
సాక్షి, బెంగళూరు: ప్రేమికుల దినోత్సవం వచ్చిందంటే... ప్రేమికుల కోసం షాపింగ్ మాల్స్, బేకరీలు, వస్త్ర దుకాణాలు, చివరికి ఆన్‌లైన్ షాపింగ్ విక్రయదారులు అనేక ఆఫర్లను ఇచ్చి ప్రేమికులను ఆకర్షిస్తుంటారు. అయితే బెంగళూరులో మాత్రం.. ఓ విచిత్రమైన పోస్టర్ ఒకటి కలకలం సృష్టించింది. ‘బాయ్‌ఫ్రెండ్ కావాలా?’ అంటూ పోస్టర్ ముద్రించడం సర్వత్రా వివాదాస్పదమైంది.
‘కేవలం రూ.389 చెల్లిస్తే చాలు.. మీకు బాయ్ ఫ్రెండ్ లభించును’ అంటూ బెంగళూరు జయనగరలోని వివిధ ప్రాంతాల్లో ఈ విధమైన పోస్టర్లు దర్శనమిచ్చాయి. వాటిపై క్యూఆర్ కోడ్ కూడా ఉంది. వీటిని నెటిజన్లు, నగరవాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పోలీసులు దృష్టి సారించి, నిర్వాహకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment