సాక్షి, విశాఖ : విశాఖలోని ఓ ప్రైవేట్ హోటల్ లో సింగపూర్ టూరిజం బోర్డు అధికారులు, స్కూట్ ఎయిర్ లైన్స్ ప్రతినిధులతో విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అక్టోబర్ 27 నుంచి వారంలో అయిదు రోజులు నేరుగా విశాఖ నుంచి సింగపూర్ కి విమానాలు నడపనున్నట్లు స్కూట్ ఎయిర్ లైన్స్ సంస్థ ప్రకటించింది. మంగళవారం, గురువారం మినహా మిగిలిన అయిదు రోజుల పాటు సర్వీసులు కొనసాగనున్నాయని అధికారులు తెలిపారు.
ఈ విమానం సింగపూర్లో రాత్రి 8.45 నిమిషాలకి బయలుదేరితే రాత్రి 10 గంటలకి విశాఖకు చేరుకోనుందని,( భారత కాలమాన ప్రకారం నాలుగు గంటల ప్రయాణం)విశాఖలో రాత్రి 11 గంటలకి బయలుదేరితే, సింగపూర్‌కి తెల్లవారుజామున 5.45 కి చేరుకోనుందని వెల్లడించారు. ఈ సమావేశంలో మంత్రితోపాటు సింగపూర్ టూరిజం బోర్డు ప్రతినిధులు శ్రీధర్, లిమ్ సి టింగ్, పూజ, బ్రియాన్ టోరే, భరత్, నితిన్, కె.విజయ్ మోహన్, టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోషియేషన్ అధ్యక్షుడు నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
Comments
Please login to add a commentAdd a comment