cm meeting
-
సీఎం సభకు వెళ్లి వస్తుండగా.. రెండు బైక్‌లు ఢీ.. యువకుడు మృతి..!
హాలియా: ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీకొన్న ప్రమాదంలో యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన అనుముల మండలంలోని పంగవానికుంట గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దవూర మండలం పర్వేదుల గ్రామ పంచాయతీ పరిధిలోని సుద్దబావితండాకు చెందిన రమావత్ బాలు(26) మంగళవారం హాలియా పట్టణంలో జరిగిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు హాజరయ్యాడు. సభ ముగిసిన తర్వాత బైక్‌పై తిరిగి వెళ్తుండగా.. అనుముల మండలంలోని పంగవానికుంట గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రమావత్ బాలు తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని నాగార్జునసాగర్‌లోని కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ప్రమాదంపై ఎలాంటి కేసు నమోదు కాలేదని ఎస్ఐ శోభన్‌బాబు తెలిపారు. మృతదేహంతో రాస్తారోకో పెద్దవూర: రమావత్ బాలు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగార్జునసాగర్‌లోని కమలానెహ్రూ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతుడి కుటుంబ సభ్యులు, తండావాసులు, బంధువులు వాహనాన్ని పెద్దవూర మండల పరిధిలోని సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద అడ్డుకున్నారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని వాహనం నుంచి మృతదేహాన్ని కిందికి దించి రోడ్డుపై అరగంటకు పైగా రాస్తారోకో చేశారు. దీంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. కాగా సుద్దబావితండాకు చెందిన రమావత్ బీమా, చంద్రకళ దంపతులకు ముగ్గురు సంతానం. రమావత్ బాలు పెద్ద కుమారుడు. మృతుడి తండ్రి మానసిక రోగి. బాలు ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేయడంతో పాటు కూలీ పనులకు వెళ్తూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు. చేతికి అందివచ్చిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. వారి రోదనలు పలువురిని కంటతడి పెట్టించింది. విషయం తెలుసుకున్న నాగార్జునసాగర్ సీఐ బీషన్న ఘటనా స్థలానికి చేరుకుని బాధితులతో మాట్లాడి రాస్తారోకోను విరమింపజేశారు. -
పెట్టుబడుల ఆకర్షణకు సీఎం జగన్ చేస్తున్న కృషి అభినందనీయం: లారస్ సీఈఓ
పెట్టుబడుల ఆకర్షణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్న కృషి అభినందనీయని లారస్ సీఈఓ చావ సత్యనారాయణ కొనియాడారు. విశాఖ పర్యటనలో భాగంగా అనకాపల్లి జిల్లా అచ్చుతాపురంలోని లారస్- 2 యూనిట్‌ను సీఎం సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా లారస్ సీఈఓ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్య, వైద్య రంగాల్లో తీసుకొస్తున్న మార్పులు దేశానికే ఆదర్శమన్నారు. అచ్యుతాపురంలో రూ.460 కోట్లతో ఏర్పాటు చేసిన యూనిట్ - 2 ద్వారా 1200 మందికి ఉపాధి అవకాశాలు రాబోతున్నాయని తెలిపారు. కొత్తగా రూ.850 కోట్లతో నిర్మించే రెండు యూనిట్లు ద్వారా రానున్న రోజుల్లో మరో 800 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రస్తుతానికి లారస్ లో సుమారు ఐదువేల మంది ఉన్నారని, కొత్తగా 2000 మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు చెప్పారు. నాడు-నేడు ద్వారా రాష్ట్రంలో వివిధ రంగాల్లో తీసుకొస్తున్న మార్పులు ఆదర్శప్రామంటున్న లారస్ ల్యాబ్స్ సీఈఓ చావ సత్యనారాయణతో మా ప్రతినిధి ముఖాముఖి. -
కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం
సాక్షి, నల్గొండ: హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం కలెక్టర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నల్లగొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల కలెక్టర్లు ప్రశాంత్‌జీవన్ పాటిల్, అనితారామచంద్రన్, వినయ్‌కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్లు వనమాల చంద్రశేఖర్, రాహుల్‌శర్మ, జి.రమేష్, సంజీవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పల్లెప్రగతి, హరితహారం, అక్షరాస్యతతోపాటు వివిధ సంక్షేమ పథకాల అమలు, కలెక్టర్ల బాధ్యతలపై దిశా నిర్దేశం చేశారు. అడవుల పెంపకంపై సలహాలు ఇచ్చారు. -
సీఎం సదస్సులో శ్రీదేవసేన
సాక్షి, ఆదిలాబాద్: గత రెండు విడతలుగా చేపట్టిన పల్లె ప్రగతి, త్వరలో చేపట్టనున్న పట్టణ ప్రగతి, మున్సిపల్, పంచాయతీరాజ్ చట్టాలు, కొత్త రెవెన్యూ చట్టంపై సీఎం కేసీఆర్ జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సదస్సుకు కలెక్టర్ శ్రీదేవసేన హాజరయ్యారు. మంగళవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో ఈ సదస్సు జరిగింది. -
సీఎం ఆలస్యం.. భోజనం లేక విలవిల్లాడిన మహిళలు
మదనపల్లి: ‘‘ఈ ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం ఎంతో చేసింది. నాపై నమ్మకంతోనే రాష్ట్రానికి ఐటీ కంపెనీలు వచ్చాయి. పరిశ్రమలు వెలిశాయి. ప్రభుత్వం కష్టాల్లో ఉన్నా రుణమాఫీ చేశాం. అక్కాచెల్లెమ్మలను ఆదుకున్నాం.. ఎన్నో కోట్లు ఖర్చుచేసి జిల్లాకు హంద్రీ–నీవా నీటిని తీసుకొచ్చాం. ఇక సాగునీటికి ఢోకా ఉండదు.. తాగునీటికి అవస్థలుండవు..’’ అంటూ సీఎం చంద్రబాబు గొప్పలు చెప్పుకుని మురిసిపోయారు. జలహారతి కార్యక్రమంలో భాగంగామదనపల్లె, పుంగనూరు, పలమనేరులో జరిగిన బహిరంగ సభల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. అనంతరం తిరుపతిలోని అలిపిరిలో జరిగిన సభకు హాజరయ్యారు. ప్రతిపక్ష నాయకుడు జగన్‌పై ప్రతి సభలోనూ తీవ్ర విమర్శలు చేశారు. మరోసారి తనకు అధికారం కట్టబెట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షాలకు విలువల్లేవని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జలహారతి సభను ఎన్నికల కోసం నిర్వహించిన సభగా మార్చేశారని విజ్ఞులు పెదవి విరుస్తున్నారు. ప్రభుత్వ ఖర్చుతో నిర్వహించిన సభల్లో ఏ మాత్రం సంకోచం లేకుండా నాకు ఓటేయండని అడుగుతుండడంపై టీడీపీ నాయకులే గుసగులాడుతున్నారు. ప్రభుత్వ సభలను ఎన్నికల ప్రచార సభలుగా మారుస్తున్నారని మండిపడుతున్నారు. 3 గంటల ఆలస్యం.. సీఎం సభ ఆద్యంతం 3 గంటల వరకు ఆలస్యంగా నడిచింది. షెడ్యూల్ ప్రకారం ఉదయం 10.30 గంటలకు రావాల్సి ఉంది. మనదపల్లెకు మధ్యాహ్నం 1.30 గంటలకు సభాప్రాంగణానికి వచ్చారు. హంద్రీ–నీవా జలాలకు సాష్టాంగ నమస్కారం చేశారు. సుమారు గంట సేపు ప్రసంగించారు. పుంగనూరులో జలహారతి కార్యక్రమానికి 1.30 గంటలకు హాజరవ్వాల్సి ఉండగా 3 గంటల ఆలస్యంగా వెళ్లారు. పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం గుండ్రాజువరంలో జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి సభ ప్రారంభమయ్యేసరికి చీకటి పడింది. సభకు హాజరైన వారికి కనీసం భోజన ఏర్పాట్లు కూడా చేయలేదు. సీఎం రాకముందే మహిళలు ఇళ్లకు వెళ్లిపోయారు. అధికారులు బతిమలాడినా ప్రయోజనం లేకుండా పోయింది. తిరుపతి మున్సిపల్ స్కూల్ పిల్లలను సెలవు అని చూడకుండా సభకు తరలించారు. వారు ఆకలికి అలమటించారు. ఎప్పుడూ లేటేనా? ఈ ఐదేళ్లలో జిల్లాకు వచ్చిన ప్రతిసారీ సీఎం చంద్రబాబు నాయుడు కనీసం 2 గంటలు ఆలస్యంగా వస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. పెన్షన్ కట్ చేస్తాం, డ్వాక్రా రుణాలు ఇవ్వం అంటూ బెదిరిస్తుంటే వస్తున్నామని మహిళలు, వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిసార్లు కనీసం భోజనం కూడా పెట్టకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటారని మదనపల్లి సీటీఎంకు చెందిన ఓ వృద్ధురాలు వాపోయిం ది. సోమవారం జరిగిన సభలో కొంతమంది వృద్ధులు ఆకలికి తట్టుకోలేక కళ్లు తిరిగిపడిపోయారు. టీడీపీ నాయకుడి ఓవరాక్షన్.. సీఎం సభలో టీడీపీ నాయకుడు పులివర్తి నాని ఓవరాక్షన్ చేశారు. ముఖ్యమంత్రి సభకు హాజరయ్యే టీడీపీ నాయకుల జాబితాలో లేని వారిని తీసుకొచ్చి సభలోకి అనుమతించాలని ఆయన పట్టుబట్టారు. వారు ససేమిరా అనడంతో ఆయన పోలీసులపై సీరియస్ అయ్యారు. మా పార్టీ సభకు మమ్మల్నే పంపించరా..? అంటూ చిందులేశారు. అయినా పోలీసులు నాని అనుచరులను లోపలికి అనుమతించలేదు. -
కౌలు రైతు కన్నీటి యాత్ర
గుంటూరు, యడ్లపాడు: కొన్ని బంధాలు అంత త్వరగా తెగి పోవు.. కొందరు వ్యక్తుల్ని అంత త్వరగా మర్చిపోలేం. గుండెగూటిలో ఆ వ్యక్తి చేసిన త్యాగం చెదరని జ్ఞాపకమై జీవితాంతం మిగిలిపోతుంది. కనుపాపకు రెప్పలా.. తమ బతుకులకు దిక్సూచిలా నిలిచిన ఆ వ్యక్తి కానరాని లోకాలకు వెళ్లిపోతే, కన్నీళ్లు సైతం ఇంకిపోయి నిస్సహాయులుగా మిగిలిన కొన్ని కుటుంబాల వ్యథ ఇది... కుటుంబాలకు అండగా... యడ్లపాడు మండలంలోని కొత్తపాలెం గ్రామానికి చెందిన కౌలు రైతు పిట్టల కోటేశ్వరరావు కొండవీడు ఉత్సవాల రెండో రోజున తన పంట పొలంలో పోలీసులు, టీడీపీ నేతల దాడిలో మృతి చెందాడు. కోటేశ్వరరావు మృతి కుటుంబ సభ్యుల్నే కాదు గ్రామస్తులను సైతం కలచి వేసింది. స్వయం కృషితో, ఆత్మస్థైర్యంతో అంచెలంచెలుగా ఎదిగిన కోటేశ్వరరావు ఎనిమిది కుటుంబాలకు పెద్ద దిక్కుగా వ్యవహరించేవాడు. దశాబ్దన్నర కిందటే తల్లిదండ్రులు లింగయ్య, సీతమ్మ కాలం చేశారు. తల్లిదండ్రుల నుంచి పెద్దగా ఆస్తిపాస్తులు లేకపోవడంతో కోటయ్య రెక్కల కష్టాన్ని నమ్ముకున్నాడు. తన అక్క, నలుగురు చెల్లెళ్లు, కూతురు, కుమారుడి వివాహాలను చేశాడు. తన కుటుంబంతోపాటు అక్క, చెల్లెళ్ల కుటుంబాలకు అండగా ఉన్నాడు. 14 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని రకరకాల పంటలను సాగు చేశాడు. రెక్కల కష్టం ఫలించి ఫలసాయం చేతికందే వేళ కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న వైఎస్సార్ సీపీ నేతలు రజని, రాజశేఖర్ బాధితులకు నాయకుల పరామర్శ కోటేశ్వరరావు మృతదేహాన్ని మంగళవారం చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రి ప్రాంగణం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, కొత్తపాలెంలో గ్రామస్తుల ఆర్తనాదాలతో దద్దరిల్లింది. ఆసుపత్రికి చేరుకున్న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త విడదల రజని, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్ కుటుంబ సభ్యులకు బాసటగా నిలిచారు. మృతుని కుటుంబానికి అండగా నిలుస్తామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిష్పక్షపాత విచారణ నిర్వహించాలని డిమాండ్ చేశారు. మృతుని కుటుంబానికి పరిహారంగా రూ.25 లక్షలు చెల్లించాలన్నారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. సీపీఐ గుంటూరు