సాక్షి, విజయవాడ: ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై వెకిలిగా మాట్లాడటం భావ్యం కాదని టీడీపీ ప్రభుత్వానికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హితబోధ చేశారు. శుక్రవారం స్థానికంగా జరిగిని ఓ సమావేశానికి హాజరైన ఆయన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రతిపక్షనేతపై జరిగిని దాడిపై ప్రభుత్వం సాకులు చెప్పడం సరికాదన్నారు. ఈ దాడిపై లోతైన దర్యాప్తు జరగాలని కోరారు. టీడీపీ నాయకులు ఎదుటివారిపై బురద జల్లే విధంగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు.
గతంలో నా తల్లిపై కూడా ఇలాంటి వ్యాఖ్యలే
‘వైఎస్ జగన్‌పై హత్యాయత్నం చేసింది ఆయన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలలేనని టీడీపీ నాయకులు మాట్లాడటం తగదు. ఎక్కడైనా కొడుకు, అన్న చనిపోవాలని తల్లి, చెల్లి కోరుకుంటారా?. టీడీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిది. గతంలో నా తల్లిపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. దర్యాప్తులో రాజకీయ జోక్యం మంచిది కాదు. పోలీసులను వారిపని వారిని చేసుకోనివ్వాలి.
కాంగ్రెస్-టీడీపీ కలయికపై
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన ఉనికి కోసం, పదవి కాపాడుకోవడం కోసమే ఢిల్లీ బాట పట్టారు. ఆయన చూపింది సినిమా విడుదలకు ముందు వచ్చే ట్రైలర్ లాంటింది, కానీ బాబు సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వటం ఖాయం. చంద్రబాబు కాంగ్రెస్‌తో కలయిక చూస్తుంటే అయన ప్రయాణం ఎక్కడ మొదలుపెట్టారో అక్కడికే చేరుకున్నట్లు అనిపిస్తోంది. ప్రజా సమస్యల పరిష్కారం వల్లే గెలుపు సమీకరణాలు మారతాయే కానీ పార్టీల కలయికల వల్ల కాదు.
అనుభవం పార్టీలు మారేందుకేనా?
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి అపార అనుభవం పార్టీలతో పొత్తులు పెట్టుకునేందుకే ఉపయోగపడుతుంది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే ఆ రోజు టీడీపీకి మద్దతిచ్చాను. మా అన్నయ్యను ఎదురించి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాటం చేశాను. చంద్రబాబు అనభవం ప్రజా సమస్యలు పరిష్కారం కోసం ఉపయోగపడితే బాగుంటుంది’అంటూ పవన్ సూచించారు. (వైఎస్ జగన్‌పై దాడి అమానుషం: పవన్ కల్యాణ్)
Comments
Please login to add a commentAdd a comment