సీఎం చంద్రబాబునాయుడు మడకశిరకు వచ్చిన నేపథ్యంలో నియోజకవర్గంలోని సమస్యలపై సీఎంకు వినతి పత్రం ఇవ్వడానికి వచ్చిన బీజేపీ నాయకులకు ఛేదనుభవం ఎదురైంది.
మడకశిర : సీఎం చంద్రబాబునాయుడు మడకశిరకు వచ్చిన నేపథ్యంలో నియోజకవర్గంలోని సమస్యలపై సీఎంకు వినతి పత్రం ఇవ్వడానికి వచ్చిన బీజేపీ నాయకులకు ఛేదనుభవం ఎదురైంది. అయితే 25 మంది బీజేపీ నాయకులను అనుమతించమని స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తేల్చిచెప్పారు. ఇద్దరు లేదా ముగ్గురు వచ్చి సమస్యలపై వినతి పత్రం సమర్పించాలని సూచించారు. అందుకు బీజేపీ నాయకులు నిరాకరించారు.
ఈసందర్భంగా బీజేపీ నాయకుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ తాము టీడీపీతో కలిసి పని చేస్తున్నామని అయినా కూడా తమను ముఖ్యమంత్రి వద్దకు అనుమతించకపోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రంగనాథ్, జయరామ్, లెంకప్ప, నాగలింగప్ప, ముద్దరాజు, నాగేంద్రబాబు, చంద్రప్ప పాల్గొన్నారు.