నిలువ జాగ లేదాయే !
-
నగరంలో పార్కింగ్‌స్థలాల కొరత
-
దుకాణాల ఎదుటే నిలిపివేత
-
ట్రాఫిక్ ఇబ్బందులు
-
టవర్‌సర్కిల్‌లో రోడ్డుపై చేసిన పార్కింగ్‌లు
కరీంనగర్ కార్పొరేషన్ : నగరంలో ట్రాఫికర్ రోజురోజుకు పెరుగుతుంది. బైక్‌పై వెళ్లడమే కష్టంగా మారింది. పార్కింVŠ Sస్థలాలు లేకపోవడంతో వాహనదారులు రోడ్డుపైన, దుకాణాల ఎదుట నిలుపుతున్నారు. అరకిలోమీటర్ ప్రయాణించాలంటే అరగంట పడుతుంది. టవర్‌సర్కిల్, పోస్టాఫీస్‌రోడ్, శాస్త్రీరోడ్, ప్రకాశంగంజ్, గాంధీరోడ్ తదితర ప్రాంతాల్లో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కార్పొరేషన్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు సైతం నగరంలో ప్రత్యేకంగా పార్కింగ్‌స్థలాల ఏర్పాటుపై కసరత్తు చేయడం లేదు. ఇప్పటికైనా వీటి గురించి పట్టించుకుంటే స్మార్ట్ నగరంలో ట్రాఫికర్‌కు చెక్ పెట్టగలం.
కరీంనగర్‌లో పార్కింగ్ స్థలాలు లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కో ద్విచక్రవాహనంతోపాటు మరికొన్ని ఇళ్లల్లో అదనంగా కారు ఉంటుంది. కరీంనగర్‌లో జనాభా రోజురోజుకు పెరుగుతోంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారు ఇక్కడే ఉండేందుకు ఇష్టపడుతున్నారు. పిల్లల చదువు, వ్యాపారం, ఉద్యోగం వంటి అవసరాలకు జిల్లా కేంద్రం అనువుగా ఉంది. జనాభాకు తగ్గట్టుగానే వాహనాల సంఖ్య పెరుగుతోంది. వాహనాల సంఖ్యకు అనుగుణంగా పార్కింగ్‌స్థలాలు లేకపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒక్కోసారి రోడ్డుపై వాహనం తీసుకుని వెళ్లడం నరకంగా మారుతోంది. ముఖ్యంగా నగరపాలక సంస్థ పరిధిలోని ముఖ్య వ్యాపారకూడళ్లయిన టవర్‌సర్కిల్, పోస్టాఫీస్‌రోడ్డు, శాస్త్రీరోడ్డు, ప్రకాశంగంజ్, గాంధీరోడ్డు, రూరల్‌పోలీస్ స్టేషన్‌రోడ్డు, ఆఫీస్‌రోడ్డు, కూరగాయల మార్కెట్ రోడ్డు సాయంత్రం పూట కిక్కిరిసిపోతున్నాయి. అరకిలోమీటరు ప్రయాణించాలంటే అరగంట పడుతుంది.
దుకాణాల ఎదుటే..
వివిధ అవసరాల నిమిత్తం వ్యాపార కూడలికి వచ్చే వారు తమ వాహనాలను దుకాణాల ఎదుటే నిలుపుతున్నారు. దీంతో రోడ్లపై రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నగరంలో రోడ్లు ఇరుకుగా ఉండడంతో పాలకులు ఆశించిన ఫలితం ఇవ్వడం లేదు. వాహనాలకు తోడు దుకాణాల యజమానులు వారి సామగ్రిని రోడ్డుపైనే పెడుతూ మరింత ఇబ్బందులు కలిగిస్తున్నారు. పెద్దపెద్ద వాణిజ్య సంస్థలు, షాపింగ్‌మాల్స్, ఆస్పత్రులు, హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు, విద్యాసంస్థలు ఇలా అన్నింటి ఎదుట వాహనాలపార్కింగ్‌లే దర్శనమిస్తున్నాయి.
సెల్లార్‌లపై దృష్టి కరువు
షాపింగ్‌మాల్స్, హోటళ్లు, బార్లు, ఇతర వాణిజ్య సంస్థలు పార్కింగ్‌ల కోసం సెల్లార్‌లు ఏర్పాటు చేస్తున్నాయి. ఆ సెల్లార్‌లలో వాహనాలకు బదులుగా దుకాణాలనే విస్తరిస్తుండడం ఇబ్బందిగా మారుతుంది. వాహనాల పార్కింగ్‌ను రోడ్లపైనే చేస్తున్నారు. గతంలో సెల్లార్‌లపై కొరడా ఝుళిపిస్తున్నామని నగరపాలకసంస్థ అధికారులు హడావిడి చేసినా అవి తాటాకు చప్పుల్లే అయ్యాయి. రోడ్లపై ఇరువైపులా పార్కింగ్‌లతో సగానికిపైగా రహదారులు కనుమరుగవుతున్నాయి.
స్థలాలు కరువు
నగరపాలక సంస్థ పరిధిలో పార్కింగ్ కోసం స్థలాలు కరువయ్యాయి. అమరవీరుల స్థూపం, మార్కెట్ సమీపంలోని నీటి పారుదల కార్యాలయం, అన్నపూర్ణ కాంప్లెక్స్, మున్సిపల్ గెస్ట్‌హౌస్‌ల్లో కొంత స్థలం ఉంది. అయితే పార్కింగ్ పాయింట్లు ఏర్పాటు చేసి ప్రధాన వ్యాపార కూడళ్లలో రోడ్లపై పార్కింగ్‌ను నిషేధించాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఎక్కడా పార్కింగ్ స్థలాలను గుర్తించిన దాఖలాలు లేవు. దీంతో నగరంలో వాహనాల పార్కింగ్ సమస్యగా మారింది. ఇప్పటికైన అధికారులు స్పందించి పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని నగరవాసులు కోరుతున్నారు.