తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు సింగపూర్‌లోని సెంగ్ కాంగ్ లోని శ్రీ అరుళ్ముగు వేలు మురుగన్ జ్ఞానమునీశ్వర్ ఆలయంలో ఘనంగా జరిగాయి. శ్రీ శుభకృత్ నామ సంవత్సరం లో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వ దినా న సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో భాగంగా పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ వేడుకల్లో సుమారు 200 మంది ప్రవాసి తెలుగు వారు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సమన్వయకర్తలుగా దీప నల్ల, నంగునూరి వెంకట రమణ, కాసర్ల శ్రీనివాస్ మరియు గోనె నరేందర్ రెడ్డి వ్యవరించారు. అదే విధంగా సంబరాలు విజయవంతంగా జరిగేందుకు సహయం అందించిన దాతలకు టీసీఎస్‌ఎస్ అధ్యక్షులు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, సంస్థాగత కార్యదర్శి గడప రమేష్ బాబు, కోశాధికారి కల్వ లక్ష్మణ్‌రాజులు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా సొసైటీ ఉపాధ్యక్షులు గర్రెపల్లి శ్రీనివాస్, గోనె నరేందర్ రెడ్డి, భాస్కర్ గుప్త నల్ల, ప్రాంతీయ కార్యదర్శులు దుర్గ ప్రసాద్, జూలూరి సంతోష్, రోజా రమణి, మరియు కార్యవర్గ సభ్యులు నడికట్ల భాస్కర్, శ్రీధర్ కొల్లూరి, గార్లపాటి లక్ష్మా రెడ్డి, అనుపురం శ్రీనివాస్, శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్, మరియు ప్రవీణ్ మామిడాల గార్లు సంబరాల్లో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment