సిరిసిల్ల: సిరిసిల్లలో ఆదివారం జరిగిన ఓ పెళ్లికి సింగపూర్‌వాసులు హాజరయ్యారు. మున్సిపల్ కౌన్సిలర్ గూడూరి భాస్కర్ కూతురు వాణి వివాహం జేపీ నగర్‌కు చెందిన గౌడ లక్ష్మణ్ కుమారుడు బాలకృష్ణతో కల్యాణలక్ష్మి గార్డెన్స్‌లో జరిగింది. సింగపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన వరుడి ఆహ్వానం మేరకు సహోద్యోగులు ఆరుగురు పెళ్లికి హాజరయ్యారు. సంప్రదాయబద్ధంగా జరిగిన వివాహ క్రతువు, విధి విధానాలను చూసి, ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఫోన్లలో ఫొటోలు తీశారు. తెలంగాణ వంటకాల రుచి చూశారు. వారితో స్థానికులు సెల్ఫీలు దిగారు.
Comments
Please login to add a commentAdd a comment