![Grand Ugadi celebrations in Telangana: Jupalli Krishna Rao - Sakshi](/styles/webp/s3/article_images/2024/04/10/Shantikumari.jpg.webp?itok=Qq3XJePn)
ఉగాది వేడుకల్లో మంత్రి జూపల్లి. చిత్రంలో సీఎస్ శాంతికుమారి, సంతోష్‌కుమార్ శర్మ తదితరులు
మంత్రి జూపల్లి కృష్ణారావు
రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
గన్¸పౌండ్రీ (హైదరాబాద్): క్రోధినామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం రవీంద్రభారతిలో క్రోధినామ ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. రైతు కుటుంబాలలో పున్నమి వెన్నెలను నింపడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఉగాది వేడుకల్లో భాగంగా బ్రహ్మశ్రీ బాచంపల్లి సంతోష్‌కుమార్ శాస్త్రి పంచాగ పఠనం చేశారు. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కవి సమ్మేళనం ఆహుతులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు వీర్లపల్లి శంకర్, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, సీఎం ఓఎస్‌డీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment