తహసీల్దార్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేత | suspension cancel on tahasildar | Sakshi
Sakshi News home page

తహసీల్దార్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేత

Published Thu, Aug 31 2017 9:57 PM | Last Updated on Tue, Sep 12 2017 1:29 AM

suspension cancel on tahasildar

అనంతపురం అర్బన్‌: మడకశిర తహసీల్దారు డి.హరిలాల్‌నాయక్‌పై విధించిన సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ ఉత్తర్వులు బుధవారం జారీ చేశారని రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శీలా జయరామప్ప తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహించాంటూ ఈ నెల 22న తహసీల్దార్‌ని కలెక్టర్‌ సస్పెండ్‌ చేశారన్నారు. సంఘం తరఫున 23వ తేదీన కలెక్టర్‌ని కలిసి సస్పెన్షన్‌ ఎత్తివేయాలని విన్నవించామన్నారు. తమ విన్నపంపై కలెక్టర్‌ స్పందిస్తూ తహసీల్దారుపై విధించిన సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ ఉత్తర్వులు ఇచ్చారన్నారు. తమ విన్నపంపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్‌కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement