రెండు సింహాలు విమానాశ్రయం నుంచి తప్పించుకుని పెద్ద హంగామా సృష్టించాయి!! | Two Lions Escape Freight Container At Singapore Airport | Sakshi
Sakshi News home page

రెండు సింహాలు విమానాశ్రయం నుంచి తప్పించుకుని పెద్ద హంగామా సృష్టించాయి!

Published Mon, Dec 13 2021 9:38 AM | Last Updated on Mon, Dec 13 2021 9:51 AM

Two Lions Escape Freight Container At Singapore Airport - Sakshi

సిడ్నీ: సింగపూర్‌లోని చాంగి ఎయిర్‌పోర్ట్‌లో రెండు సింహాలు తమ సరుకు రవాణా కంటైనర్‌లోంచి బయటకు వచ్చి అక్కడ ఉన్నవారందర్నీ భయబ్రాంతులకు గురి చేశాయి. అయితే అక్కడి అధికారులు  ట్రాంక్విలైజర్ గన్‌తో కాల్చి మత్తులో పడేసి ఎయిర్‌పోర్ట్‌ నుంచి తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ (ఎస్‌ఐఏ) వన్యప్రాణుల సదుపాయాన్ని నిర్వహిస్తున్న మండై వైల్డ్‌లైఫ్ గ్రూప్‌తో కలిసి పనిచేస్తోంది.

(చదవండి: పాత కార్లు, సైకిల్‌ విడిభాగాలతో... ఏకంగా విమానాన్ని తయరు చేశాడు!!)

అయితే ఈ ఎయిర్‌ లైన్స్‌ పెద్ద పులుల సంరక్షణ బాధ్యతను నిమిత్తం వాటిని మండైలోని జంతు నిర్బంధ కేంద్రానికి తరలించే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అంతేకాదు అవి ఇలా తప్పించుకోవడం మొదటిసారికాదు అని అక్కడ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ సింహాలు మండై వైల్డ్‌లైఫ్ గ్రూప్ సంరక్షణలో మత్తు నుంచి కోలుకుంటున్నాయని అధికారులు తెలిపారు.

(చదవండి: వామ్మో!... రూ. 7 లక్షలు టిప్పా!!... షాక్‌కి గురైన వెయిటర్‌!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 

పోల్

Advertisement
 
Advertisement