్రమంలో గజ్వేల్ జూనియర్ సివిల్ జడ్జి సంతోష్‌కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు బాస్కర్, ఎస్ఐ వీరన్న, డిసిఎ రత్నం, ఐసిడిఎస్ అధికారి విమల, అంగన్వాడి మండల సూపర్వైజర్లు వర్దనమ్మ, రమణ, జెడ్పీటీసీ రాంచ్రందం, తహశీల్దార్ శ్రీనివాసులు, సర్పంచ్ కరుణకర్, ఎంఈఓ సుగుణకర్‌రావు, ఎంపీటీసీలు వెంకటయ్య, బాలేషం, అన్ని గ్రామాల అంగన్వాడి కర్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. -
పాలకుల కళ్లు తెరిపించు దుర్గమ్మతల్లీ!
ఆగిపోయిన కనక దుర్గమ్మ ఆలయ లభివృద్ధి పనులు పట్టించుకోని జిల్లా మంత్రి,ఎమ్మెల్యేలు సాక్షి, బళ్లారి : కనక దుర్గమ్మ బళ్లారి నగర ప్రజల ఆదిదేవత. ఆమెను తలచుకోనిదే జిల్లా ప్రజలు ఏపని మొదలు పెట్టరు. ఆమె దర్శనం కోసం జిల్లా వాసులే కాకుండా ఇతర ప్రాంతాలనుంచి మంగళ, శుక్ర వారాలతోపాటు అమావాస్య రోజుల్లో వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. దీంతో ఆలయం కిటకిటలాడుతుంటోంది. భక్తులపై అంతటి కరుణ చూపుతున్న అమ్మవారిపై పాలకులు అశ్రద్ధ కనబరుస్తున్నారు. అమ్మవారి ఆలయ పునరుద్ధరణ పనులు ఆగిపోవడమే ఇందుకు తార్కాణం. 2009లో పనులకు శ్రీకారం 2009లో అప్పటి జిల్లా ఇన్చార్జ మంత్రి గాలి జనార్దనరెడ్డి, బళ్లారి సిటీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రూ. 10 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. నాలుగు గోపురాలు, పుష్కరిణీ, ప్రహరీ, సముదాయ భవనం, రాతిక ట్టడాలు, స్నానపు గదులు నిర్మించాల్సి ఉంది. జనార్దనరెడ్డి హయాంలో పనులు ఊపందుకున్నా ప్రభుత్వాలు మారిన తర్వాత పనులు ఆగిపోయాయి. ఏ ఒక్క పని కూడా పూర్తి కాలేదు. దీంతో వ్యయం రూ.14 కోట్లుకు మేరకు చేరుకుందని, పైగా నిధుల కొరత ఉందని ఆలయ వర్గాలు పేర్కొంటున్నారు. ఆలయంలో అమ్మవారి విగ్రహం దేదీప్యమానంగా వెలుగిపోతండగా వెలుపల మాత్రం కళావిహీనంగా కనబడుతోంది. జిల్లా ఇన్చార్జ పరమేశ్వరనాయక్, బళ్లారి సిటీ ఎమ్మెల్యే అనిల్‌లాడ్ ఆలయ అభివృద్ధి పనులపై దృష్టి పెట్టలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంత్రి చుట్టపుచూపులా జిల్లా, నగరానికి వచ్చిపోతుండటం వల్ల అభివృద్ధి జరగడం లేదని ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. బళ్లారి నగర ఆదిదేవతనే పాలకులు పట్టించుకోనప్పుడు ఇక జిల్లాలో అభివృద్ధి పనులు గురించి ఏ పాటిగా పట్టించుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా పాలకులు శ్రీకనక దుర్గమ్మ ఆలయ అభివృద్ధిపై దృష్టి పెట్టి వెంటనే పనులు పూర్తి చేయాలని నగర ప్రజలు కోరుతున్నారు. -
శ్రీ మహాలక్ష్మిగా బెజవాడ కనక దుర్గమ్మ
బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ సన్నిధికి భక్తులు పోటెత్తారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శుక్రవారం నాడు భక్తులకు శ్రీమహాలక్ష్మిగా దర్శనమిచ్చారు. భక్తులకు సకల సంపదలిచ్చే తల్లిగా కనిపించి అందరినీ తరింపజేశారు.