మాకు ఎన్నాళ్లీ శిక్ష? | Spouse teachers of 13 districts are clamoring to be transferred to one place | Sakshi
Sakshi News home page

మాకు ఎన్నాళ్లీ శిక్ష?

Published Tue, Oct 3 2023 3:55 AM | Last Updated on Tue, Oct 3 2023 9:05 PM

Spouse teachers of 13 districts are clamoring to be transferred to one place - Sakshi

మౌన దీక్ష చేస్తున్న స్పౌజ్‌ ఉపాధ్యాయులను అరెస్టు చేస్తున్న పోలీసులు. పోలీసుల తీరుతో రోదిస్తున్న చిన్నారులు

సాక్షి, హైదరాబాద్‌: వేర్వేరు జిల్లాల్లో పని­చేస్తున్న తమను ఒకేచోటుకు బదిలీ చేయా­లంటూ 13 జిల్లాల స్పౌజ్‌ ఉపాధ్యాయులు పిల్లలతో కలసి సోమవారం హైదరా­బా­ద్‌లోని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ కార్యా­ల­యం ముందు చేపట్టిన మౌనదీక్ష ఉద్రిక్తతకు దారి తీసింది. దీక్ష చేస్తున్న ఉపాధ్యాయ దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకొని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు.

ఈ సందర్భంగా పోలీసులు, ఉపాధ్యాయులకు మధ్య పెనుగులాట చోటుచేసుకుంది. మహిళలని కూడా చూడకుండా బలవంతంగా లాక్కెళ్లి పోలీసు వ్యాన్లు ఎక్కించడాన్ని ఉపాధ్యాయ దంపతులు తీవ్రంగా ప్రతి ఘటించారు. గాంధీ జయంతి సాక్షిగా ఈ తరహా పోలీసు దౌర్జన్యం సరికాదంటూ నినదించారు. 317 జీవో అమల్లో భాగంగా గతేడాది ఉపాధ్యాయ భార్యాభర్తలను వేర్వేరు జిల్లాలకు బదిలీ చేశారు.

దీనిపై తీవ్ర నిరసన వ్యక్తమవడంతో కొన్ని జిల్లాల స్పౌజ్‌ కేసులను పరిష్కరించారు. కానీ ఇప్పటికీ 13 జిల్లాల స్పౌజ్‌ల బదిలీలు పెండింగ్‌లోనే ఉన్నాయి. దీనిపై ప్రభుత్వానికి వారు అనేకసార్లు విజ్ఞప్తి చేశారు. తాము తీవ్ర మనోవేదనతో ఉన్నామని, కిలోమీటర్ల దూరంలో భార్య ఒకచోట, భర్త ఒకచోటపనిచేయడం సమస్యగా మారిందని, పిల్లల ఆలనాపాలన చూసే దిక్కులేకుండా పోయిందని ప్రభుత్వానికి విన్నవించారు. అయినప్పటికీ దీనిపై ప్రభుత్వం స్పందించకపోవడంతో పాఠశాల విద్యాశాఖ కార్యాలయం ఎదుట మౌనదీక్షకు దిగారు.

మాకెందుకీ అన్యాయం
గత జనవరిలో కేవలం 615 స్కూల్‌ అసిస్టెంట్‌ స్పౌజ్‌ బదిలీలు మాత్రమే చేపట్టారు. ఇంకా 1500 మంది బదిలీ­లకు నోచుకోక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రజాస్వామ్య పద్దతిలో దీక్ష చేస్తుంటే అరెస్టులు చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మా సమస్యను సానుభూతిలో పరిష్కరించాలి.  – నరేశ్, స్పౌజ్‌ ఫోరంకో–కన్వీనర్‌

మానసిక క్షోభకు పరిష్కారం లేదా?
గత 22 నెలలుగా ఉపాధ్యాయ దంపతు­లు బదిలీల్లేక మానసిక క్షోభకు గురవు­తున్నారు. ఈ పరిస్థితికి పరి­ష్కారం లేదా అనే అనుమానం కలుగు­తోంది. పెద్ద మనసుతో వీలైనంత త్వరగా సమస్య పరిష్కరించాలి.     – వివేక్, స్పౌజ్‌ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement