Cyclone Hudhud
-
హుద్‌హుద్... మానని గాయం
-
రైతులకు రూ.96 కోట్ల హుద్‌హుద్ పరిహారం
మందస(పలాస) :హుద్‌హుద్ తుఫాన్ నష్టపరిహారం కింద జిల్లాలోని రైతులకు రూ.96 కోట్లను అందజేసినట్టు జిల్లా రిలీఫ్ అకౌంట్స్ సహాయ ఆడిట్ అధికారి ఎం.స్వాతి తెలిపారు. మందస మండలానికి సంబంధించిన హుద్‌హుద్ పరిహారం నిధుల పంపిణీ వ్యవహారంపై మంగళవారం తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ వ్యవసాయానికి రూ.86 కోట్లు, ఉద్యానవనానికి సంబంధించి రూ.10 కోట్లను రైతులకు ఇప్పటికే అందజేశామన్నారు. మందస మండలంలో 38 పంచాయతీల్లోని 147 మంది రైతులకు రూ.2.5 లక్షలు పంపిణీ చేశామని వివరించారు. ఈ నిధులు రైతులకు చేరాయా.. అక్రమాలు జరిగాయా.. అనే అంశాలపై ఆడిట్ నిర్వహిస్తున్నామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా రెండు బృందాలు ఆడిట్ నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. ఆమెతో పాటు మందస ఏఎస్ఓ బి.భోగేశ్వరరావు, వీఆర్వోలు నల్ల వైకుంఠరావు, రవీంద్రనాథ్ పట్నాయక్‌లు రికార్డులను పరిశీలించారు. -
స్పోర్ట్స్ కాంప్లెక్స్‌పై క్రీనీడ
విజయనగరం మున్సిపాలిటీ: గతమెంతో ఘనం..వర్తమానం దైన్యం..అన్నట్లు తయారైంది క్రీడల ఖిల్లాగా పేరుగాంచిన విజయనగరంలో క్రీడామైదానాల పరిస్థితి. అందరికీ అందుబాటులో జిల్లాకేంద్ర నడిబొడ్డున గల రాజీవ్ క్రీడామైదానం ఇదే దుస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. 2014వ సంవత్సరంలో సంభవించిన హుద్‌హుద్ తుఫాన్ ధాటికి కొన్ని వనరులు పాడవగా..కేవలం నష్ట అంచనాలు రూపొందించడం మినహా అంతకుమించి ఒక్కడుగు ముందుకు పడకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా మైదానం నిర్వహణ భారం మోయలేమని బాధ్యతలను తీసుకోవడానికి క్రీడాభివృద్ధి శాఖ, మున్సిపాలిటీ వెనుకడుగు వేస్తున్నాయి. దీంతో కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన కాంప్లెక్స్‌లోని మౌలిక సౌకర్యాలు మరుగునపడుతున్నాయి. నిర్వహణకు నెలకు రూ20వేలు అవసరం జిల్లా క్రీడాప్రాధికార సంస్థ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్వహణకు నిధులు కరువయ్యాయి. నెలవారీ దీని నిర్వహణకు సుమారు రూ.20 వేల వరకూ అవసరం ఉంటుంది. అయితే ఆ నిధులు ప్రత్యేకంగా ఎక్కడ నుంచీ వచ్చే అవకాశం లేకపోవడం వల్ల డీఎస్ఏ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇటీవల వరకు జిల్లా స్థాయిలో జరిగే క్రీడాపోటీలను ఉడా అనుమతితో నిర్వహించి, అందుకు అయిన ఖర్చును పోటీల నిర్వాహకుల నుంచి వసూలు చేసేవారు. ప్రస్తుతం ఆపరిస్థితి లేదు. ఫలితంగా మైదానం ఆవరణలో ఉన్న మరుగుదొడ్లు పూర్తిగా పాడయ్యాయి. అలాగే ఇండోర్‌లోని ఉడెన్ గ్రౌండ్, వసతి గదులు, ప్రధాన ప్రవేశద్వారాలు, పార్కింగ్ ప్రాంతాలలో పారిశుద్ధ్య లోపం నెలకొంది. రాత్రి , పగలు తేడా లేకుండా మైదానం ఆవరణలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఏ ఒక్కరు పట్టించుకోకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవు తున్నాయి. గతంలోనే సూచించినా ప్రయోజనం శూన్యం మైదానం నిర్మాణ సమయంలోనే వాణిజ్య దుకాణాలు నిర్మించడం ద్వారా వాటిపై వచ్చే అద్దెతో నిర్వహణ చేయాలని ప్రతిపాదన వచ్చినా అప్పట్లో పట్టించుకోకపోవడంతో ఆ ప్రభావం ప్రస్తుతం స్పష్టంగా కనిపిస్తోంది. స్టేడియం పడమర, ఉత్తర ప్రాంతాల్లో ప్రహరీ ఆనుకొని వాణిజ్య దుకాణాలు నిర్మిస్తే వాటి ఆదాయంతో నిర్వహణ సమస్య తీరుతుందని పలువులు సూచించారు. అయితే ఆ ప్రతిపాదనను అప్పటి అధికారులు, ప్రజాప్రతినిధులు తోసిపుచ్చడంతో పరిస్థితి దయనీయంగా మారింది. నిర్వహణకు స్థిరాదాయ వనరులు కావాలి రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్వాహణకు స్థిరంగా ఆదాయం వచ్చే వనరులు కావాల్సి ఉందని డీఎస్డీఓ ఎస్.వెంకటేశ్వరరావు చెప్పారు. కాంప్లెక్స్ పరిసరాలలో వాణిజ్య భవనాలు నిర్మించే అంశం పరిశీలనలో ఉందని తెలిపారు. స్వతహాగా తమ శాఖకు ఆర్థిక స్థోమత లేకపోవడం వల్లే బాధ్యతలను తీసుకోలేదని వివరించారు. భవన నిర్మాణానికి మున్సిపాలిటీ నిధులను వెచ్చిస్తే కాంప్లెక్స్ అభివృద్ధి సులువు అవుతుందని అభిప్రాయపడ్డారు. -
ఇక్కడా కక్కుర్తే..!
♦ ఐఏవై ఇళ్లను కుదించిన రాష్ట్ర సర్కార్ ♦ సబ్సిడీ భారం తగ్గించుకునేందుకు ఎత్తుగడ ♦ {పజాప్రతినిధుల నుంచి వ్యతిరేకత ఎన్టీఆర్ గృహ నిర్మాణం పేరిట కేంద్రం మంజూరు చేసిన ఐఏవై ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం కుదించేసింది. తద్వారా సబ్సిడీ భారం రాష్ట్రంపై పడకుండా సర్దుబాటు చేసే ప్రయత్నాలు చేస్తోంది. ఈ పరిణామాలతో హుద్‌హుద్ బాధితులకు తీవ్ర నష్టం జరగనుంది. మరోవైపు ఈ నిర్ణయంపై ఎమ్మెల్యేల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నూతన మార్గదర్శకాలతో జాబితాలో అర్హులను తొలగిస్తే నియోజకవర్గాల్లో తిరగలేమని వారు మండిపడుతున్నారు. ఇటీవల జరిగిన జెడ్పీ సమావేశంలో కూడా ఈ అంశంపై తీవ్ర చర్చ జరిగింది. సాక్షి, విశాఖపట్నం : హుద్‌హుద్ తుఫాన్‌కు ఒక్క విశాఖలోనే లక్షా 18 వేల ఇళ్లు దెబ్బతిన్నాయి. నేటికీ వేలాది మంది నిలువ నీడ లేక పరాయి పంచన కాలం వెళ్లదీస్తున్నారు. ఐఏవై కింద 66,390 ఇళ్ల కోసంకేంద్రానికి ప్రతిపాదనలు పంపితే.. యూనిట్ కాస్ట్ రూ.75 వేల అంచనాతో జిల్లాకు 16,890 మంజూరు చేసిం ది. కాగా ఇటీవల రాష్ర్ట ప్రభుత్వం ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం ద్వారా రాష్ర్టంలో రెండు లక్షల గృహాలు నిర్మిస్తున్నట్టు గొప్పలు చెప్పుకుంటున్న సర్కా ర్.. హుద్‌హుద్ వల్ల తీవ్రంగా దెబ్బతిన్న విశాఖకు కేవలం 1,821 ఇళ్లను మాత్రమే మంజూరు చేసింది. ఇప్పటికే దాతల సహకారంతో ఆరువేల ఇళ్ల నిర్మాణం చేపడుతున్నందున.. ఐఏవై ఇళ్లలో కోత పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాకు మంజూరైన 16,890 ఐఏవై ఇళ్లను 9,929 ఇళ్లకు కుదించేసింది. ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకంలో మంజూరు చేసిన 1,821 ఇళ్లతో కలిపి మొత్తం 11,750 ఇళ్లను యూనిట్ కాస్ట్ రూ.2.75లక్షలతో నిర్మించాలని నిర్ణయిం చింది. యూనిట్ కాస్ట్లో ఎస్సీ, ఎస్టీలకైతే సబ్సిడీ రూపంలో రూ.37,500 కేం ద్రం, రూ.1.37,500 రాష్ర్టం భరించనుండ గా, మరో లక్ష రుణం రూపం లో మంజూరు చేయనుంది. ఇతరులకైతే కేం ద్రం రూ.37,500, రాష్ర్టం రూ.87,500 భరించనుం డగా, రూ. 1.50 లక్షలు రుణంగా అందజేయనుం ది. అంటే కేంద్రం వాటా పోను.. రాష్ర్టం సబ్సిడీ భరించాల్సి ఉంది. ఈ భారాన్ని తగ్గించుకునేందుకు ఐఏవై ఇళ్ల కింద మంజూరు చేసిన సొమ్మును సర్దుబాటు చేసుకుని ఇళ్ల సంఖ్య కుదించిందనే వాదన విన్పిస్తోంది. ఐఏవై ఇళ్లను కుదించడం వల్ల కేంద్రం వాటా, రుణం పోగా జిల్లాకు మంజూరు చేసిన ఇళ్లకు సంబంధించి రాష్ర్టంపై అదనంగా పడే భారం కేవలం రూ.65 కోట్ల లోపే ఉంటుందని అంచనా. హుద్ హుద్ బాధితులకు తీవ్ర నష్టం జిల్లా వ్యాప్తంగా హుద్‌హుద్ బాధితుల కోసం కేంద్రం ఐఏవై ఇళ్లు మంజూరు చేసింది. కానీ ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం మార్గదర్శకాలను పరిశీలిస్తే 75 శాతం పూర్తిగా ఒకే ప్రాంతంలో లే అవుట్ సైట్లోనై నిర్మించాలి. గ్రామా ల్లో ఇళ్లు నిర్మించుకోకుండా అక్కడక్కడా ఉన్న లబ్ధిదారుల్లో కేవలం 25 శాతం మందికి మాత్రమే మంజూరు చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన హుద్‌హుద్‌కు బాధితులకు నష్టం జరిగే పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యేల నుంచి వ్యతిరేకత మరొక పక్క ఇప్పటికే ఐఏవై కింద మంజూరైన ఇళ్ల కోసం ఎమ్మెల్యేల నుంచి 4,488 ప్రతిపాదనలు అందగా, వీటిలో ఇప్పటికే 1,050 ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. నియోజకవర్గానికి రెండువేల ఇళ్ల వరకు కేటాయించగా.. సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయంతో వీటి సంఖ్య సగానికి తగ్గిపోనుంది. పైగా మార్గ దర్శకాలు పుణ్యమాని అర్హుల జాబితాలో చాలాపేర్లు తొలగించాల్సి వస్తోంది. దీంతో ఈ ప్రతిపాదనను ఎమ్మెల్యేల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ‘ఇప్పటికే మంజూరైన ఐఏవై ఇళ్లను రూ.75 వేల యూనిట్ కాస్ట్‌తో నిర్మిస్తారో లేక రూ.2.75లక్షల యూనిట్‌కాస్ట్‌తో నిర్మిస్తారో మీ ఇష్టం.. కానీ జిల్లాకు మంజూరైన 16,890 ఇళ్లను కుదించడానికి వీల్లేదని’ వారు పట్టుబడుతున్నారు. అలా చేస్తే నియోజకవర్గాల్లో తిరగలేమని..ఇప్పటికే ఎంపిక చేసిన వారికి ఏం సమాధానం చెబుతామని ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశంపై జెడ్పీ సర్వసభ్య సమావేశంలో కూడా చర్చ జరగడంతో కుదించిన 5,140 ఇళ్లను జిల్లాకు అదనంగా మంజూరు చేయాలని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించింది. -
లీలావతికి ఏం జరిగింది?
‘‘సినిమా తీయాలని వైజాగ్‌కు వచ్చిన ఓ అమ్మాయి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను తీసుకుని, వాణిజ్య అంశాలు జోడించి ఈ సినిమా తీశాం. హుద్ హుద్ తుఫాన్ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. లీలావతికి ఏం జరిగింది? అనేది సినిమాలో చూడాల్సిందే’’ అని పి. సునీల్‌కుమార్ రెడ్డి అన్నారు. ఆయన దర్శకత్వంలో కీ ప్రొడక్షన్స్ సమర్పణలో శ్రావ్య ఫిలింస్ పతాకంపై యెక్కలి రవీంద్రబాబు నిర్మించిన ‘మిస్ లీలావతి’ వచ్చే వారం విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ - ‘‘గ్లోబల్ వార్మింగ్ వల్ల భవిష్యత్తులో హుద్ హుద్ వంటి పరిణామాలు బోల్డన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే, అక్రమ సంబంధాల కారణంగా భవిష్యత్తులో మానవ సంబంధాల్లో ఎలాంటి విపరీతమైన మార్పులు చోటుచేసుకుంటాయో ఈ చిత్రంలో చర్చించాం. అనుబంధాలు సవ్యంగా ఉన్నంతవరకూ బాగానే ఉంటుందనీ, దారి తప్పితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పే చిత్రం ఇది’’ అన్నారు. అసభ్యతకు తావు లేకుండా కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిదనీ, మంచి కథాంశంతో రూపొందించిన ఈ చిత్రంలో చక్కని సందేశం ఉందనీ నిర్మాత రవీంద్రబాబు చెప్పారు. అన్ని వర్గాలవారినీ ఆకట్టుకునే విధంగా సినిమా ఉంటుందని ఎగ్జిక్యూటివ్ నిర్మాత బాపిరాజు అన్నారు. సంగీతదర్శకుడు ప్రవీణ్ ఇమ్మడి, ఎడిటర్ శివ కూడా మాట్లాడారు. -
టీడీపీ కార్యకర్తలకే తుపాను సాయం: రఘువీరా
టీడీపీ కార్యకర్తలు, నకిలీ బాధితులకు హుద్‌హుద్ తుపాను నష్టపరిహారాన్ని దోచి పెడుతున్నారని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మండిపడ్డారు.తుపాను సాయంలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ తుపానులోనష్టపోయిన అసలైన బాధితులకు పరిహారం అందట్లేదని ఆయన చెప్పారు. అలాంటి బాధితుల జాబితా కూడా ప్రభుత్వం రూపొందించలేదని ఆరోపించారు. మొత్తం 774 కోట్ల రూపాయలు విడుదలైతే, అందులో సగానికి పైగా సొమ్మును టీడీపీ కార్యకర్తలే దోచుకున్నారని మండిపడ్డారు. వీటిపై క్షేత్రస్థాయిలో అఖిలపక్షాన్ని ఏర్పాటుచేసి, అధికారులతో సమీక్షలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. అవినీతిపై ప్రభుత్వం చర్యలు తీసుకోని పక్షంలో కోర్టును ఆశ్రయిస్తామని రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. -
లేని కీడుకు లబ్ధి కోసం..
పిఠాపురం : గాలీవానకు నేలమట్టమైన ఇళ్లు కొన్ని. కడలి కడుపులో కలిసిపోయిన ఇళ్లు కొన్ని. ‘హుద్‌హుద్’ తుపాను దెబ్బకు నిలువనీడ కోల్పోయిన నిజమైన బాధితులు ఎండకు ఎండి, చలికి వణుకుతూ.. మళ్లీ గూళ్లు సమకూర్చుకునేందుకు సర్కారు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. కొందరు స్వార్థపరులు ఇదే అదనుగా పావులు కదిపారు. నిక్షేపంలా ఉన్న ఇళ్లు కూడా హుద్‌హుద్ తాకిడికి ధ్వంసమైనట్టు చూపుతూ పరిహారాన్ని దండుకోవడానికి చూస్తున్నారు. ఈ అక్రమానికి అధికార పార్టీ నాయకులు సూత్రధారులు. తుపాను సమయంలో తూతూమంత్రంగా సహాయక చర్యలు చేపట్టి, వాటికైనా ఖర్చును రూ.లక్షల్లో చూపుతున్న అధికారులే అధికార పార్టీ వారి పన్నాగానికి దన్నుగా నిలుస్తున్నారు. నష్టపోని ఇళ్లను నాశనమైనట్టు రికార్డులు సృష్టించి, సర్కారు సొమ్ము దుర్వినియోగానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ‘హుద్‌హుద్’ తాకిడికి కొత్తపల్లి మండలంలో 156 గృహాలు ధ్వంసమైనట్టు అధికారులు నివేదికలు తయారు చేశారు. బాధితులకు నష్టపరిహారం మంజూరు చేయాలని కోరుతూ నివేదికలను ఆన్లైన్లో ప్రభుత్వానికి పంపారు. అలాగే తుపాను వేళ బాధితులకు భోజన వసతి సౌకర్యాలు కల్పించడానికి రూ.4 లక్షలు ఖర్చు చేసినట్టు లెక్కలు చూపిస్తున్నారు. అధికార పార్టీ నాయకుల ఆదేశాల మేరకు, వారి కనుసన్నల్లో పరిహారానికి అర్హులైన వారి జాబితాలు తయారు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అధికారుల నివేదికలను అనుసరించి బాధితులు ఒక్కొక్కరికీ ముందస్తుగా రూ.5 వేల నష్టపరిహారం మంజూరు కాగా పంపిణీకి రంగం సిద్ధమైంది. పంపిణీ అనంతరం ప్రభుత్వం జాబితాల్లోని బాధితుల్లో ఎస్సీలకు రూ.లక్ష, ఎస్టీలకు రూ.1.05 లక్షలు, బీసీ, ఓసీలకు రూ.75 వేలు కేటాయించి, ఆ మొత్తానికి దాతల నుంచి సేకరించే సొమ్ములో రూ.3 లక్షల చొప్పున జోడించి, ఐఏవై గృహాలతో మోడల్ కాలనీ నిర్మించనుంది. దీంతో ఆ లబ్ధి తమ వారికే చెందేలా అధికారపార్టీ నేతలు పావులు కదిపారు. అనుచరుల పేర్లను ఇళ్లు కోల్పోయిన బాధితులుగా రాయించారు. సీఆర్‌జెడ్ పరిధిలోని ఇళ్లకూ నష్టమని నివేదిక.. నిజానికి హుద్‌హుద్ తాకిడికి మండలం కోనపాపపేటలో సుమారు 50 గృహాలు ధ్వంసమయ్యాయి. అదే ఊళ్లో కొన్ని గృహాలు సముద్రకోతకు గురయ్యాయి. కొత్తపల్లి మండలంలో ఎక్కడా ఇళ్లు పాక్షికంగా కూడా దెబ్బతిన్న దాఖలాలు లేవు. కానీ మండలం మొత్తం మీద 156 గృహాలు దెబ్బ తిన్నట్టు అధికారులు నివేదికలు ఇచ్చారు. ప్రస్తుతం అధికారులు తయారు చేసిన జాబితాలో గతంలో ఉప్పాడ శివారు మాయాపట్నంలో అగ్నిప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన వారిని చేర్చడం అనర్హులకు చోటు కల్పించారన్న నిజాన్ని బయటపెడుతోంది. ఈ అగ్నిప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు సుబ్బంపేట వద్ద స్థలాలు కేటాయించి పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చారు. కాగా సముద్రానికి 500 మీటర్ల దూరం (కోస్టల్ రెగ్యులేటరీ జోన్ (సీఆర్‌జెడ్)లో ఎలాంటి నిర్మాణాలు జరపకూడదని కచ్చితమైన నిబంధన ఉండగా అధికారులు ఆ పరిధిలోని కొన్ని ఇళ్లకు నష్టం జరిగిందంటూ నివేదికలు ఇవ్వడం గమనార్హం. క్షేత్రస్థాయిలో గృహ నిర్మాణశాఖ విచారణ ఇళ్లు కోల్పోయిన వారి జాబితాల విషయంపై స్థానిక తహశీల్దారు రియాజ్ హుస్సేన్‌ను వివరణ కోరగా తాను ఇటీవలే బాధ్యతలు చేపట్టానన్నారు. నివేదికలపై విచారణ జరుగుతోందని, అనర్హులుంటే తొలగిస్తామని చెప్పారు. కాగా రెవెన్యూ అధికారుల నివేదికపై విచారణ నిర్వహించిన గృహనిర్మాణశాఖాధికారులు ఇళ్లు దెబ్బతిన్న బాధితుల జాబితాలో 56 మంది అనర్హులేనని తేల్చారు. వారిలో ఎక్కువ మంది ఇదివరకు ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వారేనంటున్నారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహిస్తున్నామని, ఇంకా ఎవరైనా అనర్హులున్నా బయటపడుతుందని ఆ శాఖ ఏఈ సోమిరెడ్డి తెలిపారు. -
మాకే సాయమూ అందలేదు
రాకాసి గాలులకు పడిపోయిన చెట్లకు చిన్న చిన్న చిగుళ్లు వచ్చాయి. కూలిపోయిన ఇళ్ల స్థానంలో కొత్తవి రూపుదిద్దుకుంటున్నాయి. చిందరవందరగా మారిన తీరం ఇప్పుడు సర్దుకుంటోంది. ఇదిగో ఇప్పుడు వచ్చారు అధికారులు ‘మీ నష్టమెంత’ అని అడగడానికి. తుపాను వెళ్లిన నలభై రోజుల తర్వాత కేంద్ర బృందం జిల్లాలోని పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో జరిగిన నష్టాన్ని పరిశీలించింది. ఈ సందర్భం గా స్థానికులతో అధికారులు మాట్లాడారు. అయితే అధికారుల ప్రశ్నలకు మెజారిటీ ప్రజలు ఇచ్చిన జవాబు మాత్రం ‘మాకే సాయమూ అందలేదు’ అనే... భోగాపురం: తుపాను వెలిసిన నలభై రోజుల త ర్వాత వచ్చిన కేంద్ర బృందం వద్ద బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. మండలంలోని హుద్‌హుద్ ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందం బుధవారం ఆయా ప్రాంతాల్లో పర్యటించింది. ముందుగా కవులవాడలో పడిపోయిన ఇళ్లను, కొబ్బరి తోటలను పరిశీలించింది. అనంతరం తూడెం గ్రామంలో కూలిన కొబ్బరి తోటలను అధికారులు పరిశీలించారు. దీనిపై ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు. అక్కడ స్థానికులతో అధికారులు నష్టంపై మాట్లాడారు. అనంతరం దిబ్బలపాలెం గ్రామానికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి తమకు బియ్యం తప్పించి ఎలాంటి సాయం అందలేదని బాధితులు తెలిపారు. ఇల్లు కూలిపోయినా నమోదు చేయలేదన్నారు. అనంతరం అధికారులు బమ్మిడి పేట వద్ద తుపానుకు కొట్టుకుపోయిన ఆర్అండ్బీ రోడ్డును పరిశీలించారు. భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో 20వంతెనలు పాడయ్యాయని దానికి రూ.65లక్షలు అవసరం అవుతుందని సంబంధిత శాఖ అధికారులు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో తారు రోడ్లకు కిలోమీటరుకి రూ.10లక్షల చొప్పున మెయింటనెన్స్‌కి నిధులు అవసరమని తెలిపారు. అనంతరం ముక్కాం గ్రామంలో పర్యటించారు. ఇక్కడ మత్స్యశాఖ ఏర్పాటుచేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా మత్స్యకారులకు అందాల్సిన సాయంపై మ త్స్యశాఖ ఏడి ఫణిప్రకాష్ వివరించారు. ఇక్కడి మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారని ఆయన కేంద్ర బృందం దృష్టికి తీసుకు వెళ్లారు. అనంతరం భోగాపురం గ్రామానికి చేరుకుని పశుసంవర్ధక శాఖ అధికారులతో మాట్లాడారు. తుపాను కారణంగా చనిపోయిన పశువులు, కోళ్ల పారాల్లో కోళ్లు, గొర్రెలు తదితర ఫొటోలను పరిశీలించారు. కార్యక్రమంలో బృంద సభ్యులు కృష్ణ, గోదావరి బేసిన్ ఆర్గనైజేషన్ ఎస్ఈ ఎం. రమేష్‌బాబు, ఫైనాన్స్ కమిషన్ సీనియర్ డెరైక్టరు రాజీబ్ కుమార్, కేంద్ర పశుసంవర్ధక శాఖ విభాగం డిప్యూటీ సెక్రటరీ పి.ఎస్. చక్రబర్తీ, గ్రామీణాభివృద్ది మంత్రిత్వశాఖ అండర్ సెక్రటరీ రామవర్మ తోపాటు జెడ్పీ చైర్మన్ శోభా స్వాతి రాణి, ఎమ్మెల్యే పతివాడ నారాయణ స్వామినాయుడు, ఎంపీపీ కర్రోతు బంగార్రాజు, మాజీ ఏఎంసి వైస్ చైర్మన్ దంతులూరి సూర్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు. ‘తీరని శోకమిది’ పూసపాటిరేగ: మండలంలోని తిప్పలవలస గ్రామంలో హుద్‌హుద్ కారణంగా మత్స్యకారులకు జరిగిన నష్టాన్ని కేంద్రబృందం సభ్యులు బుధవారం పరిశీలించారు. తీర ప్రాంతంలో జరిగిన నష్టాన్ని మత్స్యశాఖ ఏడీ ఫణిప్రకాష్ కేంద్ర బృంద సభ్యులకు వివరించారు. తుపాను ప్రభావంతో 22 మత్స్యకార గ్రామాల్లో రూ.కోట్లలో నష్టం జరిగిందని, వలలు, పడవలతో పాటు ఇళ్లకు కూడా నష్టం జరిగిందని బృంద సభ్యులకు వివరించారు. స్థానిక సర్పంచ్ భర్త వాసుపల్లి అప్పన్న గ్రామంలో జరిగిన నష్టాన్ని కేంద్ర బృందానికి తెలియజేశారు. అలాగే కలెక్టర్ ఎం.ఎం నాయక్ తీరప్రాంతంలో జరిగిన నష్టం,తుపాను సమయంలో అప్రమత్తమైన విధానాన్ని తెలిపారు. బృంద సభ్యులతో పాటు జేసీ రామారావు, నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు, ప్రత్యేక అధికారి వి.ఆదినారాయణ, తహశీల్దార్ జి.జయదేవి, ఎంపీడీఓ డి.లక్ష్మి, ఎంపీపీ మహం తి చిన్నంనాయుడు, జెడ్పీటీసీ ఆకిరి ప్రసాదరావు, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. పంటనష్టంపై ఫొటో ఎగ్జిబిషన్ మండలంలోని కుమిలి గ్రామం పరిధిలో దెబ్బతిన్న పంటలపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను కేంద్ర బృందం సభ్యులు బుధవారం రాత్రి తిలకించారు. తుపాను కారణంగా నష్టపోయిన పంటలు విషయమై కుమిలి సర్పంచ్ దల్లి ముత్యాలురెడ్డి కేంద్రబృందం సభ్యులకు వివరించారు. రామతీర్థసాగర్ రిజర్వాయర్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం తరఫున నిదులు మంజూరు చేయాలని నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి నాయుడు కోరారు. దీంతో బృందం సభ్యులు రామతీర్థసాగర్ రిజర్వాయర్ ట్యాంకును పరిశీలించారు. దీనిపై ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. -
హుదూద్ సహాయార్థం టాలీవుడ్ 'మేము సైతం'
-
హుదూద్ సహాయార్థం టాలీవుడ్ 'మేము సైతం'
హుదూద్ తుపాను బాధితులను ఆదుకోడానికి 'మేము సైతం' అనే భారీ కార్యక్రమాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ చేపడుతోంది. ఈనెల 29, 30 తేదీలలో ఈ బృహత్ కార్యక్రమం ఉంటుందని టాలీవుడ్ ప్రముఖులు విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇది కేవలం ఆ రెండు రోజులకు మాత్రమే పరిమితం కాదని, మారథాన్‌లా సాగుతుందని రాజ్యసభ సభ్యుడు చిరంజీవి తెలిపారు. 29వ తేదీ రాత్రి 7.30 గంటల నుంచి 10.30 గంటల వరకు నటీనటులతో డిన్నర్ కార్యక్రమం ఉంటుందని నాగార్జున చెప్పారు. దానిలోకి కేవలం 250 జంటలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఒక్కో జంటకు టికెట్ ధరను లక్ష రూపాయలుగా నిర్ణయించారు. జంటలు అంటే.. భార్యాభర్తలు కావచ్చు, అన్నాదమ్ములు కావచ్చు, ఎవరైనా ఇద్దరి చొప్పున రావాలని తెలిపారు. ఎవరికీ కాంప్లిమెంటరీ పాస్‌లు మాత్రం ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. అప్పటికప్పుడే మొదటి టికెట్‌ను అల్లు అరవింద్ కొన్నారు. పలు రకాల కార్యక్రమాలు ఉంటాయని, 500 రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు వివిధ రకాల కార్యక్రమాలకు వివిధ ధరల్లో టికెట్లు నిర్ణయించారు. ఆటలు, పాటలు, డాన్సులు, వినోద కార్యక్రమాలు అన్నీ ఉంటాయన్నారు. వీటన్నింటికి సంబంధించిన టికెట్లను బుక్ మై షో ద్వారా కూడా పొందొచ్చన్నారు. అలాగే సికింద్రాబాద్ క్లబ్బు, ఫిల్మ్‌నగర్ క్లబ్బు లాంటి చోట్ల కూడా దొరుకుతాయన్నారు. ఇతర వివరాలకు memusaitam.com అనే వెబ్సైట్లో కూడా సంప్రదించవచ్చని వివరించారు. ఈ సమావేశంలో చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, శ్రీకాంత్, సురేష్ బాబు, అల్లు అరవింద్, అశోక్ కుమార్, ఇతర టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. -
మంత్రి ఇలాకాలో కార్మికుల ‘ఆకలి కేకలు’
మెరకముడిదాం : రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణశాఖామంత్రి కిమిడి మృణాళిని సొంత ఇలాకాలో ఉన్న రెండు ఫెర్రో పరిశ్రమలు మూతపడడంతో సుమారు నాలుగు వేల మంది కార్మికులు, వారి కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి. మెరకముడిదాం మండలం గర్భాం సమీపంలో ఉన్న ఆంధ్రా ఫెర్రోఅల్లాయీస్ పరిశ్రమ హుద్‌హుద్ తుపాను కారణంగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో యాజమాన్యం పరిశ్రమను తాత్కాలికంగా మూసివేసింది. విద్యుత్ సరఫరా వచ్చేంత వరకూ కార్మికులు విధులకు హాజరుకావొద్దని యాజమాన్యం ప్రకటించింది. దీన్ని కార్మికులు వ్యతిరేకించారు. ఈ దశలో యాజమాన్యం, కార్మికుల మధ్య చర్చలు జరిగాయి. పరిశ్రమకు వారం రోజుల్లో విద్యుత్ సరఫరా వచ్చినా , లేకపోయినా కార్మికులను విధుల్లోకి తీసుకుంటామని యాజమాన్యం ఒప్పుకుంది. దీనికి కార్మికులు కూడా సరేననడంతో అప్పటికి సమస్య కొలిక్కి వచ్చింది. అయితే చర్చలు జరిగిన రెండో రోజునే పరిశ్రమకు విద్యుత్ సరాఫరా రావడంతో పరిశ్రమ యాజమాన్యం కార్మికులను విధుల్లోకి రావాలని కోరింది. అయితే తాము విధులకు హాజరుకాని రోజులకు కూడా వేతనం చెల్లిస్తేనే విధులకు హాజరవుతామని, లేదంటే హాజరుకామని కార్మికులు మొండికేశారు. దీనికి యాజమాన్యం ఒప్పుకోలేదు. అనంతరం ఇరువర్గాల మధ్య చర్చలు జరిగినా ఫలితం తేలకపోవడంతో యాజమాన్యం ఈ నెల 8వ తేదీన లాకౌట్ ప్రకటించింది. అలాగే మరోవైపు గరివిడి మండలంలోని ఫేకర్ పరిశ్రమ మూతపడి 9 నెలలు కావస్తోంది. ఈ విషయాన్ని కార్మికులు పలుమార్లు మంత్రి మృణాళిని దృష్టికి, కార్మిక శాఖామంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి కూడా తీసుకెళ్లారు. నెలలు గడుస్తున్నా సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. ఈ పరిశ్రమలు తెరిచే పరిస్థితి కానరాకపోవడంతో కార్మికులు ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. సాక్షాత్తూ రాష్ట్ర మంత్రి ఇలాకాలోని పరిశ్రమలు పరిస్థితి ఇలా ఉంటే మిగిలిన ప్రాంతాల్లో పరిశ్రమల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా మంత్రి మృణాళిని కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు. -
విశాఖ నెమ్మదిగా కోలుకుంటోంది: చంద్రబాబు
హుదూద్ తుపాను నుంచి విశాఖపట్నం నెమ్మది నెమ్మదిగా కోలుకుంటోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖపట్నంలోని ఆరిపాక ప్రాంతంలో జన్మభూమి - మాఊరు కార్యక్రమంలోను, సబ్బవరం ప్రాంతంలో స్వచ్ఛభారత్ కార్యక్రమంలోను చంద్రబాబు పాల్గొన్నారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో విద్యార్థులతో ఆయన ప్రమాణం చేయించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు తమవంతు కృషి చేస్తామని వాళ్లతో ప్రతిజ్ఞ చేయించారు. ఇక విశాఖపట్నానికి తాను పూర్వవైభవం తీసుకొస్తానని చెప్పారు. మొక్కలు నాటుదామని, పరిశుభ్రత పాటిద్దామని విశాఖ వాసులకు ఆయన పిలుపునిచ్చారు. -
'ప్రభుత్వానికి మిడిమిడి జ్ఞానం ఉండకూడదు'
ప్రభుత్వానికి ఎప్పుడూ మిడిమిడి జ్ఞానం ఉండకూడదని ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక వ్యాఖ్యానించింది. ప్రకృతితో ఆడుకుంటే హుదూద్ లాంటి మరిన్ని విధ్వంసాలు ఖాయమని వేదిక ప్రతినిధులు మండిపడ్డారు. అభివృద్ధి పేరు మీద విచ్చలవిడిగా ప్రకృతి విధ్వంసానికి పాల్పడటం వల్లనే ఇలాంటి విపత్తులు సంభవిస్తున్నాయన్నారు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో ఇటీవల హుదూద్ తుఫాను తీవ్ర ప్రభావం చూపిన చోట్ల రెండు రోజుల పాటు ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక బృందం సభ్యులు పర్యటించారు. అనంతరం విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడారు. -
'హుదూద్ జాతీయ విపత్తుగా ప్రకటించాలి'
విశాఖపట్నం: ఉత్తరాంధ్రలో బీభత్సం సృష్టించిన హుదూద్ తుపానుని జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం విశాఖపట్నంలో తుపానుకు దెబ్బతిన్న ప్రాంతాలను ఆయన పరిశీలించారు. అందులోభాగంగా ఆయన స్టీల్ ప్లాంట్‌ను సందర్శించారు. తుపాను వల్ల స్టీల్ ప్లాంట్‌కు జరిగిన నష్టంపై ఆ సంస్థ ఉన్నతాధికారులను కారత్ అడిగి తెలుసుకున్నారు. హుదూద్ తుపాను ముంచుకోస్తుందని తెలిసిన అధికార్లు నిర్లక్ష్యం ఉందన్న వార్తలపై విచారణ జరిపించాలని కారత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్టీల్‌ప్లాంట్‌తో పాటు పలు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు తాము పూర్తిగా వ్యతిరేకమని ప్రకాష్ కారత్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. -
చేసింది గోరంత.. చంద్రబాబు ప్రచారం కొండంత: శ్రీకాంత్ రెడ్డి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. సమస్యల నుంచి పక్కకు తప్పుకోవడంలో చంద్రబాబు దిట్ట అని అన్నారు. హుదూద్ తుఫాన్ సహయ చర్యలు ఎవరికీ అందలేదని, ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు. తుఫాన్ సహాయ కార్యక్రమంలో విఫలమైన అంశాన్ని ప్రజల దృష్టి నుంచి తప్పించేందుకే ఏపీ రాజధాని అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారని శ్రీకాంత్ విమర్శించారు. లక్ష కోట్లు రుణమాఫీ చేస్తానన్న చంద్రబాబు.. రూ.30 వేల కోట్లకు కుదించినట్లే.. లక్ష ఎకరాల్లో రాజధాని నిర్మాణమని 30 వేల ఎకరాలకు కుదించారని ఎద్దేవా చేశారు. రాజధాని నిర్మాణ విషయంలో చంద్రబాబు రైతులను బ్లాక్ మెయిల్ చేసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. శ్రీశైలంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ ను వెంటనే ఆపేయాలని, రుణమాఫీపై చంద్రబాబుకే స్పష్టత లేదన్నారు. తుఫాన్ బాధితులకు చంద్రబాబు గోరంత చేసి, కొండంత ప్రచారం చేసుకుంటున్నారన్నారు. ఇన్సూరెన్స్ లేక రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని.. చంద్రబాబు అసమర్ధత కారణంగానే ఈ సమస్య తలెత్తిందన్నారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. -
వచ్చారు... వెళ్లారు
చీపురుపల్లి: తుపాను బాధితులను పరామర్శించేందుకు జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏం ప్రకటిస్తారో అంటూ ఎదురు చూసిన బాధితులు, రైతులకు తీవ్ర నిరాశే ఎదురైంది. శుక్రవారం గుర్ల మండలంలో సీఎం చంద్రబాబునాయుడు నిర్వహించిన పర్యటన వచ్చారు...వెళ్లారు అన్నట్టుగా మారింది. తుపాను వల్ల ఏర్పడిన నష్టాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లి జిల్లా ప్రజలకు మేలు చేయవలసిన టీడీపీకి చెందిన నేతలెవరకూ ఆ దిశ గా కనీస ప్రయత్నం కూడా చేయలేదు. సభలో జిల్లా మంత్రి కిమిడి మృణాళిని, ఇన్చార్జి మంత్రి పల్లె రఘునాథరెడ్డి, నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఎవ్వరూ జిల్లాకు జరిగిన నష్టాన్ని వివరిస్తూ కావాల్సిన సాయాన్ని కోరకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాకుండా మంత్రి మృణాళిని ప్రసంగంలో రైతులు, బాధితులు కోసం మాట్లాడాల్సింది పోయి ఏకంగా పొగడ్తలకే సమయం మొత్తం కేటాయించడం సర్వత్రా చర్చంశనీయమయింది. గుజ్జంగివలసలో జరిగిన సభలో పలువురు వృద్ధులు, రైతులు పింఛన్లు, రుణమాఫీ, ఇసుక కోసం ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. అయితే వీటిపై ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన సమాధానం లభించకపోవడంతో వారు కూడా నిరాశ చెందాల్సి వచ్చింది. అర్హత ఉన్నప్పటికీ పింఛన్ ఎందుకు ఇవ్వలేదంటూ వృద్ధుల ఆవేదన ఓ వైపు, రుణమాఫీ జరగలేదు, ఇసుక లేక పట్టణాల్లోను, గ్రామాల్లోను ఉపాధి లేదంటూ మరోవైపు రైతులు అరుపుల మధ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సభ జరిగింది. హుదూద్ తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలు పరిశీలించేందుకు, రైతులను పరామర్శించేందుకు గురువారం గుర్ల మండలంలోని గుజ్జంగివలస గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన అకస్మాత్తుగా నిర్వహించారు. మధ్యాహ్నం 12.30 గంటలు ప్రాంతంలో గుజ్జంగివలస చేరుకున్న ముఖ్యమంత్రి పొలాల వైపు వె ళ్లలేదు, రైతులు పరామర్శించలేదు. గుజ్జంగివలసలో ఏర్పాటు చేసిన సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగం ప్రారంభించే సమయంలోనే గుజ్జంగివలస గ్రామానికి చెందిన తలచుట్ల పైడమ్మ, లండ ఆదమ్మ అనే ఇద్దరు వృద్ధమహిళలు ఒకరి తరువాత మరొకరు లేచి తమకు పింఛను తొలగించారంటూ చంద్రబాబునాయుడును ప్రశ్నించారు. వీరికి ఎలా పింఛను తొలగిపోయిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటతోనే సరిపెట్టారు తప్ప మీకు పింఛను ఇప్పిస్తానని చెప్పకపోవడంతో నిరాశ చెందారు. దీంతో పక్కనే ఉన్న కలెక్టర్ ఎం.ఎం.నాయక్ వారిని పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. సభ జరుగుతుండగా కొంతమంది రైతులు వెనుక నుంచి రుణమాఫీ కోసం పెద్దగా అరుస్తూ ప్రశ్నిస్తున్నారు. వారిని ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడంతో సమావేశం ఆఖరి సమయంలో మరోసారి పెద్దగా రుణమాఫీ జరగలేదని, గత కొద్ది రోజులుగా ఇసుక లభించకపోవడంతో ఊరిలో పనులు లేవని పెద్దగా పలువురు రైతులు అరవడంతో ఉపాధి పనులు కల్పిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రుణమాఫీ కోసం మాట్లాడకపోవడంతో రైతులు నిరాశ చెందారు. అంతేకాకుండా తుపాను నష్టాలను అంచనా వేసేందుకు గ్రామాల్లోకి వస్తున్న అధికారులు తమ మాట వినడం లేదని, నష్టాలను సరైన పద్ధతిలో నమోదు చేయడం లేదని జెడ్పీటీసీ పద్మిని, ఎంపీపీ సత్యమమ్మలు నేరుగా మైక్‌లో ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావించగా దానికి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ అధికారులు సక్రమంగా నమోదు చేయకపోతే మళ్లీ ఫొటోలు తీసి తనకు పంపించాలని అనడంతో వారు కూడా కంగుతిన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖా మంత్రి కిమిడి మృణాళిని, రాష్ట్ర ఐటీశాఖా మంత్రి పల్లె రఘునాథరెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి, ఎమ్మెల్యేలు పతివాడ నారాయణస్వామినాయుడు, కె.ఎ.నాయుడు, బొబ్బిలి చిరంజీవులు, కోళ్ల లలితకుమారి, జిల్లా పార్టీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్, మాజీ ఎమ్మెల్యేలు కిమిడి గణపతిరావు, గద్దే బాబూరావు, జెడ్పీటీసీ టి.పద్మిని, ఎంపీపీ జమ్ము సత్యమమ్మ, సర్పంచ్ గొర్లె జానకి, సీఈఓ మోహనరావు, డీఆర్డీఏ పీడీ గోవిందరాజులు, ఆర్డీఓ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. -
2 కోట్ల విరాళం ఇచ్చిన 'శ్రీ చైతన్య' డైరెక్టర్లు
హుదూద్ తుఫాను బాధితులను ఆదుకునేందుకు శ్రీ చైతన్య విద్యాసంస్థలు రెండు కోట్ల రూపాయల విరాళం ఇచ్చాయి. హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడును విద్యాసంస్థల డైరెక్టర్లు కలిసి 2 కోట్ల రూపాయల చెక్కులు అందించారు. ముఖ్యమంత్రిని కలిసినవారిలో శ్రీ చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్లు శ్రీధర్, సుష్మ, సీమ ఉన్నారు. హుదూద్ తుఫాను ఉత్తరాంధ్ర వాసులకు చాలా ఇబ్బందులు తెచ్చిపెట్టిందని, వారిని ఆదుకోవడానికి తమవంతు సాయంగా ఈ మొత్తం ఇచ్చామని డైరెక్టర్లు తెలిపారు. -
విశాఖలో భారీ కొవ్వొత్తుల ర్యాలీ
విశాఖపట్నం: 'తుపాన్లను జయిద్దాం' నినాదంతో విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ లో బుధవారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. తుపాను బాధితులకు సంఘీభావంగా ప్రజలతో పాటు అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో కొవ్వొత్తులు చేబూని ర్యాలీలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు, రాష్ట్ర మంత్రులు మంత్రులు నారాయణ, మృణాళిని, సినీ దర్శకుడు కె. రాఘవేంద్రరావు, నిర్మాత దగ్గుబాటి సురేష్ తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
మరోసారి కేంద్ర బృందం వస్తోంది: వెంకయ్య
-
మరోసారి కేంద్ర బృందం వస్తోంది: వెంకయ్య
విశాఖపట్నం: హుదూద్ తుపాను బాధిత ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేసేందుకు మరోసారి కేంద్ర బృందం వస్తోందని కేంద్ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు తెలిపారు. దెబ్బతిన్న టెలికాం, రైల్వే వ్యవస్థలను నెల రోజుల్లో పునరుద్దరిస్తామని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన తుపాన్ సాయం అందుతూనే ఉందని వెల్లడించారు. దెబ్బతిన్న ఎస్సీ, ఎస్టీ ఇళ్ల పునరుద్దరణకు చర్యలు తీసుకుంటామన్నారు. హుదూద్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వెంకయ్య నాయుడు బుధవారం ప్రకటించారు. -
కొవ్వొత్తులు ప్రదర్శించడం కాదు.. ప్రజలకు ఇవ్వండి
హుదూద్ తుఫాను కారణంగా విశాఖపట్నం నగరం మొత్తం విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, కానీ ప్రభుత్వ యంత్రాంగం మాత్రం 60 శాతం కూడా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించలేదని మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ విమర్శించారు. దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 40 వేల మందితో నిర్వహిస్తున్న 40 వేల కొవ్వొత్తుల ప్రదర్శనపై ఆయన విరుచుకుపడ్డారు. అక్కడ ప్రదర్శన నిర్వహించే బదులు కరెంటు లేనిచోట వాటిని పంచిపెడితే బాగుంటుందని సూచించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ఇతర అధికారులకు ఆయన ఓ బహిరంగ లేఖ రాశారు. విశాఖలో విద్యుత్ సరఫరాను వారం రోజుల్లోనే పునరుద్ధరించేశామని, ప్రకృతి విలయాన్ని టెక్నాలజీతో అడ్డుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ప్రకటనలపై కూడా ఈ ప్రాంత వాసుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చాలాచోట్ల ప్రజలే స్వచ్ఛందంగా చెట్లు తొలగించుకున్నారు తప్ప, సర్కారు ప్రకటించిన 200 పొక్లెయిన్లు ఎటు వెళ్లాయో తెలియట్లేదని అంటున్నారు. -
విరాళాల సొమ్ములు ఏటైపోనాయి బావూ?
ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని హుదూద్ తుఫాను అతలాకుతలం చేసింది. భారీ వృక్షాలు కూడా కూకటివేళ్లతో కూలిపోయాయి. ఎన్ని ఇళ్లు కుప్పకూలాయో లెక్కలేదు. కరెంటు స్తంభాలు విరిగిపోయాయి. జనజీవనం అల్లకల్లోలంగా మారిపోయింది. ఇలాంటి సమయంలో తుఫాను బాధితులను ఆదుకోడానికి పెద్ద హృదయంతో చాలామంది ముందుకు వచ్చారు. భారీ విరాళాలు ప్రకటించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి లక్షల్లో ఇస్తామంటూ గట్టిగానే చెప్పారు. అయితే.. వీటిలో ముఖ్యమంత్రి సహాయనిధి కార్యాలయానికి వచ్చినవి మాత్రం ఒకటి.. అర మాత్రమేనట. అవును.. విరాళాలను ఆర్భాటంగా ప్రకటిస్తున్నవాళ్లలో ఎంతమంది నిజంగా ఇస్తున్నారు, ఎంతమంది కేవలం పేరుకు మాత్రమే చదివిస్తున్నారన్న విషయం తెలియడంలేదు. విశాఖలో సహాయ కార్యకలాపాలు చేపట్టడానికి డబ్బుకోసం చూసుకుంటే.. సీఎంఆర్ఎఫ్ ఖాళీగా కనిపిస్తోంది. సినిమా నటులు, పారిశ్రామికవేత్తలు.. ఇలా చాలామంది పెద్దమొత్తంలో విరాళాలు ప్రకటించినా, వాటిలో చేతికి అందినవి కొన్నిమాత్రమే. కొంతమంది నేరుగా సీఎంఆర్ఎఫ్ కార్యాలయానికి చెక్కులు పంపారు. హీరో కృష్ణ, పవన్ కల్యాణ్, బాలకృష్ణ లాంటివాళ్లు నేరుగా చంద్రబాబును కలిసి ఆయనకే చెక్కులు అందించారు. మిగిలినవాళ్లు మాత్రం ఇంకా చెక్కులుగానీ, డీడీలు గానీ ఏ రూపంలోనూ విరాళాలు అందించలేదు. ఆ విషయం చెప్పడానికి సీఎంఆర్ఎఫ్ కార్యాలయ అధికారులు మొహమాటపడుతున్నారు. బహుశా ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చిన తర్వాత ఆయనకు చెక్కులు అందిస్తూ ఫొటోలు తీయించుకోడానికి ఇలా ఆలస్యం చేస్తున్నారేమోనన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. పేరుగొప్ప.. ఊరుదిబ్బ అన్నట్లు ఘనంగా విరాళాలు ప్రకటించి, తర్వాత ఊరుకున్నారేమోనని కూడా అంటున్నారు. -
ఆళ్లగడ్డలో పోటీకి కాంగ్రెస్ దూరం: రఘువీరా
హైదరాబాద్: ఆళ్లగడ్డ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి తెలిపారు. ఆళ్లగడ్డలో పోటీ చేయొద్దంటూ కర్నూలు జిల్లా కాంగ్రెస్ నేతలు ఏకగ్రీవతీర్మానం చేశారని చెప్పారు. ఈ విషయాన్ని దిగ్విజయ్ సింగ్ దృష్టికి తీసుకెళ్లినట్టు వెల్లడించారు. హుదూద్ తుపాను బీభత్సాన్ని జాతీయ విపత్తుగా గుర్తించాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. దీనికోసం కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఒత్తిడి తీసుకురావాలన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్, తాగునీటి సరఫరా వెంటనే పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. ఆరు లక్షల ఎకరాల్లో పంట నష్టపోయిందన్నారు. వేల సంఖ్యలో ఇళ్లు కూలిపోయాయని చెప్పారు. బాధితులను గుర్తించే ప్రక్రియ పారదర్శకంగా జరగాలన్నారు. ఇందుకోసం అఖిలపక్ష కమిటీలు వేయాలని సూచించారు. గ్రామ సభల్లో చదివి వినిపించాలి. జాబితాను ఆన్లైన్ కూడా పెట్టాలన్నారు. తుపాను కారణంగా నష్టపోయినవారందరికీ పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. -
తుపాను నష్టం లెక్కలు అస్తవ్యస్తం: వైఎస్ జగన్
-
తుపాను నష్టం లెక్కలు అస్తవ్యస్తం: వైఎస్ జగన్
తుపాను నష్టం లెక్కలు సరిగా వేయలేదని బాధితులు చెబుతున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. హుదూద్ తుఫానుతో అల్లకల్లోలంగా మారిన శ్రీకాకుళం జిల్లాలో ఆయన మంగళవారం పర్యటించారు. అసలు తమకు తుపాను సాయం అందలేదని బాధితులు చెబుతున్నారని, ప్రభుత్వ ఆర్భాటం తప్ప క్షేత్రస్థాయిలో ఏమీ జరగడం లేదని ఆయన అన్నారు. ప్రభుత్వం చివరకు బియ్యం కూడా సరిగా పంపిణీ చేయలేదని మండిపడ్డారు. రుణాలు మాఫీ చేస్తారన్న ఆశతో రైతులెవరూ రుణాలు కట్టలేదని, తీరా ఇప్పుడు మాత్రం రుణాలు మాఫీ కాక, అటు పంటబీమా కూడా దక్కక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉందని, కరెంటు లేకపోవడంతో తాగునీటి పథకాలు పనిచేయడం లేదని వైఎస్ జగన్ అన్నారు. ఎన్నికలప్పుడు డ్వాక్రా రుణాలు, రైతుల రుణాలను మాఫీ చేస్తామని చెప్పారని, వాస్తవానికి లక్ష కోట్ల వరకు అప్పులు మాఫీ చేయాల్సి ఉంటే ఇప్పుడు కేవలం 5వేల కోట్లే ఇస్తామంటున్నారని ఆయన విమర్శించారు. కేవలం రుణాల వడ్డీల కోసమే ఏడాదికి 14 వేల కోట్లు అవసరం అవుతుందని ఆయన గుర్తు చేశారు. కాగా, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలో బాణాసంచా తయారీ కర్మాగారంలో పేలుడు సంభవించి 18 మంది మరణించిన సంఘటన పట్ల వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు ఆయన బుధవారం వాకతిప్ప వెళ్లనున్నారు. -
కరెంటు లేని ప్రాంతాలకు సోలార్ లాంతర్లు
హుదూద్ తుఫానుతో తీవ్రంగా ప్రభావితమైన ఉత్తరాంధ్ర ప్రాంతంలో దీపావళి పండుగ లోగానే 90 శాతం వరకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తామని విద్యుత్ శాఖ కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. అయినా దీపావళి రోజుకు కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండకపోవచ్చని, అలాంటి ప్రాంతాలకు కూడా వెలుగులు అందించేందుకు తాము ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు. ఏయే ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదో, అక్కడ నెడ్‌క్యాప్ ద్వారా పదివేల సోలార్ లాంతర్లు అందిస్తామని అజయ్ జైన్ వివరించారు. కొన్ని చోట్ల విద్యుత్ పునరుద్ధరణ పనులు చాలా మందకొడిగా సాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వీసులను అందించే విషయంలో సిబ్బంది ఎక్కడైనా అవినీతికి పాల్పడినట్లు తెలిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
హుదూద్ పోర్టల్ ప్రారంభం: పనివారు సిద్ధం
హుదూద్ సహాయ కార్యక్రమాల కోసం ప్రభుత్వం ఓ పోర్టల్‌ను సిద్ధం చేసింది. హుదూద్ ప్రళం, తుఫాను అనంతర పరిస్థితుల లాంటివాటిని ఇందులో పొందుపరిచారు. www.hudhud.ap.gov.in అనే ఈ వెబ్సైట్లో అన్ని వివరాలు ఉంటాయని అధికార వర్గాలు తెలిపాయి. నిపుణులైన ప్లంబర్లు, కార్పెంటర్ల లాంటి పనివాళ్ల కోసం ఈ వెబ్సైట్ ద్వారా సంప్రదించవచ్చు. తుఫాను కారణంగా విశాఖపట్నం, పరిసర ప్రాంతాల్లో, ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో భారీ నష్టం వాటిల్లింది. ఇప్పటికి చాలా ప్రాంతాల్లో పరిస్థితులు మామూలు స్థితికి రాలేదు. దాంతో వృత్తిపనివాళ్లు కావాలంటే ఈ వెబ్సైట్ ద్వారా సమాచారం అందిస్తే వెంటనే పంపుతారు. వాళ్లకు అయ్యే లేబర్ ఛార్జీలను కూడా ప్రభుత్వం భరిస్తుందని చెబుతున్నారు. మొత్తం వెయ్యిమంది వరకు పనివారు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీనికోసం ఒక కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. -
రేపు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రాహుల్ పర్యటన
విశాఖ:హుదూద్ తుఫానుతో అల్లకల్లోలమైన విశాఖపట్నంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదివారం పర్యటించనున్నారు. ఆ రోజు నేరుగా ఢిల్లీ నుంచి వచ్చి, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తారు. ఉదయం 11 గం.లకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాంతంలో , 12 గం.లకు తాటిచెట్లపాలెంలో రాహుల్ బాధితులను పరామర్శిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 1 గం.కు విజయనగరం జిల్లా చేరుకుని కొవ్వులవాడలో పర్యటిస్తారు. అనంతరం ఏడు గంటలకు ఏడుగుళ్లలో తుపాను బాధితులను రాహుల్ కలుసుకుంటారు. గత మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. తరువాత వెయ్యి కోట్ల రూపాయలను తక్షణ సాయం ప్రకటించారు. -
చెట్ల తొలగింపు పూర్తికాలేదు: నారాయణ
హుదూద్ తుఫానుకు దెబ్బతిన్న విశాఖపట్నం నగరంలో చెట్ల తొలగింపు ఇంకా పూర్తికాలేదని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. తాగునీటి సరఫరాను పూర్తిగా పునరుద్ధరించారని, ప్రస్తుతానికి 25 శాతం అదనంగా కూడా నీళ్లు ఇస్తున్నారని ఆయన చెప్పారు. రేపు 50 శాతం అదనంగా ఇస్తారని, పరిశ్రమలకు కూడా తాగునీరు ఇస్తున్నారని తెలిపారు. విశాఖపట్నంలో చెట్ల తొలగింపు ఇంకా పూర్తికాలేదని, ప్రస్తుతం పదివేల మంది సిబ్బంది ఈ పనిలో ఉన్నారని, మరో పదివేల మందిని రప్పిస్తామని ఆయన చెప్పారు. రెండు రోజుల్లో మొత్తం అన్ని కాలనీలలో పడిపోయిన చెట్లను తొలగిస్తామని తెలిపారు. -
రాజమండ్రి రైల్వే బ్రిడ్జిని చూడండి.. ప్లీజ్
పాడైపోతున్న రాజమండ్రి రైల్వే బ్రిడ్జిని సందర్శించాల్సింగా రైల్వే మంత్రి సదానంద గౌడను రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ ఆహ్వానించారు. హుదూద్ తుఫాను కారణంగా ఉత్తరాంధ్రలో రైల్వే ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లిందని, వీటి పునరుద్ధరణకు వెంటనే పనులు చేపట్టాల్సిందిగా కోరానని ఆయన తెలిపారు. హుదూద్ తుఫాను నష్టాన్ని అంచనా వేసేందుకు ఓ బృందాన్ని విశాఖపట్నం పంపాల్సిందిగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కోరినట్లు చెప్పారు. అలాగే విద్యుత్ శాఖకు కూడా తీవ్ర నష్టం వాటిల్లిందని, ఈ విషయంలోనూ సాయం చేయాలని తాను కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిని కోరానని మురళీ మోహన్ వెల్లడించారు. -
షుగర్ ఫ్యాక్టరీలను అమ్మేయడం వీళ్లకు మామూలే
-
కాఫీ తోటలు నాశనమైపోయాయి: అశోక్
హుదూద్ తుఫాను కారణంగా ఉత్తరాంధ్రలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. ఈ నష్టాన్ని అంచనా వేసి, పరిహారం ఇచ్చేందుకు రాష్ట్రానికి ఓ బృందాన్ని పంపాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని తాము కోరినట్లు ఆయన చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో కాఫీ తోటలు పూర్తిగా నాశనం అయిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోడానికి కేంద్రం నుంచి వీలైనంత సాయం చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు. -
షుగర్ ఫ్యాక్టరీలను అమ్మేయడం వీళ్లకు మామూలే: వైఎస్ జగన్
సహకార రంగంలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీలను నష్టాల్లోకి తీసేసి.. వాటిని సొంత మనుషులకు అమ్మేయడం ఈ ప్రభుత్వానికి మామూలేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. హుదూద్ తుఫాను బారిన పడిన విశాఖపట్నంలోని తుమ్మపాల ప్రాంతాన్ని ఆయన శనివారం సందర్శించి, అక్కడి వారిని పరామర్శించారు. తుఫాను సాయం ఎలా అందుతోందో వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి చెరుకు రైతులు తమ గోడును వైఎస్ జగన్ వద్ద వెళ్లబోసుకున్నారు. తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ రైతులకు 6 కోట్ల రూపాయలు బకాయి పడితే ఇప్పటికి కేవలం 3 కోట్లే ఇచ్చారని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఏడు నెలల నుంచి కార్మికులకు జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉన్నారని, ఇప్పుడు ఈ ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. గతంలో కూడా 4 కోట్ల రూపాయలకు ఈ ఫ్యాక్టరీని అమ్మేయడానికి ప్రయత్నాలు చేయగా, అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ ప్రయత్నాలను అడ్డుకున్నారని ఆయన గుర్తుచేశారు. -
షుగర్ ఫ్యాక్టరీని ఆదుకోండి: వైఎస్ జగన్‌కు రైతుల మొర
హుదూద్ తుఫాను కారణంగా అస్తవ్యస్తమైన విశాఖపట్నంలోని తుమ్మపాల ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం పర్యటించారు. ఆయనను కలుసుకున్న చెరుకురైతులు.. అక్కడి షుగర్ ఫ్యాక్టరీని ప్రైవేటు పరం కాకుండా ఆదుకోవాలని మొరపెట్టుకున్నారు. తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీని ప్రైవేటు వ్యక్తులకు అమ్మేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. హుదూద్ తుఫాను కారణంగా ఫ్యాక్టరీకి బాగా నష్టం వాటిల్లిందని వాళ్లు చెప్పారు. దీన్ని కూడా సాకుగా చూపించి.. దాన్ని ప్రైవేటు పరం చేసేందుకు కార్యవర్గం పావులు కదుపుతోందని వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వాళ్లు తెలిపారు. దీన్ని అడ్డుకోవాలంటూ ఆయనకు విజ్ఞప్తి చేశారు. -
5 రోజులుగా చెట్టుకిందే ఉంటున్నాం
* విశాఖ గాంధీనగర్‌లో 100 కుటుంబాల గోడు * జగన్‌కు మొరపెట్టుకున్న హుదూద్ బాధితులు * లక్ష కోట్ల బడ్జెటున్నా సాయానికి చెయ్యి రాలేదా? * టీడీపీ సర్కారు తీరుపై ధ్వజమెత్తిన జగన్ సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘‘ఐదు రోజులుగా 100 కుటుంబాల వాళ్లం రోడ్డు పక్కన ఈ చెట్టు కిందే పడి ఉన్నాం. పగలు ఎండలో, రాత్రి చీకట్లో చస్తూ బతుకుతున్నాం. పిల్లలు ఆకలితో అల్లాడిపోతున్నారు. పక్కనున్న అపార్టుమెంట్లకు వెళ్లి అడుక్కుని వచ్చి పిల్లలకు పెడుతున్నాం. పెద్దలమైతే పస్తులే ఉంటున్నాం. పక్కనున్న ఈ రోడ్డు మీద నుంచే మినిస్టర్లు, అధికారులు వెళ్తున్నారు. మా దగ్గరికి ఒక్కరూ రాలేదు. మేం బతికున్నామో చచ్చామో కూడా చూడటం లేదు. జగన్‌బాబూ! నువ్వైనా వచ్చావు. మాకు కాస్త న్యాయం చెయ్ బాబూ... నీకు పుణ్యం ఉంటుంది’’ ఇది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డితో విశాఖలోని హుదూద్ తుపాను బాధితులు వ్యక్తం చేసిన ఆవేదన! వై.ఎస్.జగన్ శుక్రవారం విశాఖ ఉత్తర, పశ్చిమ, పెందుర్తి, గాజువాక నియోజకవర్గాల పరిధిలోని కంచరపాలెం మెట్టులోని గాంధీనగర్, సాకేతపురం కాలనీ, స్టీల్‌ప్లాంట్, ఇస్లాంపేట, బర్మాకాలనీ, దయాళ్ నగర్ ప్రాంతాల్లో పర్యటించారు.కాలినడకన కలియదిరిగి బాధితులందరినీ పరామర్శించారు. ఈ సందర్భంగా కంచరపాలెం గాంధీనగర్‌కు చెందిన కోలా కాసులమ్మ, ఆసనాల గౌరి తమ గోడును ఆయనతో వెళ్లబోసుకున్నారు. వారి దీనస్థితి చూసి జగన్ చలించిపోయారు. ప్రభుత్వం వద్ద రూ.లక్ష కోట్ల బడ్జెట్ ఉన్నా బాధితులకు సహాయం చేయడానికి చేయి రావ డం లేదని మండిపడ్డారు. బాధితులకు న్యాయం జరిగేవరకు పార్టీ తరఫున పోరాడతామని చెప్పారు. తాత్కాలికంగా పార్టీ తరఫున సాయం చేస్తామంటూ భరోసానిచ్చి వారికి ధైర్యం చెప్పారు. తాగునీటికి కూడా అల్లాడుతున్న మురికివాడలు, రాజకీయ కక్షసాధింపుతో సర్కారు సహాయం నిరాకరించడంతో దిక్కుతోచని స్థితిలోపడిపోయిన ముస్లిం మైనార్టీలు తదితర వేలాదిమంది బాధితులను కూడా జగన్ పలకరించారు. ఈ సందర్భంగా జగన్ ఏం మాట్లాడారంటే... * బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. వెయ్యి కుటుంబాలు ఉన్న కాలనీలోకి రాత్రిపూట లారీల్లో వచ్చి 200 పులిహోర ప్యాకెట్లు విసిరేసి వెళ్లిపోతున్నారు. అది కూడా పాచిపోయి తినేందుకు పనికిరావడం లేదు. రూ.10పులిహోర, రూ.14 అర లీటరు పాలు ఇచ్చేసి... ఏదో సహాయం చేశామన్నట్టుగా ప్రభుత్వం మీడియా స్టంట్లు చేస్తోంది. * లక్షలాదిమంది రోడ్డున పడ్డారు. తిండి లేదు. ఇల్లు లేదు. చేతిలో చిల్లిగవ్వ లేదు. పనికీ దిక్కు లేదు. అల్లాడుతున్నా ఇంతవరకూ ఒక్కరూ పలకరించింది లేదు, దమ్మిడీ సాయం చేసిందీ లేదు. ప్రతి వీధిలోనూ, ప్రతి ఇంటిలోనూ బాధితులు ఇదే మాట చెబుతున్నారు. * ప్రభుత్వం మేల్కోవాలి. ప్రతి కుటుంబానికి తక్షణ సహాయంగా రూ.5 వేలివ్వాలి. స్వల్పంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.50వేలు ఇవ్వాలి. బాగా దెబ్బతిన్న ఇళ్ల స్థానంలో కొత్త ఇళ్లు మంజూరు చేయాలి. గంటకు 250 కి.మీ. వేగంతో వీచే గాలులను తట్టుకునేలా అధునాతన పరిజ్ఞానంతో ఇళ్లు కట్టించి ఇవ్వాలి. ఒక్కో ఇంటికి రూ.1.5 అయినా, రూ.2.5 లక్షలైనా భరించాలి. -
విశాఖ స్టీలుప్లాంటును సందర్శించిన వైఎస్ జగన్
హుదూద్ తుఫాను కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. తుఫాను వల్ల స్టీల్ ప్లాంటుకు జరిగిన నష్టం గురించి అక్కడ పనిచేసే కార్మికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి తుఫాను వల్ల నష్టపోయిన ఇస్లాంపేటను వైఎస్ జగన్ సందర్శించారు. ఆ ప్రాంతంలో తుఫాను కారణంగా కూలిపోయిన మసీదును సందర్శించి, ముస్లిం సోదరులకు ఆయన భరోసా ఇచ్చారు. -
సాయం చేయాలంటే సాక్ష్యం కావాలి:బాబు
-
రాజమండ్రి - హైదరాబాద్ టికెట్ 17వేలు!
-
సాయం చేయాలంటే సాక్ష్యం కావాలి: చంద్రబాబు
తుఫాను బాధితులకు సాయం చేయాలంటే వాళ్లకు జరిగిన నష్టానికి సాక్ష్యం కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. విశాఖపట్నంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే అన్ని ప్రాంతాలకు ఎన్యుమరేషన్ బృందాలను పంపామని, వాళ్లు పంపిన వివరాలు సరికావనుకుంటే బాధితులు కూడా నేరుగా వెబ్సైట్లో అప్లోడ్ చేయొచ్చని ఆయన అన్నారు. అధికారులు ఇంకా పూర్తిస్థాయిలో పనిచేయాల్సి ఉందని, వాళ్ల పని నూరుశాతం పూర్తయ్యేవరకు వాళ్లను అభినందించేది లేదని చంద్రబాబు అన్నారు. ఇంకా ఆయన ఏం మాట్లాడారంటే.. ''జరిగిన నష్టం చాలా ఎక్కువ. బాధితులకు ఇవ్వడానికి సరుకులు వేర్వేరు చోట్ల కొనాలి, ప్యాకింగ్ చేయాలి. నూనె, పంచదార అన్నీ ఇవ్వాలి. కూరగాయలు వేర్వేరు ప్రాంతాల నుంచి తెప్పించాలి. ఉల్లిపాయలు కర్నూలు నుంచి రావాలి. బంగాళాదుంపలు పశ్చిమబెంగాల్ నుంచి రావాలి. రవాణా సమస్యలు ఉండటం వల్ల కూడా సహాయం అందించడం ఆలస్యం అవుతోంది. సామర్థ్యం పెంచుకోవాలని అందరికీ చెబుతున్నాను. అధికారులంతా అందుకు ప్రయత్నిస్తున్నారు. విశాఖపట్నం తీవ్రంగా ప్రభావితమైంది. దీనిపక్కన 50 శాతం కంటే ఎక్కువ ప్రభావితమైన గ్రామాలు కూడా ఉన్నాయి. వాటికో ప్యాకేజి, అంతకంటే తక్కువ ఉన్నవాటికి 10 కిలోల బియ్యం, కిలో చొప్పున పప్పు, ఉప్పు, చక్కెర, లీటరు నూనె, అర కిలో కారం ప్యాకేజిగా ఇస్తాం. కరెంటు లేదు, చెట్లు పడిపోయి ట్రాఫిక్ జామ్ అయింది, ఉపాధి కూడా లేదు కాబట్టే తుఫాను ప్రభావం లేని ప్రాంతాల్లో కూడా సాయం అందజేస్తున్నాం. సర్వే కోసం అధికారులు బయల్దేరుతున్నారు. వాళ్లు ఫొటోలు, వీడియోలు తీసుకుని అక్కడికక్కడే రికార్డు చేసి ఆన్‌లైన్‌లోకి అప్లోడ్ చేయాలి. వాళ్లు ఎన్యుమరేట్ చేసిన తర్వాత అది సరికాదనుకుంటే ఎవరైనా బాధితులు వాళ్లే ఫొటోలు, వీడియోలు తీసి వెబ్సైట్లో అప్లోడ్ చేయచ్చు. దాన్నయినా కూడా మేం అనుమతిస్తాం. మేం అందించే సాయం నేరుగా వాళ్ల బ్యాంకు ఖాతాలకు వెళ్తుంది. ఆన్లైన్లో వెళ్తుంది కాబట్టి, మధ్యలో ఎవరి ప్రమేయం ఉండబోదు. చేసిన సాయం మొత్తం బాధితులకు చేరుకుంటుంది'' అని ఆయన చెప్పారు. -
రాజమండ్రి - హైదరాబాద్ టికెట్ 17వేలు!
హుదూద్ తుఫాను కారణంగా విశాఖ విమానాశ్రయం దెబ్బతినడంతో ఒక్కసారిగా రాజమండ్రి సమీపంలో ఉన్న మధురపూడి విమానాశ్రయం నుంచి రాకపోకలు పెరిగిపోయాయి. దాంతో గిరాకీ పెరిగిందని రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు టికెట్ ఉన్నట్టుండి 17 వేల రూపాయలు చేసేశారు. మామూలు రోజుల్లో అయితే ఈ ఛార్జి కేవలం 3,500 రూపాయలు మాత్రమే. సాధారణంగా ఏవైనా పండుగ సీజన్లు వచ్చినా, ప్రయాణం తేదీ బాగా దగ్గర పడినా. విమాన ఛార్జీలు ఎక్కువగా ఉంటాయి. వీటిని డైనమిక్ ఫేర్ సిస్టం అంటారు. కానీ.. ఒక విమానాశ్రయం పనిచేయకపోవడం వల్ల ఇలా జరగడం మాత్రం ఇదే మొదటిసారి. విశాఖ నుంచి వెళ్లాల్సిన వాళ్లు కూడా అక్కడినుంచి రోడ్డు/రైలు మార్గాల్లో మధురపూడి చేరుకుని, ఇక్కడి నుంచి హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. -
రూ.10 పులిహోరతో సరిపెడతారా?
-
విశాఖకు విమాన రాకపోకలు ప్రారంభం
విశాఖ : హుదూద్ తుఫాను దెబ్బకు దారుణంగా దెబ్బతిన్న విశాఖపట్నం విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు శుక్రవారం ప్రారంభమైయ్యాయి. ఇందు కోసం ఎయిర్పోర్ట్ అథారిటీ తాత్కాలికంగా విమానాశ్రయాన్ని సిద్ధం చేసింది. అయితే కొద్ది సంఖ్యలో మాత్రమే విశాఖ-హైదరాబాద్ మధ్య విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఎయిరిండియా విమాన సర్వీసులు నేటి నుంచి ప్రారంభం కాగా, ప్రయివేట్ విమాన సర్వీసులు శనివారం నుంచి తిరగనున్నాయి. నవంబర్ 1వ తేదీ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. 2009 ఫిబ్రవరిలో నిర్మించిన విమానాశ్రయ భవనం పైకప్పు బాగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. అయితే అదృష్టవశాత్తు రన్‌వే బాగుండటం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ కూడా మరీ ఎక్కువగా దెబ్బ తినకపోవడంతో విమానాలను తిప్పడానికి సమస్య లేదని విమానాశ్రయ అధికారులు తెలిపారు. -
నచ్చినోళ్లకు నచ్చినట్టుగా..
