వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి విశాఖపట్నం విమానాశ్రయంలో పార్టీ నేతలతో మంగళవారం కొంతసేపు చర్చించారు.
హుద్‌హుద్ తుపాను బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. తుపాను వచ్చి నెలరోజులు అయినా ఇంకా పేదల బతుకులు గాడిన పడలేదు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్దాం’
- వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి విశాఖపట్నం విమానాశ్రయంలో పార్టీ నేతలతో మంగళవారం కొంతసేపు చర్చించారు. తుపాను అనంతర పరిస్థితిని గురించి ఆయన వాకబు చేశారు. బాధితులకు ఇప్పటికీ ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందలేదని పార్టీ నేతలు ఆయనకు చెప్పారు. దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతులకు కూ డా నష్టపరిహారం చెల్లించలేదని... ఇంకా గోడలు కూలిన, పైకప్పులు ఎగిరిపోయిన ఇళ్లల్లోనే పేదలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాన్నారు.
దీనిపై వై.ఎస్.జగన్ స్పందిస్తూ సీఎం చంద్రబాబు మీడియాలో హడావుడి చేయడం తప్పా క్షేత్రస్థాయిలో బాధితులకు చేసిందేమీ లేదన్నారు. ‘తుపాను బాధితులను ఆదుకోవడంలో వైఫల్యంపై ప్రభుత్వాన్ని నిలదీద్దాం. ప్రజలున కూడగట్టుకుని పోరాటం చేద్దాం. డిసెంబరు 5న కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా చేద్దాం’అని చెప్పారు. దీనిపై నేతలు స్పందిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని చెప్పారు. విమానాశ్రయంలో వై.ఎస్.జగన్ పార్టీ నేతలు అందర్నీ పేరుపేరున పలకరించారు.
సాదరస్వాగతం
అంతకుముందు విశాఖపట్నం చేరుకున్న వై.ఎస్.జగన్‌కు విమానాశ్రయం వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు సాదర స్వాగతం పలికారు. కాపునాడు వ్యవస్థాపక అధ్యక్షుడు మిరియాల వెంకటరావు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు జగన్ మంగళవారం సాయంత్రం 4గంటలకు విశాఖపట్నం చేరుకున్నారు.
విమానాశ్రయంలో ఆయనకు జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, ఎమ్మెల్యేలు సుజయ్‌కృష్ణ రంగారావు, బూడి ముత్యాల నాయుడు, గిడ్డి ఈశ్వరి, ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు, మాజీ ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, తైనాల విజయ్‌కుమార్, మళ్ల విజయ్‌ప్రసాద్, కర్రి సీతారాం, చెంగల వెంకట్రావు, బలిరెడ్డి సత్యారావు, ధర్మాన కృష్ణదాస్, పిరియా సాయిరాజ్, సమన్వయకర్తలు తిప్పల నాగిరెడ్డి, వంశీకృష్ణ, కోల గురువులు, పెట్ల ఉమాశంకర్‌గణేష్, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, కొయ్య ప్రసాదరెడ్డి, కోరాడ రాజబాబు, ఉమారాణిలతోపాటు పెద్ద సంఖ్యలో పార్టీ నేతలకు స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి వై.ఎస్.జగన్ నేరుగా చైతన్యనగర్‌లోని మిరియాల వెంకటరావు నివాసానికి చేరుకున్నారు.
దివంగత మిరియాల వెంకటరావు చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆయన సతీమణి ప్రమీల, కుమారుడు శేషగిరిబాబు, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారితో కొంతసేపు గడిపిన అనంతరం బయలుదేరి నేరుగా విమానాశ్రయానికి చేరుకున్నారు. విమనాశ్రయం లాంజ్‌లో పార్టీ నేతలతో కొంతసేపు సమావేశమయ్యారు. అనంతరం హైదరాబాద్‌కు తిరుగుప్రయాణమయ్యారు. వై.ఎస్.జగన్ పర్యటనలో పార్టీ నేతలు పక్కి దివాకర్, అదీప్‌రాజ్, రవిరెడ్డి, గుడ్ల పోలిరెడ్డి, వెల్లూరి భాస్కర్‌రావు, ఫారూకీ, తోట రాజీవ్, మొల్లి అప్పారావు, పసుపులేటి ఉషాకిరణ్, వెంకటలక్ష్మి, కలిదిండి బదరీనాథ్, జీయాని శ్రీధర్, ఉరుకూటి అప్పారావు, పల్ల చినతల్లి, జీవన్‌కుమార్, కోనాడ సంజీవన్, ఆళ్ల పైడి రాజు, తుళ్లి చంద్రశేఖర్, శ్రీదేవీ వర్మలతోపాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.