madakasira
-
శ్రీసత్యసాయి జిల్లా మడకశిర సీఐ రాగిరి రామయ్య సస్పెన్షన్
-
AP: ఒంటరి మహిళపై వేధింపులు.. సీఐ సస్పెండ్
సాక్షి, శ్రీ సత్యసాయి: పోలీసు స్టేషన్లో ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన మడకశిర సీఐ రాగిరి రామయ్యను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ మేరకు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై బాధితురాలు డీఐజీ, ఎస్పీలకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది.జరిగింది ఇది..బంధువుల గొడవపై స్టేషన్‌కు వెళ్లిన తనతో మడకశిర సీఐ రాగిరి రామయ్య అసభ్యకరంగా మాట్లాడారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీకి ఓ మహిళ ఫిర్యాదు చేసింది. మడకశిర మండలం టీడీపల్లి తాండాకు చెందిన గాయత్రి శనివారం ఎస్పీ రత్నను కలిసి పోలీసు స్టేషన్లో తనకు జరిగిన అవమానాన్ని వివరించింది. ఎస్పీ వెంటనే స్పందించి సీఐ రామయ్యపై విచారణ జరపాలని మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీని ఆదేశించారు.అనంతరం పోలీస్ కార్యాలయం ఎదుట బాధితురాలు గాయత్రి మీడియాతో గోడు వెళ్లబోసుకొంది. టీడీపల్లి తాండాలో ఇంటికి సమీపంలోనే ఉన్న తన బంధవులు పొలం హద్దుల విషయంలో శుక్రవారం గొడవ పడ్డారని తెలిపింది. ఈ వివాదం పోలీసు స్టేషన్‌కు చేరిందని చెప్పింది. వారికి సర్ది చెప్పాలని తాము కూడా పోలీస్ స్టేషన్‌కు వెళ్లామంది. సీఐ రాగిరి రామయ్య వద్దకు వచ్చి రాజీ పడతామని, కేసు లేకుండా చేయాలని కోరినట్లు చెప్పింది.అయితే, సీఐ ఆ గొడవను పట్టించుకోకుండా రాత్రి 10 గంటల సమయంలో తనను ఒక్కదానినే చాంబర్లోకి పిలిచి అవమానకరంగా మాట్లాడారని తెలిపింది. ‘నీ భర్త ఏం చేస్తున్నారు? ఎలా విడిపోయారు? ఫ్యామిలీని ఎలా పోషిస్తావు? ఒంటరిగా ఎలా ఉంటున్నావు? ఏదైనా బిజినెస్ చేయి.. నేను సపోర్టు చేస్తా. నేను చాలా మంచి ఆఫీసర్ని’ అంటూ అసభ్యకరంగా మాట్లాడారని, తనను భయబ్రాంతులకు గురిచేశారని వివరించింది.వెంటనే తన స్నేహితుడు రామాంజనేయలుకు ఫోన్ చేయగా వారు స్టేషన్‌కు వచ్చి సీఐని నిలదీశారని, దీంతో ఇంటికి పంపించారని చెప్పింది. విచారణ పేరుతో సీఐ తనను ఎంతలా భయబ్రాంతులకు గురిచేశారో సీసీ కెమెరాల ఆధారంగా పరిశీలించి, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ రత్నను కోరినట్లు తెలిపింది. సీఐ రామయ్య నుంచి రక్షణ కల్పించాలని కోరినట్లు చెప్పింది. దీంతో, ఉన్నతాధికారులు తాజాగా సీఐని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక, సీఐ రామయ్యపై గతంలో కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. -
AP: నిన్న వీఆర్వో.. నేడు సీఐ.. మహిళలపై ఆగని వేధింపులు
సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. తాడిపత్రి వీఆర్వో వేధింపుల ఘటన మరువకముందే మరో ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. తాజాగా మడకశిరలో సీఐ.. ఓ మహిళను వేధింపులకు గురిచేశాడు. దీంతో, బాధితురాలు పుట్టపర్తి ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది.చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో మహిళలు, యువతులపై వేధింపులు పెరిగాయి. కూటమి నేతల అండతో కొందరు అధికారులు ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే మహిళలపై కొందరు ఉద్యోగుల లైంగిక వేధింపులు పాల్పడుతున్నారు. దీంతో, మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా మడకశిర పోలీసు స్టేషన్లో సీఐ రాగిరి రామయ్య.. ఓ మహిళను వేధింపులకు గురిచేసిన ఘటన బయటకు వచ్చింది.అయితే, కేసుతో సంబంధం లేకుండా సదరు సీఐ.. ఓ మహిళను రాత్రి 10 గంటల వరకు తన చాంబర్లోనే ఉంచారు. విచారణ పేరుతో ఆమెను లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. అనంతరం, బాధితురాలు.. ధైర్యం చేసుకుని సీఐ తనను లైంగికంగా వేధించారని పుట్టపర్తి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో, సీఐ అరాచకం వెలుగులోకి వచ్చింది.ఇదిలా ఉండగా.. తాడిపత్రి వీఆర్వో చంద్రశేఖర్ వేధింపుల ఘటన కూడా తాజాగా బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం 35వ వార్డుకు చెందిన లక్ష్మీని రెండేళ్ల కిందట భర్త వదిలేయడంతో తల్లి నాగమునెమ్మ దగ్గర ఉంటోంది. రేషన్‌కార్డు లేనందున కుమార్తెకు ఒంటరి మహిళ పింఛన్ రావడం లేదని.. తన కుమార్తెకు కార్డు మంజూరు చేయాలంటూ నాగమునెమ్మ ఏడాదిగా వీఆర్వో చంద్రశేఖర్‌ను బతిమాలుతూ వస్తోంది. పదే పదే వీఆర్వోను బతిమాలుతుండటంతో ఇదే అదునుగా భావించిన వీఆర్వో చంద్రశేఖర్ ‘నీ కూతురిని నా దగ్గరకు పంపించు. అప్పుడు రేషన్‌కార్డు ఇప్పిస్తా’ అని చెప్పడంతో ఆమె కన్నీటి పర్యంతమైంది. వీఆర్వో దుర్మార్గాన్ని వీడియోలో వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంత జరుగుతున్నప్పటికీ మహిళలను వేధించిన మడకశిర సీఐ, తాడిపత్రి వీఆర్వోలపై కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో, బాధితులు, ప్రజలు సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
మడకశిరలో బాలిక కిడ్నాప్
మడకశిర: శ్రీసత్యసాయి జిల్లాలో ఇంటర్ చదువుతున్న ఓ బాలిక కిడ్నాప్‌నకు గురైంది. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది. మడకశిర పట్టణ సమీపంలోని బేగార్లపల్లిలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలిక మడకశిర పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈనెల ఐదో తేదీ ఉదయాన్నే కళాశాలకని ఇంటి నుంచి బయల్దేరింది. రాత్రి వరకు ఎదురుచూసినా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు రాత్రంతా తమ కుమార్తె కోసం వెతికారు. బంధువుల ఇళ్లకేమైనా వెళ్లిందేమోనని ఆరా తీశారు. అయినా ఆచూకీ దొరకలేదు.మరుసటిరోజు శుక్రవారం మడకశిర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి మూడ్రోజులు గడిచినా పోలీసులు బాలిక ఆచూకీని గుర్తించలేదు. దీంతో బాలిక తల్లి శైలజ తీవ్ర మనోవేదనకు గురై సోమవారం ఇంట్లోనే పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటనే ఆమెను మడకశిర ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో బాలిక కుటుంబ సభ్యులు, బంధువుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. స్థానిక పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకుని ధర్నాకు దిగారు. పోలీసుల నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బాలిక తండ్రి జయరామప్ప కూడా పోలీస్‌స్టేషన్ ఎదుటే ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. బంధువులు, కుటుంబసభ్యులు ఆయన్ను వారించడంతో ప్రమాదం తప్పింది. ఈ సమాచారం అందుకున్న సీఐ రాజ్‌కుమార్ అక్కడికి చేరుకుని బాలిక కుటుంబ సభ్యులతో చర్చించారు. ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోవడంలేదని సీఐతో వారు వాగ్వాదానికి దిగారు. త్వరలోనే కిడ్నాపర్లను పట్టుకుని బాలికను క్షేమంగా అప్పగిస్తామని సీఐ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
ఈవీఎంలు మార్చేశారు
-
Madakasira: లోకలా.. నాన్ లోకలా?
మడకశిర: ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన మడకశిర రాజకీయం రసవత్తరంగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ....లోకల్, నాన్‌లోకల్ నినాదం ఊపందుకుంది. వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఈరలక్కప్ప పక్కా లోకల్ కాగా... టీడీపీ అభ్యర్థి ఎంఎస్ రాజు నాన్ లోకల్. దీంతో నియోజకవర్గ ప్రజలంతా గతంలో నాన్ లోకల్‌ను గెలిపించి పడిన ఇబ్బందులను గుర్తు చేసుకుంటున్నారు. లోకల్‌కే తమ మద్దతు అంటూ స్పష్టం చేస్తున్నారు.ఎంఎస్ రాజు నాన్ లోకల్..అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గానికి చెందిన ఎంఎస్ రాజును టీడీపీ అధినేత చంద్రబాబు మడకశిర టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఆయనకు మడకశిర నియోజకవర్గ ప్రజలతో ఏమాత్రం సంబంధాలు లేవు. అసలు మడకశిర నియోజకవర్గంపై కనీస అవగాహన కూడా లేదు. టీడీపీలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎంఎస్ రాజుకు మడకశిర టికెట్ కేటాయించారు. స్థానికులైన ఎంతో మంది దళిత నాయకులు దరఖాస్తు చేసుకున్నా... టీడీపీ హైకమాండ్ స్థానికేతరుడు ఎంఎస్ రాజుకు టికెట్ కేటాయించడంతో ఆ పార్టీ శ్రేణుల్లోనే వ్యతిరేకత వ్యక్తమైన విషయం తెలిసిందే. ‘లోకల్ ముద్దు...నాన్ లోకల్ వద్దు’ అంటూ టీడీపీ కార్యకర్తలే ఎంఎస్ రాజుకు వ్యతిరేకంగా ఆందోళనలు కూడా చేశారు. అయినా చంద్రబాబు స్థానికేతరుడికే మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో మడకశిర ప్రజలు నాన్‌లోకల్ వద్దంటే వద్దంటున్నారు. గతంలో స్థానికేతరులను గెలిపించి తీవ్రంగా నష్టపోయామని, మరోసారి ఆ తప్పు చేయబోమంటున్నారు.ఈరలక్కప్ప... పక్కా లోకల్గుడిబండ మండలం ఫళారం గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలి ఈరలక్కప్పకు వైఎస్సార్ సీపీ టికెట్ ఇచ్చింది. ఆయన నిరుపేద. ప్రభుత్వం ఇచ్చిన గృహంలో తల్లితో కలిసి ఉంటున్నారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని నియోజకవర్గ ప్రజలంతా మెచ్చుకుంటున్నారు. రాజకీయాల్లోకి నిరుపేదలు కూడా రావాలన్న సంకల్పం మంచిదంటున్నారు. ఈరలక్కప్ప 2006–2011 మధ్య గుడిబండ సర్పంచ్‌గా పని చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ కార్యాలయాల వద్దకు వచ్చే ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేసేవారు. అందువల్లే ప్రస్తుతం ఈరలక్కప్ప ఏ గ్రామానికి వెళ్లినా... ప్రజలు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. ఈరలక్కప్ప ఎమ్మెల్యే అయితే అందరికీ అందుబాటులో ఉండి సేవలందిస్తారని చెబుతున్నారు. సామాన్యుడికి జగన్ అవకాశం ఇచ్చారని, తప్పకుండా అసెంబ్లీకి పంపుతామంటున్నారు.ఎస్సీ సామాజిక వర్గం నుంచే రాజుపై తీవ్ర వ్యతిరేకత..టీడీపీ అభ్యర్థి ఎంఎస్ రాజును ఆ పార్టీలోని ఎస్సీ వర్గానికి చెందిన నాయకులే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పార్టీ కోసం పనిచేసిన తమను కాదని స్థానికేతరుడు, వివాదాస్పదుడైన ఎంఎస్ రాజుకు టికెట్ ఇవ్వడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ టికెట్ కోసం ఎస్సీ వర్గానికే చెందిన స్థానిక నాయకులు మాజీ ఎమ్మెల్యే ఈరన్న, మంజునాథ్, సుబ్బరాయుడు, జయకుమార్, కృష్ణమూర్తి, మల్లికార్జున తదితరులు ప్రయత్నించారు. అయితే టీడీపీ హైకమాండ్ మాజీ ఎమ్మెల్యే ఈరన్న తనయుడు సునీల్‌కు తొలుత టికెట్ కేటాయించింది. దాదాపు 50 రోజుల పాటు సునీల్ నియోజకవర్గంలో ప్రచారం చేశారు. చివరకు టీడీపీ తరఫున నామినేషన్ కూడా వేశారు. అయితే చివరి నిమిషంలో టీడీపీ అధినేత చంద్రబాబు సునీల్‌ను పక్కనపెట్టి ఎంఎస్ రాజుకు బీఫాం ఇచ్చారు. దీంతో స్థానిక ఎస్సీ వర్గాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈక్రమంలోనే కొందరు స్థానిక ఎస్సీ సంఘాల నాయకులు ఎంఎస్ రాజుకు వ్యతిరేకంగా ప్రకటనలు కూడా చేశారు. ఎంఎస్ రాజుపై 54 కేసులు ఉన్నాయని, అతను గెలిచినా పెద్దగా ఉపయోగం ఉండదంటున్నారు. వాయిదాల కోసం కోర్టుల చుట్టూ తిరగడానికే సమయం సరిపోతుందని చెబుతున్నారు. ప్రజలు కూడా ఆలోచించి స్థానికులకే పట్టం కట్టాలని కోరుతున్నారు.1983లో నాన్ లోకల్ అభ్యర్థిని చిత్తుగా ఓడించిన ప్రజలు..1983లో మడకశిర టీడీపీ అభ్యర్థిగా అనంతపురానికి చెందిన జగదోద్ధారకగుప్తా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో పలువురు స్థానికులు టికెట్ ఆశించినా ఎన్టీఆర్ పట్టించుకోలేదు. దీంతో మడకశిర వాసులు రగిలి పోయారు. ఆ ఎన్నికల్లో ఎన్టీఆర్ గాలి పెద్ద ఎత్తున వీచినా...మడకశిరలో మాత్రం స్థానికేతరుడైన టీడీపీ అభ్యర్థి జగదోద్ధారకగుప్తా చిత్తుగా ఓడిపోయారు. డిపాజిట్ కూడా దక్కలేదు. ప్రస్తుతం ఎంఎస్ రాజుకు ఇదే పరిస్థితి ఎదురవుతుందనే రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.స్థానికేతరుల హయాంలో అభివృద్ధికి నోచుకోని మడకశిర..మడకశిర 1962 నుంచి 1972 వరకు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా కొనసాగింది. ఆ పదేళ్లలో మూడుసార్లు అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. 1967, 1972 ఎన్నికల్లో స్థానికేతరులు మడకశిర నుంచి పోటీ చేశారు. 1967 స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన స్థానికేతరుడైన ఎంబీ రాజారావు గెలుపొందారు. అదే విధంగా 1972లో స్థానికేతరుడు యల్లప్ప కాంగ్రెస్ తరుఫున పోటీ చేసి గెలుపొందారు. కానీ వారిద్దరూ నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించారు. అసలు నియోజకవర్గ ప్రజలకే అందుబాటులో ఉండేవారు కాదు. దీంతో చిన్నచిన్న సమస్యలు కూడా ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. తాజాగా టీడీపీ స్థానికేతరుడైన ఎంఎస్ రాజుకు టికెట్ ఇవ్వడంతో నాటి రోజులను నియోజకవర్గ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. -
షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!
-
మడకశిరలో భగ్గుమన్న విభేదాలు..!
-
అసెంబ్లీ బరిలో కూలీ.. లక్కప్ప
-
మడకశిర టీడీపీ అభ్యర్థికి ఘెర పరాభవం
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: మడకశిర టీడీపీ అభ్యర్థి సునీల్ కుమార్‌కు ఘెర పరాభవం ఎదురైంది. సునీల్ కుమార్‌పై మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి వర్గీయులు చెప్పులతో దాడి చేశారు. మడకశిర పట్టణంలోని టీడీపీ నేత గుండుమల తిప్పేస్వామి ఇంటి వద్ద ఘటన జరిగింది. మడకశిర నియోజకవర్గంలో కొంత కాలంగా మాజీ ఎమ్మెల్యే ఈరన్న, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మధ్య వర్గపోరు సాగుతోంది. మాజీ ఎమ్మెల్యే ఈరన్న కొడుకు సునీల్ కుమార్‌కు చంద్రబాబు టికెట్ ఖరారు చేయగా, మద్దతు కోరేందుకు టీడీపీ అభ్యర్థి సునీల్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఈరన్న.. తిప్పేస్వామి ఇంటికెళ్లారు. దీంతో ఇద్దరిపైనా చెప్పులతో దాడి చేసి తరిమేశారు. మడకశిర టీడీపీ గ్రూపు రాజకీయాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అనంతపురం జిల్లా టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత అనంతపురం జిల్లా టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. శింగనమల టీడీపీ అభ్యర్థి గా బండారు శ్రావణి నియామకంపై అసంతృప్తి భగ్గుమంది. టూమెన్ కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి, ఆలం నరసానాయుడు ఆధ్వర్యంలో నిరసన జరిగింది. జిల్లా టీడీపీ కార్యాలయంపై అసమ్మతి నేతలు రాళ్లు రువ్వారు. టీడీపీ కార్యాలయంలో అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. చంద్రబాబు, లోకేష్‌లకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు. ఇదీ చదవండి: ‘తుప్పు పట్టిన సైకిల్-పగిలిపోయిన గ్లాసుకు గోల్డ్ కవరింగ్’ -
కలలో కూడా అనుకోలేదు.. థాంక్యూ సీఎం సార్
-
సామాజిక జైత్ర యాత్ర.. హోరెత్తిన మడకశిర
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: మడకశిర నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి ఆధ్వర్యంలో సామాజిక సాధికార బస్సు యాత్ర జరిగింది. మడకశిర పట్టణంలోని సరస్వతి విద్యామందిరం నుంచి వైఎస్సార్ సర్కిల్ దాకా బస్సు యాత్ర సాగింది. అనంతం వైఎస్సార్ సర్కిల్ లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యేలు డాక్టర్ తిప్పేస్వామి, శంకర్ నారాయణ, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్మన్ బోయగిరిజమ్మ, హిందూపురం వైఎస్సార్ సీపీ సమన్వయకర్త కురుబ దీపిక పాల్గొన్నారు. చంద్రబాబుకు విశ్వసనీయత లేదు. చంద్రబాబు ఇచ్చే హామీలను నమ్మొద్దు. మోసం చేయడం ఆయన అలవాటు. కులాలు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం జగన్‌దే. 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 175 సీట్లు ఖాయం -మంత్రి గుమ్మనూరు జయరాం చంద్రబాబు-పవన్ కళ్యాణ్ పొత్తు ఎలాంటి ప్రభావం చూపదు. తెలంగాణ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కంటే బర్రెలక్కకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగ చంద్రబాబు. కేసుల భయంతో ఏపీ ప్రయోజనాలు తాకట్టు పెట్టిన దుర్మార్గుడు చంద్రబాబు. సీఎం జగన్ పేదల పక్షపాతి -హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ -
నేటి సామాజిక సాధికార బస్సుయాత్ర షెడ్యూల్..
శ్రీసత్యసాయి జిల్లా: వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర జిల్లాలోని మడకశిర నియోజకవర్గంలో కొనసాగనుంది. ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరుగనుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు మంత్రులు, ఎమ్మెల్యేల మీడియా సమావేశం ఉండనుంది. మడకశిర పట్టణం లోని సరస్వతి విద్యామందిరం నుంచి వైఎస్సార్ సర్కిల్ వరకూ బస్సుయాత్ర సాగనుంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు మడకశిర వైఎస్సార్ సర్కిల్లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. -
శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో చిరుతపులుల హల్ చల్
-
మడకశిరలో చిరిగిన విస్తరాకులా టీడీపీ
సాక్షి, సత్యసాయి జిల్లా: మడకశిరలో టీడీపీ రెండు వర్గాలుగా విడిపోయింది. మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఒక వర్గానికి, మాజీ ఎమ్మెల్యే ఈరన్న మరొక వర్గానికి నాయకత్వం వహిస్తుండడంతో ఆ పార్టీ పరిస్థితి చిరిగిన విస్తరాకులా తయారైంది. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ వర్గపోరు తారాస్థాయికి చేరుకుంటోంది. ఈ క్రమంలోనే పార్టీలో ఇరువర్గాల నాయకులు ఎవరికివారు పైచేయి సాధించడానికి పరస్పరం ఫిర్యాదుల పర్వానికి తెరలేపారు. వైరి వర్గాల నేతలు నెలకు మూడు నాలుగు సార్లు మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వెళ్లి పెద్దలను కలిసి పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారు. చంద్రబాబును కలిసిన ఈరన్న వ్యతిరేక వర్గం టీడీపీ అధినేత చంద్రబాబును బుధవారం మాజీ ఎమ్మెల్యే ఈరన్న వ్యతిరేక వర్గం కలిసింది. టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మంజునాథ్, బీసీ సెల్ అధ్యక్షుడు తిప్పేస్వామి, టీడీపీ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి నరేష్ తదితరులు చంద్రబాబు, అచ్చెన్నాయుడుని కలిసి ఈరన్నకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని రాత పూర్వకంగా ఫిర్యాదు అందించారు. ఇప్పటికే గుండుమలపై ఫిర్యాదు.. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే ఈరన్న వర్గం కూడా మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి వర్గంపై ఫిర్యాదు చేసింది. మాజీ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో వర్గ పోరును ప్రోత్సహిస్తున్నారని, ఇన్చార్జ్కు వ్యతిరేకంగా పని చేస్తూ పార్టీ కట్టుబాట్లను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించింది. అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసిన అవినీతితో పార్టీ నష్టపోయిన తీరుపై కూడా మాజీ ఎమ్మెల్యే ఈరన్న వర్గం ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో మడకశిర టీడీపీ వ్యవహారం పార్టీ అధినేతకు తలనొప్పిగా మారింది. గతంలో చంద్రబాబు రెండు వర్గాల నేతలను మంగళగిరి పార్టీ కార్యాలయానికి పిలిపించి పంచాయతీ చేసి పంపినా ప్రయోజనం లేకుండా పోయింది. -
ఒకే మహిళతో ఇద్దరు వివాహేతర సంబంధం..
సాక్షి, సత్యసాయి జిల్లా(మడకశిర): పురుషాంగాన్ని కోసిన కేసులో నిందితుడిని మడకశిర పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను శనివారం మడకశిర పోలీస్ స్టేషన్లో ఎస్ఐ నాగేంద్ర వెల్లడించారు. మడకశిరలోని పాత, కొత్త ఎస్సీ కాలనీలకు చెందిన బాలకృష్ణ, నాని.. ఒకే మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఈ విషయంగా ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలో నానిపై కక్ష పెంచుకున్న బాలకృష్ణ ఎలాగైనా అతణ్ని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే ఈ నెల 21న రాత్రి మడకశిరలోని ఓ థియేటర్ వద్దకు నానిని రప్పించుకున్నాడు. అనంతరం థియేటర్ వెనుక ఉన్న ఖాళీ స్థలంలో ఇద్దరూ కలసి మద్యం సేవించారు. మద్యం మత్తులో నానితో గొడవ పడిన బాలకృష్ణ పక్కనే ఉన్న ఖాళీ సీసాతో నాని తలపై బలంగా కొట్టాడు. కట్టెలతో దాడి చేశాడు. ఘటనతో నాని స్పృహ కోల్పోయాడు. అనంతరం అక్కడే పడి ఉన్న గాజు ముక్కలు తీసుకుని దారుణంగా దాడి చేసిన బాలకృష్ణ పరారయ్యాడు. ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. శనివారం ఉదయం వడ్రపాళ్యం వద్ద తచ్చాడుతున్న బాలకృష్ణను గుర్తించి అరెస్ట్ చేశారు. -
Madakasira: తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత!
మడకశిర: శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో దాదాపు 40 కలర్ గ్రానైట్, మెటల్ క్వారీలు ఉన్నాయి. అన్నీ కర్ణాటక సరిహద్దుల్లోనే ఉండడం నిర్వాహకులకు కలిసివస్తోంది. రాత్రికి రాత్రే సులభంగా విలువైన ఖనిజాన్ని సరిహద్దులు దాటిస్తున్నారు. అగళి మండలం పీ బ్యాడిగెర క్వారీల్లో తీసిన కలర్ గ్రానైట్ దిమ్మెలకు కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భారీ డిమాండ్ ఉంటుంది. దక్షిణ భారతదేశంలోనే ఈ గ్రానైట్ చాలా నాణ్యమైంది. ఈ క్వారీల నిర్వాహకులు నెలకు రూ.కోట్లల్లో విలువ చేసే కలర్ గ్రానైట్ తరలిస్తారు. ఇందులో దాదాపు 50 శాతం అక్రమంగా రవాణా అవుతోంది. ఇక.. రొళ్ల మండలం హొట్టేబెట్ట వద్ద బుడ్డప్ప అనే వ్యక్తికి ప్రభుత్వం 3.09 ఎకరాల భూమికి డీపట్టా ఇచ్చింది. ఇందులో ఇతను ఎలాంటి అనుమతి పొందకుండా క్వారీ ప్రారంభించాడు. కర్ణాటకకు చెందిన వ్యక్తికి లీజుకిచ్చి కొన్ని నెలల పాటు అక్రమంగా కలర్ గ్రానైట్ దిమ్మెలు తీసి కర్ణాటకకు తరలించి సొమ్ము చేసుకున్నారు. స్థానికులు ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ అధికారులు వెళ్లి పనులను నిలిపివేశారు. మైనింగ్ అధికారులు మాత్రం ఇంత వరకు చర్యలు తీసుకోలేదు. మైనింగ్ చేయడానికి నిర్వాహకులు ముందుగానే గనులశాఖ నుంచి అనుమతి పొందాలి. అధికారులు క్యూబిక్ మీటర్ల ప్రకారం తవ్వకాలకు అనుమతి ఇస్తారు. హద్దులు కూడా నిర్ణయిస్తారు. ఆ ప్రకారం ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించి మైనింగ్ చేసుకోవాలి. అయితే క్వారీ నిర్వాహకులు వందల క్యూబిక్ మీటర్లకు అనుమతి పొంది వేల క్యూబిక్ మీటర్లలో మైనింగ్ చేసిన సంఘటనలు ఇటీవల సీజ్ చేసిన క్వారీల్లో వెలుగులోకి వచ్చాయి. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. మడకశిర కలర్ గ్రానైట్ చాలా నాణ్యంగా ఉంటుంది. దీంతో దీనికి చాలా డిమాండ్. తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో మడకశిర గ్రానైట్ చాలా ప్రసిద్ధి. ఇతర దేశాలకు కూడా ఇక్కడి నుంచి ఎగుమతి అవుతోంది. రూ.కోట్లలో క్వారీ నిర్వాహకులకు ఆదాయం లభిస్తుంది. దీంతో అందరి కన్ను మడకశిర గ్రానైట్‌పైనే పడుతోంది. మడకశిర ప్రాంతంలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై స్థానిక ఎమ్మెల్యే తిప్పేస్వామి ఇటీవల అమరావతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. గనులశాఖ డైరెక్టర్ వెంకటరెడ్డిని కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానిక మైనింగ్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఎమ్మెల్యే వారి దృష్టికి తీసుకెళ్లారు. విలువైన గ్రానైట్ సరిహద్దులు దాటుతున్నా మైనింగ్ శాఖ పత్తా లేదు. అక్రమ మైనింగ్‌పై స్థానిక పోలీసులే ఎక్కువ కేసులు నమోదు చేశారు. ఇటీవల కాలంలో మైనింగ్‌శాఖ అధికారులు పెద్దగా కేసులు నమోదు చేసిన దాఖలాలు లేవు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన ప్రారంభంలో మడకశిర ప్రాంతంలోని క్వారీలపై మైనింగ్‌శాఖ అధికారులు పెద్ద ఎత్తున దాడులు చేశారు. అక్రమంగా మైనింగ్ చేస్తున్న క్వారీలను సీజ్ చేసి రూ.కోట్లలో రాయల్టీ విధించారు. ప్రస్తుతం రూ. కోట్లల్లో అక్రమ రవాణా సాగుతున్నా, అటువైపు కన్నెత్తి చూడడం లేదు. మా దృష్టికి వస్తే చర్యలు మడకశిర ప్రాంతంలో అక్రమంగా మైనింగ్ నిర్వహిస్తున్నట్లు మా దృష్టికి వస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. సరిహద్దుల్లో ఉన్న క్వారీలపై ప్రత్యేక నిఘా పెట్టాం. అక్రమంగా మైనింగ్ చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదు. క్వారీల ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడానికి చర్యలు తీసుకుంటున్నాం. – బాలసుబ్రమణ్యం, ఏడీ, గనులశాఖ -
మిర్చి సాగు.. లాభాలు బాగు
మడకశిరరూరల్: ఎండు మిర్చి సాగు రైతులకు మంచి లాభాలు తెచ్చిపెడుతోంది. మడకశిర నియోజకవర్గంలో అధిక శాతం మంది రైతులు ఎండు మిర్చి సాగుకే మొగ్గు చూపుతున్నారు. ప్రతి ఏడాది వేరుశనగ సాగుతో నష్టాలు మూటకట్టుకుంటున్న రైతులు ఎలాగైనా సరే ఆర్థికంగా నిలదొక్కుకోవాలని మిర్చి సాగువైపు దృష్టిసారించారు. ప్రసుత్తం ఎండు మిరపకు మార్కెట్లో మంచి« ధర ఉండటంతో బోరుబావుల కింద ఎక్కువ మంది మిరప సాగు చేస్తున్నారు. 910 ఎకరాల్లో సాగు... మడకశిర, అగళి, అమరాపురం, గుడిబండ, రొళ్ల మండలాల్లో ఇప్పటికే 910 ఎకరాలకుపైగా సాగు చేసిన మిరప పంట ఆశాజనకంగా ఉంది. ఎక్కువ మంది రైతులు మిరప సాగు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. మిరప పైరు ఒక్కోటి రూ.75 పైసాలు కాగా ఎకరా పంట సాగుకు మిరప పైరుకు రూ.12 వేలు ఖర్చు అవుతోంది. ఎకరాకు రూ.లక్ష ఆదాయం కృషాజలాలకు తోడు భారీ వర్షాలు కురవడంతో చెరువులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. బోరు బావుల్లోనూ నీటి మట్టం పెరగడంతో మిరప పంట సాగు చేయడానికి రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఎకరా పంట సాగుకు మిరప పైరు, మందులు, ఎరువులకు రూ.25 వేల వరకు పెట్టుబడి అవుతోంది. మార్కెట్లో ప్రసుత్తం 10 కిలోల ఎండు మిరప రూ.2,500 వరకు ధర పలుకుతోంది. తెగుళ్లు సోకకపోతే ఎకరాకు రూ.లక్ష దాకా ఆదాయం ఉంటుందని రైతులు చెబుతున్నారు. వైఎస్సార్ బీమా వర్తింపుతో... రాష్ట్ర ప్రభుత్వం మిరప పంటకు వైఎస్సార్ ఉచిత పంటల బీమా వర్తింపజేయడంతో అధిక శాతం మంది రైతులు మిర్చి సాగుపై మరింతగా ఉత్సహం చూపుతున్నారు. వర్షాలకు పంట దెబ్బతింటే ఎకరా మిరప పంటకు రూ.60 వేల చొప్పున బీమా వర్తిస్తోంది. బీమా వర్తింపు హర్షణీయం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మిరప పంటకి వైఎస్సార్ ఉచిత పంటల బీమా చెల్లించడం చాలా సంతోషంగా ఉంది. మిర్చి పంట సాగుతో ఆదాయం పొందుతున్నాం. అర్ధ ఎకరాకు పైగా మిరప పంట సాగు చేశా. గతంలో ఏ ప్రభుత్వం మిరపకు బీమా మంజూరు చేయలేదు. – నాగరాజు, రైతు, ఎల్లోటి పదేళ్లుగా మిర్చి సాగు బోరు బావి కింద పదేళ్లుగా మిర్చి పంటను సాగు చేస్తున్నాను. సాగు చేసిన నెల తర్వాత మెదటి క్రాప్ మిపర కాయలను తొలగించుకోవచ్చు. ప్రసుత్తం మార్కెట్లో మిర్చి ధర బాగా ఉంది. మిరప పంట సాగు ద్వారా మంచి ఆదాయం పొందుతున్నాను. – ఆవులప్ప , రైతు, మడకశిర అవగాహన కల్పిస్తున్నాం మిర్చి పంటకు ప్రభుత్వం ఎకరాకు రూ. 60వేలు వైఎస్సార్ ఉచిత బీమా వర్తింపజేస్తోంది. బోరు బావుల్లో నీటి మట్టం పెరగడంతో గతంలో కంటే ఈ ఏడాది రైతులు మిరప పంటసాగుపై దృష్టి సారిస్తున్నారు. మిరప పంటకు తెగుళ్లు సోకకుండా వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల పరిధిలోని రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. – చిన్న రెడ్డయ్య, ఉద్యానశాఖ అధికారి, మడకశిర -
వైఎస్సార్ వరమిస్తే.. సీఎం జగన్ సాకారం చేశారు
మడకశిర.. జిల్లా సరిహద్దులో ఉన్న నియోజకవర్గం. వ్యవసాయం తప్ప మరో వ్యాపకం తెలియని జనం. అందుకే యువత ఉపాధి కోసం పెద్దసంఖ్యలో సమీపంలోని కర్ణాటకకు వలసవెళ్తోంది. ఈ క్రమంలో ఈ నియోజకవర్గ అభివృద్ధికి జగన్ సర్కార్ చర్యలు చేపట్టింది. ఇప్పటికే నియోజవకర్గంలోని అన్ని చెరువులనూ కృష్ణా జలాలతో నింపేందుకు రూ. 214.కోట్లు విడుదల చేసింది. తాజాగా ఈ ప్రాంత వాసుల దశాబ్దాల కలను సాకారం చేసేందుకు పారిశ్రామికవాడ ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. మడకశిర: మండలంలో పారిశ్రామికవాడ ఏర్పాటుకు ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాంతంలో పారిశ్రామికవాడకు దివంగత నేత వైఎస్సార్ హయాంలోనే బీజం పడింది. అప్పట్లోనే మడకశిర మండలం గౌడనహళ్లి, ఛత్రం, ఆర్. అనంతపురం గ్రామ పంచాయతీల పరిధిలో 800 మంది రైతుల నుంచి 1,600 ఎకరాల భూమిని సేకరించారు. అయితే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దీనిపై శ్రద్ధ చూపలేదు. భూములిచ్చిన రైతులకు చంద్రబాబు హయాంలో పూర్తి స్థాయిలో నష్టపరిహారం కూడా చెల్లించ లేదు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక బకాయిపడ్డ రూ.25 కోట్ల నష్ట పరిహారాన్ని రైతులకు అందించి పారిశ్రామిక వాడ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వసతులు పుష్కలం పారిశ్రామిక వేత్తలు సౌకర్యాలన్నీ చూశాకే పరిశ్రమల స్థాపనకు ముందుకువస్తారు. మడకశిరపరంగా చూస్తే కావాల్సిన వసతులన్నీ అందుబాటులో ఉన్నాయనే చెప్పాలి. అంతర్జాతీయ విమానాశ్రయమున్న బెంగళూరు కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో పరిశ్రమల ఏర్పాటుకు పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు ముందుకువచ్చే అవకాశ ముంది. అదే విధంగా రాయదుర్గం నుంచి మడకశిర మీదుగా తుమకూరు వరకూ ప్రస్తుతం రైల్వేలైన్ నిర్మాణం కూడా జరుగుతోంది. ఇప్పటికే పారిశ్రామికవాడకు చుట్టుపక్కలున్న చెరువులకు ఏటా కృష్ణా జలాలు అందుతున్నాయి. వీటితో పాటు మడకశిర–కర్ణాటకలోని ముఖ్యమైన పట్టణాల మధ్య జాతీయ రహదారుల అనుసంధానం పెరిగింది. ఇవన్నీ పారిశ్రామికవాడ అభివృద్ధికి దోహదం చేస్తాయనడంలో సందేహం లేదు. చదవండి: (CM Jagan: వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్) ఏపీఐఐసీకి 1,443 ఎకరాల భూమి అప్పగింత మడకశిర కేంద్రంగా ఏర్పాటు చేసే పారిశ్రామికవాడ వేగంగా ప్రగతి సాధించేలా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. ఇందులో భాగంగా పారిశ్రామికవేత్తలను ఆకర్షించడానికి అవసరమైన చర్యలను చేపట్టింది. పరిశ్రమలు ఏర్పాటుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు జాప్యం జరగకుండా భూ కేటాయింపునకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్)కు 1,443 ఎకరాల భూమిని వెంటనే అప్పగించింది. రెండు పరిశ్రమలకు భూమి కేటాయింపు ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో మౌలిక వసతులు కల్పించి పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూమిని కేటాయించే ప్రక్రియను ప్రారంభించింది. ఇప్పటికే బెంగళూరుకు చెందిన ఇద్దరు పారిశ్రామికవేత్తలకు ప్లాస్టిక్ వస్తువుల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు అర ఎకరా చొప్పున భూమిని కేటాయించింది. అంతేకాకుండా బెంగళూరు చెందిన పలువురు పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూమిని కేటాయించాలని కోరుతూ ఏపీఐఐసీకి దరఖాస్తులు చేసుకున్నట్లు తెలిసింది. వీరికి కూడా భూమి కేటాయించడానికి ఏపీఐఐసీ ప్రక్రియను ప్రారంభించింది. ఇలా ఒక్కో పరిశ్రమ ఏర్పాటవుకు అడుగులు పడుతుండగా...నిరుద్యోగుల కల సాకారమయ్యే రోజు ఎంతో దూరం లేదని తెలుస్తోంది. చదవండి: (వారానికోసారి కట్టించేసుకోండి) పారిశ్రామికవాడ అభివృద్ధికి చర్యలు మడకశిర పారిశ్రామికవాడ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం 1,443 ఎకరాల భూమిని ఏపీఐఐసీకి అప్పగించింది. ఇప్పటికే రెండు చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు ఎకరా భూమి కేటాయించాం. పరిశ్రమల ఏర్పాటుకు చాలా మంది ముందుకు వస్తున్నారు. ఇప్పటికే దరఖ>స్తులు కూడా సమర్పించారు. వారికి నిబంధనల మేరకు భూములు కేటాయిస్తాం. పారిశ్రామికవాడ అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి అనుకూల వాతావరణం ఉంది. – మల్లికార్జున్, జిల్లా మేనేజర్, ఏపీఐఐసీ మడకశిర సమగ్రాభివృద్ధి మడకశిరను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం జగన్ నేతృత్వంలో అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. పరిశ్రమలు ఏర్పాటైతే స్థానికులకు 75 శాతం ఉపాధి అవకాశాలు లభిస్తాయి నిరుద్యోగుల జీవితాలు బాగు పడుతాయి. యువతకు ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేస్తున్నాం. –డాక్టర్ తిప్పేస్వామి, ఎమ్మెల్యే, మడకశిర స్థానికంగానే ఉపాధి మడకశిర కేంద్రంగా పారిశ్రామికవాడ ఏర్పాటు కావడం ఎంతో సంతోషంగా ఉంది. ఎమ్మెస్సీ పూర్తి చేశా. ఉద్యోగ వేటలో ఉన్నా. స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటైతే తప్పకుండా ఇక్కడే ఉద్యోగం దొరుకుతుంది. అమ్మానాన్నలను చూసుకుంటూ ఇక్కడే ఉండవచ్చు. ఇంతటి అవకాశమిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటాం. – శోభ, దొక్కలపల్లి, అగళి మండలం కల నెరవేరింది నిరుద్యోగులు ఏళ్ల తరబడిగా పారిశ్రామికవాడ కోసం ఎదురు చూస్తున్నాం. మాలాంటి వారి కలను వైఎస్ జగన్ నెరవేరుస్తుండడం ఎంతో గొప్ప విషయం. నేను బీటెక్ పూర్తి చేసినా సరైన ఉద్యోగం దొరకలేదు. పారిశ్రామికవాడలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటైతే మంచి ఉద్యోగం వస్తుందని ఆశిస్తున్నా. – మంజునాథ్, మడకశిర 75 శాతం ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం తీసుకొచ్చిన జీఓ ప్రకారం పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు లభిస్తాయి. ఈ ప్రాంతం నుంచి ఎంతోమంది నిరుద్యోగులు ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. ఇప్పుడు పారిశ్రామికవాడ ఏర్పాటై పరిశ్రమల స్థాపన జరిగితే వీరందరూ తిరిగి స్వగ్రామాలకు వస్తారు. – కృష్ణయాదవ్, ఆర్ గొల్లహట్టి, రొళ్ల మండలం -
MLA Thippeswamy: నేను క్షేమంగానే ఉన్నా.. ఎమ్మెల్యే తిప్పేస్వామి
మడకశిర (సత్యసాయి జిల్లా): తాను క్షేమంగానే ఉన్నట్లు మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి తెలిపారు. కర్ణాటకలోని కోలారు జిల్లా ముళబాగిలు వద్ద సోమవారం రాత్రి ఎమ్మెల్యే కారు, ఓ మినీ ట్రాక్టర్ ఢీకొన్నాయి. మంగళవారం ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఈ విషయం చక్కర్లు కొట్టడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు, నియోజకవర్గ ప్రజలు ప్రమాదంలో ఎమ్మెల్యేకు ఏమైందోనని ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే తిప్పేస్వామి ‘సాక్షి’తో మాట్లాడి టెన్షన్‌కు తెరదించారు. ప్రమాదం జరిగిన సమయంలో అసలు తాను కారులోనే లేనని ఆయన తెలిపారు. బెంగళూరులో తనను వదిలిన అనంతరం కారు డ్రైవర్ తిరుపతికి వస్తున్న సమయంలో ప్రమాదం జరిగిందన్నారు. తాను క్షేమంగానే ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. చదవండి👉 ఆత్మకూరు ఉప ఎన్నికలో పోటీచేసే అభ్యర్థులకు ‘ఆన్లైన్ అవకాశం’ -
CM YS Jagan: మడకశిరకు వైఎస్ జగన్ మరో వరం
సాక్షి, మడకశిర: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మడకశిరకు మరో వరం ప్రకటించారు. కొన్ని రోజుల క్రితమే నియోజకవర్గంలోని అన్ని చెరువులనూ కృష్ణా జలాలతో నింపే బైపాస్ కెనాల్ ఏర్పాటుకు రూ.214.85 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో మడకశిర కేంద్రంగా పారిశ్రామిక వాడ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఈ ఏడాది ఐదు నెలల్లోపే మడకశిరకు రెండు భారీ ప్రాజెక్టులు ప్రకటించడంపై నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 1,600 ఎకరాల భూ సేకరణ.. మడకశిరలో పారిశ్రామికవాడ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 1,600 ఎకరాల భూమిని సేకరించింది. ఆర్.అనంతపురం, ఛత్రం, గౌడనహళ్లి గ్రామ పంచాయతీల పరిధిలోని రైతుల నుంచి సేకరించిన ఈ భూములను ఏపీఐఐసీకి అప్పగించారు. ఇందుకు సంబంధించి 800 మంది రైతులకు పరిహారాన్ని సైతం ప్రభుత్వం అందజేసింది. వైఎస్సార్ హయాంలోనే ఈ మొత్తం ప్రక్రియ పూర్తి అయింది. చదవండి: (తప్పు చేశా.. అందుకు తలవంచుకుంటున్నా!) నీరుగార్చిన టీడీపీ ప్రభుత్వం.. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే భూ సేకరణ జరగగా... తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పారిశ్రామిక వాడ ఏర్పాటుపై శీతకన్ను వేశాయి. గత టీడీపీ ప్రభుత్వం మరో అడుకు ముందుకేసి అదిగో.. ఇదిగో అంటూ కాలం నెట్టుకొచ్చింది. వైఎస్సార్ హయాంలో 50 శాతం పరిహారాన్ని రైతులకు అందజేయగా.. మిగిలిన 50 శాతం పరిహారం చెల్లింపు విషయంలో టీడీపీ ప్రభుత్వం పూర్తి ఉదాసీనత కనబరిచింది. దీంతో పారిశ్రామిక వాడ ఏర్పాటు అంశం నీరుగారిపోయింది. ఈ దశలో దాదాపు రూ.25 కోట్ల మిగులు పరిహారాన్ని రైతులకు వైఎస్ జగన్ ప్రభుత్వం చెల్లించి పారిశ్రామిక వాడ ఏర్పాటుకు మార్గం సుగమమం చేసింది. సీఎం వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటాం మడకశిర కేంద్రంగా పారిశ్రామిక వాడ ఏర్పాటుకు మంత్రి వర్గం ఆమోదం తెలపడంపై స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి హర్షం వ్యక్తం చేశారు. గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. మడకశిర అభివృద్ధికి సహకరిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారని పేర్కొన్నారు. పరిశ్రమల ఏర్పాటుతో స్థానిక నిరుద్యోగ యువతకు విస్తృత ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దక్కుతాయన్నారు. -
సీఎం జగన్‌తో ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల భేటీ
సాక్షి, మడకశిర (సత్యసాయి జిల్లా): ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి కుటుంబ సభ్యులు గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన సతీమణి సత్యవాణి, కుమారులు డాక్టర్ స్వామి దినేష్, డాక్టర్ స్వామి రాజేష్, స్వామి మహేష్ దంపతులు ముఖ్యమంత్రిని కలిశారు. మడకశిర బైపాస్ కెనాల్ నిర్మాణానికి రూ.214.85 కోట్ల నిధులను మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్పినట్లు ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గంలోని పలు సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. మడకశిర నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్నారు. చదవండి: (యూజీసీ కంటే అడుగు ముందే ఏపీ) -
ప్రాణం ఉన్నంత వరకు సీఎం జగన్ వెంటే: తిప్పేస్వామి
మడకశిర(సత్యసాయి జిల్లా): మంత్రి పదవి రాలేదని తనకు అసంతృప్తి లేదని ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి తెలిపారు. సోమవారం ఆయన ఫోన్లో మాట్లాడారు. ప్రాణం ఉన్నంత వరకు తాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంటే ఉంటానని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలన్నదే తన ఆశయమన్నారు. మంత్రి పదవి దక్కక పోవడంతో తాను అసంతృప్తితో ఉన్నట్లు మీడియా అసత్యప్రచారం చేసిందన్నారు. తాను 40 ఏళ్ల నుంచి వైఎస్ కుటుంబం వెంటే ఉన్నానని పేర్కొన్నారు. చదవండి: నెరవేరబోతున్న మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కల.. తనకు వైఎస్సార్ 1999లో చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారన్నారు. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి 2014, 2019లో మడకశిర ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం కల్పించారని తెలిపారు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్సార్ కుటుంబానికి విశ్వాస పాత్రుడిగా ఉంటానని తెలిపారు. కొందరు కావాలనే ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులు ఇలాంటి ప్రచారాలు నమ్మొద్దని కోరారు. -
టీడీపీ: పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున బట్టబయలైన విభేదాలు
సాక్షి, అనంతపురం: ‘అనంత’ టీడీపీ అతుకుల బొంతగా మారింది. ఒకప్పుడు కంచుకోటగా గొప్పలు చెప్పుకున్న జిల్లాలో ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. అంతర్గత కుమ్ములాటతో కేడర్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అధికారంలో ఉన్నన్నాళ్లూ విక్టరీలు చూపించిన నేతలంతా... 2019 ఎన్నికల్లో తర్వాత పార్టీకి..ప్రజలకూ పూర్తిగా దూరమయ్యారు. మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎవరికి వారు ప్రయత్నాలు సాగిస్తున్నారు. నియోజక వర్గాలే సామంతరాజ్యాలుగా భావించి పావులు కదుపుతున్నారు. ప్రతినియోజకవర్గంలోనూ రెండు మూడు గ్రూపులు. ఇద్దరు ముగ్గురు నాయకులు. మార్చి 29వ తేదీతో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నలభై ఏళ్లు నిండిన నేపథ్యంలో జిల్లాలో మంగళవారం జరిగిన పార్టీ కార్యక్రమాలు వర్గవిభేదాలకు అద్దం పట్టాయి. ఏ నియోజకవర్గంలోనూ నేతలంతా కలిసి ఒకే వేదికపైనుంచి కార్యక్రమాలు నిర్వహించిన దృశ్యం కనిపించలేదు. మడకశిరలో లుకలుకలు మడకశిర నియోజకవర్గంలో టీడీపీ ఇన్చార్జి ఈరన్న, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రెండు వర్గాల నాయకులను ఇటీవలే మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి పిలుపించుకుని మాట్లాడారు. కలిసి కట్టుగా పనిచేయాలని ఆదేశించారు. అయినా వేర్వేరుగానే అన్ని కార్యక్రమాలూ నిర్వహిస్తుండటంతో కార్యకర్తలు కూడా తలోవైపు వెళ్లిపోయారు. పెనుకొండలో బీకే పార్థసారథి లేకుండానే ఎన్టీఆర్ విగ్రహం వద్ద సంబరాలు జరుపుతున్న సవిత జేసీ..పరిటాలపై అసమ్మతి సెగలు జేసీ బ్రదర్స్ వ్యవహారంపై జిల్లాలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. నిన్నటికి నిన్న పుట్టపర్తిలో జేసీ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే టికెట్ పల్లె రఘునాథరెడ్డికి కాకుండా మరొకరికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో వెంటనే పల్లె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మరోవైపు జేసీ వర్గానికి ప్రభాకర్‌చౌదరి వర్గానికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. జేసీ వర్గానికి అనంతపురంలో ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ ఇవ్వడానికి వీల్లేదంటూ జిల్లాలో చాలామంది పావులు కదుపుతున్నారు. ఇటీవల ప్రభాకర్ చౌదరి పాదయాత్ర చేస్తే ఎవరూ మద్దతు ఇవ్వలేదు. మరోవైవు మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరిని ఎట్టిపరిస్థితుల్లో పార్టీలో చేర్చుకునే ప్రసక్తి లేదని పరిటాల శ్రీరాం తేల్చి చెప్పారు. బహిరంగంగానే సూరిపై విమర్శలు చేశారు. గుంతకల్లులో నాలుగు స్తంభాలాట గుంతకల్లు నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి స్తంభాలాటగా మారింది. గుంతకల్లులో నియోజకవర్గ ఇన్చార్జ్ జితేంద్రగౌడ్ నాయకత్వంలో పరిటాల శ్రీరాములు కళ్యాణమండపంలోను, పట్టణ అధ్యక్షుడు బండారు ఆనంద్ వర్గం బీరప్పగుడి సర్కిల్ సమీపంలోనూ వేడుకలు నిర్వహించారు. గుత్తిలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకటశివుడుయాదవ్ నేతృత్వంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు జరిగాయి. వాస్తవానికి వెంకటశివుడుయాదవ్, బండారు ఆనంద్‌కు పార్టీ ఇన్చార్జి జితేంద్రగౌడ్ నుంచి ఎలాంటి ఆహ్వానం కానీ సమాచారం కానీ అందలేదని తెలుస్తోంది. ఈ నలుగురు నాయకులు రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పటి నుంచే పార్టీ కేడర్‌పై పెత్తనం కోసం పావులు కదుపుతున్నారు. గుంతకల్లులో బండారు ఆనంద్ నేతృత్వంలో టీడీపీ జెండాను ఆవిష్కరిస్తున్న దృశ్యం పెనుకొండలో ఎడమొహం.. పెడమొహం పెనుకొండలో నిర్వహించిన టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి, కురుబ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ సవిత ఎడమొహం పెడమొహంగా కనిపించారు. స్కూటర్ ర్యాలీలోనూ అలాగే వ్యవహరించారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ తమకంటే తమకే వస్తుందని ప్రచారం చేసుకుంటుండటంతో కేడర్ అయోమయంలో పడింది. ఇదిలా ఉండగా మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప పార్టీ ఆవిర్భావ వేడుకలకు దూరంగా ఉన్నారు. బీకే వ్యవహారం నచ్చకే ఆయన ఇంటికి పరిమితమయ్యారని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. అటు అత్తార్..ఇటు కందింకుట కదిరిలో రెండు గ్రూపులుగా విడిపోయి టీడీపీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకటప్రసాద్ తన అనుచరులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించగా, మరో వైపు మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా తన వర్గంతో కలిసి అత్తార్ రెసిడెన్సీలో సమావేశం నిర్వహించారు. కాబోయే ఎమ్మెల్యే అభ్యర్థి అత్తార్ చాంద్‌బాషా అంటూ అనుచరులు గట్టిగా నినాదాలు చేశారు. ఇంకోవైపు కందికుంట వర్గం ఈసారి కూడా టికెట్ కందికుంట అన్నకే..అని ఈలలు, కేకలు వేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. రాయదుర్గంలో ఉనికి కోసం.. రాయదుర్గంలో మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ వేడుకలకు వస్తే రూ.500తో పాటు మద్యం పంపిణీ చేస్తామని గుమ్మఘట్టకు చెందిన ఓ నాయకుడు కార్యకర్తలకు నమ్మబలికాడు. వచ్చిన తర్వాత నగదు ఇచ్చి మద్యం పంపిణీని విస్మరించడంతో కార్యకర్తలు మద్యం షాపుల వద్ద బండ బూతులు తిట్టారు. రాయదుర్గంలో కూడా రూ.300 నగదు, మద్యం ఇస్తామని చెప్పి మాట తప్పారని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికి వారే యమునా తీరే.. కళ్యాణదుర్గంలో ఉన్నం హనుమంతరాయ చౌదరి, మహేశ్వర నాయుడు ఎవరికి వారు ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా గ్రూపులుగా విడిపోయి కార్యక్రమాలు నిర్వహించడంతో కార్యకర్తలు అయోమయానికి గురయ్యారు. ఎటు వెళ్లాలో తెలియక కొందరు దూరంగా వెళ్లిపోయారు. -
వారు తెలుగువారే.. కర్ణాటకలో ఉద్యోగాలు చేస్తుంటారు!
అమరాపురం: వారు తెలుగువారే. అయినా కన్నడ మాట్లాడతారు. కన్నడ మాధ్యమంలో చదువుకుంటారు. కర్ణాటకలో ఉద్యోగాలు చేస్తుంటారు. అంతేనా.. వివాహ, వ్యాపార సంబంధాలు సైతం కన్నడిగులతోనే. రాష్ట్రాలు వేరైనా ఇరు ప్రాంతాల వారూ అన్నదమ్ముల్లా కలసిమెలసి ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారు. ఆచార, వ్యవహారాలు కూడా ఒకే విధంగా పాటిస్తున్నారు. ఇదీ అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని కర్ణాటక సరిహద్దుకు ఆనుకుని ఉన్న గ్రామాల పరిస్థితి. మడకశిర నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉన్నాయి. మడకశిర మినహా మిగిలిన అమరాపురం, అగళి, రొళ్ల, గుడిబండ మండలాల్లో ప్రజల మాతృభాష కన్నడ. ఇంటిలోనే కాదు ప్రభుత్వ కార్యాలయాలు, సమావేశాలు ఎక్కడైనా సరే కన్నడంలోనే మాట్లాడుతారు. అమరాపురం మండల కేంద్రానికి ఏడు కిలో మీర్ల దూరంలో నిద్రగట్ట పంచాయతీ ఉంది. ఈ పంచాయతీ పరిధిలోని హెచ్బీఎన్ కాలనీ కర్ణాటక సరిహద్దుకు ఆనుకుని ఉంది. పక్కనే కర్ణాటకలోని లక్కనహళ్లి గ్రామం ఉంది. రాష్ట్రాలు, భాషలు వేరైన ఈ రెండు గ్రామాలకు మధ్యన సరిహద్దుగా రోడ్డు ఉంది. కేవలం మూడు అడుగులే దూరం. రోడ్డుకు ఒకపైపు ఆంధ్రప్రదేశ్.. మరొక వైపు కర్ణాటక రాష్ట్రం ఉంటాయి. నిద్రగట్ట పంచాయతీ పరిధిలో నిద్రగట్ట, ఎన్.గొల్లహట్టి, యర్రగుంటపల్లి, హెచ్బీఎన్ కాలనీలు ఉన్నాయి. ఈ గ్రామాల్లోని విద్యార్థులు కర్ణాటకలోని లక్కనహళ్లి పాఠశాలకు వెళ్లి చదువుకుంటారు. ఆంధ్రప్రదేశ్ వాసులే అయినప్పటికీ వీరి మాతృభాష మాత్రం కన్నడే. తెలుగు పాఠశాలల్లో చదివినా.. అక్కడ వారు మాట్లాడేది కన్నడ భాషే. దీంతో హెచ్బీఎన్కాలనీ, కెంపక్కనహట్టి గ్రామాల్లో రెండు కన్నడ పాఠశాలలు ఉన్నాయి. బెంగళూరు, తుమకూరు, దావణగెర పట్టణాల్లో కూడా మన తెలుగువారు చదువుకుంటున్నారు. శిర, హిరియూరు, తుమకూరు, పావగడ, మధుగిరి, తదితర ప్రాంతాల్లో తమ పిల్లలకు వివాహాలు కుదుర్చుకుంటున్నారు. వ్యాపార, వాణిజ్య సంబంధాలు, స్థలాలు, పొలాలు సైతం రెండు ప్రాంతాల వారివీ అటు – ఇటు కొనసాగుతున్నాయి. అన్నదమ్ముల్లా ఉంటాం రాష్ట్రాలు వేరైనా గ్రామం వేరైనా ఒకేభాష మాట్లాడుకుంటూ అన్నదమ్ములా కలిసిమెలసి ఉంటున్నాం. మాకు రెండు భాషలు వస్తాయి. తెలుగుతో పాటు కన్నడను అనర్గళంగా మాట్లాడుతాము. నా కూతురు కర్ణాటకలోని మైసూరు యూనివర్సిటిలో చదివించా. పిహెచ్డీ చేయించా. మాకు చాలా అనుకూలమైన ప్రాంతం. దీంతో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మూడడుగులు వేస్తే కర్ణాటక లక్కనహళ్లిలో ఉంటాము. రెండు గ్రామాల్లో ఏ శుభకార్యాలు జరిగినా కలిసిమెలసి జరుపుకుంటాం. –రాజన్న, హెచ్బీఎన్ కాలనీ, అమరాపురం మండలం పరస్పర సహకారం మాకు రాష్ట్రాలు అనే భేద భావం లేదు. అన్నదమ్ముల్లా కలసి ఉంటాం. ఆంధ్ర ప్రాంత ప్రజలు మా గ్రామాల్లో పని చేయడానికి కూలికి వస్తారు. మేము పని ఉంటే ఆంధ్రాకు వెళతాం. హెచ్బీఎన్ కాలనీ ప్రజలు తెలుగు, కన్నడ బాగా మాట్లాడుతారు. మాకు తెలుగు రాదు. అయినా అర్థం చేసుకుని కన్నడలో మాట్లాడుతాం. –రవికుమార్, లక్కనహళ్లి, కర్ణాటక రాష్ట్రం సంబంధాలు బలపడుతన్నాయి పొరుగునే కర్ణాటక రాష్ట్రం ఉండడంతో తమ సంబంధ బాంధవ్యాలు ఎక్కువగా ఆ రాష్ట్రంలోనే జరుపుతున్నాం. పిల్లల్ని కూడా అక్కడే చదివిస్తున్నాం. పెళ్లిళ్లు ఎక్కువగా కర్ణాటకలోనే చేస్తున్నాం. ఆచార వ్యవహరాలు, భోజనం తదితర అన్నీ ఒక్కటిగానే ఉంటాయి. ఇక్కడ ప్రధాన వంటకం రాగి ముద్ద. –నాగన్న, హెచ్బీఎన్ కాలనీ, అమరాపురం మండలం చక్కగా మాట్లాడుతారు లక్కనహళ్లిలోని కన్నడ పాఠశాలకు నిద్రగట్ట పంచాయతీ నుంచి అధిక మంది విద్యార్థులు వస్తున్నారు. చక్కగా చదువుకుంటున్నారు. నేను కన్నడ బోధిస్తా. మా కన్నడిగుల కంటే తెలుగు ప్రాంత విద్యార్థులకే అధిక మార్కులు వస్తున్నాయి. ఇక్కడ చదివిన విద్యార్థులు బెంగళూరు, మైసూరు తదితర ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగులుగా స్థిర పడ్డారు. –జయరామ్, కన్నడ టీచర్, లక్కనహళ్లి ఉన్నత పాఠశాల ఏపీలో ఉద్యోగావకాశాలు కల్పించాలి నేను ఒకటో తరగతి నుంచి కన్నడ పాఠశాలలోనే చదువుకున్నా. ప్రస్తుతం సెకెండ్ పీయూసీ చేస్తున్నా. మాకు ఆంద్రప్రదేశ్‌లో ఉద్యోగావకాశాలు వచ్చేలా చూడాలి. నా సొంత మండలం అమరాపురం. అయితే చదువు కర్ణాటకలో ఉండడం వలన మాకు నాన్‌లోకల్‌గా గుర్తిస్తారు. మండలాన్ని బేస్ చేసుకుని లోకల్‌గా పరిగణించాలి. –నయన, విద్యార్థి సెకెండ్ పీయూసీ, యర్రగుంటపల్లి, అమరాపురం మండలం. రెండు భాషలు నేర్చుకోవచ్చు హెచ్బీఎన్ కాలనీ కన్నడ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నందుకు గర్వంగా ఉంది. ఇక్కడ తెలుగు, కన్నడ భాషలు రెండు నేర్చుకోవచ్చు. నాది రాయదుర్గం నియోజకవర్గం డి.హిరేహళ్ మండలం. ఆంధ్ర సర్కారు గడినాడు ప్రాంతాల్లో కన్నడ పాఠశాలలు నిర్వహించడం మాలాంటి వారికి ఎంతో ఉపయోగం. –సోమశేఖర్, ఉపాధ్యాయుడు, హెచ్బీఎన్ కాలనీ, కన్నడ పాఠశాల ఆంధ్రలో పథకాలు బాగున్నాయి మా రాష్ట్రంలో కన్నా ఆంధ్రప్రదేశ్‌లో పథకాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. నాకు పింఛన్ ఇక్కడ రూ.600 ఇస్తారు. అదే హెచ్బీఎన్ కాలనీ మా ఇంటికి ఆరడుగుల దూరంలో ఉంది. అక్కడ నా స్నేహితురాలు నరసమ్మకు పింఛన్ రూ.2250 ఇస్తున్నారు. అంతేకాదు 45 ఏళ్లు నిండిన మహిళలకు రూ.18,750 ఆర్థికసాయం అందిస్తున్నారు. –లక్ష్మక్క, లక్కనహళ్లి కర్ణాటక రాష్ట్రం -
శభాష్ వలంటీర్లు: రాష్ట్రాలను దాటి మరీ పింఛన్ల పంపిణీ
ఓడీ చెరువు/ మడకశిర రూరల్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ల పంపిణీలో కొత్త ఒరవడి తీసుకువచ్చింది. లబ్ధిదారుల ఇంటికే నేరుగా పింఛన్లు అందించే ప్రక్రియ ప్రారంభమైంది. అయితే పింఛన్‌దారులు ఇంట్లో ఉండకుండా ఇతర రాష్ట్రాల్లో ఉండగా అక్కడికి వెళ్లి మరీ ఇస్తున్నారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో ఉన్న లబ్ధిదారుల వద్దకు వెళ్లి పింఛన్ నగదు వారి చేయికి అందిస్తున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ మహిళకు పింఛన్ అందజేసి వలంటీర్ ప్రశంసలు అందుకున్నాడు. మండల కేంద్రానికి చెందిన గోవిందమ్మ కిడ్నీ సమస్యతో బాధపడుతోంది. మూడు నెలల నుంచి బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. దీంతో పింఛన్ పొందలేకపోయింది. మంగళవారం వలంటీర్ సురేశ్‌బాబు సొంత ఖర్చులతో బెంగళూరు వెళ్లి బయోమెట్రిక్ వేయించుకొని 3 నెలల పింఛన్ రూ.6,750 అందజేశాడు. మడకశిర మండలం వైబీహళ్లి సచివాలయం పరిధిలోని గ్రామ వలంటీర్ హనుమంతేగౌడ్ తెలంగాణకు వెళ్లి లబ్ధిదారుకు పింఛన్ అందజేశారు. హైదరాబాద్‌లో ఉంటున్న దివ్యాంగురాలు లక్ష్మీదేవికి మంగళవారం మూడు నెలల పింఛన్ డబ్బు అందించారు. హైదరాబాద్‌లోని నేత్ర విద్యాలయం కళాశాలలో లక్ష్మీదేవి డిగ్రీ తృతీయ సంవత్సరం పరీక్షలకు హాజరవుతోంది. దీంతో ఆమె రెండు నెలల పింఛన్ తీసుకోలేదు. ఇది తెలుసుకున్న వలంటీర్ వెళ్లి పింఛన్ డబ్బు అందజేసినట్లు కార్యదర్శి పెద్దన్న తెలిపారు. -
మడకశిర నుంచి తమిళనాడుకు వెళ్లి..
మడకశిర రూరల్: సచివాలయ వ్యవస్థతో సంక్షేమ పథకాలన్నీ అర్హులను వెతుక్కుంటూ వెళుతున్నాయనేందుకు పలు నిదర్శనాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని 4వ వార్డు వలంటీర్ హరిప్రసాద్ తమిళనాడుకు వెళ్లి లబ్ధిదారుకు పింఛన్ అందజేసిన సంఘటన ప్రశంసలందుకుంది. వివరాల్లోకి వెళితే.. మడకశిరకు చెందిన వృద్ధురాలు పుంగమ్మ తమిళనాడు రాష్ర్టం మధురై జిల్లా ఉసిలంపట్టి గ్రామంలో మూడు నెలలుగా చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో రెండు నెలలుగా పింఛన్ పొందని ఆమె...ఏప్రిల్ నెలకు సంబంధించిన పింఛన్ కూడా తీసుకోకపోతే పింఛన్ రద్దవుతుంది. దీన్ని గుర్తించిన వలంటీర్ హరిప్రసాద్ 800 కి.మీ దూరంలోని ఉసిలంపల్లికి వెళ్లి పుంగమ్మకు మూడు నెలల పింఛన్ అందించాడు. దీంతో పుంగమ్మ వలంటీర్‌కు, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పింఛన్ పంపిణీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చూసి తమిళనాడు వాసులు ఆశ్చర్యానికి గురయ్యారు. చదవండి: సనాతన ధర్మాన్ని కాపాడిన సీఎం జగన్ చంద్రగిరిలో బాబుకు షాక్ -
ఖతర్నాక్ వలంటీర్.. కలెక్టర్ వేటు
సాక్షి, మడకశిర: ‘వైఎస్సార్ పింఛన్’ డబ్బు కోసం కట్టుకథ అల్లాడు ఓ వలంటీర్. తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి రూ.43,500 దోచుకెళ్లారంటూ అందరినీ నమ్మించే యత్నం చేశాడు. వివరాల్లోకెళితే... పట్టణంలోని 3వ వార్డుకు చెందిన శివాపురం పరిధిలో వార్డు వలంటీర్‌గా వీరప్ప పని చేస్తున్నారు. గురువారం 1వ తేదీ కావడంతో లబి్ధదారులకు పింఛన్ పంపిణీ చేయడానికి తెల్లవారు జామున 4.30 గంటలకే సిద్ధమయ్యాడు. శివాపురం కాలనీ పరిధిలోని కొండ ప్రాంతంలో ఉన్న లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేయడానికి దాదాపు రూ.43,500 జేబులో పెట్టుకుని ఇంటి నుండి బయలుదేరాడు. అయితే ఆ డబ్బును ఎలాగైనా కాజేయాలన్న ఉద్దేశంతో కట్టుకథను అల్లాడు. తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో పాటు కళ్లలో కారంకొట్టి రూ.43,500 దోచుకెళ్లారని స్థానికులను నమ్మించే యత్నం చేశాడు. నిజమేననుకొని స్థానికులు వలంటీర్‌ను చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. (మడకశిరలో దోపిడీ దొంగల బీభత్సం) విచారణలో తేలిన నిజం విషయం తెలియగానే స్థానిక సీఐ రాజేంద్రప్రసాద్, ఎస్ఐ రాజేష్, మున్సిపల్ కమిషనర్ నాగార్జున సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. వీరప్పను వారు విచారించగా డబ్బు కోసమే కట్టు కథ అల్లాడని తేల్చారు. అతనిపై ఎలాంటి దాడి జరగలేదన్నారు. రూ.43,500 ను వలంటీర్ నుండి రికవరీ చేస్తామని మున్సిపల్ కమిషనర్ నాగార్జున తెలిపారు. విధుల నుంచి తొలగింపు మడకశిరరూరల్: శివాపురం సచివాలయ పరిధిలోని వలంటీర్ వీరప్పను జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు విధుల నుంచి తొలగించాలని కమిషనర్ నాగార్జునకు ఉత్తర్వులు జారీ చేశారు. పింఛన్ సొమ్ము రూ.43,500 అపహరణ వ్యవహారంలో వలంటీర్ అసత్యాలు, కట్టు కథ అల్లినట్లు విచారణలో తేలడంతో అతన్ని విధుల నుంచి తొలగించాలని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
బస్సు ప్రమాదంలో భార్యాభర్తల మృతి
సాక్షి, మడకశిర(అనంతపురం) : తూర్పుగోదావరి జిల్లాలో మంగళవారం బస్సు లోయలో పడిన ప్రమాదంలో మడకశిరకు చెందిన ఇద్దరు మృతి చెందారు. పట్టణానికి చెందిన మేడా శ్రీనివాసులు(62), మేడా మధురాక్షమ్మ(56) ఈ ప్రమాదంలో మరణించారు. వీరు శుక్రవారం రాత్రి మడకశిర నుంచి ఓ ప్రైవేట్ మినీ బస్సులో అన్నవరం, భద్రాచలం తదితర ప్రాంతాల సందర్శనలో భాగంగా కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లా చెళ్ళకెరకు వెళ్లారు. చెళ్ళకెరలోని బంధువులను కూడా ఆయా ప్రాంతాల సందర్శనకు తీసుకెళ్లారు. ఈక్రమంలో మంగళవారం ఉదయం భద్రాచలంలో పూజలు నిర్వహించుకున్నారు. ఆ తర్వాత అన్నవరానికి వెళ్తుండగా మారేడుమిల్లి–చింతూరు మధ్య వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సు అదుపు తప్పి లోయలో పడగా ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో మడకశిరకు చెందిన మేడా శ్రీనివాసులు, మేడా మధురాక్షమ్మ ఉన్నారు. ఈ దంపతులకు కుమారుడు కిశోర్, కుమార్తెలు ఆశ, నాగమణి సంతానం. కుమార్తెలిద్దరికీ వివాహం కాగా.. కుమారుడు కిశోర్ ఓ ప్రైవేట్ టెలికాం సంస్థలో పని చేస్తున్నాడు. మృతులు మడకశిరలో చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే కుమారుడు తన మిత్రులతో కలిసి ఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు. మృతుల్లో కొందరి మూలాలు మడకశిరలోనే.. మృతుల్లో ఎక్కువమందికి మడకశిరతో సంబంధం ఉంది. ప్రస్తుతం చెళ్ళకెరలో నివాసం ఉంటున్న మేడా వెంకటాచలపతి(56), మేడా గాయత్రమ్మ(52), వీరి కుమార్తె మేడా శ్వేత(25) కూడా మృతుల్లో ఉన్నారు. వీరు మడకశిర నియోజకవర్గంలోని అగళి మండలం ఇనగలూరుకు చెందిన వారు. ఈ కుటుంబం 25 ఏళ్ల పాటు ఇదే మండలంలోని దొక్కలపల్లిలో చిల్లర అంగడిని ఏర్పాటు చేసుకుని వ్యాపారం నిర్వహించారు. ఐదేళ్ల క్రితమే ఈ కుటుంబం అంతా చెళ్ళకెరకు వలస వెళ్లింది. ప్రమాదంలో ఈ కుటుంబంలోని ముగ్గురు మృతి చెందడం బంధువులను విషాదంలోకి నెట్టింది. -
తమ్ముళ్ల పంథా...రియల్ దందా
మడకశిరలో టీడీపీ నేతలు ఐదేళ్లూ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. అధికారం అండతో అక్రమాలకు తెరతీశారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే లేఅవుట్లు వేసేశారు. అమాయకులకు వాటిని అంటగట్టి రూ.కోట్లు కొళ్లగొట్టారు. టీడీపీలోని ఓ కీలక నేత కనుసన్నల్లో జరిగిన ఈ రియల్ దందాకు అధికారులూ సహకరించినట్లు తెలుస్తోంది. సాక్షి, మడకశిర: మడకశిర 2012లో ఆగస్టులో నగర పంచాయతీగా ఏర్పడింది. అప్పటి నుంచి ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభమైంది. పైగా నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన అధికారులు, ప్రైవేటు ఉద్యోగులంతా మడకశిరలోనే స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకునేందుకు మొగ్గుచూపుతుండడంతో ఇళ్ల స్థలాలకు డిమాండ్ పెరిగింది. దీన్ని ఆసరాగా తీసుకుని టీడీపీ నేతలు అక్రమ వ్యాపారానికి తెరలేపారు. పలువురు మున్సిపల్ అధికారులు సహకారంతో లేఅవుట్లు వేసి రూ.కోట్లు సంపాదించారు. ఈ రియల్ దందాకు గతంలో ఇక్కడ పని చేసిన ఓ ప్రముఖ అధికారి, మున్సిపల్ కార్యాలయంలో పని చేసే మరో అధికారి సహకరించినట్లు తెలిసింది. ప్రధాన రోడ్ల పక్కనే.. టీడీపీ నాయకులు పట్టణంలోని ప్రధాన రోడ్లకిరువైపులా ఉన్న భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసి లేఅవుట్లు వేస్తున్నారు. పట్టణంలో ప్రస్తుతం 20పైగా లేఅవుట్లు ఉండగా, ఇందులో 10 అక్రమంగా వేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అమరాపురం, మధుగిరి, పెనుకొండ, పావగడ రోడ్లలో ఈ అక్రమ లేఅవుట్లు వెలిశాయి. టీడీపీ హయాంలో ఒక వెలుగు వెలిగిన టీడీపీ ప్రముఖుల అండదండలతోనే ఈ బిజినెస్‌కు బీజం పడినట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రతి ఫలంగా వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా ప్లాట్లను కేటాయించినట్లు సమాచారం. ఎమ్మెల్యే ఆగ్రహం పట్టణంలో అక్రమ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకోవడం...అక్కడ ప్లాట్లు కొనుగోలు చేసిన సామాన్యులంతా అవి నిబంధనలకు విరుద్ధంగా వేసినట్లు తెలుసుకుని గగ్గోలు పెట్టారు. న్యాయం చేయాలని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి వద్ద మొరపెట్టుకున్నారు. పైగా అక్రమ లేఅవుట్లతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడింది. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి ఇటీవల మున్సిపల్ శాఖపై సమీక్ష చేశారు. అక్రమ లేఅవుట్ల గురించి చర్చించారు. అక్రమ లేఅవుట్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మడకశిరలో వెలసిన అక్రమ లేఅవుట్లు పలువురికి నోటీసుల జారీ ఎమ్మెల్యే ఆదేశాలతో మున్సిపల్ అధికారులు రంగ ప్రవేశం చేశారు. మున్సిపల్ కమిషనర్ షేక్‌మాలిక్ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. 7 లేవుట్లు అక్రమంగా వేసినట్లు గుర్తించారు. వెంటనే సంబంధిత రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నోటీసు లు జారీ చేశారు. మొత్తం మీద టీడీపీ హయాంలో ఈ వ్యాపారం రూ.కోట్లల్లో జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. కఠినంగా వ్యవహరిస్తాం మడకశిరలో అక్రమంగా వేసిన లేఅవుట్లపై కఠినంగా వ్యవహరిస్తాం. ఎంతటి వారైనా వదిలేదిలేదు. 7 లేఅవుట్లకు ఎలాంటి అనుమతులు లేవని గుర్తించాం. వారికి నోటీసులు కూడా జారీ చేశాం. వెంటనే లేఅవుట్లను సక్రమం చేసుకోవాలి. లేక పోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఈ లేఅవుట్లలో ఎవరూ స్థలాలను కొనుగోలు చేయవద్దు. ఇలాంటి లేఅవుట్లలోని ఇళ్లకు కరెంట్ సరఫరా, డ్రైనేజీ సౌకర్యం ఉండవు. – షేక్‌మాలిక్, మున్సిపల్ కమిషనర్, మడకశిర -
గుండుమల.. గ్రానైట్ దందా!
ఇక్కడ కనిపిస్తున్న రోడ్డు మెటల్ క్వారీ మడకశిర మండలం మెళవాయి గ్రామంలోనిది. ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి సోదరుడు జయప్ప దీనికి లీజు పొందారు. హెక్టార్ విస్తీర్ణంలో ఉన్న ఈ క్వారీకి పర్యావరణ అనుమతులు లేవు. అయినప్పటికీ ఆరేళ్లుగా రోడ్డు మెటల్‌ను తవ్వేసుకుంటున్నారు. ఇదే గ్రామంలోని సర్వే నంబర్ 622–2లో ఐదు హెక్టార్లను 2016 మార్చి నెలలో అధికారులు ఎమ్మెల్సీ మరో సోదరుడు జి.సుభాష్ పేరుతో క్వారీకి లీజు ఇచ్చారు. ఈ క్వారీకి భూగర్భ, గనులశాఖ నుంచి అనుమతులు లేవు. అయినా అధికారం అండతో తవ్వకాలు చేపట్టిన ఎమ్మెల్సీ సోదరుడు...రాయల్టీ కూడా చెల్లించకుండానే మూడేళ్లుగా రోడ్డు మెటల్‌ను కర్ణాటకకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఆయనో ప్రజాప్రతినిధి.. పైగా పెద్దల సభకు ప్రాతినిథ్యం. ఈ పెద్దమనిషి.. వక్రబుద్ధితో దోపిడీదారుని అవతారమెత్తారు. సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన ఆయన.. అక్రమార్కులకు మార్గదర్శిగా మారారు. అధికార అండతో కొండలను పిండిచేసి రూ.కోట్లు కూడబెట్టాడు. తమ్ముళ్లు, బంధువుల పేరుతో గనులను లీజుకు తీసుకుని అనుమతులు లేకుండానే ఖనిజం తవ్వడంతో పాటు.. రాయల్టీ సైతం ఎగ్గొట్టి సరిహద్దు దాటించేస్తున్నాడు. సాక్షి, అనంతపురం టౌన్: మడకశిర.. కర్ణాటక ప్రాంతానికి అతి సమీపంలో ఉన్న నియోజకవర్గం. రెండు, మూడు కిలోమీటర్లు దాటితే కర్ణాటక రాష్ట్ర సరిహద్దు వస్తుంది. ఇదే క్వారీ నిర్వాహకులకు కలిసి వస్తోంది. క్వారీల కోసం భూములను లీజుకు తీసుకుంటున్న వారు...ఎలాంటి అనుమతులు లేకుండానే ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టి అత్యంత విలువైన ఖనిజాన్ని గుట్టుచప్పుడు కాకుండా రాత్రికి రాత్రే కర్ణాటక ప్రాంతానికి తరలిస్తున్నారు. మామూళ్లకు అలవాటు పడిన అధికారులు కూడా అక్రమ రవాణాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడుతోంది. ఎమ్మెల్సీ అండ.. తమ్ముళ్ల దందా మడకశిర నియోజకవర్గంలో దాదాపు 40కిపైగా గ్రానైట్, రోడ్డుమెటల్ క్వారీలున్నాయి. వీటిలో 25కు పైగా గుండుమల తిప్పేస్వామి బంధువుల పేరుతో ఉన్నాయి. ఈ క్వారీల నుంచి ఖనిజ తరలింపు కోసం చెల్లించిన రాయల్టీకి తవ్విన ఖనిజానికి ఎక్కడా పొంతన లేదు. వందల క్యూబిక్ మీటర్లకు అనుమతులు పొంది వేల క్యూబిక్ మీటర్లలో తవ్వకాలు చేపట్టారు. అంతటితో ఆగకుండా లీజు పొందని ప్రాంతాల్లో సైతం హద్దులు దాటి తవ్వకాలు చేపట్టారు. అంతా గుండుమల కనుసన్నల్లో.. మడకశిర ప్రాంతంలో జరిగే గ్రానైట్ వ్యాపారం అంతా ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి కనుసన్నల్లోనే సాగుతుంది. క్వారీల్లో సింహభాగం కుటుంబీకులవే. దీంతో ఇతరులెవరైనా క్వారీలు లీజు పొందిన ఎమ్మెల్సీ కనుసన్నల్లో నడవాల్సిందే.. క్వారీలో వాటా ఇవ్వాల్సిందే. లేని పక్షంలో ఇబ్బందులు గురికావాల్సి ఉంటుంది. దీంతో గుండుమల తిప్పేస్వామి సోదరులకు అన్ని క్వారీల్లోను వాటాలున్నాయి. వారి ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి సోదరులు గుండుమల చంద్రప్ప, శివానందప్ప, రాధాకృష్ణలు మడకశిర మండలం జాదరహళ్లి గ్రామంలో నాలుగు గ్రానైట్ క్వారీలను 2012 సంవత్సరంలో లీజుకు తీసుకున్నారు. లీజులు మాత్రమే పొందిన వారు ఎలాంటి అనుమతులు లేకుండానే తవ్వకాలు చేపట్టి గుట్టుచప్పుడు కాకుండా విలువైన గ్రానైట్ బ్లాక్‌లను కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తున్నారు. కలర్ గ్రానైట్‌కు ఒక క్యూబిక్ మీటర్‌కు రూ.1,600 వరకు రాయల్టీ చెల్లించాల్సి ఉన్నప్పటికీ.. ఆరేళ్లుగా ఎలాంటి రాయల్టీ చెల్లించకుండా వేలాది క్యూబిక్ మీటర్ల గ్రానైట్ బ్లాక్‌లను తరలించి సొమ్ము చేసుకున్నారు. జాదరహళ్లి గ్రామంలో ఎమ్మెల్సీ సోదరులు నడుపుతున్న క్వారీలో అనుమతి పొందిన దానికంటే.. అదనంగా తవ్వకాలు చేసినట్లు గనుల శాఖ అధికారులు గుర్తించారు. ఏకంగా రూ.2 కోట్లకు పైగా జరిమానా విధించారు. అయినా అక్రమ దందాను మాత్రం అరికట్టలేకపోయారు. రాయల్టీ ఊసేలేదు రోడ్డు మెటల్‌కు బెంగళూరులో మంచి డిమాండ్ ఉంది. మడకశిర కర్ణాటక సరిహద్దులో ఉండటంతో అందరూ ఇక్కడి నుంచే మెటల్‌ను తరలిస్తున్నారు. అందువల్లే ఇక్కడి క్వారీల నుంచి రోజూ పదుల సంఖ్యల్లో వాహనాల్లో రోడ్డు మెటల్ తరలిపోతుంది. నిబంధనల ప్రకారం క్యూబిక్ మీటర్ రోడ్డు మెటల్‌కు రూ.100 ప్రకారం ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాల్సి ఉంది. అయితే ఏ ఒక్క క్వారీ నిర్వాహకుడు రాయల్టీ చెల్లించడం లేదు. అసలు పర్మిట్లే తీసుకోవడం లేదు. ఎవరైనా అధికారి వాహనాన్ని ఆపితే... గుండుమల పేరు చెబుతున్నారు. దీంతో అధికారులు కూడా ఆ వాహనాలను ఆపే సాహసం చేయడం లేదు. అందువల్లే గుండమల గ్రానైట్, మెటల్ దందా మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. రూ.కోట్లలో జరిమానా విధించినా.. మడకశిర మండలం మళ్లినాయకనహళ్లి, ఆమిదాలగొంది, జాదరహాళ్లి, అగళి మండలం హెచ్డీ హళ్లి గ్రామాల్లో గుండుమల తిప్పేస్వామి సోదరులు కలర్ గ్రానైట్, రోడ్డు మెటల్ క్వారీలను నిర్వహిస్తున్నారు. ఈ క్వారీలపై గతంలో కొందరు ఫిర్యాదు చేయగా.. రాష్ట్ర గనులశాఖ అధికారులు గతేడాది సెప్టెంబర్, అక్టోబర్లలో తనిఖీలు చేశారు. అయితే తీసుకున్న పర్మిట్లకు, తవ్వుకున్న ఖనిజానికి పొంతన లేకపోవడంతో గనులశాఖ అధికారులు క్వారీల్లో కొలతలు వేశారు. అక్రమ తవ్వకాలు చేపట్టినట్లు గుర్తించి రూ. కోట్లలో జరిమానా విధించారు. ఇక జాదరహళ్లి గ్రామంలో ఎమ్మెల్సీ సోదరులు.. అనుమతి పొందిన దానికంటే... అదనంగా తవ్వకాలు చేసినట్లు గుర్తించి ఆ క్వారీకి రూ.2 కోట్లకుపైగా జరిమానా విధించారు. అయినా క్వారీ నిర్వాహకుల్లో ఎలాంటి మార్పు రాలేదు. నేటికీ ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టి విలువైన ఖనిజ సంపదను తరలిస్తూ... ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. చర్యలు తీసుకుంటాం పర్యావరణ అనుమతులు లేకుండా క్వారీల్లో తవ్వకాలు చేపట్టకూడదు. మడకశిర నియోజకవర్గంలోని క్వారీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటాం. అవసరమైతే లీజులను రద్దు చేస్తాం. ఇక రాయల్టీ చెల్లించకుండా ఖనిజం తరలిస్తున్న వారిపై చర్యలకు ఆదేశిస్తాం. – వెంకటేశ్వరరెడ్డి, ఏడీ భూగర్భ, గనులశాఖ -
యువతి ఫోటోలు మార్ఫింగ్, ఇంజనీర్ అరెస్ట్
సాక్షి, భీమవరం : ప్రయివేట్ కంపెనీలో సివిల్ ఇంజనీరుగా పనిచేస్తూ విజ్ఞానంతో వికృత చేష్టలకు పాల్పడ్డాడో ప్రబుద్ధుడు. ఫేస్బుక్లో పరిచయమైన యువతి ఫోటోలను మార్ఫింగ్ చేసి ఆపై బ్లాక్ మెయిలింగ్‌కు దిగి మనోవేదనకు గురిచేశాడు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గానికి చెందిన యువతి భీమవరంలోని ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకుంది. అనంతపురం జిల్లా మడకశిరకు చెందిన సేనపరిగి హిమతేజకు ఫేస్బుక్ ద్వారా పరిచయం అయింది. ఇది స్నేహంగా మారడంతో ఆమె తన ఫోటోలు పంపింది. ఒకరినొకరు ఇష్టపడ్డారు. తర్వాత అతడు మంచివాడు కాదని తెలుసుకుని ఫేస్బుక్ పరిచయాన్ని ఆపేసి, మాట్లాడటం మానేసింది. ఆరు నెలల తర్వాత యువతి పేరుపై ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్‌లో నకిలీ అకౌంట్స్ క్రియేట్ చేశాడు. ఆమె స్నేహితురాళ్లకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి తర్వాత ఆ యువతి ఫోటోలను మార్ఫింగ్ చేసి వాళ్లకు పంపాడు. వారంతా ఆమెకు ఫోన్ చేసి ఇలాంటి ఫోటోలు అప్లోడ్ చేస్తున్నావేంటని అడగటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బాధిత యువతి భీమవరం పోలీసులకు ఈ నెల 8న ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో సివిల్ ఇంజనీరుగా పనిచేస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
మడకశిర ప్రచార సభలో వైఎస్ జగన్
-
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం: వైఎస్ జగన్
-
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం: వైఎస్ జగన్
సాక్షి, మడకశిర (అనంతపురం జిల్లా) : అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆర్టీసీ కార్మికులకు అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం అనంతపురం జిల్లా మడకశిరలో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. చంద్రబాబుకు ఐదేళ్ల తన పాలనపై ఓటు అడిగే ధైర్యం లేక ఢిల్లీ నుంచి నాయకులను తెచ్చుకుంటున్నారని విమర్శించారు. గత ఐదేళ్ల పాలనలో మోసం తప్ప ఏం జరగలేదని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు చేసే అబద్దపు వాగ్ధానాలకు మోసపోవద్దని కోరారు. అధికారంలోకి రాగానే నవరత్నాలతో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతామని భరోసా ఇచ్చారు. అనంతపురం జిల్లాలో ఉన్న రెండు ఎంపీ స్థానాలను బీసీలకే కేటాయించామన్నారు. మడకశిర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎం.తిప్పేస్వామి, హిందూపురం లోక్‌సభ అభ్యర్థి గోరంట్ల మాధవ్‌లను ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ సభలో ఆయన ఏమన్నారంటే.. 20 శాతం పనులు కూడా.. మడకశిర బ్రాంచ్ కెనాల్ కోసం.. రూ.250 కోట్లు ఖర్చు చేసి 80 శాతం పనులను ఆ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి పూర్తి చేశారు. మిగిలిన 20 శాతం పనులు కూడా చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో పూర్తి చేయలేదు. మడకశిరలో తాగు నీటి సమస్య ఎక్కువగా ఉందని ధర్నాలు చేస్తున్నా చంద్రబాబు పట్టించుకోలేదు. సీఎం హోదాలో ఇచ్చిన హామీలను కూడా చంద్రబాబు నెరవేర్చలేదు. పరిశ్రమలు పెట్టిస్తానన్నారు. ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా? డిగ్రీ కాలేజీలు కట్టించాడా? మడకశిరలో 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా చేస్తానన్నాడు. చేశాడా? ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తానన్నాడు. నిర్మించాడా? ఒక్క పంటకు గిట్టుబాటు ధరలేక రైతులు అవస్థలు పడుతున్నారు. ఐదేళ్ల పాలనలో ఏం జరిగిందంటే.. చంద్రబాబు పాలనలో ఏం జరిగిందంటే.. రైతుల అప్పులు రూ. లక్ష 50 వేలకు పైగా రెట్టింపయ్యాయి. రైతులకు ఇవ్వాల్సిన సున్నా వడ్డీ పథకం కనుమరుగైంది. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ కాలేదు. పెంచిన కరెంట్, రాయాల్టీ చార్జీలకు పరిశ్రమలు మూతపడ్డాయి. చంద్రబాబు హయాంలో నిరుద్యోగం పెరిగింది. బాబు వస్తే జాబు వస్తుందన్నారు. కానీ బాబు వచ్చారు ఉన్న ఉద్యోగాలు పోయాయి. నిరుద్యోగభృతి పేరిట ప్రతి ఇంటికి రూ.లక్ష ఇరవై వేలు ఎగ్గొట్టాడు. పొదపు సంఘాలు బలహీనమయ్యాయి. డ్రాక్రా మహిళల రుణాలు రూ. 26వేల కోట్లకు రెట్టింపయ్యాయి. అక్కా చెల్లమ్మల సున్నా వడ్డీ పథకం కూడా లేకుండా పోయింది. మహిళల భద్రతకు రక్షణ లేకుండా పోయింది. ఇసుక మాఫియాను అడ్డుకున్న ఎమ్మార్వో వనజాక్షిని జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్తే చంద్రబాబు ఏ చర్యలు తీసుకోలేదు. కాల్‌మనీ సెక్స్ రాకెట్‌తో మహిళలను వేధించిన నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రైతన్నలకు పంట దిగుబడి తగ్గింది. ఎస్టీ,ఎస్సీల భూములను లాక్కున్నారు. బీసీ పిల్లలు చదువుల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 6వేల ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. బెల్ట్‌షాపులు విపరీతమయ్యాయి. ఎన్టీఆర్ సుజల స్రవంతి కాస్త.. నారా వారి సారా స్రవంతి అయింది. జన్మభూమి కమిటీలతో గ్రామాల్లో మాఫీయాను ఏర్పాటు చేశారు. ఏదీ కావాలన్నా లంచం ఇవ్వాల్సిందే. 108 ఫోన్ చేస్తే రాని పరిస్థితి. యుద్దం ఒక్క చంద్రబాబుతోనే కాదు.. యనమల రామకృష్ణుడు పంటి నొప్పి వస్తే సింగపూర్‌కు వెళ్లి వైద్యం చేయించుకోవడానికి డబ్బులు ఇస్తారు. కానీ పేదవాడి గుండెనొప్పి వస్తే పక్కరాష్ట్రంలో వైద్యం చేయించుకుంటే ఆరోగ్యశ్రీ రాదంటారు. బాబు పాలనలో చార్జీలు బాదుడే బాదుడు. అమరావతి పేరు పెట్టి.. అమరేశ్వరుడి భూములు కొల్లగొట్టేశారు. అదిగో రాజధాని అంటూ బాహుబలి సినిమా చూపించారు. రాజధాని పేరిట చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. రైతన్నలకు గిట్టుబాటు ధరల కోసం రూ.5వేల కోట్ల స్థిరికరణ నిధి పెడుతానన్నారు.. అది పెట్టలేదు కానీ లోకేశ్ స్థిరికరణల నిధి పెట్టుకున్నారు. ప్రజలను చూసి ఓటు అడగటానికి దమ్ములేదు.. దీంతో ఢిల్లీ నుంచి నాయకులను తెచ్చుకుంటున్నారు. ప్రతి కులాన్ని మోసం చేశారు. 2014 మేనిఫెస్టోను మాయం చేశారు. ఈ ఐదేళ్ల చంద్రబాబు పాలనలో మోసం తప్పా ఏం చూడలేదు. మరో 13 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు రోజుకో సినిమా చూపిస్తారు. ఈ కుట్రలన్నీ గమనించి అప్రమత్తంగా ఉండండి. మన యుద్దం ఒక చంద్రబాబుతోనే కాదు.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, అమ్ముడుపోయిన అన్నీ చానళ్లతో చేస్తున్నాం. ఉన్నది లేనట్టుగా.. లేనిది ఉన్నట్లుగా చూపిస్తారు. 20 రోజులు ఓపిక పట్టమని చెప్పండి.. ఎన్నికలు వచ్చే సరికి చంద్రబాబు చేయని మోసం ఉండదు. కుట్రలతో ఈ ఎన్నికలు గెలవాలని చంద్రబాబు చూస్తున్నారు. ప్రతిగ్రామానికి మూటలు మూటలు డబ్బులు పంపిస్తారు. ఓటు కొనేందుకు ప్రతి ఒక్కరి చేతిలో రూ.3వేలు పెడతారు. మీరందరూ గ్రామాలకు వెళ్లండి ప్రతి ఒక్కరిని కలవండి. నవరత్నాల గురించి చెప్పండి. చంద్రబాబు ఇచ్చే 3వేలకు మోసపోవద్దని చెప్పండి. 20 రోజులు ఓపిక పడితే జగనన్న ప్రభుత్వం వస్తుందని చెప్పండి. జగనన్న వచ్చిన తర్వాత జరిగే సంక్షేమాన్ని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. పిల్లలను బడులకు పంపిస్తే ఏడాదికి రూ.15వేలు ఇస్తామని, డ్వాక్రా మహిళలకు ఎన్నికల నాటికి ఎంత రుణమున్నా.. ఎన్నికల నాటికి నాలుగు దఫాల్లో నేరుగా ఇస్తామని తెలపండి. పిల్లల చదువులకు ఎంత ఖర్చు అయినా ఫీజురీయింబర్స్‌మెంట్ కింద అన్నే ఉచితంగా చదివిస్తాడని చెప్పండి. లక్షాధికారులను చేస్తామని ప్రతి అక్కా చెల్లెమ్మలకు చెప్పండి. 45 ఏళ్లు దాటిన ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనార్టీలకు రూ. 75 వేలు ఇస్తామని చెప్పండి. అవ్వా,తాతలకు మూడు వేల ఫించన్ మీ మనవడు ఇస్తాడని, రాజన్న రాజ్యాన్ని జగన్ పాలనలో చూస్తామని చెప్పండి.’ అని వైఎస్ జగన్ కోరారు. -
ప్రమాణ స్వీకారం చేసిన తిప్పేస్వామి
-
ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తిప్పేస్వామి
సాక్షి, అమరావతి: అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మెల్యేగా వైఎస్సార్ సీపీ నాయకులు తిప్పేస్వామి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిలోని స్పీకర్ కార్యాలయంలో ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరగింది. కాగా, 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఈరన్న.. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇవ్వడంతో వైఎస్సార్ సీపీ అభ్యర్థి తిప్పేస్వామి హైకోర్టును ఆశ్రయించారు. తిప్పేస్వామి పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈరన్న ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పుపై ఈరన్న సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దానిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తిప్పేస్వామి నేడు మడకశిర ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. చదవండి: టీడీపీ ఎమ్మెల్యేకు హైకోర్టు షాక్.. ఎన్నిక చెల్లదని ఆదేశాలు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించండి -
ఎమ్మెల్యేపై అనర్హత: అసెంబ్లీ కార్యదర్శిని కలిసిన వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, మడకశిర: అనంతపురం జిల్లా మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఈరన్నపై అనర్హత వేటు వేస్తూ సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రతులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు శనివారం ఏపీ అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. టీడీపీ ఎమ్మెల్యేపై వేటు వేసి.. ఆయన స్థానంలో మడకశిర నియోజకవర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ తిప్పేస్వామిని ఎమ్మెల్యేగా కొనసాగించాలని న్యాయస్థానాలు ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 20లోగా తనతో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించాలని స్పీకర్ కోడెల శివప్రసాదరావు, అసెంబ్లీ కార్యదర్శిని తిప్పేస్వామి కోరుతున్నారు. శాసనసభ ఆవరణలో అసెంబ్లీ కార్యాదర్శి కార్యాలయానికి వెళ్లిన తిప్పేస్వామి వెంట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కోన రఘుపతి, ఆదిములపు సురేష్ తదితరులు ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మడకశిర తదుపరి ఎమ్మెల్యేగా తనను గుర్తించాలని తిప్పేస్వామి అసెంబ్లీ కార్యదర్శిని కోరారు. ఇప్పటికే స్పీకర్‌కు, అసెంబ్లీ కార్యదర్శికి తనను ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రతులను ఫ్యాక్స్, ఈ–మెయిల్ ద్వారా పంపానని ఆయన వెల్లడించారు. స్పీకర్ పిలుపు కోసం ఎదురు చూస్తున్నానని, కోర్టు ఉత్తర్వులను గౌరవించి తనతో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. కాగా, ఢిల్లీలో శుక్రవారం కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారిని తిప్పేస్వామి కలిసి కోర్టులు ఇచ్చిన తీర్పు ప్రతులను కేంద్ర ఎన్నికల సంఘానికి అందించారు. -
ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించండి
సాక్షి, మడకశిర: ఈ నెల 20లోగా తనతో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించాలని స్పీకర్ కోడెల శివప్రసాదరావు, అసెంబ్లీ కార్యదర్శిని అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ తిప్పేస్వామి కోరారు. ఈ మేరకు ఫ్యాక్స్, ఈ–మెయిల్ చేసినట్లు శుక్రవారం ‘సాక్షి’కి తెలిపారు. తనను ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రతులను కూడా పంపానన్నారు. స్పీకర్ పిలుపు కోసం ఎదురు చూస్తున్నానని, కోర్టు ఉత్తర్వులను గౌరవించి తనతో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. కాగా, ఢిల్లీలో శుక్రవారం కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారిని తిప్పేస్వామి కలిసి కోర్టులు ఇచ్చిన తీర్పు ప్రతులను కేంద్ర ఎన్నికల సంఘానికి అందించారు. సుప్రీం తీర్పును గౌరవించి రాజీనామా: ఈరన్న సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు ఈరన్న తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను అసెంబ్లీ కార్యదర్శికి రాజీనామా సమర్పించానన్నారు. తన రాజీనామాను స్పీకర్ ఆమోదించాల్సి ఉందన్నారు. ఎమ్మెల్యేనే కానప్పుడు ఈరన్న పదవికి రాజీనామా చేయడం హాస్యాస్పదంగా ఉందని డాక్టర్ తిప్పేస్వామి అన్నారు. కోర్టుల తీర్పుల నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యేనే కాదన్నారు. నేడు అసెంబ్లీ కార్యదర్శిని కలవనున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఈరన్న అనర్హతపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాపీలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శనివారం అసెంబ్లీ కార్యదర్శికి అందచేయనున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఈరన్న.. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో తనపై ఉన్న క్రిమినల్ కేసులతోపాటు కుటుంబసభ్యుల ప్రభుత్వ ఉద్యోగాల గురించి ప్రస్తావించలేదని వైఎస్సార్సీపీ అభ్యర్థి తిప్పేస్వామి గతంలో హైకోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారించిన హైకోర్టు తిప్పేస్వామి వాదనను సమర్థిస్తూ.. ఈరన్న ఎన్నిక చెల్లదని ఇటీవల తీర్పునిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ ఈరన్న సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈరన్న తన ఎన్నికల అఫిడవిట్లో వ్యక్తిగత వివరాలు దాచిపెట్టారని సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ధారించడమేగాక.. ఆయన ఎన్నిక చెల్లదన్న హైకోర్టు తీర్పును సమర్థించింది. ఆ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి తిప్పేస్వామి ఎమ్మెల్యేగా కొనసాగుతారని కూడా పేర్కొంది. ఈ నేపథ్యంలో శనివారం వెలగపూడి అసెంబ్లీ కార్యాలయంలో కార్యదర్శిని వ్యక్తిగతంగా కూడా కలసి పార్టీ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు తీర్పు కాపీని అందచేయనున్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఆదిమూలపు సురేష్, కోన రఘుపతి, తిప్పేస్వామిలతోపాటు పలువురు పార్టీ నేతలు అసెంబ్లీ కార్యదర్శిని కలవనున్నారు. ఈరన్న రాజీనామా వ్యూహం.. సుప్రీం తీర్పును తప్పించుకునేందుకేనా? తన ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మడకశిర ఎమ్మెల్యే ఈరన్న రాజీనామా వ్యూహాన్ని తెరపైకి తెచ్చారు. ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇవ్వడంతో సుప్రీంకోర్టు ఈరన్న ఎన్నిక చెల్లదని, ఆయన తర్వాత స్థానంలోని వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఎమ్మెల్యేగా కొనసాగుతారని తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. తీర్పు ప్రకారం ఈరన్న ఎమ్మెల్యే పదవి రద్దయింది. కానీ ఆయన రద్దయిన ఎమ్మెల్యే పదవికి వ్యూహాత్మకంగా రాజీనామా చేశారు. శుక్రవారం వెలగపూడిలోని అసెంబ్లీకి వచ్చి కార్యదర్శి విజయరాజుకు తన రాజీనామా లేఖను ఇచ్చి వెళ్లిపోయారు. ఆ రాజీనామాను స్పీకర్ ఆమోదించాల్సి ఉంటుంది. స్పీకర్ ఆమోదించేవరకూ ఈరన్న ఎమ్మెల్యేగానే కొనసాగే అవకాశం ఉంటుంది. స్పీకర్ ఏ విషయం తేల్చకుండా రాజీనామా లేఖను అలాగే రెండు, మూడు నెలలు కాలం గడిపితే ఈ అసెంబ్లీ సమయం ముగిసిపోతుంది. అప్పటివరకూ ఈరన్న ఎమ్మెల్యేగా కొనసాగవచ్చని టీడీపీ పెద్దల వ్యూహంగా కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే ఈరన్నతో రాజీనామా చేయించనట్లు భావిస్తున్నారు. రాజీనామాకు ముందు గురువారం ఈరన్న సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌ను కలిశారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా స్పీకర్‌ను అడ్డుపెట్టుకుని ఈరన్నను ఎమ్మెల్యే పదవిలో కొనసాగించేందుకు చంద్రబాబు ఎత్తు వేసినట్లు ప్రచారం జరుగుతోంది. -
ఎమ్మెల్యే ఈరన్న పిటిషన్ కొట్టివేత
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీం కోర్టులో అనంతపురం జిల్లా మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఈరన్నకు చుక్కెదురైంది. ఎమ్మెల్యేగా తన ఎన్నిక చెల్లదన్న హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ టీడీపీ నేత ఈరన్న దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తన ఎన్నికకు వ్యతిరేకంగా ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలన్న ఈరన్న వినతిని కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారన్న అభియోగాలు నిజమని రుజువు కావడంతో.. ఈరన్న ఎన్నిక చెల్లదంటూ ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెల్సిందే. హైకోర్టు తీర్పుతో మడకశిర అసెంబ్లీ స్థానం ఖాళీ కావడంతో.. 2014 ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎం. తిప్పేస్వామి మడకశిర ఎమ్మెల్యేగా కొనసాగుతారని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. టీడీపీ ఎమ్మెల్యే ఈరన్న ఎన్నిక చెల్లదంటూ కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ మడకశిరలో వైఎస్సార్ సీపీ శ్రేణుల సంబరాలు నిర్వహించాయి. కార్యకర్తలు, నియోజకవర్గ నాయకులు ర్యాలీగా వెళ్లి మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. -
రాజీలేని పోరాటం చేస్తా : డా. తిప్పేస్వామి
సాక్షి, అనంతపురం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ముందుకు వెళ్తానని, మడకశిర ప్రజల సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేస్తానని మడకశిర వైఎస్సార్ సీపీ సమన్వయకర్త డా. తిప్పేస్వామి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఈరన్న ఎన్నిక రద్దు తీర్పు చారిత్రాత్మకమన్నారు. హైకోర్టు తీర్పు కాపీ అందగానే స్పీకర్‌ను కలవనున్నట్లు తెలిపారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా తనతో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించాలని కోరారు. టీడీపీ ఎమ్మెల్యే ఈరన్న కావాలనే తప్పుడు సమాచారం ఇచ్చారని చెప్పారు. నామినేషన్ల పరిశీలన సమయంలోనే ఆధారాలను సమర్పించినా అధికారులు పట్టించుకోలేదన్నారు. -
గట్టి షాక్: టీడీపీ ఎమ్మెల్యే ఎన్నిక రద్దు
సాక్షి, హైదరాబాద్/పలమనేరు: అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మెల్యే కె.ఈరన్నకు(తెలుగుదేశం పార్టీ) హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. మడకశిర ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికను రద్దు చేసింది. ఎన్నికల అఫిడవిట్లో ఈరన్న తనపై ఉన్న కేసుల వివరాలను, భార్య ప్రభుత్వ ఉద్యోగి అన్న విషయాలను పొందుపరచకపోవడాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది. ఇలా చేయడం వాస్తవాలను దాచిపెట్టడమేనని తేల్చిచెప్పింది. ఇందుకు గాను ఆయన ప్రజాప్రాతినిధ్య చట్ట నిబంధనల ప్రకారం ఎమ్మెల్యేగా కొనసాగేందుకు ఎంతమాత్రం అర్హుడు కాదని స్పష్టం చేసింది. ఈరన్న ఎన్నికను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ఈరన్నపై పోటీ చేసి ఓడిపోయిన వైఎస్సార్సీపీ అభ్యర్థి మోపురగుండు తిప్పేస్వామి మడకశిర ఎమ్మెల్యేగా ఎన్నికైనట్లు ప్రకటించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తాళ్లూరి సునీల్ చౌదరి మంగళవారం సంచలన తీర్పును వెలువరించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కె.ఈరన్న వైఎస్సార్సీపీ అభ్యర్థి తిప్పేస్వామిపై విజయం సాధించారు. ఈరన్న ఎన్నికల అఫిడవిట్లో తనపై ఉన్న కేసుల వివరాలను, భార్య ప్రభుత్వ ఉద్యోగి అనే విషయాన్ని దాచిపెట్టి నామినేషన్ వేశారని, ఈ నేపథ్యంలో ఈరన్న ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ తిప్పేస్వామి 2014 జూన్ 28న హైకోర్టులో ఎన్నికల పిటిషన్ (ఈపీ) దాఖలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి ఎన్నికల అఫిడవిట్లో తనపై ఉన్న కేసులు, కుటుంబ సభ్యుల వివరాలను తెలియజేయాలని తిప్పేస్వామి కోర్టుకు నివేదించారు. ఉద్దేశపూర్వకంగా అలా చేయలేదు ఉద్దేశపూర్వకంగా తాను ఇలా చేయలేదని, నామినేషన్ పత్రాన్ని పూరించే వ్యక్తులు చేసిన తప్పిదం వల్లే కేసు వివరాలను పొందుపరచలేదని కె.ఈరన్న హైకోర్టుకు వివరణ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ తనకు చివరి నిమిషంలో బీ ఫాం ఇచ్చిందని, అందువల్ల ఎన్నికల అఫిడవిట్లో అన్ని వివరాలను ప్రస్తావించిందీ లేనిదీ చూసుకోలేదని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే నాటికి తన భార్య ప్రభుత్వ ఉద్యోగి అని, ఆ తరువాత ఆమె విధులకు హాజరు కావడం మానేశారని, అనంతరం రాజీనామా చేశారని, అందువల్ల ఆమెకు సంబంధించిన వివరాలను ఎన్నికల అఫిడవిట్లో పొందుపరచలేదని పేర్కొన్నారు. కర్ణాటకలోని కొడగ్ పోలీస్‌స్టేషన్‌లో తనపై 2002లో నమోదైన కేసు సాధారణ కేసని, ఇది ప్రజాప్రాతినిధ్య చట్ట పరిధిలోకి రాదని వివరించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నేర చరిత్రను తెలుసుకునేందుకే కేసుల వివరాలను పొందుపరచాలన్న నిబంధన పెట్టారని, తాను నేర చరితుడను కాదని నియోజకవర్గ ప్రజలకు తెలుసని ఈరన్న చెప్పారు. ఈరన్న వాదనను తోసిపుచ్చిన కోర్టు తిప్పేస్వామి దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ టి.సునీల్ చౌదరి మంగళవారం తీర్పును వెలువరించారు. ఈరన్న వాదనలన్నింటినీ న్యాయమూర్తి తోసిపుచ్చారు. నామినేషన్ దాఖలు చేసే నాటికి ఇవ్వాల్సిన వివరాలన్నింటినీ ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచి తీరాల్సిందేనని తేల్చిచెప్పారు. తెలిసిన వివరాలను ఎన్నికల అఫిడవిట్లో పేర్కొనకపోవడాన్ని వాస్తవాలను దాచిపెట్టడం గానే పరిగణించాల్సి ఉంటుందన్నారు. ఈ కేసులో ఈరన్న కూడా ఇదే రీతిలో వ్యవహరించారని, కొడగ్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసు వివరాలు, భార్య ప్రభుత్వ ఉద్యోగి అనే విషయాన్ని ఎన్నికల అఫిడవిట్లో ప్రస్తావించలేదన్నారు. ఇలా వాస్తవాలను దాచిపెట్టినందుకు ఈరన్న ఎన్నికను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అంతేకాక నిబంధనల మేరకు పిటిషనర్ తిప్పేస్వామి మడకశిర ఎమ్మెల్యేగా ఎన్నికైనట్లు ప్రకటిసున్నట్టు తెలిపారు. ఎట్టకేలకు న్యాయమే గెలిచింది: తిప్పేస్వామి మడకశిర ఎమ్మెల్యే ఈరన్న ఎన్నికను రద్దు చేస్తూ హైకోర్టు ధర్మాసనం తీర్పు ఇవ్వడంతో ఎట్టకేలకు న్యాయమే గెలిచిందని వైఎస్సార్సీపీ అభ్యర్థి, పలమనేరు మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి పేర్కొన్నారు. ఆయన మంగళవారం చిత్తూరు జిల్లా పలమనేరులో మీడియాతో మాట్లాడారు. టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఈరన్నపై పలు క్రిమినల్ కేసులున్నాయని, వాటిలో ఆయనకు శిక్ష కూడా పడిందని, ఆ విషయాన్ని అఫిడవిట్లో చూపకుండా ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని తాను తెలియజేశానని అన్నారు. తన ఫిర్యాదును అప్పటి ఎన్నికల అధికారి పరిగణనలోకి తీసుకోలేదని, దాంతో హైకోర్టులో ఎన్నికల వ్యాజ్యం దాఖలు చేశానన్నారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈరన్న ఎన్నిక చెల్లదంటూ తీర్పుచెప్పడం సంతోషంగా ఉందన్నారు. ఈరన్న ఎన్నిక రద్దుతో రెండోస్థానంలో ఉన్న తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనట్టేనని పేర్కొన్నారు. కోర్టు నుంచి తీర్పు ప్రతి అందగానే స్పీకర్‌ను కలుస్తానని తెలిపారు. తిప్పేస్వామి అభిమానులు పలమనేరులో బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. -
టీడీపీ ఎమ్మెల్యేకు హైకోర్టు షాక్.. ఎన్నిక చెల్లదని ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: అనంతరం జిల్లా మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఈరన్నకు హైకోర్టు షాక్ ఇచ్చింది. శాసనసభ సభ్యుడిగా ఆయన ఎన్నిక చెల్లదంటూ మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. ఆయనపై వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేసిన డాక్టర్ మోపురగుండు తిప్పేస్వామి విజయం సాధించినట్టు న్యాయస్థానం ప్రకటించింది. ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్లో తప్పుడు సమాచారమిచ్చారనే ఆరోపణలపై హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. తనపై ఉన్న నాలుగు క్రిమినల్ కేసుల గురించిన వివరాలు, అలాగే భార్య ప్రభుత్వ ఉద్యోగనే విషయాన్ని ఈరన్న అఫిడవిట్లో పేర్కొనపోవడాన్ని ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లో ఈరన్న తప్పుడు సమాచారం ఇచ్చారని, కర్ణాటకలో తనపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను అఫిడవిట్లో తెలియజేయలేదని, ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనని వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీచేసిన డాక్టర్ తిప్పేస్వామి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే ఈరన్న ఎన్నిక చెల్లదన్న హైకోర్టు.. ఆయన స్థానంలో డాక్టర్ తిప్పేస్వామి ఎమ్మెల్యేగా కొనసాగవచ్చునని ఆదేశాలు ఇచ్చింది. వివరాలు దాచి అఫిడవిట్..! టీడీపీ ఎమ్మెల్యే ఈరన్నకి కర్ణాటకలో నమోదైన ఓ కేసులో శిక్ష కూడా పడింది. ఆంధ్రప్రదేశ్‌లో రెండు కేసులు నమోదవ్వగా.. అందులో ఒక కేసులో చార్జిషీట్ దాఖలైంది. ఈరన్న భార్య కర్ణాటక అంగన్ వాడి విభాగంలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఈ వివరాలను ఆయన తన అఫిడవిట్లో పొందుపరచలేదు. ఈ విషయాలన్నీ 2014 ఎన్నికల సమయంలోనే వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ తిప్పేస్వామి రిటర్నరింగ్ అధికారి దృష్టికి తెచ్చారు. కాని అప్పుడు పట్టించుకోలేదు. ఈ విషయమై ఆయన న్యాయపోరాటం చేసి ఇప్పుడు విజయం సాధించారు. -
ఎన్నికల్లో లబ్ధికోసం చంద్రబాబు కొత్త ఎత్తుగడ
-
మడకశిరలో తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, మడకశిర: అనంతపురం జిల్లా మడకశిరలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. శంకరగల్లు గ్రామానికి చెందిన పుష్పలత నాలుగు రోజుల కిందట దారుణహత్యకు గురైంది. గ్రామస్తుల సమాచారం మేరకు అదే గ్రామానికి చెందిన మారుతి అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సదరు మహిళపై అత్యాచారం చేసి నగలు దోచుకొని మహిళను చంపి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడు మారుతిని తమ గ్రామం నుంచి బహిష్కరించి కఠినంగా శిక్షించాలని శంకరగల్లు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి శనివారం మధ్యాహ్నం మడకశిర పోలీసు స్టేషన్ ను ముట్టడించారు. పోలీసులు ఆందోళనకారులతో మాట్లాడుతున్నారు. -
మీకో దండం.. ఎందుకీ ‘గండం’
మడకశిర: అనంతపురం జిల్లాలో రోడ్డు నిబంధనలపై విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. మడకశిర సీఐ శుభకుమార్ కూడా ర్యాలీలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం తెస్తున్నారు. సోమవారం ఆయన ఓ కేసు విచారణ నిమిత్తం మడకశిర నుంచి అమరాపురం మండలంలోని వి.అగ్రహారానికి వెళుతున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ద్విచక్రవాహనంపై నలుగురిని కూర్చోబెట్టుకుని మడకశిరకు వస్తున్నాడు. ఈ దృశ్యాన్ని చూసిన సీఐ వెంటనే వాహనాన్ని ఆపి ఆ వ్యక్తికి కౌన్సెలింగ్ ఇచ్చారు. మీకు చేతులెత్తి నమస్కరిస్తా.. ఇలా చేయొద్దు.. అని వేడుకున్నారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు వాహనదారుల భద్రత కోసం ఏపీ ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించింది. హెల్మెట్ ధరించని ద్విచక్రవాహనదారులకు, సీట్ బెల్టులు పెట్టుకోని కారు డ్రైవర్లకు ఇంధనాన్ని సరఫరా చేయరాదంటూ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనలు పాటించని వారికి పెట్రోల్, డీజిల్ పోయరాదని పెట్రోల్ బంకుల యాజమన్యాలను సూచించింది. -
మడకశిరలో టెన్షన్.. టెన్షన్
రోడ్ల విస్తరణతో ఆందోళన విస్తరణ చేసి తీరుతామంటున్న టీడీపీ నేతలు పరిహారం చెల్లించిన తర్వాతనే అంటున్న కాంగ్రెస్ వాదులు మడకశిర: మడకశిరలో రూ. 42.75 కోట్లతో చేపట్టిన రోడ్ల విస్తరణ పనులు వివాదాలకు కారణమవుతోంది. మడకశిర–పావగడ, మడకశిర–హిందూపురం, మడకశిర–అమరాపురం, మడకశిర–పెనుకొండ రోడ్లను 66 అడుగుల మేర విస్తరణ చేయాల్సిందేనంటూ టీడీపీ నేతలు పట్టుబట్టారు. అయితే ఇందుకు సంబంధించి బాధితులకు పరిహారం చెల్లించిన తర్వాతనే పనులు చేపట్టాలంటూ స్థానిక కాంగ్రెస్ నేతలు అడ్డుకోవడంతో అందరి దృష్టి రోడ్ల విస్తరణపై పడింది. ఈ ప్రక్రియను ఈ రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో చివరకు రాజకీయరంగు పులుముకుంది. పట్టణంలో రోడ్ల విస్తరణ పనుల ద్వారా 120 మంది వరకు నష్టపోనున్నారు. వీరిలో 40మంది హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం పట్టణ శివారులో రోడ్ల విస్తరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. విస్తరణ పనులను స్వాగతిస్తున్న వారు పట్టణంలోని తమ భవనాలను స్వచ్ఛందంగా తొలగించుకుంటున్నారు. మరికొందరు తమకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే భవనాలను తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. వీరికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నిలిచారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం బాధితులకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతే రోడ్ల విస్తరణ పనులు చేపట్టాలంటూ ఆందోళనలు కూడా చేపట్టింది. రోడ్ల విస్తరణ కోసం ఇప్పటికే ప్రధాన రోడ్లకు ఇరువైపులా ఉన్న 400 చెట్లను అధికారులు తొలగించారు. రింగ్ రోడ్డుతో సమస్య దూరం మడకశిర చుట్టూ రింగ్ రోడ్డు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 50 కోట్ల మేర నిధులను మంజూరు చేసింది. ఈ పనులకు గత ఏడాది డిసెంబర్ 2న సీఎం చంద్రబాబు భూమి పూజ కూడా చేశారు. రింగ్ రోడ్డు ఏర్పాటు చేసేటప్పుడు పట్టణంలో రోడ్ల విస్తరణతో పనేముందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇదే అభిప్రాయాన్ని కాంగ్రెస్ నాయకులు కూడ వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో రోడ్లు ఇరుకుగా ఉండటంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోందని ఫలితంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. నష్టపరిహారం చెల్లించాలి నష్టపరిహారం చెల్లించి రోడ్ల విస్తరణ పనులు చేపడితే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. రోడ్ల విస్తరణ వలన పూర్తిగా నష్టపోతాం. – ఫణిశేఖర్, బాధితుడు, మడకశిర పునరావాసం కల్పించాలి రోడ్ల విస్తరణ ద్వారా నిలువ నీడ కోల్పోతున్న వారికి ముందుగా పునరావాసం కల్పించాలి. ఆ తర్వాతే రోడ్ల విస్తరణ పనులు చేపట్టాలి. – సదాశివప్ప, బాధితుడు, మడకశిర రింగ్‌రోడ్డు ఏర్పాటు చేస్తే చాలు రింగ్ రోడ్డు ఏర్పాటుతో పట్టణంలో ట్రాఫిక్ సమస్య పూర్తిగా తగ్గుతుంది. పట్టణంలో రోడ్ల విస్తరణ ప్రక్రియను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. –లక్ష్మి, బాధితురాలు, మడకశిర -
దొంగ అరెస్ట్
మడకశిర : మడకశిర పోలీసులు మంగళవారం నరసింహమూర్తి అలియాస్ గుండు అనే దొంగను అరెస్ట్ చేశారు. ఇతని నుంచి రూ.4 లక్షలు విలువ చేసే 130 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సీఐ శుభకుమార్, అమరాపురం ఎస్ఐ వెంకటస్వామిలు సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కర్ణాటకలోని పావగడ నియోజకవర్గం మూగుదాళబెట్టకు చెందిన కాపు నరసింహమూర్తి ఆలియాస్ గుండు అమరాపురం మండలం గుణేహళ్లి, ఆలదపల్లి, పేలుబండ, గుడిబండ మండలం హెచ్ఆర్ హట్టి గ్రామాల్లో పగటి పూట తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదుల మేరకు పోలీసులు కొన్ని నెలలుగా గాలింపు చేపట్టారు. మంగళవారం ఉదయం 10గంటల సమయంలో కాపు నరసింహమూర్తి తను దొంగిలించిన బంగారు ఆభరణాలను విక్రయించడానికి మోటారుసైకిల్‌లో వెళుతుండగా అమరాపురం మండలం చిట్నడుకు క్రాస్‌వద్ద ఎస్ఐ వెంకటస్వామి తన సిబ్బందితో చాకచక్యంగా అరెస్ట్ చేశారు. మొత్తం 4కేసుల్లో 130 గ్రాముల బంగారు ఆభరణాలను ఇతడు దొంగిలించినట్లు సీఐ తెలిపారు. కోర్టులో హాజరుపరచగా.. మెజిస్ట్రేట్ రిమాండ్‌కు ఆదేశించారన్నారు. -
విడిపోతున్న అంగన్వాడీ
- ఐసీడీఎస్ విభజనకు రంగం సిద్ధం - ఒక్కో ప్రాజెక్టు పరిధిలో 250 అంగన్వాడీ కేంద్రాలు - ప్రస్తుతం జిల్లాలో 17 ఐసీడీఎస్ ప్రాజెక్టులు - కొత్తగా మరో 8 ఐసీడీఎస్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి కసరత్తు - ప్రతిపాదనలు పంపిన ఐసీడీఎస్ జిల్లా అధికారులు మడకశిర: జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న అంగన్వాడీ కేంద్రాలు రెండుగా విడిపోనున్నాయి. ఐసీడీఎస్ ప్రాజెక్టుల విభజనకు ఆశాఖ ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేశారు. త్వరలోనే ఐసీడీఎస్ ప్రాజెక్టులను విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం. ఇటీవల ఐసీడీఎస్ ప్రాజెక్టుల విభజన ప్రతిపాదనలను జిల్లా అధికారుల నుంచి ప్రభుత్వం తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. పాలనాసౌలభ్యం కోసం ఐసీడీఎస్ ప్రాజెక్టులను విభజిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 17 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. మడకశిర, కదిరి ఈస్ట్, వెస్ట్, పెనుకొండ, హిందూపురం, గుత్తి, కంబదూరు, కూడేరు, తాడిపత్రి, ఉరవకొండ, రాయదుర్గం, కణేకల్లు తదితర ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రధానంగా మడకశిర ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 438 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. హిందూపురం ప్రాజెక్టు పరిధిలో 500 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. కదిరి ఈస్ట్ ప్రాజెక్టు పరిధిలో 500, వెస్ట్ పరిధిలో 500పైగా అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. అదేవిధంగా పెనుకొండ ప్రాజెక్టు పరిధిలో 500 పైగా అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. గుత్తి, కూడేరు, తాడిపత్రి, ఉరవకొండ తదితర ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో కూడా 300కు పైగా అంగన్వాడీ కేంద్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఏ ప్రాజెక్టు పరిధిలో 250 కన్నా ఎక్కువగా అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయో ఆ ప్రాజెక్టులను విభజించనున్నట్లు సమాచారం. పథకాల అమలు పటిష్టం చేసేందుకే.. : ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అనేక పథకాలు అమలవుతున్నాయి. ఈ పథకాల అమలును మరింత పటిష్టం చేయాలనే ఉద్దేశంతో ఐసీడీఎస్ ప్రాజెక్టుల విభజనకు ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో 250కి పైగా అంగన్వాడీ కేంద్రాలు ఉన్న ఐసీడీఎస్ ప్రాజెక్టులను విభజించడానికి వీలుగా జిల్లా అధికారులు రాష్ట్ర మహిళా శిశుసంక్షేమ శాఖకు ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. కొత్తగా జిల్లాలో మరో 8 ఐసీడీఎస్ ప్రాజెక్టులను చేయనున్నట్లు అధికారుల ద్వారా తెలుస్తోంది. మడకశిర ప్రాజెక్టు పరిధిలో ఐదు మండలాలు ఉన్నాయి. ఇందులో 2 మండలాల్లోని అంగన్వాడీ కేంద్రాలను ఒక ప్రాజెక్టు పరిధిలోకి, మిగిలిన అంగన్వాడీ కేంద్రాలను మరో ప్రాజెక్టు పరిధిలోకి తీసుకురావడానికి నిర్ణయించినట్లు తెలిసింది. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నట్లు సమాచారం. ఐసీడీఎస్ ప్రాజెక్టుల విభజనపై సమాచారం ఇచ్చిన ఆర్జేడీ: ఐసీడీఎస్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ శారద మడకశిర నియోజకవర్గంలో శనివారం పర్యటించారు. ఈ పర్యటనలో స్థానిక ఐసీడీఎస్ అధికారులకు ప్రాజెక్టుల విభజనపై సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. మడకశిర ఐసీడీఎస్ ప్రాజెక్టును కూడా విభజించనున్నట్లు ఆమె తెలిపినట్లు సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నట్లు కూడా ఆమె తెలిపినట్లు సమాచారం. ప్రతిపాదనలు పంపిన మాట వాస్తవమే జిల్లాలో ఐసీడీఎస్ ప్రాజెక్టుల విభజనకు జిల్లా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన మాట వాస్తవమే. 250 అంగన్వాడీ కేంద్రాలకు ఒక ఐసీడీఎస్ ప్రాజెక్టును చేయనున్నారు. మడకశిర ఐసీడీఎస్ ప్రాజెక్టు కూడా విభజన కానుంది. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా అధికారులకు తాము కూడా పంపాం. త్వరలోనే ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసే అవకాశం ఉంది. – ఇందిరాదేవి, సీడీపీఓ, మడకశిర -
తహసీల్దార్‌పై సస్పెన్షన్ ఎత్తివేత
అనంతపురం అర్బన్: మడకశిర తహసీల్దారు డి.హరిలాల్నాయక్పై విధించిన సస్పెన్షన్ ఎత్తివేస్తూ కలెక్టర్ జి.వీరపాండియన్ ఉత్తర్వులు బుధవారం జారీ చేశారని రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శీలా జయరామప్ప తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహించాంటూ ఈ నెల 22న తహసీల్దార్‌ని కలెక్టర్ సస్పెండ్ చేశారన్నారు. సంఘం తరఫున 23వ తేదీన కలెక్టర్‌ని కలిసి సస్పెన్షన్ ఎత్తివేయాలని విన్నవించామన్నారు. తమ విన్నపంపై కలెక్టర్ స్పందిస్తూ తహసీల్దారుపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఉత్తర్వులు ఇచ్చారన్నారు. తమ విన్నపంపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్‌కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. -
పండుగ పూట విషాదం..
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం అన్న మృతిని తట్టుకోలేక చెల్లెలు ఆత్మహత్యాయత్నం మడకశిర: మడకశిరలో శుక్రవారం వినాయక చవితి రోజు విషాదం చోటు చేసుకుంది. పట్టణంలోని వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాలలో రెండో సంవత్సరం డిప్లొమా చదువుతున్న సందీప్‌కుమార్ (19) కేఎస్ ఆర్టీసీ బస్సు ఢీకొని అక్కడిక్కడే మృతి చెందాడు. వివరాల్లోకెళితే... మడకశిరకు చెందిన ప్రకాష్ 108 వాహనంలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇతని కుమారుడు సందీప్‌కుమార్ వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాలలో రెండో సంవత్సరం డిప్లొమో చదువుతున్నాడు. వీరు పట్టణంలోని చర్చికాంపౌండ్‌లో నివాసం ఉంటున్నారు. శుక్రవారం వినాయకచవితి సందర్భంగా వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులు వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వేడుకల్లో సందీప్‌కుమార్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నాడు. కార్యక్రమం పూర్తయిన తర్వాత సందీప్‌కుమార్ ద్విచక్రవాహనంలో ఇంటికి బయల్దేరాడు. కళాశాల గేట్ నుంచి రోడ్డుపైకి రాగానే పావగడ నుంచి తుమకూరుకు వెళ్లే కేఎస్ ఆర్టీసీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. తలకు బలమైన గాయాలైన సందీప్‌కుమార్‌ను కళాశాల సిబ్బంది, విద్యార్థులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే సందీప్‌కుమార్ మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. సందీప్‌కుమార్ మృతిని తట్టుకోలేని చెల్లెలు బ్లెస్సీ (18) బ్లేడుతో చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఎస్ఐ లింగన్న సంఘటన స్థలాన్ని పరిశీలించి, స్థానికులను విచారించారు. కేఎస్ ఆర్టీసీ బస్సును మడకశిర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే కళాశాల గేట్ వద్ద స్పీడ్ బ్రేకర్ వేసి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని ప్రజలు చర్చించుకోవడం కనిపించింది. -
మిగులు.. కొక్కులు!
ఎంఎల్ఎస్ పాయింట్లలో చేతివాటం - డిలర్కిచ్చే బియ్యంలో చిలక్కొట్టుడు - క్వింటాకి రెండు కేజీల మేర దోపిడీ - నెలసరి 5వేల క్వింటాళ్ల బియ్యం నల్లబజారుకు.. - ఎందుకొచ్చిన తలనొప్పని డీలర్ల మౌనం - బొక్కుడు తిలాపాపం తలా పిడికెడు 2962 - జిల్లాలోని చౌక ధరల దుకాణాలు 24 - ఎంఎల్ఎస్ పాయింట్లు 11.92 లక్షలు - కార్డులు 1.81 లక్షల క్వింటాళ్లు - ప్రతి నెలా సరఫరా చేస్తున్న బియ్యం 50 టన్నులు - నల్లబజారుకు తరలుతున్న బియ్యం మడకశిర ఎంఎల్ఎస్ పాయింట్ లెక్కల్లో 1200 బస్తాలు తేడా వచ్చినట్లు తెలిసింది. ఇక్కడి గోడౌన్ ఇన్చార్జిగా ఉన్న ఆర్ఐ రమేశ్‌ని బదిలీ చేస్తూ ఆయన స్థానంలో హిందూపురంలో పనిచేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ జయశేఖర్ని ఆర్ఐగా నియమించారు. బదిలీపై వచ్చిన ఆర్ఐకి అప్పటి వరకు అక్కడున్న ఆర్ఐ క్లోసింగ్ రికార్డుతో పాటు స్టాక్ రికార్డును చూపి స్వాధీనం చేయాల్సి ఉంది. ఆ సందర్భంగా 1200 బస్తాలు తేడా ఉన్నట్లు జయశేఖర్ గుర్తించారు. స్వాధీనం చేసుకుంటే సమస్య తన మెడకు చుట్టుకుంటుందనే భయంతో ఆయన సెలవులో వెళ్లిపోయారు. ‘‘ప్రజాపంపిణీ వ్యవస్థలో అవినీతి జరుగుతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా అంగీకరించారు.’’ జూన్ 9న ఎరువాకను ప్రారంభించేందుకు రాయదుర్గం నియోజకవర్గం ఉడేగోళం గ్రామానికి వచ్చిన ఆయన, అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. రేషన్ దుకాణాల్లో 1.5 శాతం అవినీతి జరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. అయితే ఎక్కడా ఎవరిపైనా చర్యలు తీసుకోకపోవడంతో పేదల బియ్యం పక్కదారి పడుతోంది. పుట్టపర్తి మండల పరిధిలో 39 చౌక దుకాణాలు ఉండగా.. కార్డుల సంఖ్య 24,952. కేటాయించిన బియ్యం 2,444.06 క్వింటాళ్లు. ఈ మండలంలోని ఒక చౌక దుకాణం పరిధిలో 510 కార్డులు ఉండగా.. 69.90 క్వింటాళ్ల కోటాలో 67 క్వింటాళ్లు మాత్రమే తరలించారు. మడకశిర మండల పరిధిలో 60 చౌక దుకాణాలు ఉండగా.. కార్డుల సంఖ్య 24,952. కేటాయించిన బియ్యం 3,855.67 క్వింటాళ్లు. ఈ మండలంలోని ఒక చౌక దుకాణం పరిధిలో 503 కార్డులు ఉండగా.. 82.50 క్వింటాళ్ల కోటాలో 80 క్వింటాళ్లతో సరిపెట్టారు. అనంతపురం అర్బన్: పేదల బియ్యానికి రెక్కలొచ్చాయి. మండల లెవల్ స్టాక్ పాయింట్లు(ఎంఎల్ఎస్) కేంద్రంగా ఈ వ్యవహారం సాగుతోంది. డీలర్లు ఇచ్చే ఇండెంట్ ఆధారంగా స్టాక్ పాయింట్ల నుంచి బియ్యం సరఫరా చేయాల్సి ఉండగా.. కొన్నిచోట్ల అధికారులు, సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఈ విధంగా ప్రతి నెలా దాదాపు 5వేల క్వింటాళ్ల(50 టన్నులు) బియ్యం నల్లబజారుకు తరలుతోంది. ఒక్కో ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి సగటున 7,500 క్వింటాళ్ల బియ్యం సరఫరా అవుతోంది. డీలర్లకు ఇచ్చే బియ్యంలో క్వింటాకు రెండు కేజీల వరకు నొక్కేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి నెలా కనీసంగా 200 క్వింటాళ్ల బియ్యం మిగుల్చుకుంటున్నట్లు సమాచారం. విషయం బయటకు పొక్కితే డీలర్‌షిప్‌కు ఎసరు వస్తుందనే భయంతో డీలర్లు కూడా ఈ భారాన్ని మౌనంగానే భరిస్తున్నారు. 70 క్వింటాళ్లు ఇవాల్సి ఉన్న డీలర్‌కు 67 క్వింటాళ్లతో సరిపెడుతున్నారు. అధికారులతో గొడవ పడి లేని తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకనే ఉద్దేశంతో మిన్నకుంటున్నట్లు పుట్టపర్తికి చెందిన ఒక డీలర్ తెలిపారు. కార్డుదారులకు బియ్యం పంపిణీ చేసే సమయంలో ఈ నష్టాన్ని సర్దుబాటు చేసుకుంటున్నట్లు వాపోయాడు. బియ్యం ఎందుకు తక్కువిస్తున్నారంటే.. బియ్యం తక్కువగా ఇవ్వడంపై కొందరు అధికారులు ఒక వాదన వినిపిస్తున్నారు. ప్రస్తుతం టెయిర్ వెయిట్(సంచి తూకం) ఇవ్వడం లేదని చెబుతున్నారు. క్వింటాకు రెండు బస్తాలు వస్తాయని, వీటి బరువు ఒక కేజీ 100 గ్రాములు ఉంటుందన్నారు. ప్రభుత్వం నుంచి సరఫరా అయ్యే బియ్యమే కింటా స్థానంలో 998.9 కేజీలు ఉంటోందన్నారు. ఇక లోడింగ్ అన్‌లోడింగ్‌లో కనీసం ఒక కేజీ మేర తరుగు ఉంటుందని.. అంటే క్వింటా మీద రెండు కేజీల వరకు తక్కువగా వస్తున్నాయని చెబుతున్నారు. ఈ తరుగు 120 టన్నుల మేర వస్తోందని ఆ వర్గాలు వెల్లడించాయి. దీనిని భర్తీ చేసుకునేందుకు డీలర్లకు కొందరు తక్కువగా ఇస్తుండవచ్చని చెప్పుకొస్తున్నారు. తరుగుని అంచనా వేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక బృందాన్ని నియమించిందని, ఆ బృందం రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి నిర్దేశించిన ఎంఎల్ఎస్ పాయింట్లలో తూకాలను, తరుగుని పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. స్టాక్ తూకం వేయిస్తున్నాం జయశేఖర్ శుక్రవారం విధుల్లో చేరారు. ఎంఎల్ఎస్ పాయింట్లో ఉన్న స్టాక్ తూకం వేయించే ప్రక్రియ శనివారం చేపడతాం. అక్కడికి ప్రత్యేకంగా టెక్నికల్ అధికారి భానుని పంపిస్తున్నాం. మొత్తం స్టాక్ తూకం వేయడానికి రెండు మూడు రోజులు పట్టొచ్చు. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత కొరత ఎంతనే విషయం తెలుస్తుంది. దీని ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా కొన్ని ఎంఎల్ఎస్ పాయింట్లలో బియ్యం తక్కువగా ఇస్తుండొచ్చు. వీటిని నిరోధించేందుకే ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లు, ఈ పాస్, లారీ వే బ్రిడ్జిని అమల్లోకి తీసుకొస్తున్నాం. – డి.శివశంకర్‌రెడ్డి, జిల్లా మేనేజర్, పౌర సరఫరాల సంస్థ -
28న పాలిటెక్నిక్ స్పాట్ అడ్మిషన్లు
మడకశిర : పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈనెల 28న ఉదయం 10గంటలకు స్పాట్ అడ్మిషన్లు ఉంటాయని ప్రిన్సిపల్ జి.కృష్ణమూర్తినాయుడు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ స్పాట్ అడ్మిషన్లలో పాల్గొనడానికి అర్హులన్నారు. ప్రధానంగా ఈఈఈ, డీటీటీ కోర్సులకు మాత్రమే స్పాట్ అడ్మిషన్లు ఉంటాయన్నారు. స్పాట్ అడ్మిషన్లో పాల్గొనే విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాలిటెక్నిక్ కళాశాలలో హాజరు కావాలన్నారు. -
కదులుతున్న గుప్తనిధుల డొంక
- నిందితుల్లో ఒకరు సాఫ్ట్వేర్ ఇంజినీర్, మరొకరు న్యాయవాది – కొనసాగుతున్న పోలీసుల విచారణ మడకశిర : గుప్తనిధుల వ్యవహారంలో డొంక కదులుతోంది. మడకశిర పోలీసుల అదుపులో ఉన్న గుప్తనిధుల ముఠా సభ్యులను పోలీసులు బుధవారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు పూర్తి స్థాయిలో విచారించారు. అమరాపురం మండలం హేమావతి శ్రీ సిద్ధేశ్వరస్వామి దేవాలయంలో గుప్తనిధుల తవ్వకాల కోసం వచ్చిన ఐదుగురు సభ్యుల ఈ ముఠా బుధవారం పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. ఈ ముఠా సభ్యులను అమరాపురం ఎస్ఐ వెంకటస్వామి అదుపులోకి తీసుకుని వెంటనే మడకశిరకు తరలించారు. స్థానిక సీఐ శుభకుమార్ ఎదుట హాజరు పర్చారు. ఈ ముఠా సభ్యులు బెంగళూరు, అనంతపురం, ఉరవకొండ ప్రాంతాలకు చెందినవారని పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ముఠా సభ్యుల్లో ఒకరు సాఫ్ట్వేర్ ఇంజినీరు, మరొకరు న్యాయవాది. ఈ సభ్యులు గత కొన్ని రోజుల నుండి శ్రీ సిద్ధేశ్వరస్వామి ఆలయంలో గుప్తనిధుల తవ్వకాలకు పథకం వేసుకున్నట్లు బయటపడింది. ఈ పథకంలో భాగంగానే 15 రోజుల క్రితం ఈ దేవాలయానికి ఈ ముఠా సభ్యులు వచ్చి పరిశీలించినట్లు సమాచారం. ఆ తర్వాత ఈ దేవాలయానికి ఈ ముఠా సభ్యులందరూ మూడు, నాలుగు సార్లు వచ్చినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. ఈ ముఠా సభ్యులు పథకం ప్రకారం ఆలయ కమిటీ వారిని, అర్చకులను లోబర్చుకుని ఈ ఆలయంలో గుప్తనిధులను తవ్వడానికి ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రయత్నాలు విఫలం కావడంతో ఈ ముఠా సభ్యులు పోలీసుల చేతికి చిక్కినట్లు తెలిసింది. రెండు వాహనాల్లో ఈ ముఠా సభ్యులు వచ్చినట్లు తెలిసింది. ఈ వాహనాలను కూడా ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిని లోతుగా విచారిస్తున్నారు. గతంలో ఎక్కడైనా ఈ ముఠా సభ్యులు గుప్త నిధులను తవ్వారో లేదో కూడా విచారించారు. అయితే ఇదే మొదటి సారిగా గుప్తనిధుల కోసం వచ్చినట్లు పోలీసుల విచారణలో వీరు చెప్పినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేస్తాం – శుభకుమార్, సీఐ, మడకశిర గుప్తనిధుల ముఠా సభ్యులపై కేసు నమోదు చేస్తాం. ప్రస్తుతం ఈ ముఠా సభ్యులను పూర్తి స్థాయిలో విచారిస్తున్నాం. ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదు. నియోజకవర్గంలో గుప్తనిధుల తవ్వకాలపై నిఘా పెంచుతాం. అనుమానితులపై ప్రజలు సమాచారం అందించాలి. -
ప్రశాంతంగా అగ్రి ఇంజినీరింగ్ సెట్ పరీక్ష
మడకశిర : పట్టణంలోని వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం అగ్రి ఇంజినీరింగ్ సెట్–2017 ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. అగ్రికల్చర్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ద్వితీయ సంవత్సరం ప్రవేశానికి నిర్వహించిన ఈ పరీక్షలకు డిప్లొమో విద్యార్థులకు 95.5శాతం హాజరయ్యారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి 170 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 161 మంది విద్యార్థులు హాజరయ్యారు. 94మంది బాలురు, 67మంది బాలికలు పరీక్ష రాసినట్లు అగ్రి ఇంజనీరింగ్ సెట్ కన్వీనర్ డాక్టర్ సీ రమణ తెలిపారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విద్యాలయం గుంటూరు నుంచి పాలిటెక్నిక్ కోఆర్డినేటర్ పీ సునీల్‌కుమార్ పరీక్షలను పరిశీలించారు. -
దొంగలు ఏకమవుతున్నారు
- ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పార్టీని బలోపేతం చేయాలి - జగన్ సీఎం అయితేనే ప్రజలకు న్యాయం - మడకశిర వైఎస్సార్సీపీ ప్లీనరీలో ఎంపీ మిథున్‌రెడ్డి - ఇక్కడి నుంచే బోణీ కొట్టాలి : శంకరనారాయణ - చంద్రబాబు అబద్ధాల కోరు : గురునాథరెడ్డి మడకశిర : రాష్ట్రంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి వ్యతిరేకంగా మరోమారు దొంగలందరూ ఏకమవుతున్నారని, వారి ప్రయత్నాలను పార్టీ శ్రేణులు తిప్పికొట్టాలని వైఎస్సార్సీపీ జిల్లా ఇన్చార్జ్, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి పిలుపునిచ్చారు. మడకశిరలోని శ్రీ సరస్వతీ విద్యామందిరం ఆవరణలో గురువారం వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తిప్పేస్వామి అధ్యక్షతన ప్లీనరీ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మిథున్‌రెడ్డితో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎల్ఎం మోహన్‌రెడ్డి, ప్లీనరీ ఇన్చార్జ్ గిర్రాజు నగేష్ తదితరులు హాజరయ్యారు. ముందుగా నేతలందరూ అమరాపురం బస్టాండులోని వైఎస్సార్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా బయల్దేరి సభాస్థలికి చేరుకున్నారు. ప్లీనరీలో మిథున్‌రెడ్డి మాట్లాడుతూ 2018లోనే ఎన్నికలు వస్తాయని, పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని సూచించారు. వైఎస్ జగన్ సీఎం అయితేనే ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. వైఎస్సార్ హయాంలో పార్టీలకు, కులాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తే, ఈ ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరుతో ఇబ్బంది పెడుతోందని విమర్శించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి నిధులు లేవని టీడీపీ నేతలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. నీరు - చెట్టు పనులకు మాత్రం నిధులు ఉంటాయా అని ప్రశ్నించారు. కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ అధైర్యపడొద్దని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పార్టీని కాపాడుకోవాలని సూచించారు. జగన్ సీఎం అయితే కష్టాలన్నీ తీరిపోతాయన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి హెచ్‌బీ నర్సేగౌడ్, మాజీ ఎమ్మెల్యే వైటీ ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వైసీ గోవర్దన్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జీబీ శివకుమార్, జిల్లా కార్యదర్శులు రంగేగౌడ్, వాగేష్, డాక్టర్ దేవరాజు తదితరులు పాల్గొన్నారు. సైనికుల్లా పనిచేయాలి - పార్టీ రాష్ట్ర నేత గిర్రాజు నగేష్ పార్టీ కార్యకర్తలు యుద్ధానికి సిద్ధం కావాలి. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సైనికుల్లా పని చేయాలి. ప్రజాకంటక టీడీపీ ప్రభుత్వాన్ని సాగనంపాలి. చంద్రబాబు పిట్టలదొర - అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి చంద్రబాబు పిట్టలదొర. సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారు. జిల్లాలోని మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారు. మడకశిరలో వైఎస్సార్సీపీని గెలిపించి జగన్‌కు కానుకగా ఇవ్వాలి. ఇక్కడి నుంచే బోణీ కొట్టాలి - వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ వైఎస్సార్ హయాంలో మడకశిర నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందింది. పార్టీకి మంచి పట్టున్న నియోజకవర్గం. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచే బోణీ కొట్టాలి. జగన్‌ను సీఎం చేయాలి. జిల్లాలోని అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అవినీతిలో కూరుకుపోయారు. అవినీతి పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి - ఎల్ఎం మోహన్‌రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి బెల్టుషాపులను తొలగించడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారు. హామీలను నిలబెట్టుకోలేని బాబుకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలి. అలగే జగన్‌ను సీఎం చేసే బాధ్యతను పార్టీ శ్రేణులు భుజానికెత్తుకోవాలి. ఆయన ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంది. చంద్రబాబు పాలనకు చరమగీతం పాడాలి చంద్రబాబు అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. అన్ని వర్గాల ప్రజలను నట్టేట ముంచారు. ఆయన పాలనకు చరమగీతం పాడాలి. పాలకులు ప్రజా సంక్షేమాన్ని విస్మరించి అక్రమార్జనపై దృష్టి పెడుతున్నారు. గతేడాది వేరుశనగ నష్టపోయిన రైతులకు నేటికీ పరిహారం, బీమా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రుణాలు మాఫీ కాక రైతులు, మహిళలు ఇబ్బందులు పడుతుంటే నయవంచన దీక్షలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్సీపీ పోరాటం చేస్తూ అందరికీ అండగా ఉంటుంది. రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలి. - డాక్టర్ తిప్పేస్వామి, వైఎస్సార్సీపీ మడకశిర నియోజకవర్గ సమన్వయకర్త -
ఈతకెళ్లి బాలుడి మృతి
మడకశిర రూరల్: మండలంలోని కల్లుమర్రి గ్రామానికి చెందిన నబీరసూల్ కుమారుడు షేక్ మన్సూర్ (12) ఈతకెళ్లి నీటమునిగి మృతిచెందాడు. బాలుడు కల్లుమర్రి ఉన్నతపాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవుల్లో బాలుడు కర్ణాటకలోని గౌరీబిదనూరు తాలూకా కుర్లపల్లి గ్రామంలో బంధువుల ఇంటికి వెళ్లాడు. ఆదివారం గ్రామసమీపంలోని చెరువులో ఈతకెళ్లి నీటిలో మునిగి మృతి చెందాడు. కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. స్వగ్రామం కల్లుమర్రిలో సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. -
కూలీల ఆటో బోల్తా: ఇద్దరి మృతి
పెనుకొండ: అనంతపురం జిల్లా మడకశిర సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 15 మంది ఉపాధి కూలీలతో వెళ్తున్న ఆటో మడకశిర రైల్వే గేట్ వద్దకు రాగానే అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ఆటోలో ఉన్న కూలీలలో కురవ నాగప్ప అనే కూలీ అక్కడికక్కడే మృతి చెందగా, మరో తొమ్మిది మందికి తీవ్ర గాయాలవడంతో వారిని అంబులెన్స్‌ల సాయంతో అనంతపురం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సావిత్రమ్మ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు సేకరించారు. చికిత్స పొందుతున్న కూలీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నేత్రపర్వం.. రథోత్సవం
మడకశిర : మడకశిరలోని కోట లక్ష్మీ వెంకటరమణస్వామి రథోత్సవం బుధవారం నేత్రపర్వంగా సాగింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తొలుత రథంలో ఉత్సవ విగ్రహాన్ని కొలువుదీర్చి పూజలు చేశారు. ఆ తర్వాత దేవాలయం నుంచి తేరువీధి వరకు రథాన్ని లాగారు. తేరు లాగడానికి భక్తులు పోటీపడ్డారు. ఎమ్మెల్యే ఈరన్న, ఎమ్మెల్సీ గుండుమలతిప్పేస్వామి, మునిసిపల్ కమిషనర్ సంగం శ్రీనివాసులు, చైర్పర్సన్ శరణ్య, కౌన్సిలర్లు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. అంతకుముందు ఆయన దేవాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ప్రభుత్వం తరపున తహసీల్దార్ హరిలాల్‌నాయక్, డీటీ శ్యామలాదేవి తదితరులు పట్టు వస్త్రాలను శ్రీవారికి సమర్పించారు. మాజీ ఎమ్మెల్యే వైవీ తిమ్మారెడ్డి జ్ఞాపకార్థం వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వైసీ గోవర్ధన్‌రెడ్డి కుటుంబ సభ్యులు కూడా శ్రీ వారికి పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు చేయించారు. శ్రీ అయ్యప్పస్వామి సేవా సమితి ఆధ్వర్యంలో ఎల్ఐసీ ఏజెంట్ శ్రీనివాసరావు భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. -
11న మడకశిరలో మెగా ఉద్యోగ మేళా
అనంతపురం న్యూసిటీ : మడకశిర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నెల 11న ఉదయం 10 గంటలకు మెగా ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు మేనేజర్ టీహెచ్ విల్సన్ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జాబ్ మేళాలో బహుళ జాతీయ కంపెనీలైన టెక్‌మహీంద్ర, అపోలో, కార్వే, పోలరీస్, ఇంటెలెంట్ గ్లోబల్ సర్వీసెస్, జెన్పాక్ట్, వినూత్నా ఫెర్టిలైజర్స్ తదితర కంపెనీలు మేళాను నిర్వహిస్తున్నాయన్నారు. పదో తరగతి పాస్/ఫెయిల్, ఏదైనా డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్ పూర్తి చేసిన వారు జాబ్‌మేళాలో పాల్గొనవచ్చన్నారు. -
రైతు సమస్యలపై వైఎస్సార్సీపీ ధర్నా
మడకశిర : రైతు సమస్యలపై వైఎస్సార్సీపీ మండల శాఖ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు మడకశిరలో గురువారం ఆందోళన నిర్వహించారు. రైతు సమస్యలను వెంటనే పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏడీసీసీ బ్యాంకు ఉపాధ్యక్షుడు కే ఆనందరంగారెడ్డి, రాష్ట్ర వైఎస్సార్సీపీ సంయుక్త కార్యదర్శి వైఎన్ రవిశేఖర్‌రెడ్డి, రాష్ట్ర వైఎస్సార్సీపీ రైతు విభాగం కార్యదర్శి ఎస్.ఆర్.అంజనరెడ్డి మాట్లాడుతూ 2015కు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీని వెంటనే ఇవ్వాలన్నారు. పంటబీమాకు ముడిపెట్టకుండా 2016కు సంబంధించిన పంట నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. పశువులకు గడ్డి, దాణాను ఉచితంగా సరఫరా చేసి ఆదుకోవాలన్నారు. ఉపాధి పథకం ద్వారా కూలీలకు విరివిగా పనులు కల్పించాలని చెప్పారు. తాగునీటి సమస్య పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. రుణమాఫీ కాని రైతులకు వెంటనే రుణ మాఫీని అమలు చేయాలని తెలిపారు. వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని స్థానిక డిప్యూటీ తహసీల్దార్ శ్యామలాదేవికి అందజేశారు. ఈ ధర్నాలో మండల కన్వీనర్ ఈచలడ్డి హనుమంతరాయప్ప, కౌన్సిలర్ పార్వతమ్మ దాసన్న, స్థానిక నాయకులు దశనాథ్రెడ్డి, జగన్నాథ్‌రెడ్డి, హిద్దూ, టైలర్ వెంకటేష్, ఉగ్రప్ప, మంజు, రాము, తిమ్మారెడ్డి, ఉదుగూరు నాగరాజు, వేమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అక్కడ మద్యం ముట్టరు!
అగళి (మడకశిర) : మూడు దశాబ్దాల క్రితం కుటీర పరిశ్రమల సారా కాచిన అగళి మండలంలోని హెచ్డీ తండా వాసుల్లో పరివర్తన వచ్చింది. సారా తయారీనే కాదు ఆఖరుకు మద్యం కూడా ముట్టడం లేదు. ఒకప్పుడు మత్తులో జోగిన వారే నేడు పంట సాగులో అద్భుత ఫలితాను సాధిస్తూ పలువురికి ఆదర్శంగా నిలిచారు. వివరాల్లోకి వెళితే.. వంద కుటుంబాలు ఉన్న హెచ్డీ తండాలో 500 మంది జీవిస్తున్నారు. 30 ఏళ్ల క్రితం బాల్యా నాయక్ అనే వ్యక్తి మాత్రమే అక్కడ విద్యావంతుడు. మిగిలిన వారికి అక్షరంముక్కరాదు. కుటుంబ పోషణకు గ్రామస్తులు సారా కాచేవారు. గ్రామంలోని పలు కుటుంబాలు సారా మత్తులో జోగుతుండేవి. కొందరు ప్రాణాలు సైతం కోల్పోవడంతో గ్రామంలో సారా తయారీ అరికట్టాలని బాల్యానాయక్ నిర్ణయించుకున్నారు. ఈ విషయంపై స్థానిక యువతను తోడుగా తీసుకున్నారు. సారా తయారీ, తాగుడు వల్ల జరుగుతున్న అనర్థాలపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు. కొన్ని రోజుల్లోనే వారు ఆశించిన ఫలితం కనిపించసాగింది. నెమ్మదిగా ఒక్కొక్కరు సారా కాచే పని మానుకుని వ్యవసాయంపై దృష్టిసారించసాగారు. గ్రామ పరిధిలో రెండు వేల ఎకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ అసైన్డ్ భూమిని అర్హులకు పంపిణీ చేయించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ వక్క, పూల తోటలతో లాభాలు గడించారు. ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్న సమయంలో పక్కా గృహాలను నిర్మించుకున్నారు. ప్రస్తుతం ఆ గ్రామంలో ఎటు చూసినా అభివృద్ధి కనడపడుతోంది. గ్రామంలో పిల్లలను బాగా చదివిస్తున్నారు. పలువురు ప్రభుత్వ ఉద్యోగులుగాను స్థిరపడ్డారు. పోలీసులు సైతం ఆ గ్రామం వైపు కన్నెత్తి చూడకపోవడంతో అక్కడ ప్రశాంతత వెల్లివిరుస్తోంది. అప్పట్లో కుటుంబాలు వీధులపాలయ్యాయి 40ఏళ్ల క్రితం సారా బట్టీలతో నిత్యం తాగి ఇంటికొచ్చేవారు. భార్య,పిల్లలను ఇబ్బందులకు గురి చేసేవారు. అప్పట్లో పలు కుటుంబాలు వీధిపాలయ్యాయి. ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది. పిల్లలను బాగా చదివిస్తున్నారు. అందరూ దీన్నే కోరుకుంటున్నారు.– ముద్దమ్మ, హెచ్‌డీహళ్లి తండా -
వివాహిత దారుణహత్య
అగళి (మడకశిర) : అగళి మండలం ఆర్జీపల్లిలో ఆదివారం రాత్రి రంగమ్మ (35) అనే వివాహిత దారుణహత్యకు గురైంది. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. రంగమ్మ, రామన్న దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. రామన్న గొర్రెల కాపరి కాపరి కావడంతో గడ్డి, నీరుకోసం గొర్రెలను మైసూర్ ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఇద్దరు కుమారులు బెంగళూరులో ఉపాధి కోసం వెళ్లారు. రంగమ్మ మాత్రమే ఇంటికి కాపలాగా ఉంటోంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి దుండగులు వచ్చి.. రంగమ్మను హత్య చేసి ఆమె చెవిలోని కమ్మలను దొంగిలించారు. బీరువా తాళం పగులగొట్టి దుస్తులను చిందరవందరగా పడేశారు. సోమవారం ఉదయం గ్రామస్తుల నుంచి సమాచారం తెలుసుకున్న సీఐ దేవానంద్, ఎస్ఐ నాగన్న సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బెంగళూరు నుంచి వచ్చిన కుమారుల ద్వారా వివరాలను సేకరించారు. -
పాలకుల పట్ల అప్రమత్తంగా ఉండండి
రాష్ట్ర ప్రజలకు పీసీసీ చీఫ్ రఘువీరా హెచ్చరిక మడకశిర : హేవిళంబి నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా లేకుంటే పాలకుల చేతిలో మోసపోవడం ఖాయమని పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి హెచ్చరించారు. ప్రతి ఏటా మాదిరిగానే ఉగాది పండుగ సందర్భంగా బుధవారం మడకశిరలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద లౌకికవాద పరిరక్షణ, ప్రజలకు మంచి జరగాలని ఆకాంక్షిస్తూ ఉదయం 11.20 నుంచి 12 గంటల వరకు మౌనదీక్ష చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడి రైతుల ఆత్యహత్యలు పెరుగుతున్నా, నివారణకు ప్రభుత్వం ఎటువంటి చర్యలూ చేపట్టలేదని మండిపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వ విధానాలతో లౌకికవాదానికి ముప్పు ఏర్పడిందన్నారు. ముస్లింలు, క్రిస్టియన్లు అభద్రతాభావంతో జీవనం సాగిస్తున్నారని, హిందువులకు కూడా మనశ్శాంతి లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. లౌకికవాదాన్ని పరిరక్షించుకోవాలని కోరారు. మౌనదీక్షలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్, నెల్లూరు జిల్లా ఆత్మకూరు కాంగ్రెస్ ఇన్చార్జ్ చేవూరు శ్రీధర్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సురంగలనాగరాజు, మండల కన్వీనర్ మంజునాథ్, పట్టణ కన్వీనర్ నాగేంద్ర, మాజీ మండల కన్వీనర్ ఆశ్వర్థనారాయణ, జిల్లా మైనార్టీసెల్ అధ్యక్షుడు జియాఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
వివాహిత అనుమానాస్పద మృతి
మడకశిర రూరల్ : మడకశిర ఆరేపేటలో నివాసముంటున్న కలీం భార్య నజియాబాను(23)అనుమానాస్పద స్థితిలో ఆదివారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. భర్త, అత్తమామలు అదనపు కట్నం కోసం తరచూ తమ బిడ్డను వేధించేవారని మృతురాలి బంధువులు ఆరోపించారు. ముందస్తు పథకం ప్రకారం నజియాబానును హతమార్చి, ఆ తరువాత ఆత్మహత్యగా చిత్రీకరించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బానుది మూమ్మటీకి హత్యేనని, నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. కాగా అత్తమామలు పరారీ కావడం అనుమానాలకు తావిస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అగళి, మడకశిరలో కనిష్ట ఉష్ణోగ్రత
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో చలితో పాటు ఎండలు కొనసాగుతున్నాయి. ఆదివారం తనకల్లు, అగళి, మడకశిరలో 10.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా రొద్దం 12.5 డిగ్రీలు, బెళుగుప్ప, అమరాపురం 12.9 డిగ్రీలు నమోదైంది. మిగతా మండలాల్లో 13 నుంచి 19 డిగ్రీల వరకు కొనసాగింది. చెన్నేకొత్తపల్లిలో 37.2 డిగ్రీల గరిష్టం నమోదు కాగా మిగతా మండలాల్లో 32 నుంచి 35 డిగ్రీల వరకు నమోదయ్యాయి. గాలిలో తేమశాతం ఉదయం 62 నుంచి 82, మధ్యాహ్నం 12 నుంచి 22 శాతం మధ్య ఉంది. గంటకు 6 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లు వాతావరణ విభాగం నివేదిక తెలియజేసింది. -
క్వార్టర్స్‌కు నార్పల, మడకశిర
- అనంత ప్రీమియర్ లీగ్ పోటీల్లో సత్తా అనంతపురం సప్తగిరిసర్కిల్ : జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఆర్డీటీ సహకారంతో స్థానిక అనంత క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న అండర్–16 బాలుర అనంత ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు ఆదివారం రసవత్తరంగా సాగాయి. క్రికెట్ పోటీల్లో నార్పల, మడకశిర జట్లు నాకౌట్ స్థాయి నుంచి క్వార్టర్‌కు చేరాయి. కాగా ఇప్పటికే ఆర్డీటీ అకాడమీ, కదిరి, ఆత్మకూరు, ధర్మవరం, గుంతకల్లు, కణేకల్లు జట్లు క్వార్టర్స్‌కు చేరిన విషయం తెలిసిందే. అయితే తాజాగా నార్పల, మడకశిర జట్లు క్వార్టర్స్‌కు చేరాయి. మ్యాచ్ వివరాలు విన్సెంట్ క్రీడా మైదానంలో పెనుకొండ, నార్పల జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన నార్పల జట్టు 38.3 ఓవర్లలో 227 పరుగులకు ఆలౌటైంది. జట్టులో విజయకృష్ణ (73) రాణించారు. పెనుకొండ బౌలర్లు బాబా ఫకృద్దీన్, ఖాదర్ తలా 4 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పెనుకొండ జట్టు 26.3 ఓవర్లలో 77 పరుగులకే కుప్పకూలింది. నార్పల జట్టు బౌలర్లు లక్ష్మీకాంత్ 4, విష్ణువర్ధన్ 3 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. అదేవిధంగా బీ గ్రౌండ్లో ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ మడకశిర, తాడిపత్రి జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన మడకశిర జట్టు 42 ఓవర్లలో 227 పరుగులు చేసింది. జట్టులో భీమానాయక్ (61), అల్తాఫ్ (51) అర్ధశతకాలతో రాణించారు. తాడిపత్రి జట్టులో రమేష్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన తాడిపత్రి నిర్ణీత 45 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసి ఓడింది. జట్టులో లక్ష్మణ్‌కుమార్ (96) త్రుటితో సెంచరీ మిస్సయ్యాడు. వచ్చే ఆదివారం క్వార్టర్స్ మ్యాచ్‌లు నిర్వహించనున్నట్టు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి బీఆర్ ప్రసన్న తెలిపారు. క్వార్టర్స్ మ్యాచ్‌ల వివరాలు కదిరి–నార్పల ధర్మవరం–ఆత్మకూరు గుంతకల్లు–కణేకల్లు ఆర్డీటీ అకాడమీ–ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ మడకశిర -
ఇది తాలిబన్ పాలనా..?
- రైతులను తీగలకు వేలాడదీసినా పట్టించుకోరా? - వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో నడుస్తున్నది చంద్ర బాబు పాలనా? తాలిబన్ పాలనా? అని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. రైతులను కరెంటు తీగలకు వేలాడదీస్తున్నా కళ్లప్పగించి చూస్తున్న రాక్షస ప్రభుత్వమిది అని మండిపడ్డారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఇంత జరుగుతున్నా సీఎంగానీ, ఒక్క మంత్రిగాని స్పందించకపోవడం దారుణమన్నారు. శాంతి భద్రతలు పూర్తిగా మర్చిపోయారని, చట్టాన్ని గౌరవించడం ఈ ప్రభుత్వంలో లేదని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. టీడీపీ నేతలు అధికారమదంతో ఇష్టానుసారంగా వ్యవహ రిస్తుంటే పోలీసులు నిద్రపోతున్నారా? అని ప్రశ్నించారు. (చదవండి: పరిహారమడిగితే వేలాడదీశారు!) ఏపీ సీఎం బాటలోనే టీడీపీ నేతలు అనంతపురం జిల్లాలో ఎలాంటి పరిహారం ఇవ్వకుండా తన భూమి మీదుగా కరెంటు తీగలు వేయడాన్ని వ్యతిరేకించిన రైతు పట్ల, ఒంటరి మహిళ మీద టీడీపీ సర్పంచ్ చేసిన గూండాగిరీ వంటివి తాలిబన్ల పాలనలో తప్ప ఎక్కడా జరగవని వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేశ్‌లను కూడా తీగలకు వేలాడదీస్తే రైతుల బాధలు తెలుస్తాయన్నారు. చీరాలలో ఎమ్మెల్యే ఆమంచి సోదరుడు, అతని అనుచరులు ఓ జర్నలిస్టుపై గూండా ల్లాగా జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా మని చెప్పారు. ప్రజల తరపున మీడియా ప్రశ్నిస్తే భౌతిక దాడులకు పాల్పడతారా? అని ప్రశ్నించారు. మహిళా తహసీల్దార్ వనజాక్షిని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అతని అనుచరులు జుట్టుపట్టుకొని కొట్టిన రోజునే శిక్షించి ఉంటే పరిస్థితి ఇక్కడి వరకు వచ్చేది కాదన్నారు. ప్రత్యేక హోదాపై ప్రశ్నించినందుకు నువ్వే చానల్ విలేకరివి? అని స్వయానా సీఎం బెదిరిస్తుంటే పార్టీ నేతలు వేరేలా ఎలా ప్రవర్తిస్తారని ఎద్దేవా చేశారు. కమీషన్లు దండుకోవడానికేనా..? కాంట్రాక్టర్లకు, అవినీతి మంత్రులకు కొమ్ముకాసి వారి నుంచి వాటాలు పంచుకోవటానికే ఈ ప్రభుత్వం పనిచే స్తుందని పద్మ దుయ్యబట్టారు. నెల్లూరు జిల్లాలో రైల్వే లైన్ వేయకుండా కమీషన్ల కోసం అడ్డుకున్న చరిత్ర టీడీపీ ఎమ్మెల్యేలకు ఉందన్నారు. గుంటూరులో కమీషన్ల కోసం స్పీకర్ కోడెల కుమారుడు పనులు ఆపుతున్నారని కేంద్రా నికి ఫిర్యాదు చేశారన్నారు. చంద్రబాబు విష సంస్కృతిని పోషించినా, తాము అధికారంలోకి వచ్చాక వారి కోరలు పీకుతామని హెచ్చరించారు. ప్రత్యేక హోదాపై ప్రజల్లో దావానలంలా ఉన్న అగ్నిగోళం బద్దలైన రోజున మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. -
మడకశిరలో కనిష్ట ఉష్ణోగ్రత 10.7 డిగ్రీలు
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో ఓ వైపు చలి, మరోవైపు ఎండలు కొనసాగుతున్నాయి. ఆదివారం మడకశిరలో 10.7 డిగ్రీలు, అగళి 11.1 డిగ్రీలు, తనకల్లు 11.2 డిగ్రీలు, రొద్దం 12.4 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చలితీవ్రత కొనసాగుతోంది. మిగతా మండలాల్లో 13 నుంచి 19 డిగ్రీల వరకు కొనసాగాయి. పగటి ఉష్ణోగ్రతలు 30 నుంచి 34 డిగ్రీలు నమోదయ్యాయి. గాలిలో తేమశాతం ఉదయం 65 నుంచి 85, మధ్యాహ్నం 12 నుంచి 22 శాతం మధ్య రికార్డు కాగా, గాలులు గంటకు 6 నుంచి 14 కిలోమీటర్ల వేగంతో వీచాయి. -
మడకశిరలో 13.1 డిగ్రీల కనిష్టం
అనంతపురం అగ్రికల్చర్ : గత వారం స్వల్పంగా పెరిగిన రాత్రి ఉష్ణోగ్రతలు మరోసారి కాస్త తగ్గుముఖం పట్టాయి. పగటి ఉష్ణోగ్రతలు, మధ్యాహ్న సమయంలో గాలిలో తేమశాతం పెరిగింది. ఈ క్రమంలో రాత్రిళ్లు కొంత చలివాతావరణం కొనసాగుతున్నా మధ్యాహ్న సమయంలో ఎండలు కనిపిస్తున్నాయి. మంగళవారం మడకశిరలో 13.1 డిగ్రీల కనిష్టం ఉష్ణోగ్రత నమోదైంది. అగళి 13.2 డిగ్రీలు, కనగానపల్లి 13.9 డిగ్రీలు, నల్లమాడ 14.3 డిగ్రీలు, రొద్దం 14.4 డిగ్రీలు, కళ్యాణదుర్గం 14.5 డిగ్రీలు, పుట్లూరు 14.6 డిగ్రీలు, రాయదుర్గం 14.8 డిగ్రీలు, గాండ్లపెంట 14.9 డిగ్రీలు నమోదు కాగా మిగతా మండలాల్లో 15 నుంచి 19 డిగ్రీల వరకు కొనసాగాయి. జిల్లా అంతటా పగటి ఉష్ణోగ్రతలు 32 నుంచి 34 డిగ్రీల వరకు నమోదైంది. గాలిలో తేమశాతం ఉదయం 68 నుంచి 88 మధ్య ఉండగా మధ్యాహ్న సమయంలో 15 నుంచి 25 శాతానికి పడిపోయింది. గంటకు 6 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. కాగా రానున్న నాలుగు రోజులూ పగటి ఉష్ణోగ్రతలు 29 నుంచి 33 డిగ్రీలు, కనిష్టం 16 నుంచి 19 డిగ్రీల మధ్య నమోదు కావచ్చని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా కేంద్రం వాతావరణ విభాగం శాస్త్రవేత్తలు డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్ బి.సహదేవరెడ్డి మంగళవారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్నారు. గాలిలో తేమ శాతం ఉదయం 50 నుంచి 63, మధ్యాహ్నం 29 నుంచి 31 శాతం మధ్య ఉండవచ్చన్నారు. గంటలకు 7 నుంచి 9 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. -
మడకశిర మున్సిపల్ చైర్మన్ ప్రకాష్ రాజీనామా
మడకశిర రూరల్ : మడకశిర మున్సిపల్ చైర్మన్ ప్రకాష్ గతంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం బుధవారం చైర్మన్ పదవికి రాజీనామా చేసి కమిషనర్ నయీమ్ అహమ్మద్‌కు అందజేశారు. రాజీనామాను ఉన్నత అధికారులకు పంపుతామని కమిషనర్ తెలిపారు. వారు ఆమోదించిన తర్వాత కొత్త చైర్మన్‌ను ఎన్నుకునేవరకు మున్సిపాల్ ఉపాధ్యక్షులుగా ఉన్న ఓబన్నకు ఇన్చార్జ్ చైర్మన్ బాధ్యతలు అప్పగిస్తారని టీడీపీ నాయకులు తెలిపారు. -
మడకశిర, అగళిలో 12.5 డిగ్రీలు కనిష్టం
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో చలి వాతావరణం కొనసాగుతోంది. బుధవారం మడకశిర, అగళిలో 12.5 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా.. తనకల్లు 12.9 డిగ్రీలు, రొద్దం 13.5 డిగ్రీలు, సోమందేపల్లి 13.5 డిగ్రీలు, కనగానపల్లి 13.8 డిగ్రీలు నమోదైంది. మిగతా మండలాల్లో 14 నుంచి 19 డిగ్రీల వరకు కొనసాగాయి. పగటి ఉష్ణోగ్రతలు 30 నుంచి 32 డిగ్రీలు నమోదయ్యాయి. -
మడకశిరలో కనిష్ట ఉష్టోగ్రత 13.8 డిగ్రీలు
అనంతపురం అగ్రికల్చర్ : పగటి ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతుండగా రాత్రి ఉష్ణోగ్రతలు, గాలి వేగం స్వల్పంగా పెరిగాయి. చలి వాతావరణంం కొనసాగుతోంది. ఆదివారం మడకశిరలో 13.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. తనకల్లు 14 డిగ్రీలు, సోమందేపల్లి 14.6 డిగ్రీలు, రొద్దం 14.7 డిగ్రీలు కొనసాగింది. మిగతా మండలాల్లో 15 నుంచి 20 డిగ్రీల వరకు నమోదయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలు 29 నుంచి 33 డిగ్రీల మధ్య ఉన్నాయి. గాలిలో తేమ శాతం ఉదయం 65 నుంచి 85, మధ్యాహ్నం 35 నుంచి 45 శాతం మధ్య రికార్డయింది. గాలులు గంటకు 8 నుంచి 16 కిలోమీటర్ల వేగంతో వీచాయి. -
ఐక్యతే వీరశైవులకు బలం
- వీరశైవుల మహాసభలో శ్రీశైలం పీఠాధిపతి శివాచార్య మహాస్వామి మడకశిర : వీరశైవులకు ఐక్యతే బలమని శ్రీశైలం పీఠాధిపతి, డాక్టర్ చెన్న సిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామి తెలిపారు. మడకశిరలో బుధవారం టీటీడీ కళ్యాణ మండపంలో అఖిల భారత వీరశైవ మహాసభ జరిగింది. ముందుగా పట్టణంలో నిర్వహించిన ఊరేగింపులో మహాస్వామిని వెండిరథంపై కళ్యాణ మండపం వరకు తీసుకొచ్చారు. 108 మంది మహిళలు పూర్ణకుంభాలతో ఽఈ ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మహాస్వామి మాట్లాడుతూ సమైక్యంగా ఉంటేనే వీరశైవలు అన్ని విధాలుగా బలపడుతారని చెప్పారు. 10 వేల మందికి పైకా సభకు హాజరవడం సంతోషంగా ఉందన్నారు. మహాసభకు అధ్యక్షత వహించిన వీరశైవుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కృషితోనే వీరశైవులను బీసీలుగా గుర్తించారని అనగానే సభికులు చప్పట్లు కొట్టి ఈలలు వేశారు. వీరశైవులంతా సమైక్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే కే సుధాకర్ మాట్లాడుతూ ఐక్యతతోనే ఏదైనా సాధించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. మాజీ మంత్రి నర్సేగౌడ్ మాట్లాడుతూ వీరశైవులను ఓబీసీలుగా గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వంపై కాపు రామచంద్రారెడ్డి ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మాట్లాడుతూ శ్రీశైలం మహాస్వామి మడకశిర ప్రాంతంలో అడుగుపెట్టడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే వైటీ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ వీరశైవులు ఐక్యంగా ఉండి అభివృద్ధి సాధించాలని కోరారు. మడకశిర వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ తిప్పేస్వామి మాట్లాడుతూ వీరశైవులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని తెలిపారు. అనంతరం 85 మంది వీరశైవ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. తర్వాత శ్రీశైలం క్యాలెండర్లను ఆవిష్కరించారు. -
మడకశిరలో 8.9 డిగ్రీల కనిష్టం
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లా వ్యాప్తంగా చాలా మండలాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదుకావడంతో చలితీవ్రత పెరిగింది. బుధవారం మడకశిరలో 8.9 డిగ్రీల కనిష్టం నమోదైంది. రొద్దం 9.6 డిగ్రీలు, సోమందేపల్లి 9.8 డిగ్రీల ఉష్టోగ్రత నమోదైంది. కొత్తచెరువు, గాండ్లపెంట, అగళి, కనగానపల్లి , నల్లమాడ , ఎన్పీ కుంట , హిందూపురంలలో పది డిగ్రీలకు పైగా నమోదు అయింది. చెన్నేకొత్తపల్లి 11 డిగ్రీలు, ఓడీ చెరువు 11.4 , తాడిమర్రి 11.5 , లేపాక్షి 11.7 , తలుపుల 11.8 , పుట్లూరు 11.9 , నల్లచెరువు 11.9 , అమడగూరు 11.9 డిగ్రీల మేర నమోదయ్యాయి. మిగతా మండలాల్లో 12 నుంచి 16 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు కొనసాగాయి. -
మున్సిపాలిటీలకు నిధులు మంజూరు
14వ ఆర్థిక సంఘం నిధులు రూ.148.79 కోట్లు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద మరో రూ.137.28 కోట్లు మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ విజయలక్ష్మి మడకశిర : మున్సిపల్ రీజనల్ పరిధిలోని కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఉన్న 38 మున్సిపాలిటీలకు నిధులు మంజూరైనట్లు మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. 2016 - 17వ ఆర్థిక సంవత్సరంలో 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.148.79 కోట్లు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద మరో రూ.137.28 కోట్లు మున్సిపాలిటీలకు మంజూరయ్యాయన్నారు. ఆమె సోమవారం మడకశిరకు వచ్చిన సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సబ్‌ప్లాన్ నిధుల్లో ఎస్సీల అభివృద్ధికి రూ.77.65 కోట్లు, ఎస్టీల అభివృద్ధికి రూ.59.63 కోట్లు కేటాయించారన్నారు. 2015 - 16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రావాల్సిన 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.101.60 కోట్లు, సబ్‌ప్లాన్ నిధులు రూ.333.36 కోట్లు కూడా మున్సిపాలిటీలకు వచ్చాయన్నారు. ఈ నాలుగు జిల్లాల పరిధిలో గత డిసెంబరుకు రూ.212.35 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయాల్సి ఉండగా, రూ.109.84 కోట్లు(52శాతం) మాత్రమే వసూలైనట్లు తెలిపారు. పన్ను వసూళ్లను 75శాతానికి పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రీజనల్ పరిధిలోని కర్నూలు, తాడిపత్రి, కడప, ప్రొద్దుటూరు, శ్రీకాళహస్తి, ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపాలిటీలకు మొదటి విడతలో ఏహెచ్‌పీ కింద రూ.27,900 ఇళ్లు మంజూరైనట్లు తెలిపారు. అదే విధంగా హౌసింగ్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీలకు బీఎల్సీ కింద 17,470 ఇళ్లు మంజూరయ్యాయన్నారు. 38 మున్సిపాలిటీల పరిధిలో స్వచ్ఛభారత్ కింద 56,333 మరుగుదొడ్లను నిర్మించామన్నారు. 162 కమ్యూనిటీ మరుగుదొడ్లను మంజూరు చేశామని, ఇందులో 68 పూర్తి చేశామని తెలిపారు. అన్ని మున్సిపాలిటీల పరిధిలో 84,677 కుక్కలు ఉంటే అందులో 42,247 కుక్కలకు ఆపరేషన్లు చేయించామన్నారు. మున్సిపాలిటీ కార్యాలయాల్లో ఈ - ఆఫీస్‌కు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఇంతవరకు రీజనల్ పరిధిలో 3,485 ఫైళ్లను ఈ - ఆఫీస్ ద్వారా నిర్వహించామన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ప్రవేశపెట్టిన ‘పురసేవ’ యాప్‌ద్వారా 5,200 ఫిర్యాదులు వచ్చాయని, ఇందులో 4,500 పరిష్కరించామని చెప్పారు. మున్సిపాలిటీల పరిధిలో నగదు రహిత లావాదేవీలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. స్వైపింగ్ మిషన్ల కోసం 3,700 దరఖాస్తులు రాగా 960 మిషన్లను సరఫరా చేశామన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ ప్రకాష్, కమిషనర్ నయీద్అహమ్మద్ పాల్గొన్నారు. -
నేడు మడకశిరలో విద్యుత్ అదాలత్
అనంతపురం అగ్రికల్చర్ : విద్యుత్ వినియోగదారులకు సంబంధించి దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం గురువారం మడకశిర ట్రాన్స్‌కో సబ్ డివిజన్ ఆఫీస్‌లో ప్రత్యేక విద్యుత్ అదాలత్ ఏర్పాటు చేసినట్లు ట్రాన్స్‌కో ఎస్ఈ ఆర్ఎన్ ప్రసాదరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే అదాలత్‌ను వినియోగదారులు ఉపయోగించుకోవాలని సూచించారు. -
మడకశిరలో కనిష్టం
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లా వ్యాప్తంగా రాత్రి ఉష్ణోగ్రతలు స్వల్పంగా మారాయి. కొన్ని మండలాల్లో స్వల్పంగా పెరిగినట్లు కనిపించినా చలితీవత్ర మాత్రం తగ్గలేదు. పగటి ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతుండగా గాలివేగం స్వల్పంగా పెరిగింది. గురువారం మడకశిర మండలంలో 11.1 డిగ్రీల కనిష్టం నమోదు కాగా, రొద్దం, తనకల్లులో 11.7 డిగ్రీలు, అగళిలో 11.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక మిగతా మండలాల్లో 13 నుంచి 18 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలు జిల్లా అంతటా 29 నుంచి 33 డిగ్రీలుగా నమోదయ్యాయి. -
డబ్బిస్తా... వెళ్లిపో
భార్యను వేధిస్తున్న ఎస్ఐ రెండో పెళ్లికి యత్నాలు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు హిందూపురం అర్బన్: ప్రేమిస్తున్నానని చెప్పి వివాహం చేసుకుని ఇప్పుడు తనని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఒక ఎస్సైపై మహిళ ఫిర్యాదు చేసింది. అనంతపురం జిల్లా పరిగి మండలం పెద్దరెడ్డిపల్లికి చెందిన శివకుమార్, మడకశిరకు చెందిన షేక్ నగీనా హిందూపురంలోని ఓ కళాశాలలో డిగ్రీ చదివేటప్పుడే ప్రేమించుకున్నారు. డిగ్రీ పూర్తయ్యాక ఆమె కానిస్టేబుల్ ఉద్యోగం సాధించింది. ఆమె ఆర్థిక సహకారంతో శివకుమార్ ఎంబీఏ పూర్తి చేశారు. కొంతకాలం తర్వాత శివకుమార్ వీఆర్ఓ పోస్టు సాధించారు. ఇద్దరికీ ఉద్యోగం రావడంతో పెళ్లి చేసుకుందామని ఆమె కోరారు. ఎస్ఐ కావడం తన లక్ష్యమని, అప్పటిదాకా ఆగుదామని శివ చెప్పారు. దీంతో ఎస్ఐ పోస్టు కోసం ఇద్దరూ హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకున్నారు. నగీనాకు అవకాశం రాకపోగా, శివకుమార్ పోస్టు సాధించారు. శిక్షణ సమయంలోనే పెళ్లి చేసుకుందామని కోరినా ఆయన స్పందించలేదు. దీంతో నగీనా పోలీసు అధికారుల సంఘం నాయకులను ఆశ్రయించారు. ఈ విషయాన్ని వారు జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన స్పందించి ఇద్దరికీ అనంతపురంలోని పోలీసు శిక్షణా కళాశాల(పీటీసీ)లో 2015 డిసెంబర్ ఐదున వివాహం చేశారు. శిక్షణలో ఉన్నప్పుడే శివకుమార్ తండ్రికి జబ్బు చేయగా.. నగీనా భారీగా ఖర్చుచేసి వైద్యం చేయించారు. శివకుమార్ చిత్తూరు జిల్లా కేవీబీపురం ఎస్ఐగా నియమితులయ్యారు. అనంతపురం జిల్లా గుడిబండలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నగీనా భర్తతో కలసి ఉండాలని భావించి రెండు నెలల క్రితం సెలవుపెట్టి అక్కడికి వెళ్లారు. కొన్నిరోజులకే శివకుమార్ తన కుటుంబసభ్యులతో కలసి వేధించడం మొదలుపెట్టారు. డబ్బు ఎంతైనా ఇస్తానని, వెళ్లిపోవాలని వేధించేవారు. దీంతో ఆమె మనస్తాపానికి గురై హిందూపురం వన్‌టౌన్ సీఐ ఈదురుబాషాకు ఫిర్యాదు చేశారు. శివకుమార్‌కు జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రముఖ నేత బంధువుల అమ్మాయితో రెండో పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. -
వివాహిత ఆత్మహత్యాయత్నం
రొద్దం : మండలంలోని కంచిసముద్రంలో ఓ వివాహిత(25) బుధవారం మధ్యాహ్నం ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు. అటు భర్త, ఇటు ప్రియుడి చేష్టలతో విసుగెత్తిన ఆమె జీవితంపై విరక్తి చెంది ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుందన్నారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. స్టేషన్ హౌస్ ఆఫీసర్ నరసింహులు తమ సిబ్బందితో కలసి గ్రామానికి చేరుకుని జరిగిన సంఘటనపై విచారణ చేశారు.