'వైఎస్ జగన్ ఆరోగ్యంపై బులెటిన్ విడుదల చేయమని కోరాం' | YSRCP leaders met IG of Jails on YS Jagan's Deeksha at Chanchalguda | Sakshi
Sakshi News home page

'వైఎస్ జగన్ ఆరోగ్యంపై బులెటిన్ విడుదల చేయమని కోరాం'

Published Mon, Aug 26 2013 4:50 PM | Last Updated on Wed, Aug 8 2018 5:51 PM

YSRCP leaders met IG of Jails on YS Jagan's Deeksha at Chanchalguda

వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని కోరుతూ జైళ్ల శాఖ ఐజీ సునీల్‌కుమార్‌తో వైఎస్ఆర్ సీపీ నేతలు సోమవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. ఈ భేటిలో శోభానాగిరెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, గొల్ల బాబూరావులు హాజరయ్యారు. 
 
చంచల్ గూడ జైల్లో దీక్ష చేస్తున్న వైఎస్ జగన్ ఆరోగ్య స్థితిపై ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారని, అందుకే బులెటిన్ విడుదల చేయాలని జైళ్ల శాఖ ఐజీని కోరారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ నిరంకుశ ధోరణికి నిరసనగా వైఎస్ జగన్‌ చేపట్టిన దీక్షకు ఎలాంటి ఆటంకాలు కల్పించవద్దని కోరామని వైఎస్ఆర్ సీపీ నేతలు మీడియాతో అన్నారు. 
 
ప్రతి రోజు ఒకసారి హెల్త్ బులెటిన్ విడుదలకు జైళ్లశాఖ ఐజీ అంగీకరించారని నేతలు తెలిపారు. ప్రస్తుతం వైఎస్ జగన్ ఆరోగ్యం బాగానే ఉందని నేతలు శోభానాగిరెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, గొల్ల బాబూరావు ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement