
‘ఈనాడు’ తప్పుడు కథనాలపై మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మండిపడ్డారు.
సాక్షి, విశాఖపట్నం: ‘ఈనాడు’ తప్పుడు కథనాలపై మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మండిపడ్డారు. తన కుటుంబాన్ని కిడ్నాప్ చేసి హేమంత్ అనే వ్యక్తి వేధించాడు. హేమంత్, తనకు సంబంధం ఉందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు హేమంత్ ఎవరో తెలియదని స్పష్టం చేశారు.
‘‘నా కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన ఘటనపై మళ్లీ విచారణ జరపాలని కోరుతున్నా.. హేమంత్ సంతకం లేని ఒక ఉత్తరాన్ని బయటకు తెచ్చి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. హేమంత్‌కు ఖరీదైన కార్లు, బంగాళాలు ఇస్తే అవి ఎక్కడ ఉన్నాయో చూపించాలి. ‘‘నేను, నా వియ్యంకుడు 12 స్థలాలు హేమంత్‌కు గిఫ్ట్ ఇచ్చినట్లు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. నిరాధార ఆరోపణలతో నన్ను మానసికంగా వేధిస్తున్నారు. నా పై చేసిన ఆరోపణలు నిరూపించాలి’’ అంటూ ఎంవీవీ సత్యనారాయణ సవాల్ విసిరారు.