place
-
గౌతమ్ గంభీర్ స్థానంలో అక్షయ్ కుమార్?
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీల్లో హుషారు పెరిగిపోతోంది. తూర్పు ఢిల్లీ నుంచి భారతీయ జనతా పార్టీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఆయన ఒక ట్వీట్లో తనను రాజకీయ బాధ్యతల నుంచి తప్పించాలని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలను కోరారు. అదే సమయంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌ను బీజేపీ ఇక్కడి నుంచి ఎన్నికల రంగంలోకి దించవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గౌతమ్ గంభీర్ తాను ఇకపై తన క్రికెట్ కమిట్మెంట్లపై దృష్టి పెడతానని అంటున్నారు. ఈ నేపధ్యంలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌ను బీజేపీ.. ఢిల్లీలోని ఒక స్థానం నుండి ఎన్నికల్లో పోటీ చేయమని కోరనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఆయనతో కొందరు పార్టీ నేతలు టచ్‌లో ఉన్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అక్షయ్ కుమార్ కూడా భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్షయ్ కెరీర్ గ్రాఫ్ పడిపోతోంది. అతని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. దీంతో ఆయన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ సీటు నుంచి ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల అభ్యర్థులు బరిలో నిలిచారు. నాటి ఎన్నికల్లో గౌతమ్ గంభీర్ 6,96,156 ఓట్లతో విజయం సాధించారు. -
బల్క్ డ్రగ్ పార్కు స్థలం మార్పునకు కేంద్రం ఆమోదం
సాక్షి, అమరావతి: బల్క్ డ్రగ్ పార్కును కాకినాడ నుంచి అనకాపల్లి జిల్లా నక్కపల్లికి మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పార్కును కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త భాగస్వామ్యంతో 2 వేల ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ రూ.2,190 కోట్లతో ఫార్మాస్యూటికల్ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. ఇందు కోసం రూ.1,000 కోట్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం భూమిని సమకూరుస్తోంది. అయితే, ప్రభుత్వ భూమి మాత్రమే ఉండాలని కేంద్రం మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. దీంతో కాకినాడ నుంచి నక్కపల్లి ప్రాంతానికి ఈ పార్కును మార్చారు. నక్కపల్లి వద్ద ఏపీఐఐసీ భూమి అందుబాటులో ఉండటం, అక్కడ ఇప్పటికే ఫార్మా రంగానికి చెందిన పలు పరిశ్రమలు ఉండటంతో రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, త్వరలోనే టెండర్లను న్యాయ పరిశీలనకు (జ్యుడిíÙయల్ ప్రివ్యూకు) పంపుతామని ఏపీఐఐసీ వీసీ ఎండీ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. న్యాయపరిశీలన అనంతరం ఆమోదం రాగానే టెండర్లు పిలుస్తామని చెప్పారు. చైనా నుంచి ఫార్మా దిగుమతులను అరికట్టాలన్న ఉద్దేశంతో దేశంలో మూడు బల్క్ డ్రగ్ పార్కులు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. తెలంగాణ వంటి 16 రాష్ట్రాలతో పోటీ పడి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును దక్కించుకుంది. పూర్తిగా పర్యావరణహితమైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ పార్కును అభివృద్ధి చేస్తారు. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫార్మా హబ్‌గా తయారవుతుందని, రూ.14,340 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షిస్తుందని అంచనా. ఇక్కడ 30,000 మందికి ప్రత్యక్షంగా, 40,000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 200కు పైగా ఫార్మా యూనిట్లు ఉన్నాయి. బల్క్ డ్రగ్ పార్కు ద్వారా అదనంగా 100కు పైగా యూనిట్లు వస్తాయని బల్క్ డ్రగ్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. -
మాకు ఎన్నాళ్లీ శిక్ష?
సాక్షి, హైదరాబాద్: వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న తమను ఒకేచోటుకు బదిలీ చేయాలంటూ 13 జిల్లాల స్పౌజ్ ఉపాధ్యాయులు పిల్లలతో కలసి సోమవారం హైదరాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయం ముందు చేపట్టిన మౌనదీక్ష ఉద్రిక్తతకు దారి తీసింది. దీక్ష చేస్తున్న ఉపాధ్యాయ దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకొని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు, ఉపాధ్యాయులకు మధ్య పెనుగులాట చోటుచేసుకుంది. మహిళలని కూడా చూడకుండా బలవంతంగా లాక్కెళ్లి పోలీసు వ్యాన్లు ఎక్కించడాన్ని ఉపాధ్యాయ దంపతులు తీవ్రంగా ప్రతి ఘటించారు. గాంధీ జయంతి సాక్షిగా ఈ తరహా పోలీసు దౌర్జన్యం సరికాదంటూ నినదించారు. 317 జీవో అమల్లో భాగంగా గతేడాది ఉపాధ్యాయ భార్యాభర్తలను వేర్వేరు జిల్లాలకు బదిలీ చేశారు. దీనిపై తీవ్ర నిరసన వ్యక్తమవడంతో కొన్ని జిల్లాల స్పౌజ్ కేసులను పరిష్కరించారు. కానీ ఇప్పటికీ 13 జిల్లాల స్పౌజ్‌ల బదిలీలు పెండింగ్‌లోనే ఉన్నాయి. దీనిపై ప్రభుత్వానికి వారు అనేకసార్లు విజ్ఞప్తి చేశారు. తాము తీవ్ర మనోవేదనతో ఉన్నామని, కిలోమీటర్ల దూరంలో భార్య ఒకచోట, భర్త ఒకచోటపనిచేయడం సమస్యగా మారిందని, పిల్లల ఆలనాపాలన చూసే దిక్కులేకుండా పోయిందని ప్రభుత్వానికి విన్నవించారు. అయినప్పటికీ దీనిపై ప్రభుత్వం స్పందించకపోవడంతో పాఠశాల విద్యాశాఖ కార్యాలయం ఎదుట మౌనదీక్షకు దిగారు. మాకెందుకీ అన్యాయం గత జనవరిలో కేవలం 615 స్కూల్ అసిస్టెంట్ స్పౌజ్ బదిలీలు మాత్రమే చేపట్టారు. ఇంకా 1500 మంది బదిలీలకు నోచుకోక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రజాస్వామ్య పద్దతిలో దీక్ష చేస్తుంటే అరెస్టులు చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మా సమస్యను సానుభూతిలో పరిష్కరించాలి. – నరేశ్, స్పౌజ్ ఫోరంకో–కన్వీనర్ మానసిక క్షోభకు పరిష్కారం లేదా? గత 22 నెలలుగా ఉపాధ్యాయ దంపతులు బదిలీల్లేక మానసిక క్షోభకు గురవుతున్నారు. ఈ పరిస్థితికి పరిష్కారం లేదా అనే అనుమానం కలుగుతోంది. పెద్ద మనసుతో వీలైనంత త్వరగా సమస్య పరిష్కరించాలి. – వివేక్, స్పౌజ్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు -
అమ్మకు బహుమతిగా చందమామపై స్థలం!
గోదావరిఖని (రామగుండం): తల్లిపై ప్రేమతో వినూత్న కానుక ఇవ్వాలని ఆ కుమార్తె భావించింది. ఇందుకోసం ఏకంగా చందమామపైనే ఎకరం భూమిని కొనుగోలు చేసి తల్లికి బహుమతిగా అందించింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని జీఎం కాలనీకి చెందిన సింగరేణి ఉద్యోగి సుద్దాల రాంచందర్, వకుళాదేవి దంపతుల పెద్ద కుమార్తె సాయి విజ్ఞత. ఆమె అమెరికాలోని ఐయోవాలో ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా పనిచేస్తున్నారు. మదర్స్ డే సందర్భంగా లూనార్ రిజిస్ట్రీ వెబ్సైట్లో ఓ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని ఎకరం భూమిని కొనుగోలు చేసినట్టు వెల్లడించారు. రూ.35 లక్షలు చెల్లించి తన తల్లి వకుళాదేవి పేరిట దానిని రిజిస్టర్ చేయించానని వివరించారు. ఈ మేరకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు కూడా వచ్చేశాయన్నారు. -
అది ప్రపంచంలోనే అత్యంత విషపూరిత ప్రాంతం.. ఏ జీవికైనా తక్షణం మరణం తధ్యం!
ప్రపంచంలో కొన్ని ప్రాంతాలకు వెళ్లేముందు వందసార్లు ఆలోచించాల్సి వస్తుంటుంది. నిజానికి ఈ భూమి మీద చాలామేరకు పచ్చదనం, జీవం కనిపిస్తుండగా, ఆ ప్రాంతంలో చావు, నిశ్శబ్దం మాత్రమే కనిపిస్తాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ప్రదేశం భూమిపై అత్యంత విషపూరితమైన ప్రాంతంగా పేరొందింది. ఇక్కడ విచిత్రమైన విషయం ఏమిటంటే ఇది ఏ ఎడారిలోనే లేదు. ఫ్రాన్స్‌లోని పట్టణ ప్రాంతానికి కొంచెం దూరంలో ఉంది. ఒకప్పుడు మనుషులతో సందడిగా ఉన్న ఈ ప్రదేశం ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన ప్రదేశంగా ఎలా మారిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విషపూరిత ప్రదేశం ఎక్కడుంది? ఇప్పుడు మనం చెప్పుకుంటున్న విషపూరిత ప్రదేశాన్ని జోన్ రోగ్ అని అంటారు. కొందరు ఈ ప్రదేశాన్ని డేంజర్ జోన్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రదేశం ఫ్రాన్స్‌లో ఉంది. గడచిన వంద సంవత్సరాలుగా ఈ ప్రదేశాన్ని ఎవరూ సందర్శించలేదు. ఇక్కడికి ఎవరినీ వెళ్లనీయకుండా ప్రభుత్వం నిషేధించింది. నిజానికి ఈ ప్రాంతపు మట్టిలోనే కాదు ఇక్కడి నీటిలోనూ పూర్తిగా విషం నిండివుంది. ఇక్కడి పదార్థం ఏదైనా మనిషి, లేదా మరో జీవి నోటిలోకి వెళితే మరణం ఖాయమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రదేశం విషపూరితంగా ఎలా మారింది? మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు ఈ ప్రదేశం జనం సందడితో ఉండేదని చెబుతారు. ఇక్కడ ఒకప్పుడు మానవ నివాసాలు ఉండేవి. అయితే ఈ ప్రదేశం ప్రపంచ యుద్ధంలో ధ్వంసమైంది. ఇక్కడ లెక్కకు మించిన బాంబులు ప్రయోగించారు. ఈ ప్రాంతంలో రసాయన దాడులు జరిగాయి. ఇక్కడి గాలి కూడా విషపూరితమే. కొంతకాలం క్రితం ఇద్దరు జర్మన్ శాస్త్రవేత్తలు పరిశోధనల కోసం ఇక్కడికి వెళ్లారు. ఇక్కడి మట్టిలోనే కాదు నీళ్లలో కూడా ఆర్సెనిక్ అధికమోతాదులో ఉందని తేలింది. దీనిలోని ఒక్క రేణువైనా ఏ జీవి నోటిలోకి వెళ్లినా మరణం ఖాయమని వారు తమ పరిశోధనలో గుర్తించారు. ఇది కూడా చదవండి: అది రహస్య కుటుంబం.. 40 ఏళ్లుగా దట్టమైన అడవుల్లోనే ఉంటూ.. -
స్నేహితుని స్థానంలో పరీక్షకు సిద్ధం.. బయోమెట్రిక్ మెషీన్లో వేలు పెట్టగానే..
మధ్యప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో మరో అభ్యర్థి పేరుతో, అతని స్థానంలో పరీక్ష రాసేందుకు వచ్చిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. రత్లాంలోని ఒక పరీక్షా కేంద్రంలో బయోమెట్రిక్ మెషీన్లో అభ్యర్థుల వేలి ముద్రల గుర్తింపులో సమస్య ఏర్పడటంతో వారికి కంటి రెటీనా పరీక్షలు చేస్తున్నారు. అయితే ఇంతలో ఒక నకిలీ అభ్యర్థి బిల్డింగ్‌లోని మెదటి అంతస్థు నుంచి దూకి పారిపోయాడు. అయితే పోలీసులు అతనిని వెంబడించి పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే రత్లాంకు సుమారు 28 కిలోమీటర్ల దూరంలోని సాత్‌రూంఢాలో గల మారుతి స్కూలులో పోలీస్ కానిస్టేబుళ్ల రాతపరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. పరీక్షకు హాజరయ్యేందుకు వచ్చే అభ్యర్థులు తమ హాల్‌టిక్కెట్, ఆధార్ కార్డును అధికారులకు చూపిస్తేనే వారిని పరీక్షా హాలులోకి అనుమతిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌కు చెందిన పుష్పేంద్ర యాదవ్(20) తన స్నేహితుడు, ఇటావానివాసి రాహుల్ యాదవ్ స్థానంలో పరీక్ష రాసేందుకు అతని హాల్ టిక్కెట్‌తో పరీక్షా కేంద్రానికి వచ్చాడు. అయితే బయోమెట్రిక్ వెరిఫికేషన్ సమయంలో అధికారులకు అనుమానం రావడంతో అతనిని ప్రశ్నించారు. దీంతో పుష్ఫేంద్ర యాదవ్ స్కూలు మొదటి అంతస్తు నుంచి దూకి, స్కూలు వెనుక తలుపు నుంచి పొలాల్లోకి పారిపోయాడు. అయితే అతనిని పోలీసులు వెంబడించి గ్రామ శివార్లలో పట్టుకున్నారు. అధికారులు ప్రశ్నించినప్పుడు పుష్పేంద్ర యాదవ్.. రాహుల్ యాదవ్ తన స్నేహితుడని తెలిపాడు. డబ్బు కోసం ఆశపడి రాహుల్ స్థానంలో పరీక్ష రాసేందుకు వచ్చానని తెలిపాడు. దీంతో పోలీసులు రాహుల్ యాదవ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇది కూడా చదవండి: వింత మొఘల్ పాలకుడు: ఒకసారి నగ్నంగా, మరోసారి స్త్రీల దుస్తులు ధరించి.. -
బాత్రూమ్లో బీకేర్‌ఫుల్.. ఇళ్లల్లో రెండో అత్యంత ప్రమాదకర ప్రదేశం
సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా ఏటా 15 ఏళ్లు పైబడిన వారిలో 2.35 లక్షల మంది బాత్రూమ్లో గాయపడుతున్నారని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నివేదిక చెబుతోంది. ఇంట్లో అతి చిన్న గదే అయినప్పటికీ.. వంటగది తరువాత బాత్రూమ్ అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం. బాత్రూమ్లో సంభవించే ప్రమాదాల కారణంగా ఒక్క యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోనే నిత్యం 370 మంది మరణిస్తున్నారు. మన దేశంలో ఎముకల చికిత్స కోసం వెళుతున్న వారిలో దాదాపు 35నుంచి 45 శాతం మంది బాత్రూమ్లో జారిపడి గాయాల పాలైనవారే. ప్రముఖ సినీ నటి శ్రీదేవి దగ్గర్నుంచి తాజాగా చైతన్య విద్యాసంస్థల అధినేత బీఎస్ రావు వరకూ అనేక మంది ప్రముఖుల మరణాలు బాత్రూమ్లోనే సంభవించాయి. ఈ జాగ్రత్తలు పాటించాలి వదులుగా ఉన్న టాయిలెట్ బౌల్ రిమ్పై కూర్చోవడం వల్ల అది అటూ ఇటూ కదిలి శరీరానికి గాయం చేయవచ్చు. ప్లాస్టిక్ సీట్లు పగిలిపోవడం, వ్యక్తి బరువు వల్ల కూలిపోవడం కూడా గాయాలు కలిగించవచ్చు. టాయిలెట్లలో సిగరెట్లు వంటివి పడేయడం వల్ల అవి పేలిపోయే ప్రమాదం కూడా ఉంది. కోసుకుపోవటం, ఎముకలు విరగటం, వెన్నెముకకి గాయాలు, ఫ్రాక్చర్లు, వంటివి మామూలే. సాధారణంగా బాత్రూమ్ ప్రమాదాలు మనం టబ్‌లోంచి బయటకు వస్తున్నప్పుడో, టాయిలెట్ సీటుపై కూర్చున్నప్పుడో, తువ్వాలు తీసుకుంటున్నప్పుడో లేదా జారుడు నేలపై నడిచినప్పుడో జరుగుతాయి. ఇలాంటివి ఆపాలంటే బాత్రూమ్ వాడుతున్నప్పుడు లైట్లు, డోర్ మ్యాట్లు వేయాలి. బాత్రూమ్ నేలను పొడిగా ఉండేలా చూసుకోవడంతో పాటు, పట్టుకోడానికి హ్యాండిల్స్ పెట్టించాలి. పాశ్చాత్య టాయిలెట్లో కూర్చుని లేచే సమయంలో హ్యాండిల్ పట్టుకుని లేవాలి. బాత్రూమ్కి వెళ్లినప్పుడు లోపల గట్టిగా గడియపెట్టుకోవకపోవడం వృద్ధులకు మంచిది. షవర్ కింద స్నానం చేసే సమయంలో స్టూల్ వాడాలి. చల్లని నీటితో స్నానం చేసినప్పుడు ముందుగా తలపై కాకుండా పాదాలపై నీటిని పోసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చరిత్రలో కొన్ని దుర్ఘటనలు ♦ చైనాలోని జిన్ రాష్ట్ర పాలకుడు క్రీస్తు పూర్వం 581లో టాయిలెట్ పిట్లో పడి మరణించాడు. ♦చరిత్రలో మర్చిపోలేని దుర్ఘటన ఒకటి 1184 జూలై 26న సంభవించింది. ‘ఎర్ఫర్ట్ లెట్రిన్ విపత్తు’గా పిలిచే ఈ ప్రమాదం రోమన్ చక్రవర్తి హెన్రీ అనధికార సమావేశం నిర్వహిస్తుండగా.. దానికి హాజరైన వారి బరువు కారణంగా చెక్క భవనం రెండవ అంతస్తు నేల కూలిపోయింది. కొంతమంది గ్రౌండ్ ఫ్లోర్ కింద ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో పడి మునిగిపోవడంతో 60 మంది మరణించారు. ♦ 1760లో గ్రేట్ బ్రిటన్‌కు చెందిన కింగ్ జార్జ్ అక్టోబర్ 25న టాయిలెట్లో మరణించాడు. ♦1945లో జర్మన్ జలాంతర్గామి ఒక టాయిలెట్ ప్రమాదంలో మునిగిపోయింది. ♦1983 జూన్ 2న ఎయిర్ కెనడా విమానం–797 వెనుక లావెటరీలో మంటలు చెలరేగి విమానం మొత్తం కాలిపోయింది. ప్రమాదంలో 23 మంది మరణించారు. ♦ బ్రిటిష్ వ్యాపారవేత్త, కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు క్రిస్టోఫర్ షేల్ జూన్ 26, 2011న గ్లాస్టన్బరీ ఫెస్టివల్లో పోర్టబుల్ టాయిలెట్లో గుండెపోటుతో చనిపోయాడు. ♦ టాయ్లెట్ల ఫిట్టింగ్‌లు సరిగ్గా లేకపోవడం వల్ల ఏటా దాదాపు 10 వేల ఓడలు ప్రపంచవ్యాప్తంగా మునిగిపోతున్నాయి. వృద్ధుల ప్రాణాలు తీస్తున్నాయ్ ఇంట్లో 65 ఏళ్లు పైబడిన పెద్దవారు ఉంటే.. బాత్రూమ్ ప్రమాదాల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. ప్రతి నలుగురిలో ముగ్గురు వృద్ధులు ఏడాదికి ఒకసారైనా బాత్రూమ్లో జారిపడే అవకాశం ఉంది. ఈ ప్రమాదాల్లో 65 శాతం చిన్న గాయాలతో సరిపెట్టినా.. మిగతా 35 శాతం మాత్రం ప్రాణాలు తీస్తున్నాయి. మన దేశంలో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం.. దేశంలో 42 శాతం మంది టాయిలెట్లలో 7 నుంచి 10 సార్లు ప్రమాదాలకు గురవుతున్నారు. 58 శాతం మంది 11 నుంచి 15 సార్లు పడిపోతున్నారు. సరైన తలుపులు లేకపోవడం ప్రమాదానికి వంద శాతం కారణమవుతుండగా, జారే ఫ్లోర్ 91.9 శాతం, బాత్రూమ్ పరిమాణం 80.3 శాతం, ఎత్తైన తలుపు థ్రెషోల్డ్ 53.5 శాతం, నాన్–స్కిడ్ మ్యాట్ లేకపోవడం 99.5 శాతం, గ్రాబ్ బార్లు లేకపోవడం 97 శాతం, ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేకపోవడం 96.6 శాతం, బాత్రూమ్లో వెలుతురు సరిపోకపోవడం వల్ల 94.4 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయి. వేడి నీటి వినియోగం 89.9 శాతం, సీట్ ఉపరితలం 55.6 శాతం, ప్రవేశ ద్వారం వద్ద లైట్ స్విచ్ లేకపోవడం 53 శాతం, చిందరవందరగా ఉన్న మార్గం వంటివి 39.4 శాతం కారణమవుతున్నాయి. ఎన్సీబీఐ మార్కెటింగ్ ఏజెన్సీ నివేదిక ప్రకారం.. 11 శాతం హార్ట్ అటాక్‌లు బాత్రూమ్లోనే వస్తున్నాయి. మలవిసర్జనకు వెళ్లినప్పుడు లేదా స్నానం చేస్తున్న సమయంలో ఇవి సంభవిస్తున్నాయి. అప్రమత్తంగా ఉండండి బాత్రూమ్లో మరణించే వారిలో ఎక్కువ శాతం హార్ట్ అటాక్ వల్లే సంభవిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం చల్లని నీటితో తలస్నానం చేసినప్పుడు.. ఆ నీటిని తలపై పోసుకుంటే శరీరంలో ఆ భాగం చల్లగా మారుతుంది. దీంతో రక్తనాళాలు వెంటనే అలర్ట్ అయ్యి రక్తాన్ని ఒక్కసారిగా పైకి పంపిస్తాయి. దీనివల్ల తల భాగం వైపు రక్త సరఫరాలో ఆటంకం ఏర్పడుతుంది. ఫలితంగా ఒక్కసారిగా బ్లడ్ ప్రెషర్ పెరిగి హార్ట్ అటాక్ వస్తుంది. కొన్నిసార్లు పక్షవాతం కూడా రావచ్చు. జారి పడిపోయినప్పుడు తల నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. వెన్నుపూస కూడా విరగవచ్చు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. – డాక్టర్ సుధాకర్ కనపర్తి, ఎముకలు, కీళ్ల వైద్య నిపుణుడు, విజయవాడ -
ఊహించని ప్రదేశాలలో వింత ఆవిష్కరణలు
-
ప్రపంచంలోని టాప్ 10 పచ్చదనంతో కూడిన ప్రదేశాలు
-
ప్రపంచంలోనే గొప్ప ప్రాంతాల జాబితాలో కేరళ, అహ్మదాబాద్
న్యూయార్క్: భారత్‌లోని రెండు ప్రాంతాలకు అరుదైన గౌరవం దక్కింది. టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన ప్రపంచంలోనే గొప్ప ప్రదేశాలు-2022 జాబితాలో గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరం, కేరళ రాష్ట్రాలకు చోటు దక్కింది. 50 అత్యుత్తమ పర్యటక గమ్యస్థానాల్లో భారత్‌లోని ఈ రెండు ప్రాంతాలు స్థానం సంపాదించాయి. ‘ప్రయాణాల ద్వారా మానవ సంబంధాల విలువ తెలుసుకునేందుకు 2022లో ఎదురైన సవాళ్లు దోహదపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ప్రస్తుతం రోడ్డు, ఆకాశ మార్గాల్లో ప్రయాణాలు పుంజుకున్నాయి. ఆతిథ్య పరిశ్రమ మళ్లీ ప్రారంభమైంది. యాత్రికులను ఆహ్వానించేందుకు సిద్ధమైంది.’ అని పేర్కొంది టైమ్ మ్యాగజైన్. భారత్‌లోని తొలి యునెస్కో గుర్తింపు పొందిన వారసత్వ నగరం అహ్మదాబాద్‌లో ఎన్నో కలగలిసి ఉన్నాయని పేర్కొంది. 'సంప్రదాయ పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు ఇక్కడ పురాతన స్థలాలతో పాటు కొత్త కొత్త ఆవిష్కరణలు ఉన్నాయి. అందులో సబర్మతి నది సమీపంలో 36 ఎకరాలతో ఉన్న గాంధీ ఆశ్రమం నుంచి ప్రపంచంలోనే సుదీర్ఘ నృత్య పండుగ నవరాత్రి ఉత్సవాల వరకు చాలా ఉన్నాయి.' అని పేర్కొంది. అహ్మదాబాద్ అంటే ఒక సైన్స్ సిటీగా పేర్కొంది. మరోవైపు.. భారత్‌లోని ఆగ్నేయ తీర ప్రాంతంలో కేరళ ఒక అందమైన రాష్ట్రంగా అభివర్ణించింది టైమ్. అందమైన బీచ్‌లు, ఆలయాలు, ప్రాంతాలు ఉన్నాయని, దేవతలు నివసించే దేశంగా మారిందని పేర్కొంది. ఈ ఏడాది భారత్‌లో పర్యాటక రంగాన్ని కేరళ మరింత ముందుకు తీసుకెళ్లినట్లు తెలిపింది. ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల జాబితాను సిద్ధం చేయడానికి ఈ సంవత్సరం టైమ్ మ్యాగజైన్ దాని అంతర్జాతీయ నెట్వర్క్ కరస్పాండెంట్లు, కంట్రిబ్యూటర్ల ద్వారా తమ అనుభవాలను అందించే వారి వైపు దృష్టి సారించి స్థలాల నామినేషన్లను స్వీకరించినట్లు పేర్కొంది. జాబితాలోని మరికొన్ని ప్రాంతాలు.. వరల్డ్స్ గ్రేటెస్ట్ ప్రాంతాల్లో యూఏఈలోని రాస్ అల్ ఖైమా, ఉతాహ్‌లోని పార్క్ సిటీ, సియోల్, ఆస్ట్రేలియాలోని గ్రేట్ బారియర్ రీఫ్, ద ఆర్కిటిక్, స్పెయిన్‌లోని వలెన్సియా, భూటాన్‌లోని ట్రాన్స్ భూటాన్ ట్రైల్, అంతర్జాతీయ స్పేస్ స్టేషన్, బోగోటా, జాంబియాలోని లోవర్ జాంబేజి నేషనల్ పార్క్, ఇస్తాన్‌బుల్, కిగాలీ, ర్వాండాలు ఉన్నాయి. ఇదీ చూడండి: అమర్నాథ్ యాత్రికుల బస్సుకు ప్రమాదం.. 15 మంది మృతి! -
రోవర్ ల్యాండింగ్ సైటు పేరెంటో తెలుసా..
లాస్ఎంజిల్స్: అంగారక గ్రహంపై పరిశోధనల నిమిత్తం నాసా పంపిన పర్సెవరన్స్ రోవర్ దిగిన స్థలానికి నాసా పేరుపెట్టింది. రోవర్ దిగిన స్థలానికి ప్రముఖ సైన్స్ ఫిక్షన్ రచయిత ‘ఆక్టేవియా ఇ బట్లర్ ’ పేరును పెట్టారు. అంగారక గ్రహంపై రాళ్లు, మట్టిని పరిశోధించడం, సూక్ష్మజీవుల ఉనికిని అన్వేషించడం, నేరుగా మానవుడు ల్యాండ్ అవ్వడానికి అనువైన స్థలాన్ని వెతకడం పర్సెవరన్స్ విధి. గతంలో మార్స్‌పై దిగిన క్యూరియాసిటి రోవర్ ల్యాండింగ్ స్థలానికి ‘రే బ్రాడ్బరీ’ రచయిత పేరును 2012 ఆగస్టు 22న పెట్టారు. గత ఏడాది జూలై 30 న ఈ రోవర్‌ను నాసా ప్రయోగించిన విషయం తెలిసిందే . ఇది 203 రోజుల ప్రయాణం తరువాత ఫిబ్రవరి 18 న అంగారక గ్రహానికి చేరింది. (చదవండి:మార్స్‌పై రోవర్ అడుగులు షురూ!) -
అక్కడే నిర్మించండి..
టీటీడీ సత్రం స్థలంలోనే అన్నదాన భవనం నిర్మించాలని ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రసాద్ ఆదేశం దేవస్థానంలోని పలు నిర్మాణాలపై లిఖితపూర్వక ఆదేశాలు జారీ అన్నవరం(ప్రత్తిపాడు) : అన్నవరం దేవస్థానంలో రూ.పది కోట్ల వ్యయంతో అన్నదాన భవనాన్ని పాత టీటీడీ సత్రం స్థలంలోనే నిర్మించాలని దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ దేవస్థానం అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం దేవస్థానంలో భక్తులకు సీఆర్ఓ భవనం దిగువన ఉన్న హాలులో అన్నదానం చేస్తున్నారు. నూతన భవన నిర్మాణ కోసం కొత్త సెంటినరీ సత్రం లోని 48 గదుల బ్లాక్‌ను కూల్చాలని మూడేళ్ల క్రితం కమిషనర్ ఆదేశాలివ్వడంతో దీనిని అందరూ వ్యతిరేకించారు. అయితే ఈ విషయానికి బుధవారం ప్రిన్సిపల్ సెక్రటరీ ముగింపు పలికారు. ఈ నెల ఎనిమిదో తేదీన అన్నవరం దేవస్థానంలో పర్యటించిన జేఎస్వీ ప్రసాద్ పలు నిర్మాణాలు తిలకించడంతో పాటు వివిధ అంశాలపై అధికారులతో చర్చలు జరిపారు. అనంతరం ఆయన దేవస్థానం అధికారులకు బుధవారం లిఖిత పూర్వకంగా పలు ఆదేశాలు జారీ చేశారు. ఒకేసారి 1500 మందికి భోజనం పెట్టేలా.. సెంటినరీ కాటేజీ కూల్చకుండా ఖాళీగా ఉన్న టీటీడీ సత్రం స్థలంలోనే అన్నదాన భవనం నిర్మించాలని, స్థలం చాలకపోతే పక్కనే ఉన్న సబ్‌క్యాంటీన్ స్థలాన్ని కలుపుకొని నిర్మించాలని ఆదేశించారు. ఒకేసారి 1,500 మందికి భోజనం పెట్టేలా మూడంతస్తులలో భవనం నిర్మించాలని, దానికి గాను గతంలో రూపొందించిన ప్లాన్‌ను రివైజ్ చేసి ‘ జీ ప్లస్ టూ’ భవనం నిర్మించాలని సూచించారు. భవన నిర్మాణం డిజైన్ చేసే ముందు శ్రీశైలం దేవస్థానం, ద్వారకాతిరుమల, సింహాచలం దేవస్థానాల్లోని అన్నదాన భవనాలను పరిశీలించాలని ఆదేశించారు. చెందుర్తిలో సోలార్ పవర్ ప్రాజెక్ట్ దేవస్థానానికి చెందుర్తి గ్రామంలో ఉన్న 135 ఎకరాల స్ధలంలో 1.5 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్‌ను రూ.4.5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. యాగశాలకూ ఓకే : దేవస్థానంలో యాగశాల నిర్మాణానికీ ఆయన లిఖితపూర్వక ఆదేశాలిచ్చారు. వీలైనంత త్వరగా ఈ పనులు ప్రారంభించాలని పేర్కొన్నారు. వేదపాఠశాలలో అదనపు నిర్మాణాలకు గ్రీన్‌సిగ్నల్ : సత్యగిరిపై నిర్మిస్తున్న స్మార్త, ఆగమ, వేద పాఠశాల లో ప్రస్తుతం నిర్మిస్తున్న నిర్మాణాలతో పాటు అదనంగా రెండు స్టాఫ్ క్వార్టర్స్‌ను నిర్మించాలని ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ ఆదేశించారు. ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటాం: ఇన్‌ఛార్జి ఈఓ దేవస్థానంలో వివిధ నిర్మాణాలపై ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ ఇచ్చిన ఆదేశాలపై తగు చర్యలు తీసుకుంటామని ఇన్చార్జి ఈఓ ఈరంకి జగన్నాథరావు బుధవారం తెలిపారు. వీటిని దేవాదాయశాఖ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి తగిన అనుమతులు పొందాల్సి ఉందన్నారు. అన్నదానభవన నిర్మాణం కోసం ఇటీవల ప్రముఖ దేవస్థానాల్లో నిర్మించిన అన్నదాన భవనాలను పరిశీలించమని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. -
ఒకే గూటిలో పోలీసు కార్యాలయాలు
20 ఎకరాలలో నూతన భవనాల నిర్మాణం అర్బన్ ఎస్పీ, డీఎస్పీలు, సీఐడీ, ఆయుధగారం.. అన్నీ అక్కడే సీఎం చంద్రబాబుతో ప్రారంభించేందుకు యత్నం రాజమహేంద్రవరం పోలీస్ అర్బన్ జిల్లాలోని ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలన్నీ ఒకేచోట నిర్మిస్తున్నారు. లాలాచెరువు వద్ద జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఓఎన్జీసీ బేస్ క్లాంప్లెక్ వద్ద 20 ఎకరాల స్థలంలో అర్బన్ జిల్లా ఎస్పీ కార్యాలయం, డిస్ట్రిక్ ఆర్మ్డ్ రిజర్వు పోలీస్ కార్యాలయం (డీఏఆర్), సీఐడీ కార్యాలయం, ఆయుధగారం కార్యాలయాలు కొత్త హంగులతో రూపుదిద్దుకుంటున్నాయి. ఇప్పటివరకూ కొన్ని డీఎస్పీ, సీఐడీ తదితర కార్యాలయాలు అద్దె భవనాలలో నిర్వహిస్తున్నారు. ఒకేచోటు అన్ని కార్యాలయాలు ఉండడం వల్ల ప్రజలకు సౌలభ్యంతో పాటు, ప్రభుత్వానికీ అద్దెల భారం తగ్గుతుంది. డీఎఆర్ కార్యాలయం, ఆయుధగారాలు నూతన భవనాలు శిథిలావస్థకు చేరాయి. రూ.14 కోట్లతో ఎస్పీ కార్యాలయం, ఆయుధగారం, డీఏఆర్ కార్యాలయాల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఈ కార్యాలయాలను సీఎం చంద్రబాబుతో ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాజమహేంద్రవరం క్రైం (రాజమహేంద్రవరం సిటీ) : డిస్ట్రిక్ పోలీస్ ఎస్పీ కార్యాలయాన్ని పూర్తి హంగులతో 27 వేల చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మించారు. భవనం ముందు భాగంగా గార్డెనింగ్ ఏర్పాటు చేశారు. ఎస్పీ, ముగ్గురు అడిషినల్ ఎస్పీలకు ప్రత్యేక చాంబర్లు, క్రైం, లా అండ్ ఆర్డర్, స్పెషల్ బ్రాంచి, ఇతర శాఖల డీఎస్పీలకు కూడా చాంబర్లు కేటాయించారు. ఈ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్, పరిపాలనకు సంబంధించిన ఏ,బీ,సీ,డీ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. సీఐడీ కార్యాలయం... ప్రస్తుతం ఏవీ అప్పారావు రోడ్డులో అద్దె భవనంలో ఉన్న సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి ఈ ప్రాంగణంలో ఎకరం స్ధలం కేటాయించారు. దీనిలో 17 వేల చదరపు గజాల స్థలంలో జీ ప్లస్-1 తో రూ.3.40 కోట్లతో నిర్మించారు. ఈ కార్యాలయంలో సీఐడీ డీఎస్పీ కార్యాలయం, డీఎస్పీ గదులు, కాన్ఫరెన్స్ హాల్, మల్టీపర్పస్ రూమ్స్, సీఐలు, ఎస్సైలకు ప్రత్యేక గదులు, లాకప్ రూమ్, ఇంటరాగేషన్ రూమ్ నిర్మించారు. డీఏఆర్ కార్యాలయం ఆశోకా థియేటర్ వద్ద శిథిలావస్థలో ఉన్న పురాతన భవనంలో ప్రస్తుతం డిస్ట్రిక్ ఆర్మ్డ్ పోలీస్ కార్యాలయం ఉంది. పోలీస్ కార్యాలయ సముదాయంలో 22 వేల చదరపు గజాల స్థలంలో ఈ కార్యాలయానికి భవనం నిర్మించారు. ఈ భవనంలో డీఏఆర్ డీఎస్పీ, ఎంఆర్, ఆర్ఎస్సైలు, ఆర్ఐల కోసం ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు. వీటితో పాటు పోలీస్ బ్యాండ్ కోసం ప్రత్యేక రూమ్, క్లాస్ రూమ్‌లు నిర్మించారు. వీటిని మహిళా, పురుష పోలీసులకు వేర్వేరుగా ఏర్పాటు చేశారు. ఆయుధగారం... ప్రస్తుతం ఆశోకా థియేటర్ వద్ద పురాతన భవనంలో ఉన్న ఆయుధగారాన్ని నూతన భవనంలోకి మార్చనున్నారు. 8 వేల చదరపు గజాల స్థలంలో నిర్మించిన ఈ భవనానికి సంఘ వ్యతిరేక శక్తులు దాడిని తట్టుకునేలా ఎలక్ట్రానిక్ ఫెన్సింగ్ ఉంటుంది. భవనం కింద భాగంలో ఆయుధాలు ఉంచేందుకు స్ట్రాంగ్ రూమ్ ఉంటుంది. నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక రూమ్ ఏర్పాటు చేశారు. భవనం పరిసరాలలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. పేరేడ్ గ్రౌండ్, షెడ్లు, ఈ ప్రాంగణంలో ఉన్నాయి. సోలార్ సిస్టమ్... ఈ కార్యాలయాలకు మొత్తం సోలార్ సిస్టం ద్వారా విద్యుత్‌ను అందించనున్నారు. భవనంపైనే సోలార్ పలకలను ఏర్పాటు చేశారు. రూ.65 లక్షలతో 100 కేవీ సోలార్ సిస్టం ఏర్పాటు చేశారు. దీని ద్వారా అన్ని కార్యాలయాలకు విద్యుత్ సరఫరా చేస్తారు. -
వంటంతా ఒకే చోట..!
- 20 కిలోమీటర్లకో పాకశాల ఏర్పాటు యోచన - అక్కడి నుంచే పాఠశాలలకు మధ్యాహ్నభోజనం - జిల్లాలో ఐదు క్లస్టర్లలో అమలుకు సన్నాహాలు రాయవరం (మండపేట) : ‘మెనూ ప్రకారం భోజనం అందడం లేదు. అన్నంలో పురుగులు ఉంటున్నాయి. మెనూ ప్రకారం గుడ్డు వడ్డించడం లేదు..’ ఇలాంటివే ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై వినిపిస్తున్న విమర్శలు. ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అమలు చేస్తున్న ఈ పథకంపై విద్యార్థులు, తల్లిదండ్రులు వివిధ సందర్భాల్లో జిల్లాలో ఏదో ఒక మూల అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్న భోజనంలో మార్పులకు విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. ఇందుకు ప్రభుత్వం 524339/ప్రోగ్రామ్.1/ఎ1/2017 తేదీ 19–04–2017తో మెమో విడుదల చేసింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తోంది. జిల్లాలో 4,189 ప్రభుత్వ, మండల పరిషత్, జెడ్పీ, ఎయిడెడ్, మున్సిపల్ పాఠశాలల్లో దాదాపుగా రోజుకు 2.80 లక్షల మంది మధ్యాహ్న భోజనం తింటున్నారు. జకొన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని స్వచ్ఛంద సంస్థలు వండి సరఫరా చేస్తుండగా, చాలా పాఠశాలల్లో మిడ్డే మీల్ వర్కర్లు వండి వడ్డిస్తున్నారు. ప్రతి క్లస్టర్లో 25 వేల మందికి వంట ఇకపై ప్రతి మూడు, నాలుగు మండలాలకు ఒక భారీ వంటశాల ఏర్పాటు చేసి అక్కడి నుంచి అన్ని పాఠశాలలకూ భోజనం సరఫరా చేయాలని ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. జిల్లాలో కాకినాడ, రాజమహేంద్రవరం, పిఠాపురం, అమలాపురం, రామచంద్రపురంలలో క్లస్టర్ల ఏర్పాటుకు ప్రతిపాదించారు. ప్రతి క్లస్టర్లో సుమారు 25 వేల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సిద్ధం చేయనున్నారు. ఉదాహరణకు రామచంద్రపురంలో వంటశాలను ఏర్పాటు చేసి దాని పరిధిలోని 25 వేల మందికి భోజనం తయారు చేసి అక్కడి నుంచి వాహనాల ద్వారా పాఠశాలలకు సరఫరా చేయనున్నారు. ఎప్పుడు తయారైన భోజనం అప్పుడే ప్యాకింగ్ చేసి పంపేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇందుకు ప్రతి క్లస్టర్‌కు రెండు ఎకరాల ప్రభుత్వ స్థలం అవసరమని జిల్లా విద్యాశాఖ గుర్తించింది. అవసరమైన స్థలాలను ఐదు క్లస్టర్లలో గుర్తించాలని కలెక్టర్‌కు విద్యాశాఖ నివేదించింది. ఇప్పటి వరకు మధ్యాహ్న భోజన పథకాన్ని పాఠశాల హెచ్ఎంతో పాటు మండల విద్యాశాఖాధికారి ఒక్కరే పర్యవేక్షిస్తున్నారు. వంటశాలల ఏర్పాటు తర్వాత వాటి సంఖ్య పరిమితంగా ఉంటుంది. ఫలితంగా డివిజన్, జిల్లా స్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. మెనూ ప్రకారమే భోజనం.. ప్రభుత్వ ఆలోచన పూర్తి స్థాయిలో అమలైతే నిర్దేశించిన మెనూ ప్రకారమే విద్యార్థులకు భోజనం అందనుంది. వంటశాలలు లేవని, వర్షం కురుస్తోందని, బిల్లులు చెల్లించక పోవడంతో భోజనం అందించడం ఇబ్బందిగా మారుతుందనే మాటలు వినిపించే అవకాశం ఉండదు. ప్రతి వారం తప్పనిసరిగా రెండు గుడ్లు అందించాల్సి ఉంటుంది. విద్యార్థులకు ఆరోగ్యకరమైన వాతావరణంలో పరిశుభ్రమైన భోజనం తయారవుతుంది. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలల్లో ప్రస్తుతం ఉన్న ఇబ్బందులు తొలగిపోనున్నాయి. వర్కర్లకు ప్రత్యామ్నాయమెలా.. మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహిస్తున్న మహిళలు భారీగా ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. ప్రతి పాఠశాలలో మిడ్డే మీల్ వర్కర్లు భోజనం తయారు చేసి వారికి వడ్డిస్తున్నారు. జిల్లాలో సుమారు 8 వేల మంది మిడ్డే మీల్ వర్కర్లు పనిచేస్తున్నారు. వీరికి నెలకు రూ.1,000 గౌరవ వేతనం అందజేస్తున్నారు. నూతన విధానం అమలు జరిగితే వారు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. వారికి ప్రత్యామ్నాయ ఉపాధి ఎలా చూపుతారనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే వంటశాలల్లో భోజనం తయారీతో పాటు ప్యాకింగ్, ఇతర పనుల్లో వీరిని వినియోగించుకోనున్నా..అందరికీ ఉపాధి సాధ్యమవుతుందా అనే ప్రశ్న తలెత్తుతుంది. అంచనాలు రూపొందిస్తున్నాం.. ప్రతి 20 కిలోమీటర్లకో వంటశాల ఏర్పాటు చేసేందుకు అవసరమైన అంచనాలు రూపొందిస్తున్నాం. వంట తయారు చేయడానికి అవసరమైన భవనాల నిర్మాణానికి అనువైన స్థలం కోసం జిల్లా కలెక్టర్‌కు నివేదించాం. – ఎస్.అబ్రహాం, జిల్లా విద్యాశాఖాధికారి -
ప్రాణాలైనా ఇస్తాం.. స్థలాలు ఇవ్వలేం
► తాతల కాలం నుంచి ఇక్కడే ఉన్నాం ► శివనామస్మరణ వింటూ ఆధ్యాత్మిక చింతనలో బతుకుతున్నాం ► ఇప్పుడు భూములు ఇవ్వమంటే ఎలా? ► జేసీని నిలదీసిన స్థానికులు ►మంచి పరిహారం ఇస్తామని భరోసా ‘ప్రాణత్యాగానికైనా సిద్ధం.. ఎట్టి పరిస్థితుల్లోనూ మా స్థలాలు ఇవ్వలేం’ అంటూ శ్రీకాళహస్తి దేవస్థానం సమీప ప్రాంతాల్లో నివాసముంటున్న 173 కుటుంబాల ప్రజలు తెగేసి చెప్పారు. ‘తాతముత్తాతల కాలం నుంచి ఇక్కడే ఉన్నాం.. శివనామస్మరణ వింటూ ఆధ్యాత్మిక చింతనలో బతుకుతున్నాం.. ఇప్పుడు మా ఇళ్లు ఖాళీ చేసి.. స్థలాలు లాక్కుంటే ఎలా బతికేది’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అదిరించి..బెదిరించి స్థలాలు లాక్కోవాలని చూస్తే ఇక్కడే చావనైనా చస్తామని శుక్రవారం సబ్‌కలెక్టర్ ఎదుట తమ ఆవేదన వెళ్లగక్కారు. శ్రీకాళహస్తి : మాస్టర్ ప్లాన్‌లో భాగంగా శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో విస్తరణ పనులు చేపట్టేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం తహసీల్దార్ కార్యాలయంలో బృహత్తర ప్రణాళిక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ గిరీషా హాజరయ్యారు. బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఒక్కొక్కరిదీ ఒక్కో సమస్య పలువురు బాధితులు మాట్లాడుతూ తాతల.. ముత్తాతల కాలం నుంచే ఇదే ప్రాంతంలో నివాసముంటున్నామని, ఇప్పుడు స్థలాలు దేవస్థానానికి ఇవ్వాలని డిమాం డ్ చేయడం సరికాదని చెప్పారు. ‘ఇంట్లోనే ఉంటాం.. ఇల్లు కూల్చివేసి... స్థలాలు లాక్కోండి’ అంటూ కొందరు ఆక్రోశం వెళ్లగక్కారు. ఎక్కడో స్థలాలు ఇస్తే ఎలా బతకా లి..? అంటూ మరికొందరు సమాధానం ఇచ్చారు. మా జీవితం ఇదే ప్రాంతంలో గడిపేయాలంటూ ఇంకొందరు జాయింట్ కలెక్టర్‌కు విన్నవించారు. మంచి పరిహారం ఇస్తాం జాయింట్ కలెక్టర్ స్పందిస్తూ దేవస్థానాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుం దని, తద్వారా మంచి జరుగుతుందని చెప్పారు. మంచి పరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వానికి భూములు అవసరమైతే తీసుకునే హక్కు ఉందని, మొత్తం 173 మందిలో కొందరు ఆలయ అభివృద్ధికి స్థలాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, ముందుగా వారి స్థలాలు సేకరిస్తామని జాయింట్ కలెక్టర్ వివరించారు. కానీ దీనికి బాధితుల నుంచి సంతృప్తికర సమాధానం లభించలేదు. వారికి ఇంతవరకు పరిహారం అందలేదు.. గాలిగోపురం 2010లో కుప్పకూలితే నష్టపోయినవారికి, కొత్త గాలిగోపురం నిర్మాణానికి స్థలాలు ఇచ్చినవారికి ఇప్పటికీ న్యాయం చేయలేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇవ్వడం కుదరదని తెగేసి చెప్పారు. దాంతో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపుచేశారు. ఇంటికో ఉద్యోగం ఇవ్వాలి కొందరు తమ స్థలాలకు అంకణానికి రూ.15లక్షల చొప్పున ఇప్పించాలని, ఇంటికి ఓ షాపు, ఓ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంటికో ఉద్యోగం ఇవ్వడం కుదరదని, షాపులు అయితే కొందరికి ఇస్తామని జాయింట్ కలెక్టర్ చెప్పారు. పరిహారం చెల్లింపులకు ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసిందని, ఓ పద్ధతి ప్రకారం స్థలం విలువకట్టి పరిహారం చెల్లిస్తుందన్నారు. దీనిపై మరో రెండు, మూడు సమావేశాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. సబ్ కలెక్టర్ నిశాంత్‌కుమార్, ఆలయ చైర్మన్ పోతుగుంట గురవయ్యనాయుడు, ఈవో భ్రమరాంబ, ఆలయ ఈఈ వెంకటనారాయణ, తహసీల్దార్ రమేష్‌బాబు, డీఎస్పీ వెంకటకిషోర్, సీఐ చిన్నగోవింద్, ఎస్ఐ సంజీవ్‌కుమార్ పాల్గొన్నారు. -
మిలింద్కు చోటు
బంగ్లాతో ప్రాక్టీస్‌కు భారత్ ‘ఎ’ జట్టు ప్రకటన న్యూఢిల్లీ: భారత్ ‘ఎ’ జట్టులో హైదరాబాదీ ఆటగాడు సి.వి.మిలింద్కు చోటు దక్కింది. బంగ్లాదేశ్‌తో హైదరాబాద్‌లో జరిగే రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ కోసం 14 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించారు. తమిళనాడుకు చెందిన అభినవ్ ముకుంద్ ‘ఎ’ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఈ ప్రాక్టీస్ మ్యాచ్ వచ్చే నెల 5, 6 తేదీల్లో జింఖానా గ్రౌండ్స్‌లో జరుగుతుంది. భారత్ ‘ఎ’ జట్టు: ముకుంద్ (కెప్టెన్), ప్రియాంక్ పంచాల్, శ్రేయస్ అయ్యర్, ఇషాంక్ జగ్గీ, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా, షాబాజ్ నదీమ్, జయంత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అనికేత్ చౌదరి, సీవీ మిలింద్, నితిన్ సైని. -
వ్యక్తిపై గొడ్డలితో దాడి
ఎమ్మిగనూరు రూరల్ : పార్లపల్లిలో స్థలంలో ముళ్లచెట్ల తొలగింపు విషయంపై జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తిపై గొడ్డలితో దాడి చేయటంతో తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన జమీర్ ఏడేళ్ల క్రితం ఖాళీ స్థలాన్ని కొన్నాడు. ఇతని స్థలం పక్కనే అదే గ్రామానికి చెందిన అబ్దుల్లా కూడా 6 నెలల క్రితం స్థలం కొన్నాడు. ఇద్దరి స్థలాల్లో మధ్య ఉన్న దారిలో ముళ్లచెట్లు పెరగడంతో వాటిని అబ్దుల్లా తొలగించాడు. తమ స్థలంలోని చెట్లను ఎలా తొలగిస్తామని జమీర్ అబ్దుల్లాను అడగగా మాటమాట పెరిగింది. జమీర్‌పై అబ్దుల్లా అతని కుమారులు దాడి చేశారు. దీంతో తలకు తీవ్ర గాయమైంది. అతడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు. -
సీఎం బహిరంగ సభ స్థలం పరిశీలన
వివి మెరక(సఖినేటిపల్లి) : ఈ నెల 29న మోరిలో సీఎం చంద్రబాబునాయుడు పర్యటన సందర్భంగా వివి మెరకలో నిర్వహించనున్న బహిరంగ సభాస్థలిని జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ అమలాపురం ఆర్డీఓ గణేష్‌కుమార్‌తో కలసి శుక్రవారం పరిశీలించారు. గ్రౌండ్ సామర్ధ్యంపైనా స్థానిక అధికారులతో సమీక్షించారు. సభలో నగదు రహిత లావాదేవీలు, ఏపీ ఫైబర్ గ్రిడ్ ప్రారంభం, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ఎల్ఈడీ బల్బుల ఏర్పాటుకు సీఎం ప్రారంభోత్సవాలు చేస్తారని కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే సభాస్థలి మ్యాప్‌ను, పరిసరాలను జిల్లా ఎస్పీ రవిప్రకాష్ తదితరులు పరిశీలించారు. -
పర్యాటక ప్రాంతాన్ని పరిశీలించిన కలెక్టరు
కాట్రేనికోన : మండలంలోని బ్రహ్మసమేథ్యం శివారు రాతి కాలువ అటవీ సెక్ష¯ŒS పరిధిలోని సముద్ర తీర ప్రాంతాన్ని మంగళవారం కలెక్టరు అరుణ్‌కుమార్ పరిశీలించారు. జి.మూలపొలం నుంచి బోటులో మడ అటవీ ప్రాంతం వెంబడి నదీపాయలో ప్రయాణించారు. మగసానితిప్ప ప్రాంతంలో తూరల మెండును కూడా పరిశీలించారు. మాంగ్రూవ్ అటవీ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. కార్యక్రమంలో టూరిజం రీజనల్ డైరెక్టర్ భీమ్శంకర్, వైల్డ్ లైఫ్ ఫారెస్టు అధికారి ఎ.సునీల్‌కుమార్, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు. -
స్థలం లేక వాహనాల సీజ్ లేదట!
⇒ పట్టుకున్న వాహనాలకు పార్కింగే సమస్య ⇒ రెండు నెలలుగా ‘సీజ్’ మాటే మరిచిన రవాణా అధికారులు గుంటూరు (నగరంపాలెం): నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు తిరుగుతున్నా రవాణా అధికారులు రెండు నెలలుగా సీజ్ చేయడం లేదు. అదేంటీ...రూల్స్ ఏమైనా మారాయా అనుకుంటున్నారా...ఏమీ కాదు... సీజ్ చేసిన వాహనాలను ఎక్కడ పెట్టాలో తెలియక.. పార్కింగ్ సమస్యతోనే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మోటార్ వెహికల్ యాక్ట్‌కు విరుద్ధంగా ప్రయాణిస్తున్న వాహనాలను మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్లు గుర్తిస్తే వాటిపై కేసులు నమోదు చేసి వెంటనే సీజ్ చేస్తారు. సీజ్ చేసిన ప్రాంతానికి సమీపంలోని పోలీస్ స్టేషన్లో గానీ, ఆర్టీసీ బస్ డిపోలలో గానీ వాహనాలను తరలిస్తారు. అయితే అన్ని పోలీస్ స్టేషన్ల ప్రాంగణాలలో గ్రీనరీ పెంపొందించి సుందరంగా తీర్చి దిద్దాలని రెండు నెలల క్రితం ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్లలో ఉన్న సీజ్ చేసిన వాహనాలు తీసుకువెళ్లాలని, కొత్తగా సీజ్ చేసిన వాహనాలు తీసుకురావద్దంటూ సంబంధిత ఎస్‌హెచ్‌వోలు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లకు సమాచారం అందించారు. ఆర్టీసీ బస్ డిపోలలో సైతం సీజ్ చేసిన వాహనాలు నిలపడానికి ఆర్టీసీ అధికారులు అనుమతించటం లేదు. స్థలాల కొరతే ప్రధాన సమస్య.. జిల్లాలో రవాణాశాఖకు గుంటూరు, నర్సరావు పేటలో ఆర్టీఏ కార్యాలయాలు.., తెనాలి, పిడుగురాళ్ళలో యూనిట్ కార్యాలయాలు.., మాచర్ల, చిలకలూరిపేట, బాపట్ల, మంగళగిరిలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టరు కార్యాలయాలు ఉన్నాయి. గుంటూరు ఆర్టీఏ కార్యాలయం మినహా మిగతా అన్నీ అద్దె భవనాలలోనే కొనసాగుతున్నాయి. నర్సరావుపేటలో ఆర్టీఏ కార్యాలయం, టెస్టింగ్ ట్రాకు, సీజ్ చేసిన వాహనాలు పార్కింగ్‌కు ఐదు ఎకరాల స్థలం కావాలని, తెనాలి , పిడుగురాళ్ల యూనిట్ కార్యాలయాలకు రెండు ఎకరాల స్థలం కావాలని, మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాలకు స్థలాలు కేటాయించాలని రవాణా శాఖ అధికారులు జిల్లా యంత్రాగానికి పలుమార్లు లేఖలు రాసారు. ఇప్పటికీ స్థలాల కేటాయింపుపై సూత్ర ప్రాయంగా అంగీకారం కూడా రాలేదు. రవాణా శాఖ కార్యాలయాల వద్ద సీజ్ చేసిన వాహనాలు పార్కింగ్ చేసుకోవటానికి స్థలాలు లేకపోవటంతో రెండు నెలలుగా జిల్లాలో ఎంవీఐలు వాహనాలు సీజ్ చేయటం నిలిపివేశారు. తనిఖీలలో జరిమానాలు , కేసులూ మాత్రమే నమోదు చేస్తున్నారు. స్థలం లేక ఇబ్బంది.. తనిఖీ సమయంలో సీజ్ చేసిన వాహనాలను సురక్షిత ప్రాంతాల్లో పార్కింగ్ చేసేందుకు రవాణాశాఖ అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా రాజధాని ప్రాంతంగా మారటంతో స్థలాల లభ్యత కష్టంగా ఉంది. నరసరావుపేటలో ఆర్టీఏ కార్యాలయానికి ఐదు ఎకరాల స్థలం సేకరించేం దుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోలీస్ స్టేషన్లలలో, ఆర్టీసీ డిపోలలో తాత్కాలికంగా అయినా సీజ్ చేసిన వాహనాలు పార్కింగ్ చేయటానికి సంబంధిత అధికారులు నిరాకరిస్తున్నారు. దీంతో వాహనాలు సీజ్ చేయటం గత రెండునెలలుగా జిల్లాలో గణనీయంగా ఎంవీ ఐలు తగ్గించారు. జిల్లా యంత్రాంగం స్థలాల కేటాయింపుపై సానుకూలంగా స్పందిస్తే సమస్య పరి ష్కారమవుతుంది. – జీసీ రాజరత్నం, జిల్లా ఉపరవాణా అధికారి -
ట్రిబ్యునల్ తీర్పు బేఖాతర్
స్థలం స్వాధీనంలో దేవాదాయ శాఖ నిర్లక్ష్యం - టీడీపీ నేతల ఒత్తిళ్లే కారణం - నోటీసులతో సరిపెట్టే ప్రయత్నం కర్నూలు(అగ్రికల్చర్): ఓ స్థలాన్ని స్వాధీనం చేసుకునే విషయంలో ఎండోమెంట్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చిన నాలుగేళ్ల తర్వాత దేవాదాయ శాఖ స్పందించిన తీరు చర్చనీయాంశంగా మారింది. నేతల ఒత్తిళ్లే ఇందుకు కారణం కాగా.. ఆ శాఖ కమిషనర్ ఆగ్రహంతో ఎట్టకేలకు కదలిక వచ్చింది. అయితే టీడీపీ నేతల ఒత్తిళ్లతో ఇప్పుడు కూడా నోటీసులతో సరిపెట్టేందుకు రంగం సిద్ధమయింది.ఽ వివరాల్లోకి వెళితే.. కర్నూలు కిడ్స్ వరల్డ్ సమీపంలోని గోరక్షణ మహా సంఘానికి సర్వే నెంబర్ 171లో 330 చదరపు గజాల స్థలం ఉంది. ఇందులో వీఎస్ టెక్స్టైల్స్ వస్త్ర దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ స్థలాన్ని దక్కించుకునేందుకు దేవాదాయ శాఖ అధికారులు ఎండోమెంట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. విచారణ అనంతరం 2012లో తీర్పు ఎండోమెంట్‌కు అనుకూలంగా వచ్చింది. తీర్పు కాపీ అందిన నెల రోజుల్లో స్థలం స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. అయితే దేవాదాయ శాఖ స్పందించని పరిస్థితి. ప్రస్తుతం అధికార టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న నేతల ఒత్తిళ్లతోనే ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. విషయం దేవాదాయ శాఖ కమిషనర్ దృష్టికి వెళ్లడంతో అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆ మేరకు తీర్పు వచ్చిన నాలుగేళ్ల తర్వాత దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ గాయత్రిదేవి కర్నూలు తహసీల్దార్ రమేష్, పోలీసు అధికారులతో శనివారం సర్వే నెంబర్ 171లోని స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లారు. వీఎస్ టెక్స్టైల్స్ పేరుతో నిర్వహిస్తున్న దుకాణాన్ని ఖాళీ చేయాలని కోరారు. ఈ విషయాన్ని యజమాని టీడీపీ నేతల దృష్టికి తీసుకెళ్లడం.. అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం.. అక్కడి నుంచి వెళ్లిపోవడం చకచకా జరిగిపోయాయి. అయితే 15 రోజుల్లో స్థలాన్ని ఖాళీ చేయాలని దుకాణం యజమానికి నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. -
‘అమృత్’ పనులపై స్థల పరిశీలన
చిత్తూరు (అర్బన్): ‘అమృత్’ పథకంలో భాగంగా చేపట్టనున్న పనుల కోసం ఎంపిక చేసిన స్థలాలను అధికారులు సోమవారం పరిశీలించారు. కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు భాస్కరరావుతో పాటు టాటా కన్సల్టెన్సీ నిర్వాహకులు నగరంలోని ఓవర్ బ్రిడ్జి, కట్టమంచి చెరువు, ఇరువారం, నీవానది ప్రాంతాల్లో పర్యటించారు. నగరంలో నుంచి వచ్చే మురుగునీరు నీవానదిలో కలవకముందే శుద్ధి చేసి ఇతర అవసరాలను ఉపయోగించేలా ప్లాంట్‌ను పెట్టడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటిని ఎక్కడెక్కడ పెట్టాలనే అంశంపై స్థలాలను అధికారులు పరిశీలించారు. -
స్థలం కనిపిస్తే కబ్జా
* చందవరంలో టీడీపీ నాయకుడి దందా * ప్రభుత్వ పోరంబోకు భూమిలో మెరక తోలిన వైనం * పట్టించుకోని రెవెన్యూ అధికారులు ఖాళీ స్థలం కన్పిస్తే చాలు కబ్జా చేసేందుకు అధికార పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. దర్జాగా దందాలు చేస్తున్నా అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు చోద్యం చూడటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెవెన్యూ యంత్రాంగం సహకారంతోనే అక్రమార్కులు భూములు యథేచ్ఛగా ఆక్రమించుకుంటున్నారు. ప్రభుత్వ భూమి అని తెలిసినా వదలడంలేదు. గ్రామస్థాయి టీడీపీ నాయకులే ఈ విధమైన దురాగతాలకు పాల్పడుతుంటే ఇక జిల్లా, ఆ పై స్థాయి వారు ఏ విధమైన అరాచకాలకు తెగబడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. చందవరం (నాదెండ్ల): అధికారం మాటున ఎలాంటి అక్రమాలకైనా పాల్పడొచ్చనే దీమాతో ఉన్నారు నియోజకవర్గంలోని టీడీపీ నేతలు. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో తమ అధికార దర్పం ప్రదర్శిస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. తాజాగా మండలంలోని చందవరం గ్రామంలో ఓ టీడీపీ నాయకుని నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ భూమిలో చెట్ల తొలగింపు గ్రామ పరిధిలోని సర్వే నెంబరు 117/1లో 80 సెంట్లు, 1172బీలో 16 సెంట్లు ప్రభుత్వ పోరంబోకు భూమి. దీని పక్కనే 253/1 – య.10.66 సెంట్లు, 253/2 – 3 సెంట్లు, 253/3 – 72 సెంట్లు మొత్తం య.11.41 సెంట్లు భూమి రక్షిత నీటి చెరువు. దీని పక్కనే సాతులూరు రైల్వే స్టేషన్‌కు వెళ్లే రోడ్డు పక్కనే ఉన్న 96 సెంట్లు స్థలంలో కొంత రోడ్డుకు పోను సుమారు 40 సెంట్లు భూమి మిగిలి ఉంది. ఈ భూమిలో ఇటీవల గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు పిచ్చి చెట్లు తొలగించి మెరక తోలించాడు. 2014లోనే ఈ స్థలంలో పిచ్చిచెట్లు తొలగించి ప్లాట్లు వేసి అమ్మేందుకు రంగం సిద్ధం చేశారు. అప్పట్లో గ్రామస్తులు వ్యతిరేకించి జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. లోకాయుక్తాకూ ఫిర్యాదు... అప్పట్లో లోకాయుక్త ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు స్థలాన్ని పరిశీలించి ఇది ప్రభుత్వ స్థలం, ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోబడతాయని బోర్డు పెట్టారు. దీంతో టీడీపీ నేత కొంత వెనక్కు తగ్గారు. రెండేళ్ళ అనంతరం తిరిగి స్థలాన్ని కాజేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఇటీవల పక్కనే ఉన్న చెరువులో అక్రమంగా మట్టిని తవ్వి స్థలంలో మెరక పోశాడు. ఎస్సీ కాలనీ శ్మశానవాటిక సమీపంలో ఉన్న మరికొంత ప్రభుత్వ స్థలాన్ని సైతం కబ్జాచేసి మట్టి తోలించాడు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు మాత్రం తమకేమీ పట్టదన్నట్లు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అధికారులు కఠిన చర్యలు తీసుకోకుంటే సహించేది లేదని గ్రామస్తులు స్పష్టం చేశారు. మా దృష్టికి రాలేదు.. దీనిపై తహశీల్దార్ మేడూరి శిరీషను ప్రశ్నించగా 2014లో కోర్టు ఆదేశాల మేరకు ఇది ప్రభుత్వ స్థలమేనని బోర్డు పెట్టాం. అయితే ప్రస్తుతం ఈ స్థలంలో ప్రైవేటు వ్యక్తులు మట్టి తోలిన విషయం మా దృష్టికి రాలేదు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే చర్యలు తీసుకుంటాం. స్వయంగా వెళ్ళి పరిశీలిస్తాను. -
‘తెలుగు ప్రాచీన కేంద్రానికి స్థలం ఇవ్వండి’
హైదరాబాద్: తెలుగు ప్రాచీన కేంద్రాన్ని ఏపీలో ఏర్పాటుచేసేందుకు అనువైన స్థలాన్ని కేటాయించాలని శాసనసభ డిప్యుటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. తెలుగు ప్రాచీన కేంద్రం ప్రస్తుతం మైసూర్లో ఉందని, దీన్ని ఏపీకి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం సమ్మతించిందని బుద్ధప్రసాద్ రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి మంత్రి గంటా శ్రీనివాసరావుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. నాగార్జున వర్సిటీలో తెలుగు ప్రాచీన కేంద్రాన్ని ఏర్పాటుచేయడానికి స్థలాన్ని ఇవ్వాలని, దీనిపై త్వరితంగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని మంత్రిని కోరారు. ఈ లేఖపై తదుపరి చర్యలకు సంబంధించి మంత్రి గంటా శనివారం అధికారులతో చర్చించారు. అయితే కేంద్రప్రభుత్వం దీనికి సంబంధించి అధికారికంగా రాష్ట్రప్రభుత్వానికి ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు జరపలేదని, అవేవీ లేకుండా ముందుగా స్థలం కేటాయింపు ఎలా అన్న సందేహాన్ని కొందరు వ్యక్తపరిచినట్లు తెలిసింది. తెలుగు ప్రాచీన కేంద్రం తరలింపునకు సంబంధించి కేంద్రప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వచ్చాకనే తదుపరి చర్యలు తీసుకోవడం మంచిదన్న అభిప్రాయంతో మంత్రి గంటా ఉన్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. -
పేరు పేదలది.. పెత్తనం పెద్దలది
పేదలకు పట్టాలు.. ఎమ్మెల్యే అనుచరుని చేతిలో భూమి 13 ఏళ్లుగా పేదలకందని ఇంటి స్థలం కలగానే మిగిలిన సొంతిల్లు సుందరపల్లి (కె.గంగవరం) : ‘మేం ఏం చెబితే అదే జరుగుతుంది. స్థలం కావాలని అడిగితే ఖబడ్దార్. ..మేం ఇచ్చినప్పుడే తీసుకోండి.’ ఇదీ అధికార పార్టీ నేత హుకుం. నియోజకవర్గంలోని కె. గంగవరం మండలం సుందరపల్లిలో స్థానిక ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు అనుచరుని అరాచకాలకు నిలువుటద్దం పడుతోందీ సంఘటన. 13 ఏళ్లుగా దేవస్థానం భూమిని ఎమ్మెల్యే అనుచరుడు యథేచ్ఛగా పండించుకుంటున్నప్పటికీ అధికారులు తమకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. సుందరపల్లిలోని శ్రీసోమేశ్వరస్వామి దేవస్థానికి చెందిన సుమారు రెండు ఎకరాల భూమిని 2003లో గ్రామంలోని కొంత మందికి ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం సేకరించింది. 70 సెంట్ల భూమిని ఎస్సీలకు, 120 సెంట్ల భూమిని ఓసీలకు కేటాయిస్తూ అప్పటి తహసీల్దార్ లబ్ధిదారులకు పట్టాలిచ్చారు. పట్టాలిచ్చారు గానీ ఆభూమిని మాత్రం ఇప్పటికీ వారికి అప్పగించలేదు. దేవస్థానం భూమిని ప్రభుత్వం సేకరించటంతో దేవస్థానం అధికారులు ఆ పంట భూమికి వేలం కూడా నిర్వహించలేదు. ఆ భూమిని ప్రభుత్వం మెరక చేసి పట్టాదారులకు అప్పగించాలి. కానీ ఆ విధంగా జరగలేదు. ప్రభుత్వం దేవస్థానం భూమిని సేకరించిందని చెప్పి గ్రామానికి చెందిన ఆ నేత ఆ భూమిని తన ఆధీనంలోనికి తీసుకున్నాడు. 13 ఏళ్లుగా సుమారు 2 ఎకరాల భూమిని తన అనుచరులతో సాగు చేయిస్తూ మగతాలు పొందుతున్నాడు. చేను వృథాగా ఉందని సాగు చేస్తున్నామని, వచ్చిన పంటను దేవుడి కోసంS ఖర్చు చేస్తున్నామని ఆయన కబుర్లు చెబుతున్నాడు. ఎవరైనా ఇదేమని అడిగినా, జమా ఖర్చులు చెప్పాలన్నా వారిపై దాడులు చేయిస్తూ తనమాటే చెల్లుబడి చేసుకుంటున్నాడు. ఇప్పటికైనా రెవెన్యూ, దేవస్థానం అధికారులు స్పందించి ప్రభుత్వ భూమిని తమకు అందజేసి న్యాయం చేయాలని పట్టాదారులు కోరుతున్నారు. -
ఫ్లైటెక్ ఏవియేషన్ స్థల పరిశీలన
విజయపురి సౌత్: స్థానిక ఫ్లైటెక్ ఏవియేషన్ స్థలాన్ని ముంబాయి ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు సంజయ్ గోయల్, రక్షిత్ మంగళవారం పరిశీలించారు. ప్రభుత్వం 2014 డిసెంబర్లో మినీఎయిర్పోర్ట్గా ఫ్లైటెక్ ఏవియేషన్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఎయిర్పోర్ట్ ఎన్ని ఎకరాల్లో ఉంది, రన్‌వే పొడవు, వెడల్పును వీరు పరిశీలించారు. ప్రస్థుతం ఫ్లైటెక్ ఏవియేషన్‌కు ఉన్న 100 ఎకరాల స్థలం పక్కన ఉన్న ఫారెస్ట్, రెవెన్యూ, ప్రైవేట్ స్థలాలను మ్యాప్ ద్వారా పరిశీలించి, మాచర్ల తహసిల్దార్ వెంకటేశ్వర్లుతో మాట్లాడి వివరాలు సేకరించారు. కార్యక్రమంలో సర్వేయర్ హర్షద్, మాచర్ల రూరల్ ఆర్ఐ ఏసీహెచ్ వెంకటేశ్వర్లు, మాచర్ల టౌన్ ఆర్ఐ శ్రీధర్, వీఆర్ఏ రవి తదితరులు పాల్గొన్నారు. -
పునరావాస కాలనీ ఏర్పాటుకు స్థల పరిశీలన
కాసిపేట : సింగరేణి యాజమాన్యం నిర్మాణం చేపట్టనున్న కెకె ఓపెన్‌కాస్టు ప్రాజెక్టుకు సంబంధించి నిర్వాసిత గ్రామం దుబ్బగూడెం గ్రామస్తులు శనివారం పునరావాస కాలనీ ఏర్పాటుకు సింగరేణి స్థలాన్ని పరిశీలించారు. సింగరేణి అధికారి సురేష్ ఆధ్వర్యంలో గ్రామం నుంచి 30మందిని బెల్లంపల్లి శివారులోని 68డీప్ ప్రాంతంలో ఉన్న సింగరేణి స్థలాన్ని చూపించారు. ప్రభుత్వం మంజూరు చేయనున్న డబుల్బెడ్రూం గహాలకు సైతం ఇక్కడే స్థలం కేటాయించడం జరుగుతుందని, దుబ్బగూడెం పునరావాసానికి సైతం అనుకూలంగా ఉంటుందని మౌలిక వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. అనంతరం గ్రామస్తులు మందమర్రి శివారు, స్టేషన్‌పెద్దనపల్లి సమీపంలో, పెద్దనపల్లి శివారులలో ఉన్న భూములను సైతం పరిశీలించారు. ఎక్కడ నచ్చితే అక్కడ గ్రామస్తులు అంగీకరించినట్లయితె రెవెన్యూ అధికారులు భూములు ప్రభుత్వానివా, కొనుగోలు చేయడమా నిర్ణయం తీసుకుంటారన్నారు. 68డీప్ సింగరేణి ప్రాంతం కావడంతో ఎటువంటి సమస్య లేదని గ్రామస్తుల అభీష్టం మేరకు నిర్ణయం ఉంటుందన్నారు. తాము చూసిన చోట్లలో ఎక్కడ ప్రభుత్వం ఇవ్వడానికి సాధ్యం అవుతుందో తెలిపినట్లయితే స్థలంపై నిర్ణయం ప్రకటిస్తామని గ్రామస్తులంతా ముక్తకంఠంతో తెలిపారు. -
ఆలయ స్థలం కొనుగోలుకు రూ.లక్ష విరాళం
ధర్మపురి : ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహాస్వామి ఆలయం వెనుక స్థలం కొనుగోలు చేయడానికి ఎల్లాల శ్రీనాథ్‌రెడ్డి, కవిత దంపతులు రూ.లక్ష విరాళం ప్రకటించారు. పట్టణానికి చెందిన రిటైర్డు సివిల్ సర్జన్ ఎల్లాల రాజరెడ్డి, రమాదేవి కుమారుడు ఎల్లాల శ్రీనాథ్‌రెడ్డి అమెరికాలో స్థిరపడ్డారు. నృసింహుని ఆలయం వెనుకభాగంలోని ఖాళీ స్థలాన్ని కొనుగోలుకు ఆలయ అధికారులు నిర్ణయించగా.. శ్రీనాథ్‌రెడ్డి దంపతులు మాజీ జెడ్పీటీసీ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి ద్వారా రూ.లక్షను ఆలయ వో సుప్రియకు అందించారు. -
ప్రజాసాధికార సర్వేలో జిల్లాకు రెండో స్థానం
పిఠాపురం టౌన్ : ప్రజాసాధికార సర్వేలో జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో ఉందని జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ తెలిపారు. పిఠాపురంలో ఆయన సోమవారం విలేకర్లతో మాట్లాడారు. ఇంతవరకూ జిల్లాలో 2,48,190 ఇళ్ల సర్వే పూర్తయిందని తెలిపారు. 7,12,642 మందికి సంబంధించిన సర్వే పూర్తయినట్టు వివరించారు. మొత్తం 2590 మంది ఎన్యూమరేటర్లు సర్వేలో పాల్గొంటున్నారన్నారు. పిఠాపురం, గొల్లప్రోలు, కాకినాడ, సామర్లకోట, తుని ప్రాంతాల్లో సర్వే మందకొడిగా సాగుతోందన్నారు. 20 డాక్యుమెంట్లకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించాలని, ఇందుకోసం ప్రచార కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించినట్టు తెలిపారు. ఒక్కో ఎన్యూమరేటరు రోజుకు 14 ఇళ్లు సర్వే చేయాల్సి ఉండగా 5 కూడా పూర్తి చేయడం లేదని తెలిపారు. ట్యాబ్‌లు పని చేయకపోయినా, సాంకేతిక సమస్యలు తలెత్తినా తక్షణం తమ దృష్టికి తీసుకువస్తే సరిదిద్దే చర్యలు చేపడతామన్నారు. పని చేయని ట్యాబ్‌ల స్థానంలో కొత్తవి కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టామని జేసీ చెప్పారు. ఆయన వెంట తహసీల్దార్ బి.సుగుణ, ఇన్చార్జ్ కమిషనర్ ఎంవీకే మాధవి ఉన్నారు. సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలి కాకినాడ సిటీ : ప్రజాసాధికార సర్వేను కచ్చితత్వంతో త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. కలెక్టర్లతో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన సర్వే పురోగతిని సమీక్షించారు. ప్రస్తుతం ప్రతి ఎన్యూమరేటరూ సగటున రోజుకు 10 కుటుంబాల సర్వే నిర్వహిస్తున్నారన్నారు. సర్వే నిర్వహించే కుటుంబాలు ఏయే పత్రాలు, సమాచారం సిద్ధంగా ఉంచుకోవాలో ప్రత్యేకంగా ముద్రించిన పత్రాలను ముందు రోజే పంపిణీ చేయడం ద్వారా సమయం కలిసివస్తుందని, ఆ మేరకు చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు. సర్వేలో తామిచ్చే సమాచారం వల్ల ప్రస్తుతం తమకు లభిస్తున్న ప్రయోజనాలు కోల్పోతామేమోననే సంకోచం కొంతమంది ప్రజల్లో ఉందని, దీనిని తొలగించేందుకు సర్వే వల్ల చేకూరే ప్రయోజనాల గురించి అవగాహన కల్పించాలని అన్నారు. కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ మాట్లాడుతూ, ప్రజాసాధికార సర్వే ద్వారా జిల్లాలో 2,44,567 కుటుంబాలకు చెందిన 7,02,193 మంది వివరాలను ఇప్పటివరకూ ఆన్లైన్లో నమోదు చేసినట్టు వివరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్–2 జె.రాధాకృష్ణమూర్తి, ఎన్ఐసీ సీనియర్ సైంటిస్ట్ సయ్యద్ ఉస్మాన్, జెడ్పీ సీఈఓ కె.పద్మ పాల్గొన్నారు. -
ప్రజాసాధికార సర్వేలో జిల్లాకు రెండో స్థానం
పిఠాపురం టౌన్ : ప్రజాసాధికార సర్వేలో జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో ఉందని జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ తెలిపారు. పిఠాపురంలో ఆయన సోమవారం విలేకర్లతో మాట్లాడారు. ఇంతవరకూ జిల్లాలో 2,48,190 ఇళ్ల సర్వే పూర్తయిందని తెలిపారు. 7,12,642 మందికి సంబంధించిన సర్వే పూర్తయినట్టు వివరించారు. మొత్తం 2590 మంది ఎన్యూమరేటర్లు సర్వేలో పాల్గొంటున్నారన్నారు. పిఠాపురం, గొల్లప్రోలు, కాకినాడ, సామర్లకోట, తుని ప్రాంతాల్లో సర్వే మందకొడిగా సాగుతోందన్నారు. 20 డాక్యుమెంట్లకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించాలని, ఇందుకోసం ప్రచార కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించినట్టు తెలిపారు. ఒక్కో ఎన్యూమరేటరు రోజుకు 14 ఇళ్లు సర్వే చేయాల్సి ఉండగా 5 కూడా పూర్తి చేయడం లేదని తెలిపారు. ట్యాబ్‌లు పని చేయకపోయినా, సాంకేతిక సమస్యలు తలెత్తినా తక్షణం తమ దృష్టికి తీసుకువస్తే సరిదిద్దే చర్యలు చేపడతామన్నారు. పని చేయని ట్యాబ్‌ల స్థానంలో కొత్తవి కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టామని జేసీ చెప్పారు. ఆయన వెంట తహసీల్దార్ బి.సుగుణ, ఇన్చార్జ్ కమిషనర్ ఎంవీకే మాధవి ఉన్నారు. సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలి కాకినాడ సిటీ : ప్రజాసాధికార సర్వేను కచ్చితత్వంతో త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. కలెక్టర్లతో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన సర్వే పురోగతిని సమీక్షించారు. ప్రస్తుతం ప్రతి ఎన్యూమరేటరూ సగటున రోజుకు 10 కుటుంబాల సర్వే నిర్వహిస్తున్నారన్నారు. సర్వే నిర్వహించే కుటుంబాలు ఏయే పత్రాలు, సమాచారం సిద్ధంగా ఉంచుకోవాలో ప్రత్యేకంగా ముద్రించిన పత్రాలను ముందు రోజే పంపిణీ చేయడం ద్వారా సమయం కలిసివస్తుందని, ఆ మేరకు చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు. సర్వేలో తామిచ్చే సమాచారం వల్ల ప్రస్తుతం తమకు లభిస్తున్న ప్రయోజనాలు కోల్పోతామేమోననే సంకోచం కొంతమంది ప్రజల్లో ఉందని, దీనిని తొలగించేందుకు సర్వే వల్ల చేకూరే ప్రయోజనాల గురించి అవగాహన కల్పించాలని అన్నారు. కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ మాట్లాడుతూ, ప్రజాసాధికార సర్వే ద్వారా జిల్లాలో 2,44,567 కుటుంబాలకు చెందిన 7,02,193 మంది వివరాలను ఇప్పటివరకూ ఆన్లైన్లో నమోదు చేసినట్టు వివరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్–2 జె.రాధాకృష్ణమూర్తి, ఎన్ఐసీ సీనియర్ సైంటిస్ట్ సయ్యద్ ఉస్మాన్, జెడ్పీ సీఈఓ కె.పద్మ పాల్గొన్నారు. -
నిలువ జాగ లేదాయే !
నగరంలో పార్కింగ్‌స్థలాల కొరత దుకాణాల ఎదుటే నిలిపివేత ట్రాఫిక్ ఇబ్బందులు టవర్‌సర్కిల్‌లో రోడ్డుపై చేసిన పార్కింగ్లు కరీంనగర్ కార్పొరేషన్ : నగరంలో ట్రాఫికర్ రోజురోజుకు పెరుగుతుంది. బైక్‌పై వెళ్లడమే కష్టంగా మారింది. పార్కింVŠ Sస్థలాలు లేకపోవడంతో వాహనదారులు రోడ్డుపైన, దుకాణాల ఎదుట నిలుపుతున్నారు. అరకిలోమీటర్ ప్రయాణించాలంటే అరగంట పడుతుంది. టవర్‌సర్కిల్, పోస్టాఫీస్రోడ్, శాస్త్రీరోడ్, ప్రకాశంగంజ్, గాంధీరోడ్ తదితర ప్రాంతాల్లో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కార్పొరేషన్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు సైతం నగరంలో ప్రత్యేకంగా పార్కింగ్‌స్థలాల ఏర్పాటుపై కసరత్తు చేయడం లేదు. ఇప్పటికైనా వీటి గురించి పట్టించుకుంటే స్మార్ట్ నగరంలో ట్రాఫికర్‌కు చెక్ పెట్టగలం. కరీంనగర్లో పార్కింగ్ స్థలాలు లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కో ద్విచక్రవాహనంతోపాటు మరికొన్ని ఇళ్లల్లో అదనంగా కారు ఉంటుంది. కరీంనగర్లో జనాభా రోజురోజుకు పెరుగుతోంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారు ఇక్కడే ఉండేందుకు ఇష్టపడుతున్నారు. పిల్లల చదువు, వ్యాపారం, ఉద్యోగం వంటి అవసరాలకు జిల్లా కేంద్రం అనువుగా ఉంది. జనాభాకు తగ్గట్టుగానే వాహనాల సంఖ్య పెరుగుతోంది. వాహనాల సంఖ్యకు అనుగుణంగా పార్కింగ్‌స్థలాలు లేకపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒక్కోసారి రోడ్డుపై వాహనం తీసుకుని వెళ్లడం నరకంగా మారుతోంది. ముఖ్యంగా నగరపాలక సంస్థ పరిధిలోని ముఖ్య వ్యాపారకూడళ్లయిన టవర్‌సర్కిల్, పోస్టాఫీస్రోడ్డు, శాస్త్రీరోడ్డు, ప్రకాశంగంజ్, గాంధీరోడ్డు, రూరల్‌పోలీస్ స్టేషన్‌రోడ్డు, ఆఫీస్‌రోడ్డు, కూరగాయల మార్కెట్ రోడ్డు సాయంత్రం పూట కిక్కిరిసిపోతున్నాయి. అరకిలోమీటరు ప్రయాణించాలంటే అరగంట పడుతుంది. దుకాణాల ఎదుటే.. వివిధ అవసరాల నిమిత్తం వ్యాపార కూడలికి వచ్చే వారు తమ వాహనాలను దుకాణాల ఎదుటే నిలుపుతున్నారు. దీంతో రోడ్లపై రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నగరంలో రోడ్లు ఇరుకుగా ఉండడంతో పాలకులు ఆశించిన ఫలితం ఇవ్వడం లేదు. వాహనాలకు తోడు దుకాణాల యజమానులు వారి సామగ్రిని రోడ్డుపైనే పెడుతూ మరింత ఇబ్బందులు కలిగిస్తున్నారు. పెద్దపెద్ద వాణిజ్య సంస్థలు, షాపింగ్‌మాల్స్, ఆస్పత్రులు, హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు, విద్యాసంస్థలు ఇలా అన్నింటి ఎదుట వాహనాలపార్కింగ్లే దర్శనమిస్తున్నాయి. సెల్లార్లపై దృష్టి కరువు షాపింగ్‌మాల్స్, హోటళ్లు, బార్లు, ఇతర వాణిజ్య సంస్థలు పార్కింగ్‌ల కోసం సెల్లార్లు ఏర్పాటు చేస్తున్నాయి. ఆ సెల్లార్లలో వాహనాలకు బదులుగా దుకాణాలనే విస్తరిస్తుండడం ఇబ్బందిగా మారుతుంది. వాహనాల పార్కింగ్‌ను రోడ్లపైనే చేస్తున్నారు. గతంలో సెల్లార్లపై కొరడా ఝుళిపిస్తున్నామని నగరపాలకసంస్థ అధికారులు హడావిడి చేసినా అవి తాటాకు చప్పుల్లే అయ్యాయి. రోడ్లపై ఇరువైపులా పార్కింగ్‌లతో సగానికిపైగా రహదారులు కనుమరుగవుతున్నాయి. స్థలాలు కరువు నగరపాలక సంస్థ పరిధిలో పార్కింగ్ కోసం స్థలాలు కరువయ్యాయి. అమరవీరుల స్థూపం, మార్కెట్ సమీపంలోని నీటి పారుదల కార్యాలయం, అన్నపూర్ణ కాంప్లెక్స్, మున్సిపల్ గెస్ట్‌హౌస్‌ల్లో కొంత స్థలం ఉంది. అయితే పార్కింగ్ పాయింట్లు ఏర్పాటు చేసి ప్రధాన వ్యాపార కూడళ్లలో రోడ్లపై పార్కింగ్‌ను నిషేధించాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఎక్కడా పార్కింగ్ స్థలాలను గుర్తించిన దాఖలాలు లేవు. దీంతో నగరంలో వాహనాల పార్కింగ్ సమస్యగా మారింది. ఇప్పటికైన అధికారులు స్పందించి పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని నగరవాసులు కోరుతున్నారు. -
గుడుంబా స్థావరాలపై దాడులు
దహెగాం : మండలంలోని కల్వాడ మర్రిపల్లి గ్రామాల్లోని గుడుంబా స్థావరాలపై ఆదివారం దాడులు నిర్వహించినట్లు పీఎస్సై సుధాకర్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం... గుడుంబా విక్రయిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించామని పేర్కొన్నారు. కల్వాడ గ్రామానికి చెందిన బానోత్ తుకారాం, మర్రిపల్లి వాసి బదావత్ వినోద్‌లపై కేసు నమోదు చేశామని తెలిపారు. వీరి వద్ద 100 గుడుంబా ప్యాకెట్లు, 10 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నామని వివరించారు. -
భువనేశ్వర్ స్థానంలో రిషి ధావన్ కు చోటు
ఆస్ట్రేలియాతో జరిగే మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో పాల్గొనే భారత జట్టులో ఒక మార్పు జరిగింది. బౌలర్ భువనేశ్వర్ కుమార్ గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. దాంతో అతని స్థానంలో ఆల్‌రౌండర్ రిషి ధావన్‌కు స్థానం లభించింది. గాయపడ్డ మరో బ్యాట్స్‌మన్ అజింక్య రహానే స్థానంలో ప్రత్యామ్నాయంగా గుర్కీరత్ సింగ్ జట్టుతోపాటు కొనసాగుతాడు. -
వేడుకలు శృతిమించితే చర్యలు
-
క్రీడాంశంగా మారిన యోగా
-
హత్యలకు అడ్డా.. నల్లమల!
నల్లమల ప్రాంతం హత్యలకు అడ్డాగా మారుతోంది. దుండగులు ఎక్కడో హత్యలు చేసి అచ్చంపేట ప్రాంతంలో మృతదేహాలను పడేస్తున్నారు.. ఈ ప్రాంతంలో దట్టమైన అడవులు ఉండటమో లేదా పోలీసుల అసమర్థతతో కానీ ఎక్కువ శాతం హత్యలు ఈ ప్రాంతంలోనే వెలుగులోకి వస్తున్నాయి.. ఎంతో ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతంలో భయాందోళనలు సృష్టిస్తున్నారు.. - అచ్చంపేట రూరల్ ఈ మధ్యకాలంలో అచ్చంపేట ప్రాంతంలో హత్యలు, దొంగతనాలు, చోరీలు ఎక్కువగా జరుతున్నాయి. ముఖ్యంగా దుండగులు ఎక్కడో హత్య చేసి నల్లమల ప్రాంతంలోనే మృతదేహాలను పడేసిపోయి పోలీసులకు సవాలు విసురుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకు సమీప జిల్లాలైన రంగారెడ్డి, నల్లగొండ, హైదరాబాద్ జిల్లాల్లో హత్యలు చేసి నల్లమల ప్రాంతంలో పడేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వివాహేతర సంబంధం పెట్టుకున్న, భార్యపై కక్ష పెట్టుకున్న వారు హత్య చేసి మృతదేహాలను పడేసిపోతున్నారు. ఈ సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారు. తాజాగా ఫిబ్రవరి 25న చంద్రవాగు బ్రిడ్జి వద్ద ఓ మహిళను దహనం చేసిన సంఘటన చర్చనీయాంశమైంది. నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలో మహిళను హత్య చేసి బ్రిడ్జి వద్ద దహనం చేసినట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆ దిశగా నల్లగొండ జిల్లా దేవరకొండ, మల్లెపల్లి ప్రాంతంలో మహిళ ఆచూకీ కోసం వెతుకుతున్నారు. ఈమె భవన నిర్మాణ పనులు చేసి ఉంటుందని, భర్తలేరని అనుమానిస్తున్నారు. చేతికి రోల్‌గోల్డ్ గాజు ఉందని, కాలుకు మెట్టె, గుండ్రని ముఖం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. 2011 మే 23న ఓ వివాహితను హత్య చేసిన భర్త రంగాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో పడవేసిపోయారు. 2011లో జరిగిన సంఘటనకు సంబంధించిన కేసును పోలీసులు చేధించారు. భర్తే హత్యకు పాల్పడినట్లు గుర్తించి అరెస్టు చేశారు. తాజాగా జరిగిన సంఘటనపై పోలీసులకు సమాచారం లభించక తలలు పట్టుకుంటున్నారు. ఇక ఎక్కడో హత్యలు చేసిన దుండగులు రాత్రివేళ శ్రీశైలం హై రోడ్డుపై వాహనాల్లో ప్రయాణించి చివరికి అచ్చంపేట ప్రాంతంలోనే మృతదేహాలను వదిలివెళుతున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా దుండగులు తగుజాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందుకు నిదర్శనం 2011లో జరిగిన మహిళ హత్యే. ఆమె ముఖంపై యాసిడ్‌పోసి గుర్తించకుండా చేశారు. అలాగే గత నెలలో చంద్రవాగు వద్ద మహిళను హత్య చేసిన అనంతరం బ్రిడ్జి కింద పడేసి యాసిడ్, పెట్రోల్‌పోసి తగులబెట్టారు. శరీరం 95శాతం కాలినా ముఖం, కుడిచే యి మాత్రమే మిగిలింది. ఈ విషయమై సీఐ వెంకటేశ్వర్లును వివరణ కోరగా రాత్రివేళ డిండి నుంచి హాజీపూర్‌చౌరస్తా వరకు ఉప్పునుంతల పోలీసులు, హాజీపూర్ నుంచి మన్ననూర్ వరకు సిద్దాపూర్ పోలీసులు వాహనంతో తిరుగుతూనే ఉన్నారన్నారు. త్వరలోనే ఆయా కేసుల్లో దుండగులను పట్టుకుంటామన్నారు. -
పెట్టుబడికి స్థలమే ముఖ్యం
స్థిరాస్తి రంగంలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే స్థలం మీద మదింపు చేయడమే ఉత్తమం. దీర్ఘకాలం వేచి చూడగలిగితే అధిక రాబడిని అందుకోవచ్చు. నాణ్యమైన నిర్మాణాల్ని అందించాలని ఎలాగూ ప్రభుత్వాలూ భావిస్తున్నాయి కాబట్టి.. గిరాకీ పెరుగుతుందే తప్ప తగ్గదు. -సాక్షి, హైదరాబాద్ ముందుగా మీరు స్థలంపై ఎంత పెట్టుబడి పెట్టగలరనే విషయంపై ఓ అవగాహనకు వచ్చాక.. ఆ తర్వాత ఎక్కడ కొనాలో నిర్ణయించుకోండి. ఇప్పుడు కాకపోయినా ఓ పదేళ్లయ్యాకైనా స్థలం విలువ రెట్టింపయ్యే అవకాశం గల ప్రాంతాన్ని ఎంచుకోండి. ఉద్యోగావకాశాలను కల్పించడానికి ఆస్కారమున్న ప్రాంతాలైతే మరీ మంచిది. హెచ్ఎండీఏ లాంటి స్థానిక సంస్థలు తరచూ వేలం పాటలను నిర్వహిస్తాయి కాబట్టి వీలుంటే ఓ సారి కనుక్కోండి. క్రమం తప్పకుండా లావాదేవీలు నిర్వహించే మీ బ్యాంకు ఆమోదం ఉన్న లే అవుట్లు ఉన్నాయోమో ఓసారి ఆరా తీయండి. దేని పరిధిలో ఉందో: మీరు కొనాలనుకున్న స్థలం దేని పరిధిలోకి వస్తుంది? అంటే రెసిడెన్షియల్ జోన్ కిందికొస్తుందా? కన్జర్వేషన్ జోన్ పరిధిలోకి వస్తుందా? అనే విషయాల్ని తెలుసుకోవాలి. హెచ్ఎండీఏ బృహత్ ప్రణాళిక ప్రకారం.. దాదాపు ఆరు వేల కిలో మీటర్లు విస్తరించిన హుడా ఎక్స్టెండెడ్ ఏరియాను 12 స్థల వినియోగ జోన్లుగా వర్గీకరించారు. ఏ స్థలం ఏయే జోన్ పరిధిలోకి వస్తుందో తెలియని పరిస్థితి. హెచ్ఎండీఏ అధికారుల్ని అడిగినా సరైన సమాధానం రాకపోవచ్చు. రిక్రియేషన్ జోన్ పరిధిలోని స్థలం కొని విశాలమైన ఇల్లు కట్టుకుంటానంటే కుదరదు. కాబట్టి, ఈ విషయంలో ముందే అవగాహనకు రండి. ధర తెలుసుకోండి: మాంద్యం తర్వాత మార్కెట్లో 30 శాతం స్థలాల ధరలు తగ్గుముఖం పట్టాయి. మీరు ఎంపిక చేసుకున్న ప్లాటులో ప్రస్తుతం ధరెంత చెబుతున్నారు? బూమ్ సమయంలో ధర ఎంతుందో బేరీజు వేయండి. ఆ తర్వాత సదరు సంస్థ నుంచి స్థలం పత్రాలు, టైటిల్ డీడ్, పన్ను రశీదులు తీసుకోండి. వాటిని లాయర్‌తో పరిశీలింపజేయండి. స్థానిక సంస్థల నుంచి స్థలం కొనాలని భావిస్తే బేరమాడే అవకాశముండదు. అదే ప్రైవేటు సంస్థలనుకోండి.. మీరు ఎంత దాకా పెట్టగలరో సూటిగా చెప్పొచ్చు. ధర విషయంలో మీరో నిర్ణయానికి రాగానే.. సంస్థ నిబంధనల ప్రకారం కొంత సొమ్ము ముందు చెల్లించండి. మిగతా మొత్తాన్ని ఎలా చెల్లిస్తారో వివరించండి. రిజిస్ట్రేషన్ మీ పేరునే: మీరు సొమ్మంతా కట్టేశాక.. స్థలాన్ని మీ పేరిట రిజిస్టర్ చేసుకోండి. ఖాళీగా ఉన్న ప్రాంతంలో కొంటే ముందుగా పునాది వేసుకోండి. వీలైతే గోడ కూడా కట్టేయండి. కబ్జా కాకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా స్థలంపై దృష్టి సారించాలి. నగరంలోని పలు లే-అవుట్లివే.. ఫార్చూన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రై.లి. శ్రీశైలం హైవే లోని కర్తాల్‌లో 3,600 ఎకరాల్లో ‘ఫార్చూన్ బటర్ ఫ్లై సిటీ’ని నిర్మిస్తోంది. ఇందులో 2 వేల ఎకరాలు పూర్తిగా లే-అవుట్లే. ధర గజానికి రూ.3 వేలు. విజన్ ఇండియా సంస్థ భువనగిరిలో 15 ఎకరాల్లో ‘విజన్ కౌంటీ’ గేటెడ్ కమ్యూనిటీని అభివృద్ధి చేస్తోంది. ఇదే సంస్థ బెంగళూరు హైవేలోని కొత్తూర్‌లో 18.5 ఎకరాల్లో ‘విజన్ ప్యారడైజ్’ పేరుతో మరో గేటెడ్ కమ్యూనిటీని కూడా చేస్తోంది. దీనికి దగ్గర్లోనే మరో 50 ఎకరాల్లో విజన్ ప్రైడ్‌ను కూడా రానుంది. త్వరలోనే షాద్‌నగర్ వెళ్లే మార్గంలో జాతీయ రహదారి ఆనుకొని 70 నుంచి 100 ఎకరాల్లో మరో ప్రాజెక్ట్‌కు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మెట్రోసిటీ ఇన్ఫ్రా డెవలపర్స్ బొంగ్లూరు ఓఆర్ఆర్ వద్ద 20 ఎకరాల్లో మెట్రోసిటీ ఇన్ఫ్రాటెక్ ఫేజ్-2ను ప్రారంభించింది. గజం ధర రూ.5,500. ఇదే సంస్థ ఆదిభట్ల టీసీఎస్ వెనుక ప్రాంతంలో 20 ఎకరాల్లో కొత్త వెంచర్‌ను కూడా వేస్తోంది. గజం ధర రూ.18-20 వేలు. సాయి బాలాజీ ఎస్టేట్స్ గున్‌గల్‌లో 30 ఎకరాల్లో శ్రీ బాలాజీ నగర్‌ను నిర్మిస్తోంది. గజం ధర రూ.4 వేలు. -
కొనసాగిన ఎగుమతుల జోరు
న్యూఢిల్లీ: భారత ఎగుమతులు 2014 జూన్‌లో (గత యేడాది ఇదే నెలతో పోల్చి చూస్తే) 10.22 శాతం పెరిగాయి. ఈ విలువ 26.47 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఎగుమతుల్లో వృద్ధి రెండంకెల్లో నమోదుకావడం వరుసగా ఇది రెండవనెల. అయితే వీటి వృద్ధి రేటు మేతో పోల్చితే (12.4 శాతం) తక్కువ కావడం గమనార్హం. ఇక దిగుమతులు ఇదే నెలలో 8.33 శాతం పెరిగి 38.24 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఫలితంగా ఈ నెలలో ఎగుమతులు-దిగుమతుల మధ్య వ్యత్యాసం వాణిజ్యలోటు 11 నెలల గరిష్ట స్థాయిలో 11.76 బిలియన్ డాలర్లుగా నిలిచింది. జూన్‌లో బంగారం దిగుమతులు పెరగడం కూడా వాణిజ్యలోటు ఎగయడానికి దారితీసింది. బుధవారం ఈ గణాంకాలను కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ బుధవారం విడుదల చేసింది. రంగాల పరంగా చూస్తే... జౌళి (14.39% పెట్రోలియం ప్రొడక్ట్స్ (38.3%), ఇంజనీరింగ్ (21.57%), తోళ్లు (15%), సముద్ర ఉత్పత్తులు (27.49%), చమురు గింజలు (44.4%), పొగాకు (31%) ఎగుమతులు బాగున్నాయి. డిమాండ్ పెరగడం హర్షణీయం అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడం వల్ల వృద్ధి రేటు రెండంకెల్లో నమోదయినట్లు ఎగుమతిదారుల సంస్థ ఎఫ్ఐఈఓ ప్రెసిడెంట్ రఫీక్ అహ్మద్ అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో అలాగే వర్థమాన దేశాల్లో ఎగుమతులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇదే ధోరణి కొనసాగితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎగుమతులు గత ఏడాదికన్నా బాగుంటాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత ఆర్థిక సంవత్సరం ఎగుమతుల విలువ 312 బిలియన్ డాలర్లుగా ఉంది. 2014-15లో ఈ విలువ కనీసం 325 బిలియన్ డాలర్లను అధిగమించాలన్నది లక్ష్యం. క్యూ1లో వాణిజ్యలోటు సానుకూలమే జూన్‌లో వాణిజ్యలోటు పెరిగినప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్)లో ఈ లోటు గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 31 శాతం తగ్గింది. విలువ రూపంలో 33.1 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఎగుమతులు పెరగడం, బంగారం దిగుమతులు భారీగా తగ్గడం ఇందుకు ప్రధాన కారణమని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మూడు నెలల్లో ఎగుమతుల వృద్ధి రేటు 9.3 శాతంగా ఉంది. విలువ 80.11 బిలియన్ డాలర్లు. ఇక దిగుమతులు 6.92 శాతం వృద్ధితో 113.19 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. -
ఏఐ ప్రైవేటీకరణకు తొందరపడం
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా (ఏఐ) ప్రైవేటీకరణపై తొందరపాటు నిర్ణయం తీసుకోబోమని పౌర విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు సూచనప్రాయంగా వెల్లడించారు. మంత్రిగా గురువారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. ఏఐ ప్రైవేటీకరణపై కొత్త ప్రభుత్వం ఎలాంటి నిర్ణయానికీ రాలేదనీ, దీనికి సంబంధించిన అన్ని అంశాలనూ అధ్యయనం చేస్తామనీ చెప్పారు. ‘వివిధ దేశాల్లోని అనేక ప్రభుత్వ రంగ కంపెనీలు సమర్థంగా పనిచేస్తున్నాయి. కారణం ఏదైనా మనదగ్గర అలా జరగలేదు. కానీ, ఈ అంశాన్ని అన్ని కోణాల్లోనూ పరిశీలించాల్సి ఉంది. ఎయిర్ ఇండియా ప్రభుత్వ అధీనంలో ఉంది. ఆ సంస్థకు కొన్ని సానుకూల అంశాలు, ప్రతికూల అంశాలున్నాయి. ఎయిర్ ఇండియాను ఎలా అభివృద్ధి చేయగలమో ఆలోచించాలి..’ అని ఆయన తెలిపారు. యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ పునఃసమీక్షిస్తారా అని ప్రశ్నించగా, పోస్ట్‌మార్టమ్ వల్ల లాభం ఉండదని బదులిచ్చారు. మునుపటి ప్రభుత్వం అనేక రంగాలకు పలు హామీలిచ్చింది... వాటన్నిటినీ అమలు చేయాలంటే ప్రభుత్వంలో మార్పు ఉండకూడదని వ్యాఖ్యానించారు. విమానయానాన్ని ప్రజలకు మరింత చేరువచేసే చర్యలు చేపడతామని తెలిపారు. -
ఒక్కరితో సరి!
సాక్షి, ముంబై: అసెంబ్లీ ఎన్నికలకు నాలుగైదు నెలలే ఉన్నా ఎన్నికల్లో విజయం కోసం మంత్రివ ర్గ విస్తరణ చేపడుతున్నట్లు హంగామా చేసిన కాంగ్రెస్, ఎన్సీపీల ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం ఊరించి.. ఉసూరుమనిపించింది. మార్పులు, చేర్పులతో కలిసి కనీసం నలుగురైదుగురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారని భావించినా కేవలం ఒక్కరితో మాత్రమే సరి అనిపించారు. వైద్యవిద్యాశాఖ మంత్రిగా అవ్హాడ్.. వైద్యవిద్యాశాఖ మంత్రిగా కల్వా-ముంబ్రా యువ ఎమ్మెల్యే జితేంద్ర అవ్హాడ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లోని దర్బార్ హాలులో గురువారం ఉదయం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గవర్నర్ కె.శంకర్నారాయణన్, అవ్హాడ్తో ప్రమాణ స్వీకారం చేయించి పదవీ బాధ్యతలు అప్పగించారు. నందుర్బార్ జిల్లాకు చెందిన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నాయకుడు విజయ్‌కుమార్ గావిత్ బీజేపీ బాట పట్టడంతో ఆయనను పార్టీలోంచి వెలివేయాల్సి వచ్చింది. దీంతో గావిత్ వద్ద ఉన్న వైద్యవిద్యాశాఖమంత్రి పదవి ఖాళీ కావడంతో దానిని అవ్హాడ్‌కు కట్టబెట్టారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఎన్సీపీకి చెందిన పలువురు ప్రముఖ నాయకులు హాజరయ్యారు. ఫౌజియాఖాన్పై వేటు లేనట్లే... ఆరోగ్య, సాంస్కృతికశాఖ మంత్రి ఫౌజియాఖాన్ (ఎమ్మెల్సీ) పదవీ కాలం కూడా ముగిసింది. దీంతోపాటు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపీ అభ్యర్థికి ఫౌజియాఖాన్ సహకరించలేదన్న ఆరోపణలు వినిపించాయి. దీంతో ఆమెకు మరోసారి మంత్రి పదవి కట్టబెట్టే అవకాశాలు సన్నగిల్లినట్టేనని అంతా భావించారు. ఈ పదవిని విజయ్‌కుమార్ గావిత్ సొంత సోదరుడు శరద్ గావిత్‌కు అప్పగిస్తారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఎలాంటి మార్పులు చేయకూడదని, మంత్రి పదవిలో ఆమెనే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఖాళీగానే కాంగ్రెస్ కోటా.. కాంగ్రెస్ కోటాలోని మూడు పదవులు కూడా భర్తీ చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే గురువారం జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఈ మూడు స్థానాలను ఎవరితోనూ భర్తీ చేయలేదు. దీంతో కాంగ్రెస్ వాటాలోని మూడు మంత్రిపదవులు ఖాళీగా ఉన్నాయి. వాటిని త్వరలో భర్తీ చేయాలనే యోచనలో అధిష్టానం ఉందని ఆ పార్టీ నేతలు కొందరు తెలిపారు. ఈ పదవులను ఆశిస్తున్న నాయకుల్లో మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే, వసంత్ పుర్వే తదితరులు ఉన్నారు. నాలుగైదు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపేందుకే మంత్రివర్గ విస్తరణ చేపట్టినా కేవలం ఒక్కరికి మాత్రమే అవకాశం ఇవ్వడం ద్వారా వారిలో నిరుత్సాహాన్ని నింపినట్లే అయిందని విశ్లేషకులు చెబుతున్నారు. -
మోడీ వస్తే చిన్న ర్యాలీ... రాకపోతే భారీ పతనమే!
మరి ఈసారో?... సగటు ఎగ్జిట్ పోల్స్‌ను పరిగణనలోకి తీసుకొని మార్కెట్ వర్గాలు మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి 250-270 సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నాయి. దీనికి అనుగుణంగా ఇప్పటికే మార్కెట్లు పరుగులు తీశాయి. గత 5 రోజుల్లో సెన్సెక్స్ 1,600 పాయింట్లకుపైగా పెరిగింది. ఇప్పటికే మార్కెట్లు భారీగా పెరగడంతో అప్పర్ సర్క్యూట్‌కి(20% పెరగడం) అవకాశాల్లేవని, ఫలితాలు అంచనాలకు భిన్నంగా ఉంటే లోయర్ సర్క్యూట్‌ను (20% తగ్గడం) తాకొచ్చని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. మార్కెట్ గరిష్టంగా 20% పెరగడం లేదా తగ్గడం జరిగితే, ఆ రోజుకి ఇక ట్రేడింగ్ ఆపేస్తారు. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎన్నికల ఫలితాలు వెలువడనున్న శుక్రవారం స్టాక్ మార్కెట్ కదలికలు ఏ విధంగా ఉంటాయన్న దానిపై మార్కెట్ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. 2004, 2009 సంవత్సరాల్లో ఎన్నికల ఫలితాల అనంతరం సూచీలు 15 శాతానికి పైగా పెరగడం కానీ నష్టపోవడం కానీ జరిగింది. ఈ సారి కూడా అదే విధంగా ఉంటుందన్న ఉద్దేశ్యంతో 20% కదలికలకు మార్కెట్లు సిద్ధం చేసుకుంటున్నట్లు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ డేటా వెల్లడిస్తున్నది. ప్రస్తుతం నిఫ్టీ 7,100 స్థాయి వద్ద ఉంటే పెరిగితే 8,000-8,500 స్థాయి వరకు వెళ్ళొచ్చన్న నమ్మకంతో ట్రేడర్లు కాల్స్‌ను కొనుగోలు చేస్తున్నారు. ఒకవేళ ఫలితాలు ప్రతికూలంగా ఉంటే 6,000-5,500 స్థాయి వరకు పడొచ్చన్న ఉద్దేశ్యంతో ట్రేడర్లు పుట్ ఆప్షన్స్ కొనుగోలు చేస్తున్నారు. ర్యాలీ జరిపితే కాల్ ఆప్షన్ కొన్నవారికి, తగ్గితే పుట్ ఆప్షన్ కొన్నవారికి లాభం వస్తుంది. ఎగ్జిట్ పోల్ ప్రభావం ఎంత? గత రెండు ఎన్నికల ఫలితాలు మార్కెట్ అంచనాలకు భిన్నంగా వచ్చాయి. 2004లో అందరూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్‌పోల్ అంచనాలు వస్తే దానికి భిన్నంగా వామపక్షాల మద్దతుతో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. అలాగే 2009లో యూపీఏ కూటమి తిరిగి అధికారంలోకి రాదని, థర్డ్ ఫ్రంట్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ ఎగ్జిట్ పోల్స్ ఘోషించాయి. కాని అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వామపక్షాల మద్దతు అవసరం లేకుండానే యూపీఏ కూటమి అధికారం నిలబెట్టుకుంది. దీంతో మార్కెట్లు ఒక్కసారిగా పరుగులు తీశాయి. కాని ఇక్కడ గమనించాల్సిన ఆసక్తికర విషయం ఇంకోటుంది. 2004 ఫలితాల తర్వాత సూచీలు కుప్పకూలినా.. ఆ తర్వాతి కాలంలో ఎన్నడూ ఊహించనంత లాభాలందించాయి. 2009 లో స్వల్పకాలానికి పెరిగినా ఆ తర్వాత కుప్పకూలి పరిమిత శ్రేణిలో కదిలాయి. అప్పర్ సర్క్యూట్ చాన్స్ తక్కువే ఎన్నికల ఫలితాల లెక్కింపు 8 గంటలకే ప్రారంభం కానుండటంతో 9.15కల్లా ఫలితాల సరళిపై కొంచెం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా మార్కెట్లు ప్రారంభంలోనే కొద్దిగా గానప్ అప్ లేదా గ్యాప్ డౌన్‌తో ప్రారంభం కావచ్చని ఎస్ఎంసీ గ్లోబల్ రీసెర్చ్ హెడ్ జగన్నాథం తూనుగుంట్ల అంచనా వేస్తున్నారు. ఎన్డీఏకి 280 వరకు సీట్లు వస్తాయని అంచనాతో మార్కెట్లు ఇప్పటికే పెరగడంతో వాస్తవ ఫలితాలు కూడా అదే విధంగా ఉన్నాసరే మార్కెట్లు పెద్దగా పెరగకపోవచ్చన్నారు. ఒకవేళ ఎన్డీఏ కూటమి 220-240 దగ్గరకొచ్చి ఆగిపోతే భారీ పతనం తప్పకపోవచ్చన్నారు. ఫలితాలు ఏకపక్షంగా ఉండకుండా, చివరివరకూ ఊగిసలాట ధోరణిలో ఉంటే మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు గురవుతాయన్నారు. రేపటి ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ఎన్ని, బీజేపీఒంటిరిగా ఎన్ని సీట్లు సాధిస్తున్నది అన్న అంశాలను పరిశీలించాలంటున్నారు జెన్ మనీ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ సతీష్ కంతేటి. ఎన్డీఏ కూటమి 300 సీట్లు దాటితే 10% వరకు పెరిగే అవకాశం ఉందంటున్నారు. కేవలం బీజేపీ సీట్లు 220 లోపునకు పరిమితం అయినా, ఎన్డీఏ కూటమి 230లోపు ఆగినా, థర్డ్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చే అవకాశాలున్నా సూచీలు లోయర్ సర్క్యూట్ తాకుతాయని సతీష్ పేర్కొన్నారు. స్వల్ప మెజార్టీతో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సెన్సెక్స్ కేవలం 150 నుంచి 200 పాయింట్లు పెరుగుతుందని, అదే ఫలితాలు భిన్నంగా ఉంటే 2,000 వరకు నష్టపోయే ప్రమాదం ఉందని ఎడల్విస్ ఫైనాన్షియల్ మేనేజింగ్ పార్టనర్ అంబరీష్ బాలిగ పేర్కొన్నారు. స్థిరమైన ప్రభుత్వం వస్తే రానున్న 12-18 నెలల్లో నిఫ్టీ 8,700 వరకు పెరుగుతుందని, అదే థర్డ్ ఫ్రంట్ అధికారంలోకి వస్తే సూచీలు 15-20% నష్టపోయి 3-6 నెలల తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి దిశ తీసుకుంటుందనేది కార్వీ స్టాక్ బ్రోకింగ్ అంచనా. ఎన్నికల తర్వాత... సంవత్సరం రెండు రోజుల్లో 1999 6.05% 2004 -16.56% 2009 17.34% -
ఆస్ట్రాజెనెకా కోసం ఫైజర్ మెగా బిడ్!
