ప్రపంచంలో కొన్ని ప్రాంతాలకు వెళ్లేముందు వందసార్లు ఆలోచించాల్సి వస్తుంటుంది. నిజానికి ఈ భూమి మీద చాలామేరకు పచ్చదనం, జీవం కనిపిస్తుండగా, ఆ ప్రాంతంలో చావు, నిశ్శబ్దం మాత్రమే కనిపిస్తాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ప్రదేశం భూమిపై అత్యంత విషపూరితమైన ప్రాంతంగా పేరొందింది. ఇక్కడ విచిత్రమైన విషయం ఏమిటంటే ఇది ఏ ఎడారిలోనే లేదు. ఫ్రాన్స్‌లోని పట్టణ ప్రాంతానికి కొంచెం దూరంలో ఉంది. ఒకప్పుడు మనుషులతో సందడిగా ఉన్న ఈ ప్రదేశం ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన ప్రదేశంగా ఎలా మారిందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ విషపూరిత ప్రదేశం ఎక్కడుంది?
ఇప్పుడు మనం చెప్పుకుంటున్న విషపూరిత ప్రదేశాన్ని జోన్ రోగ్ అని అంటారు. కొందరు ఈ ప్రదేశాన్ని డేంజర్ జోన్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రదేశం ఫ్రాన్స్‌లో ఉంది. గడచిన వంద సంవత్సరాలుగా ఈ ప్రదేశాన్ని ఎవరూ సందర్శించలేదు. ఇక్కడికి ఎవరినీ వెళ్లనీయకుండా ప్రభుత్వం నిషేధించింది. నిజానికి ఈ ప్రాంతపు మట్టిలోనే కాదు ఇక్కడి నీటిలోనూ పూర్తిగా విషం నిండివుంది. ఇక్కడి పదార్థం ఏదైనా మనిషి, లేదా మరో జీవి నోటిలోకి వెళితే మరణం ఖాయమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఈ ప్రదేశం విషపూరితంగా ఎలా మారింది?
మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు ఈ ప్రదేశం జనం సందడితో ఉండేదని చెబుతారు. ఇక్కడ ఒకప్పుడు మానవ నివాసాలు ఉండేవి. అయితే ఈ ప్రదేశం ప్రపంచ యుద్ధంలో ధ్వంసమైంది. ఇక్కడ లెక్కకు మించిన బాంబులు ప్రయోగించారు. ఈ ప్రాంతంలో రసాయన దాడులు జరిగాయి. ఇక్కడి గాలి కూడా విషపూరితమే. కొంతకాలం క్రితం ఇద్దరు జర్మన్ శాస్త్రవేత్తలు పరిశోధనల కోసం ఇక్కడికి వెళ్లారు. ఇక్కడి మట్టిలోనే కాదు నీళ్లలో కూడా ఆర్సెనిక్ అధికమోతాదులో ఉందని తేలింది. దీనిలోని ఒక్క రేణువైనా ఏ జీవి నోటిలోకి వెళ్లినా మరణం ఖాయమని వారు తమ పరిశోధనలో గుర్తించారు.
ఇది కూడా చదవండి: అది రహస్య కుటుంబం.. 40 ఏళ్లుగా దట్టమైన అడవుల్లోనే ఉంటూ..
Comments
Please login to add a commentAdd a comment