![Madakasira Tdp Candidate Attacked By Gundumala Thippeswamy Followers - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/24/Madakasira-SunilKumar.jpg.webp?itok=90JVZhTs)
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: మడకశిర టీడీపీ అభ్యర్థి సునీల్ కుమార్‌కు ఘెర పరాభవం ఎదురైంది. సునీల్ కుమార్‌పై మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి వర్గీయులు చెప్పులతో దాడి చేశారు. మడకశిర పట్టణంలోని టీడీపీ నేత గుండుమల తిప్పేస్వామి ఇంటి వద్ద ఘటన జరిగింది. మడకశిర నియోజకవర్గంలో కొంత కాలంగా మాజీ ఎమ్మెల్యే ఈరన్న, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మధ్య వర్గపోరు సాగుతోంది.
మాజీ ఎమ్మెల్యే ఈరన్న కొడుకు సునీల్ కుమార్‌కు చంద్రబాబు టికెట్ ఖరారు చేయగా, మద్దతు కోరేందుకు టీడీపీ అభ్యర్థి సునీల్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఈరన్న.. తిప్పేస్వామి ఇంటికెళ్లారు. దీంతో ఇద్దరిపైనా చెప్పులతో దాడి చేసి తరిమేశారు. మడకశిర టీడీపీ గ్రూపు రాజకీయాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
అనంతపురం జిల్లా టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
అనంతపురం జిల్లా టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. శింగనమల టీడీపీ అభ్యర్థి గా బండారు శ్రావణి నియామకంపై అసంతృప్తి భగ్గుమంది. టూమెన్ కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి, ఆలం నరసానాయుడు ఆధ్వర్యంలో నిరసన జరిగింది. జిల్లా టీడీపీ కార్యాలయంపై అసమ్మతి నేతలు రాళ్లు రువ్వారు. టీడీపీ కార్యాలయంలో అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. చంద్రబాబు, లోకేష్‌లకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు.
ఇదీ చదవండి: ‘తుప్పు పట్టిన సైకిల్-పగిలిపోయిన గ్లాసుకు గోల్డ్ కవరింగ్’
Comments
Please login to add a commentAdd a comment