జిల్లా పశ్చిమ కార్యదర్శి గద్దె చలమయ్య, రైతు సంఘం రాష్ట్ర ఉపా«ధ్యక్షుడు పీ నరసింహారావు, సీపీఎం నాయకులు బొల్లు శంకరరావు, పోపూరి సుబ్బారావు, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ అన్నం శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి తాటిపర్తి జయరామిరెడ్డి, పొత్తూరి బ్రహ్మానందం, జనసేన, వివిధ ప్రజాసంఘాల నాయకులు ఆసుపత్రికి చేరుకుని ప్రభుత్వ, పోలీసులు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ హత్యగానే భావించాల్సి ఉంటుందని ఆరోపించారు. నిజానిజాలు నిగ్గు తేలేవరకు ఎలాంటి పోరాటానికైనా వెనుకాడేది లేదని హెచ్చరించారు. సాయంత్రం కోటేశ్వరరావు మృత దేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించి బంధులకు అప్పగించారు. అనంతరం గ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. విడదల రజనిఆర్థిక సహాయం అందజేత మృతుడు కోటేశ్వరరావు కుటుంబ సభ్యులకు వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త విడదల రజని రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. -
సీఎం సభకు 108 వాహనాలు.. వైద్యం అందక బాలిక మృతి
సాక్షి, తాడికొండ: రాజధాని ప్రాంతంలో పెరిగిన ట్రాఫిక్‌కు అనుగుణంగా అనువైన రోడ్లు లేకపోవడం.. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించాల్సిన 108 వాహనాలు అందుబాటులో లేకపోవడం కారణంగా ఓ బాలిక మృత్యుఒడికి చేరింది. తాడికొండ మండలం మోతడక గ్రామ పరిధిలో శుక్రవారం సాయంత్రం వేగంగా వెళుతున్న ఆటోకు టైరు పేలడంతో అదుపుతప్పింది. దీంతో అమరావతి వలస మాలపల్లికి చెందిన రాయపూడి గీతాంజలి (14) తీవ్రగాయాలపాలై కొట్టుమిట్టాడుతుండగా.. స్థానికులు 108 వాహనానికి ఫోన్ చేశారు. అయితే వాహనం అందుబాటులో లేదని, రావడానికి సమయం పడుతుందంటూ సమాధానం రావడంతో కంగుతిన్నారు. చిన్నారిని హుటాహుటిన ప్రైవేటు వాహనంలో గుంటూరులోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందింది. కాగా, ముఖ్యమంత్రి సభ పేరిట శుక్రవారం ఉదయం 8 గంటలకే తాడికొండ, అమరావతి మండలాలకు చెందిన 108 వాహనాలను తుళ్ళూరు ప్రాంతానికి తరలించారు. దీంతో ఈ ప్రాంతంలో 108 సేవలు శుక్రవారం పూర్తిగా నిలిచిపోయాయి. -
నారా హమారా.. కష్టాలు కనరా!
గుంటూరు నడిబొడ్డున ‘నారా హమారా.. టీడీపీ హమారా’ పేరిట జరిగిన సీఎం సభ ప్రయాణికులతో పాటు, నగర ప్రజలను అష్టకష్టాలకు గురిచేసింది. షెడ్యూలు బస్సులను రద్దుచేసి మరీ ప్రజలను సభకు తరలించేందుకు కేటాయించారు. దీంతో గంటలతరబడి గుంటూరు బస్టాండ్‌కు బస్సులు రాలేదు. వచ్చిన అరకొర బస్సులు చాలకపోవడంతో ప్రయాణికులు ఆటోలు, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చింది. వాటిలో అధిక చార్జీలు వసూలు చేశారు. మరో వైపు నగరం మొత్తం ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పాతగుంటూరులో దుకాణాలను కూడా మూసివేయించడంతో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ఆటోలు ఎక్కేందుకు, ఇళ్లకు చేరుకునేందుకు కిలోమీటర్ల కొద్దీ నడవాల్సిన దుస్థితి నెలకొంది. నెహ్రూనగర్(గుంటూరు): ‘ముఖ్యమంత్రి వచ్చిన ప్రతిసారీ బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నాం. గంటల తరబడి ఎదురు చూస్తే ఒక్క బస్సు వచ్చింది. ఆ బస్సేమో కిటకిటలాడుతోంది. కాలుపెట్టే జాగాలేదు.. పిల్లాజెల్లతో ఇంటికి ఎలా వెళ్లాలి?’ అంటూ ప్రయాణికులు వాపోయారు. ‘ముఖ్యమంత్రి పర్యటన అంటేనే భయమేస్తోంది. పోలీసులు అడుగడుగునా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు. బస్సులు లేవని పిల్లలు కాలేజీలకు వెళ్లకుండా ఇంటికి వచ్చేశారు. అన్ని దుకాణాలను కూడా మూసివేయిస్తే ఎలా?’ అంటూ గుంటూరు నగర ప్రజలు అసహనం వ్యక్తం చేశారు.‘నారా హమారా...టీడీపీ హమారా’ పేరిట గుంటూరు నగరం నడిబొడ్డను ఉన్న బ్రహ్మానందరెడ్డి (బీఆర్)స్టేడియంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం నిర్వహించిన మైనార్టీ సదస్సు నగర ప్రజలకు, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగించింది. బీఆర్ స్టేడియంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన ఈ సభ కోసం అధికారులు సోమవారం సాయంత్రం నుంచే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపట్టారు. సభకు ప్రజలను తరలించేందుకు జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు కేటాయించారు. ఈ బస్సులను వివిధ ప్రాంతాలకు తరలించి అక్కడి నుంచి మైనార్టీలను సభకు తీసుకొచ్చారు. బస్సులు లేకపోవడంతో షెడ్యూలు సర్వీసులు రద్దయ్యాయి. ఫలితంగా బస్సులు లేక గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ వెలవెలబోయింది. ప్రయాణికులు మాత్రం ప్లాట్‌ఫాంలపై కిక్కిరిశారు. ఆయా ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులు గంటకో, రెండు గంటలకో ఒకటి చొప్పున రావడం, అది కాస్తా క్షణాల్లో కిటకిటలాడటంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు. గంటల తరబడి మరో బస్సు కోసం ఎదరు చూడలేక, పిల్లలతో బస్టాండ్‌లోనే వేచివుండలేక ఆటోలను ఆశ్రయించక తప్పలేదు. ఆటోవాలాలు అధిక చార్జీలు వసూలుచేయడంతో ప్రయాణికుల జేబులు ఖాళీకాక తప్పలేదు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు మాత్రం ఆటోలు కూడా లేక గంటల తరబడి బస్టాండ్‌లోనే పడిగాపులు కాశారు. చివరకు ప్రైవేటు వాహనాల్లో గమ్యస్థానాలకు చేరాల్సిన పరిస్థితి దాపురించింది. జిల్లా నుంచి 436 బస్సులు గుంటూరు రీజియన్ పరిధిలో 13 డిపోలు ఉన్నాయి. ఈ డిపోల్లో మొత్తం 1,017 బస్సులు ఉన్నాయి. వాటిలో 436 బస్సులు సీఎం సభ కోసం కేటాయించారు. ఇందు కోసం ఆయా బస్సులు షెడ్యూలు సర్వీసులను రద్దుచేశారు. షెడ్యూలు బస్సులు లేకపోవడంతో జిల్లా వ్యాప్తంగా ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మండుటెండలో రోడ్డుపక్కనే బస్సుల కోసం పడిగాపులుకాశారు. మరోవైపు బస్సుల్లో విధులకు వెళ్లే ఉద్యోగులకూ ఇబ్బందులు తప్పలేదు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విద్యార్థులు గుంటూరు నుంచి నరసరావుపేట, సత్తెనపల్లి, చిలకలూరిపేట, పొన్నూరు, విజయవాడలలోని వివిధ ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, మెడిసిన్ కాలేజీలకు వేల సంఖ్యలో విద్యార్థుళు వెళ్లొస్తుంటారు. సీఎం సభకు బస్సులను కేటాయించడం, నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో విద్యార్థులు ఇ బ్బందులు ఎదుర్కొన్నారు. సరిపడ బస్సులు లేకపోవడంతో చాలా మంది కళాశాలలకు వెళ్లకుం డానే ఇంటిబాట పట్టారు. ఇంటికి వెళ్లేందుకు సైతం ట్రాఫిక్ ఆంక్షలతో నడిచి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. సాయంత్రం వేళల్లో బస్సులు కోసం వేచి వేచి చూసి ఆటోలు, ఇతర ప్రయివేట్ వాహనాల్లో వేలాడుతూ గుంటూరు చేరుకోవాల్సి వచ్చింది. అధిక చార్జీలు వసూలు ఆర్టీసీ బస్సులు సరిపడినన్ని లేకపోవడంతో ఆటోలు, ప్రైవేటు వాహనాలకు డిమాండ్ పెరిగింది. దీంతో ఆటోలు, టాటామ్యాజిక్, కార్లు వంటి వాహనాలను ప్రయాణికులు ఆశ్రయించారు. వాటి డ్రైవర్లు చార్జీలను రెట్టింపుచేశారు. ఆర్టీసీ బస్సులో గుంటూరు నుంచి పేరేచర్లకు రూ.10 వసూలు చేస్తే, ప్రైవేట్ వాహనాల్లో రూ.20 వసూలు చేసినట్లు ప్రయాణికులు తెలిపారు. నగర శివారులో బాగుండేది సీఎం సభను గుంటూరు నగరం నడిబోడ్డులో ఏర్పాటు చేస్తే ప్రయాణికులు, నగర వాసులు ఇబ్బందులు పడతారే కనీస అవగాహన తెలుగుదేశం పార్టీ పెద్దలకు, ప్రభుత్వానికి లేకపోవడం బాధాకరమని పలువురు పేర్కొన్నారు. సీఎం స్థాయిలో హాజరయ్యే కార్యక్రమాలను నగరానికి దూరంగా శివారు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే బాగుండేదని పలువురు ప్రయాణికులు అభిప్రాయం వ్యక్తంచేశారు. -
సీఎం సభకు రావాలని బెదిరింపులు
-
సీఎం మీటింగ్‌కు రాకపోతే రూ.400 కట్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యే సభకు రాకపోతే రూ.400 కట్ చేస్తామని డ్వాక్రా మహిళా సంఘం లీడర్లకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సీఎం బుధవారం అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా రాప్తాడు నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభకు డ్వాక్రా మహిళలను తరలించే ఏర్పాట్లు చేశారు. సంఘం నుంచి కనీసం ఇద్దరు రావాలని ఫోన్లు చేసి ఒత్తిడి చేస్తున్నారు. రాలేమని చెబుతుంటే బెదిరింపులకు దిగుతున్నారు. అనంతపురం: సీఎం చంద్రబాబు హాజరయ్యే సభకు రాకపోతే రూ.400 కట్ చేస్తామని డ్వాక్రా మహిళా సంఘం లీడర్లకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సీఎం బుధవారం అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి మండలం పేరూరుకు వస్తున్నారు. బహిరంగ సభకు జిల్లా వ్యాప్తంగా డ్వాక్రా సంఘాల సభ్యులను తరలించేందుకు అధికార పార్టీ నేతలు రంగం సిద్ధం చేశారు. ప్రతి మహిళా సంఘం నుంచి కనీసం ఒకరిద్దరు కచ్చితంగా రావాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. రామంటే బెదిరింపులకు దిగుతున్నారు. సోమవారం అనంతపురం రూరల్ మండల పరిధిలోని ఓ సంఘం లీడరుకు యానిమేటర్ ఫోన్ చేశారు. వారి మధ్య సంభాషణ ఇలా సాగింది. గ్రూపు లీడరు (అంజనాదేవి): అక్కా చెప్పక్కా! యానిమేటర్ (లక్ష్మీదేవి): అక్కా..పేరూరు మీటింగ్‌కు రావాలి గ్రూపు లీడరు: అక్కా మేము రాము. మేము వైఎస్సార్ పార్టీవాళ్లము. యానిమేటరు: మీ గ్రూపులో నుంచి ఎవరైన్నా పంపు. నువ్వే రావాలని చెప్పడం లేదు. గ్రూపు లీడరు: నేనైతే ఎవరికీ చెప్పను. రూలేమైనా ఉంటే చెప్పండి. నేను ఫాలో అవుతా. యానిమేటరు: నువ్వ లీడరు కాబట్టి చెబుతున్నా. ఎవర్నైనా పంపు. గ్రూపు లీడరు: నేనైతే ఎవరికీ వెళ్లమని చెప్పను. నేనైతే పక్కా వైఎస్సార్. పదిలక్షలు ఇస్తామంటే కూడా మీటింగ్‌కు రాను. యానిమేటరు: అవన్నీ అనవసరం. వస్తావా రావా? మనకు రాజకీయాలు అవసరం లేదక్కా? గ్రూపు లీడరు: మీటింగ్ పెడుతున్నారు కాబట్టి ఇది రాజకీయమే. రాజకీయ నాయకుల కోసమే పేరూరుకు పోతుండేది తెలుసు. యానిమేటరు: రాజకీయం కాదు మన డ్వాక్రా వాళ్ల కోసమే సారు బస్సు పంపిస్తున్నాడు. గ్రూపు లీడరు: సారు నంబరు నాకివ్వు. నేను ప్రెస్వాళ్లను పిలిపించి మాట్లాడతా. ఏళ్ల నుంచి గ్రూపులో ఉన్నా రుణమాఫీ కాలేదు. అవన్నీ తీర్చితే ఎన్ని బస్సులకు కావాలంటే అంతమందిని ఎక్కిస్తానని చెబుతా. యానిమేటరు: నువ్వు వస్తేరా లేదంటే లేదు.రాకపోతే రూ.400 కట్ చేస్తా. గ్రూపు లీడరు: మీటింగ్‌కు పోకపోతే సంఘంలో 400 కట్ చేస్తారా? సరే చేయండి. -
ఏదీ ఆహ్వానం..?
