
సాక్షి, హైదరాబాద్ : విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన దాడిలో ఆయన భుజానికి తీవ్ర గాయమైంది. దీంతో వైఎస్ జగన్‌ను వెంటనే హైదరాబాద్‌లోని సిటీన్యూరో ఆస్పత్రికి తరలించారు. భుజానికి తీవ్రగాయం కావడంతో డాక్టర్లు ఆయనకు శస్త్ర చికిత్స చేశారు. వైఎస్ జగన్ భుజానికి తొమ్మిది కుట్లు వేశామని గురువారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో వైద్యులు తెలిపారు.
దుండగుడు పొడిచిన కత్తి వైఎస్ జగన్ శరీరంలోకి బలంగా దిగిందని వైద్యులు పేర్కొన్నారు. దాదాపు 4 సెంటీమీటర్ల లోతుకు కత్తి దిగిందన్నారు. ప్రస్తుతం వైఎస్ జగన్ ఆరోగ్య నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. రక్త నమూనాలను సేకరించి పరీక్షలకి పంపామన్నారు. కత్తికి విషం పూసారా, లేదా అన్నది పరీక్షల తర్వాతే తెలుస్తుందన్నారు. రిపోర్ట్ వచ్చాక డిశ్చార్జ్ ఎప్పుడనేది చెబుతామని వైద్యులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment