హుదూద్ తుఫాన్.. విశాఖ విమానాశ్రయంపై విరుచుకుపడింది.
విశాఖపట్నం: హుదూద్ తుఫాన్.. విశాఖ విమానాశ్రయంపై విరుచుకుపడింది. చండప్రచండంగా వీచిన ఈదురు గాలులకు ఎయిర్పోర్టు బాగా దెబ్బతింది. విమాశ్రాయం టెర్మినల్ పైకప్పు, అద్దాలు ధ్వంసమైయ్యాయి. సూచికలు, హోర్డింగ్స్ దెబ్బతిన్నాయి.
శిథిలాలు ప్రయాణికులు వేచివుండే గదిలోకి పడిపోయాయి. ఎయిర్పోర్టుల పరిసర ప్రాంతాల్లో చెట్లు విరిగిపోయాయి. మరోవైపు భారీ వర్షాలతో రన్ వేపైకి నీరు చేరింది. ఫలితంగా విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది.