Visakhapatnam airport
-
ఇక 24 గంటలూ రాకపోకలు..
విమాన సర్వీసులతో పాటు రాకపోకల్లోనూ గణనీయంగా వృద్ధి సాధిస్తూ దూసుకుపోతున్న విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త రూపు సంతరించుకునేందుకు సిద్ధమవుతోంది. ఈస్ట్‌కోస్ట్‌లో ఓపెన్ స్కై ఎయిర్‌పోర్టుగా గుర్తింపు పొందేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఓపెన్ స్కై పాలసీలో భాగంగా ఎయిర్‌పోర్టుకు ఈ గుర్తింపు లభిస్తే..24 గంటల పాటు విమానాలు తిరుగుతాయి. కనెక్టివిటీ విమానాలు పెరిగితే..విదేశీ సర్వీసులు గణనీయంగా వృద్ధి చెందే అవకాశాలున్నాయి. ప్రధాని మోదీ ఆలోచనలకు అనుగుణంగా వైజాగ్ ఎయిర్‌పోర్టుని హబ్ అండ్ స్పూఫ్ మోడల్లో తీర్చిదిద్దేందుకు సమాలోచనలు జరుగుతున్నాయి. సాక్షి, విశాఖపట్నం: విశాఖ విమానాశ్రయం నుంచి ఎయిర్ కనెక్టివిటీ విస్తరిస్తోంది. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఆక్యుపెన్సీ 90% నమోదవుతోంది. మూడేళ్ల నుంచి ఐటీ, పారిశ్రామిక, పోర్టు ఆధారిత పెట్టుబడులు పెట్టేందుకు కార్పొరేట్ దిగ్గజ సంస్థలు విశాఖవైపు అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరింత కనెక్టివిటీ పెంచితే..అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి పథంలో దూసుకుపోనుంది. ఇందులో భాగంగా.. విశాఖ ఎయిర్‌పోర్టుని ఓపెన్ స్కై పాలసీ పరిధిలోకి తీసుకురావాలన్న ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఈ పాలసీ అమలు చేయడం ద్వారా..కొత్త సెక్టార్లలో ఆపరేషన్స్ పై విమానయాన సంస్థలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. ఓపెన్ స్కై పాలసీ 1944 అంతర్జాతీయ పౌర విమానయాన ఒప్పందం ప్రకారం విదేశీ విమానయాన సంస్థలకు సర్వీసులు నడిపేందుకు స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించవచ్చు.కీలకంగా ఎయిర్ కనెక్టివిటీ.. ప్రతి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దేశ విదేశాలకు కనెక్టివిటీ పెంచేందుకు అనుగుణంగా సర్వీసులు పెంచాల్సిన సమయం ఆసన్నమైంది. డిమాండ్ ఉన్న కొత్త సెక్టార్ల వైపు విమానయాన సంస్థలు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో విశాఖ నుంచి సర్వీసులు గణనీయంగా పెరిగే రోజులు సమీపిస్తున్నాయనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వింటర్ షెడ్యూల్ ప్రకారం 70 సర్వీసులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇండిగో, ఎయిర్ ఏషియా, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండియా వన్ ఎయిర్, స్కూట్, థాయ్ ఎయిర్ ఏషియా సంస్థలు ఇంటర్నేషనల్, డొమెస్టిక్ సేవలు నిర్వహిస్తున్నాయి. డిమాండ్ ఆధారంగా కొత్త కారిడార్లకు విస్తరించేందుకు బై లేటరల్ మోడల్లో విమానయాన సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇటీవల విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రారంభించిన డిజీ యాత్ర వంటి సౌకర్యాలు ఎయిర్ ప్యాసింజర్లకు పెద్ద వెసులుబాటు కల్పిస్తున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ, హైదరాబాద్, ముంబై మార్గాల్లో డిమాండ్ మరింత పెరిగింది. విశాఖ నుంచి రోజు సగటున 8000 మంది రాకపోకలు సాగిస్తున్నారు. ప్రతి నెలా సగటున విమాన ప్రయాణాలు చేస్తున్న వారి సంఖ్య 2.50 లక్షలకు చేరుకుంది. గతేడాదితో పోలిస్తే 90 శాతానికి పైగా ఆక్యుపెన్సీ పెరిగిందని ఎయిర్ పోర్ట్ అథారిటీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కొత్త కనెక్టివిటీ సర్వీసులు పెరిగితే..ఈ సంఖ్య రెట్టింపయ్యే అవకాశాలున్నాయి.ప్రధాన దేశాలకు అనుసంధానిస్తే.. ఓపెన్ స్కై ఎయిర్‌పోర్టుగా మార్చితే..ప్ర«దాన దేశాలకు విశాఖ నుంచి అనుసంధానం చేసే విమాన సర్వీసులు మొదలవుతాయి. ప్రస్తుతం సింగపూర్, మలేషియా, బ్యాంకాక్‌లకు అంతర్జాతీయ విమాన సర్వీసులు ఉన్నాయి. ఓపెన్ స్కైగా లేకపోవడం వల్ల..మిడిల్ ఈస్ట్ దేశాలకు అనుసంధానం చేసే విధంగా ఎయిర్ కనెక్టివిటీ సర్వీసులు రాలేదు. ఒకవేళ దీన్ని అమలు చేస్తే ఎమిరేట్స్, ఖతార్, ఒమాన్, ఎతియాడ్, కువైట్, సౌదీ ఎయిర్‌లైన్స్ విశాఖ వైపు అడుగులు వేస్తాయి. ఎమిరేట్స్, ఎతియాడ్ ఎయిర్‌లైన్స్ విశాఖ నుంచి సర్వీసులు ప్రారంభిస్తే యూరప్, యూఎస్ఏ, ఆఫ్రికా దేశాలకు విమాన సర్వీసులు ఎక్కువగా ఉంటాయి. రాయ్‌పూర్, భువనేశ్వర్, విజయవాడ, చెన్నై కి హబ్ అండ్ స్పూఫ్గా సర్వీసులు రాత్రి పూట నడిపేందుకు వీలుంటుంది. యూరప్, ఆఫ్రికా, యూఎస్ఏ దేశాల నుంచి ఎక్కువగా సర్వీసులన్నీ రాత్రి సమయంలోనే విశాఖ చేరుకుంటాయి. ఆ సమయంలో హబ్ అండ్ స్పూఫ్ మోడల్లో సమీప నగరాలకు కనెక్టివిటీ ఫ్లైట్స్ కూడా గణనీయంగా పెరుగుతాయి. ఇవన్నీ వీలైనంత త్వరగానే అందుబాటులోకి రానున్నాయి. ప్రాంతీయ విమానయాన కేంద్రంగా.. ఏపీలో అతిపెద్ద ఎయిర్‌పోర్టుగా ఉన్న విశాఖని ఓపెన్ స్కై ఎయిర్‌పోర్ట్‌గా మార్చితే విదేశీ విమానయాన సంస్థలకు సులభంగా యాక్సెస్‌ను అందించగలం. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇప్పుడు ఓపెన్ స్కై పాలసీ కింద ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతాకు విదేశీ సర్వీసుల్ని అనుమతిస్తోంది. ఈస్ట్ కోస్ట్‌లో విశాఖను ఓపెన్ స్కైగా మార్చితే ఎయిర్ కనెక్టివిటీ గణనీయంగా పెరుగుతుంది. ఈస్ట్ కోస్ట్ పరిధిలో విశాఖ ప్రాంతీయ విమానయాన కేంద్రంగా మారుతుంది. అందుకే ఓపెన్ స్కై పాలసీని వైజాగ్ ఎయిర్‌పోర్టులో అమలు చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ఎందుకంటే విశాఖ విమానాశ్రయం నుంచి ప్రతీ నెల దేశీయ ప్రయాణికుల సంఖ్యతో పాటు విదేశీ ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మరిన్ని సర్వీసులు అందుబాటులోకి వస్తే.. అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. – విజయ్‌మోహన్, ఎయిర్‌పోర్టు అడ్వైజరీ బోర్డ్ మెంబర్ -
Visakhapatnam: విమానం హైజాక్!
విశాఖ సిటీ: విశాఖ విమానాశ్రయంలో ఒక్కసారిగా భద్రతా బలగాలు మోహరించాయి. ఎన్ఎస్జీ కమాండోలు, సీఐఎస్ఎఫ్ అధికారులు ఆయుధాలతో రన్‌వే పై పరుగులు తీసి.. ఒక విమానాన్ని చుట్టుముట్టారు. అందరిలోనూ ఒకటే టెన్షన్. ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది. కొంత సేపటికి అది ఒక డ్రిల్‌గా తెలుసుకుని అందరూ ఊపిరిపీల్చుకున్నారు. విశాఖ విమానాశ్రయంలో యాంటీ హైజాక్ ప్రదర్శన నిర్వహించారు. విమానం హైజాక్ అయితే తలెత్తే పరిస్థితులు, భద్రతా బలగాలు చేసే సాహసాలు, ముష్కరుల నుంచి ప్రయాణికుల విముక్తి, ఇలా అన్ని అంశాలను యథాతథంగా విన్యాసాలు చేశారు. విమానాశ్రయంలో ఆకస్మిక ప్రణాళిక, హైజాక్ సమయంలో పరిస్థితుల అంచనా, ప్రయాణికుల భద్రత, కేంద్ర, రాష్ట్ర బలగాలు, శాఖల మధ్య సమన్వయంపై ప్రద ర్శన చేపట్టారు. ఐఎన్ఎస్ డేగా, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ), ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు ఇందులో పాల్గొన్నాయి. హైజాక్ సమయంలో అప్రమత్తత, సంసిద్ధత, అత్యవసర ఆపరేషన్ నిర్వహణ, శాఖల మధ్య సమన్వయానికి ఈ ప్రదర్శన దోహదం చేస్తుందని ఐఎన్ఎస్ డేగా అధికారులు పేర్కొన్నారు. నేషనల్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ప్రొగ్రాం కింద ఈ వార్షిక డ్రిల్‌ను నిర్వహించారు. -
విమానయానం రయ్రయ్
సాక్షి, విశాఖపట్నం: విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికుల రాకపోకల్లో గణనీయమైన వృద్ధి నమోదు చేసుకుంటోంది. 2022–23తో పోలిస్తే 2023–24లో ఏకంగా 22 శాతం వృద్ధి సాధించింది. ఓవైపు రన్‌వే పునరుద్ధరణ పనుల వల్ల నవంబర్ నుంచి రాత్రి పూట సర్వీసులు నిలుపుదల చేసినా.. చివరి రెండు నెలల్లోనూ మంచి ఫలితాలే నమోదయ్యాయి. రాత్రి పూట కూడా సర్వీసులుండుంటే వృద్ధి శాతం 25కి దాటే అవకాశం ఉండేదని విమానాశ్రయ వర్గాలు చెబుతున్నాయి. కోవిడ్‌కు ముందు ఏడాది 30 లక్షల వరకూ ప్రయాణికుల రాకపోకలు సాగగా.. కోవిడ్ తర్వాత ఈ సంఖ్య సగానికి పడిపోయింది. అయితే.. క్రమంగా కోలుకుంటూ 2023లో తొలిసారిగా 20 లక్షల బెంచ్ మార్క్‌ను దాటింది. 2022–23 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకూ 17,67,609 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించగా.. 2023–24 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకూ 21,67,660 మంది రాకపోకలు సాగించారు. మరోవైపు.. ఈ ఏడాది విశాఖ ఎయిర్‌పోర్టుకు అన్నీ మంచి శకునాలే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఒక్కటే ఉన్న అంతర్జాతీయ సర్వీసు ఏప్రిల్ నాటికి మూడు సర్వీసులు రానున్నాయి. రోజుకు సగటున 50 విమానాల రాకపోకలు సాగిస్తుండగా.. రన్‌వే పనులు పూర్తయ్యాక వీటి సంఖ్య కూడా 70కి చేరుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. రోజుకు 50 విమానాల రాకపోకలు 1981లో రోజుకు ఒక విమానం ద్వారా పౌర సేవలు ప్రారంభమయ్యాయి. సివిల్ ఎయిర్ క్రాఫ్ట్స్‌లకు 85 రన్ వే కెపాసిటీగా విధించారు. జెట్ ఎయిర్వేస్ ఉన్నప్పుడు 80 విమానాలు రాకపోకలు సాగించాయి. జెట్ ఎయిర్వేస్ సర్వీసులు గతంలో నిలిచిపోవడంతో ప్రస్తుతం 60 నుంచి 66 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రతి పదేళ్లకోసారి రన్‌వే పునరుద్ధరణ పనులు చేపడుతుంటారు. ఈ పనుల కారణంగా నవంబర్ 15 నుంచి రాత్రి పూట సర్వీసులు నిలిపేశారు. రాత్రి 9 నుంచి ఉదయం 8 గంటల వరకు రన్‌వే మూసివేస్తున్నారు. ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా, పూణె తదితర ప్రాంతాలకు 12కి పైగా సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా ప్రస్తుతం 50 వరకూ విమానాల రాకపోకలు సాగుతున్నాయి. ఇందులో ఒక అంతర్జాతీయ సర్వీసు కూడా ఉండటం విశేషం. అయినప్పటికీ.. పాసింజర్ ఫుట్ఫాల్లో మాత్రం 2023లో మంచి ఫలితాలు నమోదు చేసింది. ప్రతి రోజూ సగటున 7,000 నుంచి 7,500 వరకూ ప్రయాణికులు విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. సర్వీసులు పెరిగే అవకాశాలు ఈ ఏడాది మార్చి 31 నాటికి రన్‌వే రీ సర్వీసింగ్ పనులు పూర్తి కానున్నాయి. అనంతరం.. పాత సర్వీసులు పునరుద్ధరించేందుకు విమానయాన సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. వీటితో పాటు దేశంలోని వివిధ నగరాలకు కొత్త సర్వీసులు మొదలు పెట్టేందుకు ఇండిగో, ఎయిర్ఏసియా సంస్థలు ఎయిర్‌పోర్టు వర్గాలతో చర్చలు జరుపుతున్నాయి. టైమ్ స్లాట్స్‌ని అడ్జెస్ట్ చేసేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. వీటికి తోడు.. ప్రస్తుతం సింగపూర్‌కు మాత్రమే ఇంటర్నేషనల్ సర్వీసు నడుస్తోంది. మరో రెండు మూడు నెలల్లో అదనంగా రెండు సర్వీసులు మొదలవ్వనున్నాయి. ఏప్రిల్ నుంచి థాయ్‌లాండ్, మలేసియాకు డైరెక్ట్ సర్వీసుల్ని విశాఖ నుంచి నడపనున్నట్లు ఎయిర్ఏసియా సంస్థ ప్రకటించింది. ఇలా.. రీ సర్వీసింగ్ పనులు పూర్తయిన తర్వాత.. విమాన సర్వీసులు 70కి చేరే అవకాశాలున్నాయని విమానాశ్రయ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. విమాన ప్రయాణికుల వృద్ధి ౖపైపెకి.. 2023–24లో 21,67,660 మంది రాకపోకలు -
Vizag : పొగమంచు ఎఫెక్ట్.. పలు విమానాలు రద్దు
విశాఖపట్నం: పొగమంచు కారణంగా విశాఖ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. విశాఖపట్నం నుంచి వేర్వేరు రాష్ట్రాలు, దేశాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు నిర్ణీత సమయానికి విమానాశ్రయానికి చేరుకుంటున్నా.. వాతావరణం అనుకూలించక కొన్ని సర్వీసులు రద్దు అవుతున్నాయి. విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో పొగ మంచు ప్రభావం.. మరో రెండు రోజులు ఉండనున్న దృష్ట్యా మరిన్ని సర్వీసులు రద్దయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. రద్దు అయిన ఫ్లైట్ వివరాలు: 1) 6E6336/5309 VOBL-VOVZ-VOBL 2) 6E626/783 HS-VOVZ- HS 3) 6E5176/2776 DP-VOVZ-DP. ఈరోజు రద్దయిన విమానాల వివరాలు... 1) బెంగళూరు నుంచి..విశాఖపట్నం. విశాఖ టు బెంగళూర్.. 6E6336/5309 VOBL-VOVZ-VOBL 2) హైదరాబాద్. టు. విశాఖపట్నం. విశాఖ టు. హైదరాబాద్.. 6E626/783 HS-VOVZ- HS 3) ఢిల్లీ. టు. విశాఖపట్నం అండ్ ఢిల్లీ.. 6E5176/2776 DP-VOVZ-DP. -
వీసాతో పనిలేకుండానే విదేశాలకు రయ్.. రయ్!
సాక్షి, విశాఖపట్నం: ‘భారతీయులూ.. వీసా లేకుండా మా దేశాన్ని సందర్శించండి’ అంటూ ఇటీవల వివిధ దేశాలు వరుసగా ప్రకటిస్తున్నాయి. ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ.. ఇంటర్నేషనల్ ట్రిప్స్ కోసం ఎదురుచూస్తున్న వారంతా విమానంలో ప్రయాణించేందుకు సిద్ధమవుతున్నారు. అందుకు అనుగుణంగా భారతీయులకు ప్రయాణ అవకాశాల్ని మరిన్ని కల్పించేందుకు విమానయాన సంస్థలు సిద్ధమవుతున్నాయి. టైర్–2 సిటీస్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయాలున్న నగరాలపై దృష్టి సారించాయి. వీటిలో విశాఖ ముందువరుసలో ఉంది. ఇప్పటికే విశాఖ నుంచి థాయ్‌లాండ్‌కు విమాన సర్వీసు ప్రారంభిస్తున్నట్టు ప్రకటించిన ఎయిర్ ఏషియా సంస్థ.. తాజాగా మలేషియా వెళ్లేందుకు మరో సర్వీసును మొదలు పెట్టేందుకు ముహూర్తం చూసుకుంటోంది. ఈ సర్వీసు ప్రకటనతో విదేశాలకు విమాన సర్వీసులు విశాఖ నుంచి ఒక్కొక్కటిగా పెరుగుతూ వస్తుండటం విశేషం. వీసాలతో పని లేకుండా.. వీసా ఉంటేనే విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. చాలా మందికి ఎంట్రీ లేదా టూరిస్ట్ వీసాలు దొరక్క.. తమకు నచ్చిన దేశంలో విహరించే ఆలోచనలను మధ్యలోనే విరమించుకుంటున్నారు. అలాంటి వారందరికీ ఇప్పుడు గోల్డెన్ చాన్స్ వచ్చేసింది. పాస్‌పోర్ట్ ఉంటే చాలు.. టికెట్ బుక్ చేసుకుని కొన్ని దేశాలకు ట్రిప్‌కు వెళ్లి రావొచ్చు. భారతీయ పాస్‌పోర్టు బలమైందిగా మారడమే దీనికి కారణం. ఇటీవల ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) విడుదల చేసిన వీసా ఫ్రీ దేశాల జాబితాలో ప్రపంచ దేశాల్లో భారత్ 83వ స్థానంలో నిలిచింది. ఈ కారణంగా కొన్ని దేశాలు భారతీయుల్ని విహారానికి వీసా లేకుండానే ఆహ్వానం పలుకుతున్నాయి. ఈ అవకాశాల్ని విమానయాన సంస్థలు సద్వినియోగం చేసుకుంటున్నాయి. థాయ్‌లాండ్, మలేషియాకు.. ఎయిర్ ఏషియా సంస్థ జైపూర్, గోవా, వారణాసితో పాటు విశాఖ నుంచి వీసా ఫ్రీ దేశాలకు సర్వీసులు ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. ముఖ్యంగా విశాఖపై ఎయిర్ ఏషియా స్పెషల్ ఫోకస్ పెట్టింది. దక్షిణ భారతదేశంలోని వివిధ నగరాల నుంచి కౌలాలంపూర్‌కు లిమిటెడ్ పీరియడ్‌తో ప్రత్యేక ప్రమోషన్ చార్జీలతో విమాన సర్వీసుల్ని ఎయిర్ ఏషియా ప్రకటించింది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి కూడా సర్వీసులు నడపాలని నిర్ణయించింది. సౌత్ ఇండియా నుంచి ఈ ఏడాది ఫస్ట్ క్వార్టర్లో మొత్తంగా 69 వీక్లీ సర్వీసులు నడుపుతూ ఏడాదికి 1.5 మిలియన్ సీట్లతో రెండు దేశాల మధ్య సేవలను గణనీయంగా పెంచనున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే మరో వీసా ఫ్రీ ప్రకటించిన థాయ్‌లాండ్‌కు కూడా విశాఖ నుంచి ఏప్రిల్‌లో సర్వీసులు మొదలు పెడుతున్నట్టు ఎయిర్ ఏషియా ప్రకటించింది. ఏప్రిల్ 9 నుంచి మంగళవారం, గురువారం, శనివారం రోజుల్లో సర్వీసులు నడపనున్నట్టు వెల్లడించింది. మరోవైపు.. విశాఖ నుంచి సింగపూర్‌కు స్కూట్ సర్వీస్‌కు ఫుల్ డిమాండ్ ఉంది. ప్రతి రోజూ కనీసం 300 నుంచి 350 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. త్వరలో ప్రారంభం కానున్న థాయ్, కౌలాలంపూర్ సర్వీసులతో విశాఖ నుంచి ఏకంగా మూడు విదేశీ సర్వీసులు నడవనున్నాయి. ఫిబ్రవరిలో ఇండిగో సంస్థ కూడా మరో విదేశీ సర్వీసు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉందని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. ఈ సర్వీసుల రాకతో విదేశీ ప్రయాణాలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్టు గేర్ మార్చినట్టుగా అధికారులు భావిస్తున్నారు. దూసుకుపోతున్న ఎయిర్ ఏషియా ఇప్పటివరకూ దాదాపు 60 దేశాలు వీసా ఫ్రీ ప్రకటించాయి. 30 నుంచి 90 రోజుల వరకూ వీసా లేకుండానే భారతీయులు తమ దేశానికి వచ్చి ఆతిథ్యాన్ని ఎంజాయ్ చెయ్యొచ్చని ప్రకటించాయి. తాజాగా తమ దేశ పర్యాటకానికి ఊతమిచ్చేందుకు వియత్నాం, థాయ్‌లాండ్, శ్రీలంక మాదిరిగానే మలేషియా కూడా భారతీయులకు వీసా ఫ్రీ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతేడాది డిసెంబర్ 1 నుంచి మలేషియా ఈ అవకాశాన్ని కల్పించింది. ఇలా వీసా ఫ్రీ టూర్‌కు వివిధ దేశాలు అవకాశమిస్తున్న తరుణంలో విమానయాన సంస్థలు తమ సర్వీసుల్ని పెంచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇందులో ఎయిర్ ఏషియా సంస్థ అగ్రభాగంలో ఉంది. ఈ సంస్థ టైర్–2 నగరాల్లోని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుల్నే టార్గెట్ చేస్తూ కొత్త సర్వీసుల్ని మొదలు పెడుతోంది. -
జగన్ పిటిషన్లో మధ్యంతర ఉత్తర్వులు పొడిగింపు
సాక్షి, అమరావతి: విశాఖ విమానాశ్రయంలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టు విచారణను నిలిపేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు మూడు వారాలు పొడిగించింది. తదుపరి విచారణకు ఇరుపక్షాలు వాదనలు వినిపించేందుకు సిద్ధమై రావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో 2018 అక్టోబర్ 25న విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్‌పై జనుపల్లి శ్రీనివాసరావు హత్యాయత్నం చేయడం తెలిసిందే. పదునైన కత్తితో జగన్ మెడపై దాడికి జనుపల్లి ప్రయత్నించాడు. జగన్ అప్రమత్తంగా ఉండటంతో ఆయన ఎడమ చేయికి గాయమైంది. ఈ ఘటనపై హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్ఐఏ దర్యాప్తు చేసి.. చార్జిషీట్ దాఖలు చేసింది. జగన్‌ను చంపడమే శ్రీనివాసరావు ఉద్దేశమని, అందుకే మెడపై కత్తితో దాడికి ప్రయత్నించాడని చార్జిషీట్లో పేర్కొంది. ముందస్తు పథకంలో భాగంగానే శ్రీనివాసరావు కోడికత్తి సంపాదించాడని, అదును చూసి జగన్‌పై దాడిచేశాడని వివరించింది. దీనివెనుక ఉన్న కుట్ర, ప్రేరణ వ్యవహారాన్ని కూడా తదుపరి దర్యాప్తులో తేలుస్తామని ప్రత్యేక కోర్టుకు తెలిపింది. అయితే తరువాత ఎన్ఐఏ.. కుట్రకోణంపై దృష్టి సారించలేదు. ఎవరి ప్రేరణతో శ్రీనివాసరావు హత్యాయత్నానికి పాల్పడ్డాడో తేల్చలేదు. ఈ నేపథ్యంలో తనపై హత్యాయత్నం వెనుక ఉన్న కుట్రపై లోతైన దర్యాప్తు చేసేలా ఎన్ఐఏను ఆదేశించాలని కోరుతూ జగన్మోహన్రెడ్డి ఈ ఏడాది ఏప్రిల్‌లో విజయవాడ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విజయవాడ కోర్టు కొట్టేసింది. దీన్ని సవాలు చేస్తూ సీఎం జగన్మోహన్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అక్టోబర్‌లో విచారించిన హైకోర్టు.. విశాఖ కోర్టులో జరుగుతున్న విచారణను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఎన్ఐఏను ఆదేశించింది. తాజాగా ఈ వ్యాజ్యంపై హైకోర్టు మంగళవారం మరోసారి విచారించింది. -
విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో డ్రోన్ కెమెరాల కలకలం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ విమానాశ్రయంలో డ్రోన్ కెమెరాలు కలకలం సృష్టించాయి. విదేశీ డ్రోన్ కెమెరాలుగా అధికారులు గుర్తించారు. ఐఎన్ఎస్ డేగా విమానాశ్రయం కలిపి ఉండటంతో రక్షణ శాఖ అప్రమత్తమైంది. ప్రస్తుతం విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో రీ సర్ఫెసింగ్ పనులు కొనసాగుతున్నాయి. డ్రోన్ కెమెరాలను అధికారులు సీజ్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వెనక్కి వచ్చిన ఎయిరిండియా విమానం
గోపాలపట్నం: విశాఖ విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం బయలు దేరిన కొద్ది సేపటికే తిరిగి వచ్చేసింది. ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు విశాఖ నుంచి ఢిల్లీ బయలు దేరిన ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక లోపం కారణంగా సాయంత్రం 6.30 గంటలకు తిరిగి విశాఖ విమానాశ్రయానికి చేరుకుంది. ఈ విమానంలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు అనంత్ నాయక్‌తో పాటు మరో ముగ్గురు సభ్యులు ఉన్నారు. 165 మంది ప్రయాణికులకు విమానాయాన సంస్థ ప్రత్యేక వసతి ఏర్పాట్లు చేసింది. -
ఏది నిజం?: కప్పిపుచ్చడమే..అసలైన కుట్ర!
మొదటి నుంచీ అంతే!!. 2018 అక్టోబర్‌లో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం జరిగిన రోజునే... అటు ‘ఈనాడు’ గానీ... ఇటు తెలుగుదేశం పార్టీ గానీ సిగ్గూ ఎగ్గూ వదిలేశాయి. హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాసరావుపై తన స్వస్థలం ముమ్మిడివరంలో ఎలాంటి కేసులూ లేవంటూ రామోజీరావు తొలిరోజునే సర్టిఫికెట్ ఇచ్చేశారు. కానీ రెండవరోజున అప్పటి వైజాగ్ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. నిందితుడిపై ముమ్మిడివరం పోలీస్‌స్టేషన్‌లో నమోదైన రెండు కేసుల్ని వివరించారు. తప్పనిసరై దాన్ని కూడా ప్రచురించింది ‘ఈనాడు’. ఇక్కడ గమనించాల్సింది... ప్రశ్నించాల్సింది ఒక్కటే. తొలిరోజున ఏ పోలీస్ అధికారీ చెప్పకుండానే... ‘ఈనాడు’ తనంతట తానుగా నిందితుడు శ్రీనివాసరావుపై ఎలాంటి కేసులూ లేవని ఎలా ప్రచురించింది? అసలెందుకు ప్రచురించిందీ వార్త? ఎందుకంటే ఇదంతా రామోజీ, చంద్రబాబు కలిసి ఆడించిన కుట్ర కాబట్టి!. తాజాగా ఎన్ఐఏ వేసిన కౌంటర్‌కు తన సొంత భాష్యం చెబుతూ శుక్రవారం ‘ఈనాడు’ రాసిన వార్త... ఈ కుట్రను మరోసారి స్పష్టంగా బయటపెట్టింది.అంతే!. కోర్టుకు ఎన్ఐఏ సమర్పించిన అఫిడవిట్లో జనిపల్లి శ్రీనివాసరావుపై ముమ్మిడివరం పోలీస్‌స్టేషన్‌లో 2017 మార్చి నెలలో కేసు నమోదు అయినట్లు పేర్కొన్న భాగం జనిపల్లి శ్రీనివాసరావుపై ముమ్మిడివరం స్టేషన్ పరిధిలో ఎలాంటి కేసు నమోదు కాలేదు అంటూ హత్యాయత్నం జరిగిన నాడే ‘ఈనాడు’ రాసిన వార్త.. (ఫైల్) ఏది నిజం ? వాస్తవానికి సంఘటన జరిగిననాడే ‘ఈనాడు’ ఏడెనిమిది వార్తలు వేసింది. అందులో ఒక్కటి మాత్రమే దాడికి సంబంధించినది. మిగిలినవన్నీ ఆ దాడితో తెలుగుదేశానికి సంబంధం లేదంటూ ఎదురుదాడి చేసినవే. ఆ రోజు మొదలు... ప్రతిరోజూ ఈ కేసును తప్పుదోవ పట్టించే వార్తలే. కాకపోతే ఈ కేసును దర్యాప్తు చేసిన ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) 2019 జనవరి 23న దీనిపై ఛార్జిషీట్ వేసింది. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యకు ప్రయత్నించటం వెనక కుట్ర కోణం ఉన్నట్లు ఎన్ఐఏ ఆ ఛార్జిషీట్లో స్పష్టంగా పేర్కొంది. ఆ దిశగా దర్యాప్తు చేయాల్సి ఉందని చెప్పింది. ఇలాంటి సమయంలో న్యాయస్థానాలు అయితే ఆ ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకుని అభియోగాలు నమోదు చేయటం... లేకపోతే తదుపరి దర్యాప్తు కొనసాగించి తుది ఛార్జిషీటు వేయాలని చెప్పటం చేస్తాయి. ఈ కేసులో తదుపరి దర్యాప్తు చేసి తుది ఛార్జిషీటు వేయాలని ఎన్ఐఏకు కోర్టు చెప్పింది. కాకపోతే ఏళ్లు గడుస్తున్నా... ఎన్ఐఏ తుది ఛార్జిషీటు వేయలేదు. ఈ కేసులో కుట్ర కోణం దాగి ఉందని తన తొలి ఛార్జిషీట్లో చెప్పింది కాబట్టి... ఆ కోణాన్ని త్వరగా విచారించి తుది ఛార్జిషీటు వేయాల్సిందిగా ఎన్ఐఏను ఆదేశించాలంటూ పిటిషనర్ వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఆనాడే.. తన స్టేట్మెంట్లో.. వివరంగా తనపై హత్యాయత్నానికి సంబంధించి 2019 జనవరి 17న నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దర్యాప్తు అధికారులకు వాంగ్మూలమిచ్చారు. తనపై హత్యాయత్నం వెనక ఉన్న కుట్ర కోణాన్ని ఆయన బలంగా వినిపించారు. ‘‘నిందితుడెవరో నాకు తెలియదు. కానీ తనను వైఎస్సార్ సీపీ అభిమానిగా చూపించటం, దానికి మద్దతుగా ఒక ఫ్లెక్సీని సృష్టించటం ఇదంతా ఓ పెద్ద కుట్రలో భాగం. ఇదంతా తమకు సంబంధం లేని వ్యవహారంగా చిత్రించడానికి టీడీపీ చేస్తున్న కుట్ర. నా పాదయాత్ర విశాఖలో అడుగుపెట్టిన నాటి నుంచీ హత్యాయత్నం జరిగిన రోజు వరకూ ఎయిర్‌పోర్టులో సీసీ టీవీ కెమెరాలు పనిచేయలేదని నాకు తెలిసింది. పైపెచ్చు నిందితుడికి ఎయిర్‌పోర్టులోని తన ఫ్యూజన్‌ఫుడ్స్ రెస్టారెంట్లో ఉద్యోగమిచ్చిన హర్షవర్దన్ చౌదరి టీడీపీ నాయకుడు. 2014లో గాజువాక టిక్కెట్ కూడా ఆశించారు. నిందితుడు శ్రీనివాసరావుపై ఎలాంటి కేసులూ లేవని అబద్ధపు డిక్లరేషన్ ఇచ్చి మరీ తనను పనిలో పెట్టుకున్నాడు. ‘ఆపరేషన్ గరుడ’ పేరిట టీడీపీ సానుభూతిపరుడైన ఓ నటుడు(శివాజీ) ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఈ కుట్రలో భాగమేననిపిస్తోంది. వీళ్లు చేసే హత్యాయత్నం ఫలిస్తే వీళ్లనుకున్నది జరుగుతుంది. ఒకవేళ బెడిసికొడితే.. గరుడలో చెప్పిందే జరిగిందని వీళ్లే ఎదురుదాడి చేయాలన్నది వ్యూహంగా కనిపిస్తోంది’’ అంటూ అప్పట్లో తన స్టేట్మెంట్లో వివరంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి. మరి దీన్ని ఎన్ఐఏ ఎందుకు సమగ్రంగా విచారించటం లేదు? ఇదే ఇప్పుడు ప్రశ్న. ఇది కుట్ర కాదనగలమా? వైఎస్ జగన్‌పై హత్యాయత్నం చేసిన జానిపల్లి శ్రీనివాసరావు విశాఖపట్నం విమానాశ్రయంలోని రెస్టారెంట్ ఫ్యూజన్ ఫుడ్స్‌లో ఉద్యోగంలో చేరడమే ఈ కుట్రకు నాంది. తదనంతరం జరిగిన పరిణామాలు కుట్రను స్పష్టంగా బయటపెట్టేలా ఉన్నా... ఎన్ఐఏ ఉదాసీనంగా ఉండటమే ఇక్కడ విస్మయం కలిగించే అంశం. ఎందుకంటే జె.శ్రీనివాసరావుకు తన రెస్టారెంట్లో ఉద్యోగమిచ్చేందుకు దాని యజమాని హర్షవర్దన్ చౌదరి అన్ని నిబంధనలనూ తుంగలో తొక్కారు. కట్టుదిట్టమైన భద్రతా వలయంలో ఉండే విమానాశ్రయాల్లో ప్రైవేటు సిబ్బంది నియామకానికి కచ్చి తమైన మార్గదర్శకాలున్నాయి. (హర్షవర్దన్ చౌదరి పాత్రను, తెలుగుదేశంతో ఆయన సంబంధాలను, ఈ కుట్రపై దర్యాప్తు జరగాల్సిన అవసరాన్ని పేర్కొంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచి్చన వాంగ్మూలం.) రెస్టారెంట్, ట్రావెల్ ఏజెన్సీల డెస్క్ లు మొదలైన వాటిలో ప్రైవేటు వ్యక్తులే పని చేస్తారు. అందుకోసమే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించింది. ఆ మార్గదర్శకాల ప్రకారం విమానాశ్రయంలో పనిచేసే వారికి ఎలాంటి నేర చరిత్ర ఉండకూడదు. ఆ విషయాన్ని నిర్ధారిస్తూ నిరభ్యంతర పత్రం(ఎన్వోసీ) ఇస్తేనే ఉద్యోగంలో చేర్చుకోవాలి. నిజానికి జె.శ్రీనివాసరావుపై 2017లో నాటి తూర్పుగోదావరి జిల్లాలోని ముమ్మిడివరంలో ఓ కేసు నమోదైంది. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతోపాటు పోలీసులు చార్జ్‌షీట్ కూడా వేశారు. అంటే అతనికి నేర చరిత్ర ఉన్నట్టే. కానీ అతనిపై ఎలాంటి కేసులూ లేవని ఫ్యూజన్ ఫుడ్స్ యజమాని హర్షవర్ధన్ చౌదరి డిక్లరేషన్ ఇవ్వటం గమనార్హం. ఇంకా శ్రీనివాసరావుపై తమ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎలాంటి కేసులూ లేవని, స్వస్థలంలో ఉన్నాయేమో చూడాలని విశాఖ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ సీఐ ఎన్వోసీ ఇచ్చారు. కానీ స్వస్థలంలో కేసుల గురించి కనుక్కునే ప్రయత్నం ఎవ్వరూ చేయలేదు. దానికితోడు శ్రీనివాసరావుపై ఎలాంటి కేసులూ లేవంటూ హర్షవర్దన్ చౌదరి తన సొంత ఎన్ఓసీ ఇచ్చేశారు. హత్యాయత్నం జరిగిన రోజున రామోజీరావు కూడా శ్రీనివాసరావుపై ఎలాంటి కేసులూ లేవంటూ ‘ఈనాడు’ ద్వారా ఎన్ఓసీ ఇచ్చేశారు. ఇంతటి కీలకమైన అంశంపై ఎన్ఐఏ దృష్టిసారించకపోవటమే పలు అనుమానాలకు తావిస్తోంది. సీసీ టీవీ రికార్డింగులు ఎందుకు కోర్టుకు సమర్పించలేదు ఈ కేసులో విమానాశ్రయంలో సీసీ టీవీ కెమెరాల ఫుటేజీ అత్యంత కీలకం. ఎందుకంటే అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే విమానాశ్రయంలోకి జె.శ్రీనివాసరావు హత్యాయత్నం చేయడానికి వాడిన కత్తిని ఎలా తీసుకువెళ్లారన్నది కీలకం. హత్యాయత్నానికి కంటే కొన్ని రోజుల ముందటి సీసీ టీవీ కెమెరాల రికార్డులను ఎన్ఐఏ ఆ కెమెరాల తయారీదారైన తోషిబా కంపెనీకి పంపించి విశ్లేషించింది. విమానాశ్రయం కిచెన్‌లో ఓ వంటపాత్రలో ఆ కత్తిని వేడిచేస్తున్నట్టుగా ఆ వీడియో క్లిప్పింగుల్లో ఉందని వెల్లడైంది. జె.శ్రీనివాసరావే ఆ కత్తిని వేడి నీటిలో మరిగిస్తున్నట్టుగా వీడియో క్లిప్పింగుల్లో ఉంది. మరి ఆ విషయాన్ని ఎన్ఐఏ ఎందుకు కౌంటర్ అఫిడవిట్లో ప్రస్తావించలేదన్నది ప్రశ్నార్థకంగా మారింది. అంతటి కీలకమైన వీడియో క్లిప్పింగులను న్యాయస్థానానికి కూడా సమర్పించకపోవడం గమనార్హం. నిందితుడి లేఖను కూడాసమర్పించనే లేదు... ఈ కేసులో నిందితుడు జె.శ్రీనివాసరావు రాసిన లేఖ, ఇతర కాపీలను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. వాటిని ఎన్ఐఏకు అప్పగించారు. తనకు ఏమైనా అయితే తన శరీర అవయవాలను దానం చేయాలని అతను రాసినట్టుగా ఉంది. తనకు ఏదైనా అవుతుందని జె.శ్రీనివాసరావు ముందే ఎలా ఊహిస్తారు... ! అంటే ఇదేమీ యాదృచ్చి కంగానో అప్పటికప్పుడు హఠాత్తుగానో జరిగింది కాదన్నది సుస్పష్టం. ముందస్తుగానే కొందరితో కలిసి పన్నిన కుట్ర ప్రకారమే అంతా జరిగిందని... ప్లాన్‌తోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని వెల్లడి కావటంలేదా? మరి అంతటి కుట్ర వెనుక ఎవరున్నారన్నది తెలుసుకోవాల్సిన అవసరం లేదా? నిందితుడు శ్రీనివాసరావు ఫ్యూజన్ ఫుడ్స్ యూనిఫామ్ వేసుకుని, వాటర్ బాటిల్‌తో వీఐపీలాంజ్‌లో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పక్కన నిల్చుని అవకాశం కోసం చూశాడని, అవకాశం దొరికినవెంటనే పదునైన కత్తితో హతమార్చుదామని అనుకున్నాడని.. ఈ క్రమంలోనే జగన్మోహన్రెడ్డి వేగంగా పక్కకు తప్పుకోవటంతో భుజానికి గాయం అయిందని ఛార్జిషీట్లో పేర్కొన్న ఎన్ఐఏ. ఈ కేసులో కుట్ర కోణాన్ని, నిందితుడిని ప్రేరేపించిన పరిస్థితులుంటే వాటిని కూడా దర్యాప్తుచేస్తామని తొలి ఛార్జిషీట్లో కోర్టుకు చెప్పిన ఎన్ఐఏ. దర్యాప్తు ముగియనే లేదు కదా...! అంత ఆతృత ఎందుకు రామోజీ? హత్యాయత్నం వెనక ఉన్న కుట్రకోణాన్ని త్వరగా దర్యాప్తు చేసి తుది ఛార్జిషీటు వేయాల్సిందిగా వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి వేసిన పిటిషన్‌పై ప్రస్తుతం కోర్టు విచారణ జరుగుతోంది. ఈ విచారణలో భాగంగా ఎన్ఐఏను సమాధానమివ్వాలని కోర్టు కోరగా... దీనిపై ఎన్ఐఏ కౌంటర్ వేసింది. ఇది కౌంటర్ మాత్రమే తప్ప తుది ఛార్జిషీటు కాదు. తమ దర్యాప్తు ముగిసిందని కూడా చెప్పలేదు. ఈ కేసులో బాధితుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రస్తావించిన అంశాలను కౌంటర్లో ప్రస్తావించింది. దర్యాప్తు కొనసాగుతోందని చెప్పింది. కానీ దర్యాప్తు ముగిసిపోయినట్లు... ఇక దర్యాప్తు చేసేందుకు ఏమీ లేదని అన్నట్టుగా టీడీపీ అనుకూల పచ్చ మీడియా తెగ హడావుడి చేస్తోంది. నిందితుడు శ్రీనివాసరావు హత్యాయత్నం చేసినట్లు ఎన్ఐఏ ఎప్పుడో చెప్పింది. దానికి కారణాలు తేలాలి. ఆ దిశగా దర్యాప్తు సాగుతోంది. కారణాలు తెలిస్తే కుట్ర కోణమూ బయటపడుతుంది. కాకపోతే దర్యాప్తు కొనసాగుతుండగానే... ఇక కుట్ర కోణమేదీ లేదని ఎల్లో మీడియా తేల్చేసింది. ఎన్నాళ్లగానో తాము చేస్తున్న ప్రయత్నం ఫలించినట్లుగా... ఎన్ఐఏ కౌంటర్‌ను చూసి ఎల్లో మీడియా తెగ సంబరపడిపోయింది. ఎందుకింత ఆత్రం? దర్యాప్తు పూర్తికాకుండానే ఎందుకంత తొందర రామోజీ? ఎల్లో సిండికేట్ తీరే అంత... వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో ప్రజల్ని తప్పుదారి పట్టించడమే లక్ష్యంగా ఎల్లో సిండికేట్ మొదటి నుంచీ వ్యవహరిస్తూ వస్తోంది. ఈ ఘటన జరిగిన వెంటనే అప్పటి డీజీపీగా ఉన్న ఆర్పీ ఠాకూర్ హడావుడిగా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి నిందితుడు జె.శ్రీనివాసరావు వైఎస్సార్సీపీ అభిమాని అని ప్రకటించేశారు. కేవలం సానుభూతి కోసమే ఈ హత్యాయత్నానికిపాల్పడ్డారని బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న డీజీపీ ఏకపక్షంగా ప్రకటించడం అప్పట్లో అందరినీ నివ్వెరపరిచింది. నిజానిజాలు వెలికితీస్తాం అని ప్రకటించాల్సిన ఆయన... చంద్రబాబు డైరెక్షన్ మేరకు అడ్డగోలు అబద్ధాలు చెప్పారు. ఈ కేసు దర్యాప్తు చేసే కిందిస్థాయి పోలీసు అధికారులను ప్రభావితం చేసేందుకే ఆయన అలా ప్రకటించారన్నది సుస్పష్టం. వైఎస్ జగన్‌కు తీవ్రమైన గాయం అయ్యింది. ఆ కత్తి మెడలో దిగి ఉండే ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చేదని వైద్యులు నిర్ధారించారు. పోలీసులు న్యాయస్థానానికి సమర్పించిన నివేదికలో కూడా అదే విషయాన్ని పేర్కొన్నారు. కానీ గాయం చిన్నదే అని నాటి డీజీపీ, చంద్రబాబు, ‘ఈనాడు’ కట్టగట్టుకుని ప్రచారం చెయ్యడాన్ని ఏమనుకోవాలి? మళ్లీ అదే తతంగం ఇక తాజాగా ఎన్ఐఏ కౌంటర్ అఫిడవిట్లో పేర్కొన్న అంశాల విషయంలోనూ ఎల్లో మీడియా ఇదే పంథా ఎంచుకుంది. హత్యాయత్నం వెనక ఎలాంటి రాజకీయ కుట్ర లేదని నిర్ధారణ అయినట్టుగా కథనాలు ప్రచురించి తన దుర్బుద్ధిని చాటుకుంది. ఎన్ఐఏ కౌంటర్ అఫిడవిట్‌లోని అంశాలను సవాల్ చేస్తూ బాధితుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తరపు న్యాయవాది కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. అందుకోసం న్యాయస్థానం గడువు ఇస్తూ కేసు విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది. జగన్ తరపు న్యాయవాది వేసే కౌంటర్లోని అంశాలను న్యాయస్థానం పరిగణలోకి తీసుకున్నాక విచారణ ప్రక్రియ సాగుతుంది. మరోవైపు ఎన్ఐఏ దర్యాప్తు కూడా ఇంకా పూర్తి కాలేదు. తుది నివేదిక రావాలి. ఇవేవీ పట్టించుకోకుండా కేసు దర్యాప్తు ముగిసినట్టే అనే భ్రాంతి కలిగించేలా పచ్చ మీడియా హడావుడి చేస్తుండటమే అసలైన కుట్ర!!. -
సింగపూర్ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా
చోడవరం రూరల్ (అనకాపల్లి జిల్లా): సింగపూర్ నుంచి వచ్చిన వ్యక్తికి విశాఖ విమానాశ్రయంలో జరిపిన కరోనా పరీక్షలో పాజిటివ్ నిర్ధారణ అయింది. వివరాల్లోకి వెళితే... అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలోని జన్నవరం గ్రామానికి చెందిన 33 ఏళ్ల వ్యక్తి సింగపూర్‌లో పనిచేస్తున్నాడు. సెలవు దొరకడంతో ఊరికి వచ్చాడు. ఆదివారం విశాఖ విమానాశ్రయంలో దిగిన ఆయనకు ఎయిర్‌పోర్టులో వైద్య పరీక్షలు జరిపారు. అనంతరం అతడు మండలంలోని జన్నవరానికి, సోమవారం అత్తగారి ఊరైన శ్రీరాంపట్నం వెళ్లాడు. అయితే అతనికి కోవిడ్ నిర్ధారణ అయినట్టు మంగళవారం ఎయిర్‌పోర్టు అథారిటీ వైద్య వర్గాల నుంచి గవరవరం వైద్య కేంద్రానికి సమాచారం అందింది. దీంతో వైద్యాధికారి దమయంతీదేవి సిబ్బంది జన్నవరం, శ్రీరాంపట్నం గ్రామాలకు చేరుకుని సింగపూర్ నుంచి వచ్చిన వ్యక్తి భార్య, పిల్లలు, అత్తమామల పరీక్షలు చేశారు. వీరిలో భార్యకు మాత్రం కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. భార్యాభర్తలిద్దరినీ జన్నవరంలో వారి గృహంలోనే ఐసోలేషన్‌లో ఉంచామని, వారికి వైద్య సేవలు అందిస్తున్నామని వైద్యాధికారి తెలిపారు. జన్నవరం, శ్రీరాంపట్నం గ్రామాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని, ప్రజలు భయపడాల్సిందేమీ లేదన్నారు. చదవండి: భారత్‌లో ఎండెమిక్ స్టేజ్‌కు కరోనా.. అధికారుల కీలక ప్రకటన -
కేసుతో సంబంధం లేని వ్యక్తి పిటిషన్ ఎలా వేస్తారు?
సాక్షి, అమరావతి: విశాఖపట్నం విమానాశ్రయంలో రాష్ట్ర మంత్రులపై దాడి చేసినందుకు విమానాశ్రయ పోలీసులు నమోదు చేసిన రెండు ఎఫ్ఐఆర్లను కొట్టేయాలని కోరుతూ కేసుతో సంబంధం లేని మూడో వ్యక్తి ఎలా పిటిషన్ వేస్తారని హైకోర్టు సందేహం వ్యక్తంచేసింది. ఈ వ్యాజ్యాలను అనుమతిస్తే ఇటువంటివి పెద్ద సంఖ్యలో దాఖలయ్యే ప్రమాదం ఉందని తెలిపింది. కేసులు ఎదుర్కొంటున్న వారు మాత్రమే ఇలాంటి పిటిషన్ దాఖలుకు ఆస్కారం ఉంటుందని తెలిపింది. విచారణార్హతపై స్పష్టత వచ్చిన తరువాతే మధ్యంతర ఉత్తర్వుల జారీని పరిశీలిస్తామంది. అప్పటివరకు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదంది. ఈ మొత్తం వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. విశాఖపట్నంలో జనవాణి నిర్వహణకు పోలీసులకు దరఖాస్తు చేసుకోవచ్చని, అనుమతిని నిరాకరిస్తే హైకోర్టును ఆశ్రయించవచ్చని స్పష్టంచేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జనసేన కార్యకర్తల అరెస్టు, విశాఖ నగరం, ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలో పార్టీ ర్యాలీలు, ఆందోళనలు చేపట్టకుండా విశాఖ ఏసీపీ జారీ చేసిన నోటీసును రద్దు చేయాలని కోరుతూ ఆ పార్టీ ఉపాధ్యక్షుడు బొంగునూరి మహేందర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మంత్రులపై దాడి జరిగిన సందర్భంగా జనసేన నాయకులు, కార్యకర్తలు తన విధులకు ఆటంకం కలిగించారంటూ పెందుర్తి సీఐ నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన కేసును కూడా కొట్టేయాలని ఆయన మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు వ్యాజ్యాలపై జస్టిస్ రాయ్ మంగళవారం విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీ కుమార్ వాదనలు వినిపిస్తూ, జనవాణిని అడ్డుకునేందుకే పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారన్నారు. అధికార పార్టీ మంత్రులు, నేతలే జనసేన కార్యకర్తలను రెచ్చగొట్టారని, వారిపై పోలీసులు కేసులు నమోదు చేయలేదన్నారు. థర్డ్ పార్టీ సైతం ఎఫ్ఐఆర్ల రద్దు కోరవచ్చునని తెలిపారు. ప్రభుత్వ న్యాయవాది (హోం) వేలూరు మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ.. కేసుతో సంబంధం లేని వ్యక్తులు ఎఫ్ఐఆర్ను కొట్టేయాలంటూ పిటిషన్ దాఖలు చేయడానికి వీల్లేదన్నారు. అందువల్ల ఈ వ్యాజ్యాలకు విచారణార్హతే లేదన్నారు. ఇందుకు సంబంధించి తీర్పులను ఆయన కోర్టు ముందుంచారు. విమానాశ్రయం లోపల జరిగే ఘటనలపై సాధారణ పోలీసులు కూడా కేసు నమోదు చేయవచ్చని తెలిపారు. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామన్నారు. -
రివ్వున ఎగిరిపోతున్నారు..
సాక్షి, విశాఖపట్నం: కోవిడ్ సంక్షోభం ఎదుర్కొన్న విమానయాన రంగం క్రమంగా కోలుకుంటోంది. రాష్ట్రంలో విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. తిరుపతి, విశాఖపట్నం ఎయిర్‌పోర్టుల ద్వారా సాగిన ప్రయాణికుల రాకపోకల్లో దాదాపు 50 శాతం వృద్ధి నమోదైంది. గతేడాది అక్టోబర్ నుంచి ఆంక్షలు లేని విమానయానానికి గ్రీన్ సిగ్నల్ లభించడంతో ప్రయాణికుల రాకపోకలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన ఎయిర్‌పోర్టులైన విశాఖ, తిరుపతి, రాజమండ్రి, విజయవాడలలో ప్రతి చోటా వృద్ధి నమోదైంది. 2020–21తో పోలిస్తే.. 2021–22లో సాగిన ప్రయాణికుల రాకపోకలకు సంబంధించి తిరుపతిలో 77 శాతం వృద్ధి నమోదవ్వగా.. విశాఖలో 45 శాతం, రాజమండ్రిలో 35, విజయవాడలో 23 శాతం వృద్ధి నమోదైంది. విశాఖ నుంచి అత్యధికంగా 16.10 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. సర్వీసుల పెంపు, కార్గోలోనూ జోరు.. ప్రయాణికుల రాకపోకల్లోనే కాకుండా.. విమాన సర్వీసులు, కార్గో రవాణాలో కూడా ఎయిర్‌పోర్టులు పుంజుకున్నాయి. సర్వీసుల పెంపులోనూ తిరుపతి 43 శాతంతో ముందంజలో ఉండగా.. విశాఖ 28 శాతం వృద్ధి సాధించి రెండోస్థానంలో నిలిచింది. అత్యధిక విమాన సర్వీసులు నడుస్తున్న ఎయిర్‌పోర్టుగా మాత్రం విశాఖపట్నం మొదటి స్థానంలో నిలిచింది. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ సర్వీసులతో కలిపి విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి 2021–22లో మొత్తం 14,852 విమానాలు రాకపోకలు సాగించాయి. కార్గో సర్వీసుల్లో విశాఖ ఎయిర్‌పోర్టు 13 శాతం వృద్ధితో మొదటిస్థానంలో నిలిచింది. -
Visakhapatnam: ఎయిర్ పోర్టులో ఉత్కంఠ.. విమానం హైజాక్ వేళ..
సాక్షి, గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): విశాఖ విమానాశ్రయంలో యాంటీ–హైజాక్ మాక్ డ్రిల్ ఆద్యంతం ఉత్కంఠ∙రేకెత్తించింది. గురువారం ఎయిర్‌పోర్టు ఐఎన్ఎస్ డేగాలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు. విమానం హైజాక్‌కు గురి కాకుండా ఏ విధంగా అడ్డుకోవాలో ఇక్కడ ప్రదర్శించారు. తమ సామర్థ్యాన్ని పరీక్షించుకునేందుకు ఈ ప్రక్రియ దోహద పడుతుందని అధికారులు తెలిపారు. ఈ మాక్ఎక్సర్సైజ్ మెరైన్ కమాండోలు (మార్కోస్), సెంట్రల్ ఇండస్ట్రీస్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్), ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో నిర్వహించాయి. క్షతగాత్రుల తరలింపు భారత నౌకాదళ డోర్నియర్ ఉపయోగించి రూపొందించిన మాక్ హైజాక్ ఆధారంగా కార్యక్రమం ప్రదర్శించారు. ఐఎన్ఎస్ డేగా కమాండింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఏరోడ్రోమ్ కమిటీ స్టాండ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్‌వోపీఎస్) ప్రకారం మాక్ఎక్సర్సైజ్ కార్యక్రమం చేపట్టారు. డేగా ఏటీసీ, క్విక్ రియాక్షన్ టీమ్ (క్యూఆర్టీ), మెరైన్ కమాండో, సీఐఎస్ఎఫ్, ఏఏఐ, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం త్వరతిగతిన స్పందించే తీరును నేషనల్ సెక్యూరిటీ గార్డు, ఎస్‌వోపీఎస్ అధికారులు పరిశీలించారు. భవిష్యత్తులో సంభవించే ఆకస్మిక పరిస్థితులను ఎదుర్కొనే నైపుణ్యం సామర్థ్యం కలిగి ఉన్నారని నిర్ధారించారు. హైజాక్‌ను ఎదుర్కొనేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్న సైనికులు -
వరుస సర్వీసులతో దూసుకుపోతున్న విశాఖ ఎయిర్పోర్ట్
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో అతి పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయమైన విశాఖ ఎయిర్‌పోర్టు.. వరుస సర్వీసులతో దూసుకుపోతోంది. కోవిడ్ నుంచి కోలుకుని విమాన సర్వీసులను ఒక్కొక్కటిగా పెంచుకుంటూ పోతూ.. హాఫ్ సెంచరీ మార్క్‌కు చేరుకుంది. రాత్రి సమయంలోనూ ఢిల్లీ, బెంగళూరుకు వెళ్లేందుకు మరో రెండు సర్వీసులను ప్రారంభించింది. త్వరలోనే దుబాయ్‌కు కూడా విమాన సర్వీసు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. నౌకాదళ అనుమతులు వస్తే.. జంబో ఫ్లైట్‌గా పిలిచే డ్రీమ్‌లైనర్ సర్వీసు కూడా మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోవిడ్ కారణంగా నిలిచిపోయిన విమాన సర్వీసులు ఒక్కొక్కటిగా ప్రారంభమవుతున్నాయి. దేశీయ విమానాల రాకపోకలు మొదలైన తొలినాళ్లలో ప్రయాణికులు ఆసక్తి చూపకపోవడంతో సర్వీసులు నడిపేందుకు విమానయాన సంస్థలు కూడా ఆలోచనలో పడ్డాయి. విశాఖ విమానాశ్రయం నుంచి ఒకట్రెండు సర్వీసులతో కార్యకలాపాలు మొదలయ్యాయి. క్రమంగా నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సడలించడంతో.. విమాన ప్రయాణం వైపు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. విశాఖ విమానాశ్రయం నుంచి మే లో 143 విమానాలు రాకపోకలు సాగించగా.. ప్రస్తుతం సుమారు 1300 ఫ్లైట్ ఆపరేషన్స్ నడుస్తున్నాయి. మేలో కేవలం 7,989 మంది మాత్రమే ప్రయాణాలు సాగించారు. ఆ తర్వాత నుంచి రాకపోకలు పుంజుకున్నాయి. అక్టోబర్‌లో ఏకంగా సుమారు 1.55 లక్షల మంది విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి ప్రయాణాలు సాగించారు. చదవండి: (ఉద్యోగుల జీతాలు ఎక్కడా ఆగలేదు) హాఫ్ సెంచరీ దాటిన సర్వీసులు 1981లో రోజుకు ఒక విమానం ద్వారా ఇక్కడ పౌర సేవలు ప్రారంభమయ్యాయి. సివిల్ ఎయిర్ క్రాఫ్ట్స్‌లకు 85 రన్ వే కెపాసిటీగా విధించారు. జెట్ ఎయిర్వేస్ ఉన్నప్పుడు 80 విమానాలు రాకపోకలు సాగించాయి. జెట్ ఎయిర్వేస్ సర్వీసులు గతంలో నిలిచిపోవడంతో కోవిడ్‌కు ముందు వరకు 66 విమానాల రాకపోకలు సాగించాయి. కోవిడ్ కారణంగా సర్వీసులన్నీ రద్దయ్యాయి. దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. అన్‌లాక్ ప్రక్రియ తర్వాత క్రమంగా ఒక్కో సర్వీసు పెరుగుతూ వచ్చింది. నెల కిందటి వరకు 36 సర్వీసులతో నడవగా.. ఇప్పుడు ఏకంగా 50 మార్కుకు చేరుకుంది. ఇదే దూకుడు కొనసాగితే రానున్న రెండు నెలల్లో గరిష్ట మార్కు 66కు చేరుకునే అవకాశం ఉందని విమానాశ్రయ వర్గాలు చెబుతున్నాయి. రాత్రి వేళల్లోనూ రాజధానికి ప్రయాణం ఫ్లైట్ ఆపరేషన్లు క్రమంగా పుంజుకుంటున్న నేపథ్యంలో విశాఖ నుంచి బయలుదేరే సర్వీసులు క్రమంగా పెరుగుతున్నాయి. డిసెంబర్ నుంచి తొలిసారిగా తిరుపతికి నేరుగా విమానయానం ప్రారంభం కానుంది. రాత్రి వేళల్లోనూ సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు చాలా నెలల తర్వాత సర్వీసులు ప్రారంభమవుతున్నాయి. విశాఖ నుంచి ఢిల్లీ, బెంగళూరుకు నైట్ సర్వీసులు మొదలయ్యాయి. ఇవి క్రమంగా మిగిలిన ప్రధాన నగరాలకు విస్తరించే అవకాశం ఉందని విమానాశ్రయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అదే విధంగా త్వరలోనే దుబాయ్‌కు విమాన సర్వీసు ప్రారంభం కానుందని వెల్లడించాయి. డ్రీమ్‌లైనర్ కోసం ఎదురుచూపులు ప్రస్తుతం ఉన్న సౌకర్యాల ప్రకారం 300 మంది ప్రయాణికులతో నడిచే భారీ విమానం డ్రీమ్‌లైనర్ తరహా ఫ్లైట్ సర్వీసులను నడిపేందుకు ఎయిర్‌పోర్టు వర్గాలు ఆసక్తిగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న రన్‌వేను మరింత విస్తరిస్తే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవచ్చు. ఇందుకు నౌకాదళం అనుమతి కచ్చితంగా అవసరం. ఎయిర్‌పోర్టు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) మొత్తం నౌకాదళ ఆధీనంలో ఉండటం వల్ల వేచి చూడాల్సి వస్తోంది. ఈ కల నెరవేరే దిశగా అధికారులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇది విజయవంతమైతే విశాఖ వీధుల్లోంచి భారీ విమానం రయ్‌మని దూసుకెళ్లే అవకాశం ఉంది. ఆ రోజు కోసం ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు. చదవండి: ('ఆర్బీకేల్లో' దండిగా ఎరువులు) -
వృద్ధురాలి బ్యాగ్‌లో 13 బుల్లెట్లు
గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): విశాఖ విమానాశ్రయంలో ఒక వృద్ధురాలి బ్యాగ్‌లో 13 బుల్లెట్లు దొరికాయి. విశాఖ నగరానికి చెందిన త్రిపురాణి సుజాత (70) బ్యాగ్‌లో ఈ బుల్లెట్లు లభించినట్లు విమానాశ్రయం పోలీసులు తెలిపారు. హైదరాబాద్ వెళ్లేందుకు మంగళవారం సాయంత్రం విమానాశ్రయానికి వచ్చిన ఆమె బ్యాగ్‌ను స్కానర్‌లో తనిఖీ చేసినప్పుడు ఈ బుల్లెట్లు బయటపడ్డాయని చెప్పారు. ఆమెను ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఏసీపీ శ్రీపాదరావు, సీఐ ఉమాకాంత్ విచారించారు. తమ పాత ఇంట్లో వస్తువులు సర్దానని, ఈ క్రమంలో పాత బ్యాగ్‌లో కొన్ని దుస్తులు పెట్టుకుని హైదరాబాద్ బయలుదేరానని ఆమె తెలిపారు. గతంలో తన పెదనాన్న వేటకు వెళ్లేవారని, ఈ బుల్లెట్లు ఆయనవై ఉంటాయని చెప్పారు. బ్యాగ్‌లో బుల్లెట్లు ఉన్నట్లు తనకు తెలియదని, తనిఖీల్లో బయట పడినప్పుడే చూశానని తెలిపారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. సుజాత చెబుతున్న విషయాల్లో ఎంతవరకు నిజముందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
తేరుకున్న గ్రామాలు
దొండపర్తి (విశాఖ దక్షిణ)/వంగర/విజయనగరం/సీతానగరం/మునగపాక: గులాబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చేపట్టిన సహాయక చర్యలతో ముంపు గ్రామాలు పూర్తిగా తేరుకున్నాయి. రెండు రోజులుగా పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న వారు ఇళ్లకు చేరుతున్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో సరఫరాను 98 శాతం వరకు పునరుద్ధరించారు. విశాఖ విమానాశ్రయంలోకి చేరిన వరద నీటిని మళ్లించడంతో కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. తుపాను ప్రభావంతో విశాఖ జిల్లాలోని 30 మండలాల్లో 244 గ్రామాలు జలమయం కాగా.. మంగళవారం నాటికి 95 శాతం గ్రామాలు ముంపు నుంచి పూర్తిగా తేరుకున్నాయి. లోతట్టు ప్రాంత ప్రజల కోసం 28 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 10,512 మందిని తరలించగా.. గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనడంతో 8,352 మంది తిరిగి ఇళ్లకు వెళ్లిపోయారు. ప్రస్తుతం 2,160 మంది మాత్రం పునరావాస కేంద్రాల్లో ఉన్నారు. జిల్లాలో 12 సబ్స్టేషన్లు దెబ్బతినగా వాటిని పునరుద్ధరించారు. 198 వీధి దీపాలు ధ్వంసం కాగా.. మరమ్మతులు పూర్తిచేశారు. జిల్లాలో అనేక ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడగా.. 74 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పునరుద్ధరించారు. పాడేరు ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండ చరియలు, నేలకొరిగిన భారీ వృక్షాలను తొలగించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేశారు. పరవాడ మండలం లంకెలపాలెంలో వరద ప్రవాహానికి ఏలేరు కాలువ వంతెన వద్ద రోడ్డు కోతకు గురైంది. అధికారులు అక్కడకు చేరుకుని తాత్కాలిక మరమ్మతులు చేయించి లంకెలపాలెం, పరవాడ గ్రామాల మధ్య ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. విశాఖలో జాతీయ రహదారి పక్కన మురుగు కాలువల్లో పూడిక తొలగిస్తున్న సిబ్బంది శ్రీకాకుళంలో ముమ్మరంగా సహాయక చర్యలు శ్రీకాకుళం జిల్లాలో తుపాను ప్రభావానికి గురైన ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నదీ పరీవాహక ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సేవలందిస్తున్నాయి. వంగర మండలంలోని మడ్డువలస గొర్లె శ్రీరాములు నాయుడు ప్రాజెక్టును వరద ముంచెత్తింది. ఫలితంగా సోమవారం అర్ధరాత్రి కొప్పర, కొండచాకరాపల్లి, గీతనాపల్లి గ్రామాలు నీటమునిగాయి. కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ ప్రాజెక్టును పరిశీలించారు. ఎస్పీ అమిత్ బర్దార్ డ్రోన్ కెమెరాల సాయంతో వరద గ్రామాల్లో పరిస్థితిని సమీక్షించారు. నాగావళి ఉగ్రరూపంతో అంపిలి, అన్నవరం, గోపాలపురం, చిన్నమంగళాపురం గ్రామాల్లో వరద నీరు చేరింది. అధికారులు గ్రామాల్లో పర్యటించి పరిస్థితిని అంచనా వేశారు. బాధిత కుటుంబాలకు ఆహార పొట్లాలను అందజేశారు. కోలుకుంటున్న విజయనగరం తుపాను దెబ్బ నుంచి విజయనగరం జిల్లా ప్రజలు కోలుకుంటున్నారు. మంగళవారం సాయంత్రానికి చాలా గ్రామాల్లో విద్యుత్ సరఫరా ఇవ్వగలిగారు. మరోవైపు తుపాను బాధితులకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 24 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 1,205 మందికి వసతి, భోజన సదుపాయాలు కల్పించారు. రోడ్లకు అడ్డంగా పడిన చెట్లను పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, స్థానికులు కలిసి తొలగిస్తున్నారు. వరద ఉధృతి తగ్గుతుండటంతో పంట నష్టాల గణన వేగవంతమైంది. కలెక్టర్ ఎ.సూర్యకుమారి, జేసీలు కిశోర్‌కుమార్, మహేష్‌కుమార్‌లు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. మరోవైపు ఎంపీ బెల్లాన చంద్రశేఖరరావు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, అలజంగి జోగారావు, శంబంగి వెంకటచిన అప్పలనాయుడు, బొత్స అప్పలనర్సయ్య తదితరులు రైతులు, ప్రజల దగ్గరకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు. గొర్రెల కాపరి సురక్షితం విజయనగరం జిల్లా సీతానగరం మండల పరిధిలోని కొత్తవలస ఆనకట్ట దిగువన గల మెట్టపైకి గొర్రెలను తోలుకెళ్లిన దుక్క సింహాచలం సువర్ణముఖి నది ప్రవాహం మధ్య సోమవారం చిక్కుకుపోయిన విషయం విదితమే. అతడిని అర్ధరాత్రి దాటాక విశాఖపట్నం నేవీ సిబ్బంది హెలికాప్టర్ సాయంతో ఒడ్డుకు చేర్చారు. గోడకూలి వృద్ధురాలి దుర్మరణం విశాఖ జిల్లా మునగపాక మండలం పల్లపు ఆనందపురం గ్రామానికి చెందిన వృద్ధురాలు కర్రి జోగులమ్మ (65) అనే వృద్ధురాలిపై మంగళవారం ఉదయం పక్కింటి గోడ కూలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. రెండు రోజులపాటు భారీ వర్షాలకు గోడ తడిసిపోవడంతో ఈ ఘటన జరిగింది. గోదావరి పరవళ్లు కొవ్వూరు: ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి నదిలోకి భారీగా వరద నీరు వస్తోంది. ధవళేశ్వరం ఆనకట్ట నుంచి 4,43,330 క్యూసెక్కులను దిగువకు విడిచిపెడుతున్నారు. బుధవారం సాయంత్రానికి 8 లక్షల క్యూసెక్కులకు వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువ ప్రాంతంలో నీటిమట్టాలు పెరుగుతుండంతో ధవళేశ్వరం వద్ద వరద ఉధృతి అధికమైంది. అక్టోబర్ నెలాఖరున గోదావరికి ఈ స్థాయి వరద రావడం ఇదే ప్రథమం. 2005 అక్టోబర్ 21 తర్వాత ఇప్పుడే ఈ సమయంలో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. -
కేంద్ర మంత్రికి ‘ఉక్కు’ నిరసనల సెగ
సాక్షి, విశాఖపట్నం: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో ‘ఉక్కు’ ఉద్యమ సెగ తగిలింది. 150 రోజులకు పైగా ఉద్యమం చేస్తున్నా.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకే కేంద్రం కట్టుబడిన నేపథ్యంలో కేంద్ర మంత్రి పర్యటన ఉద్రిక్తంగా మారింది. శుక్రవారం సాయంత్రం విశాఖ ఎయిర్‌పోర్టుకు కేంద్ర మంత్రి చేరుకోక ముందు నుంచే ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ప్రతినిధులు, స్టీల్ ప్లాంట్ కార్మికులు పెద్ద ఎత్తున విమానాశ్రయ పరిసరాలకు చేరుకున్నారు. పోలీసులు అప్రమత్తమై ముందస్తు భద్రత ఏర్పాటు చేశారు. సీఐఎస్ఎఫ్, కేంద్ర బలగాలు కూడా ఎయిర్‌పోర్టు లోపల పహారా కాశాయి. ఎయిర్ పోర్టులోకి వచ్చే వాహనాల్ని తనిఖీ చేసి.. అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఉద్యమకారులు భారీ సంఖ్యలో ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీస్ బలగాలు వారిని నిరోధించేందుకు ప్రయత్నించడంతో స్వల్ప పెనుగులాట జరిగింది. నిర్మలా సీతారామన్ గో బ్యాక్, విశాఖ ద్రోహి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యల్ని తక్షణమే ఉపసంహరించుకోవాలంటూ పెద్ద ఎత్తున నినదిస్తూ.. విమానాశ్రయ రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు అప్రమత్తమై వందల మంది ఆందోళనకారుల్ని అరెస్ట్‌చేసి నగరంలోని వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు. కొంతమంది ఉద్యమకారులు పోలీస్ వలయాన్ని దాటుకుంటూ.. విమానాశ్రయం లోపలికి చొచ్చుకెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉక్కు ఆందోళనకారులు ఎయిర్‌పోర్టు వైపు వస్తున్న తరుణంలో.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బయటికి రావడంతో ఆమె కాన్వాయ్‌ని అడ్డుకోకుండా భద్రతా బలగాలు ఉద్యమకారులను నిలువరించాయి. సీతారామన్ ఎయిర్‌పోర్టు నుంచి బయటికి వెళ్లేంత వరకూ విమానాశ్రయ పరిసర ప్రాంతాలన్నింటినీ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి ఆమె బస చేస్తున్న పోర్టు గెస్ట్ హౌస్ వరకూ ఎక్కడా ఎలాంటి ఆటంకం కలగకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. -
నేడు గన్నవరం ఎయిర్‌పోర్టు రన్‌వే ప్రారంభం
విమానాశ్రయం (గన్నవరం): కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్‌పోర్టులో భారీ విమానాల రాకపోకల కోసం కొత్తగా విస్తరించిన రన్‌వే గురువారం నుంచి వినియోగంలోకి రానుంది. ఇందుకోసం ఎయిర్‌పోర్టు అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. 2017 జనవరి 12న ట్రాన్సిట్ టెర్మినల్‌ను ప్రారంభించడంతో పాటు తొలిదశ రన్‌వే విస్తరణ ప్రాజెక్టుకు కేంద్రం శ్రీకారం చుట్టింది. సుమారు రూ.100 కోట్లతో ప్రస్తుతమున్న 2,286 మీటర్ల రన్‌వేను.. 45 మీటర్ల వెడల్పు, 1,074 మీ. పొడవున విస్తరించారు. దీంతో రన్‌వే పొడవు 3,360 మీటర్లకు చేరుకుంది. తద్వారా రాష్ట్రంలోనే అతిపెద్ద రన్‌వే కలిగిన ఎయిర్‌పోర్ట్‌గా గన్నవరం ఎయిర్‌పోర్టు గుర్తింపు సాధించింది. తర్వాతి స్థానంలో 3,048 మీ. పొడవుతో విశాఖ ఎయిర్పోర్ట్ ఉంది. గన్నవరంలోని కొత్త రన్ వేపై బోయింగ్ బీ747, బీ777, బీ787, ఎయిర్‌బస్ ఎ330, ఎ340, ఎ350 వంటి భారీ విమానాలు రాకపోకలు సాగించవచ్చు. రన్‌వే విస్తరణతో పాటు ఐసొలేషన్ బే, ట్యాక్సీ వే, లింక్ ట్యాక్సీ ట్రాక్, రెండు వైపుల రన్‌వే ఎండ్ సేఫ్టీ ఏరియా, లైటింగ్, బౌండరీ వాల్ పనులను ఎయిర్పోర్ట్ అధికారులు పూర్తి చేశారు. వాస్తవానికి ఎయిర్పోర్ట్ రన్‌వే విస్తరణ పనులు రెండేళ్ల క్రితమే పూర్తయ్యాయి. కానీ పలు సెక్యూరిటీ కారణాల వల్ల డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి అనుమతులు రావడంలో జాప్యం జరిగింది. ఈ నెల 15 నుంచి వినియోగంలోకి తీసుకువచ్చేందుకు డీజీసీఏ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. -
ఏపీలో ప్రారంభమైన విమాన సర్వీసులు
-
ఏపీలో ప్రారంభమైన దేశీయ విమాన సర్వీసులు
సాక్షి, విజయవాడ/విశాఖపట్నం : రెండు నెలల విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం ఉదయం నుంచి దేశీయ విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. గన్నవరం, విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌ల నుంచి రాకపోకలు ప్రారంభం కావడంతో ప్రయాణికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరకుంటున్నారు. ఎయిర్‌పోర్ట్‌లకు చేరకున్న ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్, శానిటైజేషన్ చేసిన తర్వాత అధికారులు లోనికి అనుమతిస్తున్నారు. ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. సిబ్బంది కూడా ప్రత్యేక రక్షణ దుస్తులు ధరించి విధులకు హాజరయ్యారు. గన్నవరం నుంచి బెంగళూరు, ఢిల్లీ, చెన్నైలకు, విశాఖ నుంచి బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్‌లకు మధ్య విమాన సర్వీసులు నడవనున్నాయి. (చదవండి : 630 విమానాలు రద్దు) ఇప్పటికే బెంగళూరు నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు ఒక విమానం చేరకుంది. ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ప్రయాణికులకు అధికారులు ప్రత్యేక బస్సుల్లో తరలిస్తున్నారు. ప్రయాణికులు రెండు గంటల ముందుగానే విమానాశ్రయానికి చేరుకోవాలని గన్నవరం ఎయిర్పోర్ట్ డైరెక్టర్ మధుసూదన్‌రావు సూచించారు. మరోవైపు ఇండిగో విమానంలో బెంగళూరు నుంచి విశాఖకు 114 మంది ప్రయాణికులు చేరుకున్నారు. ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రత్యేక కేంద్రాలకు తీసుకెళ్లి స్క్రీనింగ్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. స్వాబ్ కలెక్షన్ తర్వాత వారిని హోం క్వారంటైన్‌కు తరలించనున్నారు. కాగా, దేశంలోని పలు ఎయిర్‌పోర్ట్‌లలో సోమవారం నుంచే దేశీయ విమానాల రాకపోకలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. -
విమానాలు రెడీ
-
చినబాబు చిరుతిండి రూ.25 లక్షలండి!
సాక్షి ప్రతినిధి. విశాఖపట్నం: సహజంగా వీవీఐపీలు, వీఐపీలు ప్రయాణ సమయాల్లో విమానాశ్రయానికి వచ్చినప్పుడు ఫ్లయిట్ టేకాఫ్‌కు సమయముంటే వీఐపీ లాంజ్‌లో కాసేపు సేద తీరతారు. అలాగే ఫ్లయిట్ దిగినప్పుడు ఐదు, పది నిమిషాల పాటు తమను కలిసేందుకు వచ్చిన ప్రముఖులతో భేటీ అవుతారు. ఆ సందర్భంగా టీ, కాఫీ, స్నాక్స్ తీసుకోవడం సహజం. ఆ మేరకు సర్వ్ చేసి.. ఎయిర్‌పోర్ట్‌లో సదరు రెస్టారెంట్లు ఇచ్చిన బిల్లులను జిల్లా ప్రొటోకాల్ అధికారులు చెల్లిస్తారు. ఇదంతా ఎక్కడైనా సాధారణమే. కానీ గత ఐదేళ్ళలో విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబునాయుడు, ఈయన అకౌంట్లోనే తనయుడు లోకేష్‌బాబులు టీ, కాఫీ, స్నాక్స్ కోసం చేసిన ఖర్చు అక్షరాలా పాతిక లక్షల రూపాయలు. ఔను.. మీరు చదివింది కరెక్టే.. టీడీపీ నేతలు, అప్పటి మంత్రులతో సహా వారిద్దరూ వచ్చినప్పుడు మొత్తంగా అయిన ఖర్చు పాతిక లక్షలని తేల్చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి 2016 వరకు దాదాపు రూ.12లక్షల బిల్లులను అప్పటి అధికారులు ఎయిర్‌పోర్ట్‌లోని ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్‌కు చెల్లించారు. ఇక 2017 నుంచి 2019 మే 31 వరకు అయిన మొత్తం 13,44,484 రూపాయలు. ఈ బిల్లును మాత్రం పెండింగ్‌లో ఉంచారు. ఆ బిల్లు చెల్లించాలంటూ ఫ్యూజన్ ఫుడ్స్ యాజమాన్యం అధికారులను సంప్రదిస్తూ వస్తోంది. కానీ అన్నేసి లక్షల బిల్లులు ఎలా చెల్లించాలో అర్ధం కాక ప్రస్తుత జిల్లా అధికారులు తలలు పట్టుకుంటున్నారు. లోకేష్ బిల్లూ...బాబు అకౌంట్లోనే సహజంగా సీఎం ప్రొటోకాల్‌తో పోలిస్తే మంత్రి ప్రొటోకాల్ తక్కువే ఉంటుంది. కానీ గత టీడీపీ హయాంలోని ఐదేళ్ళలో ఎయిర్‌పోర్ట్‌కు చంద్రబాబు తనయుడు లోకేష్ వచ్చినా బాబుకిచ్చే ప్రొటోకాల్‌నే అనుసరించిన అప్పటి అధికారులు ఆ మేరకు టీ. కాఫీ, స్నాక్స్ బిల్లులను కూడా ఇబ్బడిముబ్బడి చేసేశారు. మొత్తంగా చంద్రబాబు కంటే లోకేష్‌బాబు వచ్చినప్పుడే బిల్లులు భారీ స్థాయిలో అయ్యేవని తేలింది. -
విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో తెలుగు తమ్ముళ్ల ఓవరాక్షన్
-
విశాఖ నుంచి సింగపూర్‌కి నేరుగా విమానాలు
సాక్షి, విశాఖ : విశాఖలోని ఓ ప్రైవేట్ హోటల్ లో సింగపూర్ టూరిజం బోర్డు అధికారులు, స్కూట్ ఎయిర్ లైన్స్ ప్రతినిధులతో విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అక్టోబర్ 27 నుంచి వారంలో అయిదు రోజులు నేరుగా విశాఖ నుంచి సింగపూర్ కి విమానాలు నడపనున్నట్లు స్కూట్ ఎయిర్ లైన్స్ సంస్థ ప్రకటించింది. మంగళవారం, గురువారం మినహా మిగిలిన అయిదు రోజుల పాటు సర్వీసులు కొనసాగనున్నాయని అధికారులు తెలిపారు. ఈ విమానం సింగపూర్‌లో రాత్రి 8.45 నిమిషాలకి బయలుదేరితే రాత్రి 10 గంటలకి విశాఖకు చేరుకోనుందని,( భారత కాలమాన ప్రకారం నాలుగు గంటల ప్రయాణం)విశాఖలో రాత్రి 11 గంటలకి బయలుదేరితే, సింగపూర్‌కి తెల్లవారుజామున 5.45 కి చేరుకోనుందని వెల్లడించారు. ఈ సమావేశంలో మంత్రితోపాటు సింగపూర్ టూరిజం బోర్డు ప్రతినిధులు శ్రీధర్, లిమ్ సి టింగ్, పూజ, బ్రియాన్ టోరే, భరత్, నితిన్, కె.విజయ్ మోహన్, టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోషియేషన్ అధ్యక్షుడు నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు -
రెరా ముద్ర ఉన్నదే ‘రియల్’ ఎస్టేట్
న్యూఢిల్లీ : రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) వద్ద రిజిస్టర్ కాకుండా ఏ బిల్డరైనా, ప్రమోటరైనా ఫ్లాట్లు, భవనాలు, ఇంకా ఏ రకమైన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టును కూడా విక్రయించడానికి వీల్లేదని గృహనిర్మాణ శాఖ సహాయ మంత్రి హర్దీప్ సింగ్ పురీ బుధవారం రాజ్యసభలో స్పష్టం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. రియల్ ఎస్టేట్(రెగ్యులేషన్, డెవలప్మెంట్) చట్టం 2016 ప్రకారం రెరా వద్ద రిజిస్టర్ చేసుకోకుండా ఏ బిల్డరు, ఏ ప్రమోటర్.. తమ వెంచర్లను ప్రచారం చేసుకోవడం, బుక్ చేసుకోవడం, విక్రయించడం వంటి కార్యకలాపాలు ఎట్టి పరిస్థితుల్లోను అనుమతించబడవని ఆయన తెలిపారు. రెరా చట్టం అమల్లోకి వచ్చిన నాటికే నిర్మాణంలో ఉండి ప్రాజెక్టు పూర్తయినట్టుగా జారీ చేసే ధ్రువీకరణ పత్రం పొందని బిల్డర్లు మూడు నెలల వ్యవధిలోగా తమ ప్రాజెక్టును రెరా వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉందన్నారు. రెరా వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోని బిల్డర్లు, ప్రమోటర్లు.. రెరా ఆదేశాలు, మార్గదర్శకాలను అత్రికమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. అలాంటి వారికి రెరా చట్టంలోని సెక్షన్ 59 కింద మూడేళ్ల జైలు శిక్ష లేదా ప్రాజెక్టు అంచనా వ్యయంలో పదిశాతం జరిమానా విధించే నిబంధన ఉన్నట్టు ఆయన చెప్పారు. రెరా వద్ద రిజిస్టర్ కాని బిల్డర్ల వద్ద ఫ్లాట్లు కొన్న వినియోగదారులకు ఏవైనా సమస్యలు ఎదురైతే తగిన ఫోరంలో ఫిర్యాదు చేసి చట్టపరంగా వారి హక్కులను పరిరక్షించుకోవచ్చని తెలిపారు. దేశంలో ఎన్ని గృహ నిర్మాణ ప్రాజెక్టులు రెరా వద్ద రిజిస్టర్ అయ్యాయనే వివరాలను తమ మంత్రిత్వ శాఖ సేకరించిందని పేర్కొన్నారు. రెరా వ్యవస్థను ప్రతి రాష్ట్రం ఏర్పాటు చేస్తుంది కనుక.. ఆ వివరాలన్నీ ఆయా రాష్ట్రాల రెరా వద్దే లభ్యమవుతామని వెల్లడించారు. వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో ఉపందుకున్న కార్గో రవాణా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి కార్గో రవాణా గణనీయంగా పెరిగినట్టు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి హర్దీప్ సింగ్ పురీ బుధవారం రాజ్యసభలో ప్రకటించారు. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి 2017-18లో 257 మెట్రిక్ టన్నుల సరుకులు రవాణా కాగా, 2018-19 నాటికి అది 669 టన్నులకు చేరినట్లు తెలిపారు. ప్రస్తుతం విశాఖ ఎయిర్‌పోర్ట్‌లోని కార్గో హ్యాండ్లింగ్ కాంప్లెక్స్ ఏడాదికి 20 వేల మెట్రిక్ టన్నుల రవాణా సామర్థ్యం కలిగి ఉందన్నారు. ఎయిర్ కార్గో రవాణా కార్యకలాపాలను మరింతగా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అయా రాష్ట్ర ప్రభుత్వాలు, ఎయిర్‌లైన్స్ సర్వీసులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. 2017లో విశాఖలో అంతర్జాతీయ ఎయిర్ కార్గో టెర్మినల్ ప్రారంభించినట్టు గుర్తుచేశారు. ఈ టెర్మినల్ కార్యనిర్వహణ యాజమాన్యాన్ని ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్‌కు అప్పంగించడం జరిగిందన్నారు. 558 చ.మీ ప్రాంతంలో విస్తరించి ఉన్న ఈ టెర్మినల్‌లో కార్గో రవాణా నిమిత్తం లోడింగ్, అన్లోడింగ్ కోసం ట్రక్ డాక్ ఏరియా, తనిఖీలు చేపట్టే హాలు, స్ట్రాంగ్ రూమ్, కోల్డ్ స్టోరేజ్, ప్రమాదకరమైన సరుకు నిల్వచేసే షెడ్ వంటి సౌకర్యాలను కల్పించినట్టు తెలిపారు. -
ఎవరైతే మాకేంటి.. రూల్ రూలే.!
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): విశాఖ విమానాశ్రయంలో ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా విమానాశ్రయ భద్రతా సిబ్బంది కఠినంగా వ్యవహరించక తప్పడం లేదు. ఇక్కడ వీఐపీలు, వీవీఐపీల పేరిట ఇష్టానుసారంగా కార్లు పార్కింగ్ చేసిన వారు అపరాధ రుసుం చెల్లించాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. విమానాశ్రయ డైరెక్టర్ ప్రకాష్‌రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం భద్రతా సిబ్బందితో అధికారులు చర్యలు చేపట్టారు. విమానాశ్రయం ముందు పార్కింగ్ చేసిన వారి వాహనాలకు కళ్లాలు వేశారు. దీంతో ఆ కార్లను డ్రైవర్లు స్టార్ట్ చేసినా.. ముందుకు కదలలేదు. ఇదేంటని వెతికితే బెట్లు కట్టిన కార్ల చక్రాలకు చట్రాలు బిగించేసి ఉన్నాయి. ఇలా నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ చేసిన చాలా వాహనాలకు రూ. 3 వేల నుంచి రూ.5వేల వరకు జరిమానా విధించారు. ఓ తెలుగు మహిళా నాయకురాలు కారుకు ఎంపీ స్టిక్కర్ అతికించుకుని వస్తే అదేదో ఎంపీ కారని భద్రతా సిబ్బంది భావించారు. అయితేనేం నిబంధనలకు వ్యతిరేకంగా పార్కింగ్ చేశారని ఆ కారు చక్రానికి తాళం వేసేశారు. రూ.3 వేలు చెల్లిస్తే గానీ కదలనీయలేదు. మరో చోట ఓ పోలీసు అధికారి వెంట వచ్చిన మరో వ్యక్తి కారును జరిమానా వేశారు. ఇలా.. విమానాశ్రయంలో పార్కింగ్ క్రమబద్ధీకరణ కట్టుదిట్టం చేయడానికి నిర్మోహమాటంగా భద్రతా సిబ్బంది చర్యలు చేపడుతున్నారు. -
కన్నుచేరేసిన కెమెరాలు
విశాఖ విమానాశ్రయంలో భద్రత డొల్లతనం బట్టబయలైంది. సీఐఎస్ఎఫ్, నేవీ, రాష్ట్ర పోలీసుల నిఘా ఉన్న ప్రాంతంలో భద్రతా ప్రమాణాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్న ఘటనతో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న వాస్తవాలు నివ్వెర పరుస్తున్నాయి. సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలోని అంతర్జాతీయ విమానాశ్రయం రక్షణ శాఖ అధీనంలోని తూర్పు నావికాదళం పర్యవేక్షణలో ఉంటుంది. దేశంలోనే నేవీ, పౌర విమానాశ్రయాలు కలిసి ఒకే చోట ఉన్న ఏకైక విమానాశ్రయం ఇదే. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) కట్టుదిట్టమైన భద్రత, నేవీ నిరంతర నిఘా, రాష్ట్ర పోలీసుల బందోబస్తు కల్గిన ఈ విమానాశ్రయంలో భద్రతా ప్రమాణాలు ఏమాత్రం బాగోలేదంటూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్న ఘటనతో విశాఖ ఎయిర్‌పోర్టులో భద్రత డొల్లతనం బట్ట బయలుకాగా, ఇదే కేసులో తాజాగా హైకోర్టు చేసి న వ్యాఖ్యలు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అత్యంత కట్టుదిట్టమైన భద్రత వలయం కలిగిన ఎయిర్‌పోర్టులో ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం జరగడం దేశప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. విశాఖ ఎయిర్ పోర్టులో ఓ పక్క పౌర విమానాశ్రయం.. దానికి ఆనుకునే మరో పక్క ఐఎన్ఎస్ డేగా(నేవీ ఎయిర్‌పోర్టు) ఉంటాయి. డేగాలో వేల కోట్ల విలువైన మిగ్‌లు, చేతక్ హెలీకాప్టర్లు, ఎయిర్ క్రాఫ్ట్‌లు ఉంటాయి. ఒక్క పీ–8ఐ నిఘా విమానం ఖరీదు వేల కోట్లలో ఉంటుంది. పైగా రాత్రి పగలనే తేడా లేకుండా ఏటా లక్షలాది మంది ప్రయాణికులు.. వేలాది మంది పర్యాటకులు.. వందలాది మంది వీఐపీలు, వీవీఐపీలు దేశవిదేశాలకు రాకపోకలు సాగించే ప్రాంతంలో జరిగిన హత్యాయత్న ఘట న నిఘా వైఫల్యాన్ని ఎత్తు చూపింది. హత్యాయత్నం ఉదంతానికి సంబంధించి కీలకమైన సీసీ ఫుటేజీ ఏమైందన్న ప్రశ్న తలెత్తగానే అబ్బే దేశ వ్యాప్తంగా ఏ ఎయిర్ పోర్టుల్లోనూ వీఐపీ లాంజ్ల్లో సీసీ కెమెరాలు ఉండవని ఎయిర్‌పోర్టు అథా రిటీ ఆఫ్ ఇండియా అధికారులు ప్రకటించి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేశారు. పైగా విశాఖ ఎయిర్ పోర్టులో 200కు పైగా సీసీ కెమెరాలున్నాయని చెప్పుకొచ్చిన అధికారులు అవి బాగానే పని చేస్తున్నాయంటూ మీడియాను ఏమార్చారు. ఘట న జరిగిన రోజు నాటి సీసీ ఫుటేజినే కాదు.. విశా ఖ ఎయిర్‌పోర్టు నుంచి వై.ఎస్.జగన్ రాకపోకలు సాగిస్తున్న గడిచిన మూడు నెలల నాటి సీసీ ఫుటేజిని, అలాగే నిందితుడు శ్రీనివాసరావు ఫ్యూజన్ ఫుడ్స్‌లో చేరిన జనవరి నెల నుంచి కూడా సీసీ ఫుటేజ్‌ను సేకరించి ఐదుగురు నిపుణులతో విశ్లేషిస్తున్నామంటూ స్వయంగా సిట్ అధికారులు ప్రకటించి ప్రజలను తప్పుదారి పట్టించారు. ఈ కేసులో కుట్ర కోణాన్ని దాచిపెట్టినట్టుగానే సీసీ కెమెరాలు పనిచేయడం లేదన్న వాస్తవాన్ని కూడా దాచిపెట్టా రు. కానీ చివరికి హైకోర్టు నిలదీయడంతో సిట్ అధికారులు అసలు విషయాన్ని బయటపెట్టారు. గడిచిన మూడు నెలలుగా ఎయి ర్ పోర్టులో ఏ ఒక్క సీసీ కెమెరా పనిచేయడం లేదని, మా వద్ద సీసీ ఫుటేజ్ లేనేలేదని అంగీకరించడం చూస్తుంటే సిట్ దర్యాప్తు ఏ విధంగా సాగుతుందో ఇట్టే అర్థమవుతోంది. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో విశాఖ ఎయిర్ పోర్టును ఆధునికీకరించారు. రూ.100 కోట్లతో నూతన టెర్మినల్‌ను నిర్మించారు. ఆ తర్వాత 2014లో సంభవించిన హుద్‌హుద్‌కు రూ.65 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు లెక్కతేల్చినా ఆ తర్వాత తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టారు. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం కల్గిన ఆధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. హైవే మొదలుకొని ప్రయాణికులు విమానం ఎక్కే లేడర్ వరకు అడుగడుగునా సీసీ కెమెరాలు కన్పిస్తాయి. ఎయిర్‌పోర్టు లాంజ్‌లోని ఫ్రీ జోన్, సెక్యురిటీ హోల్డ్ ఏరియా(ఎస్హెచ్ఏ), బోర్డింగ్ చాంబర్లలోనే కాదు.. చివరకు రెస్టారెంట్లు, కారిడార్, ఇతర వాణిజ్య ప్రాంతాలతో పాటు ఎయిర్ పోర్టు చుట్టూ సీసీ కెమెరాలు దర్శనమిస్తుంటాయి. ఈ సీసీ కెమెరాల్లోని ఫుటేజ్‌ను 24 గంటలూ పర్యవేక్షించేందుకు వీలుగా ప్రత్యేక యంత్రాంగాన్ని నియమించాలి. సీఐఎస్ఎఫ్ పర్యవేక్షణలో పనిచేసే ఈ సిబ్బంది షిఫ్ట్‌ల వారీగా సీసీ కెమెరాల్లో ప్రయాణికులు, సిబ్బంది కదలికలు ఎప్పటికప్పుడు పరిశీలించాలి. అత్యంత నిఘా ఉండాల్సిన ఎయిర్‌పోర్టులో సీసీ కెమెరాలు పని చేయడం లేదంటూ సాక్షాత్తు హైకోర్టులోనే అధికారులు అంగీకరించడం చూస్తుంటే పర్యాటకులు, వీఐపీలు, వీవీఐపీల భద్రత విషయంలో ఎంత ఉదాశీనంగా ఉన్నారో అర్థమవుతోంది. ఈ ఎయిర్‌పోర్టు మీదుగా తాను రాకపోకలు సాగించానని, అక్కడ భద్రత ప్రమాణాలు ఏమాత్రం బాగోలేవంటూ సాక్షాత్తు హైకోర్టు చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించడం విశాఖ విమానాశ్రయంలో భద్రతా వైఫల్యం ఎంత దారుణంగా ఉందో మరోసారి తేటతెల్లమైంది. సీసీ కెమెరాల ఫుటేజీ విషయాన్ని ఇన్నాళ్లు బయటకు పొక్కనీయకుండా దాచిపెట్టిన సిట్ అధికారులు.. హైకోర్టు నిలదీయడంతో సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. అంతర్జాతీయ విమానాశ్రయంలో మూడు నెలల పాటు సీసీ కెమెరాలు పని చేయకపోతే ఏం చేస్తున్నారంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం.. అటు విమానాశ్రయ అధికారులతో పాటు ఇటు ఏపీ పోలీస్ అధికారుల్లో వణుకు పుడుతోంది. -
వైఎస్ జగన్‌పై హత్యాయత్నం నేపథ్యంలో..
సాక్షి, విశాఖపట్నం: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ఘటన అనంతరం దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) భద్రతను కట్టుదిట్టం చేసింది. మునుపటికంటే హైసెక్యూరిటీతో మరింత అప్రమత్తమవుతోంది. దేశ చరిత్రలోనే ఎయిర్‌పోర్టులో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి కావడంతో విమానాశ్రయాల్లోని రెస్టారెంట్లు, ఇతర కౌంటర్లు, విభాగాల్లో పనిచేసే ప్రైవేటు ఉద్యోగులు ఇకపై విధిగా పాస్‌పోర్టును కలిగి ఉండాలన్న నిబంధన విధించింది. ఇప్పటివరకు వీరికి పాస్‌లు మాత్రమే జారీ చేయడం, ఆయా సంస్థలు/నిర్వాహకులు ఇచ్చే గుర్తింపు కార్డులతోనూ అనుమతించే వారు. ఇలా పాస్‌లు, గుర్తింపు కార్డులు ఇష్టానుసారం జారీ చేయడం వల్ల ప్రముఖుల భద్రతకు ముప్పు వాటిల్లుతోందన్న భావనతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లూ ఏదో రకమైన పాస్లతోనో, లేక సిఫార్సులతోనో విమానాశ్రయంలోకి వెళ్లిరావడం తేలిగ్గా జరిగిపోయేది. ఈ పాస్‌లతో రన్‌వే మినహా మిగతా ప్రాంతాల్లో వీరు విచ్చలవిడిగా తిరిగేవారు. గత నెల 25న జగన్మోహన్రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులోని ఫ్యూజన్‌ఫుడ్స్ రెస్టారెంట్లో పనిచేస్తున్న జనుపల్లి శ్రీనివాసరావు కత్తితో హత్యాయత్నం ఘటనతో ఇటు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), విమానయాన సంస్థలతో పాటు సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. విమానాశ్రయాల్లో భద్రతను మరింత కఠినతరం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎయిర్‌పోర్టులోని విమానయాన సంస్థలు, రెస్టారెంట్లు, విమానయానేతర సంస్థల సిబ్బందికి కూడా పాస్‌పోర్టు కలిగి ఉండాలన్న నిబంధనను అమలు చేయనున్నారు. ఆధార్‌కార్డు నంబర్‌ను కూడా ఆన్లైన్లో నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే మంత్రితో పాటు వెంట వెళ్లేందుకు వ్యక్తిగత కార్యదర్శి/సహాయకుడిని మాత్రమే అనుమతిస్తారు. అయితే వారికి కూడా ఆధార్ తప్పనిసరి. సీఎంతోనే మొదలు ఈ నేపథ్యంలోనే విశాఖ ఎయిర్‌పోర్టులో బీసీఏఎస్ నిబంధనల అమలును ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే శ్రీకారం చుట్టారు. శ్రీకాకుళం పర్యటనకు వెళ్లేందుకు సోమవారం విశాఖ వచ్చిన చంద్రబాబు ఎయిర్‌పోర్టు వీవీఐపీ లాంజ్‌లో ఉన్నారు. ఆయన వద్దకు వెళ్లడానికి మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యక్తిగత సహాయకులను కూడా ఎయిర్‌పోర్టు భద్రత, సీఐఎస్ఎఫ్ అధికారులు అనుమతించలేదు. చివరకు విమాన టిక్కెట్టు కొనుక్కుని లోపలకు వెళ్లాల్సి వచ్చిందని తెలిసింది. విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే, బీజేపీ శాసనసభాపక్ష నేత పి.విష్ణుకుమార్‌రాజు, విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు ఎయిర్‌పోర్టు ఎడ్వయిజరీ కమిటీ సభ్యులు కావడం వల్ల వారిని అనుమతించారు. ఇక సీఎం ఎయిర్‌పోర్టుకు వచ్చిన ప్రతిసారీ పెద్ద ఎత్తున అనుసరించే అధికారులను కూడా భద్రతా చర్యల్లో భాగంగా అనుమతించడం లేదు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా విమానాశ్రయంలోకి 43 మంది అధికారులను అనుమతించాలని విశాఖ ఆర్డీవో దరఖాస్తు చేయగా ఒక్కరికీ అవకాశం ఇవ్వకపోవడం గమనార్హం. మంత్రులు సిఫార్సు చేసినా ఒప్పుకోలేదు. -
కేజీహెచ్‌లోనే పసిడి స్మగ్లర్లు
పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణం): విమానాశ్రయంలో పట్టుబడిన స్మగ్లర్ల నుంచి ఇంకా పూర్తిస్థాయిలో బంగారం బయటపడలేదు. ముగ్గురు స్మగ్లర్లను శనివారం అరెస్టు చేసిన కస్టమ్స్ అధికారులు వారి నుంచి అప్పుడే కొంత బంగారం స్వాధీనం చేసుకున్నారు. వారి కడుపులో ఇంకా కొంత బంగారం ఉందన్నఅనుమానంతో వారిని కేజీహెచ్‌కు తరలించి.. కడపులోంచి కక్కించే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. సీటీ స్కాన్, ఎక్స్‌రేల్లో ఇద్దరి కడుపులో ఒక్కొక్కటి, మూడో స్మగ్లర్ కడుపులో ఎనిమిది బంగారం బిస్కెట్లు ఉన్నట్లు గుర్తించారు. మలద్వారా ద్వారా వాటిని బయటకు రప్పించేందుకు మందులు ఇచ్చారు. దాంతో మొదటి ఇద్దరి కడుపులో ఉన్న ఒక్కో బిస్కెట్, ఎనిమది బిస్కెట్లు మింగిన మూడో దుండగుడి నుంచి నాలుగు బిస్కెట్లను బయటకు రప్పించగలిగారు. మిగిలిన నాలుగు బిస్కెట్లను బయటకు రప్పించేందుకు మళ్లీ అతగాడికి మందులిచ్చారు. -
బంగారం మింగేశారని..
విశాఖపట్నం, గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): విశాఖ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు మరో మారు బంగారం స్మగ్లింగ్ గుట్టు రట్టు చేశారు. బంగారం బిస్కెట్లు అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురిని అరెస్టు చేశారు. వివరాలిలా ఉన్నాయి. విశాఖ విమానాశ్రయంలో శనివారం రాత్రి పది గంటలకు ఎయిర్ ఏషియా విమానం నుంచి తమిళనాడుకు చెందిన జహుబర్ సాధిక్ అజారుద్దీన్, జహుబర్ సాధిక్ షేక్ అబ్దుల్లా, నైనాఎండీ సయ్యద్‌లు బ్యాగులతో దిగారు. వీరు టాయ్లెట్ల వైపు వెళ్లటంతో కస్టమ్స్ అధికారులు అనుమానించి తనిఖీ చేశారు. వారి వద్ద రూ.2,33,600 విలువైన బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. మరింత బంగారం మింగేసి ఉంటారన్న అనుమానంతో వైద్య పరీక్షల నిమిత్తం కేజీహెచ్‌కి తరలించారు. -
‘ప్రభుత్వ పెద్దల సహకారంతోనే జగన్‌పై హత్యాయత్నం’
న్యూఢిల్లీ : ఏపీ ప్రభుత్వ పెద్దల సహకారంతోనే తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిందని వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనకు సంబంధించి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌లను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలు.. ఏపీ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌పై జరిగింది మూమ్మాటికీ హత్యాయత్నమేనని రిమాండ్ రిపోర్ట్‌లో తేటతెల్లమైందన్నారు. ఇది ప్రభుత్వ పెద్దల సహకారంతోనే జరిగిందనడానికి చాలా కారణాలున్నాయని తెలిపారు. నిందితుడు శ్రీనివాస్ విశాఖ ఎయిర్‌పోర్టులోని క్యాంటీన్లో పని చేస్తున్నాడని, అది టీడీపీకి చెందిన వ్యక్తి చేతుల్లోనే ఉందనే విషయాన్ని సుబ్బారెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ‘రిమాండ్ రిపోర్ట్‌తో సగం వాస్తవాలు బయటకొచ్చాయి. సెల్ఫీ నెపంతో నిందితుడు శ్రీనివాస్.. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం చేశాడు. అదృష్టావశాత్తు వైఎస్ జగన్ పక్కకు తప్పుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సీఎం చంద్రబాబు హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారు. శ్రీనివాస్‌కు చంద్రబాబు ప్రభుత్వం రెండు ఇళ్లు మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ విచారణపై మాకు నమ్మకం లేదు. రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రిని కలిసి ఫిర్యాదు చేస్తాం. హత్యాయత్నంపై థర్డ్ పార్టీ విచారణ జరిపించాలి. నిందితులు ఎంతటివారైనా శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలి’ అని సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. మరో వైఎస్సార్సీపీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నంపై న్యాయ విచారణ జరిపించాలి. టీడీపీ ప్రభుత్వ ప్రోద్భలంతోనే జగన్‌పై హత్యాయత్నం. వైఎస్ జగన్ ఆరోగ్యంపై ఆరా తీయాల్సిన చంద్రబాబు.. తప్పుడు ఆరోపణలు చేయడం ఎంతవరకు సబబు. వైఎస్ జగన్‌ను అంతమొందిస్తే ఎదురుండదని కుట్ర పన్నారు. పరామర్శించకుండా విమర్శలు చేస్తున్నారు. టీడీపీ నేతల వ్యాఖ్యలను రాష్ట్ర ప్రజలంతా ఛీ కొడుతున్నారు. టీడీపీ మంత్రులు స్పందించే తీరు సరికాదు. చంద్రబాబు నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారు’ అని విమర్శించారు. ‘రిమాండ్ రిపోర్ట్‌లో వాస్తవాలు బయటకొచ్చాయి. వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం వెనుక కుట్ర ఉంది. ప్రజా సంకల్పయాత్రకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక హత్యాయత్నం. ఆరోపణలు చేయడం అన్యాయం. ఇది వరకే నేర చరిత్ర ఉన్న శ్రీనివాస్‌కు ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగం ఎలా ఇచ్చారు. వీటిన్నంటిపై న్యాయ విచారణ జరిపించాలి’ అని వరప్రసాద్ పేర్కొన్నారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సీసీ కెమెరాలు లేని ప్రదేశం చూసుకుని జగన్‌పై హత్యాయత్నం చేశారు. ఆపరేషన్ గరుడపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విచారణ జరిపించలేదు. జగన్‌కు వస్తున్న ప్రజాదారణను చూసే హత్యాయత్నం’ అని తెలిపారు. రిమాండ్ రిపోర్ట్; వైఎస్ జగన్‌పై జరిగింది ముమ్మాటికీ హత్యాయత్నమే! ఆ ఫ్లాట్‌లోని వేరే గదిలోనే మరో ఇద్దరు అమ్మాయిలు! ‘హర్షవర్ధన్‌కు ఆ పదవి ఇవ్వాలని చంద్రబాబు ఒత్తిడి’ -
వైఎస్ జగన్‌పై జరిగింది ముమ్మాటికీ హత్యాయత్నమే!
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగింది ముమ్మాటికీ హత్యాయత్నమేనని స్పష్టమైంది. ఈ మేరకు రిమాండ్ రిపోర్టులో సంచలన వాస్తవాలు వెలుగుచూశాయి. ఈ దాడిలో వైఎస్ జగన్ మెడభాగంలో కత్తి తగిలి ఉంటే.. ఆయన అక్కడే చనిపోయి ఉండేవారని, నిందితుడు శ్రీనివాసరావు జగన్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించాడని రిమాండ్ రిపోర్టులో స్పష్టంగా పేర్కొన్నారు. దాడి సమయంలో అదృష్టవశాత్తు వైఎస్ జగన్ కుడివైపునకు తిరగడంతో హత్యాయత్నం నుంచి తృటిలో తప్పించుకున్నారని వెల్లడించారు. గత గురువారం విశాఖపట్నం విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లో వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ వచ్చేందుకు పార్టీ నేతలతో కలిసి ఆయన వీఐపీ లాంజ్‌లో ఎదురుచూస్తున్న సమయంలో సెల్ఫీ నెపంతో వైఎస్ జగన్ వద్దకు వచ్చిన జనిపల్లి శ్రీనివాసరావు కోళ్ల పందాలకు ఉపయోగించే పదునైన కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనపై ఏపీ పోలీసు దర్యాప్తు అధికారులు స్థానిక కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టును ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది. వైఎస్ జగన్‌పై జరిగింది ముమ్మాటికీ హత్యాయత్నమేనని రిమాండ్ రిపోర్ట్ స్పష్టం చేసింది. కత్తి గనుక మెడ భాగంలో తగిలి వుంటే ఆయన చనిపోయివుండేవారనే, నిందితుడు శ్రీనివాస్.. వైఎస్ జగన్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించాడని తెలిపింది. వైఎస్సార్సీపీ నేత కరణం ధర్మశ్రీ సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో నిందితుడు హత్యాయత్నం చేశాడని, అదృష్టవశాత్తు ఆ సమయంలో వైఎస్ జగన్ కుడివైపునకు తప్పుకోవడంతో ఆయనకు ప్రాణాపాయం తప్పిందని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఏపీ ప్రోటోకాల్ ఇన్స్పెక్టర్ వాసుదేవ్ అక్కడే వున్నారని కూడా రిమాండ్ రిపోర్ట్‌లో తెలిపారు. అంతేకాదు నిందితుడి జేబులో మరో పదునైన కత్తి ఉందని, జగన్ హత్యకు నిందితుడు పథకం ప్రకారమే ప్లాన్ చేశాడని విచారణలో వెల్లడైంది. 25వ తేదీన వైఎస్ జగన్ ఎయిర్‌పోర్టుకు వస్తారన్న సమాచారం తెలుసుకున్న శ్రీనివాస్.. ఒక రోజు ముందుగానే కత్తులను ఎయిర్‌పోర్ట్‌లోకి తెచ్చుకున్నాడని, సీసీ కెమెరాలు కవర్ చేయని ప్రాంతంలో ఆ కత్తులను దాచాడని రిమాండ్ రిపోర్ట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. సాక్షి టీవీ లైవ్ కవరేజ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. -
పోలీసుల కస్టడీలోకి శ్రీనివాసరావు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం చేసిన నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావును పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం నిందితుడిని తమ కస్టడీకి అప్పగించాలలని పోలీసులు చేసిన అభ్యర్థనను కోర్టు అంగీకరించింది. ఆరు రోజుల పాటు (ఆదివారం నుంచి శుక్రవారం వరకు) విచారణ కొనసాగనుంది. పోలీస్ స్టేషన్లోనే నిందితుడిని విచారించాలని న్యాయమూర్తి ఆదేశించిన నేపథ్యంలో.. శ్రీనివాసరావును విశాఖ సెంట్రల్ జైలు నుంచి ఎయిర్‌పోర్టు జోన్ పోలీస్ స్టేషన్‌కి తరలించనున్నారు. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం అనంతరం నిందితుడి జేబులో ఓ లేఖ దొరికిన సంగతి తెలిసిందే. ఈ లేఖ రాశారని భావిస్తున్న ఓ యువతి, శ్రీనివాసరావు స్నేహితుడిని కూడా సిట్ అధికారులు విచారణ చేయనున్నారు. ఫ్యూజన్ హోటల్ యజమాని, టీడీపీ నేత హర్షవర్ధన్ చౌదరిని పోలీసులు శనివారం విచారించారు. వైఎస్ జగన్ హత్యకు యత్నించిన శ్రీనివాస్‌కు హర్షవర్ధన్ భారీ జీతంతో పాటు ఇంటి అద్దె కట్టి ప్రత్యేక సదుపాయాలు కల్పించాడని తెలిసింది. కోడి పందాల పేరుతో శ్రీనివాస్‌ను విశాఖ రప్పించినట్టు వెల్లడైంది. -
కేంద్ర హోంమంత్రిని కలవనున్న వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, న్యూఢిల్లీ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఢిల్లీ పయనమయ్యారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ని కలిసి ఏపీలో తలెత్తిన శాంతి భద్రతల వైఫల్యాన్ని ఆయనకు వివరించనున్నారు. అత్యంత భద్రత ఉండే విశాఖ ఎయిర్‌పోర్టులో వైఎస్ జగన్‌పై గురువారం హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ నేతలు థర్డ్ పార్టీ విచారణ కోరనున్నారు. చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరించిన రాష్ట్ర డీజీపీ ఆర్పీ ఠాకూర్ వైఎస్ జగన్‌పై హత్యాయత్నం ఘటనపై వివాదాస్పదంగా వ్యవహరించారు. దాంతో హత్యాయత్నం ఘటనపై ఠాకూర్ నేపథ్యంలో ఏర్పాటైన సిట్‌పై తనకు నమ్మకం లేదంటూ వైఎస్ జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఘటనపై ఏపీ అధికారులతో కాకుండా థర్డ్ పార్టీతో విచారణ చేయించాలని వైఎస్సార్సీపీ నేతలు రాజ్‌నాథ్‌సింగ్‌కు తెలపనున్నారు. -
40 ఏళ్ల అనుభవం.. మాట్లాడే తీరు ఇదేనా?
సాక్షి, విశాఖపట్నం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుడివాడ అమర్నాథ్ విమర్శల వర్షం కురిపించారు. విశాఖ ఎయిర్‌పోర్టులో వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నానికి కర్త, కర్త, క్రియ చంద్రబాబేనని ఆరోపించారు. శనివారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్‌పై 12.40 నిముషాలకు దాడి జరిగితే ఎయిర్‌పోర్టు మేనేజర్, సీఐఎస్ఎఫ్ కమాండెంట్లు 4.30 గంటలకు పోలీస్‌స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చారని తెలిపారు. మరి, డీజీపీ మధ్యాహ్నం రెండు గంటలకే దాడి చేసింది వైఎస్ జగన్ అభిమాని అని ఎలా చెప్పారని మండిపడ్డారు. ప్రెస్ మీట్లో చంద్రబాబు చెప్పదల్చుకున్న విషయాలన్ని ముందే డీజీపీతో చెప్పించారని విమర్శలు గుప్పించారు. దీన్ని బట్టే టీడీపీ కుట్ర రాజకీయాలు బయటపడ్డాయని అన్నారు. పోలీస్ బాస్ అలా అసత్యాలు ప్రచారం చేస్తే మిగతా ఉన్నతాధికారులు, సీఐలు, ఎస్సైలు ఏం చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. డీజీపీకి వ్యతిరేకంగా వారు మట్లాడగలరా అని ప్రశ్నించారు. కనీస మర్యాద లేని మనిషి ముఖ్యమంత్రి 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు మాట్లాడే తీరు ఇదేనా? అని ప్రశ్నించారు. చంద్రబాబు కనీస మర్యాద లేని మనిషని అమర్నాథ్ వ్యాఖ్యానించారు. ఘటనను ఖండించకుండా, వైఎస్ జగన్‌ను పరామర్శించకుండా అమానుషంగా ప్రవర్తించారని మండిపడ్డారు. ఎయిర్‌పోర్టులో భద్రత కేంద్ర పరిధిలోని అంశమని మాట్లాడుతున్న చంద్రబాబుకు సంస్కారం లేదని అన్నారు. వైఎస్ జగన్ విశాఖ ఎయిర్‌పోర్టుకు వచ్చినప్పుడు తామే ఆయనకు టీ, స్నాక్స్ అందిస్తామని తెలిపారు. అయితే, ఎయిర్‌పోర్టు క్యాంటీన్ నిర్వాకుడు, టీడీపీకి చెందిన హర్షవర్థన్ దీనికి అభ్యంతరం తెలిపాడని వివరించారు. వైఎస్ జగన్‌కు బయట నుంచే టీ, ఫలహారాలు తీసుకొస్తున్నారనీ, ఇది తమ వ్యాపారానికి నష్టం కలిగిస్తోందని ఎయిర్‌పోర్టు అధికారులకు ఫిర్యాదు చేశాడని అన్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్‌కు టీ అందించే నెపంతో నిందితుడు శ్రీనివాసరావు దాడికి పాల్పడ్డాడని అన్నారు. బాబూ.. మీ ఇంటలిజెన్స్ ఏమైంది.. పనీ పాట లేని ఓ ఆర్టిస్ట్ ‘ఆపరేషన్ గరుడ’ అంటూ చెప్తే దానిని ముఖ్యమంత్రి నిజమేకావచ్చునని అనుమానం వ్యక్తం చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. యాక్టర్ శివాజీ వ్యాఖ్యలకు ప్రాధాన్యమిస్తున్న చంద్రబాబు.. ‘ఆపరేషన్ గరుడ’పై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కొన్ని నెలల కిందటే శివాజీ ఈ విషయాలు చెప్పినప్పుడు ఏం చేశారనీ, చంద్రబాబు ఇంటలిజెన్స్ పని చేయడం లేదా అని చురకలంటించారు. వైఎస్ జగన్‌పై దాడి ఘటనను సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మాత్రమే కోరామని.. పక్క రాష్ట్ర పోలీసులతో విచారణ చేయించాలని ఎక్కడా చెప్పలేదని ఉద్ఘాటించారు. -
వెల్లువెత్తిన అభిమానం.. జగనన్న బాగుండాలని మొక్కుల అభిషేకం
-
జగన్‌పై హత్యాయత్నం ఘటనపై హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్: ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనకు సంబంధించి ఆ పార్టీ శ్రేణులు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ మేరకు వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి హైకోర్టులో శుక్రవారం రిట్ పిటిషన్ దాఖలు చేశారు. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసును సీబీఐతో విచారణ జరిపించాలని పిటిషన్లో పేర్కొన్నారు. తమకు ఏపీ పోలీసులపై నమ్మకం లేదని, థర్డ్ పార్టీ విచారణ జరపాలని కోరారు. ఇక్కడ చదవండి ‘ఆపరేషన్ గరుడ వెనుక ఉన్నది చంద్రబాబే’ ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ సీరియస్ పక్కదారి పట్టించేందుకు బాబు పక్కా స్కెచ్ వైఎస్ జగన్‌పై హత్యాయత్నం -
‘ఆపరేషన్ గరుడ వెనుక ఉన్నది చంద్రబాబే’
హైదరాబాద్: ఆపరేషన్ గరుడ వెనుకున్నది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. ఆపరేషన్ గరుడకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ చంద్రబాబేనంటూ ఆయన విమర్శించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై దాడి చేసిన వ్యక్తి గరుడ బొమ్మతో ఉన్న వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీని పెట్టడంతోనే టీడీపీ డ్రామా బయటపడిందని సుబ్బారెడ్డి విమర్శించారు. వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీలో గరుడ బొమ్మను ఎవరైనా పెడతారా అంటూ ఆయన ప్రశ్నించారు. సిటీ న్యూరో సెంటర్లో చికిత్స పొందుతున్న వైఎస్ జగన్‌ను పరామర్శించడానికి వచ్చిన సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు పదే పదే చెబుతున్న ఆపరేషన్ గరుడ వెనుక ఉన్నది చంద్రబాబేనన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఎల్లో రంగు ఫ్లెక్సీని ఒక వైఎస్సార్సీపీ అభిమాని పెడతాడా అని ఆయన నిలదీశారు. ఫొటోలు మార్ఫింగ్ చేసి ఫ్లెక్సీలు సృష్టించారన్నారు. జగన్‌ను కత్తితో పొడిచిన వ్యక్తి టీడీపీ నేత హోటల్లో పనిచేస్తున్నాడన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అసలు పోలీసుల అనుమతి లేకుండా ఒక వ్యక్తి కత్తితో ఎయిర్‌పోర్ట్‌లోకి రాగలడా అని సుబ్బారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలన్నారు. దీనిపై కేంద్ర హోంమంత్రి, రాష్ట్రపతి, గవర్నర్లను కలుస్తామన్నారు. వైఎస్ జగన్‌పై జరిగింది ముమ్మూటికీ హత్యాయత్నమేనన్నారు. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలన్నారు. ఘటన జరిగిన వెంటనే ఏపీ డీజీపీ ఎలా మాట్లాడతారన్నారు. గతంలో అలిపిరి ఘటనలో చంద్రబాబు నాయడు గాయపడ్డప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి వెంటనే ఖండించిన విషయాన్ని సుబ్బారెడ్డి గుర్తు చేశారు. స్వయంగా వెళ్లి చంద్రబాబును వైఎస్సార్ పరామర్శించారన్నారు. ఇప్పుడు చంద్రబాబు మానవత్వం లేకుండా వ్యవహరించారంటూ సుబ్బారెడ్డి మండిపడ్డారు. ఫ్లెక్సీ తరహాలోనే 11 పేజీల లెటర్‌ను కూడా సృష్టించారన్నారు. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం! దాడిపై అనుమానాలెన్నో? -
ఆగ్రహం ఆందోళన
-
ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ సీరియస్
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో గురువారం హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. సాక్షాత్తూ ఎయిర్‌పోర్టులోనే ఒక రాష్ట్ర ప్రతిపక్షనేతపై దాడి జరగడంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్, పవన్, బీజేపీ ఎంపీ జీవీఎల్, కన్నా లక్ష్మీనారాయణ ఈ దాడిని ఖండించారు. అయితే, వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన దాడి ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు డ్రామాగా అభివర్ణించారు. జగన్‌పై దాడిని ఖండించిన వారిపై బాబు విమర్శలు చేశారు. కాగా, ముఖ్యమంత్రి విమర్శలపై స్పందించిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. ‘ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు’ ఎక్కడ ఏం జరిగినా ముఖ్యమంత్రి గారు, ఆయన వర్గీయులు మా మీద పడి ఏడుస్తారెందుకని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. My response for Sri CBN’s comments on us: ‘ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు’ ఎక్కడ ఏం జరిగినా ముఖ్యమంత్రి గారు అయన వర్గీయులు మా మీద పడి ఏడుస్తారు ఎందుకు? — Pawan Kalyan (@PawanKalyan) October 25, 2018 వైఎస్ జగన్‌పై దాడి అమానుషం: పవన్ కల్యాణ్ -
జగన్‌పై హత్యాయత్నం.. నిందితుడిపై కేసు నమోదు
సాక్షి, విశాఖపట్నం : ప్రజల సంక్షేమం కోసం నిరంతరం తపిస్తూ.. వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ జనం గోడును వింటున్న జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో హత్యాయత్నం జరగడం తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే. విశాఖ ఎయిర్‌పోర్టులోని కేఫెటేరియాలో వెయిటర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసరావు ఈ దాడికి పాల్పడ్డాడు. సెల్ఫీ పేరుతో వైఎస్ జగన్‌పై శ్రీనివాసరావు హత్యాయత్నం చేశాడని ఘటనా ప్రాంతంలో విధుల నిర్వహిస్తున్న సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ దినేష్‌కుమార్ ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దినేష్‌కుమార్ ఫిర్యాదుతో ఐపీసీ 307 (హత్యాయత్నం) సెక్షన్ కింద కేసు నమోదు చేశామనీ, ఘటనపై దర్యాప్తు చేపట్టామని పోలీస్ ఇన్స్పెక్టర్ మల్లా శేషు తెలిపారు. (వైఎస్ జగన్‌పై హత్యాయత్నం!) (దాడిపై అనుమానాలెన్నో?) -
వైఎస్ జగన్‌పై హత్యాయత్నం
-
వైఎస్ జగన్ శరీరంలోకి కత్తి బలంగా దిగింది
-
వైఎస్ జగన్ హెల్త్ బులెటిన్ విడుదల
సాక్షి, హైదరాబాద్ : విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన దాడిలో ఆయన భుజానికి తీవ్ర గాయమైంది. దీంతో వైఎస్ జగన్‌ను వెంటనే హైదరాబాద్‌లోని సిటీన్యూరో ఆస్పత్రికి తరలించారు. భుజానికి తీవ్రగాయం కావడంతో డాక్టర్లు ఆయనకు శస్త్ర చికిత్స చేశారు. వైఎస్ జగన్ భుజానికి తొమ్మిది కుట్లు వేశామని గురువారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో వైద్యులు తెలిపారు. దుండగుడు పొడిచిన కత్తి వైఎస్ జగన్ శరీరంలోకి బలంగా దిగిందని వైద్యులు పేర్కొన్నారు. దాదాపు 4 సెంటీమీటర్ల లోతుకు కత్తి దిగిందన్నారు. ప్రస్తుతం వైఎస్ జగన్ ఆరోగ్య నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. రక్త నమూనాలను సేకరించి పరీక్షలకి పంపామన్నారు. కత్తికి విషం పూసారా, లేదా అన్నది పరీక్షల తర్వాతే తెలుస్తుందన్నారు. రిపోర్ట్ వచ్చాక డిశ్చార్జ్ ఎప్పుడనేది చెబుతామని వైద్యులు పేర్కొన్నారు. పథకం ప్రకారమే వైఎస్ జగన్‌పై హత్యాయత్నం! -
పథకం ప్రకారమే వైఎస్ జగన్‌పై హత్యాయత్నం!
సాక్షి, హైదరాబాద్ : విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం పలు అనుమానాలకు దారితీస్తోంది. పక్కా పథకం ప్రకారమే ఈ దాడి జరిగినట్లుగా కనిపిస్తోంది. వైఎస్ జగన్ రాకపోకలపై పూర్తి సమచారం సేకరించి ప్లాన్ ప్రకారమే దుండగులు ఈ దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ప్రజాసంకల్పయాత్ర పూర్తి చేసుకుని హైదరాబాద్‌కు చేరుకునేందుకు విశాఖ ఎయిర్పోర్ట్ లాంజ్‌లో వైఎస్ జగన్ ఎదురుచూస్తుండగా దాడి జరిగింది. అక్కడి కేఫ్టేరియలో పనిచేసే వెయిటర్ శ్రీనివాస్ సెల్ఫీ నెపంతో వైఎస్ జగన్ వద్దకు వచ్చి.. కత్తితో మెడపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. వైఎస్ జగన్ తప్పించుకోవడంతో ఆయన భుజానికి తీవ్రగాయమైంది. ఈ దాడిలో పైకి శ్రీనివాస్ కనిపిస్తున్నా.. తెరవెనుక మరికొంత మంది ఉండవచ్చనే అనుమానం వ్యక్తమవుతోంది. గత రెండు నెలలుగా విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి జగన్ వస్తున్న సంగతిని కుట్రదారులు గమనించినట్లు తెలుస్తోంది. ప్రతి గురువారం వైఎస్ జగన్ ప్రయాణ సమాచారాన్ని తెలుసుకున్న కుట్రదారులు ఎయిర్ పోర్టు లాంజ్ అయితేనే తమ పని సులువవుతుందని అనుకున్నారు. అక్కడ భద్రత తక్కువ ఉంటుందని భావించి వ్యూహాత్మకంగా ఎయిర్‌పోర్ట్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కేఫ్టేరియా సిబ్బంది రూపంలో అయితే జగన్‌కు దగ్గరగా వెళ్లొచ్చని కుట్ర పన్నారు. కేఫ్టేరియా సిబ్బంది రూపంలో శ్రీనివాస్‌ను ఎయిర్‌పోర్టులోకి పంపిచారు. కత్తిని వారం ముందే ఎయిర్‌పోర్ట్‌లోకి తీసుకెళ్లి ఉండొచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. సైజ్ చిన్నదైనా.. పదునుగా ఉంటే కోడిపందాల కత్తిని ఉపయోగించారు. సరైన సమయం కోసం వేచిచూసిన శ్రీనివాస్ గురువారం హత్యాయత్నానికి పాల్పడ్డాడు. శ్రీనివాస్ కత్తి పట్టుకున్న తీరు పక్కా ప్రొఫెషనల్ కిల్లర్ తీరును తలపిస్తోంది. ఉద్దేశపూర్వకంగానే ఈ హత్యాయత్నం జరిగినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. టీడీపీ నేతకు నిందితుడు సన్నిహితుడు.. వైఎస్ జగన్‌పై దాడికి పాల్పడిన శ్రీనివాస్‌ది అమలాపురం సమీపంలోని ముమ్మిడివరం అని తెలుస్తోంది. ఎయిర్‌పోర్టు ల్యాంజ్ క్యాంటీన్ యాజమాని హర్షవర్ధన్‌కు అతడు సన్నిహతుడని సమాచారం. హర్షవర్థన్ అధికార టీడీపీ నాయకుడు కావడం గమనార్హం. అతడు గతంలో గాజువాక టీడీపీ టిక్కెట్ కోసం ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో టీడీపీ పెద్దల సిఫార్సుతోనే అతనికి ఎయిర్‌పోర్టు క్యాంటీన్ కాంట్రాక్ట్ వచ్చింది. అతడి క్యాంటీన్లోనే పనిచేస్తున్న శ్రీనివాస్ భద్రత తనిఖీల కళ్లుగప్పి కత్తిని ఎలా లోపలికి తీసుకొచ్చాడన్నది ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. సమగ్ర దర్యాప్తు జరిగితే తప్ప ఈ ఘటనకు వెనక ప్రేరేపణ ఏమిటి? కుట్ర ఏమిటి? అన్నది తెలియదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం! -
ఎవరూ ఆందోళన చెందొద్దు: వైఎస్ జగన్
-
వైఎస్ జగన్‌పై దాడి ఫొటోలు
-
నేను క్షేమంగా ఉన్నా: వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్ : తాను క్షేమంగా ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందవద్దని వైఎస్ జగన్ తెలిపారు. జగన్ చికిత్స పొందుతున్న హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రి వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునే యత్నం చేశారు. జనంలో ఉన్న భయాందోళనలను తొలగించడానికి జగన్ ట్విట్టర్ ద్వారా సందేశం పంపారు. ‘నా క్షేమం గురించి ఆందోళన చెందుతున్న ప్రతి ఒక్కరికీ.. నేను క్షేమంగా ఉన్నానని తెలియజేస్తున్నాను. దేవుడి దయ, నా గురించి ఆందోళన చెందుతున్న రాష్ట్ర ప్రజల ప్రేమానురాగాలు, ఆశీర్వాదాలు నన్ను ఎల్లప్పుడూ కాపాడతాయి. నాపై దాడి లాంటి పిరికిపంద చేష్టలు నన్ను ఎప్పటికీ నా లక్ష్యం నుంచి వెనక్కి తగ్గేలా చేయలేవు. రాష్ట్ర ప్రజల కోసం పని చేయాలన్న నా సంకల్పాన్ని మరింత దృఢతరం చేస్తాయి’ అని జగన్ ట్వీట్ చేశారు. (వైఎస్ జగన్‌పై దాడి ఫొటోలు) To everyone worried about my safety - I’d like to inform you that I am safe. God's grace and the love, concern & blessings of the people of Andhra Pradesh will protect me. Such cowardice acts will not dissuade me but only strengthen my resolve to work for the people of my state! — YS Jagan Mohan Reddy (@ysjagan) October 25, 2018 -
పథకం ప్రకారమే దాడి - డీజీపి
-
వైఎస్ జగన్‌పై దాడి చేసిన వ్యక్తి ఎవరు?
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. అత్యంత భద్రత ఉండే ఒక అంతర్జాతీయ విమానాశ్రయంలో సాక్షాత్తూ రాష్ట్ర ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జగరడం.. తీవ్ర సంచలనం రేపుతోంది. సెల్ఫీ నెపంతో వైఎస్ జగన్ వద్దకు వచ్చిన శ్రీనివాస్ అనే వెయిటర్ కోడిపందాలలో ఉపయోగించే కత్తితో దాడి చేశాడు. అసలు ఈ శ్రీనివాస్ ఎవరు? ఎందుకు వైఎస్ జగన్‌పై హఠాత్తుగా దాడి చేశాడు? అత్యంత భద్రత ఉండే అంతర్జాతీయ విమానాశ్రయంలోపలికి అసలు కత్తి ఎలా వచ్చింది? తనిఖీలను తప్పించుకొని.. కోళ్ల పందాలకు వాడే పదునైన కత్తిని అతను లోపలికి ఎలా తీసుకొచ్చాడు? అతనికి సహకరించింది ఎవరు? దీనిలో రాజకీయ కుట్ర ఏమైనా దాగి ఉందా? అన్న అనుమానాలు ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. టీడీపీ నేతకు నిందితుడు సన్నిహితుడు.. వైఎస్ జగన్‌పై దాడికి పాల్పడిన శ్రీనివాస్‌ది అమలాపురం సమీపంలోని ముమ్మిడివరం అని తెలుస్తోంది. ఎయిర్‌పోర్టు ల్యాంజ్ క్యాంటీన్ యాజమాని హర్షవర్ధన్‌కు అతను సన్నిహతుడని సమాచారం. హర్షవర్థన్ అధికార టీడీపీ నాయకుడు కావడం గమనార్హం. అతను గతంలో గాజువాక టీడీపీ టిక్కెట్ కోసం ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో టీడీపీ పెద్దల సిఫార్సుతోనే అతనికి ఎయిర్‌పోర్టు క్యాంటీన్ కాంట్రాక్ట్ వచ్చింది. అతని క్యాంటీన్లోనే పనిచేస్తున్న శ్రీనివాస్ భద్రత తనిఖీల కళ్లుగప్పి కత్తిని ఎలా లోపలికి తీసుకొచ్చాడు? అన్నది ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. సమగ్ర దర్యాప్తు జరిగితే తప్ప ఈ ఘటనకు వెనక ప్రేరేపణ ఏమిటి? కుట్ర ఏమిటి? అన్నది తెలియదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఎయిర్‌పోర్టు భద్రతపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఎయిర్‌పోర్టు లోపలికి ఓ వ్యక్తి కత్తి ఎలా తీసుకెళ్లాడు? ఎయిర్‌పోర్టులోకి కత్తి తీసుకురావడానికి అతనికి సహకరించిందెవరు? తనిఖీ చేయకుండా భద్రతా సిబ్బంది అతన్ని లోపలికి ఎలా పంపించారు? అన్న కోణంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
వైఎస్ జగన్‌పై హత్యాయత్నం: లైవ్ అప్డేట్స్
సాక్షి, హైదరాబాద్ : ప్రజల సంక్షేమం కోసం నిరంతరం తపిస్తూ.. వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ జనం గుండె చప్పుడు తెలుసుకుంటున్న జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో హత్యాయత్నం జరగడం తీవ్ర సంచలనం రేపింది. సెల్ఫీ తీసుకుంటానంటూ వచ్చి ఓ దుండగుడు వైఎస్ జగన్‌పై కోళ్ల పందేలకు ఉపయోగించే కత్తితో దాడి చేశాడు. అత్యంత భద్రత ఉండే ఎయిర్‌పోర్ట్‌లో సాక్షాత్తూ రాష్ట్ర ప్రతిపక్ష నేతపై ఇలా హత్యాయత్నం జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ ఇవి.. వైఎస్ జగన్‌కు కేసీఆర్ పరామర్శ దాడికి గురైన వైఎస్ జగన్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్లో పరామర్శించారు. దాడి, చికిత్స వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైఎస్ జగన్ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు జైపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా వైఎస్ జగన్‌ను పరామర్శించారు. హెల్త్ బులెటిన్ విడుదల వైఎస్ జగన్ ఆరోగ్యం నిలకడగా ఉందని హెల్త్ బులెటిన్‌లో సిటీ న్యూరో వైద్యులు తెలిపారు. కత్తి బలంగా ఆయన శరీంలోకి దిగిందని, తొమ్మిది కుట్లు వేశామని వెల్లడించారు. బయాప్సిని పరీక్షలకు పంపించినట్టు చెప్పారు. ప్రజల దీవెనలతోనే... ఆంధ్రప్రదేశ్ ప్రజల దీవెనలు, వేంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో వైఎస్ జగన్‌కు ప్రాణాపాయం తప్పిందని విజయసాయిరెడ్డి అన్నారు. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం వెనుక కచ్చితంగా కుట్ర ఉందని, దీని వెనుక ఎవరున్నారో ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్‌కు సెక్యురిటీ పెంచాలని పదేపదే చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదని, ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఆస్పత్రికి చేరుకున్న వైఎస్ విజయమ్మ వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయమ్మ, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి హైదరాబాద్ సిటీ న్యూరో ఆస్పత్రికి చేరుకున్నారు. తన కుమారుడిపై హత్యాయత్నం జరగడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన విజయమ్మ. జానారెడ్డి పరామర్శ హైదరాబాద్ సిటీ న్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్ జగన్‌ను తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కె. జానారెడ్డి పరామర్శించారు. జగన్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వైఎస్ జగన్ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఎవరూ ఆందోళన చెందవద్దు తనపై జరిగిన దాడి పట్ల ఎవరూ ఆందోళన చెందవద్దని వైఎస్ జగన్ ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. భగవంతుడి దయ, కోట్లాది మంది ప్రజల, ఆశీస్సులే తనను రక్షించాయని ఆయన పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం కోసం తాను చేసే పోరాటాలను ఇటువంటి పిరికిపంద చర్యలు ఆపలేవని ట్వీట్ చేశారు. సిటీ న్యూరో ఆస్పత్రిలో చికిత్స హైదరాబాద్ సిటీ న్యూరో ఆస్పత్రిలో వైఎస్ జగన్‌కు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. భుజానికి కుట్లు వేయాల్సివుంటుదని వైద్యులు తెలిపారు. గాయమైన ప్రదేశం నుంచి రక్త నమూనాలు సేకరిస్తున్నారు. కత్తికి విషం పూసారా, లేదా అన్నది పరీక్షల తర్వాతే తెలుస్తుందన్నారు. మరోవైపు వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి ఆస్పత్రికి చేరుకున్నారు. ఖండించిన నాయకులు వైఎస్ జగన్‌పై దాడి జరగడాన్ని పలు పార్టీల నాయకులు ఖండించారు. ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ దాడిని గర్హించారు. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరగడాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ ఎంపీ కవిత కూడా ఖండించారు. వైఎస్ జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న వైఎస్ జగన్.. పెద్ద ఎత్తున చేరుకున్న తెలంగాణ వైఎస్సార్సీపీ శ్రేణులు.. తమ అధినేతపై హత్యాయత్నం నేపథ్యంలో ఎయిర్‌పోర్టు వద్ద పార్టీ శ్రేణుల ఆందోళన సురేశ్ ప్రభు దిగ్భ్రాంతి... ఢిల్లీ: ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై జరిగిన దాడి పట్ల పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది పిరికిపంద చర్య అని ఆయన అభివర్ణించారు. సీఐఎస్ఎఫ్ సహా అన్ని సంస్థలను ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్టు ట్విట్టర్లో ఆయన వెల్లడించారు. ఈ ఘటనపై వెంటనే విచారణ మొదలుపెట్టామని, దీనికి బాధ్యులెవరో గుర్తించాలని పౌర విమానయాన శాఖ కార్యదర్శిని ఆదేశించామని తెలిపారు. ఏపీ డీజీపీకి గవర్నర్ నరసింహన్ ఫోన్ వైఎస్ జగన్‌పై హత్యాయత్నం నేపథ్యంలో ఏపీ డీజీపీకి గవర్నర్ నరసింహన్ ఫోన్ చేశారు. హత్యాయత్నంపై వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఘటనపై తక్షణమే నివేదిక ఇవ్వాలని డీజీపీని గవర్నర్ ఆదేశించారు. ఈ క్రమంలో ఏపీ డీజీపీ ఆఫీస్‌కు వైఎస్సార్సీపీ నేతలు బయల్దేరి వెళ్లారు. జగన్‌పై హత్యాయత్నాన్ని ఖండించిన బీజేపీ ఇటువంటి దాడులు దారుణం. ఇలాంటివాటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. కోళ్ల పందాలకు వాడే కత్తి పదును తీవ్రంగా ఉంటుంది. కుట్రపూరితంగా జరిగిందేమోనని అనుమానం కలుగుతోంది: సోము వీర్రాజు జగన్‌పై హత్యాయత్నాన్ని ఖండించిన జీవీఎల్ సురక్షితంగా భావించే ఎయిర్‌పోర్ట్‌లో ఇటువంటి దాడులు జరగడం దారుణమని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ శ్రేణుల దిగ్భ్రాంతి తమ అభిమాన వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరగడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాయి. ఈ ఘటనపై వెంటనే విచారణ చేపట్టాలని విశాఖ ఎయిర్పోర్ట్ ముందు వైఎస్సార్సీపీ శ్రేణులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎయిర్‌పోర్ట్‌లోకి కత్తి ఎలా వెళ్లిందని, తనిఖీ చేయకుండా ఎయిర్పోర్ట్ సిబ్బంది దుండగుడిని ఎలా లోపలికి పంపించారని వారు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. దాడి చేసిన దుండగుడు అక్కడి రెస్టారెంట్లో పనిచేస్తుండగా.. ఆ రెస్టారెంట్ యజమాని హర్షవర్దన్ అని, అతను గతంలో గాజువాక నుంచి టీడీపీ టికెట్ కోసం ప్రయత్నించారని తెలుస్తోంది. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్‌పై విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగింది. ప్రజాసంకల్పయాత్ర పూర్తిచేసుకుని హైదరాబాద్‌కు చేరుకునేందుకు విశాఖ ఎయిర్పోర్ట్ లాంజ్‌లో ఆయన ఎదురుచూస్తుండగా దాడి జరిగింది. అక్కడి రెస్టారెంట్లో పనిచేసే వెయిటర్ శ్రీనివాస్ సెల్ఫీ నెపంతో వైఎస్ జగన్ వద్దకు వచ్చి.. కత్తితో మెడపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. వైఎస్ జగన్ తప్పించుకోవడంతో ఆయన భుజానికి తీవ్రగాయమైంది. కోడిపందేలకు ఉపయోగించే కత్తితో దాడి చేశాడని, ఉద్దేశపూర్వకంగానే ఈ హత్యాయత్నం జరిగినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. -
విజయసాయి రెడ్డి ప్రశ్నలకు మంత్రుల జవాబులు
సాక్షి, న్యూఢిల్లీ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నలకు సోమవారం కేంద్ర మంత్రులు రాజ్యసభలో సమాధానమిచ్చారు. విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలపై ఎంపీ ప్రశ్నకు గనుల శాఖ సహాయ మంత్రి హరిభాయ్ పార్ధీబాయ్ చౌదరి వివరణనిచ్చారు. విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాల కోసం ప్రభుత్వ రంగ సంస్థ నాల్కో ప్రతిపాదనలు సమర్పించినట్టు పేర్కొన్నారు. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ మైనింగ్ కోసం కొన్ని బ్లాక్‌లను కేటాయించాల్సిందిగా నాల్కో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదనలను సమర్పించిందని చెప్పారు. బాక్సైట్ గనుల కేటాయింపు జరిగితే విశాఖపట్నంలో అల్యూమినా రిఫైనరీ కాంప్లెక్స్ ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమని నాల్కో తన ప్రతిపాదనలలో పేర్కొన్నట్లు ఆయన వెల్లడించారు. విశాఖ ఏజెన్సీలోని గూడెం, జెర్రలలోని బాక్సైట్ బ్లాక్‌లతోపాటు తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని కాటంరాజు కొండ వద్ద గల బాక్సైట్ బ్లాక్‌లను తవ్వకాల కోసం లీజుకు కేటాయించాల్సిందిగా 2007 నవంబర్లోనే నాల్కో దరఖాస్తు చేసిందన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన సిఫార్సులను ఆమోదిస్తూ ఆయా బాక్సైట్ బ్లాక్‌లలో తవ్వకాలు జరిపేందుకు 2009 సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం నాల్కోకు అనుమతించినట్లు మంత్రి తెలిపారు. కారణాంతరాల వలన నాల్కో బాక్సైట్ తవ్వకాలను చేపట్టలేకపోయిందని పేర్కొన్నారు. దీంతో తిరిగి ఏజెన్సీ ప్రాంతంలోని బాక్సైట్ బ్లాక్‌లలో మైనింగ్ లీజు కోసం నాల్కో 2017 మే, 2017 సెప్టెంబర్ మాసాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు దరఖాస్తు చేసుకున్నట్లు మంత్రి తెలిపారు. సుప్రీం కోర్టు (సమతా తీర్పులో) ఆదేశాల ప్రకారం షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ప్రభుత్వ లేదా ప్రభుత్వ అధీనంలోని సంస్థ మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించవచ్చు. నాల్కో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినందున షెడ్యూల్డు ఏరియాలో మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించడానికి అర్హత కలిగి ఉందని ఆయన వెల్లడించారు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో విమాన సర్వీసులపై ఆంక్షలు లేవు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో ఆయిల్ రిఫైనరీ, పెద్ద ఎత్తున ఆయిల్ ట్యాంక్‌లు ఉన్నందున రక్షణ శాఖ విమానాల్లో పైలట్ల శిక్షణకు ఇది ఎంతవరకు సురక్షితం అన్న ప్రశ్నకు రక్షణ శాఖ సహాయ మంత్రి సుభాష్ భామ్రే లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో కమర్షియల్ విమానాల రాకపోకలపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని వెల్లడించారు. విశాఖపట్నంలో ప్రాథమికమైన ఫ్లైయింగ్ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించబోమని తెలిపారు. సుశిక్షితులైన పైలట్లే ఈ ఎయిర్పోర్ట్ నుంచి మిలటరీ విమానాలను ఆపరేట్ చేస్తారని చెప్పారు. మిలటరీ విమానాల రాకపోకలకు సంబంధించి అవసరమైన అన్ని భద్రతా చర్యలు పాటిస్తున్నామని వెల్లడించారు. ఆయిల్ రిఫైనరీలు, ట్యాంక్‌లపై నుంచి మిలటరీ విమానాలు రాకపోకలు సాగించవని మంత్రి స్పష్టం చేశారు. -
ఆకాశవీధిలో.. కార్గో అదరహో
సాక్షి, విశాఖపట్నం: విశాఖ విమానాశ్రయం ప్రయాణికుల సంఖ్యలోనే కాదు.. ఎయిర్ కార్గో హ్యాండ్లింగ్లోనూ దూకుడు ప్రదర్శిస్తోంది. ఏటికేడాది కార్గో రవాణాలో ముందుకు దూసుకువెళ్తోంది. ఇటీవల ఎయిర్‌పోర్టు సర్వీస్ క్వాలిటీలో ఎయిర్‌పోర్టు కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) ఇచ్చిన ర్యాంకింగ్‌లో విశాఖ విమానాశ్రయం 173 నుంచి 112వ ర్యాంకు సాధించింది. ఈ ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 2016–17లో 2.33 మిలియన్ల మంది ప్రయాణించగా, 2017–18లో ఆ సంఖ్య 2.48 మిలియన్లకు పెరిగింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ విమానాశ్రయం టెర్మినల్ బిల్డింగ్‌ను 19,800 నుంచి 29,650 చదరపు మీటర్లకు విస్తరిస్తున్నారు. అలాగే ఎయిర్‌క్రాఫ్ట్‌ల పార్కింగ్ సదుపాయాన్ని 8 నుంచి 16కి పెంచారు. మరోవైపు డొమెస్టిక్ (దేశీయ) కార్గో రవాణాలో గత ఏడాది తొలి త్రైమాసికానికి 1,283 టన్నుల కార్గో రవాణా చేయగా ఈ ఏడాది అది 15.43 శాతం పెరిగి 1,481 టన్నులకు చేరింది. 2017–18 మొత్తమ్మీద 4,846 టన్నుల కార్గో రవాణా నిర్వహించింది. రికార్డు స్థాయిలో వృద్ధి విశేషమేమిటంటే ఈ ఏడాది తొలి క్వార్టరు రికార్డు స్థాయిలో అంతర్జాతీయ కార్గో రవాణాలో 747 శాతం వృద్ధి సాధించింది. గత సంవత్సరం తొలి క్వార్టరులో 15.70 టన్నుల అంతర్జాతీయ కార్గో రవాణా జరగగా, ఈ ఏడాది అది 133 టన్నులకు పెరిగింది. కార్గో రవాణాలో రొయ్యలు, ఫార్మా ఉత్పత్తులు, బ్రాండిక్స్‌లో తయారైన దుస్తులు, వజ్రాల ఎగుమతులు ఎక్కువగా ఉంటున్నాయి. ఇలా చేస్తే ఇక దూసుకుపోవడమే.. హైదరాబాద్, చెన్నైకంటే కార్గో హ్యాండ్లింగ్ చార్జీలు విశాఖలో 20 శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ ప్రగతి కనిపిస్తోంది. అవే రాయితీలు ఈ విమానాశ్రయానికి కూడా అమలు చేస్తే మరింత గణనీయమైన వృద్ధి సాధించడానికి వీలవుతుందని వ్యాపారవేత్తలు, ఎగుమతిదార్లు, ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ విమానాశ్రయం నుంచి కార్గో రవాణా మరింత విస్తృతం కావాలంటే మరికొన్ని చర్యలు తీసుకోవాలని వీరు సూచిస్తున్నారు. అంతర్జాతీయ ఎయిర్ కార్గో కాంప్లెక్స్, దేశీయ కార్గోలో మౌలిక వసతుల విస్తరణ, పచ్చి సరకులు చెడిపోకుండా టెంపరేచర్ కంట్రోల్ జోన్, డ్రగ్ కంట్రోల్, యానిమల్ క్వారంటైన్ ఆఫీసర్ల నియామకం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. వీటిని సమకూర్చడంతో పాటు రాయితీలిస్తే ఫార్మా కంపెనీలు తమ ఉత్పత్తుల ఎగుమతి, దిగుమతులను ఇతర రాష్ట్రాల ఎయిర్‌పోర్టు నుంచి కాకుండా విశాఖ విమానాశ్రయం ద్వారా జరిపే వీలుంటుందని విశాఖ డెవలప్మెంట్ కౌన్సిల్ అధ్యక్షుడు ఒ.నరేష్కుమార్, ఏపీ ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డీఎస్ వర్మ ‘సాక్షి’తో చెప్పారు. ఆంక్షల ఎత్తివేతతో ఊరట అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఈ విమానాశ్రయంపై నావికాదళం పౌర విమానాల రాకపోకలపై ఇటీవల ఆంక్షలు విధించింది. ఈ నిర్ణయంపై సర్వత్రా నిరసన వ్యక్తం కావడంతో కొద్దిరోజుల్లోనే నేవీ ఆంక్షల నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ఈ తరుణంలో ఇప్పుడు కార్గో రవాణా కూడా ఊపందుకోవడంపై విశాఖ వ్యాపార, వాణిజ్య వర్గాల్లో ఒకింత ఆనందం వ్యక్తమవుతోంది. -
విశాఖ ఎయిర్‌పోర్టులో అనౌన్స్మెంట్ బంద్
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం నుంచి ప్రయాణికులకు అనౌన్స్మెంట్ సిస్టంను బంద్ చేశారు. దిస్ ఈజ్ ఏ సైలెంట్ ఎయిర్పోర్ట్ అంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. ఇక్కడ దేశీ య, అంతర్జాతీయ ప్రయాణికుల తాకిడి అనూహ్యంగా పెరగడం, వరుసగా విమానాల రాకపోకలు సాగిస్తుండడంతో అనౌన్స్మెంట్ల ప్రక్రియను గతంలో పెంచారు. విమానాశ్రయ టెర్మినల్ బిల్డింగ్‌లోనే కాదు. ఎదురుగా ఉన్న గార్డెన్‌లోనూ సౌండ్ హారన్లు ఏర్పాటు చేశారు. విమానాల రాకపోకల అనౌన్స్మెంట్ బస్‌స్టాండ్‌లో మాదిరిగా ఇక్కడా వినిపించేది. అయితే తాజాగా విమానాశ్రయ అధికారులు కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. విమానాల తాకిడి పెరగడంతో శబ్దకాలుష్యం పెరిగిందని చెబుతున్నారు. ఇలా మంగళవారం నుంచి అనౌన్స్మెంట్ ప్రక్రియను నిలుపుదల చేశారు. ఇక్కడ డిస్ప్లే బోర్డులను గమనించి విమాన సర్వీసులు ఉపయోగించుకోవాలని డైరెక్టర్ ప్రకాష్‌రెడ్డి సూచించారు. ప్రయాణికులకు డిస్‌ప్లేబోర్డులతో పాటు వారి ఫోన్లకు ముందస్తు సమాచారాలను అనుసరించి విమాన సర్వీసులు వాడుకోవాలని కోరారు. అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఇలాంటి చర్యలు ఉన్నాయని చెప్పారు. అత్యవసరాల్లో మాత్రమే అనౌన్స్మెంట్లు జరుగుతాయని వివరించారు. -
ఎగిరిపోతే ఏం బాగుంటుంది?
‘‘విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఎయిర్‌కార్గో అంతర్జాతీయ కేంద్రంగా రూపొందిస్తాం. ఇపుడున్న స్థాయి చాలదు. ఇంకా 105 టన్నుల సామర్థ్యాన్ని మోసే విమానాలు వస్తే ఇపుడున్న సదుపాయాలు చాలవు. అందుకే విశాఖ విమానాశ్రయాన్ని భోగాపురానికి తరలించనున్నాం. ఇక్కడ కోస్తాంధ్ర వ్యాపార, ఉపాధి అవకాశాలకు కేంద్రంగా చేస్తాం. విశాఖలో ఉండాల్సిన విమానాశ్రయం భోగాపురానికి తరలిస్తే ప్రయాణికులకు వచ్చే నష్టం ఏముంది?‘‘ ఇవీ.. ఇటీవల కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు పత్రికల ముందు చేసిన వ్యాఖ్యలు. దీన్నిబట్టి విశాఖ విమానాశ్రయం బిచాణా ఎత్తివేత దాదాపు ఖరారైనట్లుగా భావించవచ్చు! గోపాలపట్నం: అదిగదిగో.. అక్కడే.. ఎన్ఏడీ జంక్షన్‌కు సమీపంలోనే విశాఖ విమానాశ్రయం ఉండేది. ఇప్పుడు భోగాపురానికి తరలిపోయింది... విశాఖ విమానాశ్రయం గురించి ఇలా చెప్పుకునే రోజులు సమీపిస్తున్నాయి. అంటే ఆర్థిక రాజధాని అయిన విశాఖలో అసలు విమానాశ్రయమే లేదా? పొరుగున ఉన్న విజయనగరానికి తరలిపోయిందా అని ఆశ్చర్యపోయే పరిస్థితి దాపురించనుంది. ఇలా ఎందుకు జరగకూడదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు ప్రశ్నిస్తుండడంతో కోస్తాంధ్ర ప్రయాణికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. విశాఖ విమానాశ్రయం చివరికి ఓ జ్ఞాపకంగా మిగిలిపోనుందా అన్న ఆవేదన వ్యక్తమవుతోంది. విశాఖ విమానాశ్రయం ఇక కార్గో కాంప్లెక్స్‌కే.. ఇక్కడ పాత టెర్మినల్ భవనంలో దేశీయ కార్గో సర్వీసులు రెండేళ్ల క్రితం ప్రారంభం కాగా, తాజాగా అంతర్జాతీయ కార్గో సర్వీసులూ ప్రారంభమయ్యాయి. శ్రీలంక, దుబాయ్, సింగపూర్, కౌలాలంపూర్‌లకు అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులోకి రావడంతో రోజుకు మూడు టన్నుల నుంచి నాలుగు టన్నుల కార్గో ఉత్పత్తులు దేశీయంగా, అంతర్జాతీయంగా జరుగుతున్నాయి. ఈ తరుణంలో విశాఖ విమానాశ్రయాన్ని మొత్తంగా భోగాపురానికి తరలించి ఇక్కడ కేవలం ఎయిర్కార్గోని మాత్రమే అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర పౌర విమాన యానశాఖమంత్రి అశోక్‌గజపతిరాజు కొద్ది రోజుల క్రితం స్పష్టం చేశారు. వదులుకోవడం దేనికి? విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని విశాఖ నుంచి వెళ్లిపోవడాన్ని ఎలా వదులుకుంటామని ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారు. విశాఖ అంతర్జాతీయ ఎయిర్‌కార్గో ద్వారా ప్రస్తుతం మూడు నుంచి నాలుగు టన్నుల ఎగుమతి దిగుమతులు దేశీయ, అంతర్జాతీయంగా జరుగుతున్నాయి.ఇపుడు విశాఖకు వస్తున్న అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణికుల పరిమితి కాక మూడు టన్నుల సరకులు రవాణా చేసే వీలుంది. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద బోయింగ్ 747లో ప్రయాణికులు లేకుండా ఒకేమారు 43టన్నుల సరకు తీసుకెళ్లే వీలుంది. ఎయిర్‌బస్ 300లో ప్రయాణికులు లేకుండా 43టన్నులు తీసుకెళ్లవచ్చు. బోయింగ్ 727లో 27 టన్నుల సరకు రవాణాకు వీలుంది. అంత మహాపట్టణంగా ఉన్న ఢిల్లీలోనే అశోక్ గజపతిరాజు చెప్పినట్లు 105 టన్నుల సామర్థ్యం మోసే విమానాలు తిరగడం లేదు. ఇలాంటి తరుణంలో బలవంతంగా విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భోగాపురానికి ఎందుకు తరలించాలని పలువురు ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ఇదీ ప్రస్థానం... రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నేవీ అవసరాల కోసం ఏర్పాటైన విశాఖ విమానాశ్రయం 1960 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. అప్పట్లో 4 వేల అడుగుల పొడవున రన్‌వేతో చిన్న టెర్మినల్ ఉండేది. పదుల సంఖ్యలో ప్రయాణికులుండేవారు. హైదరాబాదు నుంచి విశాఖకు ఒక్క విమానమే నడిచేది. 1970లో మరో టెర్మినల్ బిల్డింగ్, 6500 అడుగుల పొడవైన రన్‌వే విస్తరించుకుంది. 2009లో అంతర్జాతీయస్థాయిలో 10030 అడుగుల రన్‌వేతో రూపుదిద్దుకుంది. ఈ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి కేంద్రం రూ.315కోట్ల నిధులు వెచ్చించగా, నేవీ రూ.100 కోట్ల ఖర్చు చేసింది. నేవీకి, పౌరవిమానాయానశాఖకు సఖ్యత ఉండడంతో 24గంటల విమానాశ్రయ నిర్వహణకు అనుమతులొచ్చాయి. తర్వాత ఇక్కడ అంతర్జాతీయ టెర్మినల్ భవనాన్ని నిర్మించారు. కావాల్సిన అన్ని సదుపాయాలూ ఏర్పాటయ్యాయి. ఏటా మొత్తంమ్మీద 23.50లక్షల వరకూ ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో విమానాలు, దేశీయవిమానాలు పెరగడంతో ఇక్కడ మరో ఆరు పార్కింగ్ బేలు కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించారు. రేపోమాపో ప్రారంభించనున్నారు. దేశీయ విమానాశ్రయం, అంతర్జాతీయ విమానాశ్రయం వేర్వేరుగా ఏర్పాటవుతున్నట్లు చెబుతుంటే ప్రయాణికులు ఆనందిస్తున్నారు. అయితే ఇంత అభివృద్ధి జరిగాక, ఈ విమానాశ్రయాన్ని ఇక్కడి నుంచి విజయనగరం జిల్లా భోగాపురానికి తరలించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతుండడం ఎవరికీ మింగుడుపడని విషయం. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని అనుమతులూ వచ్చినట్లు తెలుస్తోంది. 98శాతం ప్రయాణికుల వ్యతిరేకత విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురానికి తరలిపోతుందన్న నిజాన్ని ప్రయాణికులు జీర్ణించుకోలేకపోతున్నారు. మా సంఘం చేపట్టిన సర్వేలో 98 శాతం ప్రయాణికులు విశాఖ విమానాశ్రయాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయడానికి ఇంకా స్థలం ఉంది. అంతర్జాతీయ కార్గోకు సరిపడా సదుపాయం ఉంది. ఇలాంటపుడు మార్పు అవసరం లేదు. కావలిస్తే భోగాపురాన్ని ఉడాన్ టైప్ టూ విమానాశ్రయంగా రూపొందించుకోవచ్చు. – డి.వరదారెడ్డి, భారత విమానప్రయాణికుల సంఘ అధ్యక్షుడు -
మొరాయించిన ఎయిర్ ఇండియా విమానం
-
ఎయిరిండియా పరువు పోయింది
గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): ఎయిరిండియా సిబ్బంది విమాన ప్రయాణికులకు నరకం చూపించారు. విమానం మొరాయించడంతో ఉదయం నుంచి పడిగాపులు పడ్డారు. విశాఖ విమానాశ్రయంలో గురువారం ఉదయం 7.50 గంటలకు 180 మంది దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులతో ఢిల్లీకి బయలుదేరిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. విమానం రన్‌వే నుంచి కదులుతూ ఎరరడానికి సిద్ధమయ్యే సరికి సమస్యను పైలెట్ గుర్తించి విమానాన్ని తిరిగి అప్రాన్పైకి తీసుకొచ్చేశారు. ప్రయాణికులందర్నీ దించేసి టెర్మినల్ బిల్డింగ్‌లోకి పంపారు. మరో విమాన సర్వీసు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేశారు. అలా కుదరదని విమాన సంస్ధ ఉద్యోగులు బదులివ్వడం, గంటల తరబడి టెర్మినల్ బిల్డింగ్‌లో ఉంచేయడంతో ప్రయాణికులు టిఫిన్లు, భోజనాలు లేక అల్లాడిపోయారు. తాను పొరుగుదేశానికి అత్యవసరంగా వెళ్లాలని విదేశీ ప్రయాణికురాలు వత్తిడి తెచ్చినా ఢిల్లీకి ఇంకో విమానంలో పంపలేమని, రీబుకింగ్ చేసుకోవాల్సిందేనని సెలవిచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎయిరిండియా కూడా ప్రత్యామ్నాయం చూపక పోతే ఎలా అని ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. అయినా ఎయిరిండియా నిర్వాహకులు స్పందించలేదు. కొందరు ప్రత్యామ్నాయ విమాన సర్వీసులను వెతుక్కుని గమ్యాలకు వెళ్లిపోయినా మిగతా ప్రయాణికులు పడిగాపులు కాశారు. రాత్రి తొమ్మిదిన్నరకు విమానం కదులుతుందని విమానవర్గాలు చెప్పినా రాత్రి పన్నెండయినా విమానం కదల్లేదు. పదకొండు గంటలకు అధికారులు కూడా ఇక్కడి నుంచి ప్రయాణికులను వదిలేసి వెళ్లిపోయారు. దీంతో ఇక్కడ విదేశీయులు, పిల్లలతో మరి కొందరు తల్లులు నానా యాతనపడిపోయారు. కనీసం భోజన సదుపాయాల్లేకుండా పట్టించుకోకుండా ఇలా హింస పెట్టడమేంటని ప్రయాణికులు గగ్గోలు పెట్టారు. కనెక్టివిటీ ఫ్లెయిట్ మిస్ అవుతామని విదేశీ ప్రయాణిలు ఆందోళన చెందారు. ఎయిరిండియా పరువు పోయింది ప్రభుత్వ రంగ సంస్థగా ఎయిరిండియా పరువు పోయింది. ఇంత దారుణం ఎపుడూ చూడలేదు. విమానం మొరాయించాక ప్రత్యామ్నాయం చూపనప్పుడు ప్రయాణికుల పరిస్థితి ఏమిటని ఉన్నతాధికారులు పట్టించుకోపోతే ఎలా. ఇదేనా బాధ్యత. ప్రత్యామ్నాయం అడిగితే ఇంకో టికెట్ తీసుకోవాలని చెప్పారు. – డాక్టర్ డీవీఏఎస్వర్మ, చైనా ప్రయాణికుడు దుర్మార్గంగా వ్యవహరించారు ఢిల్లీలో ఆలిండియా ప్రభుత్వ రంగ పర్యవేక్షణ కోరుతూ కార్మిక సంఘాలతో జంతర్‌మంతర్ వద్ధ «ధర్నా చేయాలని మూడునెలల ముందే టికెట్లు బుక్ చేసుకున్నాం. గురువారమే చేరుకోవాల్సి ఉంది. – రవీంద్రబాబు, బీహెచ్ఎల్ కార్మికనేత -
మంత్రి అశోక్ గజపతి దొరికిపోయారు
-
ఇరకాటంలో అశోక్‌గజపతి రాజు!
న్యూఢిల్లీ: విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బందితో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి గొడవ వ్యవహారంలో పౌర విమాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు దొరికిపోయారు. గొడవ జరినప్పుడు ఆయన అక్కడే ఉన్నారని వెల్లడైంది. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిపై రిపబ్లిక్ టీవీ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో ఈ విషయం బహిర్గతమైంది. ఘటన జరిగిన రోజు అశోక్ గజపతిరాజు.. విమానాశ్రయంలోనే ఉన్నారని, ఆయనే మేనేజర్‌ను పిలిచి తనకు బోర్డింగ్ పాస్ ఇప్పించారని స్టింగ్ ఆపరేషన్‌లో దివాకర్‌రెడ్డి వెల్లడించారు. ‘ఆయన స్టేషన్ మేనేజర్‌ను పిలిచారు. రెడ్డి ఏది అడుగుతున్నారో అది ఇవ్వండ’ని మంత్రి ఆదేశించినట్టు తెలిపారు. ఆ రోజు అదే విమానంలో విశాఖ నుంచి హైదరాబాద్‌కు వచ్చానని తెలిపారు. దివాకర్‌రెడ్డి వ్యాఖ్యలతో అశోక్ గజపతిరాజు ఇరకాటంలో పడ్డారు. జేసీ గొడవతో తనకు సంబంధం లేదని గతంలో మంత్రి చెప్పారు. అయితే ఈ ఘటనపై అశోక్ గజపతిరాజు విచారణకు ఆదేశించడంపై జేసీని ప్రశ్నించగా... ‘ఆయన రాజకీయ నాయకుడు కాదు. ఆయన అధికారి. ఆయన రాజకీయ నేతగా పనిచేయడం లేదు. అధికారిలా ఆయన పనిచేస్తున్నార’ని సమాధానమిచ్చారు. ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై దౌర్జన్యం చేసిన మాట వాస్తమేనని దివాకర్‌రెడ్డి ఒప్పుకున్నారు. ‘నేను హడావుడిలో ఉన్నాను. రెండు మూడుసార్లు బతిమాలినా నాకు టిక్కెట్ ఇవ్వకపోవడంతో భావోద్వేగానికి గురయ్యాను. అక్కడున్న ప్రింటర్‌ను పక్కకు తోసేయ్యాలనుకున్నాను. కానీ నావల్ల కాలేదు. నేను ఎవరికీ క్షమాపణ చెప్పను. నేనెందుకు క్షమాపణ చెప్పాలి. నేనూ మనిషినే. ప్రయాణం హడావుడిలో ఈ ఘటన చోటుచేసుకుంద’ని జేసీ పేర్కొన్నారు. కాగా, ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బందిపై దివాకర్‌రెడ్డి దౌర్జన్యం చేసిన వీడియో దృశ్యాలను కూడా రిపబ్లిక్ టీవీ ప్రసారం చేసింది. ఇండిగో ఎయిర్‌లైన్స్ మేనేజర్‌ను వెనుక నుంచి జేసీ నెట్టేస్తున్న దృశ్యం ఇందులో ఉంది. అయితే ఫ్రెండ్లీగానే ఆయన భుజాలపై చేతులు వేశానని, నెట్టలేదని ఆయన సమర్థించుకున్నారు. ఈ నెల 15న విశాఖ ఎయిర్‌పోర్టులో దివాకర్‌రెడ్డి వీరంగం సృష్టించారు. తనకు బోర్డింగ్ పాస్ ఇవ్వలేదన్న కోపంతో ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బందిపై జులుం ప్రదర్శించారు. దీంతో ఇండిగో ఎయిర్‌లైన్స్, ఎయిరిండియా, స్పైస్‌జెట్, జెట్‌ఎయిర్‌వేస్ సహా పలు సంస్థలు ఆయనపై నిషేధం విధించాయి. -
ఎయిర్‌పోర్టులో జేసీ దివాకర్‌రెడ్డి వీరంగం
విశాఖపట్నం: టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి గురువారం ఉదయం విశాఖ ఎయిర్‌పోర్టులో వీరంగం సృష్టించారు. బోర్డింగ్ పాస్ ఇవ్వలేదన్న కోపంతో దౌర్జన్యానికి దిగారు. ఇండిగో విమానంలో హైదరాబాద్ వెళ్లేందుకు ఈ ఉదయం ఆయన విమానాశ్రయానికి వచ్చారు. బోర్డింగ్ పాస్ జారీ సమయం ముగియడంతో సిబ్బంది కౌంటర్‌ను ముసేశారు. తనకు బోర్డింగ్ పాస్ ఇవ్వాలని సిబ్బందితో ఆయన వాదనకు దిగారు. సమయం ముగిసిందని ఇవ్వడం కుదరదని చెప్పడంతో దివాకర్‌రెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు. బోర్డింగ్ పాస్ ప్రింటర్‌ను విసిరేసి వీరంగం సృష్టించారు. జేసీ చర్యతో అక్కడున్నవారంతా భయాందోళనకు గురయ్యారు. ఆయనపై ఉన్నతాధికారులకు ఎయిర్‌పోర్టు సిబ్బంది ఫిర్యాదు చేశారు. కొద్ది రోజుల క్రితం తమ మేనేజర్‌పై దాడి చేసిన శివసేన రవీంద్ర గైక్వాడ్‌ను విమానాల్లో ప్రయాణించకుండా ఎయిరిండియా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ప్రైవేటు విమాన సంస్థలు కూడా ఆయనపై నిషేధం అమలు చేశాయి. దిగివచ్చిన గైక్వాడ్ పశ్చాత్తాపం వ్యక్తం చేయడంతో ఆయనపై నిషేధం తొలగించారు. ఎయిర్‌పోర్టులో దౌర్జన్యం చేసిన దివాకర్‌రెడ్డిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. -
విజయసాయిరెడ్డికి సాదర స్వాగతం
గోపాలపట్నం (విశాఖ పశ్చిమ) : విశాఖ విమానాశ్రయంలో శుక్రవారం రాత్రి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డికి సాదర స్వాగతం లభించింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఆయనను ఇక్కడ నియోజకవర్గ సమన్వయకర్తలు వంశీకృష్ణ శ్రీనివాస్, తిప్పల నాగిరెడ్డి, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్‌రెడ్డి, రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి జీవీ రవిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు రొంగలి జగన్నాథం, కంపా హనోక్, కేంద్ర కమిటీ సభ్యుడు ప్రగడ నాగేశ్వరరావు, నగర ప్రచార కమిటీ అధ్యక్షుడు బర్కత్ అలీ, నగర బీసీ సెల్ మాజీ కన్వీనర్ పక్కి దివాకర్ తదితర నాయకులు, ఏయూ విద్యార్థి సంఘ నేతలు, పలు వార్డుల అధ్యక్షులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. -
జగన్ పట్ల పోలీసుల దౌర్జన్యం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్‌తో విశాఖపట్నం ఆర్కే బీచ్ వద్ద తలపెట్టిన కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనడానికి ఇక్కడకు చేరుకున్న ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమానాశ్రయం లోనికి కూడా అనుమతించకుండా పోలీసులు దారుణంగా వ్యవహరించారు. పార్టీకి చెందిన ఎంపీలు విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, నాయకులు అంబటి రాంబాబు తదితరులతో కలిసి గురువారం మధ్యాహ్నం జగన్ మోహన్ రెడ్డి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం విమానాశ్రయం చేరుకున్నారు. విమానాశ్రయంలో దిగగానే జగన్ నేతృత్వంలో ప్రతినిధి బృందం ఎయిర్ పోర్టు లాబీల్లోకి చేరుకుంటుండగా పోలీసులు అడ్డంగా నిలబడి వారిని అడ్డుకున్నారు. డొమెస్టిక్ లాబీల్లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా అకస్మాత్తుగా కొందరు వ్యక్తులు వచ్చి చుట్టుముట్టి వారిని ముందుకు కదలకుండా అడ్డుకున్నారు. ఈ ఆకస్మిక పరిణామానికి విస్మయం చెందిన నాయకులు మీరెవరంటూ ప్రశ్నించినా వారి నుంచి సమాధానం రాలేదు. విమానం నుంచి దిగివస్తున్న తమను టెర్మినల్ లోకి వెళ్లేందుకు అనుమతించకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించినా వారినుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దాంతో ఆగ్రహించిన నేతలు విమానాశ్రయం లాబీల్లోకి ఎందుకు అనుమతించడం లేదంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా అడ్డుకున్న వారికి తోడుగా మరికొందరు పోలీసులు వచ్చి ఆ నాయకులను వెనక్కి తోయడం ప్రారంభించారు. కేంద్రప్రభుత్వ భద్రతా సిబ్బంది (సీఐఎస్ఎఫ్) సంరక్షణలో ఉండాల్సిన విమానాశ్రయంలో మీరంతా ఎవరు? ఎందుకు అడ్డుకుంటున్నారంటూ ప్రశ్నించినా వారి నుంచి సమాధానం లేకపోగా నేతలను బయటకు వెళ్లనివ్వకుండా, విమానాశ్రయం లాబీల్లోకి కూడా అనుతించకుండా తోసేశారు. నాయకులపై చేతులు పెట్టి వెనక్కి నెట్టడం ప్రారంభించారు. ప్రతిపక్ష నాయకుడు, ఎంపీలు అన్నది కూడా చూడకుండా వారిని తోయడం, వారి చుట్టూ ఒక చైనులా ఏర్పడి ముందుకు కదలకుండా అడ్డుకోవడం వంటి దుశ్చర్యలకు దిగారు. ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించిన కొందరు నేతలను వారు వెనక్కి ఈడ్చుకెళ్లారు. సివిల్ డ్రెస్ లో ఉన్న మీరంతా ఎవరు? అని అడిగినా సమాధానం రాలేదు. ప్రతిపక్ష నాయకుడు, పార్లమెంట్ సభ్యులు ఉన్నారన్న కనీస మర్యాద పాటించకుండా వ్యవహరించారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండాల్సిన నేతల విషయంలో ఇలా సివిల్ డ్రెస్సులో ఉన్న వాళ్లు అడ్డుకోవడం మొత్తం యావత్ ప్రజలను విస్మయపరిచింది. ఎవరినైనా అడ్డుకోవాలన్నప్పుడు మరీ ముఖ్యంగా కేబినేట్ స్థాయి నేత, పార్లమెంట్ సభ్యుల విషయంలో పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అలాంటిదేమీ లేకుండా సివిల్ డ్రెస్సుల్లో రన్ వే వైపు పెద్ద సంఖ్యలో ముందుగానే పోలీసు బలగాలను మోహరించడం గమనిస్తే ప్రతిపక్ష నాయకుడిని ఎట్టి పరిస్థితుల్లో విమానాశ్రయం నుంచి బయటకు రానివ్వకూడదన్న ఎత్తుగడతోనే ఉన్నట్టు అక్కడున్న పరిస్థితులు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. విమానం నుంచి దిగీదిగగానే ఇదేంటి? మమ్మల్ని ఎందుకు వెళ్లనివ్వడం లేదంటూ వారిపై జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి వస్తున్నారని ముందస్తు సమాచారం ఉండగా, కొన్ని గంటల ముందే విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో ప్రజలను తరిమి తరిమి కొట్టారు. ఆ పరిసరాల్లో పెద్దఎత్తున పోలీసు బలగాలను నియమించి ఎవరినీ అటువైపు రానీయకుండా అడ్డుకున్నారు. డీజీపీ స్వయంగా విమానాశ్రయం వద్దకొచ్చి పరిస్థితిని పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు సిబ్బందికి తగిన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించాలన్న డిమాండ్‌పై విశాఖలోని ఆర్కే బీచ్ లో గురువారం సాయంత్రం భారీ ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీ తలపెట్టగా ఆ ర్యాలీలో పాల్గొంటానని జగన్ మోహన్ రెడ్డి ముందుగానే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు ఉదయం నుంచి ఆర్కే బీచ్ కు ఎవరినీ రానీయకుండా పోలీసులు ప్రజలను.. మరీ ముఖ్యంగా యువతీ యువకులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఉదయం నుంచి విశాఖ తీరంలో భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించడమే కాకుండా కనుచూపు మేరలో ఎవరు కనిపించినా తరిమికొట్టారు. ఒకవైపు విశాఖపట్నం మొత్తంలో పోలీసులను మోహరించి ఒక టెర్రర్ వాతావరణం సృష్టించిన అదికారులు తీరా జగన్ మోహన్ రెడ్డి విశాఖ విమానాశ్రయం చేరుకున్న తర్వాత దాన్ని మరింత తీవ్రం చేశారు. విమానాశ్రయం రన్ వే వైపు లోపలే అడ్డుకోవడం పట్ల జగన్ మోహన్ రెడ్డి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రన్ వే పైనే మమ్మల్ని అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు. ఇలా అడ్డుకుంటున్న మీరంతా అసలు పోలీసులేనా (అంతా సివిల్ డ్రెస్సులో ఉన్నారు) అని, మీలో ఒక్కరు కూడా కనీసం ఐడీ కార్డులు ప్రదర్శించడం లేదని మండిపడ్డారు. రన్ వే పైన ప్రయాణికులను, అందులో ప్రతిపక్ష నాయకుడితో పాటు పార్లమెంట్ సభ్యులను అడ్డుకోవడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తమను రన్‌వే మీదనే అడ్డుకోవడం, అసలు లాంజ్ వైపు కూడా వెళ్లనివ్వకపోవడంతో.. 'మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారు ఇక్కడ? ఇటువైపు వీఐపీ లాంజ్ ఉంది, అటువైపు అరైవల్ లాంజ్ ఉంది. అక్కడకు వెళ్లండి. అయినా అసలు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతంలోకి రాష్ట్ర పోలీసులు ఎలా వస్తారు? ఒక ప్రయాణికుడిగా కూడా నన్ను లోపలకు పోనివ్వకుండా ఎందుకు ఆపుతున్నారు? లోపలకు అనుమతించండి, అక్కడ మాట్లాడదాం. ఎంతసేపు ఇక్కడ నిలబెడతారు? మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారు? మీరు ఇంకా ఎక్కువ చేస్తే ఇక్కడే కూర్చుంటాం, తర్వాతి విమానం వచ్చిన తర్వాతైనా మీరు తలుపులు తీయాల్సిందే '' అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతతో ఎలా ప్రవర్తించాలో కూడా తెలియకుండా డిపార్టుమెంటులో ఎలా ఉన్నారని అడిగారు. డొమెస్టిక్ ఎరైవల్స్ అని బోర్డు కూడా కనిపించడంలేదా, ప్రయాణికులను అక్కడకు అనుమతించాలని మీకు తెలియదా అంటూ నిలదీశారు. తలుపు తీయాలని.. డొమెస్టిక్ ఎరైవల్స్ వద్దకు కూడా వెళ్లనివ్వకుండా రన్ వే మీద ఆపడం ఏంటని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత ఎంతగా ప్రశ్నించినా అధికారుల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. అలాగని ముందుకు అనుమతించలేదు. దాంతో తమను అనుమతించాల్సిందేనంటూ జగన్ మోహన్ రెడ్డితో సహా నేతలంతా రన్ వే నుంచి లాబీల్లోకి వెళ్లే దారిలో బైఠాయించి అక్కడే నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగానే రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించాల్సిందేనంటూ నినాదాలు చేస్తూ తమ నిరసనను కొనసాగిస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డిని విమానాశ్రయం లాబీల్లోకి కూడా అనుమతించకుండా లోపలే నిర్భంధించారని తెలిసి విశాఖ ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. విమానం నుంచి జగన్ మోహన్ రెడ్డి దిగినా గంటల తరబడి ఆయన బయటకు రాకపోవడంతో లోపల ఏం జరుగుతుందో తెలియక పరిసర ప్రాంతాల్లో దూరంగా ఉన్న ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేకహోదాపై నినాదాలు కొనసాగించారు. కొందరు యువకులు విమానాశ్రయం సమీపంలోకి వచ్చే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డగించారు. జగన్ మోహన్ రెడ్డి విశాఖ చేరుకోవడానికి ముందుగానే వైఎస్సార్ సీపీ నేతలు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్ నాథ్ తదితర నేతలందరినీ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. ప్రస్తుతం విశాఖ విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉత్కంఠ, ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. -
విమానాశ్రయంలో పనిచేయని ఏటీఎం
దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల గగ్గోలు గోపాలపట్నం : విశాఖ విమానాశ్రయంలో ఎస్బీఐ ఏటీఎం పనిచేయక దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. ఇక్కడ ఉదయం నుంచి రాత్రి వరకూ 34 విమాన సర్వీసుల్లో వేలాదిగా ప్రయాణాలు సాగిస్తున్నారు. దేశీయ ప్రయాణికులతో పాటు ఇతర దేశాల ప్రయాణికులు ఇక్కడి ఏటీఎంకి వచ్చి భంగపడుతున్నారు. అవసరానికి ఏటీఎం పనిచేయక పోవడంతో ఇబ్బందిగా ఉందని పలువురు ఆవేదన చెందుతున్నారు -
జననేతకు నీరాజనం
విశాఖ విమానాశ్రయంలో ఘన స్వాగతం రాత్రి విశాఖలోనే బస.. నేడు హైదరాబాద్‌కు గోపాలపట్నం : విమానాశ్రయ ఆవరణ కిక్కిరిసిపోయింది. పతాకాలతో కళకళలాడింది. జగన్ జిందాబాద్ నినాదాలతో హోరెత్తింంది.. ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి విశాఖ రాక సందర్భంగా సోమవారం ఉదయం ఎయిర్‌పోర్టులో కనిపించిన దృశ్యమిది.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ ఆ పార్టీ నిర్వహిస్తున్న ఉద్యమంలో భాగంగా విజయనగరంలో యువభేరి కార్యక్రమం నిర్వహించారు. అందులో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి విమానంలో చేరుకున్న జగన్మోహన్రెడ్డికి పార్టీ కార్యకర్తలు, అభిమానులు నీరాజనాలు పట్టారు. అపూర్వ స్వాగతం పలికారు. వారి ఆదరణను చూసి ఉప్పొంగిన ఆయన విమానాశ్రయం వెలుపలికి వచ్చి అందరికీ అభివాదం చేశారు. నాయకులను పలకరించారు. అనంతరం రోడ్డుమార్గంలో విజయనగరం వెళ్లారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకుల రాకతో విమానాశ్రయ ఆవరణలో కోలాహలం నెలకొంది. అభిమానులు జగన్మోహన్రెడ్డితో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. కొందరు ఫొటోలు, సెల్ఫీలు దిగారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నా«థ్, ఎమ్మెల్యేలు బూడి ముత్యాలనాయుడు, గిడ్డి ఈశ్వరి, మాజీ ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, గొల్ల బాబూరావు, మళ్ల విజయప్రసాద్, కరణం ధర్మశ్రీ, తైనాల విజయకుమార్, నియోజకవర్గ సమన్వకర్తలు వంశీకృష్ణ యాదవ్, తిప్పల నాగిరెడ్డి, కోలా గురువులు, పెట్ల ఉమాశంకర్ గణేష్, పార్టీ పశ్చిమ నియోజకవర్గ పరిశీలకుడు సత్తి రామకృష్ణారెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి రవిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు కంపా హనూకు, జాన్ వెస్లీ, బీసీడీఎఫ్ అధ్యక్షుడు పక్కి దివాకర్, పార్టీ నాయకులు ఉరుకూటి అప్పారావు, జియ్యాని శ్రీధర్, గరికిన గౌరి, నగర మహిళా విభాగం అధ్యక్షురాలు ఉషాకిరణ్, శ్రీదేవి, జిల్లా అధికార ప్రతినిధి ఆల్ఫా కృష్ణ, రొంగలి జగన్నాథం, పల్లా చినతల్లి పెంటారావు, కలిదిండి బదిరీనాథ్, రాష్ట్ర యువజన అధికార ప్రతినిధి తుల్లి చంద్రశేఖర్ యాదవ్, నగర కార్యదర్శి చెవ్వేటి జీవన్‌కుమార్, 69వ వార్డు అధ్యక్షుడు దాసరి అప్పలరాజు, జిల్లా సంయుక్త కార్యదర్శి యతిరాజుల నాగేశ్వర్రావు తదితరులు జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కాగా విజయనగరం పర్యటన ముగించుకున్న అనంతరం సోమవారం రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత తిరిగి విశాఖ చేరుకున్న జగన్మోహన్రెడ్డి సరŠుక్యట్ హౌస్‌లో రాత్రి బస చేశారు. మంగళవారం ఉదయం 9.20 గంటలకు విమానంలో ఆయన హైదరాబాద్‌కు తిరిగి వెళతారని పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రొగ్రామ్స్ కమిటీ కన్వీనర్ తలశీల రఘురామ్ తెలిపారు. -
నాయుడు ద్వయం రాక.. జెండాకు అవమానం
విశాఖపట్టణం: జాతీయ భావాన్ని, దేశభక్తిని పెంపొందించడంలో భాగంగా సదరన్ రీజియన్‌లోని అన్ని విమానాశ్రయాల్లో బుధవారం జాతీయ జెండాలు ఆవిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు విశాఖపట్నం విమానాశ్రయ ప్రాంగణంలోని గార్డెన్లో 20 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పున జాతీయ భారీ జెండాను ఏర్పాటుచేశారు. బ్రిక్స్ సమావేశంలో పాల్గొనేందుకు బుధవారం నగరానికి వచ్చిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుల చేత ఆవిష్కరింపజేయాలని ఎయిర్ పోర్టు డైరెక్టర్ వినోద్ కుమార్ శర్మ భావించారు. విశాఖ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌ను ఒప్పించి సీఎం, కేంద్ర మంత్రి షెడ్యూల్ లో ఈ కార్యక్రమాన్ని కూడా పొందుపర్చారు. కానీ.. తొలుత విమానాశ్రయంలో దిగిన వెంకయ్యనాయుడు పాతటెర్మినల్ బిల్డింగ్ నుంచి వెలుపలికి వచ్చి.. బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులతో ఊరేగింపుగా నగరంలోకి వెళ్లిపోయారు. తర్వాత కొద్ది సేపటికే ప్రత్యేక విమానంలో విశాఖ వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. కలెక్టర్ సహా ప్రజాప్రతినిధులతో కలిసి బ్రిక్స్ సదస్సు ప్రాంగణానికి వెళ్లిపోయారు. భారీ జాతీయ జెండాను ఆవిష్కరించకుండా సీఎం, కేంద్రమంత్రి వెళ్లిపోవడంతో ఎయిర్ పోర్టు డైరెక్టర్ శర్మ ఒకింత ఆందోళనకుగురయ్యారు. వెంటనే కలెక్టర్‌కు ఫోన్ చేసి విషయం గుర్తుచేయగా.. 'వారికి తీరిక లేద'న్న సమాధానం వచ్చింది. దీంతో ఎం చెయ్యాలో పాలుపోని అధికారులు తర్జనభర్జనల అనంతరం కలెక్టర్‌తో చర్చించి మరో సారి జెండాను ఆవిష్కరింపజేద్దామనే నిర్ణయానికి వచ్చారు. అప్పటికి వరకు జెండాను జాగ్రత్తగా దాచి ఉంచాలని సిబ్బందికి సూచించారు. ఈలోగా వర్షం కురవడంతో జెండా తడిసిముద్దయింది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత జెండా తీసేశారు. ఆవిష్కరణకు సిద్ధంగా ఉంచిన జెండాను ఎంగరేయకుండా తీసేయడం అవమానించడమేనని పలువురు పేర్కొన్నారు. -
కూలిన మిగ్ విమానం ఇంధన ట్యాంక్
- పేలుడు కారణంగా భారీ మంటలు - విశాఖ విమానాశ్రయంలో కలకలం గోపాలపట్నం, మల్కాపురం(విశాఖ): విశాఖ విమానాశ్రయంలో సోమవారం ఉదయం 10 గంటల ప్రాం తంలో ఐఎన్ఎస్ డేగా నుంచి రోజూ మాదిరిగానే నాలుగైదు యుద్ధ విమానాలు విన్యాసాల కోసం బయల్దేరాయి. వాటిలో మిగ్-57 విమానం రన్‌వే నుంచి గాల్లోకి ఎగురుతున్న సమయంలో విమానంలోని ఇంధన ట్యాంకు రన్‌వేపైకి జారిపడింది. పెలైట్ అప్రమత్తమై విమానాన్ని ఆపకుండా గాల్లోకి దూసుకుపోవడంతో ప్రమాదం తప్పింది. ఇంధన ట్యాంకు పడిన చోట గడ్డి కూడా తగలబడడంతో మంటలు చెలరేగాయి. వెంటనే ఐఎన్ఎస్ డేగాతోపాటు, విమానాశ్రయం నుంచి అగ్నిమాపక శకటాలు వచ్చి మంటలు ఆర్పాయి. కాగా ఇంధన ట్యాంకుకు చెందిన ఒక శకలం మల్కాపురం హెచ్‌పీసీఎల్ సీఐఎస్ఎఫ్ క్వార్టర్స్‌లో పడటంతో పారిశ్రామిక ప్రాంత ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. కాగా, ఈ సంఘటనతో విమానాల రాకపోకలు గంటకుపైగా నిలిచిపోయాయి. ఫలితంగా పలు విమానాలు గాల్లోనే చక్కర్లు కొట్టాయి. అయితే విమానం నుంచి ఇంధన ట్యాంకు నగరంలో పడి ఉంటే పరిస్థితేంటని జనం భయంతో చర్చించుకున్నారు. ఇలాంటి ఘటన జరగడం విశాఖలో ఇది రెండోసారి. -
వెనక్కి వచ్చేశారు
షార్జా విమానాశ్రయంలోఅనుమతించకపోవడంతో ప్రయాణికులు వెనక్కి దుబాయ్ విమానాశ్రయంలో ఘటనే కారణం సాంకేతిక కారణాలతో పలు విమానాల రద్దు...ఆలస్యం గోపాలపట్నం : దుబాయ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో ఎమిరేట్స్ విమాన ప్రమాద ఘటన ప్రభావం ప్రయాణికులపై చూపింది. దుబాయ్ విమానాశ్రయంలో రనవ్‌వే దెబ్బతినడంతో విమానాశ్రయం తాత్కాలికంగా బంద్ అయింది. దీంతో షార్జాకి విమానప్రయాణాలు జరపడానికి ఎయిరిండియా టికెట్లిచ్చింది. గురువారం సాయంత్రం ఎయిరిండియా విమానంలో దుబాయ్ ప్రయాణికులతో షార్జాకి బయల్దేరిన విమానానికి హైదరాబాదు విమానాశ్రయంలో అంతరాయం ఏర్పడింది. షార్జా విమానాశ్రయంలో వాలడానికి పచ్చజెండా ఊపలేదు. అక్కడ రన్‌వే ఖాళీగా లేదన్న సంకేతాలు రావడంతో హైదరాబాదులో ప్రయాణికులు నిలిచిపోయారు. కొందరు అక్కడి నుంచి ప్రత్యామ్నాయ విమానాల్లో అత్యవర ప్రయాణాలు సాగించారు. మరో డెభ్భైమంది మాత్రం ఆందోళన వెలిబుచ్చారు. దీంతో ఆవిమాన సంస్థ శుక్రవారం ఉదయం వారిని విశాఖకు తిరిగి తీసుకొచ్చేసింది. ఇదిలా ఉండగా, శుక్రవారం ఎయిరిండియా విమాన సంస్థ షార్జా విమానాశ్రయంలో క్లియరెన్స్ తెచ్చుకోవడంతో ఆలస్యంగానయినా విమానం వచ్చింది. ఉదయం ఏడున్నరకి రావాల్సిన విమానం 10.30కి వచ్చింది. తిరిగి 10.50కి ఢిల్లీ బయల్దేరాల్సిన విమానం మధ్యాహ్నం 01.30కి బయలుదేరి వెళ్లింది. ఇదిలా ఉండగా, చెన్నై నుంచి విశాఖకు మధ్యాహ్నం 02.05కి రావాల్సిన విమానం సాయంత్రం 06.15కి విశాఖకు చేరింది. ఇది తిరిగి 03.55కి వెళ్లాల్సిన విమానం రాత్రి ఎనిమిది గంటలకు బయల్దేరింది. ఎయిర్‌కోస్తా విమాన సర్వీసు పలు కారణాల వల్ల రద్దయింది. దీంతో బెంగుళూరు-విశాఖ, హైదరాబాద్-విశాఖ, విశాఖ-బెంగళూరు సర్వీసులు రద్దయ్యాయి. సర్వీసుల అంతరాయంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. -
చంద్రబాబు తలచుకుంటే..
ఎయిర్‌పోర్టు పరిసరాల్లో తాత్కాలిక షెడ్డు నిర్మాణం కలెక్టర్ ఎన్.యువరాజ్ స్థలపరిశీలన విశాఖపట్నం: రాజు తలచుకుంటే.. కాదు కాదు సీఎం తలచుకుంటే ఏదైనా జరుగుతుంది. పగటి పూట వెన్నెల విరులు కురుస్తాయి. రాత్రి సూర్యుడు వెలుగులు చిందిస్తాడు. ఏంటో ఈ విడ్డూరం అనుకోవద్దు. ఎందుకంటే అలాంటి చిత్రాలే ఇప్పుడు జరుగుతున్నాయి. విషయమేమిటంటే సీఎం చంద్రబాబు రాజధాని అమరావతిలో కంటే విశాఖ నగరంలో పర్యటించిందే ఎక్కువ. సగటున వారానికోసారి నగరంలో అడుగుపెడుతున్నారు. ఆయనతో పాటు మంత్రులూ వస్తున్నారు. పైగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు వెళ్లాల్సి వచ్చినపుడు కూడా విశాఖ విమానాశ్రయంలో దిగి వెళుతున్నారు. ఎలా చూసినా సీఎం, మంత్రుల తాకిడి విశాఖకు విపరీతంగా పెరిగింది. వారు వచ్చి నపుడల్లా నగరంలోకి వచ్చి అతిథి గృహంలో విశ్రాంతి తీసుకోవడం, కార్యకర్తలను కలుసుకోవడం వంటి పనులకు సమయం సరిపోవడం లేదంట. దీంతో బాగా ఆలోచించిన పాలకులు ఎయిర్‌పోర్టు వద్దే అలాంటి ఏర్పాట్లు ఉంటే బాగుంటుందని భావించారు. అధికారం వారిది కాబట్టి వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేసేశారు. వారి ఆదేశాల మేరకు ఎయిర్‌పోర్టులో సీఎం కోసం తాత్కాలిక షెడ్ నిర్మాణానికి కలెక్టర్ ఎన్.యువరాజ్ గురువారం స్థల పరిశీలన జరిపారు. నిజానికి ఈ స్థలం నేవీ ఆధీనంలో ఉంది. వారి నుంచి అనుమతి తీసుకోవాలి. అధికారులు తలుచుకుంటే ఇదేమంత పెద్ద కష్టం కాదులే. అయితే అధికారపార్టీ కార్యకలాపాలకు ఎయిర్‌పోర్టును వేదిక చేసుకోవడమే విడ్డూరంగా ఉంది మరి. గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో త్వరలో నిర్మించనున్న ఈ షెడ్డును అంచెలంచెలుగా విస్తరించి టీడీపీ మినీ కార్యాలయంగా మార్చనున్నట్టు సమాచారం. కార్యకర్తల సమావేశాలు, పార్టీ సమీక్షలంటూ ఎయిర్‌పోర్టులో గందరగోళం సృష్టిస్తే దేశ, విదేశీ విమాన ప్రయాణికులకు ఇబ్బందిగా పరిణమించే అవకాశం ఉంది. -
ఐఎన్ఎస్ అనిర్వేష్ జలప్రవేశం
తీరప్రాంత భద్రత మరింత పటిష్టం: వైస్ అడ్మిరల్ హెచ్‌సీఎస్ బిస్త్ సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: తూర్పు నౌకాదళ అమ్ములపొదిలో మరో అత్యాధునిక నిఘా నౌక చేరింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ‘ఐఎన్ఎస్ అనిర్వేష్’ను తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ హెచ్‌సీఎస్ బిస్త్ సోమవారం నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. 50 మీటర్ల పొడవు, 317 టన్నుల బరువున్న ఈ వెసల్‌ను కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో రూపొందించారు. సముద్ర జలాలపై నిఘా కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ నౌకలో రాత్రి పూట కూడా పకడ్బందీగా గస్తీ విధులు నిర్వర్తించేందుకు అత్యాధునిక నైట్‌విజన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ నౌక ముందు భాగంలో 40/60 బోఫోర్స్ గన్ను అమర్చారు. ఈ నౌకలో ఆరుగురు అధికారులతోపాటు 34 మంది నౌకాదళ సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. ఈ సందర్భంగా వైస్ అడ్మిరల్ హెచ్‌సీఎస్ బిస్త్ మాట్లాడుతూ ఐఎన్ఎస్ అనిర్వేష్ ప్రవేశంతో తూర్పునౌకాదళం మరింత బలోపేతమైందని చెప్పారు. అత్యాధునిక రక్షణ వ్యవస్థతో రూపొందించిన ఈ వెసల్‌తో తీరప్రాంత భద్రత మరింత కట్టుదిట్టమవుతుందన్నారు. కమోర్తా శ్రేణికి చెందిన నౌక వచ్చే ఏడాది తూర్పు నౌకాదళంలోకి చేరుతుందని ఆయన తెలిపారు. కోస్ట్‌గార్డ్ ఐజీ ఎస్పీ శర్మ మాట్లాడుతూ విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో త్వరలో కోస్ట్‌గార్డ్ ఎయిర్ ఎన్క్లేవ్ ప్రారంభిస్తామని చెప్పారు. నిజాంపట్నం కోస్ట్‌గార్డ్ స్టేషన్‌ను త్వరలో మచిలీపట్నానికి మారుస్తామని వెల్లడించారు. నిజాం పట్నం వద్ద తగినంత లోతు లేకపోవడం, పోర్టు కూడా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. -
బాప్రే... టికెట్ 70 వేలా!
విమాన ధరలకు రెక్కలు రాకపోకల విమానాలన్నీ ఫుల్ జోరుగా విమాన ప్రయాణాలు గోపాలపట్నం: సంక్రాంతి సందడి ముగియడంతో జనం తిరుగు ప్రయాణాలతో విశాఖ విమానాశ్రయం కోలాహలంగా కనిపించింది. విమాన చార్జీలు ఠారెత్తించినా ప్రయాణికులు లెక్కచేయలేదు. దేశీయ ప్రయాణికులు, అంతర్జాతీయ ప్రయాణికులూ సమయానికే ప్రాధాన్యం ఇచ్చారు. విమాన చార్జీ ఒక దశలో రూ.70 వేలు పలికినా ప్రయాణికులు వెనక్కి జంకకుండా విమానం ఎక్కేశారు. సాధారణంగా హైదరాబాదుకి రూ.2 వేలకు దొరికేసే విమాన టికెట్ ఆదివారం మాత్రం రూ.17,603 నుంచి 50 వేల వరకూ పలికింది. అలాగే ఐదు వేలలోపు టికెట్ ఉండే ముంబయ్, చెన్నై, బెంగళూరుకి కూడా అదేస్ధాయిలో డిమాండ్ కనిపించింది. ఇక రూ.ఐదు వేల నుంచి పదివేల లోపు టికెట్ ఉండే దిల్లీ ప్రయాణ చార్జీ ఆదివారం రూ.25 వేల నుంచి మొదలై రూ.70 వేలు పలికింది. ఇలా ఠారెత్తిన చార్జీలు సందర్శకులకు ఆశ్చర్యం కలిగించినా ప్రయాణికులు సాధారణంగానే సాగారు. ఆలస్యంగా విమానాల రాకపోకలు... విశాఖ విమానాశ్రయం నుంచి పలు విమాన సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. హైదరాబాద్ నుంచి విశాఖకు ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు రావలసిన ఎయిరిండియా విమానం 9.47కి వచ్చింది. అలాగే దిల్లీ నుంచి విశాఖ రావలసిన మరో ఎయిరిండియా విమాన సర్వీసు సాయంత్రం 5.10కి రావలసి ఉండగా, రాత్రి 7.25కి వచ్చింది. దీంతో దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. -
63 కేజీల పసిడి పట్టివేత
* విశాఖ ఎయిర్‌పోర్టులో బంగారం స్మగ్లింగ్ గుట్టు రట్టు సాక్షి, విశాఖపట్నం/గోపాలపట్నం: భారీ స్థాయిలో బంగారం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ముఠాలను విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో డెరైక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు పట్టుకున్నారు. విశాఖ విమానాశ్రయం చరిత్రలోనే కనీవినీ ఎరుగని భారీ స్మగ్లింగ్ గుట్టు రట్టు చేశారు. ఇప్పటివరకు ఏకంగా 63 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం రాత్రి ప్రారంభమైన తనిఖీలు సోమవారం రాత్రి కూడా కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో మరింత బంగారం పట్టుబడే అవకాశం ఉందని తెలుస్తోంది. సోమవారం సాయంత్రం ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ జి.రాజేంద్రన్ విలేకరులకు వివరాలు వెల్లడించారు. చెన్నైకి చెందిన కొందరు ముఠాలుగా ఎలక్ట్రానిక్ పరికరాలు, గృహోపకరణాల లోపలి భాగాల్లో ఉంచడం ద్వారా సింగపూర్, మలేసియా దేశాల నుంచి హైదరాబాద్, విశాఖలకు భారీ స్థాయిలో బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లు డీఆర్ఐ చెన్నై జోనల్ యూనిట్‌కు సమాచారం అందింది. వెంటనే అధికారులు హైదరాబాద్, విశాఖలకు ప్రత్యేక బృందాలతో చేరుకున్నారు. ఆదివారం రాత్రి 9.10 సమయంలో కౌలాలంపూర్ నుంచి విశాఖ వచ్చిన ఎయిర్ ఏషియా 83, మిలిందో 251(రాత్రి 10.05గంటలు) విమానాలతో పాటు సింగపూర్ నుంచి వచ్చిన సిల్క్ ఎయిర్ ఎంఐ442 (రాత్రి 11గంటలు) విమానంలో స్మగ్లింగ్ బంగారం ఉన్నట్లు గుర్తించారు. మూడు విమానాల్లోని ప్రయాణికులను, వారి బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చే శారు. 56 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. మ్యూజిక్ సిస్టమ్‌లు, యాంప్లిఫయర్లు, మినీ వాషింగ్ మిషన్లు, ఎలక్ట్రిక్ ఓవెన్, ఇండక్షన్ స్టవ్, టీవీ, ఇతర పరికరాల్లో బంగారం దాచి తీసుకువస్తున్నట్లు తేల్చారు. మొత్తం రూ.16.85 కోట్ల విలువైన 63 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రాజేంద్రన్ తెలిపారు. నిందితుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఎయిర్‌పోర్టు డెరైక్టర్ శర్మ కస్టమ్స్ అధికారులకు సహకరించారు. తనిఖీలు పూర్తి చేసుకున్న ప్రయాణికుల్లో తమిళనాడుకు చెందిన పలువురు ఉన్నారు. మరోవైపు నిందితుల తరఫున కొందరు తమిళనాడు నుంచి విశాఖ చేరుకున్నారు. దీంతో విమానాశ్రయ ప్రాంగణం ఉద్రిక్తంగా మారింది. ముందుజాగ్రత్త చర్యగా పోలీసు బలగాలను భారీగా మోహరించారు. -
‘బంగారు’ గని
- గోల్డ్ స్మగ్లింగ్‌కు అడ్డాగా మారిన విశాఖ ఎయిర్‌పోర్టు - సింగపూర్, దుబాయ్ నుంచి భారీగా వస్తున్న గోల్ట్ బిస్కెట్లు - మూడు వారాల్లో 70మంది అరెస్ట్ సాక్షి, విశాఖపట్నం: విశాఖ విమానాశ్రయాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు దీటుగా తీర్చిదిద్దుతామని తరచు నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటారు. అభివృద్ధి విషయమేమో గానీ ఇక్కడ శంషాబాద్‌ను తలదన్నే రీతిలో బంగారం స్మగ్లింగ్ జరుగుతోంది. అంతర్జాతీయ స్మగ్లర్లకు విశాఖ విమానాశ్రయం బంగారు గనిగా మారింది. ఇరవై రోజుల్లో మూడు సంఘటనలు విశాఖ విమానాశ్రయంలో గడిచిన కొద్ది రోజులుగా గోల్డ్ స్మగ్లింగ్ ఉదంతాలు వరుసగా వెలుగుచూస్తున్నాయి. సోమవారం భారీ స్థాయిలో బంగారం స్మగ్లింగ్ చేస్తూ దాదాపు 60మంది పట్టుబడ్డారు. ఈ నెల 2న దుబాయ్ నుంచి విశాఖకు ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏ1- 952 ద్వారా బంగారం బిస్కెట్లు స్మగ్లింగ్ చేస్తూ ఏడుగురు వ్యక్తులు కస్టమ్స్‌కు చిక్కారు. వారి నుంచి రూ.1.14 కోట్ల విలువైన 4.20 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 6న దుబాయ్ నుంచి హైదరాబాద్ మీదుగా విశాఖ చేరుకున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏ1-952 నుంచి విశాఖకు బంగారం బిస్కెట్లు స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు మహిళలను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. నిందితుల వద్ద రూ.1.12 కోట్ల విలువైన 4.2 కేజీల బంగారం దొరికింది. రెండు ఉదంతాల్లోనూ స్మగ్లర్లు ఎయిర్ ఇండియా విమానాలనే వినియోగించడం విశేషం. నిజానికి స్మగ్లర్లు ఇంత ధైర్యంగా తమ కార్యకలాపాలు సాగించడానికి విమాన సిబ్బంది సహకారం కూడా వారికి లభిస్తున్నట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు. బంగారం స్మగ్లింగ్‌కు అడ్డా కేవలం ఒక్క విమాన సర్వీసుతో ప్రారంభమై రెండేళ్ల క్రితం అంతర్జాతీయ విమానాశ్రయంగా మారిన విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి ప్రస్తుతం 13 సర్వీసులు నడుపుతున్నారు. అయితే ఇదే స్మగ్లర్లకు వరంగా మారింది. ఇక్కడ భద్రతా ప్రమాణాలు లోపభూయిష్టంగా ఉండటాన్ని వారు తమకు అనుకూలంగా మలుచుకుని తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు. 2013-14లో రూ.2.01 కోట్ల విలువైన రూ.6.67 కేజీల బంగారం దొరికింది. 2014-15 మధ్య రూ.2.04 కోట్ల విలువైన 7.62 కేజీల బంగారం పట్టుబడింది. ఇక ఈ ఏడాది ఇప్పటివరకు రూ.3.06 కోట్ల విలువైన 11.06 కేజీల బంగారం బిస్కెట్లు దొరికాయి. తాజాగా పట్టుబడింది కలిపితే ఈ సంఖ్య భారీగా పెరుగుతుంది. మహిళలు సైతం స్మగ్లింగ్‌లో పట్టుబడటం విమానాశ్రయ చరిత్రలోనే ఈ ఏడాది తొలిసారిగా చోటుచేసుకుంది. 2003 నుంచి ఇప్పటివరకు 17 మందిని గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ చేసి రూ.3.75 కోట్ల కస్టమ్స్ డ్యూటీని వసూలు చేశారు. స్మగ్లింగ్ రాకెట్ కొత్త ఎత్తులు దుబాయ్ నుంచి బంగారం బిస్కెట్లను తరలించడానికి స్మగ్లింగ్ రాకెట్లు కొత్త వ్యూహాలు అవలంబిస్తున్నారు. హైదరాబాద్, విశాఖలను అడ్డాగా వాడుకుంటున్నారు. సాధారణ ప్రయాణికులతో స్మగ్లింగ్ చేయిస్తున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, శరీరం లోపల గోల్డ్‌బిస్కెట్లు పెట్టుకుని స్మగ్లింగ్ చేస్తున్నారు. ప్రయాణికులకు సాధారణ స్కానింగ్ మాత్రమే ఉండటం వీరికి కలిసివస్తోంది. మన వాళ్లు ఇంకా డోర్‌ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్స్ మాత్రమే వాడుతున్నారు. అనుమానం వస్తే గానీ ఏ ప్రయాణికుడినీ క్షుణ్ణంగా తనిఖీ చేయరు. కనీసం డాగ్ స్క్వాడ్ కూడా లేదు. -
ఆకాశాన్ని తాకుతున్నాయి..
విమానాలకు సంక్రాంతి డిమాండ్ ఫిబ్రవరి ఒకటి వరకూ టికెట్ చార్జీల మోత గోపాలపట్నం: విశాఖ విమానాశ్రయం లో సంక్రాంతి సందడి ఫుల్లుగా కనిపిస్తోంది. కోస్తాంధ్ర ప్రజలకు కేంద్రం గా వుండడంతో విమానాలన్నీ కిటకిటలాడుతున్నాయి. విశాఖ నుంచి ఇండిగో, ఎయిర్‌కోస్తా, ఎయిరిండియా, స్పైస్ జెట్ విమాన సర్వీసులు వున్నా యి. ఈనెల 11 వరకూ సా ధారణంగా వున్న విమాన చార్జీలు సోమవారం నుంచి అమాంతంగా పెరిగిపోయాయి. విశాఖ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్యకు తగ్గట్టే వచ్చే వారి సంఖ్య టికెట్ల డిమాండ్‌ని బట్టి తెలుస్తోంది. విశాఖ నుంచి చెన్నైకి వెళ్లే విమాన సర్వీసులకు బాగా డిమాండ్ కనిపించింది. సోమవారం నాటి టికెట్ చార్జీ రూ.6942 ఉంటే బుధవారానికి దాని రేటు రూ.9440, ఈ నెల 21నాటికి రూ.10,642 పలికింది. ఇలా 23నాటికి రూ.9281 ఉన్నా తర్వాత నుంచి చార్జీలు తగ్గాయి. అదే చెన్నై నుంచి విశాఖకూ విమాన ఛార్జీల మోత ఎక్కువగానే వుంది. 12న టికెట్ చార్జి 2999 వుంటే, 13నుంచి రూ 7523, 14 న రూ7610 పలికింది. తర్వాత 19నాటికి టికెట్ ఛార్జి రూ 9441 వుంది. తర్వాత నుంచి కాస్త డిమాండ్ తగ్గింది. రూ 3114 నుంచి చార్జీలు వున్నాయి. ఇదిలా వుంటే...విశాఖ నుంచి హైదరాబాద్‌కి సాధారణంగా రూ1558 నుంచి 2804 వరకూ వుండే విమాన చార్జి సోమవారం 4802 వుంది. ఈనెల16నాటికి రూ 5326, 18న రూ. 6818 రేటు వుంది. విశాఖ నుంచి ఢిల్లీకి సాధారణంగా నాలుగు వేలుంటే...ఇపుడు రూ 14982 పలుకుతోంది. ఫిబ్రవరి ఒకటి వరకూ డిమాండ్ వుంది. విశాఖ నుంచి బెంగుళూరుకి ఈనెల12న 4725 వుంటే...13న రూ. 6142, 15న 8086, 17న రూ11,403, 18న రూ13,502 పలికింది. అలాగే తిరుపతికి వెళ్లే యాత్రికులూ ఈనెలలో ఎక్కువగానే వున్నారు. సోమవారం నాటి చార్జి 5987 వుంటే 18న మాత్రం రూ 7464 వుంది. 26న రూ.8599...ఇలా ఫిబ్రవరి 8నాటికి రూ.3015 వుంది. మొత్తంమ్మీద ఫిబ్రవరి ఒకటి వరకూ విమానాల రద్దీ వుందని విమాన సంస్ధలు చెబుతున్నాయి. ఈనెల 18 వరకూ విపరీతమయిన డిమాండ్ వుందని..పలు విమాన సర్వీసులకయితే టికెట్లే లేవని స్పష్టం చేస్తున్నాయి. ఇదిలా వుంటే ట్రావెల్ ఏజెంట్లకు ఈడిమాండ్ పంటపడుతోంది. ప్రయాణికుల డిమాండ్‌ని బట్టి రెట్టింపు చార్జిలు చెబుతున్నారు. ఈనెల 18న చెన్నైకి వెళ్ల డానికి రూ టికెట్ చార్జీ రూ20 వేలు వుందంటే విమాన ప్రయాణికుల తాకిడి ఎలా వుందో తెలుస్తోంది. -
విమానాల హబ్‌గా విశాఖ
ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం సాక్షి, విశాఖపట్నం : దేశ ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయనున్న విశాఖపట్నంలో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు రవాణా వ్యవస్థ పటిష్టత చేసేందుకు ప్రభుత్వం సంకల్పించింది. విమానయాన రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా ఇండిగో ఎయిర్‌లైన్స్‌తో వరుస ఒప్పందాలు చేసుకుంటోంది. వీటిలో ఒకటి ఇప్పటికే అమలులోకి రాగా త్వరలో మరో ఒప్పందం ఆచరణలోకి రానుందని సీఎం చంద్రబాబు ప్రకటనతో విశాఖలో పారిశ్రామిక, పర్యాటక అభివృద్ధిపై కొత్త ఆశలు రేకెత్తుతున్నాయి. విశాఖ విమానాశ్రయం నుంచి ప్రస్తుతం కొన్ని నగరాలకే విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ప్రతిరోజు ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్, జెట్ ఎయిర్వేస్, ఎయిర్కోస్టా, సిల్క్ ఎయిర్వేస్ సంస్థలు హెదరాబాద్, బెంగుళూరు, భువనేశ్వర్, ఢిల్లీ, ముంబై, చెన్నై, దుబాద్, కోల్కత్తా, సింగపూర్‌లకు 16 సర్వీసులు నడుపుతున్నారు. హుదూద్ తుపాను తర్వాత సిల్క్ ఎయిర్వేస్ సర్వీసులు నిలిచిపోయాయి. విశాఖ నుంచి ప్రతి రోజూ ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌కు నాన్‌స్టాప్ సర్వీసులు నడిపేందుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ప్రభుత్వం ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ (ఏటీఎఫ్)పై సేల్స్ టాక్స్ తగ్గించేందుకు అంగీకరించింది. భవిష్యత్‌లో అగర్తల, అహ్మదాబాద్, బాగ్దోగ్రా, బ్యాంకాక్, బెంగుళూరు, భువనేశ్వర్, చంఢీఘర్, కొయంబత్తూర్, చెన్నై, ఢిల్లీ, డిడ్రుఘర్, గోవా, దుబాయ్, గౌహతి, హైదరాబాద్, ఇంఫాల్, ఇండోర్, జైపూర్, జమ్ము, ఖాట్మండ్, కొచ్చి, కోల్కత్తా, లక్నో, ముంబై, మస్కట్, నాగ్‌పూర్, పాట్నా, పూణె, రాయ్‌పూర్, రాంచీ, సింగపూర్, శ్రీనగర్, త్రివేండ్రం, వడోదర, వారణాసి తదితర 35 నగరాలకు విశాఖ నుంచి ఇండిగో విమాన సర్వీసులు నడిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం 100 విమానాలతో విశాఖను హబ్‌గా మార్చనున్నారు. -
ప్రజాపక్షాన పోరు
హుద్‌హుద్ తుపాను బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. తుపాను వచ్చి నెలరోజులు అయినా ఇంకా పేదల బతుకులు గాడిన పడలేదు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్దాం’ - వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి విశాఖపట్నం విమానాశ్రయంలో పార్టీ నేతలతో మంగళవారం కొంతసేపు చర్చించారు. తుపాను అనంతర పరిస్థితిని గురించి ఆయన వాకబు చేశారు. బాధితులకు ఇప్పటికీ ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందలేదని పార్టీ నేతలు ఆయనకు చెప్పారు. దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతులకు కూ డా నష్టపరిహారం చెల్లించలేదని... ఇంకా గోడలు కూలిన, పైకప్పులు ఎగిరిపోయిన ఇళ్లల్లోనే పేదలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాన్నారు. దీనిపై వై.ఎస్.జగన్ స్పందిస్తూ సీఎం చంద్రబాబు మీడియాలో హడావుడి చేయడం తప్పా క్షేత్రస్థాయిలో బాధితులకు చేసిందేమీ లేదన్నారు. ‘తుపాను బాధితులను ఆదుకోవడంలో వైఫల్యంపై ప్రభుత్వాన్ని నిలదీద్దాం. ప్రజలున కూడగట్టుకుని పోరాటం చేద్దాం. డిసెంబరు 5న కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా చేద్దాం’అని చెప్పారు. దీనిపై నేతలు స్పందిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని చెప్పారు. విమానాశ్రయంలో వై.ఎస్.జగన్ పార్టీ నేతలు అందర్నీ పేరుపేరున పలకరించారు. సాదరస్వాగతం అంతకుముందు విశాఖపట్నం చేరుకున్న వై.ఎస్.జగన్‌కు విమానాశ్రయం వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు సాదర స్వాగతం పలికారు. కాపునాడు వ్యవస్థాపక అధ్యక్షుడు మిరియాల వెంకటరావు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు జగన్ మంగళవారం సాయంత్రం 4గంటలకు విశాఖపట్నం చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యేలు సుజయ్‌కృష్ణ రంగారావు, బూడి ముత్యాల నాయుడు, గిడ్డి ఈశ్వరి, ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు, మాజీ ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, తైనాల విజయ్‌కుమార్, మళ్ల విజయ్‌ప్రసాద్, కర్రి సీతారాం, చెంగల వెంకట్రావు, బలిరెడ్డి సత్యారావు, ధర్మాన కృష్ణదాస్, పిరియా సాయిరాజ్, సమన్వయకర్తలు తిప్పల నాగిరెడ్డి, వంశీకృష్ణ, కోల గురువులు, పెట్ల ఉమాశంకర్‌గణేష్, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, కొయ్య ప్రసాదరెడ్డి, కోరాడ రాజబాబు, ఉమారాణిలతోపాటు పెద్ద సంఖ్యలో పార్టీ నేతలకు స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి వై.ఎస్.జగన్ నేరుగా చైతన్యనగర్లోని మిరియాల వెంకటరావు నివాసానికి చేరుకున్నారు. దివంగత మిరియాల వెంకటరావు చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆయన సతీమణి ప్రమీల, కుమారుడు శేషగిరిబాబు, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారితో కొంతసేపు గడిపిన అనంతరం బయలుదేరి నేరుగా విమానాశ్రయానికి చేరుకున్నారు. విమనాశ్రయం లాంజ్‌లో పార్టీ నేతలతో కొంతసేపు సమావేశమయ్యారు. అనంతరం హైదరాబాద్‌కు తిరుగుప్రయాణమయ్యారు. వై.ఎస్.జగన్ పర్యటనలో పార్టీ నేతలు పక్కి దివాకర్, అదీప్‌రాజ్, రవిరెడ్డి, గుడ్ల పోలిరెడ్డి, వెల్లూరి భాస్కర్‌రావు, ఫారూకీ, తోట రాజీవ్, మొల్లి అప్పారావు, పసుపులేటి ఉషాకిరణ్, వెంకటలక్ష్మి, కలిదిండి బదరీనాథ్, జీయాని శ్రీధర్, ఉరుకూటి అప్పారావు, పల్ల చినతల్లి, జీవన్‌కుమార్, కోనాడ సంజీవన్, ఆళ్ల పైడి రాజు, తుళ్లి చంద్రశేఖర్, శ్రీదేవీ వర్మలతోపాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. -
విశాఖ, రాజమండ్రికి విమానాలు రద్దు
సాక్షి, హైదరాబాద్: హుదూద్ తుపాన్ కారణంగా హైదరాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విశాఖపట్నం, రాజమండ్రికి మధ్య రాకపోకలు సాగించే విమాన సర్వీసులన్నీ దాదాపు రద్దయ్యాయి. విశాఖపట్నం నుంచి ఉదయం 10 గంటలకు హైదరాబాద్ చేరుకోవాల్సి ఇండిగో విమానం, 10.10కి చేరుకోవాల్సిన స్సైస్‌జెట్ విమానంతోపాటు మధ్యాహ్నం 12, 1.45 గంటలకు రాజమండ్రి నుంచి హైదరాబాద్ చేరుకోవాల్సిన విమాన సర్వీసులను రద్దు చేశారు. సాయంత్రం 4 గంటలకు రాజమండ్రి నుంచి రావాల్సిన విమానంతోపాటు 6.35 గంటలకు విశాఖపట్నం నుంచి రావల్సిన రెండు విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి. శంషాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే 4 విమానాలతోపాటు రాజమండ్రి వెళ్లాల్సిన 3 విమానాలనూ రద్దు చేసినట్టు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. -
విశాఖ విలవిల
* విశిష్టతలను ధ్వంసం చేసిన హుదూద్ * వ్యవస్థలన్నీ ఛిన్నాభిన్నం, నగరజీవనం అస్తవ్యస్థం సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సిటీ ఆఫ్ డెస్టినీ... నవ్యాంధ్ర ప్రదేశ్‌కు ఆర్థిక, పర్యాటక రాజధానిగా వర్ణిస్తున్న నగరం... అమెరికా అధ్యక్షుడు ఒబామాతో చర్చల సందర్భంగా ప్రధాని మోదీ ప్రస్తావించిన స్మార్ట్‌సిటీ... అలాంటి విశాఖపట్నాన్ని హుదూద్ తుపాను భయానకంగా కుదిపేసింది. ఓ రాకాసి చేయి పట్టుకుని ఊపేసినట్లు ఊపేసింది. పెను విధ్వంసం కళ్లకు కట్టింది. మధ్యయుగాల్లో విదేశీ దురాక్రమణల్లో ధ్వంసమైన భారతీయ నగరాలను గుర్తుకు తెచ్చేలా ప్రకృతి ప్రకోపానికి గురైంది. రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని ప్రకృతి విధ్వంసానికి మూగసాక్షిగా నిలుస్తోంది. విశాఖ విశిష్టతలు గాలికి... హుదూద్ తుపాను విశాఖలో విధ్వంసం సృష్టించింది. విశాఖ నగరాన్ని ప్రత్యేకంగా నిలబెట్టే విశిష్టతల్ని ఘోరంగా దెబ్బతీసింది. విశాఖ ప్రత్యేక గుర్తింపునకు ప్రధాన కారణమైన సముద్రమే ఈ పెను విధ్వంసానికి కూడా కారణం. విశాలమైన విశాఖ రోడ్లు చిన్నాభిన్నమయ్యాయి. తూర్పున సాగర్ నగర్ నుంచి దక్షిణాన గాజువాక వరకు హుదూద్ ప్రకోపానికి గురికాకుండా ఒక్క రోడ్డు కూడా మిగల్లేదు. ఇక విశాఖ రోడ్లకు ఇరువైపులా ప్రకృతి వర ప్రసాదంగా నిలిచే పచ్చని చెట్లు... చెట్టు కనిపిస్తే ఒట్టు అనే రీతిలో నేలకొరిగాయి. వందల ఏళ్ల నాటి చెట్లతోసహా దాదాపు 80 శాతం చెట్లు కూకటివేళ్లతో కుప్పకూలాయి. సినీ అందాలకు ఎర్ర తివాచీ పరిచే విశాఖ అందాల బీచ్ రోడ్డు భారీగా కోతకు గురైంది. రెండుచోట్ల బీచ్ రోడ్డు కోతకు గురై సముద్రం నీళ్లు పైకి వచ్చేశాయి. బీచ్‌రోడ్డుకు 3 మీ. దిగువన ఉండే సముద్రం నీళ్లు హుదూద్ దాటికి ఉప్పెనగా పొంగి రోడ్డుపైకి చేరుకున్నాయి. ఫిషింగ్ హార్బర్ సమీపంలో రోడ్డు కోతకు గురై రాకపోకలకు నిలిచిపోయాయి. బీచ్‌రోడ్డుకు ఇరువైపులా హోర్డింగులు చెల్లాచెదురయ్యాయి. విశాఖలో వాణిజ్య కార్యకలాపాలకు ప్రధాన కేంద్రాలైన జగదాంబ జంక్షన్, సిరిపురం, ఆశీలు మెట్ట, ద్వారకానగర్, సీతమ్మధార, పూర్ణా మార్కెట్, వీఐపీ రోడ్డు దారుణంగా దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న ఎయిర్‌పోర్టు.. తుపాను తాకిడికి విశాఖ ఎయిర్‌పోర్టు దారుణంగా దెబ్బతింది. ఎయిర్‌పోర్టు పైకప్పులు ఎగిరిపోయాయి. లాంజ్‌తో సహా అన్ని కార్యాలయాలు 50 శాతానికిపైగా దెబ్బతిన్నాయి. అద్దాలు విరిగిపడ్డాయి. రన్‌వే పూర్తిగా నీటమునిగింది. చాలా చోట్ల రన్‌వే కోతకు గురైంది. రెండురోజుల తరువాతగానీ ఎయిర్‌పోర్టుకు జరిగిన నష్టంపై ఏమీ చెప్పలేమని అధికారులు తెలిపారు. మూడునాలుగు రోజుల వరకు విమానాల రాకపోకలు సాధ్యం కాదని చెప్పారు. ఫిషింగ్ హార్బర్ విధ్వంసం... విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్రలో మత్స్యకారుల ప్రధాన జీవనాధార కేంద్రం ఫిషింగ్ హార్బర్ విధ్వంసానికి గురైంది. హార్బర్లో 60 మర బోట్లు పూర్తిగా దెబ్బతిని నీట మునిగిపోయాయి. అవి ఇక ఎందుకూ పనికిరావని వాటి యజమానులు చెబుతున్నారు. మరో 100 బోట్లు స్పల్పంగా దెబ్బతిన్నాయి. రూ.25 లక్షలు విలువ చేసే ఒక్కో బోటు మీద 8 మంది మత్స్యకారులు ప్రత్యక్షంగా ఆధారపడి జీవనాన్ని సాగిస్తున్నారు. పూర్తిగా ధ్వంసమైన బోట్ల వల్ల రూ.15 కోట్ల నష్టం వాటిల్లింది. స్వల్పంగా నష్టపోయిన బోట్ల వల్ల దాదాపు రూ.కోటి నష్టం జరిగినట్లు చెబుతున్నారు. వీటిపై ప్రత్యక్షంగా ఆధారపడుతున్న 1,300మందితోపాటు పరోక్షంగా ఆధారపడుతున్న మరో వెయ్యిమంది ఉపాధికి విఘాతం కలిగింది. తుపాను తాకిడికి సముద్రపు నీరు ముంచెత్తడంతో హార్బర్లో నిల్వ ఉంచిన రూ.లక్షల విలువైన మత్స్య సంపద కొట్టుకుపోయింది. -
విశాఖ విమానాశ్రయం పైకప్పు ధ్వంసం
విశాఖపట్నం: హుదూద్ తుఫాన్.. విశాఖ విమానాశ్రయంపై విరుచుకుపడింది. చండప్రచండంగా వీచిన ఈదురు గాలులకు ఎయిర్‌పోర్టు బాగా దెబ్బతింది. విమాశ్రాయం టెర్మినల్ పైకప్పు, అద్దాలు ధ్వంసమైయ్యాయి. సూచికలు, హోర్డింగ్స్ దెబ్బతిన్నాయి. శిథిలాలు ప్రయాణికులు వేచివుండే గదిలోకి పడిపోయాయి. ఎయిర్‌పోర్టుల పరిసర ప్రాంతాల్లో చెట్లు విరిగిపోయాయి. మరోవైపు భారీ వర్షాలతో రన్ వేపైకి నీరు చేరింది. ఫలితంగా విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది. -
జగన్‌కు ఘన స్వాగతం
విశాఖ విమానాశ్రయంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డికి మంగళవారం ఘన స్వాగతం లభించింది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని చెన్నై ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన ఆయనకు ఇక్కడి విమానాశ్రయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. విశాఖపట్నం: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డికి విశాఖ విమానాశ్రయంలో మంగళవారం ఘన స్వాగతం లభించింది. చెన్నై ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పర్యటన కోసం వచ్చిన ఆయనను పార్టీ ఉత్తరాంధ్ర కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, ఎమ్మెల్యేలు సుజయకృష్ణ రంగారావు, పూడి ముత్యాలనాయుడు, కిడారి సర్వేశ్వర్రావు, గిడ్డి ఈశ్వరి, మాజీ ఎమ్మెల్యేలు గండి బాబ్జి, కర్రి సీతారాం, చెంగల వెంకటరావు, పార్టీ నాయకులు తిప్పల నాగిరెడ్డి, వంశీకృష్ణ శ్రీనివాస్, చొక్కాకుల వెంకటరావు, గుడివాడ అమర్నాథ్, కోలా గురువులు, పెట్ల ఉమాశంకర గణేష్, ప్రగడ నాగేశ్వరరావు తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. నాగరాజు కుటుంబానికి ఓదార్పు ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్.విజయువ్ము గెలవలేదని వునస్తాపంతో నాగరాజు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో అతని కుటుంబాన్ని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి ఓదార్చారు. శ్రీకాకుళం వెళుతూ మధురవాడలో కాన్వాయ్‌ని ఆపి కుటుంబ సభ్యులను పలకరించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. -
రెక్కలు తొడిగిన ఆశలు
రాష్ట్రానికి తొలిసారిగా పౌరవిమానయానశాఖ విశాఖ విమానాశ్రయానికి మంచి రోజులు అంతర్జాతీయఖ్యాతి వస్తుందని ప్రయాణికుల ఆశాభావం గోపాలపట్నం, న్యూస్‌లైన్: విశాఖ విమానాశ్రయానికి మంచి రోజులొస్తాయన్న ఆశలు చిగురిస్తున్నాయి. విజయనగరం ఎంపీ అశోక్ గజపతిరాజుకు కేంద్ర పౌరవిమానయాన శాఖమంత్రి పదవి దక్కడంతో కోస్తాంధ్ర వాసుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖకు అంతర్జాతీయ ఖ్యాతి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇంత వరకూ పౌరవిమానయానశాఖ మంత్రి పదవులు ఇతర రాష్ట్రాల వారికే దక్కాయి. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో విజయనగరం జిల్లాకు చెందిన ఎంపీ అశోక్ గజపతికి ఈ పదవి దక్కడం విశేషం. అశోక్ గజపతి వల్ల అంతర్జాతీయ విమానాశ్రయాల సరసన విశాఖ విమానాశ్రయం చేరుతుందని, కోస్తాంధ్రకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ప్రయాణికులు ఆకాంక్షిస్తున్నారు. ఇప్పటికే విశాఖ విమానాశ్రయం నుంచి ఆరు విమాన సంస్థలు 34 సర్వీసులు నడుపుతున్నాయి. దేశ విదేశాలకు విమానాలు నడుస్తున్నాయి. ఏటా 11 లక్షలు ప్రయాణిస్తున్నారు. తాజాగా అశోక్ గజపతికి పౌరవిమానయానశాఖ పదవి లభించడంతో పెట్టుబడిదారులతో ఆర్థిక పురోగతి సాధించడంతో పాటు పారిశ్రామిక ప్రగతి ఉంటుందని కోస్తాంధ్రవాసులు అభిప్రాయపడుతున్నారు. ఈ కష్టాలు తీరాలి : విశాఖలో ఫార్మా, ఐటీ, అనేక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలున్నా పూర్తిస్థాయి విదేశీ విమానాలు రావడం లేదు. ఒకవేళ విదేశీ విమాన సంస్థలు వచ్చినా ప్రభుత్వం అనుమతించడంలేదన్న విమర్శలున్నాయి. పాత విమానాశ్రయాన్ని కంటైనర్ కార్గో టెర్మినల్‌గా అభివృద్ది చేస్తామని చెప్పినా ఇంతవరకు చేయలేదు. దీంతో కంపెనీలు తెలంగాణకు వెళ్లాల్సి వస్తోంది. 24బై7 సేవలకు నేవీ మోకాలడ్డుతోంది. దీని వల్ల విదేశీ క్లయింట్ల రాకపోకలకు, విశాఖ వాసులకు అసౌకర్యంగా ఉంది. శుభపరిణామం అశోక్ గజపతి పౌర విమానయానశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం హర్షణీయం.. శుభపరిణామం. విశాఖ ఎయిర్ పోర్టుకు ఇంకా పలు దేశీయ, విదేశీయ విమానాలు వస్తాయి. ఆశోక్ చొరవతో విశాఖకు మంచి భవిష్యత్తు ఉంటుందన్న నమ్మకం ఉంది. కోలాలంపూర్, బాంకాక్, షార్జా, శ్రీలంక తదితర దేశాలకు విమానాలు నడిపే విధంగా ఆయనపై ఒత్తిడి తెస్తాం. - డి.వరదారెడ్డి, భారత విమాన ప్రయాణికుల సంఘం అధ్యక్షుడు