'వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం మరింత క్షీణించింది'
రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడానికి నిరసనగా ఐదు రోజులుగా చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీక్షపై జైలు అధికారులు సమీక్ష నిర్వహించారు. గురువారం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించారు.
గత ఐదు రోజులుగా దీక్ష చేస్తున్న వైఎస్ జగన్ ఆరోగ్యం మరింత క్షీణించింది. రెండు కేజీల బరువు తగ్గారు. షుగర్ లెవెల్స్ బాగా తగ్గాయి. ఆహారం తీసుకుకోకుంటే ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది. బీపీ 107/70 ఉంది వెల్లడించారు.
వైఎస్ జగన్ ఆరోగ్యంపై గంట గంటకు జైళ్ల డీజీపీకి నివేదిక అందిస్తున్నారు. జగన్ ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్ర హోం శాఖ అధికారులకు జైలు అధికారులు నివేదికను పంపిచారు.