సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: మడకశిర నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి ఆధ్వర్యంలో సామాజిక సాధికార బస్సు యాత్ర జరిగింది. మడకశిర పట్టణంలోని సరస్వతి విద్యామందిరం నుంచి వైఎస్సార్ సర్కిల్ దాకా బస్సు యాత్ర సాగింది. అనంతం వైఎస్సార్ సర్కిల్ లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యేలు డాక్టర్ తిప్పేస్వామి, శంకర్ నారాయణ, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్మన్ బోయగిరిజమ్మ, హిందూపురం వైఎస్సార్ సీపీ సమన్వయకర్త కురుబ దీపిక పాల్గొన్నారు.
చంద్రబాబుకు విశ్వసనీయత లేదు. చంద్రబాబు ఇచ్చే హామీలను నమ్మొద్దు. మోసం చేయడం ఆయన అలవాటు. కులాలు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం జగన్‌దే. 2024 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 175 సీట్లు ఖాయం
-మంత్రి గుమ్మనూరు జయరాం
చంద్రబాబు-పవన్ కళ్యాణ్ పొత్తు ఎలాంటి ప్రభావం చూపదు. తెలంగాణ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కంటే బర్రెలక్కకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగ చంద్రబాబు. కేసుల భయంతో ఏపీ ప్రయోజనాలు తాకట్టు పెట్టిన దుర్మార్గుడు చంద్రబాబు. సీఎం జగన్ పేదల పక్షపాతి
-హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్
Comments
Please login to add a commentAdd a comment