లండన్: ఫైజర్ కంపెనీ ఇంగ్లాండ్‌కు చెందిన ఆస్ట్రాజెనెకా కంపెనీని చేజిక్కించుకునే ప్రయత్నాలు చేస్తోందని లండన్ నుంచి వెలువడే సండే టైమ్స్ పత్రిక పేర్కొంది. ఆస్ట్రాజెనెకాను కొనుగోలు చేయడానికి ఫైజర్ 101 బిలియన్ డాలర్లు(రూ.6.16 లక్షల కోట్లు) ఆఫర్ చేసిందని ఆ పత్రిక పేర్కొంది. కాగా వాటాదారుల విలువ పెంచడానికి నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నామని ఫైజర్ ప్రతినిధి జువాన్ కాంపియాన్ పేర్కొన్నారు. మార్కెట్ ఊహాగానాలు, వదంతులపై వ్యాఖ్యానించబోమని ఆయన స్పష్టం చేశారు. కాగా ఈ విషయమై వ్యాఖ్యానించడానికి ఆస్ట్రాజెనెకా ప్రతినిధి నిరాకరించారు. కాగా ఫైజర్ కంపెనీ 2000లో వార్నర్-లాంబర్ట్ కంపెనీని 87 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఔషధ పరిశ్రమలో ఇదే అత్యంత పెద్ద డీల్. కాగా గత 20 ఏళ్లలో 30 బిలియన్ డాలర్లకు పైబడి కంపెనీల కొనుగోళ్లు 10 వరకూ జరిగాయి. వీటిల్లో ఫైజర్ ఖాతాలో 3 ఉన్నాయి. -
ఆ అరగంటలో ప్రత్యక్ష నరకం చూశాను!
ఓ బంధం... ఓ పుస్తకం... ఓ ప్రదేశం... ఓ సంఘటన... ఓ పాట... తన జీవితాన్ని ఎలా మలుపు తిప్పాయో, ఎంతలా రీచార్జ్ చేశాయో... నాని తన మనసుని ఇలా ఆవిష్కరిస్తున్నారు... అంత మంచి మనిషిని ఇప్పటివరకూ నా జీవితంలో చూడలేదు నా బలం మా అమ్మే (పేరు విజయలక్ష్మి). షూటింగ్స్ నుంచి ఎంత ఆలస్యంగా ఇంటికెళ్లినా, భోజనం చేసేవరకు ఊరుకోదు. నేనేమో తనని కనీసం ‘తిన్నావా’ అని కూడా అడగను. నేను చేసే సినిమాలు, నా సంపాదన, జయాపజయాలు.. ఇవేవీ తనకు ముఖ్యం కాదు. గంటకోసారి ఫోన్ చేసి, ‘తిన్నావా’ అని అడుగుతుంది. వర్క్‌లో పడిపోయి ఒక్కోసారి తన ఫోన్ కూడా తియ్యను. ఒకవేళ తీసినా చిరాకుపడతాను. నా బాగోగులు పట్టించుకునే తనని నేనస్సలు పట్టించుకోను. కానీ, మనసులో మాత్రం ‘మన వెనకాల అమ్మ అనే శక్తి ఉంది’ అనే నమ్మకం, భద్రతాభావం మాత్రం నాలో ఉంటుంది. మా అమ్మ ఎంత మంచిదంటే, అంజూని తన కోడలిలా కాకుండా కూతురిలా చూసుకుంటుంది. కేవలం ఇంట్లో వాళ్లతోనే కాదు... ఇతరులతో కూడా అమ్మ కలివిడిగా ఉంటుంది. పనివాళ్లను కూడా బాగా చూసుకుంటుంది. మంచి చేస్తే స్వర్గానికి, చెడు చేస్తే నరకానికి వెళతాం అంటారు. మనందరం ఏదో సందర్భంలో అబద్ధాలాడతాం. తప్పులు చేస్తాం. అందుకని, ఎవరూ లేక స్వర్గం తుప్పు పట్టిపోయిందేమో అనిపిస్తోంది. కానీ, స్వర్గానికి వెళ్లగల అర్హత ఉన్న వ్యక్తి మా అమ్మ. ఎందుకంటే, మా అమ్మ అబద్ధం చెప్పడం, నెగటివ్‌గా మాట్లాడటం, తప్పు చేయడం ఇప్పటివరకూ నేను చూడలేదు. అంత మంచి మనిషిని ఇప్పటివరకూ నా జీవితంలో చూడలేదు. చిన్నప్పట్నుంచీ తన దగ్గర పెరిగినందువల్ల, తనలో ఉన్న కొన్ని మంచి గుణాలు నాకూ వచ్చాయి. అది నా అదృష్టం. కానీ, పూర్తిగా అమ్మలా ఉండాలని అనుకున్నా అది నా వల్ల కాదు. సినిమాల మీద నాకు మమకారం ఏర్పడటానికి ఒక కారణం ఆ పుస్తకమే పుస్తకం చదవడం మొదలుపెడితే నాకు నిద్ర ముంచుకొచ్చేస్తుంది. అందుకే చదవను. ఈ కారణంగానే చదువులో నాకు అత్తెసరు మార్కులు వచ్చేవి. కానీ, చిన్నప్పుడు నన్ను ప్రభావితం చేసిన పుస్తకం ఒకటుంది. దాని పేరు ‘టింకిల్ డెజైస్ట్’. అదొక్కటే చదివేవాణ్ణి. ఆ పుస్తకంలోని కథల్లో ఒక్కో పాత్ర తాలూకు బొమ్మ, సంభాషణలు ఉంటాయి. పిల్లలు పంపించిన కథలను అందులో ప్రచురించేవారు. ఆరు, ఏడు, ఎనిమిదో తరగతి చదివే పిల్లలు ఎక్కువగా రాసేవాళ్లు. ఆ కథలు చదువుతూ, వాటిని విజువలైజ్ చేసుకునేవాణ్ణి. అది ఎంతవరకు డెవలప్ అయ్యిందంటే, ఎవరైనా ఏదైనా సంఘటన గురించి చెబితే, వెంటనే దాన్ని విజువలైజ్ చేసుకోవడం మొదలుపెట్టేస్తాను. చివరికి ఎక్కడో ఎవరికైనా యాక్సిడెంట్ జరిగిందని వింటే, ‘ఇలా జరిగి ఉంటుందేమో’ అని విజువల్‌గా ఊహించేసుకుంటా. బేసిక్‌గా సినిమాల మీద నాకు మమకారం ఏర్పడటానికి ఒక కారణం ఆ పుస్తకమే. ఏదైనా కథ విన్నప్పుడు, వెంటనే తెరపై ఇలా ఉంటుందని ఊహించేసుకోవడం కూడా టింకిల్ డెజైస్ట్ వల్లే సాధ్యపడింది. ఆ ప్లేస్‌కి వెళ్లగానే ఫుల్ రీచార్జ్ అయిపోతాను తిరుమలతో నాదో ప్రత్యేకమైన అనుబంధం. పైకి నేను భక్తుడిలా కనిపించను కానీ, తిరుమలలో నన్ను చూసినవాళ్లు పరమభక్తుడనుకుంటారు. గర్భగుడిలో నిలబడ్డప్పుడు నిజంగానే దేవుడి ముందు నిలబడినట్లుగా భావిస్తాను. తిరుమల ప్రయాణం అనుకోగానే ఏమేం అడగాలి? ఏ విషయంలో సారీ చెప్పాలి? ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి? అని ఓ లిస్టు రాసుకుంటాను. తీరా దేవుడి ముందు నిలబడగానే అన్నీ మర్చిపోతాను. బయటికి రాగానే ‘అయ్యో చెప్పలేదే’ అనుకుంటాను. చిన్నప్పుడు ప్రతి సంవత్సరం వెళ్లేవాళ్లం. ఇప్పుడు మాత్రం ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళుతున్నాను. ఎప్పుడు వెళ్లినా నడిచే వెళతాను. ఆ మధ్య నేను, నా భార్య అంజు కూడా కాలినడకన వెళ్లాం. తిరుమలలో ఉంటే ఓ స్పెషల్ ఫీలింగ్ కలుగుతుంది. వెళ్లి రాగానే, ఏదో భారం దిగినట్లుగా అనిపిస్తుంది. ఫుల్‌గా రీచార్జ్ అయిపోతా. ఆ పాట నన్ను ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది నన్ను ఎప్పటికీ వెంటాడే పాట ఒకటుంది. ఆ పాట పెట్టుకుంటే చాలు ‘ఆడపిల్లల పాట ఇష్టపడుతున్నావ్’ అంటూ ఫ్రెండ్స్ ఏడిపించేవాళ్లు. ‘సీతారామయ్యగారి మనవరాలు’లో ‘కలికి చిలకల కొలికి..’ అనే పాట అది. అద్భుతంగా ఉంటుంది. ఉమ్మడి కుటుంబంలో ఉండే అనుబంధం గురించి చెప్పే పాట కాబట్టి నాకిష్టం. ఆ పాట వింటుంటే, ఫంక్షన్‌కి వెళ్లినట్లుగా, పండగ చేసుకుంటున్నట్లుగా, బంధువులందరితో కలిసి ఉన్నట్లుగా నాకనిపిస్తుంది. ఆ పాటకు కీరవాణిగారి ట్యూన్, వేటూరిగారి సాహిత్యం, చిత్రగారి గాత్రం అద్భుతం. చిన్న విషయాలకు పెద్దగా రియాక్ట్ కాకూడదనే పాఠం నేర్పింది ‘రైడ్’ సినిమా విడుదలైన నాలుగో రోజు... నేను, నా స్నేహితులు ప్రయాణం చేస్తున్న వాహనాన్ని హైవేలో ఓ లారీ ఢీ కొంది. అంతా పోయారనే అనుకున్నారు. కానీ బతికి బయటపడ్డాం. కొద్ది స్పృహతోటే అంబులెన్స్‌కి ఫోన్ చేశాం. రాగానే, అందులో ఎక్కాం. ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ మాకే వచ్చినట్లుగా తెగ ఫీలైపోయాం. అంబులెన్స్ వెళుతుంటే, హఠాత్తుగా ఓ పెద్ద శబ్దం. ఏంటని చూస్తే, ఓ పెళ్లి బృందం ప్రయాణం చేస్తున్న వాహనం మరో వాహనాన్ని ఢీ కొంది. ముందు వరుసలో కూర్చున్నవాళ్లు స్పాట్ డెడ్. మా అంబులెన్స్‌కి 50 అడుగుల దూరంలో ఆ ప్రమాదం జరిగింది. అందులో చిన్నపిల్లలు, పెద్దవాళ్లు ఉన్నారు. మా అంబులెన్స్ డ్రైవర్ ‘సార్.. వాళ్లని కూడా ఆస్పత్రికి తీసుకెళాల్లి’ అంటే ‘ఓకే’ అన్నాం. అందర్నీ మా వాహనంలోకి ఎక్కించారు. ఇరుక్కుని కూర్చున్నాం. నొప్పి తట్టుకోలేక పిల్లలు ఏడుస్తుంటే, వాళ్లని ఓదార్చే పరిస్థితిలో పెద్దలు లేరు. ఆస్పత్రికి చేరుకోవడానికి పట్టిన ఆ అరగంటలో నేను ప్రత్యక్ష నరకం చూశాను. వాళ్ల నొప్పి చూడలేక, ఏమీ చేయలేక బాధపడ్డాను. ఆ సంఘటన నాకో కనువిప్పు అయ్యింది. ‘జీవితంలో చిన్న చిన్న విషయాలకే పెద్దగా ఫీలైపోతుంటాం. కానీ, జీవితమే నరకం అనే స్థాయిలో కొంతమందికి ప్రమాదాలు జరుగుతుంటాయి.. సమస్యలు ఎదురవుతుంటాయి. అందుకే ఇకనుంచి చిన్న విషయాలకు పెద్దగా రియాక్ట్’ కాకూడదని ఆ సంఘటన నాకు పాఠం నేర్పింది. - డి.జి. భవాని -
ప్రస్తుత ధరకే రిలయన్స్ కేజీ డీ6 గ్యాస్ విక్రయం
న్యూఢిల్లీ: కేంద్రంలో కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం నాచురల్ గ్యాస్ ధరల సవరణపై నిర్ణయం తీసుకునేంత వరకు కేజీ డీ6 క్షేత్రంలో ఉత్పత్తయ్యే గ్యాస్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రస్తుత రేటుకే విక్రయించనుంది. ప్రస్తుతం మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్లకు (ఎంబీటీయూ) 4.2 డాలర్లుగా ఉన్న ధరను ఏప్రిల్ 1 నుంచి 8 డాలర్లకు పెంచాలని ప్రతిపాదించిన సంగతి విదితమే. అయితే, ఎన్నికల సంఘం సలహా మేరకు, మేలో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ధరల పెంపును వాయిదా వేయాలని చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ నిర్ణయించారని అధికార వర్గాలు తెలిపాయి. ఓఎన్జీసీ వంటి సంస్థలు గతంలో కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు గ్యాస్‌ను 4.2 డాలర్ల ధరకే అమ్ముతాయి. అయితే, కేజీ డీ6 గ్యాస్‌పై రిలయన్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందాల గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. కొత్త కాంట్రాక్టులు కుదుర్చుకోవాలంటే ఇరు పక్షాలూ సంతకాలు చేయాల్సి ఉంది. నూతన విక్రయ ఒప్పందాలకు సంబంధించిన అనేక అంశాలను రిలయన్స్ - కేజీ డీ6 గ్యాస్ కొనుగోలుదారుల సమావేశంలో పరిష్కరించుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుత గ్యాస్ అమ్మకం, కొనుగోలు ఒప్పందం (జీఎస్‌పీఏ) మాదిరే కొత్త జీఎస్‌పీఏ కూడా ఐదేళ్లపాటు అమల్లో ఉండడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అంగీకరించిందని ఆవర్గాలు పేర్కొన్నాయి. -
ఆర్థిక స్వేచ్ఛలో రాష్ట్రానిది మూడో స్థానం
న్యూఢిల్లీ: ఎన్నికల వేళ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి సానుకూలంగా మరో నివేదిక వెలువడింది. ఆయన సీఎంగా ఉన్న గుజరాత్ రాష్ట్రం.. ఆర్థికాంశాల స్వేచ్ఛకు సంబంధించి రాష్ట్రాల వారీ జాబితాలో అగ్రస్థానం దక్కించుకుంది. ఇదే విషయంలో అత్యంత వేగంగా స్కోరును మెరుగుపర్చుకున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిల్చింది. ప్రముఖ ఆర్థిక వేత్తలు అశోక్ గులాటీ, బిబేక్ దేబ్రాయ్, లవీష్ భండారీ, జర్నలిస్టు స్వామినాథన్ అయ్యర్ రూపొందించిన ఈఎఫ్‌ఎస్‌ఐ-2013 నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. పాలనాయంత్రాంగం పరిమాణం, న్యాయ వ్యవస్థ, ప్రాపర్టీ హక్కులకు భద్రత, వ్యాపార.. కార్మిక చట్టాల అమలు మొదలైన అంశాల ప్రాతిపదికగా దీన్ని రూపొందించారు. దీని ప్రకారం 2005లో అయిదో స్థానంలో ఉన్న గుజరాత్ ఆర్థిక స్వేచ్ఛతో పాటు వేగంగా పరిస్థితులను మెరుగుపర్చుకునే విషయంలో కూడా అగ్రస్థానం దక్కించుకుంది. 0-1.0 స్కేలుపై 0.65 స్కోరు సాధించింది. ఓవరాల్‌గా తమిళనాడు రెండో స్థానంలో (0.54 స్కోరు), ఆంధ్రప్రదేశ్ (0.50 స్కోరు) మూడో స్థానంలో ఉన్నాయి. బీహార్ 0.31 స్కోరుతో ఎప్పట్లాగానే అట్టడుగున ఉంది. మావోయిస్టులు వంటి అనేక సమస్యలు ఉన్నప్పటికీ.. జార్ఖండ్‌తో పోలిస్తే చత్తీస్‌గఢ్ మెరుగైన స్కోరుతో 16వ స్థానం నుంచి 8వ స్థానానికి ఎగబాకింది.