
భువనేశ్వర్ స్థానంలో రిషి ధావన్ కు చోటు
ఆస్ట్రేలియాతో జరిగే మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో పాల్గొనే భారత జట్టులో ఒక మార్పు జరిగింది. బౌలర్ భువనేశ్వర్ కుమార్ గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. దాంతో అతని స్థానంలో ఆల్‌రౌండర్ రిషి ధావన్‌కు స్థానం లభించింది. గాయపడ్డ మరో బ్యాట్స్‌మన్ అజింక్య రహానే స్థానంలో ప్రత్యామ్నాయంగా గుర్‌కీరత్ సింగ్ జట్టుతోపాటు కొనసాగుతాడు.