మళ్లీ బీజేపీదే అధికారం | Suryanarayana Murthy Ugadi Panchang reading at BJP office | Sakshi
Sakshi News home page

మళ్లీ బీజేపీదే అధికారం

Published Wed, Apr 10 2024 6:06 AM | Last Updated on Wed, Apr 10 2024 6:06 AM

Suryanarayana Murthy Ugadi Panchang reading at BJP office - Sakshi

పంచాంగం వినిపిస్తున్న సూర్యనారాయణమూర్తి. చిత్రంలో కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్‌

 ఈ ఏడాది అంతా మంచే జరుగుతుంది 

సమష్టి విజయం సిద్ధిస్తుంది 

ప్రపంచానికి భారత్‌ ఆదర్శంగా నిలుస్తుంది 

బీజేపీ ఆఫీసులో సూర్యనారాయణ మూర్తి ఉగాది పంచాంగ పఠనం 

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి రాబోతోందని పంచాంగ శ్రవణకర్త కాకునూరి సూర్యనారాయణ మూర్తి జోస్యం చెప్పారు. –ఈ ఏడాది అంతా మంచే జరుగుతుందనీ, పార్టీ నాయకుల్లో ఐక్యత పెరుగుతుందనీ, సమష్టి విజయం సాధించాలనే సంకల్పం సిద్ధిస్తుందన్నారు. తమ శక్తి మేర ప్రజలకు వ్యయం చేస్తే నాయకులకు పేరు వస్తుందన్నారు. వృద్ధుల సహకారం ఉంటేనే యువకులు విజయం పొందుతారని తెలిపారు.

ప్రపంచానికి భారత్‌ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. తాను 14 ఏళ్ల క్రితం బీజేపీ కార్యాలయంలో ఉగాది పంచాంగ శ్రవణంలో పాల్గొని అయోధ్యలో శ్రీరామమందిర నిర్మాణం తర్వాత మళ్లీ కలుసుకుందామని చెప్పినట్టు మూర్తి గుర్తుచేశారు. అంతకు ముందు పార్టీ కార్యాలయంలో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి దంపతులు హోమం నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డుసభ్యుడు డా.కె.లక్ష్మణ్‌ , ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీ‹Ùబాబు, రాష్ట్రపార్టీ ప్రధానకార్యదర్శి (సంస్థాగత) చంద్రశేఖర్‌ తివారీ, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్‌.కుమార్‌ పాల్గొన్నారు.

మోదీ సర్కార్‌నే ప్రజలు కోరుకుంటున్నారు: కిషన్‌రెడ్డి 
పంచాంగ శ్రవణం అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. శ్రీ క్రోధి నామ సంవత్సరం చాలా ప్రాధాన్యత కలిగిన సంవత్సరమని, మోదీ నాయకత్వంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం రావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. మంచి వర్షాలతో, పాడిపంటలతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. మోదీ నేతృత్వంలో మరింత సుస్థిర, స్థిరమైన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దేశం కోసం పనిచేస్తున్న మోదీ నాయకత్వానికి మద్దతు తెలిపి లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థులందరినీ గెలిపించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement