Sunil Kumar
-
మంత్రి గారూ.. జోక్యం చేసుకోండి!
కేంద్ర క్రీడా శాఖా మంత్రి మన్సుఖ్ మాండవీయ(Mansukh Mandaviya)ను కలిసేందుకు భారత రెజ్లర్లు శనివారం ఆయన నివాసం వద్దకు వెళ్లారు. అల్బేనియాలో జరగనున్న అంతర్జాతీయ రెజ్లింగ్ ర్యాంకింగ్ సిరీస్‌కు తమను పంపేలా ఏర్పాట్లు చేయించాలని విజ్ఞప్తి చేయాలని భావించారు. అయితే, మంత్రి ఇంట్లో లేకపోవడంతో వారికి నిరాశే మిగిలింది.కాగా కేంద్ర క్రీడాశాఖ, భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI)ల మధ్య కొరవడిన సమన్వయంతో రెజ్లర్లు మూల్యం చెల్లించుకుంటున్నారు. ఇప్పటికే ఈ సీజన్లో తొలి ర్యాంకింగ్ సిరీస్ టోర్నమెంట్‌కు దూరమైన భారత రెజ్లర్లు... మళ్లీ ఇప్పుడు రెండో ర్యాంకింగ్ సిరీస్ టోర్నీకి వెళ్లలేని పరిస్థితి వచ్చింది. డబ్ల్యూఎఫ్ఐ నిర్ణీత సమయంలోగా అవసరమైన డాక్యుమెంట్లు సమకూర్చకపోవడంతో అల్బేనియాలో జరగనున్న అంతర్జాతీయ రెజ్లింగ్ ర్యాంకింగ్ సిరీస్‌కు రెజ్లర్లను పంపలేక పోతున్నామని క్రీడాశాఖ ... సమాఖ్య తీరుపై విమర్శించింది.సమాఖ్య నిర్వాకం వల్లే‘డబ్ల్యూఎఫ్ఐ ప్రతిపాదిత జాబితాను గడువులోగా పంపడంలో తాత్సారం చేసింది. భారత స్పోర్ట్స్ అథారిటీ (SAI)కి చాలా ఆలస్యంగా జాబితా చేరడంతో తదుపరి ప్రక్రియను చేపట్టలేకపోయాం. ఏదైనా అంతర్జాతీయ టోర్నీలకు వెళ్లాలంటే ఓ పద్ధతి ఉంటుంది. ముందస్తు ప్రతిపాదన, తదుపరి డాక్యుమెంట్ల పరిశీలన తదనంతరం తుది జాబితా ఆమోదించబడాలి. కానీ సమాఖ్య నిర్వాకం వల్లే జాబితా ఆలస్యమైంది. ఆమోదానికి దూరమైంది. దీంతో అథ్లెట్లు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయారు’ అని క్రీడాశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ విషయంలో క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవీయ జోక్యం కోరుతూ.. ఆసియా చాంపియన్ సునిల్ కుమార్, అండర్-23 ఆసియా చాంపియన్‌షిప్ స్వర్ణ పతక విజేత మీనాక్షితో పలువురు రెజ్లర్లు న్యూఢిల్లీలోని ఆయన ఇంటికి వెళ్లారు.మంత్రి గారూ.. జోక్యం చేసుకోండి!ఈ సందర్భంగా సునిల్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘మా తప్పు లేకపోయినా ర్యాంకింగ్ సిరీస్‌కు దూరమయ్యే పరిస్థితి వచ్చింది. మంత్రిగారి జోక్యంతోనైనా మాకు మేలు జరుగుతుందని ఇక్కడకు వచ్చాం. ఈ సిరీస్‌లో పాల్గొనడంవల్లమార్చిలో జరుగబోయే డ్రా, తొలి దశ బౌట్లలో మాకు కాస్త వెసలుబాటు కలుగుతుంది.అందుకే మా సమస్యను మంత్రిగారి దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తున్నాం’’ అని తెలిపాడు. అయితే, మధ్యాహ్నం రెండు గంటల వరకు దాదాపు పది మంది రెజ్లర్లు మాండవీయ నివాసం వద్ద పడిగాపులు కాసినా ఫలితం లేకపోయింది. ఆయన అందుబాటులోకి రాకపోవడంతో రెజ్లర్లు నిరాశగా తిరిగి వెళ్లిపోయారు. కాగా గతంలో క్రీడాశాఖ సస్పెన్షన్ వల్ల జాగ్రేబ్ ర్యాంకింగ్ సిరీస్‌కు భారత జట్టు దూరమైంది. ఇప్పుడు ఇరు సమాఖ్యల మధ్య సమన్వయలేమి వల్ల ఈ నెల 26 నుంచి మార్చి 2 వరకు టిరానాలో జరిగే ఈవెంట్‌కూ గైర్హాజరు అవుతోంది. ఇక భారత రెజ్లర్లు సీనియర్ ఆసియా చాంపియన్‌షిప్‌పైనే ఆశలు పెట్టుకున్నారు. జోర్డాన్‌లో మార్చి 25 నుంచి 30 వరకు ఆసియా ఈవెంట్ జరుగుతుంది. -
అంతే తేడా!
‘ఇట్స్ ఓకే.. మూవ్ ఆన్ అవ్వాలిరా.. తప్పదు’ అంటూ అనంతిక సనీల్‌కుమార్ చెప్పిన డైలాగ్‌తో ‘8 వసంతాలు’ మూవీ టీజర్ ఆరంభమైంది. ‘మ్యాడ్’ మూవీ ఫేమ్ అనంతిక సనీల్‌కుమార్ లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘8 వసంతాలు’. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హను రెడ్డి, రవితేజ దుగ్గిరాల, సంజన, కన్నా పసునూరి, స్వరాజ్ రెబ్బా ప్రగడ, సమీరా కిశోర్ ఇతర పాత్రలు పోషించారు.మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా టీజర్‌ని శుక్రవారం రిలీజ్ చేశారు. ‘‘ఎవరి తుఫాన్లు వారికి ఉంటాయి లోపల... కొందరు బయట పడతారు, ఇంకొందరు ఎప్పటికీ పడరు... అంతే తేడా’’ అంటూ కన్నా పసునూరితో అనంతిక సనీల్‌కుమార్ చెప్పే డైలాగ్స్ కూడా టీజర్లో ఉన్నాయి. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్, కెమేరా: విశ్వనాథ్ రెడ్డి. -
నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చెయ్యాల్సిందే
-
సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ పై దర్శకుడు సునీల్ కుమార్ రియాక్షన్
-
వీళ్ళ తెలివితేటలకు ఏమనాలో అర్థం కావటం లేదు
-
రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్..
-
రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్.. సునీల్ కుమార్ వాహనంపై దాడి!
సాక్షి, ఏలూరు: ఏపీలో ఎన్నికల వేళ పచ్చ మూకలు రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ వాహనంపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. వాహనాన్ని చుట్టుముట్టి అద్ధాలు ధ్వంసం చేశారు.వివరాల ప్రకారం.. ఏలూరులోని లింగపాలెం మండలం రంగాపురం వద్ద వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి సునీల్ వాహనంపై టీడీపీ శ్రేణులు దాడిక దిగాయి. జంగారెడ్డిగూడెం టౌన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమం ముగించుకుని నూజివీడు నియోజకవర్గం ముసునూరు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ ఏర్పాటు చేసిన కమ్మ ఆత్మీయ సమావేశానికి చింతమనేని ప్రభాకర్, సొంగ రోషన్ వర్గీయులే దాడి చేసినట్టు గుర్తించారు.కాగా, రంగాపురం గ్రామం మార్గంలో వెళ్తున్న సునీల్ కుమార్ వాహనాన్ని చూసి టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. సునీల్ కుమార్ వాహనాన్ని చుట్టిముట్టి టీడీపీ శ్రేణులు అద్ధాలను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో పచ్చమూకల దాడి నుంచి సునీల్ కుమార్, అతని అనుచరులు చాకచక్యంగా తప్పించుకున్నారు.అనంతరం సునీల్ కుమార్ మాట్లాడుతూ..‘టీడీపీ, జనసేన శ్రేణులు నాపై దాడి చేశారు. రెండు కర్రలతో కారు అద్దాలు ధ్వంసం చేశారు. అక్కడ ఎదురు తిరిగితే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని అక్కడి నుండి వచ్చేశాను. అధికారంలో లేకపోతేనే ఇంతటి అరాచకానికి తెగబడుతున్నారు. హుందాగా రాజకీయాలు చేయాలి. కానీ మా సహనాన్ని పరీక్షించకండి. ఓడిపోతున్నామనే భయంతోనే మాపై దాడులకు పాల్పడుతున్నారు.దెందులూరు నియోజకవర్గంలో అయితే రోజూ అరాచకాలు సృష్టిస్తున్నారు. ముసునూరు మండలం కాట్రేనిపాడు గ్రామంలో 150 కుటుంబాలు మా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. వారి కోసం వెళుతుండగా ఈ ఘటన జరిగింది. వారి దాడిలో మాకు సంబంధించిన రెండు కార్లు ధ్వసం అయ్యాయి. దీనిపై కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేశాము. వారు కూడా ప్రత్యేకంగా దృష్టిపెట్టి ఇలాంటి చర్యలను నియంత్రించాలి. ప్రజలకు ఇబ్బంది కలిగే రాజకీయాలు చేయకూడదు. తెలుగుదేశం ఇప్పటికైనా తీరు మార్చుకోవాలి. టీడీపీ సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తోంది. ఎన్ని కేసులు ఉంటే అంత గుర్తింపు అన్న రీతిలో లోకేష్ వ్యవహరిస్తున్నారు’ అని కామెంట్స్ చేశారు. -
నిమ్మగడ్డ పచ్చ బానిస..అవ్వా, తాతల గోడు తగులుద్ది
-
మడకశిర టీడీపీ అభ్యర్థికి ఘెర పరాభవం
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: మడకశిర టీడీపీ అభ్యర్థి సునీల్ కుమార్‌కు ఘెర పరాభవం ఎదురైంది. సునీల్ కుమార్‌పై మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి వర్గీయులు చెప్పులతో దాడి చేశారు. మడకశిర పట్టణంలోని టీడీపీ నేత గుండుమల తిప్పేస్వామి ఇంటి వద్ద ఘటన జరిగింది. మడకశిర నియోజకవర్గంలో కొంత కాలంగా మాజీ ఎమ్మెల్యే ఈరన్న, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మధ్య వర్గపోరు సాగుతోంది. మాజీ ఎమ్మెల్యే ఈరన్న కొడుకు సునీల్ కుమార్‌కు చంద్రబాబు టికెట్ ఖరారు చేయగా, మద్దతు కోరేందుకు టీడీపీ అభ్యర్థి సునీల్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఈరన్న.. తిప్పేస్వామి ఇంటికెళ్లారు. దీంతో ఇద్దరిపైనా చెప్పులతో దాడి చేసి తరిమేశారు. మడకశిర టీడీపీ గ్రూపు రాజకీయాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అనంతపురం జిల్లా టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత అనంతపురం జిల్లా టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. శింగనమల టీడీపీ అభ్యర్థి గా బండారు శ్రావణి నియామకంపై అసంతృప్తి భగ్గుమంది. టూమెన్ కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి, ఆలం నరసానాయుడు ఆధ్వర్యంలో నిరసన జరిగింది. జిల్లా టీడీపీ కార్యాలయంపై అసమ్మతి నేతలు రాళ్లు రువ్వారు. టీడీపీ కార్యాలయంలో అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. చంద్రబాబు, లోకేష్‌లకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు. ఇదీ చదవండి: ‘తుప్పు పట్టిన సైకిల్-పగిలిపోయిన గ్లాసుకు గోల్డ్ కవరింగ్’ -
ఏలూరు పార్లమెంట్ ఇంఛార్జ్ గా కారుమూరి సునీల్ కుమార్
-
YSRCP సిద్ధం సభకు శరవేగంగా ఏర్పాట్లు
-
వైఎస్సార్సీపీలో ఫుల్ జోష్
సాక్షి ప్రతినిధి, ఏలూరు: అధికార వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లాలో ఫుల్‌జోష్‌తో కనిపిస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్‌తో సంబంధం లేకుండా స్థానిక పరిస్థితులు, సమీకరణలకు అనుగుణంగా జిల్లాలో అభ్యర్థుల మార్పులు, చేర్పుల ప్రక్రియ ముగిసింది. ఈ క్రమంలో ఆదివారం జరిగిన పార్టీ ఏలూరు జిల్లా విస్తృత స్థాయి సమావేశం, నూతన అభ్యర్థుల పరిచయ సభ గ్రాండ్ సక్సెస్ కావడం పార్టీ క్యాడర్లో కొత్త ఉత్సాహం నింపింది. ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్‌యాదవ్, చింతలపూడి అసెంబ్లీ అభ్యర్థి కంభం విజయరాజు, పోలవరం అసెంబ్లీ అభ్యర్థిగా తెల్లం రాజ్యలక్ష్మిలను జిల్లా నాయకులు కార్యకర్తలకు పరిచయం చేశారు. ఎన్నికల శంఖారావం పూరించారు. దీంతో పార్టీ శ్రేణుల్లో నవోత్సాహం కదంతొక్కుతోంది. ఇప్పటికే ప్రజల్లోకి.. ఏలూరు పార్లమెంట్ పరిధిలో రెండు అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానంలో వైఎస్సార్సీపీ ఇన్చార్జులను మార్చింది. మిగిలిన చోట్ల ఇప్పటికే ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్తున్నారు. పాదయాత్రలు చేస్తూ.. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఐదేళ్లలో తాము చేసిన పనులను వివరిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా గడపగడపకూ చేకూరిన లబ్ధిని చెబుతున్నారు. ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఈనెల 30వ తేదీకల్లా నియోజకవర్గ స్థాయి సమావేశాలు ముగిసేలా షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. బాధ్యతలు తీసుకున్న చింతలపూడి ఇన్చార్జి కంభం విజయరాజు, పోలవరం ఇన్చార్జి తెల్లం రాజ్యలక్ష్మి ఇప్పటికే వారం రోజులుగా నియోజకవర్గంలో విస్తతంగా పర్యటిస్తున్నారు. ఇక ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ ఆదివారం నుంచి పార్లమెంట్ పరిధిలో పర్యటనకు శ్రీకారం చుట్టారు. టీడీపీలో అనిశ్చితి ఇక ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో రాజకీయ అనిశ్చితి తారాస్థాయికి చేరింది. పొత్తుల గందరగోళం ఒక వైపు, టీడీపీ, జనసేన నేతల మధ్య సమన్వయ లోపం మరోవైపు ఆ పార్టీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏలూరు ఎంపీ టికెట్‌ను ముగ్గురు, నలుగురు అభ్యర్థులు ఆశిస్తున్నా స్పష్టత లేకపోవడం పొత్తుల్లో జనసేనకు ఇచ్చే స్థానాలు తేల్చకపోవడంతో రెండు పార్టీల నేతల్లో రాజకీయ నైరాశ్యం నెలకొంది. ఇక దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ సమన్వయకర్త చింతమనేని ప్రభాకర్ యథావిధిగా హల్చల్ చేస్తున్నారు. టీడీపీ, జనసేన నేతలు చింతమనేని వద్దు–ఎవరైనా ముద్దు అనే పేరుతో నిరసన సమావేశం నిర్వహించినప్పటి నుంచి ఆయన తీవ్ర ఆందోళనకు గురై టికెట్ ఆశిస్తున్న ఇతర నేతలపై నోరుపారేసుకుంటున్నట్లు సమాచారం. కైకలూరు, నూజివీడు, పోలవరంలలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పార్లమెంట్ స్థానానికో సభ నిర్వహిస్తున్నా అభ్యర్థిత్వాలపై స్పష్టత ఇవ్వడం లేదు. ఫలితంగా ముఖ్యనేతలు ఖర్చుకు ముందుకురాని పరిస్థితి. అయితే జనసేన, టీడీపీ శ్రేణులు మాత్రం సోషల్ మీడియా వార్ కొనసాగిస్తున్నాయి. ఏ పార్టీ ఏ స్థానాల్లో పోటీ చేస్తాయో పోస్టులు షేర్ చేస్తూ గందరగోళాన్ని మరింత పెంచుతున్నాయి. -
ప్రతి వ్యక్తికీ పనికొచ్చే చట్టం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైట్లింగ్ చట్టం భూమి ఉన్న ప్రతి వ్యక్తికీ పనికొచ్చే చట్టమని భూ చట్టాల నిపుణులు, నల్సార్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ ఎం.సునీల్‌కుమార్ చెప్పారు. ఇది అనాలోచితంగా చేసింది కాదన్నారు. ఈ చట్టాన్ని అర్థం చేసుకోకుండా కొందరు మాట్లాడుతున్నారని తెలిపారు. ఈ చట్టాన్ని తీసుకురావడానికి గతంలో కేంద్రంలో ఎన్డీయే, యూపీఏ ప్రభుత్వాలు కూడా ప్రయత్నించాయని గుర్తు చేశారు. గత 120 ఏళ్లుగా ఇలాంటి చట్టాన్ని తేవడానికి దేశంలో ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. కొన్ని రాజకీయ పక్షాలు, న్యాయ పరిజ్ఞానం ఉన్నవారు కూడా భూములు లాక్కోవడానికి చేసిన చట్టంగా దీని గురించి మాట్లాడడం సరికాదన్నారు. ల్యాండ్ టైట్లింగ్ చట్టం.. ఇతర చట్టాల ద్వారా ఇచ్చిన భూమి హక్కుల్ని లాక్కోదని తెలిపారు. ఉన్న హక్కుల్ని రికార్డు చేసి ఆ హక్కులకు గ్యారంటీ కల్పిస్తుందన్నారు. చుక్కల భూముల చట్టం, ఎస్టేట్ ఎబాలిషన్ చట్టం వంటి అనేక చట్టాల కింద ఉన్న హక్కులన్నీ ఉంటాయని తెలిపారు. ఇది కేవలం ఆర్ఓఆర్ చట్టం స్థానంలో వచ్చిన కొత్త చట్టం మాత్రమేనన్నారు. ఏపీ ప్రభుత్వం దేశంలోనే మొదటిసారిగా తీసుకువచ్చిన ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై జరుగుతున్న రకరకాల ప్రచారాలపై ఆయన సాక్షితో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ఒకే ఒక రికార్డు.. ప్రభుత్వం గ్యారంటీ.. ల్యాండ్ టైట్లింగ్ చట్టం ప్రకారం ఇప్పుడున్న రెవెన్యూ రికార్డులన్నీ మాయమై ఒకే ఒక రికార్డు వస్తుంది. ఆ రికార్డుల్లో ఉన్న వివరాలకు ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుంది. రిజిస్ట్రేషన్ జరిగితే హక్కులు రిజిస్టర్ అవుతాయి. రిజిస్ట్రార్ అమ్మేవాడికి హక్కు ఉంటేనే రిజిస్ట్రేషన్ చేస్తాడు. రిజిస్ట్రేషన్ అయిందంటే కొన్న వ్యక్తి పేరు మీదకు భూమి మారిపోయినట్లే. ఇది ఈ చట్టం ద్వారా వచ్చే మార్పు. దీనికి అదనంగా రికార్డులో ఉన్న వివరాలకు ప్రభుత్వమే హామీ ఇస్తుంది కాబట్టి పొరపాటున ఎవరికైనా నష్టం జరిగితే ప్రభుత్వమే నష్ట పరిహారం ఇస్తుంది. అది టైటిల్ ఇన్సూరెన్స్. సివిల్ కోర్టుల అధికారాలన్నీ పోవు.. టైటిల్ వివాదాలను సివిల్ కోర్టులు పరిష్కరించాలి తప్ప టైటిలింగ్ అధికారులు పరిష్కరించడం తప్పని అంటున్నారు. ప్రజలకు సివిల్ కోర్టుల్లో తప్ప రెవెన్యూ కోర్టుల్లో న్యాయం జరగదని వాదిస్తున్నారు. కానీ కొత్త చట్టంలో సివిల్ కోర్టుల అధికారాలన్నీ పోవు. రికార్డుల తయారు చేసేటప్పుడు వచ్చే అంశాలు మాత్రమే సివిల్ కోర్టుల పరిధిలోకి రావు. రెవెన్యూ కోర్టులే ప్రజలకు అందుబాటులో ఉంటాయి.. ఇప్పుడున్న భూ రికార్డులన్నీ రెవెన్యూ అధికారులు తయారు చేసినవే. అలాంటప్పుడు ల్యాండ్ టైట్లింగ్ చట్టం ప్రకారం కొత్త రికార్డులు తయారు చేయడం వారికి కాకుండా ఎవరికి ఇస్తారు? సివిల్ కోర్టుల కంటె రెవెన్యూ కోర్టులే ప్రజలకు ఎక్కువ అందుబాటులో ఉంటాయి. లాయర్ లేకుండా కూడా జేసీ దగ్గర మాట్లాడవచ్చు. లాయర్ లేకుండా సివిల్ కోర్టులో కేసు వేయగలరా? ప్రజలకు సత్వర న్యాయం జరగాలంటే ఇలాంటి వ్యవస్థ ఉండాలని ప్రభుత్వం చెబుతోంది. సివిల్ కోర్టుల్లో 66 శాతం భూమికి సంబంధించిన కేసులున్నాయి. ఈ చట్టం అమలైతే అవన్నీ తగ్గిపోయి సివిల్ కోర్టుల్లో భూమి తగాదాలు తగ్గుతాయి. కానీ లాయర్లకు వేరే పని పెరుగుతుంది. టైటిల్ వెరిఫికేషన్, ట్రిబ్యునల్ అప్పీళ్లు పెరుగుతాయి. ఇంతకుముందులా ఏళ్ల తరబడి సివిల్ కోర్టుల్లో వ్యాజ్యాలు నడిపించడం కుదరదు. అప్పీల్‌కు రెండేళ్లు అవకాశం.. టైటిల్ రిజిస్టర్లో ఒకసారి పేరు నమోదయ్యాక ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే అప్పీల్‌కి రెండేళ్లు అవకాశం ఇస్తారు. రెండేళ్లలోపు ఎవరైనా అభ్యంతరపెడితే అది వివాదాల రిజిస్టర్‌లోకి వెళుతుంది. రెండేళ్లలోపు ఎలాంటి అభ్యంతరం రాకపోతే అది తుది రికార్డవుతుంది. తర్వాత దాన్ని చాలెంజ్ చేయడానికి ఉండదు. ఆర్వోఆర్ చట్టంలో ఒకసారి రికార్డయితే దాన్ని చాలెంజ్ చేయడానికి ఉన్న సమయం సంవత్సరమే. మ్యుటేషన్‌పై అభ్యంతరాలను అప్పీల్ చేయడానికి ఉన్న సమయం 19 రోజులు. కానీ ల్యాండ్ టైట్లింగ్ చట్టంలో రెండేళ్లు అవకాశం ఇస్తున్నారు. ఒక రికార్డును ఎప్పుడో ఒకప్పుడు ఫైనల్ చేయకపోతే టైటిల్ గ్యారంటీ ఎలా వస్తుంది? ఎవరైనా, ఎప్పుడైనా ఉన్న రికార్డును చాలెంజ్ చేసే పరిస్థితి ఉంటే అది అంతిమ రికార్డు ఎలా అవుతుంది? దానికి ప్రభుత్వం గ్యారంటీ ఎలా ఇస్తుంది? ఏదో ఒక నిర్దిష్ట సమయం ఉండాలి కదా? సక్సేషన్ సరి్టఫికెట్ సివిల్ కోర్టులు ఇవ్వాలిగానీ టైటిల్ గ్యారంటీ ఆఫీసర్ ఎలా ఇస్తారని అంటున్నారు. కొత్త చట్టంలో సక్సేషన్ సర్టిఫికెట్ టైటిల్ ఆఫీసర్ ఇవ్వడు. గతంలో మ్యుటేషన్ జరిగినట్లే ఇక్కడా జరుగుతుంది. ఒకవేళ వారసత్వ వివాదాలుంటే సివిల్ కోర్టులకు వెళ్లాల్సిందే. ఆర్ఓఆర్ చట్టంలోనూ అదే ఉంది. ఇప్పుడున్న వ్యవస్థలో ఫైనల్ రికార్డు ఏదీ లేదు.. ఇప్పుడున్న వ్యవస్థలో భూ యజమాని ఆ భూమి నాదని చెప్పుకునే ఫైనల్ రికార్డు ఏదీ లేదు. రెవెన్యూ రికార్డులన్నీ ఒకప్పుడు పన్ను వసూలు కోసం తయారైనవే. ఆర్ఓఆర్ చట్టం మాత్రమే కొద్దిగా ఉపశమనం ఇస్తుంది. పాస్‌బుక్ ఉంటే వేరే ఎవరైనా అభ్యంతరం చెప్పనంతవరకు అతనే భూ యజమాని అని ఆ చట్టం చెప్పింది. అంతే తప్ప ఇప్పటివరకు ఏ రాష్ట్రంలోనూ ఫలానా రికార్డు.. భూమి హక్కుల నిరూపణకు అంతిమ సాక్ష్యంగా పనికిరాదు. భూముల రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు ఇద్దరి మధ్య లావాదేవీ జరిగిన కాగితానికి రిజిస్ట్రేషన్ జరుగుతుంది తప్ప హక్కుల బదలాయింపు కోసం రిజిస్ట్రేషన్ జరగదు. వివిధ ప్రభుత్వ శాఖలు తయారు చేసిన రికార్డుల్లోని వివరాలకు గ్యారంటీ లేదు. అలాగే భూ కమతానికి, ఇంటి స్థలానికి ఐడెంటిటీ లేదు.. హద్దులు కూడా సరిగా లేవు. ఈ సమస్యలన్నింటినీ తీర్చడం కోసమే ఏపీ ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని తీసుకువచ్చింది. దీనికి ముందే రీ సర్వే ప్రారంభించింది. ఈ సర్వే ద్వారా ప్రతి భూమికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. దాని ప్రకారం ఎవరి భూముల హద్దులను వాళ్లు చూసుకోవచ్చు. మొబైల్ ద్వారా కూడా చూసుకునే సదుపాయంఉంది. ప్రతి వ్యక్తికీ ఆధార్ వచ్చినట్లే భూమికి కూడా యూనిక్ ల్యాండ్ పార్సిల్ నంబర్ వస్తుంది. ఈ చట్టం ఎవరో ఒకరి కోసం చేసింది కాదు.. ఈ చట్టం ఎవరో ఒకరి కోసం చేసింది కాదు. భూమి ఉన్న ప్రతి ఒక్కరికి పనికి వచ్చే చట్టం ఇది. ఏ భూ యజమాని అయినా తన భూమికి స్పష్టమైన హద్దులుండాలని, కాగితాలు స్పష్టంగా, భద్రంగా ఉండాలని, మార్పులు చేర్పులు ఉంటే వెంటనే జరగాలని కోరుకుంటాడు. వివాదాలు వస్తే త్వరగా పరిష్కారం కావాలని ఆశిస్తాడు. ఇప్పటివరకు ఇవన్నీ లేవు కాబట్టే ఈ చట్టం చేశారు. భూమి హక్కులకు భద్రత ఇవ్వడానికి చేసిన చట్టం లాక్కోవడం ఎలా అవుతుంది? రికార్డు తయారైన తర్వాత పబ్లిక్ డొమైన్లో ఉంటుంది. దానిపై అభ్యంతరం ఉంటే వినాల్సిందే. దానిపై ట్రిబ్యునల్‌కు, ఆపైన హైకోర్టుకు కూడా వెళ్లవచ్చు. గతంలో అన్ని రాజకీయ పార్టీలు సమర్థించాయి.. ఈ చట్టం గురించి మాట్లాడుతున్న రాజకీయ పక్షాలన్నీ ఎప్పుడో ఒకప్పుడు ఈ విధానం కావాలని సమర్థించిన పార్టీలే. యూపీఏ హయాంలో కామన్ మినిమమ్ ప్రోగ్రాంలో టైటిల్ గ్యారంటీ చట్టం ఉంది. లెఫ్ట్ పార్టీలు అందులో ఉన్నాయి. నీతి అయోగ్.. టైటిల్ గ్యారంటీ చట్టం రావాలని చెప్పింది. దాని ప్రకారమే ముసాయిదా చట్టాలు వచ్చాయి. ఎన్డీఏలో అన్ని పక్షాలు దానికి మద్దతిచ్చాయి. ప్రజల కోణంలో చూసినా, రాజకీయ కోణంలో చూసినా ఈ చట్టాన్ని అభ్యంతర పెట్టడానికి అవకాశం లేదు. -
‘సమోసాకు డబ్బుల్లేక.. చాయ్‌తో సరిపెట్టారు’
న్యూఢిల్లీ: ఢిల్లీలో మంగళవారం విపక్షాల ‘ఇండియా’ కూటమి భేటీలో ప్రస్తావనకు వచ్చిన కీలకాంశాలపై ఓ వైపు చర్చ జరుగుతుంటే అక్కడ సమోసాలు ఇవ్వలేదంటూ జేడీ(యూ) సీనియర్ నేత సునీల్ కుమార్ పింటూ కాంగ్రెస్‌నుద్దేశిస్తూ చులకనగా మాట్లాడారు. డబ్బుల్లేక కాంగ్రెస్ కనీసం సమోసాలు కూడా వడ్డించలేదని వ్యాఖ్యానించారు. ‘‘ నిన్నటి సమావేశానికి భాగస్వామ్య పార్టీల అగ్రనేతలంతా విచ్చేశారు. సీట్ల పంపకాలపై చర్చించాలనుకున్నా అది టీ, బిస్కెట్లకే పరిమితం అయింది. ఎందుకంటే కాంగ్రెస్ దగ్గర నిధులు నిండుకున్నాయి. రూ.138, రూ.1,380, రూ.13,800 ఇలా చిన్న చిన్న మొత్తాలను ఆ పార్టీ విరాళంగా సేకరిస్తోంది. ఇంకా విరాళాలు రావాల్సి ఉంది. అప్పటిదాకా సమోసాలుండవు. టీ, బిస్కెట్లతో సరిపెట్టుకోవాలి. సమోసాలు లేకుండా ఎలాంటి తీవ్రమైన చర్చలు జరగబోవు’’ అని సునీల్ పింటూ వెటకారంగా అన్నారు. సంబంధిత వీడియోను బీజేపీ నేత అమిత్ మాలవీయ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌చేశారు. JDU सांसद सुनील कुमार पिंटू का बड़ा बयान। I.N.D.I. अलायंस की बैठक को बताया टांय-टांय फिस्स। pic.twitter.com/saHVMze4bJ — News18 Bihar (@News18Bihar) December 20, 2023 Video Credits:News18 Bihar ఆయ్.. హిందీ తెలియాల్సిందే విపక్షాల కూటమి సమావేశంలో నితీశ్ కుమార్ ప్రసంగిస్తుండగా డీఎంకే నేత టీఆర్ బాలు బాగా ఇబ్బంది పడ్డారు. హిందీరాని బాలుకు నితీశ్ హిందీ ప్రసంగం అర్ధంకాలేదు. అర్ధంచేసుకునేందుకు తన పక్కనే కూర్చున్న రా్రïÙ్టయ జనతాదళ్ రాజ్యసభ సభ్యుడు మనోజ్ ఝాను సాయంకోరారు. ‘మీ ప్రసంగాన్ని ఆయనకు అర్ధమయ్యేలా అనువాదం చేయొచ్చా?’ అని నితీశ్‌ను ఝా కోరారు. దీంతో ఆగ్రహించిన నితీశ్.. ‘ హిందీ మన జాతీయ భాష. అందుకే మన దేశాన్ని హిందుస్తాన్‌గా పిలుచుకుంటాం. హిందీ అందరి భాష. అలాంటి హిందీ తెలియాల్సిందే. నేర్చుకుని అర్ధంచేసుకోవాలి. మీరు అనువాదాలు ఏవీ చేయకండి’’ అని ఝాను వారించారు. -
..భూమార్గం పట్టిద్దాం!
‘తెలంగాణలో భూమి అనేది చాలా ప్రధానమైన అంశం. ప్రపంచంలోని ఎక్కడా లేని భూపోరాటాలు ఇక్కడే జరిగినా 75 ఏళ్ల తర్వాత కూడా∙భూసమస్యలు అసంపూర్తి పనిగానే మిగిలిపోయాయి. అసంపూర్ణమైన భూసంస్కరణలే ఇందుకు కారణం. ప్రభుత్వాలు చేసే పనుల కారణంగా పేదల భూములకు భద్రత కల్పించడం మాట అటుంచితే పేదల భూములు లాక్కుంటున్నారని, ఉన్న కాసిన్ని భూములు పేదల చేతుల నుంచి పోతున్నాయని ఐక్యరాజ్యసమితి చెప్పింది. ఇదీ అసలు సమస్య. ప్రజలకున్న అసలు సమస్యలే కదా ఎన్నికల ఎజెండా కావాలి. ప్రజల ప్రతి సమస్యా ఎజెండా అయితే ఆ సమస్యలు తీరుస్తామని రాజకీయ పార్టీలు చెప్పాలి..’ అని భూచట్టాల నిపుణులు, నల్సార్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ఎం.సునీల్‌కుమార్ అన్నారు. తెలంగాణలో ధరణి ఒక్కటే భూ సమస్య కాదని పేర్కొన్నారు. ప్రజలు కోరుకుంటున్న భూవిధానాలను తీసుకురావడం ఎన్నికల ఎజెండా అయినప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయంటున్నారు. 75–80 ఏళ్ల నాటి పరిస్థితే ఇప్పటికీ.. భూమిని ప్రజల కోణంలో చూడాలి. భూమి లేని వారికి భూమి ఇవ్వడం, భూమి ఉన్న వారి హక్కులకు భద్రత ఉన్నప్పుడే ఆస్తి సంపదగా మారుతుంది. అయితే ఈ రెండింటి విషయంలో 75–80 ఏళ్ల నాటి పరిస్థితే ఇప్పటికీ ఉంది. భూమి లేని గ్రామీణ కుటుంబాలు తెలంగాణలో 56 శాతం ఉన్నాయని లెక్కలు చెపుతున్నాయి. భూములున్న కుటుంబాల విషయంలో ఊరికో 200 సమస్యలున్నాయి. ఈ సమస్యలు ఎన్నికల ఎజెండా కావాలి. దురదృష్టవశాత్తూ అలా జరగడం లేదు. గత మూడు ఎన్నికలను పరిశీలిస్తే.. 2014 ఎన్నికల్లో పార్టీల మేనిఫెస్టోల్లో భూమి ప్రస్తావన ఉంది. 2018లో కొందరే ప్రస్తావించారు. కానీ ఈసారి భూమి అంశం చర్చకే రావడం లేదు. ధరణిని రద్దు చేస్తామని ఒకరు అంటుంటే, అసైన్డ్ భూములపై హక్కులు కలి్పస్తామని బీఆర్ఎస్ అంటోంది. తెలంగాణలో భూసమస్య అంటే ధరణి ఒక్కటేనా? కీలకమైన భూసర్వే ఏ పార్టీ మేనిఫెస్టోలో అయినా ఉందా? అంటే మెల్లగా భూమి అనేది ఎన్నికల ఎజెండా కాకుండా మాయమైపోతోందన్న మాట. సమస్యలు కొనసాగితేనే పార్టీలకు ఉపయోగం రాజకీయ పార్టీలు ఎన్నికల్లో భూమిని ఎజెండాగా చేయాలనుకోవడం లేదనే చెప్పాలి. ఇతర అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల కానీ, ఉద్దేశపూర్వకంగా కానీ, లేదంటే పరిష్కరించలేక పోవడం వల్ల కానీ భూమి అంశాన్ని పార్టీలు చేపట్టలేకపోతున్నాయి. భూమి సమస్యను యథాతథంగా కొనసాగించాలన్న ఆలోచన కూడా రాజకీయ పార్టీలకు ఉండొచ్చు. భూములకు సంబంధించిన సమస్యలు ఉంటేనే కదా రాజకీయ పార్టీలకు ఉపయోగం. ప్రతి గుంట భూమిని సర్వే చేయాలి తెలంగాణలో భూముల సమగ్ర సర్వే చేయాలి. ఇందుకు రూ.700–800 కోట్ల వరకు ఖర్చవుతుంది. తెలంగాణలో ప్రతి గుంట భూమిని సమగ్రంగా సర్వే చేసి కొత్త రికార్డులను తయారు చేస్తేనే సమస్య పరిష్కారమవుతుంది. కానీ సర్వే చేస్తామని ఎవరైనా చెప్తున్నారా? భూ చట్టాల్లో సమగ్ర మార్పు రావాలి. ఆర్వోఆర్, పీవోటీ, కౌలు చట్టాలు మార్చాలి. ఏ పార్టీ అయినా భూ చట్టాల్లో మార్పు తెస్తామని ప్రకటిస్తోందా? రెవెన్యూ కోడ్ తెస్తామని చెప్తోందా? భూమి హక్కులకు ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చే టైటిల్ గ్యారంటీ చట్టం తెస్తామని ఏ పార్టీ అయినా చెపుతోందా? భూమి లేని పేదలకు భూములిస్తామని ఎవరైనా అన్నారా? తెలంగాణలో 10 లక్షల మందికి పైగా ఉన్న కౌలు రైతులను గుర్తిస్తామని ఎవరైనా చెపుతున్నారా? సమగ్ర చట్టం లేకుండా కౌలుదారులను ఎలా గుర్తిస్తారు? ఎలా డబ్బులిస్తారు? భూపరిపాలన మెరుగుపరుస్తామని ఎవరైనా అంటున్నారా? ఇవి ప్రజలు చేసే డిమాండ్లే. కంప్యూటర్ రికార్డు తప్పనిసరి పేరేదైనా సరే.. భూమికి కంప్యూటర్ రికార్డు ఉండి తీరాలి. తెలంగాణలో భూమి కంప్యూటర్ రికార్డులు బ్రహ్మాండంగా ఉన్నాయమని అధికారపక్షం చెపుతోంది. ప్రతిపక్షమేమో చెండాలంగా ఉందని అంటోంది. వీళ్లు రద్దు చేస్తామంటారు. వాళ్లు యథాతథంగా కొనసాగిస్తామంటున్నారు. ఇద్దరూ చెబుతున్నదీ తప్పే. రద్దు సమస్యకు పరిష్కారం కాదు. అసలు కంప్యూటర్ రికార్డు అయితే ఉండాలి కదా? ఏదో ఒక రికార్డుండాలి. కొత్త రికార్డు ఎలా తెస్తారు? అనేది చెప్పాలి కదా? ఏం చేస్తారనే పరిష్కారం చెప్పకుండా రద్దు సమంజసం కాదు. అంతా బాగుందని చెప్పడం సరైంది కాదు. అంటే ఈ రెండు పక్షాలు ప్రజలేం కోరుకునేదానివైపు వెళ్లడం లేదన్నది అర్థమవుతోంది. కంప్యూటరీకరణ అవసరమా? భూమికి కాగితాలిచ్చే ప్రక్రియ ప్రపంచమంతా జరుగుతోంది. ఎందుకంటే భూమి ఉన్నా.. ఆ భూమికి సరైన కాగితాలున్న వారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా 30 శాతమేనట. అంటే రికార్డులు లేని వారే ఎక్కువ ఉన్నారు. ఈ రికార్డులను కల్పించడంలో భాగంగా జరిగే ప్రక్రియనే ఫార్ములైజేషన్ ఆఫ్ ల్యాండ్ రైట్స్ అంటారు. అంటే భూములకు రికార్డులు రూపొందించాలి. వాటిని కంప్యూటరీకరించాలి. అమ్మకాలు, కొనుగోళ్లు సులభంగా జరగాలి. వీటి వల్ల భూమి హక్కులకు భద్రత ఏర్పడుతుంది. పేదలకు కూడా భూములు కొనుగోలుచేయగలిగిన ధైర్యం వస్తుంది. భూవినియోగ విధానం ఉండాలి భూమి విధానం, భూమి వినియోగ విధానాలు ప్రతి రాష్ట్రానికి ఉండాలి. ఎన్నికల సమయంలోనే ఇవి చర్చకు రావాలి. ఉచితాలు అనేవి తాత్కాలిక లబ్ధి చేకూర్చేవి. అందువల్ల రాజకీయ పార్టీల హామీలు భూమి చుట్టూ తిరగాలి. స్థిరాస్తి కల్పనపై అవి దృష్టి సారించాలి. గుంట భూమి ఉంటే ఎన్ని సమస్యలో.. అది కూడా లేని వారి పరిస్థితేంటో అందరికీ తెలిసిందే. భూములివ్వడం, ఉన్న భూములను కాపాడడం చుట్టూ ఎన్నికల ఎజెండా తిరిగితేనే మెరుగైన ఫలితాలు వస్తాయి. - మేకల కళ్యాణ్ చక్రవర్తి -
మ్యాడ్తో ఎంట్రీ!
నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, గౌరీ ప్రియా రెడ్డి, అనతిక సునీల్ కుమార్, గోపికా ఉద్యన్ ముఖ్య తారలుగా నటిస్తున్న చిత్రం ‘మ్యాడ్’. కల్యాణ్ శంకర్ దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్పై రూపొందుతున్న ఈ సినిమా ద్వారా నిర్మాతలు చినబాబు కుమార్తె, నాగవంశీ సోదరి హారిక సూర్యదేవర నిర్మాతగా ఎంటర్ అవుతున్నారు. ఎస్. నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ‘‘యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రమిది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్, కెమెరా: షామ్‌దత్ సైనుద్దీన్, దినేష్ కష్ణన్ బి. -
టీడీపీ విడుదల చేసిన ఫోరెన్సిక్ రిపోర్టులో వాస్తవాలు లేవు
-
ఆ ఫోరెన్సిక్ రిపోర్టులో వాస్తవాలు లేవు: సీఐడీ చీఫ్ సునీల్ కుమార్
సాక్షి, విజయవాడ: టీడీపీ విడుదల చేసిన ఫోరెన్సిక్ రిపోర్టులో వాస్తవాలు లేవని ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ అన్నారు. ఈ మేరకు విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. అది ఇద్దరి మధ్య జరిగిన వీడియో కాల్. దీనిపై కొందరు ఫోరెన్సిక్ రిపోర్ట్ అని విడుదల చేశారు. ఆ వీడియోను ఎవరో షూట్ చేశారు. మూడో వ్యక్తి షూట్ చేసిన వీడియోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపి రిపోర్ట్ తీసుకున్నారు. వీడియో కంటెంట్ ఒరిజినలా కాదా అనేది ల్యాబ్ చెప్పలేదు. రిపోర్ట్‌ను మార్చి ప్రచారం చేశారు. ప్రైవేట్ ల్యాబ్‌లు ఇచ్చే నివేదికలకు విలువ ఉండదు. మన ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చే నివేదికే ప్రామాణికం. వీడియో తనది కాదని ఎంపీ గోరంట్ల మాధవ్ చెప్పారు. మార్ఫింగ్ చేశారని ఎంపీ ఫిర్యాదు చేశారు. దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ తెలిపారు. చదవండి: (బాలయ్య ఏందయ్యా ఇది.. పాపం పిల్లలు మాడిపోయారు?) -
కామన్వెల్త్ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం
లండన్: కామన్వెల్త్ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణ పతకం లభించింది. పురుషుల ఈపీ టీమ్ ఈవెంట్లో చింగాఖమ్ సింగ్, సునీల్ కుమార్, ఉదయ్‌వీర్ సింగ్, సదాశివన్లతో కూడిన భారత జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో భారత్ 45–44తో స్కాట్లాండ్ను ఓడించింది. మహిళల సేబర్ టీమ్ ఈవెంట్లో భవాని దేవి, జగ్మీత్ కౌర్, క్రిస్టీ జోష్నా జోస్, ఖుషీ వబికలతో కూడిన భారత జట్టు కాంస్య పతకాన్ని గెల్చుకుంది. ఇదే టోర్నీలో మహిళల సేబర్ వ్యక్తిగత విభాగంలో భవాని దేవి స్వర్ణ పతకాన్ని సాధించింది. చదవండి: Ind Vs Zim ODI Series: టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్.. -
తొలిరోజు భారత్‌కు మూడు కాంస్యాలు
Asia Senior Wrestling Championship- ఉలాన్బాటర్ (మంగోలియా): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు భారత రెజ్లర్లు మూడు కాంస్య పతకాలు సాధించారు. పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో అర్జున్ హలాకుర్కి (55 కేజీలు), నీరజ్ (63 కేజీలు), సునీల్ కుమార్ (87 కేజీలు) మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలను దక్కించుకున్నారు. కాంస్య పతక బౌట్లలో కర్ణాటకకు చెందిన అర్జున్ 10–7తో దవాబంది ముంఖ్‌ఎర్డెన్ (మంగోలియా)పై... నీరజ్ 7–4తో బఖ్రమోవ్ (ఉజ్బెకిస్తాన్)పై... సునీల్ 9–1తో బత్బెయర్ లుత్బాయర్ (మంగోలియా)పై నెగ్గారు. 77 కేజీల విభాగం కాంస్య పతక పోరులో భారత రెజ్లర్ సజన్ 1–11తో సకురాబా (జపాన్) చేతిలో ఓడిపోయాడు. చదవండి: IPL 2022: సెంచరీ మిస్.. అయితేనేం జట్టును గెలిపించాడు! జోష్‌లో బెంగళూరు! -
సీఐడీ అదనపు డీజీ సునీల్‌కు హైకోర్టు నోటీసులు
సాక్షి, అమరావతి: సీఐడీ అదనపు డీజీ సునీల్‌కుమార్ తమ కుటుంబసభ్యులను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆయన మామ, విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ తండ్రి పెనుమాక సుబ్బారావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు సునీల్‌కుమార్‌తోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర హోం శాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్, డీజీపీ తదితరులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌం టర్లు దాఖలు చేయాలని వారిని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. -
సీఎం జగన్ విజన్‌కు అనుగుణంగా పనిచేయాలి: సజ్జల
సాక్షి, విజయవాడ: రాష్ట్ర సాంఘిక సంక్షేమ మండలి చైర్మన్‌గా పులి సునీల్ కుమార్ సోమవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేశ్, ఎంపీలు అవినాష్ రెడ్డి, నందిగం సురేష్, డిప్యూటీ సీఎం అంజాద్ భాష, ప్రభుత్వ విప్ వెన్నపూస వేణుగోపాల్ రెడ్డి, చీఫ్ విప్ శ్రీనివాసులు, కడప మేయర్ సురేష్ బాబు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ...''వైఎస్ జగన్ ఆశయాలకు, విజన్‌కు అనుగుణంగా కార్పొరేషన్ ఛైర్మన్లు పనిచేయాలి. అట్టడుగు వర్గాలకు సామాజిక న్యాయం చేస్తున్నారు. మంత్రివర్గ కూర్పులోనూ సీఎం జగన్ సామాజిక న్యాయం పాటించారు. నామినేటెడ్ పోస్టుల్లోనూ సామాజిక న్యాయం పాటించారు. అట్టడుగు వర్గాల ప్రజలు తమ కాళ్ళమీద తాము నిలబడేలా చేస్తున్నారు. దళితులకు న్యాయం చేసేందుకు దళితుల నుంచే నాయకులను తయారు చేస్తున్నారు. గతంలో పైరవీలు చేసినవారికి, డబ్బులు ఇచ్చిన వారికి పదవులు వచ్చాయి. కానీ జగన్ కష్టపడినవారిని గుర్తించి పదవులు ఇస్తున్నారు. అతి తక్కువ జనాభా ఉన్న కులాలను గుర్తించి వారికి పదవులు ఇస్తూ ఔన్నత్యాన్ని కాపాడుతున్నారు. కొంతమందికి న్యాయం చేయలేకపోయామనేది వాస్తవం. కచ్చితంగా అందరికీ న్యాయం జరుగుతుంది.'' అని తెలిపారు. -
సీబీఐ కస్టడీకి సునీల్‌కుమార్ యాదవ్
సాక్షి, కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్టయి, కడప కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న సునీల్‌కుమార్ యాదవ్‌ను సీబీఐ అధికారులు 10 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. సునీల్ యాదవ్‌ను పులివెందుల తీసుకెళ్లి సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. రోటరీపురం రోడ్డులో అనుమానాస్పద ప్రదేశాల్లో సీబీఐ తనిఖీలు చేస్తోంది. కాగా, అతడిని తదుపరి విచారణ నిమిత్తం ఈ నెల 16 వరకు సీబీఐకి అప్పగిస్తూ శుక్రవారం పులివెందుల మేజిస్ట్రేట్ అనుమతించిన సంగతి తెలిసిందే. శుక్రవారం సాయంత్రం 5.15 గంటలకు కడప కేంద్ర కారాగారం నుంచి సునీల్‌కుమార్ యాదవ్‌ను సీబీఐ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. కేంద్ర కారాగారం ఆవరణలోని గెస్ట్‌హౌస్‌లో సీబీఐ ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక కార్యాలయానికి సునీల్‌కుమార్ యాదవ్‌ను తీసుకెళ్లారు. కాగా, వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, మాజీ డ్రైవర్ దస్తగిరి, పాల వ్యాపారి ఉమాశంకర్‌రెడ్డి, పులివెందులకు చెందిన చెప్పుల షాపు యజమాని మున్నాలను సీబీఐ అధికారులు శుక్రవారం కూడా విచారించారు. -
వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం
సాక్షి, కడప అర్బన్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్సార్ జిల్లా పులివెందులకు చెందిన సునీల్‌కుమార్ యాదవ్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అరెస్టు చేసింది. ఈ నెల 2న గోవాలో అతడు పారిపోతుండగా ట్రాన్సిట్ అరెస్టు చేసి అక్కడి కోర్టులో హాజరుపరిచింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అతడిని పలుమార్లు సీబీఐ విచారించిన సంగతి తెలిసిందే. అరెస్టు చేశాక అతడిని ప్రత్యేక వాహనంలో బెంగళూరు మీదుగా కడప కేంద్ర కారాగారానికి తరలించింది. అక్కడ సీబీఐ ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక కార్యాలయానికి సునీల్‌ను తీసుకొచ్చింది. మంగళవారం సాయంత్రం అతడిని కడప కోర్టులో హాజరుపరుస్తారనే ప్రచారం సాగినా రాత్రి వరకు కోర్టుకు తీసుకురా లేదు. బుధవారం ఉదయం సీబీఐ అధికారులు సునీల్ కుమార్‌ను కడప లేదా పులివెందుల లేదా జిల్లాలోని ఏదైనా కోర్టు లేదా మెజిస్ట్రేట్ ఎదుట నేరుగా గానీ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గానీ హాజరుపరిచే అవకాశం ఉంది. కాగా, కడప కేంద్ర కారాగారంలో ఇదే కేసుకు సంబంధించి వైఎస్ వివేకానందరెడ్డి ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, మాజీ డ్రైవర్ దస్తగిరి, ఉమాశంకర్ రెడ్డిలను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఈ కేసులో సునీల్‌తోపాటు ఈ ముగ్గురిని ప్రధాన అనుమానితులుగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి. ఎవరీ సునీల్‌కుమార్ యాదవ్? పులివెందుల మండలం మోటునూతలపల్లెకు చెందిన కృష్ణయ్య కుటుంబం ప్రస్తుతం భాకారాపురంలో నివాసం ఉంటోంది. కృష్ణయ్య స్థానిక ఆటోఫైనాన్స్‌లో వాటాదారుగా ఉండగా, ఆయన కుమారుడు సునీల్‌కుమార్ యాదవ్ ఇసుక రీచ్‌లో పనిచేసేవాడు. ఈ క్రమంలో తొండూరు మండలం రావులకొలనులో ఉన్న వైఎస్ వివేకానందరెడ్డికి సంబంధించిన పొలాలను పర్యవేక్షించే ఉమాశంకర్ రెడ్డితో సునీల్‌కు స్నేహం ఏర్పడింది. అతడి ద్వారా వైఎస్ వివేకాకు సునీల్ కుటుంబం మొత్తం దగ్గరైంది. ఈ నేపథ్యంలో వివేకా హత్య కేసులో తొలుత సిట్, ఆ తర్వాత సీబీఐ సునీల్‌ను, అతడి తల్లిదండ్రులు, సోదరుడు కిరణ్‌కుమార్‌ను పలు మార్లు విచారించింది. సునీల్‌ను సీబీఐ ఢిల్లీలోని తమ కార్యాలయంలో నెల పాటు ఉంచింది. దీంతో సీబీఐ తనతోపాటు తన కుటుంబ సభ్యులను విచారణకు పిలిపించి వేధిస్తోందని సునీల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనికి సీబీఐ కౌంటర్ పిటిషన్ వేసింది. హైకోర్టులో పిటిషన్ వేసినప్పటి నుంచి గోవాలోనే సునీల్‌కుమార్ యాదవ్ మకాం వేశాడు. దీంతో విచారణకు సహకరించకపో వడంతో అతడిని అనుమానితుడిగా నిర్ధారించిన సీబీఐ అరెస్టు చేసింది. -
జడ్జిలపై అనుచిత వ్యాఖ్యలు తగదు
సాక్షి, అమరావతి: న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ పీవీ సునీల్‌కుమార్ హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో హైకోర్టు న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలతో పోస్టులు పెడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. గతంలోనూ ఇలాంటి పోస్టులపై హైకోర్టు ఆదేశాల మేరకు చట్టపరమైన చర్యలు చేపట్టామని సునీల్ కుమార్ గుర్తు చేశారు. నాలుగు రోజుల నుంచి న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో వస్తున్న పోస్టింగ్‌లను గుర్తించామని, వాటిపై లోతైన దర్యాప్తు చేపట్టామని సునీల్ కుమార్ తెలిపారు. ఇదంతా కొందరు పథకం ప్రకారం చేస్తున్నట్టు ప్రాథమికంగా గుర్తించామన్నారు. దీని వెనుక కుట్ర దాగి ఉందని, కొందరు కావాలనే న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నట్టు నిర్ధారణకు వచ్చామన్నారు. ఇందుకు సంబంధించి ఏపీ సీఐడీ సోషల్ మీడియా వింగ్, ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్‌లు లోతుగా దర్యాప్తు చేస్తున్నాయని చెప్పారు. -
ప్రభుత్వాస్పత్రులపై సీఐడీ దాడులు
సాక్షి, అమరావతి: వైద్య పరికరాల నిర్వహణ కుంభకోణాన్ని నిగ్గు తేల్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,315 ప్రభుత్వాస్పత్రులపై సీఐడీ శనివారం ఏకకాలంలో దాడులు చేసింది. సీఐడీ అడిషనల్ డీజీ పీవీ సునీల్‌కుమార్ ఆదేశాల మేరకు 13 జిల్లాల్లో 42 ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయి సోదాల్లో పాల్గొన్నాయి. జిల్లా కేంద్ర ఆస్పత్రులు, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రులు, అర్బన్ హెల్త్ సెంటర్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సోదాలు చేపట్టిన సీఐడీ బృందాలు.. ఆయా ఆస్పత్రుల్లో ఉన్న వైద్య పరికరాలెన్ని? వాస్తవంగా పని చేస్తున్నవి(వర్కింగ్ కండీషన్) ఎన్ని? వాటి మార్కెట్ ధర ఎంత? వారెంటీ ఎన్నేళ్లు ఉంది? ఏఏ సంస్థలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు? ఆయా సంస్థలకు నిర్వహణ సేవల కోసం ఎంత మొత్తం చెల్లించారు? తదితర వివరాలు సేకరిస్తున్నారు. క్షేత్రస్థాయి వాస్తవాలతో ఓ నివేదిక రూపొందించి తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆస్పత్రులు, వైద్య కళాశాలల్లో వైద్య పరికరాల నిర్వహణ కాంట్రాక్టులో జరిగిన కుంభకోణంపై సెక్షన్ 420, 406, 477 కింద 07/2021 నంబర్‌తో సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ పెద్దలు చంద్రబాబు, కామినేని శ్రీనివాస్‌తో పాటు వైద్య ఆరోగ్య శాఖ కీలక అధికారుల అండతో రూ.కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన వ్యవహారంలో క్షేత్రస్థాయి ఆధారాలు సేకరించే దిశగా సీఐడీ ముందుకు వెళ్తోంది. బెంగళూరుకు చెందిన టీబీఎస్ ఇండియా టెలీమాటిక్, బయో మెడికల్ సర్వీసెస్ సంస్థకు 2015లో ఏడాది కాలానికి టెండర్ ఖరారు చేసిన దగ్గర్నుంచి.. దాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఐదేళ్లు కొనసాగించడం దాకా అప్పటి ప్రభుత్వ పెద్దల ప్రయోజనాలుండటంతో.. వాస్తవంగా పరికరాల వినియోగం గురించి సీఐడీ ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమై ఉంది. వారంలోగా వాస్తవాలు నిగ్గు తేలుస్తాం వైద్య పరికరాల నిర్వహణ సేవల పేరుతో జరిగిన కుంభకోణంలో ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు సేకరించాం. అసలు క్షేత్ర స్థాయిలో ఏం జరిగింది? అనే కోణంలో అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో సోదాలు నిర్వహిస్తున్నాం. పరికరాల విలువ ఎంత? పనిచేస్తున్నవి ఎన్ని? కాంట్రాక్టర్లకు ఎంత చెల్లించారు? అనే వివరాలను సేకరిస్తున్నాం. వారంలోగా వాస్తవాలు నిగ్గు తేలుస్తాం. అనంతరం దీనికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – సీఐడీ ఏడీజీ సునీల్‌కుమార్ -
అంతర్జాతీయ సర్వీసులపై నిషేధం పొడిగింపు
న్యూదిల్లీ: అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దును పొడిగిస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అధికారులు తెలిపారు. అయితే, ఎంపిక చేసిన మార్గాల్లో అంతర్జాతీయ సర్వీసుల రాకపోకలను పరిస్థితులను బట్టి సంబంధిత అధికారులు నిర్ణయిస్తారని అధికారులు తెలిపారు. కరోనాతో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ నిషేధాన్ని ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది. కార్గో విమానాలను ఎటువంటి షరతులు వర్తించవని స్పష్టంచేసింది. దీనికి సంబందించిన ఒక సర్క్యులర్ ను డీజీసీఏ సంయుక్త డీజీ సునీల్ కుమార్ జారీ చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చి 23 నుంచి భారత్ అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేసింది. మే నెల నుంచి ‘వందే భారత్’ మిషన్‌లో భాగంగా ఎంపిక చేసిన దేశాలకు, జూలై నుంచి కొన్ని ప్రత్యేక అంతర్జాతీయ విమాన సర్వీస్‌లను నడుపుతున్నారు.(చదవండి: ఫేస్‘బుక్’ నకిలీ ఖాతాలతో జర జాగ్రత్త!) -
భూములే కాదు.. ఆస్తుల సర్వే జరగాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి తేవడం ద్వారా భూవివాదాలకు పరిష్కారం చూపాలన్న ఆలోచనతో ముందుకెళ్తోంది. ఇందుకోసం ‘ధరణి’వెబ్‌సైట్‌ను కీలక ప్రామాణికం చేయబోతోంది. ఇకపై భూ లావాదేవీలన్నీ ఈ రికార్డుల్లో ఉన్న వివరాల ఆధారంగానే జరగనున్నాయి. భూమి ఏ విధంగా బదలాయింపు జరిగినా వ్యవసాయ భూములైతే తహసీల్దార్, వ్యవసాయేతర భూములైతే సబ్రిజిస్ట్రార్లు హక్కులను బదలాయిస్తారు. ఇందుకోసం ధరణి పోర్టల్‌ను సమగ్రంగా తీర్చిదిద్దుతోంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే, ఈ ధరణి పోర్టల్ భూమి వాస్తవ పరిస్థితులను ప్రతిబింబిస్తుందా అనేదే పెద్ద ప్రశ్న. ఈ నేపథ్యంలో ధరణి పోర్టల్‌లోని లోపాలు, హక్కుల విషయంలో ఎదురయ్యే చిక్కులు, ప్రభుత్వం చేయాల్సిన మార్పు చేర్పులపై భూహక్కుల నిపుణుడు, నల్సార్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ ఎం.సునీల్ కుమార్ ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వూ్య ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే.. హక్కుల రికార్డులపై.. ఇటీవల అసెంబ్లీ ఆమోదించిన తెలంగాణ భూమి హక్కులు మరియు పట్టాదారు పాసు పుస్తకాల చట్టం, 2020 (కొత్త ఆర్వోఆర్ చట్టం) ప్రకారం ధరణి వెబ్సైట్లో ఉన్న వివరాలనే హక్కుల రికార్డుగా పరిగణిస్తారు. అదే పాత చట్టం ప్రకారం కేవలం 1బీ రికార్డులను మాత్రమే ధరణిలో అప్లోడ్ చేశారు. ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం ఇదే హక్కుల రికార్డు అవుతుంది. ధరణిలో మార్పుచేర్పులకు కొత్త చట్టంలో అవకాశం లేదు. సాధారణంగా ఏ హక్కుల రికార్డుల చట్టంలోనైనా ఒకసారి రూపొందించిన హక్కుల రికార్డులో సవరణకు కొంత సమయం ఇస్తారు. పాత ఆర్ఓఆర్ చట్టంలో కూడా సవరణలకు ఒక సంవత్సరం సమయం ఇచ్చారు. కానీ ఇలాంటి నిబంధన కొత్త చట్టంలో లేదు. భూరికార్డుల ప్రక్షాళనలో రికార్డులను సరిచేశామని, 90 శాతానికి పైగా రికార్డులు సరిగ్గానే ఉన్నాయని ప్రభుత్వం అంటోంది. ఈ పరిస్థితుల్లో ఇప్పటికీ పట్టాదారు పాసుపుస్తకం రాని వారు మళ్లీ కొత్త చట్టం కింద తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా వివాదముంటే సివిల్ కోర్టును ఆశ్రయించాల్సిందే.. గతంలో లాగా రెవెన్యూ కోర్టుల్లో కేసు వేసే అవకాశం లేదు. హక్కు పత్రాలపై.. దేశ ప్రజలకున్న సంపద 70 శాతానికి పైగా భూమే.. కానీ, ఆ భూమికి ఉండాల్సిన దస్త్రాలు, రికార్డులు లేకపోవడం వలన దాన్ని భూయజమాని పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నాడు. రుణం పొందాలన్నా, ప్రభుత్వం రైతుకు ఇచ్చే ఏ మేలు దక్కాలన్నా హక్కు పత్రాలు లేకుంటే సాధ్యం కాదు. కాగితాలు లేని భూములు నిరర్థక ఆస్తులుగానే మిగిలిపోతాయి. ప్రభుత్వం చెప్పినట్టుగా యాజమాన్య హక్కు పత్రాలు ఇస్తే ప్రజల సంపదకు విలువ వస్తుంది. హక్కుల చిక్కులు తీరుతాయి. వివాదాలూ తగ్గుతాయి. సర్వే చేసి ఈ పుస్తకాలు ఇవ్వడం మంచిది. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మరిన్ని చిక్కులు వచ్చే ప్రమాదముంది. ఈ సమస్యలన్నింటి పరిష్కారానికి ఏకైక మార్గం సమగ్ర సర్వేనే.. ఇది భూ సమస్యల సర్వరోగ నివారిణి. సర్వే చేసి కొత్త రికార్డులు రూపొందించుకోవాలి. ఆ రికార్డులకు ప్రభుత్వమే జిమ్మేదారిగా ఉండాలి. కనీసం పాత చట్టంలాగా హక్కుల రికార్డుల్లోని వివరాలు సరైనవేనని కూడా ఈ చట్టం చెప్పడం లేదు. కాబట్టి ధరణిలో సవరణలకు ప్రభుత్వం మరో అవకాశం ఇవ్వాల్సిందే. వ్యవసాయేతర భూములపై.. వ్యవసాయేతర భూముల వివరాలు కూడా ధరణిలో నమోదు చేయబోతున్నారు. గ్రామ, నగర పాలక సంస్థల పరిధిలో ఉన్న ఆస్తుల వివరాలు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నమోదైన వివరాలను కలిపి ఒక సమగ్ర వ్యవసాయేతర ఆస్తుల జాబితాను రూపొందిస్తారు. వాటి ఆధారంగానే ఆస్తుల లావాదేవీలు జరు గుతాయి. వ్యవసాయేతర ఆస్తు ల సమగ్ర వివరాలు ప్రభుత్వం వద్ద లేవు. ఆబాదీ/గ్రామ కంఠాలలో సర్వే జరగలేదు. ఇప్పుడు గ్రామాలు ఈ ఆబాదీ దాటి వ్యవసాయ భూముల్లోకి విస్తరించాయి. దేశంలో దాదాపు ఏడు లక్షల గ్రామాలను నాలుగేళ్లలో సర్వే చేసి ఇంటి స్థలాలకు కార్డులు ఇవ్వడం కోసం కేంద్రం ‘స్వామిత్వా’పేరుతో కొత్త పథకం ప్రారంభించింది. రాష్ట్రం కూడా ఈవైపు ఆలోచించాలి. ధరణిలో తప్పొప్పులపై.. విస్తీర్ణంలో వ్యత్యాసం, భూ వివాదాలు, క్రమబద్ధీకరణ జరగని సాదా బైనామాలు, లావోని పట్టా కొనుగోళ్లు ఇలా పలు కారణాల వలన ధరణి వెబ్సైట్లో నమోదు కాని భూయజమానులు చాలామంది ఉన్నారు. ఒకవేళ ఎక్కినా పాసు పుస్తకం రికార్డుల్లో ఉన్న సర్వే నంబర్, క్షేత్రస్థాయిలో పొజిషన్లో ఉన్న సర్వే నంబర్‌కూ తేడా ఉన్న కేసులూ ఉన్నాయి. దీన్ని వైవట్ కబ్జా అంటారు. పట్టా భూమి అయి ఉండి కూడా నిషేధిత భూములు (22ఏ) జాబితాలో ఉండటంతో కొత్త పట్టా పాసుపుస్తకాలు రాని వారూ ఉంటారు. ఇలాంటి తప్పులు సరిదిద్దాలన్నా, సమస్యలకు దాదాపు పరిష్కారం కావాలన్నా భూముల సమగ్ర సర్వే తప్పనిసరి. సర్వే చేసి కొత్తగా రికార్డులు రూపొందించుకోవడమే సమస్యకు శాశ్వత పరిష్కారం. సర్వే జరిగే లోపు ధరణిలో సవరణలకు మరో అవకాశం ఇవ్వాలి. ఒక్కసారైనా రికార్డులను మ్యాన్యువల్‌గా రాసి ఆ తర్వాత ధరణిలో నమోదు చేస్తే తప్పులు సరిచేయొచ్చు. -
గ్రామాల్లో కరోనా నియంత్రణ చర్యలు పెంచండి
సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌కు పరిమిత సడలింపులతో వలస కార్మికులు పెద్ద సంఖ్యలో నగరాల నుంచి గ్రామాలకు వస్తున్న నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మరిన్ని చర్యలు చేపట్టాలంటూ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సునీల్‌కుమార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాశారు. పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో వలస కార్మికులు గ్రామాలకు చేరుతున్న సమయంలో కొత్తగా కరోనా సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల ముందస్తు చర్యలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. రాష్ట్రాలకు చేసిన సూచనలు ఇలా ఉన్నాయి... ► గ్రామాల్లో స్థానికులు కరోనా పేరుతో వలస కార్మికుల పట్ల వివక్షతో వ్యవహరించకుండా ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలి. ► అత్యంత మెరుగైన పారిశుద్ధ్య పరిస్థితులు నెలకొనేలా తగిన చర్యలు చేపట్టాలి. ► ఏఎన్ఎం, ఆశా, అంగన్వాడీ కార్యకర్తల సహకారంతో ఆయా గ్రామాల్లో కరోనా వైరస్ నియంత్రణ చర్యలు చేపట్టాలి. ► ప్రతి గ్రామంలోనూ గ్రామ వైద్య, పారిశుద్ధ్య అమలు కమిటీ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి. ► వైరస్ నివారణ కాల్షియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని ఫినాయిల్‌తో కలిపి గ్రామాల్లో విస్తృత స్థాయిలో పిచికారి చేయాలి. ► గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టాల్సిన పనులతో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ రూపొందించిన చెక్ లిస్టును అమలు చేయాలి. ► మొత్తం 60 అంశాలలో గ్రామాల్లో కరోనా నియంత్రణ చర్యలు అమలు అవుతున్నాయా లేదా అని పరిశీలించాలి. -
సునీల్ ‘పసిడి’ పట్టు
న్యూఢిల్లీ: సుదీర్ఘ విరామానికి తెరపడింది. 27 ఏళ్ల తర్వాత ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ గ్రీకో రోమన్ శైలిలో భారత్‌కు మళ్లీ స్వర్ణం లభించింది. మంగళవారం మొదలైన ఈ మెగా ఈవెంట్లో తొలి రోజు గ్రీకో రోమన్ శైలిలో భారత్‌కు ఒక స్వర్ణం, ఒక కాంస్యం లభించాయి. పురుషుల 87 కేజీల విభాగంలో సునీల్ కుమార్ పసిడి పతకం నెగ్గగా... 55 కేజీల విభాగంలో అర్జున్ హలకుర్కి కాంస్యం సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో సునీల్ 5–0తో అజత్ సలిదినోవ్ (కిర్గిస్తాన్)పై గెలిచాడు. తద్వారా పప్పూ యాదవ్ (1993లో; 48 కేజీలు) తర్వాత ఆసియా రెజ్లింగ్ పోటీల్లో గ్రీకో రోమన్ శైలిలో భారత్‌కు స్వర్ణాన్ని అందించిన రెజ్లర్‌గా సునీల్ గుర్తింపు పొందాడు. సెమీఫైనల్లో సునీల్ 12–8తో అజామత్ కుస్తుబయేవ్ (కజకిస్తాన్)పై, క్వార్టర్ ఫైనల్లో 8–2తో తకహిరో సురుడా (జపాన్)పై నెగ్గాడు. మరోవైపు 55 కేజీల విభాగం కాంస్య పతక పోరులో కర్ణాటక రెజ్లర్ అర్జున్ 7–4తో డాంగ్హైక్ వన్ (దక్షిణ కొరియా)పై నెగ్గాడు. ఇతర విభాగాల్లో సచిన్ రాణా (63 కేజీలు), సజన్ భన్వాల్ (77 కేజీలు) విఫలమయ్యారు. 130 కేజీల విభాగం కాంస్య పతక పోరులో మెహర్ సింగ్ (భారత్) 2–3తో రోమన్ కిమ్ (కిర్గిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. -
భారత రెజ్లర్లకు మళ్లీ నిరాశ
నూర్–సుల్తాన్ (కజకిస్తాన్): ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో భారత రెజ్లర్ల కథ మారలేదు. తొలి రోజు పేలవ ప్రదర్శనతో నిరాశ పరిచిన భారత రెజ్లర్లు రెండో రోజూ దానిని కొనసాగించారు. ఆదివారం గ్రీకో–రోమన్ విభాగంలో బరిలో నిలిచిన మనీశ్ (67 కేజీలు), సునీల్ కుమార్ (87 కేజీలు) తొలి రౌండ్లో నిష్క్రమించగా... రవి (97 కేజీలు) రెండో రౌండ్లో ఓడాడు. మొదటి రౌండ్లో రవి 5–0తో చెంగ్ హో చెన్ (చైనీస్ తైపీ)పై విజయం సాధించాడు. అనంతరం జరిగిన రెండో రౌండ్లో రవి 0–7తో ఆర్టర్ ఒమరొవ్ (చెక్ రిపబ్లిక్) చేతిలో ఓడాడు. అంతకుముందు జరిగిన 67 కేజీల విభాగం తొలి రౌండ్లో మనీశ్ 1–10తో డేవిడ్ తిహోమిరొవ్ దిమిత్రోవ్ (బల్గేరియా) చేతిలో, 87 కేజీల విభాగంలో సునీల్ 0–6తో జోసెఫ్ పాట్రిక్ (అమెరికా) చేతిలో ఓడారు. నేడు గుర్ప్రీత్ సింగ్ (77 కేజీలు), మనీశ్ (60 కేజీలు), నవీన్ (130 కేజీలు) బరిలో దిగుతారు. -
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇన్సూరెన్స్
సాక్షి, విజయవాడ: కాలానికి అనుగుణంగా సరికొత్త కట్టడాలతో ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ దేశంలోనే అదర్శంగా నిలుస్తుందని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. ఆయన గురువారం ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్లో 150 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఇన్స్యూరెన్స్ బాండ్లు అందజేసారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. మంచి కార్పొరేషన్‌గా అందరి మన్ననలు పొందుతోందని, మారుతున్న కాలానికి అనుగుణంగా సరికొత్త కట్టడాలతో ముందంజలో ఉందన్నారు. సంస్థ అభివృద్ధికి పాటుపడుతున్న సిబ్బంది సంక్షేమం కూడా తమకు ముఖ్యమే అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ఇన్యూరెన్స్ బాండ్లను అందించామన్నారు. సంస్థపై ఉన్న నమ్మకం వల్లే నేడు నిర్మాణం కోసం అనేక మంది సంప్రదిస్తున్నారని తెలిపారు. ఇటీవలి కాలంలో సంస్థ టర్నోవర్ కూడా బాగా పెరిగిందని వెల్లడించారు. ఇందుకు కృషి చేసిన సంస్థ వైస్ చైర్మన్ సునీల్ కుమార్, ఇతర సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. మంచి పని తీరుతో రాష్ట్రానికి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ పీవీ సునీల్ కుమార్ మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇన్సూరెన్స్ బాండ్లు ఇస్తున్నామని ప్రకటించారు. ‘బ్యాంకులు కేవలం పర్మినెంటు ఉద్యోగులకు మాత్రమే ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పినప్పటికీ, కొటక్ మహీంద్రతో ఒప్పందం చేసుకుని మరీ అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ఇన్సూరెన్స్ బాండ్లను అందిస్తున్నాం. ప్రమాదవశాత్తూ మరణించిన ఉద్యోగికి 20లక్షలు అందజేస్తాం. ఇటీవల హరికృష్ణ అనే ఉద్యోగి ప్రమాదవశాత్తు మరణిస్తే తోటి ఉద్యోగులు చందాలు వేసుకుని అతని కుటుంబానికి ఏడు లక్షలు ఇచ్చాం. ఈ విషయం తెలిసిన సీఎం జగన్మోహన్రెడ్డి బాధిత కుటుంబానికి రూ.5 లక్షల చెక్‌ను అందజేశారు. ఇక పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా అధునాతన భవనాలు నిర్మిస్తాం. ఇతర ప్రభుత్వ శాఖలు కూడా మా పని తీరు చూసి నిర్మాణ బాధ్యత అప్పగించాలి’ అని సునీల్ కుమార్ కోరారు. జరిగింది పార్టీల మధ్య గొడవ కాదు.. గణేష్ నిమజ్జన ఉత్సవాలు ముగేంత వరకు పల్నాడులో 144 సెక్షన్ అమలులో ఉంటుందని డిజిపి గౌతమ్ సవాంగ్ అన్నారు. ‘ఆత్మకూరులో రెండు వర్గాల మద్య గొడవ జరిగిందే తప్ప పార్టీలకు సంబంధం లేదు. వైన్ వెల్ఫేర్ బిల్డింగ్‌లో ఉన్నవారందరినీ పోలీసులే స్వయంగా గ్రామాలకు తీసుకెళ్లారు. అతి త్వరగా ఆత్మకూరులో పరిస్దితులు సాధారణ స్థితికి వస్తాయి. కొందరు నేతలు పొలీసులపై అసభ్యకరంగా మాట్లాడడంపై ఫిర్యాదులు వచ్చాయి. వివాదం పెద్దది కాకూడదని సంయమనాన్ని పాటించాం. నిన్న పోలీసులు స్పందించిన తీరు అభినందనీయం. తిడుతున్నా కూడా చాలా ఓర్పుగా వ్యవహరించారు. పోలీసులు ఏకపక్షం అని ఆరోపించడం సరికాదు.. పోలీసులు ప్రజల పక్షంగానే వ్యవహరిస్తారు. ఆత్మకూరు దాడిలో కొందరు మీడియా ముందు ప్రవేశపెట్టిన బాధితుల లిస్ట్‌ను మేము తెప్పించుకున్నాం. దాడిలో బాధితులని చెబుతున్నవారిలో సగానికి పైగా ఇతర ఇబ్బందులతో వచ్చినవాళ్లే. ప్రతి ఒక్కరి గురించి రెవెన్యూ అధికారులు క్షుణ్ణంగా వివరాలు తెలుసుకుంటున్నారు’ అని తెలిపారు. -
అల్లూరి నేషనల్ హీరో – సి. సునీల్‌కుమార్
‘‘స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజుగారిని ఒక ప్రాంతీయ హీరోగా కాకుండా జాతీయ హీరోగా చూపించాలనే ఆలోచనతో ‘సీతారామరాజు: ది ట్రూ వారియర్’ అనే సినిమా చేయబోతున్నాం’’ అని దర్శకుడు పి. సునీల్‌కుమార్ రెడ్డి అన్నారు. రిసాలి ఫిల్మ్ అకాడమీ అండ్ స్టూడియోస్ సమర్పణలో శ్రావ్య ఫిల్మ్స్ సహకారంతో పి. సునీల్‌కుమార్ రెడ్డి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘సీతారామరాజు: ది ట్రూ వారియర్’. ఈ సినిమా విశేషాల గురించి హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో పి.సునీల్‌కుమార్ మాట్లాడుతూ– ‘‘జాతీయ చరిత్రలో అల్లూరి సీతారామరాజుగారికి సముచితమైన స్థానం దక్కకపోవడం తెలుగువారి దురదృష్టం అనుకోవాలి. ఈ సినిమాలో రావు రమేష్, ఎల్బీ శ్రీరామ్, జీవా, షఫీ లాంటి నటులతో పాటు తమిళ, హిందీ నటీనటులు నటిస్తారు. యూరోపియన్ యాక్టర్స్‌ను కూడా తీసుకున్నాం. నా కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం. జూన్ రెండో వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నాం. ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలనుకుంటుటన్నాం’’ అని అన్నారు. ‘‘అల్లూరి సీతారామరాజు బయోపిక్ నిర్మించడం ఆనందంగా ఉంది. రిసాలి ఫిల్మ్ అండ్ స్టూడియోస్‌తో సినిమా రంగంలోకి రావడం ఆనందంగా ఉంది. మంచి సౌకర్యాలతో వైజాగ్‌లో ఏర్పాటు చేశాం. అకాడమీ స్టూడెంట్స్‌కు ఈ సినిమాకు వర్క్ చేసే అవకాశం ఇస్తున్నాం. ఈ ఏడాదిలోనే రెండు సినిమాలను నిర్మించాలనే ఆలోచనలో ఉన్నాం. కన్నడలో కూడా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాం. ఇందుకు సునీల్‌కుమార్ బాగా సహకరిస్తున్నారు’’ అన్నారు అకాడమీ ప్రతినిధి కె. శ్రీనివాస్. ‘‘ గతంలో మేం తీసిన చిత్రాలు బాగా ఆడాయి. నంది అవార్డులు తెచ్చిపెట్టాయి. రిసాలి ఫిల్మ్ అకాడమీతో కలిసి ఈ సినిమా చేయడం హ్యాపీ’’ అన్నారు రవీందర్. -
ఎమ్మెల్యేనైన నా ఓటే తొలగిస్తారా!
సాక్షి, యాదమరి(చిత్తూరు జిల్లా): ఎమ్మెల్యే ఓటే తొల గించాలని దరఖాస్తు వస్తే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి అని చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ బుధవారం మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు ప్రైవేటు ఐటీ కంపెనీల ద్వారా సామాన్య ఓటర్లవే కాక, నియోజకవర్గ ఎమ్మెల్యే ఓటు కూడా తీసేయాలని దరఖాస్తు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. నియోజక వర్గంలోని ఐరాల మండలం పైపల్లె గ్రామానికి చెందిన డాక్టర్ సునీల్‌కుమార్ గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓట్ల తొలగింపు కోసం ఆన్లైన్లో వేల కొద్దీ ఫారం–7 దరఖాస్తులు రావడంతో ఎమ్మెల్యే ధర్నాలు చేశారు, కానీ చివరకు ఎమ్మెల్యే ఓటు తీసేయాలని దరఖాస్తు రావడంతో ఆయన అవాక్కయ్యారు. అధికారులు పరిశీలించి ఫారం–7ను తిరస్కరించారు. ఎమ్మెల్యే ఓటు తీసేయాలని దరఖాస్తు చేసిన వ్యక్తిని బుధవారం ఎన్నికల అధికారులు, పోలీసులు విచారించారు. చివరకు అతను ‘‘నేను వైఎస్సార్సీపీ బూత్ కన్వీనర్‌ను. నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను దరఖాస్తు చేయలేదు’’ అని చెప్పారు. దీనిపై అధికారులు పోలీసులు ఆన్లైన్లో దరఖాస్తు పెట్టిన వారి ఐపీ అడ్రస్ ఆధారంగా పరిశీలిస్తున్నారు. -
పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ కుమార్‌కు షాక్
-
ఎమ్మెల్యే ఆటోడ్రైవర్ అయ్యారు!
పూతలపట్టు: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆటోవాలాలను ఆదుకుంటారని పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ భరోసా ఇచ్చారు. బుధవారం పూతలపట్టు మండలంలో గడప గడపకూ వైఎస్సార్ సీపీ కార్యక్రమం నిర్వహించారు. రాత్రి పి.కొత్తకోటలోని ఆటోస్టాండ్ వద్ద ఆయన ఆటోడ్రైవర్లతో మాట్లాడారు. అనంతరం తామంతా జగనన్నకు అండగా ఉంటామంటూ ఆటో డ్రైవర్లు ఎమ్మెల్యేకు ఖాకీ చొక్కా తొడిగారు. ఎమ్మెల్యే ఆటోలో డ్రైవర్లను ఎక్కించుకుని కొంతసేపు చక్కర్లు కొట్టడంతో పలువురు ఆసక్తిగా చూశారు. -
సునీల్ దొరికాడు
కడప అర్బన్ :మోస్ట్ వాంటెండ్ గ్యాంగ్‌స్టర్, జీవితఖైదు పడిన మండ్ల సునీల్‌కుమార్ అలియాస్ సునీల్ ఆటో డ్రైవర్ నుంచి మోస్ట్ వాంటెండ్ గ్యాంగ్‌స్టర్ దాకా ఎదిగి ప్రజల జీవనానికి ఆటంకం కలిగించేవాడు. అడ్డదారిలో డబ్బులు సంపాదిస్తూ జల్సాలకు పాల్పడేవాడు. ఇంటర్, ఇంజినీరింగ్ విద్యార్థులే లక్ష్యంగా వారిని ఆకట్టుకుని డబ్బులు, మద్యం, మగువలను ఎరగా వేసి గ్యాంగులుగా తీర్చిదిద్దాడు. 2010 నుంచి ఇప్పటిదాకా సునీల్‌కుమార్‌పై నాలుగు జిల్లాల్లో దాదాపు 19 కేసులు నమోదయ్యాయి. వీటిల్లో వైఎస్సార్ జిల్లాలోని వివిధ పోలీసుస్టేషన్ల పరిధిలో 13 కేసులు, అనంతపురం జిల్లాలో రెండు, కర్నూలు జిల్లాలో మూడు కేసులు, కృష్ణా జిల్లాలో ఒక కేసు నమోదైంది. ఇదీ సునీల్ నేర చరిత్ర ప్రొద్దుటూరు పట్టణ నివాసి మండ్ల సునీల్‌కుమార్ ఐదేళ్ల కిందట 150 నుంచి 200 మంది యువతను ప్రలోభాలతో చెడుదారి పట్టించి తన ఆధీనంలో గ్యాంగ్‌ను నడిపాడు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో హత్యలు, హత్యాయత్నాలు, కిడ్నాప్‌లు, చీటింగ్‌లు, అక్రమ ఆయుధాల కేసులు లాంటి నేరాలకు పాల్పడి ఇప్పటివరకు 19 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇటీవల అనంతపురం జిల్లా నార్పల కిడ్నాప్ కేసుకు సంబంధించి జీవితఖైదు విధించారు. కడప కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నాడు. 2014లో ఒకసారి కడప సెంట్రల్ జైలులోకి వెళుతూ అనంతపురం నుంచి వచ్చిన ఎస్కార్టు పోలీసుల కళ్లు గప్పి పారిపోయి కృష్ణా జిల్లా పోలీసులకు పట్టుబడ్డాడు. గతనెల 27వ తేదీన కర్నూలులో కోర్టు వాయిదాకు వెళ్లిన సునీల్‌కుమార్‌ను వాయిదాకు తీసుకెళ్లేందుకు కర్నూలు జిల్లా నుంచి ముగ్గురు ఏఆర్ పోలీసులు ఎస్కార్టుగా వచ్చారు. అక్కడి నుంచి వారిని మభ్యపెట్టి కడప బిల్టప్ జంక్షన్ వద్దకు రాగానే కేంద్ర కారాగారానికి వెళ్లకుండా దిగారు. అంతలోపు అతని బంధువులు రెండు మోటారు సైకిళ్లను, ఒక కారును, ఒక మహిళను తమతోపాటు తీసుకొచ్చారు. పెండ్లిమర్రి మండలం నందిమండలం కొండ గంగమ్మ గుడి వద్దకు అందరూ వెళ్లారు. అక్కడ పోలీసు ఎస్కార్టును దూరంగా ఉంచి సునీల్‌కుమార్, అతని అనుచరులు కారుతోపాటు పోలీసుల తుపాకులు దొంగలించి ఎత్తుకెళ్లారు. ఈ సంఘటనపై అదేరోజు పెండ్లిమర్రి పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. ఇదే సంఘటనకు సంబంధించి ఈనెల 1వ తేదిన ముగ్గురు ఏఆర్ పోలీసులను, సునీల్‌కుమార్ అనుచరులలో ముగ్గురిని డీఎస్పీ ఆద్వర్యంలో ప్రత్యేక బృందం అరెస్టు చేసింది. ప్రధాన నిందితుడు సునీల్‌కుమార్ కోసం కడప, బెంగుళూరు, ముంబయి ప్రాంతాలలో గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు సునీల్‌కుమార్‌ను బెంగుళూరులోని రాజాజీ రోడ్డులో ప్రత్యేక పోలీసు బృందం అరెస్టు చేసింది. ♦ సునీల్‌కుమార్ పెండ్లిమర్రి మండలం నందిమండలం నుంచి కారులో వెళ్లాడు. ఆయుధాలను తన అనుచరులైన గోపాల్, శ్రీనివాసులకు అప్పగించి మిగతా అనుచరులతో మోటారు సైకిళ్లపై పారిపోయాడు. ♦ చిన్నచెప్పలి వద్ద గుట్టపై అదేరోజు తన అనుచరుడు హరితోపాటు ఉండి అక్కడి నుంచి ఒక రైతు మోటారు సైకిల్ దొంగలించి ఎర్రగుంట్లకు వచ్చి రైలులో బళ్లారి, అక్కడి నుంచి బస్సులో హోస్పేటకు పారిపోయాడు. హోస్పేటలో రెండు రోజులు లాడ్జిలో ఉండి అక్కడి నుంచి ముంబయికి బస్సులో వెళ్లాడు. ఏప్రిల్ 1వ తేదిన ముంబయికి చేరుకుని అదేరోజు రాత్రి బస్సులో బెంగళూరుకు చేరుకున్నాడు. 2వ తేదీ నుంచి ఈనెల 4వ తేదీ రాత్రి వరకు బెంగళూరులోని పేయింగ్ గెస్ట్రూములో ఉన్నాడు. అక్కడికి చేరుకున్న పోలీసు బృందం బెంగుళూరులోని రాజాజీనగర్ రోడ్డులో అత్యంత చాకచక్యంగా అరెస్టు చేశారు. అక్కడి నుంచి చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని తాడిగొట్ల క్రాస్ రోడ్డు వద్దకు తీసుకు రాగా కాలకృత్యాలు తీర్చుకునే నెపంతో పోలీసులపై రాళ్లతో దాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేయగా, పోలీసు బృందం సునీల్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుంది. ♦ 2014లో జిల్లాలోని పులివెందుల–తాడిపత్రి మార్గమధ్యంలో ఓ వాహనంలో వేట కొడవళ్లు పెట్టుకుని కిడ్నాప్ నకు ప్రయత్నిస్తున్న సమయంలో అప్పటి జమ్మలమడుగు ఏఎస్పీ అప్పలనాయుడు పర్యవేక్షణలో సింహాద్రిపురం ఎస్ఐగా పనిచేసిన ఎన్.రాజరాజేశ్వర్‌రెడ్డి తమ బృందంతో కలిసి అరెస్టు చేశారు. ♦ కడప కేంద్ర కారాగారం గేటు బయటి నుంచి 2014లో వాయిదాకు వెళ్లి వచ్చి ఎస్కార్టు పోలీసుల కళ్లు గప్పి పరారయ్యాడు. కడప కేంద్ర కారాగారంలో కూడా ప్రతి ఆదివారం ఒక కిలో మేరకు చికెన్‌గానీ, మటన్గానీ తీసుకుని కడుపారా ఆరగించి తన అనుచరులకు కూడా ఇస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే ఎస్కార్టు వెళ్లిన ప్రతిసారి తనకు అనుకూలంగా ఉండే పోలీసుల ద్వారా మద్యం సేవించడం, కడుపార తినడం, అవసరాలు తీర్చికోవడం పరిపాటిగా మారిందని తెలుస్తోంది. కడప కేంద్ర కారాగారంలోనే సునీల్‌కుమార్ వచ్చినప్పటి నుంచి దాదాపు 15 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. -
‘ఇది అల్లాహ్‌కి-రాముడికి మధ్య యుద్ధం!’
బెంగళూరు : ఎన్నికల రాష్ట్రం కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్ నేతలు దిగజారుడు వ్యాఖ్యల్లో పోటీపడుతున్నారు. ‘ఈ ఎన్నికలు అల్లాహ్‌కి రాముడికి మధ్య యుద్ధం’అంటూ బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపుతున్నాయి. అంతకుముందు మంత్రి రామనాథ రాయ్ ‘అల్లాహ్ అనుగ్రహంతోనే ఆరు సార్లు గెలిచాన’న్న మాటలు కూడా వివాదాస్పదమయ్యాయి. అంతా అల్లాహ్ దయ! : దక్షిణ కన్నడ జిల్లాలోని బంత్వాల్ నియోజకవర్గంలో ముస్లింల ప్రాబల్యం ఎక్కువ. ఇక్కడి నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రామనాథ్ రాయ్(కాంగ్రెస్).. మంత్రిగానూ కొనసాగుతున్నారు. ఇటీవలే నియోజకవర్గంలో పర్యటించిన ఆయన.. ‘ముస్లింలలోని లౌకికభావన, అల్లాహ్ అనుగ్రహాల వల్లే నేను ఆరుసార్లు గెలిచాను’ అని అన్నారు. మంత్రి వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగడంతో కాంగ్రెస్ వివరణ ఇచ్చుకోవాల్సివచ్చింది. రాముణ్ని గెలిపించుకుందాం : అదే బంత్వాల్ నియోజకవర్గంలోని కల్లాడ్కలో మంగళవారం రాత్రి బీజేపీ భారీ సభను నిర్వహించింది. ఆ సభలో కర్కాల ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ.. మంత్రి రాయ్‌కి కౌంటర్ ఇచ్చారు. ‘‘ఆయన(రాయ్) అల్లాహ్ దువాతో గెలిచానని చెప్పుకుంటున్నాడు. మరి మనం మన దేవుణ్నిగెలిపించుకోలేమా, ఈ సారి బంత్వాల్‌లో జరిగే ఎన్నిక కాంగ్రెస్,బీజేపీల మధ్యకాదు.. అల్లాహ్-రాముడికి మధ్య యుద్ధం. మీరంతా రాయ్‌కి వ్యతిరేకంగా ఓటేసి మన దేవుణ్నే గెలిపించాలి’’ అని సునీల్ కుమార్ అన్నారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నంచేసిన ఈ ఇద్దరు నాయకులపై ఇప్పటివరకు ఎలాంటి కేసులూ నమోదుకాలేదు. -
పేదరికం నుంచి ప్రతిభావంతుడిగా..
గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): తండ్రి కష్టాలను చూసి పేద కుటుంబంలో పుట్టిన ఆ యువకుడు చలించిపోయాడు. బాగా చదువుకుని అత్యుత్తమ స్థాయికి చేరుకోవాలనుకున్నాడు. ఆత్మవిశ్వాసంతో శ్రమే ఆయుధంగా కష్టపడ్డ ఆ యువకుడు 24 ఏళ్ల చిన్నవయసులోనే స్విట్జర్లాండ్‌లోని క్రెడిట్ స్విస్ బ్యాంక్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎంపికయ్యాడు. అతడే బండారు సునీల్‌కుమార్. పేదరికం నుంచి ప్రతిభావంతుడిగా.. సునీల్‌కుమార్ తండ్రి శ్రీనివాస్‌ది విజయనగరం జిల్లా అలమండ సంత గ్రామం. పేదరికం వెంటాడటంతో ఆయన 16 ఏళ్ల వయసులోనే విశాఖపట్నం చేరుకున్నాడు. ముందు గోపాలపట్నంలో చిన్నచిన్న దుకాణాల్లో పనిచేసి ప్రస్తుతం విశాఖలోని ఇందిరానగర్‌లో కిరాణా కొట్టు నిర్వహిస్తున్నాడు. వచ్చే కొద్దిపాటి ఆదాయంతోనే భార్య భవానిని, కుమారుడు సునీల్ కుమార్‌ను, కుమార్తె ప్రియాంకను పోషిస్తున్నాడు. సునీల్ చిన్నతనం నుంచే ప్రతిభావంతుడిగా పేరు తెచ్చుకున్నాడు. పదో తరగతిలో 513 మార్కులు సాధించాడు. ఎంసెట్‌లో 682 ర్యాంకు, ఐఐటీ జేఈఈలో 7000 ర్యాంకు పొందాడు. కుటుంబ సభ్యులతో సునీల్‌కుమార్ ఇంటర్మీడియెట్ పూర్తయ్యాక కోల్‌కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ (ఐఎస్ఐ)లో ఇంటిగ్రేటెడ్ పీజీ పూర్తి చేసి రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రంగరాజన్ చేతులమీదుగా పట్టా అందుకున్నాడు. పీజీ పూర్తిచేసిన తర్వాత ముంబైలోని క్రెడిట్ స్విస్ బ్యాంక్ (స్విట్జర్లాండ్)లో రిస్క్ ఎనలిస్ట్‌గా బాధ్యతలు చేపట్టాడు. ప్రస్తుతం 24 ఏళ్ల చిన్న వయసులోనే ఆ బ్యాంక్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎంపికయ్యాడు. కాగా, సునీల్ సోదరి ప్రియాంక ఇంజనీరింగ్ పూర్తి చేసింది. శ్రమనే దైవంగా భావించా.. నాన్న కష్టాన్ని కళ్లారా చూశాను. కిరాణా కొట్టులో నాన్నకు సాయం చేసేవాడిని. నేటి విద్యార్థులు ఇంజనీరింగ్‌పై మాత్రమే కాకుండా మిగతా అవకాశాలపై దృష్టి సారించాలి. కోల్‌కతా యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చదవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. శ్రమనే దైవంగా భావించి కష్టపడటంతో ఈ స్థాయికి చేరుకున్నా. – సునీల్‌కుమార్ -
రౌడీల రక్షణకు గన్మెన్లా?
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల ఆక్షేపణ శిల్పా చక్రపాణిరెడ్డిపై కాల్పులకు ఖండన సాక్షి, చిత్తూరు: కర్నూలు జిల్లా నంద్యాలలో తమ పార్టీ నాయకుడు శిల్పా చక్రపాణిరెడ్డిని లక్ష్యంగా చేసుకుని అధికార పార్టీ నేత కాల్పులకు తెగబడడాన్ని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు నారాయణస్వామి, సునీల్ కుమార్ ఖండించారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ... రౌడీల రక్షణకు గన్మెన్లను ఇవ్వడం సబబేనా అని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉంటే పోలీసులు ఎందుకు ఆయుధాలు స్వాధీనం చేసుకోలేదని ప్రశ్నించారు. కత్తులతో స్వైరవిహారం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆందోళన వ్యక్తం చేశారు. నంద్యాల ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన శిల్పా మోహన్ రెడ్డి సోదరుడు చక్రపాణిరెడ్డి లక్ష్యంగా భూమా వర్గీయుడు, రౌడీ షీట్ వున్న అభిరుచి మధు గురువారం తుపాకీతో అయిదు రౌండ్ల కాల్పులు జరిపాడు. అంతేకాకుండా వేట కొడవలితో ఆయనను హెచ్చరిస్తూ వీరంగం సృష్టించాడు. -
బాపూగారు బాగా ప్రోత్సహించారు
‘‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో బౌద్ధ సన్యాసి ధర్మనందనుడుగా, ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ చిత్రంలో విలన్‌గా నటించా. ఈ సంక్రాంతికి విడుదలైన ఆ రెండు చిత్రాలు నటుడిగా నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. చాలామంది అభినందిస్తున్నారు’’ అని నటుడు సునీల్ కుమార్ చెప్పారు. పాత్రికేయుల సమావేశంలో సునీల్ కుమార్ మాట్లాడుతూ – ‘‘మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో పుట్టి పెరిగిన నేను నటుడిగా రాణించాలనుకున్నాను. ఎన్నో ప్రయత్నాలు చేశాను. అప్పుడే దర్శకుడు బాపూగారిని కలిశాను. ఆయన ‘భాగవతం’ సీరియల్లో నన్ను రాముడు, కృష్ణుడు పాత్రలిచ్చి, ప్రోత్సహించారు. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో ‘రాధాగోపాలం’, ‘సుందరకాండ’ సినిమాల్లో నటించాను. నాకు యాక్సిడెంట్ కావడంతో సినిమాలకు గ్యాప్ వచ్చింది. ధర్మనందనుడు పాత్రకు మేకప్ సెట్ కాకపోవడంతో గుండు కొట్టుకుంటావా అని క్రిష్ అడగడంతో ఓకే అన్నా. సినిమాలో నా పాత్ర చూస్తుంటే హ్యాపీగా అనిపించింది. బాలకృష్ణ, హేమమాలినిగార్లతో నటించడం మరచిపోలేని అనుభూతి’’ అన్నారు. -
ఏసీబీ వలలో మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్
చిత్తూరు: సహాయ మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్ లంచం తీసుకుంటూ ఉన్నతాధికారులకు పట్టుబడ్డాడు. దీంతో అతన్ని విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నారు. ఈ సంఘటన చిత్తూరులో సోమవారం చోటుచేసుకుంది. పట్టణంలో సహాయ మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్ ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా.. చిత్తూరు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బాలసుబ్రహ్మాణ్యం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయనపై విచారణ చేపట్టి విధుల నుంచి బహిష్కిరించారు. -
వరికి తెగుళ్లా.. దిగులొద్దు!
సస్యరక్షణ చర్యలతో మేలు వ్యవసాయాధికారుల సూచనలు పాటించాలి అతిగా రసాయనాల వాడకం వద్దు టేక్మాల్ ఏఈఓ సునీల్‌కుమార్ టేక్మాల్: వరికి సోకే తెగుళ్లతో ఎటువంటి దిగులు చెందాల్సిన పనిలేదని టేక్మాల్ వ్యవసాయ విస్తరణాధికారి సునీల్‌కుమార్ (99499 68674) తెలిపారు. సమయానుకూలంగా కలుపుతీత, సస్యరక్షణ చర్యలు పాటించాలన్నారు. అతిగా రసాయనాలను వాడితేనే ప్రమాదమన్నారు. వ్యవసాయాధికారుల సలహా సూచనలు పాటించాలని తెలిపారు. ప్రస్తుతం సాగవుతున్న వరికి సోకే తెగుళ్లు.. వాటి నివారణ చర్యలపై ఆయన అందించిన సలహా సూచనలు.. అగ్గితెగులు (బ్లాస్ట్): లక్షణాలు: అగ్గితెగులు వరిపైరుకు ఏ దశలోనైనా ఆశిస్తుంది. ముఖ్యంగా ఈ తెగుళు వరి ఆకులపై, మొక్క కణుపులపై. వరి వెన్నుపై వస్తుంది. అగ్గితెగులు నారుమడిలో వస్తే నారుమడి పూర్తిగా ఎండిపోతుంది. వరినాట్లు పూర్తయిన తర్వాత అగ్గితెగులు సోకితే తెగులు సోకిన మొక్కలు గిడసబారిపోతాయి. ఆకులపైన చిన్న చిన్న గోధుమరంగు మచ్చలు ఏర్పడి అవి క్రమేపీ పెద్దవై నూలు కండె ఆకారంలో మచ్చలు ఏర్పడతాయి. ఈ తెగులు వరి యొక్క కణుపులకు సోకినప్పుడు కణుపులపై గోధుమరంగు మచ్చలు ఏర్పడి కణుపు వద్ద మొక్క విరిగిపోతుంది. వరి వెన్ను దశలో ఈ తెగులు సోకితే వెన్ను దగ్గర గోధుమ రంగు లేదా నల్లని మచ్చలు ఏర్పడతాయి. దీని వల్ల వరి వెన్ను మెడ దగ్గర విరిగి వేలాడటం లేదా పడిపోవడం జరుగుతుంది. ఈ తెగులు సోకిన వెన్నులోని గింజలు తాలుగా మారి ఉంటాయి. వ్యాప్తి: ఈ తెగులు వ్యాప్తించిన వారంలో అనుకూల పరిస్థితులు ఉంటే వ్యాధి మరింత విజృంభిస్తుంది. వరినాట్లు దగ్గరి దగ్గరగా వేయటం లేదా నత్రజని వాడకం ఎక్కువైనా ఈ వ్యాధి తీవ్రత పెరుగుతుంది. నివారణ: 1.నాణ్యమైన విత్తనాలను ఎంచుకోవాలి. 2.పొలాల గట్లను కలుపు మొక్కలు లేకుండా శుభ్రం చేయాలి. 3.నత్రజని సిఫారసు చేసిన మేరకు 2-3 సార్లు వేయాలి. 4.ధైరాన్ లేదా కాప్టాన్ (2.5 గ్రా) ట్రైసైక్లోజోల్ 2గ్రా ఒక కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేయాలి. 5.తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే ట్రైసైక్లోజోల్ 0.6 గ్రా లేదా ఎడిఫెన్పాస్ 1 మి.లి లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. 6.తెగులు తట్టుకునే రకాలైన సింహపురి, తిక్కన శ్రీరంగ, ఫల్గుణ, స్వాతి వంటి రకాలను సాగు చేయాలి. పొడ తెగులు (శీత్బ్లెట్) లక్షణాలు: సామాన్యంగా వరి పిలకల దశ నుండి ఎప్పుడైనా ఈ తెగులు ఆశించవచ్చు. కాండంపై ఉన్న ఆకులపై చిన్న గోధుమరంగు మచ్చలు ఏర్పడి అవి క్రమేపీ పెద్దవై పాముపొడ వంటి మచ్చలుగా మారతాయి. ఈ మచ్చలు ఒక క్రమ పద్ధతిలో ఉండవు. మచ్చల చుట్టూ గోధుమ వర్ణం కల్గి మధ్యభాగం బూడిద రంగులో ఉంటుంది. ఈ తెగులు వరి మొక్క పిలక దశలో సోకినా.. వెన్ను దశకు వచ్చేసరికి కానీ రైతులు దీనిని గుర్తించలేరు. వ్యాప్తి: వరి పైరు కోసే సమయంలో ఈ బీజాలు కొన్ని రాలిపొయి, మరికొన్ని ధాన్యంతో కూడా కలుస్తాయి. ప్రవాహపు నీటి ద్వారా శిలీంధ్ర బీజాలు ఒక పొలం నుండి ఇంకో పొలానికి చేరతాయి. వరినాట్లు దగ్గరగా నాటినప్పుడు, అధిక నత్రజని ఎరువులు వేసినప్పుడు తెగులు అధికంగా వృద్ధి చెందుతుంది. నివారణ: 1. మంచి విత్తనాన్ని ఎన్నుకొని 2-3 గ్రా. మాంకోజబ్ కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేయాలి. 2. నత్రజని ఎరువు 2-3 దఫాలుగా వేయాలి. 3. పిలక దశలో తెగులు లక్షణాలు కనిపించినప్పుడు 1 మి.లీ. ప్రోపికోనజోల్ లేదా 2 మి.లీ. హెక్సాకొనజోల్ మందును నీటిని కలిపి పిచికారి చేయాలి. పొట్టకుళ్లు తెగులు: లక్షణాలు: వరి పొట్టదశలో ఉన్నప్పుడు ఈ వ్యాధి సోకుతుంది. వరి వెన్నుపైకి వచ్చే దశలో ఈ లక్షణాలు బాగా కనిపిస్తాయి. వరి వెన్నును ఆకు లోపల నుండి పూర్తిగా బయటికి రానివ్వదు. వరి వెన్ను సగభాగం మాత్రం బయటికి వచ్చి మిగతా భాగం పొట్ట ఆకులో ఉంటుంది. పొట్ట ఆకు కింది భాగంలో ఆకుపై కోలగా గాని లేక గోధుమరంగు మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చల మ«ధ్యభాగం బూడిద రంగు కలిగి ఉంటుంది. ఈ తెగులు సోకడం వలన పైకి వచ్చిన వెన్నుపై ఉండే గింజలు గడ్డి రంగు గింజలుగా, ఆకు లోపల గల గింజలు నలుపు రంగులోకి మారతాయి. వ్యాప్తి: కంకి ఆకును గాయపరిచే కీటకాలు ఎక్కువగా ఉన్నప్పుడు గాయాల వల్ల వెన్ను బయట పడని పరిస్థితుల్లో ఈ వ్యాధి ఎక్కువగా సొకుతుంది. నివారణ: 1.పైరు పొట్టదశలో ఒకసారి, తెగులు కనిపించిన వెంటనే ఒకసారి కార్బండిజమ్ 0.5- 1.0 గ్రా లేదా బెనోమిల్ 0.5 గ్రా లీటరు నీటికి కలిపి రెండుసార్లు వారం వ్యవధిలో పిచికారి చేయాలి. బ్యాక్టీరియల్ ఆకు ఎండు తెగులు లేక బ్యాక్టీరియల్ బైట్: లక్షణాలు: ఈ తెగులు వరిపైరును ముఖ్యంగా 3 దశల్లో ఆశిస్తుంది. 1) నారుమడి దశలో ఈ తెగులు సోకితే ఆకులు చివర్ల నుండి కింది వరకు రెండు పక్కల తడిసినట్లు ఉండి పసుపు రంగుకు మారి ఆకులు ఎండి మొక్కలు చనిపోతాయి. దీనిని ’క్రెసెక్’ దశ అని అంటారు. నాట్లు వేసిన 30 రోజుల తర్వాత కూడ ఈ క్రెసెక్ లక్షణాలు కనిపించవచ్చును. 2) వరి మొక్కలు పిలకలు వేసే దశలో ఆకుల చివరల నుండి కింది వరకు ఆకులు పసుపు పచ్చగా మారి తెగులు సోకిన భాగాలు ఎండిపోతాయి. తెగులు సోకిన ఆకు నుండి పచ్చని జిగురు వంటి పదార్థం బయటకు వస్తుంది. ఇది సూర్యరశ్మికి గట్టిపడి చిన్న చిన్న ఉండలుగా మారి గాలి వీచినప్పుడు ఆకు నుండి దాని చేనులోని నీటిలో పడతాయి. నీటి ద్వారా దీనిలో వున్న బ్యాక్టీరియా ఇతర మొక్కలు, పొలాలకు చేరుతుంది. 3. వరి వెన్ను పైకి వచ్చే దశలో ఈ తెగులు సోకిన ఆకులలోనికి హరిత పదార్థం తగ్గుట వలన కొన్ని వెన్నులు సగం మాత్రమే బయటికి వస్తాయి. గింజలు తాలుగా మారుతాయి. వర్షం జల్లులు పడినప్పుడు ఈ తెగులు ఎక్కువగా వ్యాపిస్తుంది. ఈ బ్యాక్టీరియా కలుపు మొక్కలలు, సాగునీటి ద్వారా, వర్షం ద్వారా వ్యాప్తి చెందుతుంది. నివారణ: 1.ఆరోగ్యవంతమైన పంట నుండి విత్తనాన్ని సేకరించాలి. 2.నత్రజని ఎరువులను 3-4 దఫాలుగా వేయాలి. 3.తెగులు వ్యాప్తి ఎక్కువగా ఉంటే నత్రజని వాడకం తాత్కాలికంగా ఆపాలి. 4.తెగులు సోకిన పొలం నుండి నీటిని తెగులు ఆశించని పొలాలకు పారకుండా చూడాలి. 5.తెగులు కనిపించిన వెంటనే స్ట్రేప్టోమైసిన్ లేదా పోషామైసిన్ 200 పీపీఎం మందును 10-15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలి. టుంగ్రో వైరస్ (నారింజ రంగు ఆకు తెగులు) లక్షణాలుః ఈ తెగులు సోకిన వరి మొక్కలు కురచగా ఉండి సరిగా ఎదగవు. చాలా తక్కువ పిలకలు వస్తాయి. ఆకులు లేత ఆకుపచ్చ లేక నారింజ రంగులోకి మారతాయి. మొక్కల వేర్లు పూర్తిగా వృద్ధి చెందక, వెన్నులు చిన్నవిగా ఉండి పొల్లుగింజలతో నిండి ఉంటాయి. వ్యాప్తి: ఈ తెగులు పచ్చదీపపు పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ పచ్చ దీపపు పురుగులు సెప్టెంబర్ రెండో వారం నుండి నవంబర్ 3వ వారం వరకు మరియు మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎక్కువగా ఉంటాయి. నివారణ: 1. తెగులు తట్టుకునే రకాలైన ఎంటీయూ 9992, 1002, 1003, çసురక్ష భరణి వంటి రకాలను సాగు చేయాలి. 2. పంట కోసిన తర్వాత దుబ్బులను నాశనం చేయాలి. 3. వరి పిలకలు, పడి మొలిచే మొక్కలను నాశనం చేయాలి. 4. తెగులు వ్యాప్తి చేసే పచ్చదీపపు పురుగుల నివారణకు ఎకరాకు 10 కిలోల కార్బోప్యూరాన్ గుళికలను వేయాలి. లేదా లీటరు నీటికి 2.2 మి.లీ., మోనోక్రోటోఫాస్ లేదా 1.5 మి.లీ. ఇథోఫెన్ఫాస్ కలిపి పిచికారి చేయాలి. 5. తెగులు సోకిన మొక్కలను గమనించిన వెంటనే పీకి నాశనం చేయాలి. -
పానీపూరీల కోసం ప్రాణాలు తీశారు!
న్యూఢిల్లీ: పానీపూరీలు ఎవరు ముందు కొనాలనేదానిపై మాటామాటా పెరిగి ఓ వ్యక్తిని హత్య చేసేవరకు వెళ్లింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన ఆగస్టు 4న వాయవ్య ఢిల్లీలోని భలాస్వా డైరీ ప్రాంతంలో జరిగింది. భలాస్వా ప్రాంతంలోని సింఘానియా గ్లాస్ గోదాము సమీపంలోని కచ్చీ గల్లీలో ఓ వ్యక్తి అపస్మాకర స్థితిలో పడిపోయి ఉండటాన్ని గుర్తించిన పోలీసులు అతణ్ని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు డాక్టరు తెలిపారు. చనిపోయిన వ్యక్తి రాజీవ్ నగర్ కు చెందిన ఇర్ఫాన్ గా పోలీసులు గుర్తించారు. ఇద్దరు వ్యక్తులు అతనిని మోటారుసైకిల్‌పై తీసుకొచ్చి గల్లీలో పడేసి వెళ్లిపోయారని దర్యాప్తులో తేలింది. వాళ్లే ఇర్ఫాన్ ను హత్యచేసి ఉంటారని అనుమానించిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. హత్య జరిగిన రోజు.. ఇర్ఫాన్, అతణ్ని చంపిన ఇద్దరు వ్యక్తులు ఓ పానీ పూరీ బండి దగ్గర తగువులాడుకున్నారు. పానీ పూరీ ఎవరికి ముందు ఇవ్వాలనే విషయమై జరిగిన గొడవలో బైక్ మీద వచ్చిన ఇద్దరూ ఇర్ఫాన్ ను కొట్టి చంపారు. సమీపంలోని సీసీటీవీల దృశ్యాల ఆధారంగా సునీల్ కుమార్(22), లక్కీ(21) అనే యువకులను పోలీసులు అరెస్టుచేశారు. -
రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య
స్టేషన్‌ఘన్‌పూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన బోగం సునీల్ కుమార్(30) అనే వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని కుటుంబసభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. సునీల్ హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పూతలపట్టు ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం
చిత్తూరు : చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌కు బుధవారం తృటిలో ప్రమాదం తప్పింది. కాణిపాకంలో నిర్వహిస్తున్న గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన వాహనంలో వెళ్తున్నారు. ఆ క్రమంలో ఎదురుగా వస్తున్న ఇన్నోవా కారు ఎమ్మెల్యే సునీల్ వాహనాన్ని ఢీకొట్టింది. కాగా ఈ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం సునీల్ మరో కారులో కాణిపాకం బయలుదేరి వెళ్లారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఎస్సీ ఎమ్మెల్యే అంటే చిన్నచూపా?
సునీల్ కేసును పట్టించుకోకపోవడం దారుణం కేసు నమోదు చేయకుంటే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామి వెల్లడి తిరుపతి మంగళం/ శ్రీరంగరాజపురం /తిరుపతి రూరల్/ మదనపల్లె సిటీ/: పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌కుమార్ ఎస్సీ వర్గానికి చెందిన వారని అధికారులు, టీడీపీ నాయకులు చిన్నచూపు చూస్తారా? అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి ప్రశ్నించారు. శనివారం ఆయన ఫోన్లో విలేకరితో మాట్లాడారు. ఐరాల మండల సమావేశానికి సునీల్ హాజరైనా, సమావేశం నిర్వహించకుండా టీడీపీకి చెందిన సింగిల్ విండో చైర్మన్ గిరినాయుడు రాలేదని సుమారు మూడు గంటలసేపు ఎమ్మెల్యేను నిరీక్షింపజేశారని, ఆ తర్వాత వచ్చిన గిరినాయుడు ఎమ్మెల్యేపై దురుసుగా ప్రవర్తించి కులం పేరుతో దూషించారని ఆందోళన వ్యక్తం చేశారు. గిరినాయుడుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డీఎస్పీకి ఫిర్యాదు చేసినా ఇంతవరకు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. వెంటనే గిరినాయుడుపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. శ్రీరంగరాజపురంలో అక్రమంగా కేసులు శ్రీరంగరాజపురం మండల పరిషత్ కార్యాలయంలో జెడ్పీటీసీ సభ్యుడు విజయ్‌కుమార్‌కు చాంబరే లేదు, ఆయన కుర్చీ విరిచారని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు 17 మందిపై కేసులుపెట్టడం ఎంతవరకు న్యాయమని ఎమ్మెల్యే నారాయణస్వామి ఎస్ఐ అరుణ్‌కుమార్‌రెడ్డిని ప్రశ్నించారు. శనివారం ఆయన శ్రీరంగరాజపురంలో పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. విజయ్‌కుమార్ ఆస్తులు ధ్వంసం చేశారా? ఆయనపై దౌర్జన్యం చేశారా? ఎవరి ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశారు? కేసులు నమోదు చేయాలని ఒత్తిడి తెచ్చిన వ్యక్తి ఎవ్వరు తేల్చాలని స్టేషన్లో బైఠాయించారు. నిందితులను వెంటనే అరెస్టుచేయాలి - ఎమ్మెల్యే చెవిరెడ్డి ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌ను అవమానించిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని వైఎస్సార్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం తిరుపతిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండల సమావేశంలో తనపై గిరినాయుడు, బాలసుబ్రమణ్యం నాయుడు దాడికి యత్నించి. కులం పేరుతో దూషించారని సునీల్ ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అనధికార వ్యక్తులను వేదికపై కూర్చోపెట్టి ఎమ్మెల్యేని దూషించడానికి కారణమైన ఎంపీడీవోను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే హక్కులకు భంగం కలిగించిన వారిపై అసెంబ్లీ నైతిక విలువల కమిటీకి ఫిర్యాదు చేస్తామన్నారు. అసెంబ్లీలో ప్రస్తావిస్తాం : ఎమ్మెల్యే తిప్పారెడ్డి ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌ను దుర్భాషలాడిన టీడీపీ నేతలపై కేసులు నమోదు చేయాలని మదనపల్లె ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మదనపల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఐరాల మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సంఘటనపై అసెంబ్లీలో ప్రస్తావిస్తామన్నారు. ప్రజాప్రతినిధికి ఇచ్చే గౌరవం అదేనా ? అని ప్రశ్నించారు. పోలీసులకు మంచి బుద్ధి ప్రసాదించండి సారూ ! తిరుపతిలో అంబేడ్కర్ విగ్రహానికి వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ వినతిపత్రం ఎమ్మెల్యే సునీల్‌ను కులం పేరుతో దూషించిన నిందితులను శిక్షించాలని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దామినేటి కేశవులు డిమాండ్ చేశారు. దళితులకు న్యాయం చేసేలా పోలీసులకు మంచి బుద్ధి ప్రసాదించు అంటూ శనివారం వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో తిరుపతిలో ఎస్వీ యూనివర్సిటీ ఎదుట ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. పోలీసులు ఇప్పటికైనా నిందితులపై అట్రాసిటీ కేసు నమోదు చే సి, వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు స్పందించకుంటే దళిత సంఘా ల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించా రు. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లారపు వాసు, అధికార ప్రతినిధి చాట్ల భానుప్రకాష్, హరిబాబు, సిద్దారెడ్డి, సునీల్, రామస్వామి, లోకనాథం పాల్గొన్నారు. -
కాంగ్రెస్ నాయకుని హత్య
తిరువనంతపురం: కేరళలో కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకడు సునీల్ కుమార్ (28) మంగళవారం హత్యకు గురయ్యారు. ఉదయం ఆయన ఇంటిపై దాడిచేసిన వామపక్ష పార్టీ కార్యకర్తలు కత్తులతో నరికి చంపారు. రాజధానికి కూతవేటు దూరంలోని అలెప్పూలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనలో నలుగురు సీపీఎం కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం సునీల్ ఆయన నివాసంలో ఉండగా సీపీఎం మద్దతుదారులు ఆయనపై దాడికి దిగ కత్తులతో పొడిచి చంపారు. సునీల్ కుమార్ ఇటీవల సీపీఎం నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు సమచారం. దానికి ప్రతీకారంగానే ఈ హత్య జరిగినట్టుగా అనుమానిస్తున్నారు. ఈ సంఘటనలో కేసు నమోదు చేసిన పోలీసులు అనుమానితులుగా సీపీఎం మద్దతుదారులను అదుపులోకి తీసుకున్నారు. కేరళలోత్వరలో జరగనున్నఎన్నికల నేపథ్యంలోగత రెండు నెలలకాలంలో రాజకీయ ప్రత్యర్థుల మధ్య దాడులు, హత్యలు చోటు చేసుకున్నాయి. ఇటీవలి బీజేపీ కార్యకర్త ఇటీవల హత్యకు గురిగాకా, ఇరువర్గాలు కార్యకర్తలు దాడికి గురయ్యారు. -
'చంద్రబాబుకు పిచ్చి ఎక్కువైంది'
చిత్తూరు: అధికార తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం దారుణమని చిత్తూరు జిల్లా పూతలపట్టు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పిచ్చి ఎక్కువైందని, ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించాలని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలను చూసే ప్రజలు మమ్మల్ని గెలిపించారని చెప్పారు. ప్రతిపక్షం ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానం ఓటింగ్‌లో పాల్గొనకుండా ఉంటే ముందస్తుగా రూ.10 కోట్లు ఇవ్వడంతో పాటు తర్వాత రూ.5 కోట్ల రూపాయల మేర పనులు అప్పగిస్తామని తనకు టీడీపీ వర్గాల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని సునీల్ కుమార్ వెల్లడించారు. -
‘అవిశ్వాస తీర్మానంలో పాల్గొనకుంటే రూ.15 కోట్ల ఆఫర్’
టీడీపీ వర్గాలు మరింత బరితెగించాయి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు నోట్ల కట్టలతో రంగంలోకి దిగాయి. ప్రభుత్వంపై ప్రతిపక్షం ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానం ఓటింగ్‌లో పాల్గొనకుండా ఉంటే ముందస్తుగా రూ.10 కోట్లు ముట్టజెబుతామంటూ తనకు టీడీపీ వర్గాల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని చిత్తూరు జిల్లా పూతలపట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ వెల్లడించారు. ఆదివారం ఆయన జిల్లాలోని ఐరాలలో మీడియా ముందు ఈ వివరాలు వెల్లడించారు. టీడీపీ సర్కారుపై వైఎస్సార్సీపీ ప్రవేశపెట్టబోయే అవిశ్వాస తీర్మానంలో పాల్గొనకుండా ఉంటే ముందు రూ.10కోట్లు ఇవ్వడంతోపాటు, తర్వాత రూ.5 కోట్ల రూపాయల మేర పనులు అప్పగిస్తామని చెప్పి కొన్ని రోజులుగా టీడీపీ వర్గాలు తనను ప్రలోభ పెడుతున్నాయని, కాల్స్ వస్తున్నాయని అన్నారు. దీనికి సంబంధించి ఓ ఎస్ఎంఎస్ కూడా తన నంబర్‌కు వచ్చినట్టు తెలిపారు. ఈ విషయాన్ని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లానని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఈ విధమైన చర్యలు సరికావని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
'అధికార పార్టీ నేతలది అరాచక పాలన'
నెల్లూరు: అధికార తెలుగుదేశం పార్టీ నేతలు అరాచక పాలనను కొనసాగిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పాశం సునిల్ కుమార్ ఆరోపించారు. గూడూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలే అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారన్నారు. మద్యం మాఫియాను కొనసాగించేది కూడా టీడీపీ నేతలే అని సునిల్ కుమార్ తెలిపారు. అధికార పార్టీ నేతల అరాచక పాలనను ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో వారికి బుద్ధి చెబుతారని సునిల్ కుమార్ స్పష్టం చేశారు. -
చిట్ ఫండ్ పేరు తో కుచ్చుటోపీ
నమ్మకంగా ఉంటూ చిట్టీలు నడుపుతున్న నిర్వాహకులు.. వినియోగదారులకు సంబంధించిన రూ.కోటి వసూలు చేసుకుని కనిపించకుండా పోయిన ఘటన నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మారుతి చిట్‌ఫండ్ సంస్థ కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో చిట్టీలు నిర్వహిస్తోంది. అయితే, ఇటీవల చిట్టీలు పాడుకున్న వారికి నిర్వాహకులు డబ్బులు ఇవ్వలేదు. గత రెండు రోజులుగా నిర్వాహకులు సంస్థ కార్యాలయానికి తాళం వేసి ఉడాయించారు. అనుమానం వచ్చిన బాధితులు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో సుమారు 50 మంది బాధితులు నేరేడ్మెట్ పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. చిట్ ఫండ్స్ డైరెక్టర్లు సునీల్ కుమార్, పుష్పరాజ్, ప్రదీప్ కుమార్ లపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఖాతాదారుల వద్ద సుమారు రూ.కోటి వసూలు చేసి ఉంటారని భావిస్తున్నారు. -
తిరుమలలో దర్శనాల టికెట్ల దళారీ అరెస్ట్
తిరుపతి: తిరుమలలో దర్శనాల టికెట్ల దళారీని తిరుపతి ఈస్ట్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. పోలీసులకు పట్టుబడిన నిందితుడు మదనపల్లెకు చెందిన సునీల్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. గత నెల 29న టీటీడీ విజిలెన్స్ అధికారుల ఆదేశాల మేరకు మోహన్‌బాబు అనే దళారీని ఈస్ట్ పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు. ఈ విచారణలో సునీల్ కుమార్ వ్యవహారం బట్టబయలు అయినట్టు పోలీసులు వెల్లడించారు. -
ప్రమాదవశాత్తూ కార్మికుడి మృతి
హైదరాబాద్ సిటీ: జీడిమెట్లలోని శ్రీపతి ఫార్మా కంపెనీలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రమాదవశాత్తూ సునీల్ కుమార్ (24) అనే కార్మికుడు ఒకటో అంతస్తు మీది నుంచి కింద పడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. కుటుంబసభ్యులు, తోటి కార్మికుల ఆందోళనతో బాధిత కుటుంబానికి యాజమాన్యం రూ.7 లక్షల నష్ట పరిహారం చెల్లించింది. బిహార్‌కు చెందిన సునీల్ ప్రస్తుతం రామిరెడ్డినగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఉద్యోగం చేసుకో అన్నందుకు...
నాంపల్లి (హైదరాబాద్): ఏదైనా ఉద్యోగం చేసుకోవాలని తల్లిదండ్రులుగా మందలించారు. దానికే మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మంగళవారం తెల్లవారుజామున హబీబ్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అఫ్జల్‌సాగర్‌కు చెందిన కె. ఈశ్వర్ కుమారుడు సునీల్ కుమార్ (25) ఇటీవలే హోటల్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేసి ఇంట్లోనే ఖాళీగానే ఉంటున్నారు. తల్లిదండ్రులు గత కొన్ని రోజులుగా ఏదైనా ఉద్యోగం చేసుకో నాయనా అంటూ బుద్ధులు చెప్పారు. ఈ బుద్ధులు అతడికి నచ్చక ఉద్యోగం చేసుకోలేక జీవితంపై విరక్తి చెంది మంగళవారం తెల్లవారు జామున తన గదిలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
'టీడీపీకి త్వరలో ప్రజలే బుద్ధి చెబుతారు'
నెల్లూరు: వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని అరెస్ట్ చేయడాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రతాప్ కుమార్ రెడ్డి, పాశం సునీల్ కుమార్ ఖండించారు. టీడీపీ నేతలు అధికారమదంతో విర్రవీగుతున్నారని విమర్శించారు. టీడీపీకి త్వరలో ప్రజలే బుద్ధి చెబుతారని ప్రతాప్ కుమార్ రెడ్డి, సునీల్ కుమార్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నంద్యాలలో పోలీసులు భూమా నాగిరెడ్డిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
ఏసీబీ వలలో అవినీతి చేప
-
నేతకు గురిపెడితే..బాడీగార్డ్ బలయ్యాడు..
పట్నా: బీహార్ గయాలో పార్సిల్ బాంబు ద్వారా జేడీయు నేత హత్యకు కుట్ర పన్నిన ఉదంతం మంగళవారం స్థానికంగా కలకలం రేపింది. స్థానిక జేడీయే నేత ఇంట్లో పార్శిల్ బాంబు పేలిన ఘటనలో బాడీగార్డ్ చనిపోగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. జేడీయూ అధ్యక్షుడు జిల్లా నేత అభయ్ కుశ్వాహ్కు గుర్తు తెలియని వ్యక్తులు పార్సిల్‌ను పంపారు. అయితే పార్సిల్‌ను తెరిచి చూస్తున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో బాడీగార్డ్ అక్కడిక్కడే దుర్మరణం చెందాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జేడీయూ నేత బంధువును ఆసుపత్రికి తరలించారు. దీనిపై విచారణ చేపట్టామని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సునీల్ కుమార్ తెలిపారు. ఈ పేలుడుతో మావోయిస్టులకు సంబంధం ఉందా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నామన్నారు. -
'అంగన్ వాడీ వర్కర్లను విధుల్లోకి తీసుకోవాలి'
నెల్లూరు: తొలగించిన హౌసింగ్ బోర్డు కాంట్రాక్టు ఉద్యోగులు, అంగన్ వాడీ వర్కర్లను విధుల్లోకి తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్నాం కదా అని టీడీపీ ప్రభుత్వం నానా విధాలుగా ప్రజలను ఇబ్బందులు పెడితే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. విద్యానగర్‌లో జరిగిన సీఎం సభలో స్థానిక ఎమ్మెల్యేను అధ్యక్షత వహించనీయకుండా ఏ పదవీ లేని సోమిరెడ్డి కార్యక్రమం నిర్వహించడం ఎమ్మెల్యే హక్కులను కాలరాయడమేనని మరో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మండిపడ్డారు. ప్రొటోకాల్ ఉల్లంఘనపై స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు. -
టీడీపీ కోడ్ ఉల్లంఘనపై ఈసీకి ఫిర్యాదు
చిత్తూరు: ఐరాలలో తెలుగు తమ్ముళ్లు అత్యుత్సాహం ప్రదర్శించారు. తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజక వర్గంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ రైతులకు రుణాల మంజూరుకు తామే సిఫారసు చేస్తామని సాక్షాత్తు జిల్లాకు చెందిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలే వాగ్దానాలు గుప్పిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన టీడీపీ నాయకులపై వైఎస్సార్సీపీ పూతల పట్టు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. -
కేరళ సర్కారుకు ఎదురుదెబ్బ
పామాయిల్ కేసు ఉపసంహరణకు హైకోర్టు తిరస్కరణ కొచ్చి: పామాయిల్ దిగుమతుల స్కాం కేసులో కేరళలోని కాంగ్రెస్-యూడీఎఫ్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారులు నిందితులుగా ఉన్న ఈ కేసులో ప్రాసిక్యూషన్‌ను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని రాష్ట్ర హైకోర్టు తిరస్కరించింది. కేసును కొట్టేస్తే నిందితులకు వ్యక్తిగతంగానో మరోరకంగానో మేలు కలుగుతుందని పేర్కొంది. అంతేకాకుండా న్యాయప్రక్రియను తొక్కిపెట్టినట్లవుతుందని వ్యాఖ్యానించింది. ప్రాసిక్యూషన్‌లో న్యాయ ప్రక్రియ దుర్వినియోగం కాలేదని పేర్కొంది. తనపై విచారణ రద్దు చేయాలని ఐఏఎస్ అధికారి గిజీ థామ్సన్, తమను కేసులో ఇంప్లీడ్ చేసుకోవాలని అసెంబ్లీ విపక్ష నేత అచ్యుతానందన్, సీపీఐ ఎమ్మెల్యే సునీల్ కుమార్‌లు వేసిన పిటిషన్లనూ కోర్టు తోసిపుచ్చింది. పామాయిల్ దిగుమతుల్లో అక్రమాలు జరగలేదు కనుక కేసును కొట్టేయాలని తాను వేసిన పిటిషన్‌ను త్రిస్సూర్ విజినెల్స్ కోర్టు తోసిపుచ్చడంతో ప్రభుత్వం హైకోర్టులో అప్పీలు వేసింది. దీన్ని మూడు నెలల్లోగా పరిష్కరించాలని సుప్రీం కోర్టు గత సెప్టెంబర్‌లో హైకోర్టును ఆదేశించింది. 1991-92లో అప్పటి కరుణాకరన్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మలేసియా నుంచి ఎక్కువ ధరకు పామాయిల్ దిగుమతి చేసుకోవడంతో ఖజానాకు రూ. 2.3 కోట్ల నష్టం వచ్చినట్లు ఆరోపణలన్నాయి. ప్రస్తుత సీఎంచాందీ ఆనాడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. నియామకాన్ని ఈ కేసు పెండింగ్‌లో ఉండడంతో సుప్రీం కోర్టు రద్దు చేసింది. -
క్రిమినల్ సునీల్ అరెస్ట్
మచిలీపట్నం : ప్రముఖుల కిడ్నాప్, హత్యలు చేయడానికి మచిలీపట్నం వచ్చిన వైఎస్సార్ జిల్లాకు చెందిన పేరుమోసిన నేరస్తుడు మండ్ల సునీల్ కుమార్‌ను స్థానిక పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఎస్పీ జి.విజయకుమార్ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు మండలం కొత్తపేటకు చెందిన మండ్ల వెంకట సునీల్ కుమార్ అనంతపురంలో బీకాం చదువుతూ మధ్యలోనే ఆపేశాడు. కొంతకాలం ఆటో నడిపాడు. ఆ సమయంలోనే ఇంజనీరింగ్ విద్యార్థులతో స్నేహం పెంచుకుని విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు. వైఎస్ఆర్, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ధనవంతులను కిడ్నాప్ చేసి, వారి కుటుంబీకుల నుంచి పెద్ద మొత్తంలో నగదు వసూలు చేస్తుంటాడు. సునీల్‌కుమార్‌పై 10 కిడ్నాప్‌లు, రెండు హత్యలు, రెండు చీటింగ్ కేసులు, ఒక ఎర్రచందనం స్మగ్లింగ్ కేసు నమోదయ్యాయి. ప్రొద్దుటూరు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సునీల్‌కుమార్‌పై రౌడీషీట్ తెరిచారు. అనంతపురం జిల్లాలో జరిగిన ఓ కిడ్నాప్ కేసులో సునీల్‌కుమార్‌తో పాటు అతని స్నేహితులను ఆగస్టు 11న పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 11న వాయిదా నిమిత్తం పోలీసులు కడప జైలు నుంచి వేముల వీరాస్వామితో పాటు సునీల్‌కుమార్‌ను అనంతపురం కోర్టుకు తీసుకువచ్చారు. వాయిదా అనంతరం కడప జైలుకు తరలిస్తుండగా ఎస్కార్ట్ సిబ్బంది నుంచి తప్పించుకుని పారిపోయాడు. కడప జైలులో పథక రచన వివిధ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న మచిలీపట్నంకు చెందిన వేముల వీరాస్వామి, మండ్ల సునీల్‌లకు కడప జైలులో పరిచయం ఏర్పడింది. తన తండ్రిని గంజాల నాగరాజు, శ్రీనివాస్, మరికొందరు మచిలీపట్నంలో దారుణంగా హత్య చేశారని, వారిని చంపాలని వీరాస్వామి అతడికి తరచూ చెబుతూ ఉండేవాడు. వీరాస్వామి తండ్రిని చంపిన వారిని హతమార్చేందుకు సునీల్‌కుమార్ అంగీకరించాడు. మచిలీపట్నంకు చెందిన తన స్నేహితుడు శలపాటి రాజేష్‌ను కలిస్తే ఆర్థిక సాయంతో పాటు సహాయకారిగా ఉంటాడని వీరాస్వామి అతడికి చెప్పాడు. ఈ నేపథ్యంలో సునీల్‌కుమార్ ఈ నెల 11న పోలీసుల నుంచి తప్పించుకుని అనంతపురం నుంచి తిరుపతి వెళ్లాడు. మచిలీపట్నంలో ఉన్న శలపాటి రాజేష్‌కు ఫోన్ చేసి తనకు కొంత నగదు కావాలని ఓ బ్యాంకు ఖాతా నంబరు ఇచ్చాడు. రాజేష్ ఆ నంబరులో నగదు వేశాడు. సునీల్‌కుమార్ తిరుపతి నుంచి ఈ నెల 13వ తేదీ రాత్రి బస్సులో మచిలీపట్నం వచ్చాడు. రాజేష్ అతడిని కలుసుకుని ముస్తాఖాన్‌పేటలోని తన ఇంటికి తీసుకువెళ్లాడు. కిడ్నాప్, హత్యలు చేసేందుకు రెక్కీ వీరిద్దరూ కలిసి పట్టణంలోని బంగారు వ్యాపారుల ఇళ్లు, షాపుల వద్ద, ప్రముఖ వైద్యుల ఇళ్లవద్ద రెక్కీ నిర్వహించారు. వీరాస్వామి తండ్రి హత్య కేసులో నిందితులైన గంజాల నాగరాజు, శ్రీనివాస్ తదితర ఇళ్ల వద్ద కూడా రెక్కీ నిర్వహించారు. వీరాస్వామి తండ్రిని చంపిన వారిని హతమార్చేందుకు కొంతమంది వ్యక్తుల సాయంతో పాటు కత్తులు, ఇనుపరాడ్లు కావాలని రాజేష్‌కు సునీల్‌కుమార్‌ను పురమాయించాడు. సునీల్ మచిలీపట్నంలో ఉన్నాడని అనంతపురం, కడప పోలీసులకు సమాచారం అందింది. వారు క ృష్ణాజిల్లా పోలీసులతో కలిసి అతడి కదలికలపై నిఘా ఉంచారు. అతడు రాజేష్‌తో కలిసి తిరుగుతున్నాడని పోలీసులకు పక్కా సమాచారం అందింది. సోమవారం రాత్రి ముస్తాఖాన్‌పేటలోని రాజేష్ ఇంట్లో ఉన్న సునీల్‌కుమార్‌ను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రాజేష్ పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. రాజేష్ విజయవాడలోని ఓ ఆసుపత్రిలో పనిచేస్తున్నాడని, ఒక హత్యాయత్నం కేసుతో పాటు మూడు కేసుల్లో అతడు నిందితుడని ఎస్పీ తెలిపారు. రాజేష్‌ను త్వరలో అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. వీరాస్వామి తండ్రిని హతమార్చిన వారిని హత్య చేయటంతో పాటు మచిలీపట్నంలోని ప్రముఖులను కిడ్నాప్ చేసి పెద్ద మొత్తంలో నగదు వసూలు చేయాలనే ఉద్దేశంతోనే సునీల్‌కుమార్ మచిలీపట్నం వచ్చినట్లు తమ విచారణలో వెల్లడైందని ఎస్పీ చెప్పారు. సునీల్‌ను అదుపులోకి తీసుకోవడానికి మచిలీపట్నం రూరల్ సీఐ ఎస్వీవీఎస్ మూర్తి, అనంతపురం, కడప పోలీసులు తమకు సహకారం అందించారని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఏఎస్పీ బీడీవీ సాగర్, బందరు డీఎస్పీ కెవి శ్రీనివాసరావు, ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్ పాల్గొన్నారు. అనంతరం సునీల్‌కుమార్‌ను పోలీసులు జిల్లా కోర్టులో హాజరు పరిచారు. ఈ నెల 29 వరకు అతడికి జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. సునీల్‌ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. -
విఐపి రిపోర్టర్ - సునీల్
-
తప్పుడు కేసులకు బెదరం
సాక్షి, చిత్తూరు: ‘అధికారపార్టీ ఆగడాలకు అంతులేకుండా పోతోంది. ఎన్ని అక్రమ కేసులు బనాయించినా ...వెరవం, బెదరం. అధికారం లేకపోయినా తట్టుకోగలం. ఆ పార్టీ ఆగడాలపై ఉద్యమిస్తాం. కార్యకర్తలను కాపాడుకుంటాం’ అని వైఎస్సార్సీపీ నేతలు పేర్కొన్నారు. పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కుమార్ తనపై టీడీపీ నాయకులు అక్రమకేసులు బనారుుంచారని నిరసిస్తూ గురువారం కలెక్టరేట్ వద్ద నిరాహారదీక్ష చేపట్టారు. ఈ ఆందోళనకు మద్దతుగా రాజం పేట ఎంపీ మిథున్‌రెడ్డి, పార్టీ మహిళా విభాగం రాష్ర్ట అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా, పార్టీ జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే నారాయణ స్వామి దీక్షలో పాల్గొన్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మద్దతిచ్చా రు. వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులపై అధికార పార్టీవారు తప్పుడు కేసులు బనారుుస్తున్నారని వారు నిరసించారు. మొ న్న ఎమ్మెల్యే రోజాపై ఎస్సీ, ఎస్టీ కేసు, నిన్న భూమా నాగిరెడ్డిపై రౌడీషీట్, నేడు పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌పై కేసులుపెట్టారని ఆరోపించారు. ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ ఆగడాలు మితిమీరాయన్నారు. కార్యకర్తలను భయభాంత్రులకు గురి చేసేందుకే పార్టీ ముఖ్యనేతలపై కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. చిత్తూరు జిల్లాలో వైఎస్సార్సీపీ బలంగా ఉందన్నారు. ఏ ఒక్క కార్యకర్తకు అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకునేది లేదన్నారు. వారికి అండగా నిలబడతామన్నారు. అవసరమైతే పోరాటాలు చేస్తామన్నారు. అధికారం లేకపోయినా తట్టుకోగల శక్తి పార్టీకి ఉందన్నారు. టీడీపీ ఇలాగే ప్రవర్తిస్తే పుట్టగతులుండవన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే.రోజా మాట్లాడుతూ ప్రజాప్రతినిధులపై తప్పుడు కేసులు పెడుతున్నందుకు అధికారపార్టీ సిగ్గుపడాలన్నారు. 10 సంవత్సరాలు ప్రతిపక్ష స్థానంలో ఉండి అధికారం చేపట్టిన టీడీపీ ప్రజాసమస్యలను విస్మరించిందని ఆమె విమర్శించారు. దీనిని ప్రశ్నిం చినందుకే వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులపై తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. నగరిలో భగవంతుణ్ని దర్శించుకునేందుకు తాను వస్తే హారతి పళ్లెం కింద వేసి ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారని విమర్శించారు. నిన్న భూమా, నేడు ఎమ్మెల్యే సునీల్‌పై తప్పుడు కేసులు పెట్టడం దారుణమన్నారు. నేతలను టార్గెట్ చేసి కేసులు పెట్టినా భయపడేదిలేదన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి మాట్లాడుతూ ఒక ఏఈ ఫిర్యాదు చేస్తే ఏకంగా ఎమ్మెల్యేపైనే కేసు పెట్టడం రాష్ట్ర చరిత్రలో తాను చూడలేదన్నారు. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదన్నారు. టీడీపీకి పోగాలం దాపురించిందన్నారు. రాబో యే కాలంలో ఆ పార్టీ కనుమరుగవుతుందన్నా రు. టీడీపీ నేతలు ప్రజాసమస్యలు పక్కన పెట్టి, ఎన్నికల హామీలను తుంగలో తొక్కి సొంత పనులు చక్కపెట్టుకుంటున్నారని ధ్వజ మెత్తారు. తప్పుడు కేసులతో వైఎస్సార్సీపీ నేతలను బెదిరించాలని చూడడం దారుణమన్నారు. పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ మాట్లాడుతూ ఎమ్మెల్యేగా తాను మోర్దానపల్లె సబ్‌స్టేషన్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగులున్నాయని తెలిసి స్థానిక డీఈని అడిగానన్నారు. పరిశీలిస్తామన్న డీఈ తనకు తెలియకుండానే నలుగురిని నియమించుకున్నారన్నారు. ఆ తరువాత తాను ముగ్గురిని అక్కడికి పంపగా, వారిని సైతం పనిలో పెట్టుకున్నారని ఎమ్మెల్యే చెప్పారు. తరువాత జీతాలు రాకపోతే ఆ ముగ్గురి విషయం అడిగేందుకు సబ్‌స్టేషన్‌కు వెళితే అక్కడ ఎవరూ లేదన్నారు. అక్కడి నుంచి తిరిగి వెళ్లిన తరువాత కాంట్రాక్ట్ ఉద్యోగిపై దౌర్జన్యం చేశాననంటూ ఏఈ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎమ్మెల్యే అని చూడాకుండా తనపై తప్పుడు కేసులు పెట్టారన్నారు. డాక్టర్ వృత్తిలో ఉన్న తాను ప్రజలకు మంచి చేసేందుకు అధికారులతో మాట్లాడడం కూడా తప్పేనా అంటూ వాపోయారు. అధికార పార్టీ ఒత్తిళ్లతోనే కేసులుపెట్టారన్నారు. తక్షణం కేసును ఉపసంహరించుకోవాలని, ఏఈని సస్పెండ్ చేయాలని సునీల్ డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గాయత్రీదేవి మాట్లాడుతూ చంద్రబాబు అధికారం చేపట్టిన నాటి నుంచి వైఎస్సార్సీపీ నేతలనే టార్గెట్ చేసి కేసులు పెడుతున్నారని విమర్శించారు. వారు తప్పుడు కేసులతో ఎన్ని ఇబ్బందులు పెట్టినా భయపడేది లేదన్నారు. పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటుందన్నారు. అధికారులు మంచిని కాపాడాలన్నారు. అధికార పార్టీకి వత్తాసు పలకడం మానుకోవాలన్నారు. వారిలో మార్పురాకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ దీక్ష జరిగింది. ఈ దీక్షకు జిల్లా నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు తరలివచ్చి మద్దతు ప్రకటించాయి. అనంతరం ఎస్పీకి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ కుమార్‌రాజా, పార్టీ అధికార ప్రతినిధి తలపులపల్లె బాబురెడ్డి, యాదమరి జెడ్పీటీసీ సభ్యురాలు ఉష, పార్టీ నాయకుడు ధనుంజయరెడ్డి, రాజరత్నంరెడ్డి,శిరీష్, ప్రవీణ్, విద్యాసాగర్‌రెడ్డి, పూతలపట్టు సుబ్బారెడ్డి,రామచంద్రారెడ్డి, హరి పాల్గొన్నారు. -
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సునీల్ అరెస్ట్
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సునీల్ అరెస్ట్ అయ్యాడు. సునీల్‌తో పాటు అతడి గ్యాంగ్‌ను అనంతపురం పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి స్కార్పియో, ఇండికా, 5 కొడవళ్లతో పాటు రూ.30 వేలు స్వాధీనం చేసుకున్నారు. సునీల్‌పై పీడీ యాక్ట్ నమోదు చేయాలని కలెక్టర్‌ను కోరనున్నట్లు ‘అనంత’ ఎస్పీ రాజశేఖర్ బాబు తెలిపారు. అనంతపురం క్రైం : మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మండ్ల సునీల్‌కుమార్ అలియాస్ సునీల్ ఎట్టకేలకు పోలీసులకు దొరికాడు. డబ్బు కోసం కిడ్నాప్, హత్యలు, బలవంతపు వసూళ్లకు దిగుతున్న ఇతడితో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం ఎస్పీ రాజశేఖర్‌బాబు వెల్లడించారు. ఇటీవల అనంతపురం జిల్లా నార్పలలో ఎరువుల వ్యాపారి ప్రసాద్‌శెట్టి అలియాస్ శ్రీనివాస్ శెట్టి కిడ్నాప్‌తో పాటు పలు కిడ్నాప్, హత్యలు, హత్యాయత్నాలు, బలవంతపు వసూ ళ్లు, ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి సునీ ల్‌పై అనంతపురం, వైఎస్ఆర్, కర్నూలు జిల్లా ల్లో 14 కేసులు ఉన్నాయి. ఇంజనీరింగ్ విద్యార్థులను చేరదీసి వారిని జల్సాలకు అల వాటు చేయడం.. వారిని నేరాలకు పాల్పడేలా చేయడంలో సునీల్ సిద్దహస్తుడు. ఇలా ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్ నాశనం చేశారు. ఈ క్రమంలో అదనపు ఎస్పీ టి.రామప్రసాదరావు పర్యవేక్షణలో ఇటుకలపల్లి సీఐ శ్రీనివాసులు, నార్పల ఎస్ఐ శేఖర్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు అతడిపై నిఘా ఉంచి ముఠాను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో సునీల్, కడప నగరానికి చెందిన లాయం హరి నాథ్, షేక్ హుసేన్‌బాషా, పక్కీర్లగార్ల సునీల్‌కుమార్, మైదుకూరుకు చెందిన జెన్నే మురళీకృష్ణ ఉన్నా రు. ఈ ముఠా నుంచి స్కార్పియో, టాటా ఇండికా కారు, ఐదు వేటకొడవళ్లు, రూ.30 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎర్ర చందనం అక్రమ రవాణాతో సునీల్ నేర ప్రస్థానం మొదలు ప్రొద్దుటూరుకు చెందిన సునీల్ కొన్నేళ్లుగా పులి వెందులలో ఉంటున్నాడు. ఇతడి తండ్రి వెంకట రమణ 2011కు ముందు అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. డిగ్రీ వరకు చదువుకున్న సునీల్.. తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. అయితే అనతి కాలంలోనే డబ్బు సంపాదించాలన్న ఆశతో నేర ప్రవృత్తి వైపు మళ్లాడు. ఈ క్రమంలో 2011లో కర్నూలు జిల్లా కోవెలకుంట్లలో ఎర్రచందనం అక్రమ రవాణాతో నేర జీవితాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత కిడ్నాప్‌లు,హత్యలు, హత్యాయత్నాలు, బలవంతపు వసూళ్లకు దిగాడు. 2013లో తాడిపత్రి పట్టణానికి చెందిన మెడికల్ షాపు యజ మానిని తన ముఠాతో కలిసి కిడ్నాప్ చేశాడు. డబ్బు ఇవ్వలేదనే కారణంతో అతడిని కర్నూలు జిల్లా జలదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతానికి తీసుకెళ్లి దారుణంగా హతమార్చా రు. ప్రొ ద్దుటూరులో ఒక హత్యాయత్నం, ఐదు కిడ్నాప్ కేసులు, రాజంపేటలో ఒక కిడ్నాప్ కేసు, సింహాద్రిపురంలో ఆయుధాలు కల్గి ఉన్న కేసు, మైదుకూరులో బెదిరింపులు, బలవంతపు వ సూళ్ల కేసు, అనంతపురం జిల్లా కదిరి, నార్పల పోలీస్స్టేషన్లలో రెండు కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి. పోలీసులకు చిక్కకుండా కోర్టులో లొంగిపోయేందుకు ప్రయత్నిస్తున్న సునీల్ గ్యాంగ్‌ను సోమవారం నార్పల మండలం బం డ్లపల్లి వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా సునీ ల్ బయట ఉంటే సమాజానికి ప్రమాదకరంగా మారతాడని భావించి అతడిపై పీడీ యాక్టు నమోదుకు పోలీసులు కలెక్టర్‌కు నివేదించారు. -
హోంకే మాఫియా బెదిరింపులు!
- శాసనసభలో ఏకరువు పెట్టిన కె.జె.జార్జ్ - ముఠాలకు వ్యతిరేకంగా చర్యలు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ప్రపంచ వ్యాప్తంగా అథో జగత్తును ఏలుతున్న మాఫియా ముఠాల నుంచి రాష్ర్ట హోం మంత్రి కేజే. జార్జ్కూ బెదిరింపులు తప్పలేదు. వేరే దేశాల్లో ఉన్న మాఫియా ముఠాలు కోస్తాలోని పారిశ్రామికవేత్తలు, ధనవంతులకు ఫోన్లు చేసి, బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. దీనిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న తనకూ బెదిరింపులు వస్తున్నాయని జార్జ్ మంగళవారం శాసన సభకు తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ సభ్యుడు సునీల్ కుమార్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, దక్షిణ కన్నడ, ఉడిపి జిల్లాల్లోని ఐశ్వర్యవంతులు, వ్యాపారులకు అజ్ఞాత మాఫియా ముఠాలు ఫోన్లు చేసి, డబ్బులు వసూలు చేస్తున్నాయని వెల్లడించారు. ఒక వేళ డబ్బులు ఇవ్వడానికి నిరాకరిస్తే హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. దీని వల్ల సామాన్యులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. కాగా విదేశాల్లో ఉన్న ఈ మాఫియా ముఠాలు డబ్బులు ఇవ్వకపోతే ఇంటి యజమాని భార్య, పిల్లలకు కూడా ఫోన్ చేసి బెదిరిస్తున్నారని సునీల్ కుమార్‌తో పాటు మరో బీజేపీ సభ్యుడు విశ్వేశ్వర హెగ్డే కాగేరి వివరించారు. ఈ పరిణామాలతో అధికారులే ప్రాణ భయంతో కాలం వెళ్లదీస్తున్నారని చెప్పారు. ఈ దశలో ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్ మాట్లాడుతూ, ఈ బెదిరింపులు కేవలం కోస్తా జిల్లాలకే పరిమితం కాలేదని, రాష్ట్రమంతా జరుగుతోందని తెలిపారు. పోలీసుల్లో నైతిక స్థైర్యాన్ని పెంచడం ద్వారా మాఫియాకు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అయితే పోలీసు అధికారులెవరూ బెదరడం లేదని, జాతీయ, అంతర్జాతీయ నిఘా సంస్థలను సంప్రదిస్తూ మాఫియా ముఠాలను తుదముట్టించడానికి ప్రయత్నిస్తున్నారని జార్జ్ వెల్లడించారు. మాఫియా డాన్ల పేర్లను తాను సభలో వెల్లడించలేనని, ఒక వేళ చెబితే పత్రికల్లో వారు పేర్లు ప్రచురితమవుతుందని తెలిపారు. అలాంటి సందర్భాల్లో వారు మరింతగా రెచ్చిపోయే అవకాశం ఉందని చెప్పారు. తాను కూడా బెదిరింపులకు భయపడడం లేదని, పుట్టుక, చావు హఠాత్పరిణామాలంటూ...మాఫియా ముఠాలకు వ్యతిరేకంగా కఠిన చర్యలను చేపడతామని ఆయన ప్రకటించారు. -
ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం
ఎర్రదొంగలపై సస్పెక్టెడ్ షీట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు సమావేశంలోగుంటూరు రేంజ్ ఐజీ నెల్లూరు(క్రైమ్): ఎర్రచందనం అక్రమ రవాణాను ఉక్కుపాదంతో అణచివేయాలని గుంటూరు రేంజ్ ఐజీ పీవీ సునీల్‌కుమార్ పోలీసు, అటవీ అధికారులకు సూచించారు. ఎర్రచందనం అక్రమ రవాణాను నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన గురువారం స్థానిక ఉమేష్‌చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్ హాల్లో పోలీసు, అటవీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఐజీ మాట్లాడుతూ ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడే, సహకరించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దన్నారు. జిల్లా సరిహద్దు ప్రాంతాలైన సోమశిల, రాపూరు, ఉదయగిరి, మర్రిపాడు తదితర ప్రాంతాల సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా నియంత్రణకు తీసుకొంటున్న చర్యలపై ఇకమీదట ప్రతి సోమవారం సమీక్ష సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా ఎక్కువగా జరిగే ప్రాంతాల్లోని ఎస్ఐలు తీసుకొంటున్న చర్యలు? ఎంత మందిని అరెస్ట్‌చేశారు? ఎన్ని కేసులు నమోదయ్యాయి తదితర వివరాలను విధిగా తెలియచేయాలన్నారు. దాని ఆధారంగానే వారి పనితీరును అంచనా వేస్తామన్నారు.గతంలో ఎర్రచందనం కేసుల్లో అరెస్ట్ అయిన వారిపై వెంటనే సస్పెక్టెడ్ షీట్లు తెరవాలన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు సహకరించినా? నియంత్రణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత అధికారులపై వేటు తప్పదని, అవసరమైతే క్రిమినల్ కేసులు సైతం నమోదు చేస్తామని హెచ్చరించారు. గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన సోమశిల కేంద్రంగా ఎర్రచందనం స్మగ్లింగ్ కథనాన్ని ఆయన పరిశీలించారు. ఎస్పీ నవదీప్ సింగ్ ఎర్రచందనం అక్రమ రవాణా నియంత్రణకు తీసుకొంటున్న చర్యలను ఐజీకి వివరించారు. అటవీశాఖ అధికారులు నేరస్తులను పట్టుకునేందుకు గ్రామాల్లోకి వెళ్లిన సమయంలో రాజకీయనాయకులు, స్థానిక ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోందన్నారు. దీంతో నిందితులు తప్పించుకుంటున్నారని ఐజీ దృష్టికి తీసుకొచ్చారు. దానిపై స్పందించిన ఐజీ స్థానిక పోలీసుల సహకారంతో వారిని అరెస్ట్ చేయాలని, అటవీ అధికారులకు సిబ్బంది సహకరించాలని సూచించారు. ఈ సమావేశంలో అటవీశాఖ అధికారి రాంబాబు, ఏఎస్పీ రెడ్డి గంగాధర్‌రావు, డీఎస్పీలు పి. వెంకటనాథ్‌రెడ్డి, రాంబాబు, మాల్యాద్రి, బాలవెంకటేశ్వరరావు, చౌడేశ్వరి, ఓఎస్డీ శిల్పవల్లి, గూడూరు, కావలి, ఆత్మకూరు సబ్‌డివిజన్ పోలీసు అధికారులు, అటవీ అధికారులు, స్పెషల్‌బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు జి. శ్రీనివాసరావు, వై. జయరామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
కంభం రూరల్ : రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో లారీ ఢీకొనడంతో ఢీకొన్న లారీలోని డ్రైవర్, ఆగి ఉన్న లారీలోని ఉపాధ్యాయుడు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన కంభం సమీపంలోని సీఎల్ఆర్ కాలేజీ వద్ద గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఆ వివరాల ప్రకారం... చిత్తూరు జిల్లా గుర్రంకొండ నుంచి టమోటా లోడుతో అనకాపల్లి వెళ్తున్న లారీ టైరుకు స్థానిక సీఎల్ఆర్ కాలేజీ వద్ద పంక్చరైంది. దీంతో ఆ లారీని రోడ్డు పక్కన ఆపిన డ్రైవర్ ఆదిబాబు టైరు మారుస్తున్నాడు. అదే లారీలో గుంటూరు జిల్లా వినుకొండ వెళ్తున్న వైఎస్ఆర్ జిల్లా రాజంపేటకు చెందిన ఉపాధ్యాయుడు గొంటు తిరుపాలు (45) కిందకిదిగి టైరు మారుస్తున్న డ్రైవర్‌తో మాట్లాడుతూ లారీకి వెనుకవైపు నిలబడి ఉన్నాడు. ఆ సమయంలో వైఎస్ఆర్ జిల్లా కమలాపురానికి చెందిన సిమెంటు లోడు లారీ మార్కాపురంవైపు వేగంగా వెళ్తూ సీఎల్ఆర్ కాలేజీ వద్ద ఆగిఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సిమెంటు లోడు లారీ నడుపుతున్న వైఎస్ఆర్ జిల్లా కమలాపురానికి చెందిన డ్రైవర్ బీదా సునీల్‌కుమార్ (40)కు తీవ్రగాయాలై లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మరణించాడు. ఆగి ఉన్న లారీ వెనుకవైపు నిలబడి ఉన్న వైఎస్ఆర్ జిల్లా రాజంపేటకు చెందిన ఉపాధ్యాయుడు గొంటు తిరుపాలు కూడా రెండు లారీల మధ్య నలిగిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. ఆగి ఉన్న లారీకి టైరు మారుస్తున్న డ్రైవర్ ఆదిబాబు తలకు తీవ్రగాయాలు కావడంతో అతన్ని కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అదే లారీ క్లీనర్ హరికృష్ణ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. సిమెంటు లోడు లారీ డ్రైవర్ సునీల్‌కుమార్ మితిమీరిన వేగంతో వాహనాన్ని నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు విచారణ చేపట్టారు. త్వరగా వెళ్లాలన్న ఆతృతే ప్రాణం తీసింది... ఈ ప్రమాదంలో మరణించిన వైఎస్ఆర్ జిల్లా రాజంపేటకు చెందిన గొంటు తిరుపాలు గుంటూరు జిల్లా వినుకొండలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. వేసవి సెలవుల్లో సొంతూరులో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపి గురువారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విధులకు హాజరయ్యేందుకు వినుకొండ బయలుదేరాడు. ముందుగా రాజంపేట నుంచి కంభం చేరుకున్నాడు. అక్కడి నుంచి రైలులో వినుకొండ వెళ్లేందుకు స్టేషన్‌కు వెళ్లాడు. అయితే, రైలు ఆలస్యంగా వస్తుందని తెలియడంతో.. ఎలాగైనా ఉదయం పాఠశాల సమయానికి వినుకొండ చేరుకోవాలన్న ఉద్దేశంతో రోడ్డుపైకి వచ్చి లారీ ఎక్కాడు. కంభం దాటిన కాసేపటికే సీఎల్ఆర్ కాలేజీ వద్ద లారీ టైరు పంక్చరై అంతలోనే మరో లారీ వచ్చి ఢీకొనడంతో మరణించాడు. ఆగి ఉన్న లారీ క్యాబి న్లో కూర్చుని ఉన్న తిరుపాలు కిందికి దిగకుండా ఉన్నా బతికేవాడని ఆ లారీ క్లీనర్ ఆవేదన వ్యక్తం చేశాడు. -
ఫ్యాన్ జోరు
ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయకేతనం మరో ఆరు చోట్ల టీడీపీ గెలుపు పట్టు నిలుపుకున్న పెద్దిరెడ్డి ఓటమి పాలైన కిరణ్ సోదరుడు సాక్షి ప్రతినిధి, తిరుపతి : అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించింది. ఎనిమిది స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలుపొందారు. ఆరు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. మొదట్లో ఫలితాలు పోటాపోటీగా వచ్చాయి. ఆ తరువాత ఏడు స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ప్రతి రౌండ్లోనూ ఆధిక్యాన్ని ప్రదర్శించారు. పూతలపట్టు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సునీల్‌కుమార్, టీడీపీ అభ్యర్థి లలితకుమారి మధ్య హోరాహోరీగా పోరు సాగింది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుపొందారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన ప్పటి నుంచి అన్ని పార్టీల వారు ప్రచారహోరు వినిపించారు. వరుసగా మునిసిపాలిటీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు రావడంతో నేతలు బిజీబిజీగా ఎన్నికల రంగంలో ఉన్నారు. ఆ తరువాత అసెంబ్లీ, పార్లమెంటుకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ, టీడీపీ పోటాపోటీగా ప్రచారంలో దూసుకుపోయాయి. ఓటింగ్ పూర్తయిన తరువాత కౌంటింగ్‌కు వారంరోజుల గడువు ఉండటంతో ఉత్కంఠ నెలకొంది. శుక్రవారం ఉదయం కౌంటింగ్ ప్రారంభమై సాయంత్రానికి ముగిసింది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 31,731ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి వెంకటరమణరాజుపై విజయం సాధించారు. గంగాధరనెల్లూరు నుంచి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కే నారాయణస్వామి పోటీ చేశారు. ఈయనకు 20,765 ఓట్ల మెజారిటీ వచ్చింది. తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ డెప్యూటీ స్పీకర్ జీ కుతూహలమ్మ పోటీచేశారు. ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు. ఘోర పరాజయాన్ని చవిచూశారు. మదనపల్లె నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి 17,039 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి చల్లపల్లి నరసింహారెడ్డిపై గెలుపొందారు. చంద్రగిరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి 4,518 ఓట్ల మెజారిటీ సాధించి మాజీ మంత్రి గల్లా అరుణకుమారిని ఓడించారు. అరుణకుమారి కాంగ్రెస్ పార్టీలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రెండు సార్లు వరుసగా మంత్రి పదవిలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరి చంద్రగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేశారు. పీలేరు నియోజకవర్గం నుంచి జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున పోటీ చేసిన ఎన్ కిషన్‌కుమార్‌రెడ్డి (కిశోర్‌కుమార్‌రెడ్డి)ని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి ఓడించారు. రామచంద్రారెడ్డికి 15,137ఓట్ల మెజారిటీ వచ్చింది. కిషన్‌కుమార్‌రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు కావడంతో ప్రతి ఒక్కరూ ఈ ఫలితంపై ఉత్కంఠతో ఎదురు చూశారు. నగరి నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆర్కే రోజా విజయం సాధించారు. ఇక్కడ ముక్కోణ పోటీ జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థికి ఐదువేల ఓట్లు వచ్చాయి. ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఓట్లు కావడం విశేషం. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమనాయుడు రోజా చేతిలో ఓటమిపాలయ్యారు. రాజకీయ ఉద్ధండుడిగా పేరున్న గాలి ముద్దుకృష్ణమనాయుడును వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, సినీనటి రోజా ఓడించడం చర్చనీయూంశమరుుంది. పలమనేరు నుంచి మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎన్ అమరనాథరెడ్డి విజయం సాధించారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా సుభాష్‌చంద్రబోస్ పోటీ చేశారు. అమరనాథరెడ్డి 3,361 ఓట్ల తేడాతో బోస్‌ను ఓడించారు. అమరనాథరెడ్డి కుటుంబం రాజకీయరంగంలో మంచి పేరు తెచ్చుకుంది. అందుకే అక్కడి వారు ఆయనను ఆదరించారు. పూతలపట్టు నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ సునీల్‌కుమార్ టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే లలితకుమారినిపై 982 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో ఇరువురి మధ్య హోరాహోరీగా పోరు సాగింది. ప్రతి మండలంలోనూ పోటాపోటీగా ఓట్లు వచ్చాయి. విజయం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని వరించింది. టీడీపీ అభ్యర్థుల విజయం తెలుగుదేశం పార్టీ నుంచి తిరుపతి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎం వెంకటరమణ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కరుణాకరరెడ్డిపై 41,294ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కుప్పం నుంచి మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చంద్రమౌళిని 47,121 ఓట్లతేడాతో ఓడించారు. తంబళ్లపల్లె నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి జీ శంకర్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని 7,995 ఓట్ల తేడా తో ఓడించారు. చిత్తూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన డీకే సత్యప్రభ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి జే శ్రీనివాసులును 6,776 ఓట్ల తేడాతో ఓడించారు. ఇక సత్యవేడు నుంచి టీడీపీ అభ్యర్థి తలారి ఆదిత్య వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆదిమూలంపై 2,824ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. శ్రీకాళహస్తిలో మాజీ మంత్రి బొజ్జలగోపాలకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బియ్యపు మధుసూదన్‌రెడ్డిపై 7,500 ఓట్ల మెజారిటీతో గెలిచారు. పట్టు నిలుపుకున్న పెద్దిరెడ్డి పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ తరఫున ఎన్నికైన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిల్లాలో తన పట్టును నిలుపుకున్నారు. టీడీపీ వారికి వచ్చే మెజారిటీని నిరోధించి జనాన్ని తనవైపు తిప్పుకోవడంలో విజయం సాధించారు. ప్రధానంగా పుంగనూరులో ఆయన అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. పీలేరు, మదనపల్లె నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు మంచి మెజారిటీతో గెలుపొందేందుకు శక్తివంచన లేకుండా కృషిచేశారు. పూతలపట్టులో డాక్టర్ సునీల్‌కుమార్‌ను గెలిపించడంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు, రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలుపొందిన పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కీలకపాత్ర పోషించారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి మిథున్‌రెడ్డి ఇచ్చిన హామీని సునీల్‌కుమార్‌ను గెలిపించుకోవడం ద్వారా నెరవేర్చారని చెప్పవచ్చు. పడమటి నియోజకవర్గాల్లో బీజేపీ అతిరథ మహారథులైన నరేంద్ర మోడీ, వెంకయ్యనాయుడు, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, సినీ నటుడు పవన్‌కల్యాణ్ ఎన్నికల సభలు ఫలితాలనివ్వలేదు. -
సీఐపై వేటు పడింది
నెల్లూరు(క్రైమ్), న్యూస్‌లైన్: ఎన్నికల విధుల్లో ఉన్న అధికారి, సిబ్బందిని అక్రమంగా నిర్బంధించిన ఘటన వాకాడు సీఐ చెంచురామారావును సస్పెండ్ చేస్తూ గుంటూరు రేంజ్ ఐజీ పీవీ సునీల్‌కుమార్ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. అయనపై క్రిమినల్ కేసు సైతం నమోదు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 10వ తేదీ రాత్రి చిట్టమూరు మండలం మల్లాంలో నగదు పంపిణీ జరుగుతోందని సమాచారం అందుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్-3 అధికారి మోజెస్ అక్కడకి చేరుకున్నారు. ఒకరి నుంచి రూ.43 వేలు స్వాధీనం చేసుకుని, ఉన్నతాధికారులతో పాటు ఎస్సై రవినాయక్‌కు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న రవినాయక్ నగదును పోలీసుస్టేషన్లో అప్పగించాలని చెప్పి వెళ్లిపోయారు. అనంతరం స్క్వాడ్ అధికారులు స్టేషన్‌కు వస్తుండగా మార్గమధ్యంలో వాకాడు సీఐ చెంచురామారావు వారి వాహనాన్ని అడ్డుకున్నారు. ఏ అధికారంతో నగదు స్వాధీనం చేసుకున్నావంటూ మోజెస్‌తో పాటు సిబ్బందిపై చిందులేశారు. వారు వాదనకు దిగడంతో కోపోద్రిక్తుడైన సీఐ చిట్టమూరు స్టేషన్‌కు తరలించి 11వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్బంధించారు. మోజెస్‌పై కేసు నమోదు చేయాలని ఎస్సై రవినాయక్‌పై ఒత్తిడి తెచ్చారు. ఆయన ససేమిరా అనడంతో ఆక్రోశం వెళ్లగక్కి వెళ్లిపోయారు. తనకు జరిగిన అవమానంపై 11వ తేదీ గూడూరు ఆర్డీఓ శ్రీనివాసరావుకు మోజెస్ ఫిర్యాదు చేశారు. దీనిపై తహశీల్దార్‌తో విచారణ చేయించి ఆయన అక్రమ నిర్బంధం నిజమేనని నిర్ధారించుకున్నారు. సీఐపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్, ఎస్పీతో ఎన్నికల సంఘానికి నివేదిక పంపారు. స్పందించిన ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవాల్ ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని గూడూరు డీఎస్పీ చౌడేశ్వరిని ఆదేశించారు. ఆమె సకాలంలో నివేదిక అందించకపోవడంతో నెల్లూరు సీసీఎస్ ఓఎస్డీ శిల్పవల్లికి సోమవారం ఆ బాధ్యతలు అప్పజెప్పారు. ఆమె విచారణలో అక్రమ నిర్బంధం నిజమేనని తేలడంతో సీఐను వీఆర్‌లో రిపోర్టు చేసుకోవాలని మంగళశారం ఎస్పీ ఆదేశించారు. అనంతరం విషయాన్ని ఐజీ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన మంగళవారం రాత్రి చెంచురామారావును విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో క్రిమినల్ కేసు? సీఐ చెంచురామారావుపై త్వరలో క్రిమినల్ కేసు నమోదుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. మోజెస్‌పై కేసు నమోదు చేసేందుకు నిరాకరించిన ఎస్సై రవినాయక్‌పై కక్ష పెంచుకుని, మంగళవారం ఓ పథకం ప్రకారమే చిట్టమూరు పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఆయనపై దాడికి దిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ అధికారిగా ఏఎస్పీ రెడ్డి గంగాధర్‌ను నియమించారు. వెంటనే రంగంలోకి దిగిన ఆయన విచారణ చేపట్టారు. సీఐ అనుచితంగా వ్యవహరించాడని విచారణలో తేలినట్టు తెలిసింది. ఈ క్రమంలో సీఐపై క్రిమినల్ కేసు నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. సీఐ నెల్లూరు నగరం విడిచి పోవద్దని గుంటూర్ రేంజ్ ఐజీ సునీల్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. మొదటి నుంచి అంతే చెంచురామారావు ఆది నుంచి వివాదాస్పదుడే. గతం లో పనిచేసిన అన్ని చోట్లా పలు ఆరోపణలు ఎదుర్కొనట్లు సమాచారం. ఇప్పటికే పలుమార్లు ఉన్నతాధికారులు ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారని తెలిసింది. వాకాడు సీఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇసుక, సిలికా వ్యాపారులతో సంబంధాలు ఏర్పరచుకుని అక్రమ రవాణాకు సహకరిస్తున్నాడని జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈయన వ్యవహారంపై పలువురు గూడూరు డీఎస్పీకి ఫిర్యాదు చేసినా స్పందించలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఐ చెంచురామారావుకు వత్తాసు పలుకుతున్న వారిపైనా పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టినట్లు తెలిసింది. టీడీపీ నేతలకు వత్తాసు గూడూరు: మల్లాంలో సర్పంచ్, టీడీపీ నేత సునీల్‌రెడ్డి నగదు పంపిణీ చేస్తుండగా ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇది టీడీపీకి కొమ్ముకాస్తున్న సీఐ చెంచురామారావుకు కోపం తెప్పిం చిందని ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే ఆయన వెంటనే రంగంలోకి దిగి మార్గమధ్యలోనే ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి మోజెస్‌ను అడ్డుకుని స్టేషన్‌కు తీసుకెళ్లి నిర్బంధించినట్లు సమాచారం. మరోవైపు ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీల నేతలు రవాణా చేస్తున్న రూ.2 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, దీన్ని అధికారికంగా చూపకుండా పంచుకునే విషయంలోనూ సీఐ, ఎస్సైల మధ్య విబేధాలు తలెత్తాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధ్యతల నుంచి తప్పించాలని విన్నపం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారిగా పనిచేయడం తన వల్ల కాదని, తనను ఆ బాధ్యతల నుంచి తప్పించాలని మోజెస్ మంగళవారం గూడూరు ఆర్డీఓకు విన్నవించారు. నిజాయితీగా పనిచేస్తున్న తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన ఆర్డీఓ విధుల నుంచి తప్పిస్తానని హామీ ఇచ్చారు. -
నియంత్రణేది?
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో రాష్ట్రంలోని డీమ్డ్ యూనివర్శిటీలు ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఆ యూనివర్శిటీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్‌లతో పాటు పీజీ కోర్సులకు ఇప్పటి వరకు ప్రభుత్వ కోటాను కేటాయించక పోవడం ఇందుకు అద్దం పడుతోంది. ప్రభుత్వం, డీమ్డ్ యూనివర్శిటీల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ప్రతి కళాశాలలోని 25 శాతం సీట్లను సీఈటీ ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈ విద్యా సంవత్సరంలో ఒక్క యూనివర్శిటీ కూడా ఆ ఒప్పందాన్ని గౌరవించ లేదని వైద్య విద్యాశాఖ చెబుతోంది. మణిపాల్‌లోని కస్తూర్బా వైద్య కళాశాలలో మొత్తం 250 సీట్లకు గాను 63 మందికి స్థానం కల్పించాల్సి ఉండగా 28 మందికి మాత్రమే ప్రభుత్వ కోటా కింద అవకాశం కల్పించారు. బీడీఎస్‌లో ఒక్కరికీ సీటు ఇవ్వక పోవడంతో పాటు పీజీ కోర్సులో 42 మందికి గాను కేవలం 14 మందికి మాత్రమే అవకాశం కల్పించారు. మైసూరులోని జేఎస్ఎస్ వైద్య కళాశాల సైతం 50 మందికి గాను 12 మందికి మాత్రమే అవకాశం కల్పించింది. పీజీ కోర్సుల్లో ఎవరికీ సీటు దక్కలేదు. బీజాపురలోని బీఎం.పాటిల్ వైద్య కళాశాల ఎంబీబీఎస్, పీజీ కోర్సుల్లో ఒక్కరంటే ఒక్కరికీ అవకాశం కల్పించ లేదు. ప్రైవేట్ వైద్య కళాశాలలు ఎంబీబీఎస్ సీట్లను రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షలకు, పీజీ సీట్లను రూ.3 కోట్లు చొప్పున విక్రయిస్తున్న సంగతి బహిరంగ రహస్యమే. ఈ విద్యా సంవత్సరంలో కేటాయించని సీట్లను వచ్చే ఏడాది సీట్లతో కలుపుకొని ఇవ్వాల్సిందిగా వైద్య విద్యా శాఖ అన్ని యూనివర్శిటీలను ఆదేశించింది. పీజీ కోర్సులకు మార్చిలో, ఎంబీబీఎస్ సీట్లకు మే నెలలో కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. నియంత్రణకు చట్టాన్ని రూపొందించండి డీమ్డ్ విశ్వ విద్యాలయాలు సొంత సామాజ్య్రాలను నిర్మించుకున్నట్లుగా వ్యవహరిస్తున్న తీరును నివారించడానికి ఓ చట్టాన్ని తీసుకు రావాల్సిందిగా స్పీకర్ కాగోడు తిమ్మప్ప ప్రభుత్వానికి సూచించిన అరుదైన సంఘటన గురువారం శాసన సభలో చోటు చేసుకుంది. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు వైద్య విద్యా శాఖ మంత్రి డాక్టర్ శరణ్ ప్రకాశ్ పాటిల్ సమాధానమిస్తూ, డీమ్డ్ యూనివర్శిటీలపై ప్రభుత్వానికి నియంత్రణ లేదని తెలిపారు. మణిపాల్, కేఈఎల్ యూనివర్శిటీలు సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో వంద శాతం ఫలితాలను సాధిస్తున్నాయని చెప్పారు. భారతీయ వైద్య మండలి, డీమ్డ్ యూనివర్శిటీల నిర్వహణను పరిశీలిస్తుంటుందని చెబుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయజాలదని నిస్సహాయత వ్యక్తం చేశారు. ఈ దశలో స్పీకర్ జోక్యం చేసుకుని వాటిని నియంత్రించడానికి చర్యలు తీసుకోదలిస్తే, సభ అండగా నిలుస్తుందని మంత్రికి భరోసా ఇచ్చారు. దీనిపై ప్రభుత్వం పరిశీలిస్తుందని తదుపరి మంత్రి చెప్పారు. -
జననేతకు నీరాజనం
మంగళహారతులతో స్వాగతం సమస్యలు చెప్పుకున్న చిత్తూరువాసులు ముగిసిన మూడోవిడత జగన్ యాత్ర సాక్షి, తిరుపతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మూడోవిడత సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్రకు ఎనిమిదవ రోజు సైతం విశేష స్పందన లభించింది. జననేతకు దారి పొడవునా మహిళలు హారతులు పట్టగా, బాణసంచా పేల్చి ఆనందం వ్యక్తం చేశారు. పలు ప్రాంతాల్లో మేళతాళాలతో ఆయనకు స్వాగతం పలికారు. ఉదయం చిత్తూరు సమన్యకర్త ఏఎస్.మనోహర్ ఇంటి నుంచి బయలుదేరిన జగన్మోహన్రెడ్డికి బైక్‌ర్యాలీతో ఆహ్వానం పలికారు. పాతకలెక్టరేట్ వద్దకు చేరుకున్న ఆయనకు జిల్లా మహిళా కన్వీనర్ గాయత్రీ దేవి, పలువురు మహిళలతో కలసి హారతులు ఇచ్చారు. ఆయన దుర్గమ్మ గుడికి వెళ్లి అభిషేకం, అర్చనలో పాల్గొన్నారు. సమీపంలోని శివాలయం సిబ్బంది మేళతాళాలతో స్వాగతం పలికారు. ఓటి చెరువు, వల్లియప్పనగర్‌లో మహిళలను జననేత పలకరించారు. విజయ డెయిరీ వద్ద పాడిరైతుల ఉద్యమకారుడు వెంకటాచలం నాయుడు ఆధ్వర్యంలో జగన్మోహన్రెడ్డిని కలుసుకున్నారు. విజయ డెయిరీని ప్రారంభించాలని కోరారు. గతంలో వైఎస్ తమకు దీనిపై మాట ఇచ్చారని అనగానే, ఆ విషయం తన దృష్టిలో ఉందని, తమ ప్రభుత్వం రాగానే చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టరేట్ మీదుగా రెడ్డిగుంట చేరుకోగా మహిళలు స్వాగతం పలికారు. గంగాసాగరంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనుప్పల్లె క్రాస్ వద్ద వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి, అంజలి ఘటించారు. మాపాక్షి క్రాస్ వద్ద రైతులతో కొద్దిసేపు ముచ్చటించారు. సమీపంలోని చీలాపల్లె క్రాస్ వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. కొత్తపల్లెలో బాణ సంచా పేల్చి స్వాగతం పలికారు. గుడిపాల వద్ద భారీ ఎత్తున టపాసులు పేల్చారు. జగన్మోహన్రెడ్డి అక్కడ బహిరంగసభలో ప్రసంగించారు. గ్రీమ్స్పేట మీదుగా కణ్ణన్ కాలేజీ చేరుకోగా డాక్యుమెంట్ రైటర్లు ఆయనను కలుసుకున్నారు. ఈ-సేవ వచ్చిన త రువాత తమకు పనులు లేకుండా పోయాయని, తమకు జీవన భృతిలేదని వారు తెలిపారు. ఆర్టీసీ ఒకటవ డిపో ఉద్యోగులు కూడా కలుసుకుని ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. అక్కడి నుంచి దర్గా సర్కిల్‌మీదుగా, ఎమ్మెస్సార్ సర్కిల్ చేరుకుని, తరువాత పీసీఆర్ సర్కిల్లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, మాజీ ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి, సమన్వయకర్తలు ఏఎస్. మనోహర్, ఆర్కే. రోజా, డాక్టర్ సునీల్‌కుమార్, రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మహిళా కన్వీనర్ గాయత్రీ దేవి, యువజన కన్వీనర్ ఉదయకుమార్, పార్టీ నాయకులు గాంధీ, తలుపులపల్లి బాబు రెడ్డి, పూర్ణం, బాబ్జాన్, వై.సురేష్ తదితరులు పాల్గొన్నారు. ముగిసిన మూడోవిడత యూత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్.జగన్మోహన్రెడ్డి ఈనెల ఐదో తేదీన జిల్లాలో చేపట్టిన మూడో విడత ఓదార్పు, సమైక్య శంఖారావం యాత్ర ఆదివారంతో ముగిసింది. తంబళ్లపల్లె నియోజకవర్గం నుంచి యాత్ర ప్రారంభంకాగా, మదనపల్లె మీదుగా, పీలేరు నియోజకవర్గం చేరుకున్నారు. పుంగనూరు, చంద్రగిరి, పూతలపట్టు, చిత్తూరు నియోజకవర్గాల్లో పర్యటించారు. మూడో విడత యాత్ర ముగించుకుని ఆదివారం సాయంత్రం ఆయన చిత్తూరు నుంచి తిరుపతి మీదుగా హైదరాబాద్‌కు బయలుదేరారు. సంక్రాంతి తరువాత జిల్లాలో నాలుగోవిడత యాత్ర ప్రారంభమవుతుందని ఆ పార్టీ నేతలు తెలిపారు. -
ఇంతకీ దొంగలెవరు?
ఏటీ అగ్రహారం (గుంటూరు), న్యూస్‌లైన్: నేరాలను నియంత్రిస్తూ ప్రజలకు అండగా నిలవాల్సిన కొందరు అవినీతి అధికారుల కారణంగా పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం వాటిల్లుతోందనే విమర్శలు వినవస్తున్నాయి. నేరస్తులను గుర్తించి చోరీ సొత్తును రికవరీ చేయాల్సిన అధికారులే దొంగలను బెదిరించి లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు లేకపోలేదు. నేరస్తులపై ఎలాంటి కేసులు నమోదు చేయకుండా వదిలివేస్తుండడం గమనార్హం! ఇటీవల ఓ డీఎస్పీ, ఎస్ఐలపై వరుసగా రేంజ్ ఐజీ పీవీ సునీల్‌కుమార్, అర్బన్ జిల్లా ఎస్పీ జెట్టి గోపీనాథ్‌లకు ఫిర్యాదులందాయి. వీటిని తీవ్రంగా పరిగణించి విచారణ జరుపుతున్నట్లు సమాచారం. దర్జాగా వెళ్లిన దొంగలు..! మార్చి 29న బ్రాడీపేటలోని ఓ హోటల్లో కొత్తపేటకు చెందిన సిరంజి మమత, హైదరాబాద్‌కు చెందిన నటారి సందీప్, సయ్యద్ అమీర్అహ్మద్, పశ్చిమ గోదావరి జిల్లా పోచవరానికి చెందిన పత్తిపాటి శ్రీనివాసరావులు దొంగ బంగారం విక్రయించేందుకు బసచేశారని సెంట్రల్ క్రైం స్టేషన్ (సీసీఎస్) పోలీసులకు సమాచారం అందింది. ఆ మేరకు డీఎస్పీ, ఎస్ఐ, సిబ్బంది ఆ హోటల్లో తనిఖీలు నిర్వహించి నలుగుర్నీ అదుపులోకి తీసుకొని విచారించారు. దొంగ బంగారం విక్రయించేందుకు వచ్చినట్లు నిర్థారించుకున్న అధికారులు వారితో బేరానికి దిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేసి లక్షన్నరకు బేరం కుదుర్చుకుని వారిని వదిలి వేసినట్లు పోలీస్‌శాఖలోనే విమర్శలు గుప్పుమన్నాయి. సగానికి సగం.. హైదరాబాద్ కంట్రీ క్లబ్లో సభ్యత్వం పేరుతో లక్షల్లో డబ్బు చెల్లించి మోసపోయామంటూ ఫిబ్రవరిలో వివిధ ప్రాంతాలకు చెందిన తొమ్మిది మంది మహిళలు అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో నలుగురిపై కేసు నమోదు చేశారు. అనంతరం కేసును సీసీఎస్‌కు బదిలీచేశారు. దర్యాప్తులో భాగంగా హైదరాబాద్ వెళ్లిన ఎస్ఐ క్లబ్ డెరైక్టర్లతో బేరం కుదుర్చుకొని లక్షల రూపాయలు సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఒక్కరినే నిందితుడిగా చూపించడం గమనార్హం! ఫిర్యాదుచేసిన తొమ్మిది మందికి డబ్బు తిరిగిచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. డీఎస్పీ సూచనల మేరకు ఎనిమిది మంది బాధితుల వద్దకు వెళ్లి వారు చెల్లించిన సొమ్ములో సగం చెల్లించి.. వారికి పూర్తిగా చెల్లించినట్లు హైదరాబాద్‌కు చెందిన ఓ న్యాయవాది సహకారంతో ఒప్పంద పత్రాలు తీసుకున్నారు. మరో మహిళకు కూడా పూర్తిగా డబ్బు ముట్టినట్లు కోర్టులో తప్పుడు సమాధానం చెప్పారు. ఈ విధంగా పలు కేసుల్లో కూడా వారిద్దరూ తమదైన శైలిలో వ్యవహరించి లక్షల్లో డబ్బును నేరస్తులు, బాధితుల నుంచి వసూలు చేశారని ఐజీ, ఎస్పీలకు అందిన ఫిర్యాదుల్లో ఉన్నాయి. గుంటూరు గోల్డ్మార్కెట్లో ఎస్ఐ అనుచరుడైన ఓ హెడ్‌కానిస్టేబుల్ దొంగలను గుర్తించడం, వారిని ఎస్ఐ వద్దకు తీసుకువచ్చి బెదిరింపులకు దిగి బంగారం కాజేస్తుంటారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విధంగా వదిలేసిన నేరస్తులు రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, భీమవరం, హైదరాబాద్‌ల్లో దొరికిన సందర్భాల్లో పోలీసు విచారణలో దొంగలించిన సొత్తు గుంటూరులోని క్రైమ్ ఎస్ఐకి అందజేశామని చెప్పినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇదంతా డీఎస్పీ కనుసన్నల్లో కొనసాగుతోందనే విమర్శలు బలంగా వినవస్తున్నాయి. -
అప్రమత్తం కండి
సాక్షి, ఒంగోలు: పార్లమెంట్లో రాష్ట్ర విభజన బిల్లును ప్రవేశపెడతారనే సమాచారం మేరకు సమైక్యాంధ్ర ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రకాశం జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని గుంటూరు రేంజ్ ఐజీ పి.వి.సునీల్‌కుమార్ పోలీస్ అధికారులకు సూచించారు. రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారుల సూచనల మేరకు ఐజీ సునీల్‌కుమార్ అప్పటికప్పుడే నిర్ణయం తీసుకొని మంగళవారం తన రేంజ్ పరిధిలోని గుంటూరు, ఒంగోలు, నెల్లూరు జిల్లాల్లో పర్యటించి సంబంధిత పోలీస్ అధికారులకు ముందస్తు జాగ్రత్త చర్యలపై ప్రత్యేక సూచనలు చేశారు. దీనిలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఆయన ఎస్పీ పి.ప్రమోద్‌కుమార్‌తో పాటు నగర డీఎస్పీ జాషువా, పలువురు నగర సీఐలతో సమావేశమయ్యారు. రాష్ట్ర విభజనకు సంబంధించి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడితే దాన్ని జిల్లాలో తీవ్రంగా వ్యతిరేకించే క్రమంలో భాగంగా అల్లర్లు చోటుచేసుకోవడం, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నష్టం వాటిల్లేలా ఆందోళనకారులు వ్యవహరించే అవకాశాలున్నాయని అన్నారు. సందర్భానుసారం పోలీస్ అధికారులు వ్యవహరించాల్సి ఉంటుందని ఐజీ పేర్కొన్నారు. ప్రజలు, ప్రజాసంఘాలు, ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర నేతలు శాంతియుతంగా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన ప్రదర్శనలు చేస్తే పోలీసులు వాటికి అనుమతినివ్వాలని, అయితే ఏ మాత్రం హింసాయుతంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు చేపట్టి వెంటనే వారిని అరెస్ట్ చేయాలని సూచించారు. ఇప్పటికే జిల్లాలో ఉన్న 4 ప్లటూన్ల ఏపీఎస్పీ సిబ్బంది, ఒక కంపెనీ బీఎస్ఎఫ్ బలగాలతో పాటు తాజాగా శిక్షణ పూర్తి చేసుకొని వచ్చిన 300 మంది కానిస్టేబుళ్లతో పాటు ఏఆర్ సిబ్బందిని వినియోగించుకోవాలని, ఏ మాత్రం అవసరం అనిపిస్తే యుద్ధప్రాతిపదికన కేంద్ర బలగాలను దింపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఐజీ తెలిపారు. రాష్ట్ర పరిస్థితులను బట్టి శాంతిభద్రతలను కాపాడే విషయంలో పోలీస్ అధికారులు, సిబ్బంది వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో ఏఆర్ అడిషినల్ ఎస్పీ కృష్ణయ్య, సీఐలు బీటీ నాయక్, సూర్యనారాయణ, భూషణం, ఐ.శ్రీనివాసన్, అశోక్‌వర్ధన్, ఎస్బీ సీఐ తిరుమలరావులు పాల్గొన్నారు. అనంతరం ఐజీ నెల్లూరు జిల్లాకు వెళ్లారు. -
'జగన్ ఆరోగ్య పరిస్థితిపై 6 గంటలకు హెల్త్ బులెటిన్'
రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ తీసుకున్న నిరంకుశ నిర్ణయానికి నిరసనగా చంచల్ గూడ జైల్లో దీక్ష చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని జైళ్ల శాఖ ఐజీ సునీల్‌కుమార్ తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని కోరుతూ జైళ్ల శాఖ ఐజీ సునీల్‌కుమార్‌తో వైఎస్ఆర్ సీపీ నేతలు శోభానాగిరెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, గొల్ల బాబూరావులు సోమవారం మధ్యాహ్నం భేటీ అయిన సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల విజ్క్షప్తికి జైళ్ల శాఖ ఐజీ సానుకూలంగా స్పందించారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు వైఎస్ జగన్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని ఐజీ సునీల్ కుమార్ తెలిపారు.