కడప ఎడ్యుకేషన్: జిల్లా ప్రథమ పౌరుడు, క్యాబినెట్ ర్యాంకు హోదా కలిగిన జిల్లా పరిషత్ చైర్మన్‌కు జిల్లాలో ఏ అధికారిక కార్యక్రమం జరిగినా పిలుపులేకుండా పోతోంది. తాజాగా జిల్లాలో జరుగుతున్న జన్మభూమితో పాటు నేడు పులివెందులకు వస్తున్న సీఎం సభకు కూడా ఆహ్వానం అందలేదు. కనీసం ప్రోటోకాల్ కోసమైనా ఆహ్వాన పత్రికలను పంపాల్సి ఉన్నా దాని గురించి పట్టించుకునే వారే లేరు. ఇటీవల ఉపరాష్ట్రపతి కార్యక్రమానికి కూడా.. ఇటీవల ప్రొద్దుటూరులో జరిగిన ఓ పాఠశాల ఉత్సవాల కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వచ్చారు. ఈయన కార్యక్రమానికి కూడా జెడ్పీ చైర్మన్‌కు పిలుపులేదు. ∙గతంలో జిల్లా పరిషత్తు కార్యాలయ ఆవరణంలో నిర్మించిన డీఆర్సీ భవన్ శంకుస్థాపనకు మంత్రి గంటా వచ్చారు. ఆ రోజు కూడా ఆహ్వానం లేదు. మంత్రి వచ్చే ముందు ఫార్మాలిటీకి ఆధికారులు వచ్చి కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. దీంతో జెడ్పీ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం తమ కార్యాలయం ఆవరణంలో కార్యక్రమం జరుగుతున్నా ఆహ్వానం లేకపోవడంపై మండిపడ్టారు. జెడ్పీ చైర్మన్ దళితుడని అధికారులకు చిన్నచూపేమోనని పలు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడుగడుగునా అవమానం తాను దళితుడినని జిల్లా అధికారులు అడుగడుగునా అవమానానికి గురి చేస్తున్నారని జెడ్పీ చైర్మన్ గూడూరు రవి సాక్షితో ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే చైర్మన్ పదవిలో అగ్రవర్ణాలకు చెందిన వారు ఉండి ఉంటే ఇలా చేశేవారా అని ప్రశ్నించారు. జిల్లాలో ఏ అధికారిక కార్యక్రమం జరి గినా కనీసం ఆహ్వాన పత్రికను కూడా పంపరని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందంతా జిల్లా అధికారులే చేస్తున్నారా లేక అ«ధికార పార్టీవారు చెప్పి చేయిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు. -
సీఎం బహిరంగ సభ స్థలం పరిశీలన
వివి మెరక(సఖినేటిపల్లి) : ఈ నెల 29న మోరిలో సీఎం చంద్రబాబునాయుడు పర్యటన సందర్భంగా వివి మెరకలో నిర్వహించనున్న బహిరంగ సభాస్థలిని జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ అమలాపురం ఆర్డీఓ గణేష్‌కుమార్‌తో కలసి శుక్రవారం పరిశీలించారు. గ్రౌండ్ సామర్ధ్యంపైనా స్థానిక అధికారులతో సమీక్షించారు. సభలో నగదు రహిత లావాదేవీలు, ఏపీ ఫైబర్ గ్రిడ్ ప్రారంభం, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ఎల్ఈడీ బల్బుల ఏర్పాటుకు సీఎం ప్రారంభోత్సవాలు చేస్తారని కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే సభాస్థలి మ్యాప్‌ను, పరిసరాలను జిల్లా ఎస్పీ రవిప్రకాష్ తదితరులు పరిశీలించారు. -
బీజేపీ నేతలకు దొరకని ముఖ్యమంత్రి దర్శనం
మడకశిర : సీఎం చంద్రబాబునాయుడు మడకశిరకు వచ్చిన నేపథ్యంలో నియోజకవర్గంలోని సమస్యలపై సీఎంకు వినతి పత్రం ఇవ్వడానికి వచ్చిన బీజేపీ నాయకులకు ఛేదనుభవం ఎదురైంది. అయితే 25 మంది బీజేపీ నాయకులను అనుమతించమని స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తేల్చిచెప్పారు. ఇద్దరు లేదా ముగ్గురు వచ్చి సమస్యలపై వినతి పత్రం సమర్పించాలని సూచించారు. అందుకు బీజేపీ నాయకులు నిరాకరించారు. ఈసందర్భంగా బీజేపీ నాయకుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ తాము టీడీపీతో కలిసి పని చేస్తున్నామని అయినా కూడా తమను ముఖ్యమంత్రి వద్దకు అనుమతించకపోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రంగనాథ్, జయరామ్, లెంకప్ప, నాగలింగప్ప, ముద్దరాజు, నాగేంద్రబాబు, చంద్రప్ప పాల్గొన్నారు. -
వామ్మో.. సీఎం సభా..?
* హడలిపోతున్న డ్వాక్రా మహిళలు, విద్యార్థులు * సీఎం సభల ఏర్పాట్లతో బెంబేలు ఎత్తుతున్న అధికారులు * తాజాగా విట్ శంకుస్థాపనకు 15 వేల మంది విద్యార్థులను తరలించాలని ఆదేశం జిల్లాలో ముఖ్యమంత్రి సమావేశాలంటే డ్వాక్రా మహిళలు, విద్యార్థులు, ప్రైవేటు స్కూల్ యజమాన్యాలు హడలిపోతున్నాయి. నెలకు నాలుగైదు సార్లు జిల్లాలో ఏదో కార్యక్రమం పేరుతో సీఎం పర్యటనలు ఉండటంతో అధికారులకు తలనొప్పిగా మారింది. ప్రభుత్వ , ప్రైవేటు కార్యక్రమం ఏదైనా జనాలను తరలించించడం, ఏర్పాట్లు బాధ్యత అధికారులకే అప్పగిస్తున్నారు. దీంతో జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులు సాక్షి, అమరావతి బ్యూరో: జిల్లాలో సీఎం చంద్రబాబు మీటింగ్‌లు నిర్వహించే ప్రతిసారీ డ్వాక్రా మహిళలు విద్యార్థులే దిక్కు అవుతున్నారు. అధికారులు బతిమాలో, భయపెట్టే సభలకు వారిని తరలిస్తున్నారు. హాజరయ్యే వారు ముఖ్యమంత్రి చెప్పే ఊక దంపుడు ఉపన్యాసాలతో బెంబేలెత్తుతున్నారు. ఈ గండం నుంచి గట్టెక్కెదట్టా అనుకుంటూ మదన పడుతున్నారు. రాజధానిలో ప్రభుత్వ భవనాల శంకుస్థాసన కార్యక్రమం ఘటనలు మరువక మందే మళ్ళీ విద్యార్థులను సీఎం సభలకు తరలించడం అధికారులకు కత్తిమీద సాముగా మారింది. విద్యాశాఖ అధికారులకే బాధ్యతలు... వేలూరు ఇన్స్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ శంకుస్థాపనకు 15 వేల మంది విద్యార్థులను తరిలించే బాధ్యత డీఈఓ, ఆర్ఐఓ, ఇంజినీరింగ్, పాలిటెక్నికల్ కళాశాలలకు అప్ప జెప్పారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వచ్చిన ప్రతి సారీ జనాలను తరలించేందుకు ప్రైవేటు స్కూల్, కళాశాలలు, ఇంజినీరింగ్ కాలేజీ బస్సులను వినియోగిస్తున్నారు. మొన్న రాయపూడిలో జరిగిన ప్రభుత్వ శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లిన మహిళలు, విద్యార్థులు వర్షంతో అల్లాడిపోయారు. బస్సులో బురదలో ఇరుక్కుపోయి కదలేని పరిస్థితి నెలకొంది. నల్లరేగడి నేల కావడంతో నడవడానికి కూడా కష్టపడ్డారు. గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం సభలకు విద్యార్థులను పంపేందుకు ప్రైవేటు స్కూలు, కళాశాల యజమాన్యాలు ఆలోచిస్తున్నాయి. ఏదైనా జరగరానిది జరిగితే విద్యార్థుల తల్లిదండ్రులకు ఏమి సమాధానం చెప్పాలని అందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎం సభల నిర్వహణలకు సరిగా నిధులు మంజూరు కాక పోవడంతో జిల్లా అధికారులకు సైతం తలకుమించిన భారంగా మారుతోంది. -
పోలీసుల అత్యుత్సాహం
– వైఎస్సార్సీపీ నేతల ముందస్తు అరెస్ట్ – హోదాపై ప్రశ్నిస్తారనే దురుద్దేశంతోనే.. అనంతపురం సెంట్రల్ : జిల్లా కేంద్రంలో పోలీసులు అత్యుత్సాహం చూపించారు. ముందస్తు అరెస్ట్‌ల పేరుతో శనివారం ఉదయమే వైఎస్సార్సీపీ నేతలను త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం ధర్మవరం, బుక్కరాయసముద్రం మండలాల్లో పర్యటించనున్న సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేకహోదా తీసుకురావడంపై ఒత్తిడి పెంచేందుకు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ విద్యార్థి, యువజన విభాగం నాయకుల ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరసన తెలపాలని భావించారు. అందులో భాగంగా స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త ఆలూరు సాంబశివారెడ్డి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. విషయం తెలుసుకున్న త్రీటౌన్ సీఐ గోరంట ్లమాదవ్, శింగనమల ఎస్ఐ హమీద్‌ఖాన్ అక్కడికి చేరుకుని నాయకులను అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాయకులు నినాదాలు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, సీఎం డౌన్‌డౌన్ అంటూ నినదించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంపై ముఖ్యమంత్రిని నిలదీస్తారనే ఈ అరెస్ట్‌లు చేసినట్లు వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు బండిపరుశురాం, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, నగర అధ్యక్షులు మారుతీనాయుడు, అధికారప్రతినిధి పోరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, విద్యార్థి విభాగం నగర అధ్యక్షులు రఫీ, నాయకులు రాఘవేంద్ర, రమణ, పురుషోత్తం, నూర్‌బాషా, సాకేనవీన్ తదితరులు అరెస్ట్ చేసిన వారిలో ఉన్నారు. -
‘గీతో’పదేశం!
♦ జిల్లాల విభజనపై టీఆర్ఎస్ ప్రతినిధులతో నేడు సీఎం భేటీ ♦ సమావేశంలో కొత్త జిల్లాలపై సంకేతాలు ఇచ్చే అవకాశం ♦ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలపై వీడనున్న చిక్కుముడి జిల్లా విభజన రేఖ ఎలా ఉంటుందో మరికొన్ని గంటల్లో స్పష్టం కానుంది. ప్రతిపాదిత కొత్త జిల్లాలపై ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మదిలో ఏముందో తేలనుంది. జిల్లాల పునర్విభజనే ప్రధాన ఎజెండాగా బుధవారం టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో ప్రతిపాదిత జిల్లాల ముసాయిదాలపై అధికారపార్టీ ప్రజాప్రతినిధులతో చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో ఏయే ప్రాంతాలు కొత్త జిల్లాలుగా ఏర్పడనున్నాయి? ఏవి జిల్లా కేంద్రాలు కానున్నాయి? ఏ నియోజకవర్గాలు పక్క జిల్లాల్లో విలీన మవుతున్నాయనే అంశాలపై సీఎం కేసీఆర్ సంకేతాలిచ్చే అవకాశం ఉంది. నయా జిల్లాలపై ఇప్పటికే సరిహద్దులు, మ్యాపులు తయారు చేసి.. ఇప్పుడు తమ అభిప్రాయం తెలుసుకోవడం లాంఛనప్రాయమేననే భావన అధికారపార్టీలో వ్యక్తమవుతోంది. ప్రజాప్రతినిధులను కూడా సంప్రదించిన తర్వాతే కొత్త జిల్లాలకు తుదిరూపు ఇచ్చామనే సందేశం ప్రజల్లోకి వెళ్లడమే ఈ సమావేశం ముఖ్యోద్దేశమని పార్టీ వర్గాలు అంటున్నాయి. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి మినహా ఇతర జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం ఇప్పటికే స్పష్టతనిచ్చింది. వీటిలో చాలావరకు కొత్త కలెక్టరేట్లపై కసరత్తు కూడా పూర్తి చేసింది. చివరి దశకు చేరిన విభజన ప్రక్రియలో ఉద్యోగుల సర్దుబాటుపై అక్కడి అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. జంట జిల్లాల్లో అనిశ్చితి మన జిల్లా విషయానికి వస్తే విభజనపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. వికారాబాద్ కేంద్రంగా రంగారెడ్డి జిల్లా కొనసాగించాలనే అంశం మాత్రమే కొలిక్కి వచ్చింది. ఈ జిల్లా పరిధిలో ప్రతిపాదించిన వికారాబాద్, తాండూరు, పరిగి, చేవెళ్ల నియోజకవర్గాలు మినహా ఇతర నియోజకవర్గాలు (10) ఏ జిల్లాలోకి వెళతాయి? ఎన్ని భాగాలుగా విడిపోతాయి? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల విభజన విషయానికొచ్చేసరికి సీఎం ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే జిల్లాల పునర్విభజనపై జరిగిన రెండు అత్యున్నతస్థాయి సమావేశాల్లో ప్రభుత్వం ఈ జంట జిల్లాలను ఎలా విభజించాలనే అంశంపై ఎటూ తేల్చలేకపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగే భేటీలో జిల్లా భవితవ్యాన్ని సీఎం నిర్దేశించనున్నారు. ఇదిలావుండగా, జిల్లాల డీలిమిటేషన్‌పై శాసనసభాపక్ష సమావేశంలో జిల్లా ఎమ్మెల్యే /ఎమ్మెల్సీ అభిప్రాయాలను సీఎం కేసీఆర్ అడిగి తెలుసుకునే అవకాశ ముంది. అంతేకాకుండా జిల్లాల పునర్విభజనపై విపక్షాలు చేస్తున్న విమర్శలను కూడా తిప్పకొట్టేలా జిల్లాల ఖరారులో పాటిస్తున్న శాస్త్రీయత, వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం తదితర అంశాలను కూడా విశదీక రించే వీలుంది. అయితే, నయా జిల్లాలపై ఇప్పటికే సరిహద్దులు, మ్యాపులు తయారు చేసి.. ఇప్పుడు తమ అభిప్రాయం తెలుసుకోవడం లాంఛనప్రాయమేననే భావన అధికారపార్టీలో వ్యక్తమవుతోంది. ప్రజాప్రతినిధులను కూడా సంప్రదించిన తర్వాతే కొత్త జిల్లాలకు తుదిరూపు ఇచ్చామనే సందేశం ప్రజల్లోకి వెళ్లడమే ఈ సమావేశం ముఖ్యోద్దేశమని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఏదీఏమైనా సమావేశంలో ముఖ్యమంత్రి వెల్లడించే సంకేతాల ఆధారంగా జిల్లాల విభజనపై మరికొంత స్పష్టత రానుంది. -
సీఎం సభ.. పిల్లలకు సెలవు!
ముఖ్యమంత్రి సభలకు ప్రైవేట్ స్కూల్ బస్సుల ఏర్పాటు 200 వాహనాలు పంపాలని ఆర్టీఏ అధికారుల హుకుం పాఠశాలల్లో తరగతులకు సెలవు .. సిలబస్ పూర్తి కావడం లేదని యాజమాన్యాల ఆవేదన మంగళగిరి : జిల్లాలో ముఖ్యమంత్రి సభ అంటే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు హడలిపోతున్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వం సభలకు ఆర్టీసీ బస్సులను వినియోగించగా వారికి కోట్లాది రూపాయలు బకాయిలు పేరుకుపోవడంతో ట్రెండ్ మార్చారు. కొద్ది రోజులుగా ప్రైవేటు స్కూల్స్ బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఒత్తిడి తీసుకువస్తున్నారు. గత నెల వ్యవధిలో జిల్లాలో 8 సార్లు సీఎం పర్యటించగా ఐటిందిటి ఆర్టీసీ బస్సులను ఉపయోగించగా, చివరి 3 కార్యక్రమాలకు ప్రైవేటు స్కూల్స్ బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా.. పాఠశాలల పని దినాల్లో ఎలాంటి ఇతర పనులకు సెలవు ప్రకటించరాదని సుప్రీంకోర్టు ఆదేశాలున్నా, సాక్షాత్తూ రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ సైతం స్కూల్ బస్సులను వినియోగించరాదని ఆదేశాలు జారీ చేసినా.. జిల్లా ఉన్నతాధికారి మాత్రం సీఎం సభకు అంటేనే విద్యా, రవాణా శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి ప్రైవేటు స్కూల్స్ నుంచి బస్సులు ఏర్పాటు చేయాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. దీంతో మండల అధికారులు తమ ప్రతాపాన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలపై చూపుతున్నారు. సిలబస్ పూర్తికాక.. ఇప్పటికే సిలబస్ పూర్తి కాక ఇబ్బంది పడుతున్న పాఠశాలలు సీఎం పర్యటనల నేపథ్యంలో సెలవులతో విద్యార్థులకు ఆదివారం సైతం క్లాసులు నిర్వహించి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో 15 రోజుల క్రితం జరిగిన వ్యవసాయ యూనివర్సిటీ శంకుస్థాపన, పొన్నూరు సభలకు సెలవులు ప్రకటించిన యాజమాన్యాలు శనివారం అమరావతిలో జరుగనున్న సీఎం పర్యటనకు బస్సులు ఏర్పాటు చేసి సెలవులు ఇవ్వాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. 200 బస్సులు కావాలన్నాం.. దీనిపై జిల్లా రవాణా శాఖలోని ఓ అధికారిని వివరణ కోరగా.. సీఎం అమరావతి పర్యటనకు 200 బస్సులు ఏర్పాటు చేయాలని జిల్లా ఉన్నతాధికారి ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. దీంతో తాము విద్యా శాఖతో కలిసి ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. అయితే పాఠశాలలకు అధికారికంగా ఎటువంటి సెలవులు వుండవని, స్కూల్ బస్సులను మాత్రం సీఎం సభకు తీసుకెళ్తామని వివరించారు. -
సీఎం సభకు వెళ్తున్న బస్సు ఢీకొని బాలుడి దుర్మరణం
మదనపల్లె: చిత్తూరు జిల్లా మదనపల్లె మండలంలో గురువారం ముఖ్యమంత్రి సభకు జనాన్ని తరలించే బస్సు ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ప్రమాదంలో పురుషోత్తం(5) అనే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల కథనం మేరకు... కురబలకోటలో జరిగే సీఎం సభకు రామసముద్రం నుంచి టీడీపీ కార్యకర్తలను బస్సులో తరలిస్తున్నారు. ఆ బస్సు దాదినాయునితాండ వద్ద ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం నడుపుతున్న మదనపల్లె మండలం కృష్ణాపురానికి చెందిన పి. ఈశ్వర్ (45), వెనుక కూర్చుని ఉన్న పవన్(12), ఈశ్వర్ తమ్ముడి కుమారుడు పురుషోత్తం(5) తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించగా, పురుషోత్తం అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈశ్వర్, పవన్ చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రండి రండి ఎమ్మెల్యే గారూ!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామ సుందర శివాజీకి అరుదైన గౌరవం దక్కింది. ఇదేంటని అనుకుంటున్నారా? సీఎం రాక నేపథ్యంలో ప్రతి సారీ తనకు అవమానం జరుగుతోందని వాపోతున్న ఆయనకు శనివారం మాత్రం పోలీసులు పూర్తిస్థాయిలో గౌరవ మర్యాదలు అందించారు. తాను ఎమ్మెల్యే అయినప్పటికీ గతంలో రణస్థలంలో జరిగిన ముఖ్యమంత్రి స్వాగత కార్యక్రమానికి పోలీసులు అడ్డుకున్నారని అప్పట్లో ఆరోపించారు. ఇటీవల జెడ్పీలో జరిగిన కీలక సమావేశానికి హాజరైనప్పుడూ, తాజాగా ఎచ్చెర్ల ఎమ్మెల్యే కళా వెంకట్రావు కుమారుడి పెళ్లి సందర్భంగా సీఎం వస్తారని హెలీప్యాడ్ వద్దకు స్వాగతం పలకడానికి వెళ్లే సమయంలోనూ పోలీసులు తనను అడ్డుకున్నారని ఆయన బహిరంగంగా వాపోయారు. అయితే శనివారం కూడా జిల్లాలోని పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చంద్రబాబు రాక నేపథ్యంలో శివాజీ తప్పకుండా వస్తారని భావించిన పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆయన్ను గుర్తుపట్టి కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ఎక్కడా ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఓ డీఎస్పీనే ఏర్పాటు చేశారు. శివాజీ వ స్తే అనుమతి పేరిట అడ్డు తగలొద్దని పోలీసు సిబ్బందికి ఆ శాఖ ఉన్నతాధికారులు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. ఎమ్మెల్యే గన్‌మెన్, డ్రైవర్లతో పోలీసులు టచ్‌లో ఉంటూ ‘సార్ ఎక్కడున్నార’ంటూ పదే పదే వాకబు చేసినట్టు తెలిసింది. ఆయన ముఖ కవళికలు ఫలనా విధంగా ఉంటాయని, ఆయన కారు నెంబర్ ఇది అని, ఆయన ఒక వేళ ఏమైనా ఆగ్రహం వ్యక్తం చేస్తే చూసీ చూడనట్టు వ్యవహరించండంటూ పోలీసు అధికారులు తమ కింది స్థాయి సిబ్బందికి సూచించినట్టు తెలిసింది. గతంలో శివాజీ హాజరైనప్పుడు పోలీసులు గుర్తు పట్టలేకపోవడంతో జిల్లా మంత్రి కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో శనివారం అలా జరగకుండా ప్రతి పోలీసు ఉన్నతాధికారీ జాగ్రత్త వహించారనే గుసగుసలు వినిపించాయి. నరసన్నపేటలో జరిగిన సీఎం బహిరంగ సభ కార్యక్రమానికి శివాజీ స్థానంలో ఆమె కుమార్తె కనిపించింది. అయినా పోలీసులు ఎక్కడా తగ్గకుండా ఆమెనూ గౌరవించారు. అదే విధంగా శివానీ ఇంజినీరింగ్ కళాశాలలో సీఎం రాకకు ఇంకా సమయం ఉండడంతో అప్పటికే అక్కడకు వచ్చిన శివాజీకి ఓ డీఎస్పీ ఏకంగా కుర్చీ వేసి రండిసార్ అంటూ షేక్‌హ్యాండ్ ఇచ్చి గౌరవ మర్యాదలు ప్రవర్తించారు. సీఎం వచ్చిన సమయంలో వేదిక వద్దకు తోడ్కొని వెళ్లారు. -
ఈనెల 6న ఢిల్లీ వెళ్లనున్న కేసీఆర్
న్యూఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 6వ తేదీన ఢిల్లీ వెళుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత ఆదివారం జరిగే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సులో ఆయన పాల్గొంటారు. మరో రెండు, మూడు రోజులు హస్తినలోనే మకాం వేయనున్న కేసీఆర్... ఈ సందర్భంగా రాష్ట్ర విభజన ఇబ్బందునలు మరోసారి కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లనున్నట్లు సమాచారం.