5వ రోజు అలంకారం శ్రీ కాత్యాయనీ దేవి | kanaka durga amma varu | Sakshi
Sakshi News home page

5వ రోజు అలంకారం శ్రీ కాత్యాయనీ దేవి

Published Tue, Oct 4 2016 11:13 PM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM

5వ రోజు అలంకారం   శ్రీ కాత్యాయనీ దేవి

5వ రోజు అలంకారం శ్రీ కాత్యాయనీ దేవి

ఈ రోజు అమ్మవారిని శ్రీ కాత్యాయనీదేవి రూపంలో అలంకరిస్తారు. మార్కండేయ పురాణంలో చెప్పినట్లు పూర్వం కాత్యాయనుడనే మహర్షి గొప్ప తపఃఫలంతో అమ్మవారిని తన పుత్రికగా పొందగలిగాడు. అందువల్ల ఈమెను కాత్యాయని అని పిలుస్తారు. యువతీ యువకులు గనక ఇంద్రకీలాద్రి పర్వతంపై వెలసిన కనక దుర్గాదేవిని కాత్యాయనీ రూపంలో దర్శించినా, వారి శక్త్యానుసారం పూజించినా, సద్గుణవంతులైన అందమైన జీవితభాగస్వామిని పొందుతారని ప్రతీతి.  దంపతులుగా కాత్యాయనీదేవి రూపాన్ని దర్శిస్తే సుఖజీవనం సాగించగలరని భక్తుల విశ్వాసం.

శ్లోకం: చంద్రహాసోజ్జ్వల కరా శార్దూల వర వాహనా  కాత్యాయనీ శుభం దద్యాద్దేవీ దానవ ఘాతిని

భావం: పులి వాహనంపై పున్నమినాటి చంద్రుడివలె ప్రకాశిస్తూ రాక్షస సంహారం చేసిన ఓ కాత్యాయనీ మాకు శుభాలను ప్రసాదించుము తల్లీ!

నివేదన: అరటిపండ్లు, పాలు, చక్కెరతో పాయసం

ఫలమ్: వివాహ సంబంధమైన చిక్కులు తొలగి మంచి జీవిత భాగస్వామి లభిస్తాడు.

 - దేశపతి అనంత శర్మ

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement