సీఎం బహిరంగ సభ స్థలం పరిశీలన
Published Fri, Dec 23 2016 11:37 PM | Last Updated on Mon, Sep 4 2017 11:26 PM
వివి మెరక(సఖినేటిపల్లి) :
ఈ నెల 29న మోరిలో సీఎం చంద్రబాబునాయుడు పర్యటన సందర్భంగా వివి మెరకలో నిర్వహించనున్న బహిరంగ సభాస్థలిని జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ అమలాపురం ఆర్డీఓ గణేష్‌కుమార్‌తో కలసి శుక్రవారం పరిశీలించారు. గ్రౌండ్ సామర్ధ్యంపైనా స్థానిక అధికారులతో సమీక్షించారు. సభలో నగదు రహిత లావాదేవీలు, ఏపీ ఫైబర్ గ్రిడ్ ప్రారంభం, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ఎల్‌ఈడీ బల్బుల ఏర్పాటుకు సీఎం ప్రారంభోత్సవాలు చేస్తారని కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే సభాస్థలి మ్యాప్‌ను, పరిసరాలను జిల్లా ఎస్పీ రవిప్రకాష్ తదితరులు పరిశీలించారు.
Advertisement
Advertisement