
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో గురువారం హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. సాక్షాత్తూ ఎయిర్‌పోర్టులోనే ఒక రాష్ట్ర ప్రతిపక్షనేతపై దాడి జరగడంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్, పవన్, బీజేపీ ఎంపీ జీవీఎల్, కన్నా లక్ష్మీనారాయణ ఈ దాడిని ఖండించారు.
అయితే, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన దాడి ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు డ్రామాగా అభివర్ణించారు. జగన్‌పై దాడిని ఖండించిన వారిపై బాబు విమర్శలు చేశారు. కాగా, ముఖ్యమంత్రి విమర్శలపై స్పందించిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. ‘ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు’ ఎక్కడ ఏం జరిగినా ముఖ్యమంత్రి గారు, ఆయన వర్గీయులు మా మీద పడి ఏడుస్తారెందుకని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
My response for Sri CBN’s comments on us: ‘ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు’ ఎక్కడ ఏం జరిగినా ముఖ్యమంత్రి గారు అయన వర్గీయులు మా మీద పడి ఏడుస్తారు ఎందుకు?
— Pawan Kalyan (@PawanKalyan) October 25, 2018