సాక్షి, హైదరాబాద్ : తాను క్షేమంగా ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందవద్దని వైఎస్ జగన్ తెలిపారు. జగన్ చికిత్స పొందుతున్న హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రి వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునే యత్నం చేశారు. జనంలో ఉన్న భయాందోళనలను తొలగించడానికి జగన్ ట్విట్టర్ ద్వారా సందేశం పంపారు. ‘నా క్షేమం గురించి ఆందోళన చెందుతున్న ప్రతి ఒక్కరికీ.. నేను క్షేమంగా ఉన్నానని తెలియజేస్తున్నాను. దేవుడి దయ, నా గురించి ఆందోళన చెందుతున్న రాష్ట్ర ప్రజల ప్రేమానురాగాలు, ఆశీర్వాదాలు నన్ను ఎల్లప్పుడూ కాపాడతాయి. నాపై దాడి లాంటి పిరికిపంద చేష్టలు నన్ను ఎప్పటికీ నా లక్ష్యం నుంచి వెనక్కి తగ్గేలా చేయలేవు. రాష్ట్ర ప్రజల కోసం పని చేయాలన్న నా సంకల్పాన్ని మరింత దృఢతరం చేస్తాయి’ అని జగన్ ట్వీట్ చేశారు.
To everyone worried about my safety - I’d like to inform you that I am safe. God's grace and the love, concern & blessings of the people of Andhra Pradesh will protect me. Such cowardice acts will not dissuade me but only strengthen my resolve to work for the people of my state!
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 25, 2018
Comments
Please login to add a commentAdd a comment