విశాఖ నుంచి సర్వీసులు నడిపేందుకు వివిధ దేశాల ఆసక్తి
సాక్షి, విశాఖపట్నం: మన విమానాశ్రయంలో రాత్రి వేళ విమానాలు తిరిగేందుకు రంగం సిద్ధమైంది. ఐఎన్‌ఎస్‌డేగాలో సిబ్బంది కొరత, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌లో శిక్షణ పొందిన సిబ్బంది లేకపోవడం కారణంగా 24+7సేవలు ఆరంభం కాలేదు. ఈనెల 1వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో సేవలు ప్రారంభమైనప్పటికీ రన్‌వే నిర్వహణ పనుల కారణంగా 15రోజులు ఆలస్యమైంది. ప్రస్తుతం ఏ విమాన సంస్థ ముందుకు వచ్చినా సౌకర్యాలు కల్పించేందుకు సిద్దంగా ఉన్నామని ఎయిర్‌పోర్ట్ అధికారులు చెబుతున్నారు.
ఇప్పటికే పలు దేశాల విమాన సంస్థలు గతంలో విశాఖ వచ్చి ఇక్కడి పరిస్థితిని పరిశీలించి వెళ్లారు. విశాఖలో రాత్రి వేళ విమానాలు నడిపేందుకు సౌకర్యాలు కల్పిస్తే వీలైనంత తొందర్లోనే సేవలు ప్రారంభిస్తామని ప్రకటించడంతో ఇక్కడి పలు విమాన ప్రయాణికుల సంఘాలు ఆ దిశగా ప్రయత్నించాయి. గతంలో సింగపూర్ విమానం వారంలో మూడు రోజులు మాత్రమే సర్వీసులుండగా ప్రస్తుతం ప్రతి బుధ, శుక్ర, శని, ఆదివారాల్లో విమానాలు నడుస్తున్నాయి.
తక్కువ ధరల కే విదేశాలకు
వచ్చేనెలలో ఎయిర్‌లైన్స్ సంస్థలతో సమావేశం పెట్టదలిచాం. ట్రా వెల్స్, టూర్ సంస్థల్నీ ఆహ్వానిస్తాం. మంత్రుల్నీ పిలుస్తాం. లంక, థాయ్‌లాండ్, మలేషియా, దుబాయ్ ఎమిరేట్స్ విమాన సంస్థల్ని సంప్రదిస్తాం. టైగర్ ఎయిర్‌వేస్ అందుబాట్లోకి వస్తే తక్కువ ధరలకే వివిధ దేశాలకు వెళ్లొచ్చు. విశాఖ-కొలంబో విమానం త్వరలోనే రాబోతోంది.
- పి. విష్ణుకుమార్‌రాజు, విశాఖ డెవలెప్ కౌన్సిల్ అధ్యక్షుడు
ఎన్ని విమానాలొచ్చినా సిద్ధమే
వచ్చే నెల నుంచి ఎయిర్ కోస్టా సేవలు ప్రారంభ మవుతున్నాయి. డీజీసీఏ నుంచి వివరాలు అం దాల్సి ఉంది. నిత్యం ఉదయం 11గంటలకు విశాఖ నుంచి బెంగళూరుకు సర్వీసు నడిపేందుకు సిద్ధం గా ఉన్నారు. చెన్నయ్‌కు కూడా సర్వీసులు నడిపే అవకాశం ఉంది. ఎయిర్‌కోస్టాకు బుకింగ్ కార్యాలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పాత టెర్మినల్‌లో కార్గో సేవలు ప్రారంభిం చేందుకు వీలుగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.
రామన్.
ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ మేనేజర్.
రాత్రికి రెక్కలు
Published Tue, Jan 21 2014 2:39 AM | Last Updated on Sat, Sep 2 2017 2:49 AM
Advertisement
Advertisement