రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ తీసుకున్న నిరంకుశ నిర్ణయానికి నిరసనగా చంచల్ గూడ జైల్లో దీక్ష చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని జైళ్ల శాఖ ఐజీ సునీల్‌కుమార్ తెలిపారు.
'జగన్ ఆరోగ్య పరిస్థితిపై 6 గంటలకు హెల్త్ బులెటిన్'
Published Mon, Aug 26 2013 5:27 PM | Last Updated on Wed, Aug 8 2018 5:51 PM
రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ తీసుకున్న నిరంకుశ నిర్ణయానికి నిరసనగా చంచల్ గూడ జైల్లో దీక్ష చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని జైళ్ల శాఖ ఐజీ సునీల్‌కుమార్ తెలిపారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని కోరుతూ జైళ్ల శాఖ ఐజీ సునీల్‌కుమార్‌తో వైఎస్ఆర్ సీపీ నేతలు శోభానాగిరెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, గొల్ల బాబూరావులు సోమవారం మధ్యాహ్నం భేటీ అయిన సంగతి తెలిసిందే.
వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల విజ్క్షప్తికి జైళ్ల శాఖ ఐజీ సానుకూలంగా స్పందించారు. ప్రతిరోజు
సాయంత్రం 6 గంటలకు వైఎస్ జగన్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని ఐజీ సునీల్ కుమార్ తెలిపారు.
Advertisement
Advertisement