రాజధాని నిర్మాణం కోసం విదేశాలపై ఆధారపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణాన్ని సైతం పరాయి దేశాల కంపెనీలకే కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని నిర్మాణం కోసం విదేశాలపై ఆధారపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణాన్ని సైతం పరాయి దేశాల కంపెనీలకే కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. సింగపూర్, జపాన్, చైనా దేశాల కంపెనీలతో ప్రభుత్వం చేసుకుంటున్న ఒప్పందాలు, కనబరుస్తున్న ఆసక్తిని బట్టి విదేశీ కంపెనీలకే మెట్రో ప్రాజెక్టును అప్పగించవచ్చని సీఆర్‌డీఏ వర్గాలు చెబుతున్నాయి.
ప్రాజెక్టు డీపీఆర్(సమగ్ర నివేదిక)ను రూపొందిస్తున్న డీఎంఆర్‌సీ (ఢిల్లీ మెట్రో రైల్ ప్రాజెక్టు) మాత్రం మెట్రో నిర్మాణ బాధ్యతను చేపట్టాలనే ఉత్సాహంతో ఉంది. ఈ మేరకు ఇటీవలే ప్రభుత్వానికి లేఖ రాసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన, నిధుల సమస్య కారణంగా డీఎంఆర్‌సీ ఆశలు నెరవేరే అవకాశాలు కనిపించడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ లేదా బీఓటీ పద్ధతిలో విదేశీ కంపెనీలకే ప్రాజెక్టును అప్పగించే అవకాశాలున్నాయి.