singapoore
-
సిరిసిల్లలో పెళ్లికి సింగపూర్‌వాసులు.. వారితో స్థానికులు సెల్ఫీలు..
సిరిసిల్ల: సిరిసిల్లలో ఆదివారం జరిగిన ఓ పెళ్లికి సింగపూర్‌వాసులు హాజరయ్యారు. మున్సిపల్ కౌన్సిలర్ గూడూరి భాస్కర్ కూతురు వాణి వివాహం జేపీ నగర్‌కు చెందిన గౌడ లక్ష్మణ్ కుమారుడు బాలకృష్ణతో కల్యాణలక్ష్మి గార్డెన్స్‌లో జరిగింది. సింగపూర్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన వరుడి ఆహ్వానం మేరకు సహోద్యోగులు ఆరుగురు పెళ్లికి హాజరయ్యారు. సంప్రదాయబద్ధంగా జరిగిన వివాహ క్రతువు, విధి విధానాలను చూసి, ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఫోన్లలో ఫొటోలు తీశారు. తెలంగాణ వంటకాల రుచి చూశారు. వారితో స్థానికులు సెల్ఫీలు దిగారు. -
లాలు యాదవ్‌కు ఊరట....అనుకూలంగా కోర్టు ఆదేశాలు
పట్నా: దాణా కుంభకోణానికి సంబంధించి ఐదు వేర్వేరు కేసుల్లో రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు, బిహార్ మాజీ సీఎం లాలు ప్రసాద్ యాదవ్ దోషిగా తేలిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు కొంత ఊరట లభించింది. లాలు సెప్టంబర్13న పాస్‌పోర్ట్ తిరిగి ఇవ్వాలని కోరతూ కోర్టుకి దరఖాస్తు పెట్టుకున్నారు. ఐతే సెంట్రల్ బ్యూర్ ఇన్వెస్టిగేషన్ ప్రత్యేక కోర్టు ఆయనకు అనుకూలంగా పాస్‌పోర్ట్ తిరిగి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడూ పాస్‌పోర్ట్ వెనక్కి తీసుకోవాలంటే యాదవ్ కోర్టులో అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుందని యాదవ్ తరుఫు న్యాయవాది ప్రభాత కుమార్ అన్నారు. ఇదిలా ఉండగా సింగపూర్ వైద్యుడు సెప్టెంబర్24న లాలు యాదవ్‌కు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఐతే ఆయన ఆ తేదికి ముందుగానే సింగపూర్ చేరుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఆయనకు త్వరితగతిన పాస్‌పోర్ట్‌ని తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. అంతేగాదు రెండు నెలల పాటు సింగపూర్‌లో ఉండేలా కూడా పాస్‌పోర్ట్ జారీ చేయాలని న్యాయవాది అభ్యర్థించారు. లాలు దరఖాస్తును విచారించిన కోర్టు...అతడికి పాస్‌పోర్టు జారీ చేయాలని ఆదేశించింది. వాస్తవానికి 1996 దాణా కుంభకోణం కేసులో 900 కోట్ల కుంభ కోణం జరిగిందని, దీనికి సంబందించి మొత్తం ఆరు కేసులు లాలుపై ఉన్నాయి. అందులో ఒక కేసులో లాలుకు 2013లో ఐదేళ్ల శిక్ష పడింది. దీంతో ఆయన ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై బయట ఉన్నారు. ఇదిలా ఉండగా లాలు దాణా కుంభకోణానిక సంబంధించి అన్ని కేసులను విచారించాలని లాలు కోర్టుకి విజ్క్షప్తి కూడా చేసుకున్నారు. కానీ సుప్రీం కోర్టు ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ప్రతికేసు విచారణను విడివిడిగా నిర్వహించాలని ఆదేశించింది. (చదవండి: మోదీకి ఇంతకు గొప్ప గిఫ్ట్ మరొకటి లేదు) -
థాయ్‌లాండ్ చెక్కేసిన గొటబయ
కొలంబో: శ్రీలంక సంక్షోభానికి మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్సే కారణమంటూ నిరసనకారలు ఆందోళనలు చేపట్టడంతో గోటబయ దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసింది. ఈ మేరకు ఆయన మాల్దీవుల నుంచి సింగపూర్‌కి పయనమయ్యారు. అక్కడే 14 రోజుల పర్యాటక వీసాపై తాత్కాలికంగా ఆశ్రయం పొందారు కూడా. అంతేగాక ఆ వీసా గడువు ఆగస్టు 11తో ముగియునున్న తరుణంలో శ్రీలంక ప్రభుత్వం మరికొన్ని రోజులు గోటబయకి అక్కడే ఆశ్రయం ఇవ్వాల్సిందిగా సింగపూర్ అధికారులను కోరింది. మరీ ఏమైందో తెలియదు గానీ ఆయన హఠాత్తుగా థాయలాండ్ చెక్కేస్తున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు గోటబయ రాజపక్స గురువారానికి థాయ్‌లాండ్ చేరుకునే అవకాశం ఉందని వెల్లడించింది కూడా. దీంతో గోటబయ థాయలాండ్‌లో ఆశ్రయం పొందుతున్నట్లు తెలుస్తోంది. ఏదీఏమైన తీవ్ర నిరసనలు నడుమ అధ్యక్ష పదవికి రాజీనామ చేసి దేశం వదిలి పారిపోయిన తొలి అధ్యక్షుడగా గోటబయ నిలిచిపోయాడు. (చదవండి: Gotabaya Rajapaksa: ప్లీజ్ ఆయన్ని అక్కడే ఉండనివ్వండి... అభ్యర్థించిన శ్రీలంక) -
ప్లీజ్ గోటబయను అక్కడే ఉండనివ్వండి... అభ్యర్థించిన శ్రీలంక
కొలంబో: శ్రీలంకలో ఏర్పడిన తీవ్ర ఆర్థిక సంక్షోభానికి కారణం గోటబయే నంటూ నిరసనకారులు ఆయన అధికార నివాసాన్ని చుట్టుముట్టడంతో ఆయన మాల్దీవులకు పారిపోయిన సంగతి తెలిసిందే. ఐతే మాల్దీవులో కూడా శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్సకు నిరసన సెగ తగలడంతో పలాయనం చిత్తగించక తప్పలేదు. దీంతో ఆయన గత నెల జులై 14 నుంచి సింగపూర్‌లో 14 రోజుల పర్యాటక వీసాపై అక్కడే ఉంటున్నారు. ఐతే ఆ వీసా గడువు ఆగస్టు 11తో ముగియనుంది. ఈ నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం రాజపక్సను మరో 14 రోజులు అక్కడే ఉండనివ్వండి అంటూ సింగపూర్ అధికారులను అభ్యర్థించినట్లు సమాచారం. దీంతో ఆయన మరికొన్ని రోజులు సింగపూర్‌లోనే గడపనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు గోటబయ జులై 15న రాజీనామ చేసినట్లు శ్రీలంక పార్లమెంట్ స్పీకర్ మహింద అబేవర్ధన బహిరంగంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన దేశాన్ని వదిలి పారిపోయిన తదుపరి గోటబయ స్థానంలో ఆయన పార్టీ ఆశీస్సులతోనే రణిల్ విక్రమసింఘే శ్రీలంక కొత్త అధక్ష్యుడిగా ఎన్నికయ్యారు. (చదవండి: వేగంగా పెరుగుతున్న కోవిడ్ కేసులు...లాక్డౌన్ దిశగా అడుగులు) -
సింగపూర్‌లో తొలి తెలుగు పండుగ “ఉగాది” వేడుకలు
-
సింగపూర్‌లో ఉగాది సంబరాలు
తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు సింగపూర్‌లోని సెంగ్ కాంగ్ లోని శ్రీ అరుళ్ముగు వేలు మురుగన్ జ్ఞానమునీశ్వర్ ఆలయంలో ఘనంగా జరిగాయి. శ్రీ శుభకృత్ నామ సంవత్సరం లో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వ దినా న సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో భాగంగా పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ వేడుకల్లో సుమారు 200 మంది ప్రవాసి తెలుగు వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సమన్వయకర్తలుగా దీప నల్ల, నంగునూరి వెంకట రమణ, కాసర్ల శ్రీనివాస్ మరియు గోనె నరేందర్ రెడ్డి వ్యవరించారు. అదే విధంగా సంబరాలు విజయవంతంగా జరిగేందుకు సహయం అందించిన దాతలకు టీసీఎస్ఎస్ అధ్యక్షులు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, సంస్థాగత కార్యదర్శి గడప రమేష్ బాబు, కోశాధికారి కల్వ లక్ష్మణ్రాజులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా సొసైటీ ఉపాధ్యక్షులు గర్రెపల్లి శ్రీనివాస్, గోనె నరేందర్ రెడ్డి, భాస్కర్ గుప్త నల్ల, ప్రాంతీయ కార్యదర్శులు దుర్గ ప్రసాద్, జూలూరి సంతోష్, రోజా రమణి, మరియు కార్యవర్గ సభ్యులు నడికట్ల భాస్కర్, శ్రీధర్ కొల్లూరి, గార్లపాటి లక్ష్మా రెడ్డి, అనుపురం శ్రీనివాస్, శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్, మరియు ప్రవీణ్ మామిడాల గార్లు సంబరాల్లో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. -
మంగిపూడి రాధికకు ఊటుకూరి రత్న సుందరి అంతర్జాతీయ సాహిత్య పురస్కారం
ప్రపంచ ఖ్యాతి పొందిన రచయిత్రి మంగిపూడి రాధికకు మాతృశ్రీ ఊటుకూరి రత్నసుందరి అంతర్జాతీయ సాహితీ పురస్కారం-2022ను రక్ష ఇంటర్నేషనల్ ఫౌండేషన్ బహుకరించింది. సింగపూర్ "శ్రీ సాంస్కృతిక కళాసారథి" ప్రధాన నిర్వాహక వర్గం సభ్యురాలిగా, బహుముఖ ప్రజ్ఞతో రచయిత్రిగా కవయిత్రిగా వ్యాఖ్యాతగా నిర్వాహకురాలిగా ఎదుగుతూ, కథలు కవితలు పాటలు వ్యాసాలు పద్యాలు హాస్య రచనలు మొదలైన రచనా ప్రక్రియలలో కథా కవితా సంకలనాలతోపాటు ఇటీవల భారతీయ తత్త్వ శతకాన్ని రచించి పండితుల ప్రశంసలు అందుకున్న మంగిపూడి రాధికను ఈ పురస్కారం 2002 సంవత్సరానికి గాను లభించింది. రక్షా పౌండేషన్ నిర్వాహకురాలు, SVBC ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలు & సోషల్ మీడియా విభాగాధిపతి, పసుమర్తి రామలక్ష్మి మాట్లాడుతూ "హైదరాబాదు కేంద్రంగా శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామిజీ చేతులమీదుగా ప్రారంభమైన తమ సంస్థ ద్వారా ప్రతి ఏడాది కళా సాహిత్య సాంస్కృతిక రంగాలకు చెందిన ఒక మహిళను ఎంపిక చేసి, తమ మాతృమూర్తి ఊటుకూరి రత్నసుందరి గారి జయంతి సందర్భంగా పురస్కారంతో గౌరవించుకుంటున్నామని, ఇదివరలో డాక్టర్ తెన్నేటి సుధాదేవికి, గత సంవత్సరం సీనియర్ సినీనటి డాక్టర్ రమణారావుకు ఈ పురస్కారాలు అందించామని, ఈ సంవత్సరం సాహిత్య విభాగంలో మంగిపూడి రాధికను ఈ విధంగా సత్కరించుకోవడం ఆనందంగా ఉందని" తెలియజేశారు. మాతృశ్రీ ఊటుకూరు రత్నసుందరి గారి 76 వ జయంతి సందర్భంగా 16వ తేదీ ఆదివారం అంతర్జాల వేదిక ద్వారా పలు దేశాల ప్రముఖుల సమక్షంలో ఈ పురస్కారాన్ని రాధికకు అందజేశారు. తిరుమల స్వామివారి శేషవస్త్రం, పురస్కార జ్ఞాపిక, సన్మానపత్రంతో రాధిక భర్త సాయి ప్రకాష్, కుమార్తె మయూఖ ఆమెను సత్కరించగా, అంతర్జాలం ద్వారా వేదాశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా వంశీ ఆర్ట్స్ థియేటర్స్ అధ్యక్షులు డా. వంశీ రామరాజు, ప్రముఖ సినీకవి రచయిత భువనచంద్ర వంటి పెద్దలు పాల్గొని రాధికకు ఈ పురస్కారం అందడం చాలా సముచితంగా ఉందని, ఆమెకు ఆశీస్సులు అందించారు. సింగపూర్ నుండి శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు రత్న కుమార్ కవుటూరు, ఊలపల్లి విద్యాధరి భాస్కర్ దంపతులు, హాంకాంగ్ నుండి జయ పీసపాటి, ఆస్ట్రేలియా నుండి తటవర్తి కళ్యాణ్ చక్రవర్తి, నార్వే నుండి డాక్టర్ వెంకటపతి తరిగోపుల, యూ. కె నుండి డాక్టర్ జొన్నలగెడ్డ మూర్తి, దక్షిణాఫ్రికా నుండి రాపోలు సీతారామరాజు, భోగరాజు సూర్యలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని రాధికకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ మరియు ఫేస్ బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడిన ఈ కార్యక్రమానికి సింగపూర్ నుండి రాధాకృష్ణ సాంకేతిక నిర్వహణా బాధ్యతలు వహించారు. -
రెండు సింహాలు విమానాశ్రయం నుంచి తప్పించుకుని పెద్ద హంగామా సృష్టించాయి!!
సిడ్నీ: సింగపూర్‌లోని చాంగి ఎయిర్‌పోర్ట్‌లో రెండు సింహాలు తమ సరుకు రవాణా కంటైనర్‌లోంచి బయటకు వచ్చి అక్కడ ఉన్నవారందర్నీ భయబ్రాంతులకు గురి చేశాయి. అయితే అక్కడి అధికారులు ట్రాంక్విలైజర్ గన్‌తో కాల్చి మత్తులో పడేసి ఎయిర్పోర్ట్ నుంచి తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ సింగపూర్ ఎయిర్‌లైన్స్ (ఎస్ఐఏ) వన్యప్రాణుల సదుపాయాన్ని నిర్వహిస్తున్న మండై వైల్డ్‌లైఫ్ గ్రూప్‌తో కలిసి పనిచేస్తోంది. (చదవండి: పాత కార్లు, సైకిల్ విడిభాగాలతో... ఏకంగా విమానాన్ని తయరు చేశాడు!!) అయితే ఈ ఎయిర్ లైన్స్ పెద్ద పులుల సంరక్షణ బాధ్యతను నిమిత్తం వాటిని మండైలోని జంతు నిర్బంధ కేంద్రానికి తరలించే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అంతేకాదు అవి ఇలా తప్పించుకోవడం మొదటిసారికాదు అని అక్కడ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ సింహాలు మండై వైల్డ్‌లైఫ్ గ్రూప్ సంరక్షణలో మత్తు నుంచి కోలుకుంటున్నాయని అధికారులు తెలిపారు. (చదవండి: వామ్మో!... రూ. 7 లక్షలు టిప్పా!!... షాక్‌కి గురైన వెయిటర్!) -
ఆక్సిజన్ కొరత: సింగపూర్ భారీ సాయం
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి విజృంభణలో తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. సోమవారం నాటి గణాంకాల ప్రకారం గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో మూడున్నర లక్షలకుపైగా కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో 2812 మరణాలు సంభవించాయి. మరోవైపు ప్రపంచ దేశాలు భారత్‌కు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి. ఆక్సిజన్ కొరత సంక్షోభ సమయంలో బ్రిటన్, అమెరికా, సింగపూర్, సౌదీ అరేబియగా తదితర దేశాలు భారత్‌కు అండగా నిలిచేందుకు రంగంలోకి దిగాయి. ఈ నేపథ్యంలో సింగపూర్ నుండి 500 బైపాప్ పరికరాలు , 250 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు, ఇతర వైద్య సామాగ్రి ఎయిర్ ఇండియా విమానం ద్వారా ఆదివారం రాత్రి ముంబైకు చేరుకున్నాయి. మరోవైపు 318 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లతో అమెరికాలోని జెఎఫ్‌కె విమానాశ్రయం నుంచి ఎయిరిండియా విమానం ఢిల్లీకి బయలు దేరింది. అటుసౌదీ అరేబియా 80 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్‌ను భారత్‌కు అందించనున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. 318 Oxygen Concentrators loaded by Air India at JFK Airport in the US, on their way to Delhi.#COVID19 pic.twitter.com/PB0CRjk5qf — ANI (@ANI) April 26, 2021 #WATCH | An Air India flight, carrying 500 BiPAPs, 250 oxygen concentrators & other medical supplies from Singapore, landed in Mumbai last night.#COVID19 pic.twitter.com/9S5G8ASE9S — ANI (@ANI) April 26, 2021 చదవండి : కోవిడ్ సంక్షోభం: సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల సాయం పీరియడ్స్ టైంలో మహిళలు వ్యాక్సిన్ తీసుకోవచ్చా? -
విశాఖ నుంచి సింగపూర్‌కి నేరుగా విమానాలు
సాక్షి, విశాఖ : విశాఖలోని ఓ ప్రైవేట్ హోటల్ లో సింగపూర్ టూరిజం బోర్డు అధికారులు, స్కూట్ ఎయిర్ లైన్స్ ప్రతినిధులతో విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అక్టోబర్ 27 నుంచి వారంలో అయిదు రోజులు నేరుగా విశాఖ నుంచి సింగపూర్ కి విమానాలు నడపనున్నట్లు స్కూట్ ఎయిర్ లైన్స్ సంస్థ ప్రకటించింది. మంగళవారం, గురువారం మినహా మిగిలిన అయిదు రోజుల పాటు సర్వీసులు కొనసాగనున్నాయని అధికారులు తెలిపారు. ఈ విమానం సింగపూర్‌లో రాత్రి 8.45 నిమిషాలకి బయలుదేరితే రాత్రి 10 గంటలకి విశాఖకు చేరుకోనుందని,( భారత కాలమాన ప్రకారం నాలుగు గంటల ప్రయాణం)విశాఖలో రాత్రి 11 గంటలకి బయలుదేరితే, సింగపూర్‌కి తెల్లవారుజామున 5.45 కి చేరుకోనుందని వెల్లడించారు. ఈ సమావేశంలో మంత్రితోపాటు సింగపూర్ టూరిజం బోర్డు ప్రతినిధులు శ్రీధర్, లిమ్ సి టింగ్, పూజ, బ్రియాన్ టోరే, భరత్, నితిన్, కె.విజయ్ మోహన్, టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోషియేషన్ అధ్యక్షుడు నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు -
స్విస్ ఛాలెంజ్‌కు తూట్లు
-
మెట్రో రైలు విదేశీ కంపెనీలకే!
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని నిర్మాణం కోసం విదేశాలపై ఆధారపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణాన్ని సైతం పరాయి దేశాల కంపెనీలకే కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. సింగపూర్, జపాన్, చైనా దేశాల కంపెనీలతో ప్రభుత్వం చేసుకుంటున్న ఒప్పందాలు, కనబరుస్తున్న ఆసక్తిని బట్టి విదేశీ కంపెనీలకే మెట్రో ప్రాజెక్టును అప్పగించవచ్చని సీఆర్డీఏ వర్గాలు చెబుతున్నాయి. ప్రాజెక్టు డీపీఆర్(సమగ్ర నివేదిక)ను రూపొందిస్తున్న డీఎంఆర్సీ (ఢిల్లీ మెట్రో రైల్ ప్రాజెక్టు) మాత్రం మెట్రో నిర్మాణ బాధ్యతను చేపట్టాలనే ఉత్సాహంతో ఉంది. ఈ మేరకు ఇటీవలే ప్రభుత్వానికి లేఖ రాసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన, నిధుల సమస్య కారణంగా డీఎంఆర్సీ ఆశలు నెరవేరే అవకాశాలు కనిపించడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ లేదా బీఓటీ పద్ధతిలో విదేశీ కంపెనీలకే ప్రాజెక్టును అప్పగించే అవకాశాలున్నాయి.