నేవీ విమానం నుంచి కిందకి దిగుతున్న కమాండోలు
సాక్షి, గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): విశాఖ విమానాశ్రయంలో యాంటీ–హైజాక్ మాక్ డ్రిల్ ఆద్యంతం ఉత్కంఠ∙రేకెత్తించింది. గురువారం ఎయిర్‌పోర్టు ఐఎన్‌ఎస్ డేగాలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు. విమానం హైజాక్‌కు గురి కాకుండా ఏ విధంగా అడ్డుకోవాలో ఇక్కడ ప్రదర్శించారు. తమ సామర్థ్యాన్ని పరీక్షించుకునేందుకు ఈ ప్రక్రియ దోహద పడుతుందని అధికారులు తెలిపారు. ఈ మాక్‌ఎక్సర్‌సైజ్ మెరైన్ కమాండోలు (మార్కోస్), సెంట్రల్ ఇండస్ట్రీస్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్), ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో నిర్వహించాయి.
క్షతగాత్రుల తరలింపు
భారత నౌకాదళ డోర్నియర్ ఉపయోగించి రూపొందించిన మాక్ హైజాక్ ఆధారంగా కార్యక్రమం ప్రదర్శించారు. ఐఎన్‌ఎస్ డేగా కమాండింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఏరోడ్రోమ్ కమిటీ స్టాండ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్‌వోపీఎస్) ప్రకారం మాక్‌ఎక్సర్‌సైజ్ కార్యక్రమం చేపట్టారు. డేగా ఏటీసీ, క్విక్ రియాక్షన్ టీమ్ (క్యూఆర్‌టీ), మెరైన్ కమాండో, సీఐఎస్‌ఎఫ్, ఏఏఐ, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం త్వరతిగతిన స్పందించే తీరును నేషనల్ సెక్యూరిటీ గార్డు, ఎస్‌వోపీఎస్ అధికారులు పరిశీలించారు. భవిష్యత్తులో సంభవించే ఆకస్మిక పరిస్థితులను ఎదుర్కొనే నైపుణ్యం సామర్థ్యం కలిగి ఉన్నారని నిర్ధారించారు.
హైజాక్‌ను ఎదుర్కొనేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్న సైనికులు
Comments
Please login to add a commentAdd a comment