* సాయం పంపిణీలోనూ రాజకీయాలు * పెత్తనమంతా ఎమ్మెల్యేలదే.. * అధికారుల ప్రేక్షకపాత్ర * బాధితుల ధర్నా సాక్షి, విశాఖపట్నం: ‘అడుక్కొని తెచ్చి పిల్లలకు అన్నం పెడుతున్నా.. తుపానొత్తందని మూడురోజులు ముందరగానే మమ్మల్ని ఈ గల్లీ బడిలో పడేశారు. తుపానులో మా కొంప పూర్తిగా ఎగిరిపోయింది. గోడలు కూడా మిగలలేదు. ఇక్కడకు వచ్చి ఏడు రోజులైనాది.. ఏ అధికారి.. ఏ నాయకుడు మా వైపు తొంగి చూడలేదు. మమ్మల్ని పత్తించుకోలేదు. ఉన్నామా? తిన్నామా? చచ్చామా? అని అడిగేవారే లేరు. ఈ గల్లీబడిలో తిండితిప్పల్లేక ఇలాగే ఉంటున్నాం. వారం రోజులుగా పనుల్లేవు. మేమెలాగూ పత్తులుంటున్నాం. పిల్లలు ఆకలేత్తందంటే వారిని చూడలేక చుట్టుపక్కల వార్ని కాస్త అన్నం పెట్టమని అడుక్కొని తెచ్చి పెడుతున్నాం. పులోరపొట్లాలిత్తున్నారు. అవి కూడా తెలుగుదేశపోళ్లు తమకు నచ్చిన వారికే ఇత్తున్నారు. నచ్చనోళ్లకు ఇవ్వడం లేదు. మేమేం పాపం చేశాం. మమ్మల్ని ఎందుకు పత్తించుకోవడం లేదో అర్ధం కావడం లేదు. మాకెందుకీ పరిస్థితి. మా కొంపతో పాటు మేము కూడా కొట్టుకుపోయి ఉంటే బాగుండేది..’ అంటూ వాసువానిపాలెం ప్రాథమిక పాఠశాల (గల్లీబడి)లోని పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్న మహిళ ఎస్.పద్మ కన్నీరుమున్నీరైంది. విశాఖ నగరంలోని పునరావాస కేంద్రాల్లో ఉంటున్న వారే కాదు.. తుపాను బాధితులంతా ఇదేరీతిలో గొల్లుమంటున్నారు. సాయం కోసం నిరుపేద బాధితులు గురువారం విశాఖపట్నం ఊటగెడ్డ వద్ద నడిరోడ్డుపై ధర్నాకు దిగడం పరిస్థితికి అద్దంపడుతోంది. సీతమ్మధార, మర్రిపాలెం, అక్కయ్యపాలేల్లో కూడా ఆందోళనలు జరిగాయి. అధికార పార్టీ నేతల మితిమీరిన జోక్యం వల్ల ఆహార పొట్లాలే కాదు.. నిత్యావసర సరుకులు ఎక్కడికక్కడ తుపాను బాధితులకు అందకుండా పక్కదారి పడుతున్నాయి. అధికారులు ఉన్నతాధికారుల సేవలోను, ఆ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి సేవలోను తరిస్తుండడంతో క్షేత్రస్థాయిలో సహాయ చర్యలను పర్యవేక్షించే వారే లేకుండాపోయారు. ఆహారం, నిత్యావసరాల పంపిణీ బాధ్యతలను అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు తమ చేతుల్లోకి తీసుకుని తమ అనుచరుల ద్వారా పంపిణీ చేయిస్తున్నారు. అధికారులు పైపైన పర్యవేక్షణకే పరిమితమవుతున్నారు. ఆహార పొట్లాలు, నిత్యావసరాలు, కూరగాయలు ఇలా ప్రతి దాన్లోను ఎమ్మెల్యేల జోక్యం శృతిమించుతోంది. ఎక్కడా తమకు తెలియకుండా పంపిణీ చేయడానికి వీల్లేదంటూ అధికారులను ఆదేశిస్తున్నారు. ఎమ్మెల్యేలు తమ అనుచరులద్వారా గడిచిన ఎన్నికల్లో తమకు ఓట్లు వేసిన వారికి, తమకనుకూలంగా ఉన్నవారికి, తమకు నచ్చిన ప్రాంతాల్లో మాత్రమే పంపిణీ చేస్తూ మిగిలిన వారిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కొండవాలు ప్రాంతాలైన వెంకోజుపాలెం, వాసువానిపాలెం, హనుమంతవాక, పెద్దగదులు, రెల్లివీధి, ఊటగెడ్డ, జాలరిపేటల్లో బాధితులకు అరకొర సాయమే అందుతోంది. ముఖ్యంగా పునరావాసకేంద్రాల్లో ఉన్న వారికి సాయం పంపిణీ జరగకపోవడంతో వారు కూలిపోయిన ఇళ్లమధ్యే కాలం గడుపుతున్నారు. వాసువానిపాలెం, శివగణేష్‌నగర్, ఆరిలోవ, రామకృష్ణాపురం, ఆదర్శనగర్, సాగర్‌నగర్, జాలరిపేటల్లో ఎమ్మెల్యేలు తమ అనుచరుల ద్వారా చేస్తున్న సహాయ చర్యలు పక్కదారిపడుతున్నాయి. కుటుంబానికి ఉచితంగా పంపిణీ చేయదల్చిన 25 కిలోల బియ్యం, ఇతర నిత్యావసరాలు ఎమ్మెల్యేల అనుచరులు పంపిణీ చేయకుండానే పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలున్నాయి. రేషన్ షాపుల వద్ద ఎమ్మెల్యేల అనుచరులు మకాం వేసి మరీ పంపిణీని పర్యవేక్షిస్తున్నారు. పార్టీ పంపిణీ చేస్తుందా? లేక ప్రభుత్వం పంపిణీ చేస్తుందా? పర్యవేక్షించడానికి వీరెవరంటూ ఎంవీపీ కాలనీలో టీడీపీ నాయకుల తీరుపై బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సక్రమంగా పంపిణీ చేస్తున్నదీ లేనిదీ చూస్తే తప్పేమిటంటూ తెలుగుదేశం నేతలు ఎదురు ప్రశ్నిస్తుంటే.. ఆ పని అధికారులు చేస్తారు కదా మీకెందుకంటూ బాధితులు నిలదీస్తున్నారు. టీడీపీ కార్యాలయం సమీపంలోని ఊటగెడ్డ వద్ద సాయం అందడం లేదంటూ బాధితులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. ఎందుకు మా పట్ల వివక్ష చూపుతున్నారు.. మాకెందుకు సాయం పంపిణీ చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయం పంపిణీ చేసే ప్రతిచోట ఇలాంటి సంఘటనలు కనిపిస్తున్నాయి. మత్స్యకార ప్రాంతాలు, మురికివాడల్లోనే పంపిణీ నామమాత్రంగా జరుగుతోంటే, మధ్య తరగతి, ఎగువమధ్య తరగతి ప్రజలుండే ప్రాంతాల్లోని బాధితుల వైపు అసలు చూడటమే లేదు. -
రూ.10 పులిహోరతో సరిపెడతారా?
* ముఖ్యమంత్రి, ప్రభుత్వంపై ధ్వజమెత్తిన జగన్ * సాయం చేశామని చెప్పుకొనే ధైర్యం ప్రభుత్వానికి లేదు * నేడు సాకేతపురం, గాజువాక ప్రాంతాల్లో జగన్ పర్యటన సాక్షి, విశాఖపట్నం: ‘‘పెద్ద పెద్ద గాలులొచ్చా యి, ఇళ్లు కూలిపోయాయి, సర్వస్వం కోల్పోయి జనం వీధిన పడ్డారు... అయినా వారెలా ఉన్నారని పట్టించుకోవడానికి, ఎంత నష్టంజరిగిందని నష్టం రాసుకోవడానికి కూడా ప్రభుత్వ అధికారులెవరూ రాలేదు. సీఎం చంద్రబాబు మాత్రం పొద్దున్నే టీవీల్లో కనిపించి అదిచేస్తాం.. ఇది చేస్తాం.. అని మాయమాటలు చెబుతున్నారు. నిజానికి ఎక్కడో ఒక లారీలో రూ.10 పులిహోర పాకెట్లు కొన్ని తెచ్చి, దూరం నుంచి విసిరేసి అంతా చేసేశామన్నట్టు చెప్పుకుంటున్నారు. ఇదేనా చిత్తశుద్ధి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై, పాలకులపై ధ్వజమెత్తారు. మంచి చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే ప్రతీ ఇంటి దగ్గరకు వచ్చి ఏమేమి ఇస్తారో ఇచ్చి అప్పుడు సగర్వంగా ఎందుకు చెప్పుకోరని ప్రశ్నించారు. ప్రభుత్వం నిజాయితీగా సాయం చేయాలనుకుంటే రూ.లక్షల కోట్లు ఉన్నాయని, కానీ మంచి చేయాలనే ఉద్దేశం ఎవరిలోనూ కనిపించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఏదో చేసేస్తున్నామని ఊరికే కలర్ పూసేసి చెప్పుకుంటున్నారని, ఇలాగే వదిలేస్తే ఎప్పటికీ సాయం అందదని ఆందోళన వ్యక్తంచేశారు. హుదూద్ తుపాను ధాటికి కకావికలమైన విశాఖలోని పలు ప్రాంతాల్లో ఆయన గురువారం పర్యటించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి కొండంత ధైర్యమిచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నా సహాయం చేయడానికి ముందుంటామని, ప్రతీ కాలనీలోను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలకు అండగా నిలబడతారని చెప్పారు. కొన్ని రోజులు సమయం ఇచ్చి అప్పటికీ ప్రభుత్వం దిగి రాకపోతే బాధితులందరితో కలిసి రోడ్డుపైకి వచ్చి పోరాటం చేస్తామని, ప్రభుత్వం మెడలు వంచయినా మంచి జరిగేలా ప్రయత్నిస్తామని జగన్ భరోసా ఇచ్చారు. ఉదయం గవర్నర్ బంగ్లా ప్రాంతం నుంచి ప్రారంభమైన జగన్పర్యటన వైఎస్సార్ కాలనీ, ధర్మానగర్, బీఎన్‌ఐటీఎన్ కాలనీ, సీతమ్మధార, బాలయ్యశాస్త్రి లేఔట్, రాజీవ్ కాలనీ, ఏకేపీ కాలనీ, మల్కాపురం జయేంద్రకాలనీ, కాకర్లలోవ, చింతల్లోవ, కొత్త గాజువాక ప్రాంతాల మీదుగా సాగింది. ఆయన శుక్రవారం సాకేతపురం, స్టీల్‌ప్లాంట్, బర్మా కాలనీ, అశోక్‌నగర్, దయాళ్ నగర్, హైస్కూల్ రోడ్డు, గాజువాక ల్లో పర్యటిస్తారు. అడుగడుగునా కష్టాలు తెలుసుకుంటూ... వైఎస్సార్ కాలనీలో ప్రజల అవస్థలను జగన్ ప్రత్యక్షంగా చూశారు. గండి రాములమ్మ, మీసాల రాజేశ్వరి, నారాయణమ్మ అనే మహిళలు తమ పాకలు ఎగిరిపోయాయని, ఇంతవరకూ ఎవరూ తమని చూడడానికి కూడా రాలేదని విలపించారు. ఏమైనా ఇచ్చారా తల్లీ? అని జగన్ ప్రశ్నించగా... పనికిరాని పులిహోర ప్యాకెట్లు ఇచ్చారని వారు బదులిచ్చారు. ఇళ్లు కూలిపోయి నడిరోడ్డున పడ్డ నాస రామయ్య, నడిపూడి చంద్రరావు, నాగేశ్వరరావులను జగన్ పరామర్శించారు. అన్నయ్యా... ఇల్లు పోయింది, పిల్లలతో దిక్కులేని వాళ్లమయ్యామని సియాద్రి మాధురి తన గోడు చెప్పుకుంది. ఇల్లు మొత్తం పడిపోయిందని, పింఛను కూడా రావడం లేద ని, పోలియో వచ్చిన కొడుకుతో అవస్థలు పడుతున్నానని గొడ్డు అప్పారావు తన దుస్థితిని వివరించారు. నిరాశ్రయులైన వారందరినీ జగన్ పేరు పేరునా పలకరించి ఓదార్పునిచ్చారు. అక్కడనుంచి రైల్వే కాలనీలో క్వార్టర్స్ దుస్థితిని పరిశీలించి... ‘సెంట్రల్ గవర్నమెంట్ క్వార్టర్ల పరిస్థితే ఇట్లుంది’ అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రతీ చోట ఓపిగ్గా గంటల తరబడి జనం కష్టాలు తెలుసుకుంటూ, వారికి భరోసానిస్తూ జగన్ ముందుకు కదిలారు. వెళ్లిన ప్రతీచోట ఎవరైనా వచ్చారా? సాయమేదైనా చేశారా? అని ఆరా తీశారు. ఇంతవరకూ తామున్నామో పోయామో పట్టించుకోవడానికి కూడా ఎవరూ రాకపోయినా మీరు మాత్రమే వచ్చారని ప్రజలు బదులిచ్చారు. జగన్ ఇచ్చిన పిలుపు మేరకు బాధితులకు సాయమందించడానికి వైఎస్సార్ పార్టీ శ్రేణులు ఆహార సరుకులు టన్నుల కొద్దీ తీసుకువచ్చి జగన్ సమక్షంలోనే పంచిపెట్టారు. కొత్త గాజువాక చేరుకొనే సరికి రాత్రి ఎనిమిది గంటలు కావస్తున్నా జగన్ అక్కడ కూలిపోయిన మసీదును సైతం పరిశీలించి ముస్లిం సోదరులకు అండగాఉంటానని ధైర్యమిచ్చారు. -
38కి చేరిన హుదూద్ మృతుల సంఖ్య
-
త్వరలో విశాఖ హార్బర్ లో కార్యకలాపాలు
న్యూఢిల్లీ: తుఫాను దెబ్బకు దారుణంగా దెబ్బతిన్న విశాఖ హార్బర్ లో కార్యకలాపాలను త్వరలో పునరుద్ధరిస్తామని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ సృష్టం చేసింది. ఇందుకు సంబంధించి సర్వే చేస్తున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా పౌరవిమానాల రాకపోకలకు సంబంధించి రక్షణశాఖ గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించి బుధవారం పౌరవిమానాయాన శాఖ అధికారులతో రక్షణశాఖ అధికారులు సమావేశమైన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో శుక్రవారం నుంచి విమాన సర్వీసులు యథావిధిగా కొనసాగనున్నాయి. అదృష్టవశాత్తు రన్‌వే బాగుండటం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ కూడా మరీ ఎక్కువగా దెబ్బ తినకపోవడంతో విమానాలను తిప్పడానికి సమస్య లేదని అధికారులు చెప్పారు. హుదూద్ తుపాను ప్రభావంతో వీచిన గాలులు విశాఖపట్నంతో పాటు విమానాశ్రయాన్ని తీవ్రంగా వణికించిన సంగతి తెలిసిందే. తాత్కాలికంగా ప్యాసింజర్ టెర్మినల్ మీద ఓ టార్పాలిన్ షీటును పైకప్పుగా వేసి ఉంచారు. -
వరద బాధితులకు వైఎస్ జగన్ సాయం పంపిణీ
-
వరద బాధితులకు వైఎస్ జగన్ సాయం పంపిణీ
హుదూద్ తుఫానుకు తీవ్రంగా దెబ్బతిన్న విశాఖపట్నంలోని ధర్మానగర్ ప్రాంతంలో తుఫాను బాధితులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం పరామర్శించారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో సేకరించిన సహాయ సామగ్రి విశాఖపట్నానికి చేరుకుంది. ఆ సామగ్రిని బాధితులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. గత రెండు రోజులుగా విశాఖలోనే ఉండి, తుఫాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్న వైఎస్ జగన్, ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏవేం కావాలో అడిగి తెలుసుకుంటున్నారు. ఆ మేరకు వారందరికీ సహాయం అందేలా ఇటు పార్టీ వర్గాలతోను, అటు స్వచ్ఛంద సంస్థలతోను సమన్వయం చేస్తున్నారు. -
రేపట్నుంచే విశాఖలో విమానాలు!
తుఫాను దెబ్బకు దారుణంగా దెబ్బతిన్న విశాఖపట్నం విమానాశ్రయం నుంచి విమానాలు శుక్రవారం నుంచి తిరుగుతాయి. హుదూద్ విలయం సృష్టించిన ఐదు రోజులకు మళ్లీ గాలిమోటార్లు పనిచేయడం ప్రారంభం అవుతోంది. ఎయిరిండియా విమానం ఢిల్లీ నుంచి విశాఖ వచ్చి, ఇక్కడినుంచి మళ్లీ హైదరాబాద్ వెళ్తుంది. 2009 ఫిబ్రవరిలో నిర్మించిన ఈ భవనం పైకప్పు బాగా దెబ్బతింది. అయితే అదృష్టవశాత్తు రన్‌వే బాగుండటం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ కూడా మరీ ఎక్కువగా దెబ్బ తినకపోవడంతో విమానాలను తిప్పడానికి సమస్య లేదని అధికారులు చెప్పారు. గంటకు 180-195 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు విశాఖపట్నంతో పాటు విమానాశ్రయాన్ని తీవ్రంగా వణికించాయి. శనివారం నుంచి మరిన్ని విమానాలు తిరుగుతాయి. తాత్కాలికంగా ప్యాసింజర్ టెర్మినల్ మీద ఓ టార్పాలిన్ షీటును పైకప్పుగా వేశారు. ప్రస్తుతానికి కంప్యూటర్లన్నీ తుఫాను కారణంగా పాడైపోయాయి కాబట్టి, బోర్డింగ్ పాసులు మాత్రం మాన్యువల్‌గానే ఇస్తారు. నెలాఖరుకు విమానాశ్రయం పూర్తిస్థాయిలో పనిచేస్తుందని అధికారులు చెప్పారు. -
ఆహార పొట్లాలు అక్కర్లేదని చెబుతున్నారు: బాబు
తుఫాను వల్ల ఇబ్బంది పడిన విశాఖ ప్రజల్లో ధైర్యం కల్పించామని, అసలు తమకు ఆహార పొట్లాలు అక్కర్లేదని ప్రజలు చెబుతున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. హుదూద్ తుఫాను వల్ల అస్తవ్యస్తమైన విద్యుత్ సరఫరా వ్యవస్థను పునరుద్ధరించడానికి ప్రైవేటు సంస్థల సహకారం తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఎల్అండ్టీ వాళ్లు, పాతూరి రామారావు తదితరులందరినీ పిలిపిస్తున్నామని, వాళ్లతో కూడా మాట్లాడి వీలైనంత త్వరగా పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా చేయిస్తామని చెప్పారు. వాస్తవానికి విశాఖలో మొదట విద్యుత్ సరఫరా చేయడానికి 15 రోజులు పడుతుందని అనుకున్నామని, కానీ మూడు రోజుల్లోనే ఇచ్చామని అన్నారు. పెట్రోలు, డీజిల్ కొరత కూడా తీరిందన్నారు. -
శనివారానికల్లా సెల్ సర్వీసుల పునరుద్ధరణ: ఎయిర్టెల్
తుఫాను దెబ్బతో విలవిల్లాడిన విశాఖ ప్రజలకు పూర్తి సంఘీభావాన్ని ప్రకటిస్తున్నట్లు ఎయిర్టెల్ చీఫ్ సునీల్ భారతీ మిట్టల్ తెలిపారు. బాధితులను ఆదుకోడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అధికారులు గట్టిగా పనిచేస్తున్నారని ఆయన అన్నారు. ఇక ఆ ప్రాంతంలో సెల్‌ఫోన్ సర్వీసులను పునరుద్ధరించడానికి తామంతా పూర్తిస్థాయిలో పనిచేస్తున్నట్లు సునీల్ మిట్టల్ చెప్పారు. శనివారం సాయంత్రానికల్లా అక్కడ ఎయిర్టెల్ సెల్ఫోన్లన్నీ పూర్తిస్థాయిలో పనిచేస్తాయని ఆయన హామీ ఇచ్చారు. అయితే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మాత్రం పరిస్థితి ఇంకా బాగోలేదని ఆయన అన్నారు. డీజిల్ అందుబాటులో లేకపోవడం వల్లే ఇలా ఉందని చెప్పారు. అయితే.. డబ్బు మిగుల్చుకోడానికి టెలికం కంపెనీలు ప్రయత్నిస్తున్నాయని, అందుకే సెల్ టవర్లకు డీజిల్ జనరేటర్లను ఉపయోగించట్లేదని చంద్రబాబు ఆరోపించారు. దాన్ని సునీల్ మిట్టల్ ఖండించారు. సెల్ టవర్లను అసలు టెలికం కంపెనీలు నడపడంలేదని, డీజిల్‌తో నడపాలా.. కరెంటుతో నడపాలా అనేది తమ చేతుల్లో లేదని అన్నారు. టెలికం సిబ్బంది 24 గంటలూ పనిచేస్తున్నారని, టవర్లను మాత్రం నడిపించేది థర్డ్ పార్టీ వ్యక్తులని ఆయన చెప్పారు. -
తుఫాను కలిగించిన నష్టం బాధాకరం: పవన్
హుదూద్ తుఫాను విశాఖపట్నానికి కలిగించిన నష్టం చాలా బాధాకరమని పవన్ కల్యాణ్ అన్నారు. ఇలాంటి కష్టం వచ్చినప్పుడు ప్రజలు మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలని ఆయన కోరారు. క్లిష్ట సమయాలను ఎదుర్కొనే నాయకత్వ లక్షణాలు చంద్రబాబుకు ఉన్నాయని ఆయన చెప్పారు. తుఫాను బాధితుల సహాయార్థం తాను ఇంతకుముందు ప్రకటించిన 50 లక్షల రూపాయల విరాళం తాలూకు చెక్కును ఆయన సీఎం చంద్రబాబు నాయుడుకు అందించారు. తక్షణ సాయం ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీకి, ఆపత్కాలంలో అక్కడే ఉండి విశాఖ వాసులకు అండగా ఉన్న చంద్రబాబుకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. తుపానువల్ల దెబ్బతిన్న విశాఖను చూస్తే బాధ వేసిందన్నారు. ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు పాలనానుభవం ఉన్న వ్యక్తుల అవసరం ఉందని, అందుకే చంద్రబాబుకు మద్దతు ఇచ్చామని చెప్పారు. -
స్టీల్‌ప్లాంట్ నుంచి విషవాయువులు వచ్చే ప్రమాదం!
హుదూద్ తుఫాను దాటికి విశాఖ స్టీలు ప్లాంటులో నాలుగురోజులగా ఉత్పత్తి నిలిచిపోయింది. ఒక్కసారిగా కరెంటు సరఫరా ఆగిపోవపడంతో పవర్ హౌస్‌లో ఒక యూనిట్ ట్రిప్పయింది. గురువారం సాయంత్రంలోగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించకపోతే అక్కడి నుంచి విషవాయువులు వెలువడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ప్రభుత్వ అధికారుల హెచ్చరికలను స్టీలు ప్లాంటు యాజమాన్యం మాత్రం పట్టించుకోవడం లేదు. అక్కడ ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవట్లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. -
36కి పెరిగిన హుదూద్ మృతుల సంఖ్య
-
నీటిలో చిక్కుకున్న చంద్రబాబు!
-
నీటిలో చిక్కుకున్న చంద్రబాబు!
శ్రీకాకుళం: ఉత్తరాంధ్రలో తుఫాన్ బాధితులను పరామర్శించడానికి చంద్రబాబు చేపట్టిన పర్యటనలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లాల్లోని రెల్లిగడ్డి వద్ద చంద్రబాబు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ నీటిలో చిక్కుకు పోయింది. పార్టీ కార్యకర్తలు, అధికారులు చంద్రబాబు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ ను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. తుఫాన్ తాకిడి గురైన ప్రాంతాల్లో చంద్రబాబు ట్రాక్టర్ పై పర్యటిస్తున్నారు. మొదలవలస, రెల్లిగడ్డి పర్యటనలో ఈ ఘటన చోటు చేసుకుంది. -
తుఫాను నష్టం వివరాలు ఇవీ..
హుదూద్ తుఫాను కారణంగా సంభవించిన మొత్తం నష్టం వివరాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. తుఫాను కారణంగా మొత్తం 26 మంది మరణించారని, 146 మందిని సహాయక బృందాలు కాపాడాయని అధికారులు చెప్పారు. 7806 ఇళ్లు ధ్వంసం అయ్యాయని, 219 చోట్ల రోడ్లు, రైలుపట్టాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. మొత్తం 8301 కరెంటు స్తంభాలు కూలిపోగా, 19 చోట్ల కాల్వలకు గండ్లు పడ్డాయి. 181 బోట్లు గల్లంతయ్యాయి. 3368 పశువులు మృతి చెందాయి. తుపాను ప్రభావం మొత్తం 2 కోట్ల మందిపై పడిందని, 223 రిలీఫ్ క్యాంపులు, 223 వైద్య శిబిరాలు ఏర్పాటుచేశామని అధికారులు ఓ ప్రకటనలో వివరించారు. -
19న విశాఖలో రాహుల్ గాంధీ పర్యటన
హుదూద్ తుఫానుతో అల్లకల్లోలమైన విశాఖపట్నంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వచ్చే ఆదివారం.. 19వ తేదీ పర్యటించనున్నారు. ఆరోజు నేరుగా ఢిల్లీ నుంచి వచ్చి, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఆయన తిరుగుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారమే విశాఖలో పర్యటించి, తక్షణ సాయంగా వెయ్యి కోట్ల రూపాయలు ప్రకటించిన విషయం తెలిసిందే. హుదూద్ తుఫాను సరిగ్గా గత ఆదివారం నాడు.. అంటే ఈనెల 12వ తేదీన తీరం దాటింది. వారం రోజులకు అంటే మళ్లీ ఆదివారం నాడు రాహుల్ గాంధీ విశాఖకు వస్తున్నారు. -
విశాఖ మార్గంలో 26 రైళ్ల రద్దు
హుదూద్ తుఫానుకు అల్లకల్లోలంగా మారిన విశాఖపట్నం మార్గంలో బుధవారం వెళ్లాల్సిన 26 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దుచేసింది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే జన్మభూమి ఎక్స్‌ప్రెస్, విశాఖ నుంచి కాజీపేట వెళ్లే లింక్ ఎక్స్‌ప్రెస్, విశాఖ నుంచి రేణిగుంట వెళ్లే స్పెషల్ రైలు రద్దయ్యాయి. అలాగే, రేణిగుంట నుంచి విశాఖపట్నం వెళ్లే స్పెషల్ రైలు, విశాఖ నుంచి సికింద్రాబాద్ వెళ్లే స్పెషల్ రైలు కూడా రద్దయ్యాయి. అలాగే, గురువారం నాడు వెళ్లాల్సిన సికింద్రాబాద్ - విశాఖ స్పెషల్ రైలు, ఈరోజు, రేపు తిరగాల్సిన భువనేశ్వర్ - సికింద్రాబాద్ విశాఖ ఎక్స్‌ప్రెస్, విశాఖ- సికింద్రాబాద్ గరీబ్‌రథ్, భువనేశ్వర్ - ముంబై కోణార్క్ ఎక్స్‌ప్రెస్, రేపటి చెన్నై -షాలిమార్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్ - సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ రద్దయిన జాబితాలో ఉన్నాయి. -
'హుదూద్'తో జనజీవనం అస్తవ్యస్తం
-
తుఫాను సాయాన్ని నిరాకరించిన ఎయిర్‌పోర్టు
హుదూద్ తుఫాను బాధితులను ఆదుకోడానికి దాతలు చేసిన సహాయాన్ని గన్నవరం విమానాశ్రయం అధికారులు తిరస్కరించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి ప్రాంతానికి చెందినవాళ్లు దాదాపు 25 వేల పులిహోర ప్యాకెట్లు, 25 వేల వాటర్ ప్యాకెట్లు, 2వేల దుప్పట్లు, 2వేల టవల్స్ మొత్తం సిద్ధం చేసి, వాటిని విశాఖపట్నం తరలించేందుకు గన్నవరం విమానాశ్రయానికి తీసుకెళ్లారు. అయితే, వాటిని విశాఖపట్న పంపడానికి కుదరదంటూ అధికారులు ఆ సరుకులను తీసుకెళ్లేందుకు నిరాకరించారు. దాంతో అధికారుల తీరును నిరసిస్తూ విమానాశ్రయం వద్ద తాడేపల్లి వాసులు ఆందోళన చేశారు. -
ఏటీఎంల వద్ద భారీ క్యూలు
-
నడుస్తున్న రైళ్లు.. ఏటీఎంల వద్ద భారీ క్యూలు
ఎట్టకేలకు ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు కొంత ఊపిరి పీల్చుకునే పరిస్థితి క్రమంగా వస్తోంది. బయ్యారం - ఎలమంచిలి మధ్య రైల్వే బ్రిడ్జిని పునరుద్ధరించారు. రెండు ట్రాకులు అందుబాటులోకి వస్తాయి. దాంతో విశాఖపట్నం, భువనేశ్వర్ ప్రాంతాలకు బుధవారం సాయంత్రం నుంచి పూర్తిస్థాయిలో రైళ్లు నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. దాదాపు నాలుగు రోజుల నుంచి ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలతో పాటు ఒడిషాకు కూడా రవాణా మార్గాలు పూర్తిగా స్తంభించిన విషయం తెలిసిందే. రైల్వే అధికారులు యుద్ధప్రాతిపదికన పనిచేసి, రైలు మార్గాలను పునరుద్ధరించారు. మరోవైపు.. కొన్ని ఏటీఎం కేంద్రాలు కూడా ఇప్పుడిప్పుడే పనిచేయడం ప్రారంభించాయి. దాంతో డబ్బులు తీసుకోడానికి వాటి ముందు భారీ క్యూలలో ప్రజలు వేచిచూస్తున్నారు. వృద్ధులు, మహిళలు కూడా ఈ క్యూలలో వేచి చూస్తూ ఇబ్బంది పడుతున్నారు. మూడు రోజుల తర్వాత వీటిలో రెండు మూడు కేంద్రాలు పనిచేస్తుండటంతో చాలామంది డబ్బుల కోసం ఏటీఎం కేంద్రాలకు వెళ్లారు. తుఫాను వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరి వద్దా ఇళ్లలో పెద్దగా డబ్బులు లేకపోవడం, ఏటీఎంలలో ఇన్వర్టర్లు విద్యుత్ సరఫరా లేక ఛార్జింగ్ అయిపోయి అవి పనిచేయడం మానేశాయి. అసలే ఒకవైపు ధరలు ఆకాశాన్ని అంటుతుండటం, మరోవైపు డబ్బు లేకపోవడంతో విశాఖ వాసులు చాలా ఇబ్బంది పడ్డారు. ఎట్టకేలకు వాళ్ల కష్టాలు కొంతవరకు తీరే అవకాశం కనిపిస్తోంది. -
వందల కోట్లు తీసుకుని.. లక్షలు విదిలిస్తారా
తుఫాను బాధితుల సహాయార్థం టాలీవుడ్ హీరోలు ప్రకటిస్తున్న సాయం మీద సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజల నుంచి వందల కోట్లు తీసుకునే హీరోలు.. విశాఖపట్నం కోసం కేవలం కొన్ని లక్షలు మాత్రమే ఇస్తారా అని ప్రశ్నించారు. ఉచితంగా వస్తాయి కాబట్టే బోలెడంత ప్రేమ కురిపించి, ప్రార్థనలు చేస్తున్నారని అన్నారు. Am shocked tht stars who hav100s of crores frm people r gvng jst a few lakhs to vizag..Thy r gvng lots of love n prayers bcos they are free — Ram Gopal Varma (@RGVzoomin) October 14, 2014 ఇక తుఫాను విషయంలో దేవుడి నిర్ణయాన్ని కూడా రాంగోపాల్ వర్మ కొంతవరకు ప్రశ్నించారు. ప్రకృతి విపత్తులు దేవుడు సృష్టించేవే అయితే.. ఇలాంటి విధ్వంసం సృష్టించి దేవుడు ఎలా ఆనందం పొందుతాడని వర్మ ప్రశ్నించారు. విశాఖపట్నంలో ఉన్న అందరూ పాపం చేసినవాళ్లేనా.. వాళ్లను ఆయన ఎందుకు శిక్షించాలనుకున్నారని అనుమానం వ్యక్తం చేశారు. అయితే చివర్లో మాత్రం.. మళ్లీ తనకంటే దేవుడికే బాగా తెలుస్తుందని, తాను కేవలం ఓ సామాన్య మానవుడినేనని వేదాంతం వల్లించారు. అప్పటివరకు అంతా బాగానే ఉంది. అయితే హీరోలు కనీసం ఆమాత్రం లక్షలైనా విరాళాలు ప్రకటించారు. రాంగోపాల్ వర్మ మాత్రం తాను ఎంత సాయం చేసేదీ ఒక్క ముక్క కూడా చెప్పలేదు. అవతలి వాళ్ల మీద రాళ్లు వేసేటప్పుడు తన అద్దాల మేడ సంగతి చూసుకోవాలన్న విషయం వర్మకు తెలియదంటారా? If a natural disaster is an act of God what pleasure does God take in such destruction? — Ram Gopal Varma (@RGVzoomin) October 14, 2014 I can't believe that everybody in Vizag is a sinner that he wanted to punish everybody...but ofcourse God knws bettr and I am jst a commoner — Ram Gopal Varma (@RGVzoomin) October 14, 2014 -
ఎంత కష్టం..ఎంత నష్టం...
-
తుపాను బాధితులకు వైసీపీ ఎంపీల 2 నెలల జీతం
సాక్షి, హైదరాబాద్: విశాఖ బాధితులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ(వైసీపీ) ఎంపీలు బాసటగా నిలిచారు. ఆ పార్టీ ఎంపీల 2 నెలల జీతాన్ని హుదూద్ తుపాను బాధితులకు విరాళంగా ఇస్తున్నట్లు నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మంగళవారం ప్రకటించారు. తుపాను బాధితులకు అందాల్సిన ఆహారం, వైద్య సదుపాయాలు వెంటనే అందేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతక్షణ సాయం కింద వెయ్యి కోట్ల రూపాయలు ప్రకటించినందుకు హర్షం వ్యక్తం చేశారు. -
అండగా ఉంటాం
* ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని మోదీ భరోసా * రాష్ట్రానికి తక్షణ సహాయంగా రూ.1,000 కోట్లు * ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాలో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే * పంటల బీమా చెల్లింపులోసానుభూతి చూపాలని కంపెనీలకు చెబుతా * టెక్నాలజీ సహాయంతోప్రాణ నష్టం బాగా తగ్గించారు * కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేశాయి * విశాఖను చూస్తే బాధేస్తోంది * మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వే ల కేంద్ర సహాయం విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: హుదూద్ తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు తక్షణ సహాయంగా రూ.1,000 కోట్లు అందిస్తామని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. అలాగే మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ 50 వేలు కేంద్రం సహాయం చేస్తుందని చెప్పారు. నష్టంపై సమగ్ర సర్వేలు చేయించి ప్రజలను అన్నివిధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దక్షిణ ఒడిశాలో తుపాను ప్రభావిత ప్రాం తాల్లో మంగళవారం ఏరియల్ సర్వే జరిపిన ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలసి ఆయన ఉత్తరాంధ్ర జిల్లాల్లో తుపాను ప్రభావానికి కకావికలమైన ప్రాంతాల్లో ఏరియల్ సర్వే జరిపారు. విశాఖ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన తుపాను ఫొటోల ప్రదర్శనను తిలకించారు. తుపాను సమీక్ష అనంతరం ప్రధాని మోదీ విలేకరులతో మాట్లాడారు. తుపాను బాధిత ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో సాధారణ పరిస్థితులను తీసుకురావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పనిచేస్తాయనీ, ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. భీకరమైన తుపాను ప్రభావాన్ని స్వయంగా అనుభవించిన విశాఖ ప్రజలు నిబ్బరంగా ఉన్నారనీ, సహాయక చర్యల్లో పాల్గొం టున్న ప్రజలు, అధికారులను ఆయన అభినందించారు. ప్రధానమంత్రి ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే.. ఇటీవల వచ్చిన హుదూద్ పెనుతుపాను ఆంధ్రాతో సహా ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో విలయం సృష్టించింది. అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రజలపై సానుభూతి ప్రకటిస్తున్నా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం అన్నివిధాలా సహకారాన్ని అందిస్తుంది. ఈ తుపానును ఎదుర్కోవడంలో సాంకేతిక పరిజ్ఞానం పూర్తిస్థాయిలో వినియోగించారు. పొంచి ఉన్న తుపాను ముప్పును వాతావరణశాఖ ముందుగానే గుర్తించి ఈనెల 6వ తేదీ నుంచే సమాచారాన్ని అందించింది. ఊహించిన దిశ, సమయంలోనే తుపాను తీరం దాటింది. ఫలితంగా ప్రాణ నష్టాన్ని తగ్గించడంలో సఫలమయ్యాం. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం భుజం భుజం కలిసి పనిచేస్తే, సరైన మార్గంలో వెళితే ఎంతటి విపత్తునైనా ఎదుర్కోవచ్చు. ఏపీ ప్రభుత్వం, కేంద్రం ఐదు రోజులపాటు నిరంతరం.. మినిట్ టు మినిట్.. పూర్తిస్థాయిలో సమన్వయంతో పనిచేశాయి. స్థానిక సంస్థలు కూడా పూర్తిస్థాయిలో కలిసి నడిచాయి. విపత్తు సమయంలో ప్రభుత్వ సూచనలను పాటించిన వైజాగ్ ప్రజలను అభినందిస్తున్నా. క్రమశిక్షణతో సూచనలు పాటించడంవల్లే ప్రజల ప్రాణాలను కాపాడటంలో మేం సఫలమయ్యాం. విపత్తులో ధైర్యం కోల్పోకుండా భయంకరమైన తుపానును మీరు(ప్రజలు) ఎదుర్కోగలిగారు. నేను చాలా దూరం వెళ్లాను. ఏరియల్ సర్వే చేశాను. ఒడిశా ప్రాంతాలను కూడా చూశాను. కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలకు కూడా భారీ నష్టం వాటిల్లింది. కోస్ట్‌గార్డు, నేవీ, రైల్వే, ఎయిర్‌లైన్స్, జాతీయ రహదారులు.. అన్నిటికీ నష్టం జరిగింది. కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలు, సంస్థలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయడంకోసం కేంద్రం నుంచి అధికారులు వచ్చి సర్వే చేస్తారు. రైతులకు పంట చేతికొచ్చే సమయం ఇది. తుపానువల్ల రైతులకు తీరని నష్టం వాటిల్లింది. పంట నష్టం అంచనా, నష్టపరిహారం చెల్లింపు విషయంలో సానుభూతితో వ్యవహరించాలని బీమా కంపెనీలతో మాట్లాడతాను. ఇక ప్రైవేటు బీమా కంపెనీల ప్రతినిధులు బాధితులతో సమావేశమై వారి క్లెయిములను త్వరగా చెల్లించే దిశగా పనిచేయాలని బీమా కంపెనీలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడున్న పరిస్థితులు, ప్రజలు పడుతున్న అవస్థను చూస్తే చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఏపీ కొత్తగా ఏర్పాటైన రాష్ట్రం. ఇప్పటికే చాలా పనులు చేయాల్సి ఉంది. ఇంతలోనే ఇంత పెద్ద విపత్తు వచ్చింది. మరోవైపు వైజాగ్‌ను స్మార్ట్ సిటీ చేయాలన్న కలతో నేను చాలా ఆనందపడ్డాను. ఊహించని విధంగా కష్టాలు వచ్చాయి. ఈ విపత్తు నుంచి బయటపడతామనే నమ్మకం నాకుంది. అతి త్వరలోనే పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయి. నష్టాలను సరిచేసుకోడంలో సఫలం అవుతాం. విద్యుత్, తాగునీరు, సమాచార వ్యవస్థల పునరుద్ధరణ ప్రాధాన్యత ఇచ్చాం. కొన్ని గంటల్లోనే పరిస్థితులు మెరుగవుతాయి. దీని కోసం కేంద్రం నుంచి ప్రతినిధులను ప్రత్యేకంగా విపత్తు సర్వే పనుల కోసం డిప్యూట్ చేశాను. ఏపీ ప్రభుత్వం కూడా పూర్తిస్థాయిలో పనిలో నిమగ్నమైంది. ప్రజలకు ప్రాథమిక అవసరాలు తీర్చే దిశగా పనులు ప్రారంభమయ్యాయి. ఇంకా పూర్తి స్థాయిలో పునరుద్ధరణ పనులు ప్రారంభం కావాల్సి ఉంది. భారీ విపత్తు నుంచి కోలుకోవడానికి కేంద్రం తరపున మధ్యంతర సహాయం కింద రూ. 1000 కోట్లు సహాయం ప్రకటిస్తున్నా. ఇక ముందు కూడా ఏపీ, వైజాగ్ ప్రజలకు కేంద్రం అండగా ఉంటుంది. సమస్యల నుంచి బయటపడటానికి ఎలాంటి సహాయం చేయడానికైనా కేంద్రం సిద్ధంగా ఉంది. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు సాయం అందిస్తాం. తుపాను నష్టంపై ప్రధాని సమీక్ష హుదూద్ తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించి కేంద్రం నుంచి రాష్ట్రానికి 2 వేల కోట్ల రూపాయల సహాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్రమోదీకి విన్నవించారు. తుపాను నష్టంపై విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం ప్రధాని సమీక్ష జరిపారు. సీఎం చంద్రబాబు నాయుడు, గవర్నర్ నరసింహన్, కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, అశోక్ గజపతిరాజు, డిప్యూటీ సీఎంలు చినరాజప్ప, కేఈ కృష్ణమూర్తి, రాష్ట్ర మంత్రులు, అధికారులు ప్రధాని సమీక్షలో పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల్లో తుపాను విధ్వంసం కారణంగా జరిగిన నష్టాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రధానికి వివరించారు. విశాఖపట్నంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు భారీగా నష్టం జరిగిందని చెప్పారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన సహాయక చర్య లు చేపట్టడానికి రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల నుంచి అధికారులు, ఉద్యోగులను రంగంలోకి దించామని తెలిపారు. తనతోపాటు మంత్రులు సైతం ఇక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నామని వివరించారు. మంగళవారం రాత్రికి విశాఖలో అత్యవసర సర్వీసులకైనా విద్యుత్ సరఫరా జరపడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. విశాఖ నగరంలో పూర్తిగా సాధారణ పరిస్థితి నెలకొనే వరకు తాను ఇక్కడే ఉంటానని చంద్రబాబు ప్రధానికి తెలిపారు. విశాఖ విషాదం అందరిదీ! ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రధాని మోదీ రాష్ట్రంలో తుపాను నష్టం పరిశీలనకు ఏరియల్ సర్వే కోసం మంగళవారం విశాఖకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ రోడ్డు మార్గం లో ప్రయాణించి విశాఖపట్నంలో సంభవించి న తుపాను విధ్వంసాన్ని స్వయం గా చూశా రు. ఈ సందర్భంగా విశాఖ విషాదం అందరిదీనని, నగరం త్వరగా కోలుకునేందుకు చేయూతనందిస్తామని సీఎం చంద్రబాబుకు హామీ ఇచ్చారు. విమానాశ్రయం నుంచి సీఎం చంద్రబాబు నాయుడుతో కలసి ఒకే వాహనంలో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన ప్రధాని విశాఖ రోడ్లపై కుప్ప కూలిన భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు, తీగలను చూసి నష్టం పెద్దదని వ్యాఖ్యానించారు. తుపాను బాధిత ప్రజలను కూడా సమీకరించి త్వరితగతిన కోలుకునేలా చేద్దామని చంద్రబాబుకు చెప్పారు. ‘విశాఖనగరాన్ని వీలైనంత త్వరగా పూర్వ స్థితికి తెచ్చేందుకు బ్లూప్రింట్ తయారు చేయాలని ప్రధాని సూచించారు. అదేవిధంగా తగిన ప్రతిపాదనలతో వస్తే విశాఖ పునరుద్ధరణకు సహకరిస్తానని మోదీ చెప్పారు. కాగా, ప్రధాన మంత్రి తొలిసారి కలెక్టరేట్‌కు వచ్చి తుపానుపై సమీక్ష నిర్వహించడం ఇదే ప్రథమం. మరోపక్క ప్రధాని రాక సందర్భంగా విమానాశ్రయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఆ మమకారాన్ని నిలుపుకుందాం: మోదీ సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ ప్రజలు కేంద్రంపై, తనపై చూపిన మమకారాన్ని నిలుపుకోవాలని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. మంగళవారం విశాఖలో పలు ప్రాంతాలను రోడ్డు మార్గంలో సందర్శించినప్పుడు ప్రజలు రోడ్డుకు ఇరువైపులా స్వాగతం పలుకుతూ మోదీకి జయజయధ్వానాలు పలికారు. పర్యటన అనంతరం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరిగి వస్తూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో ప్రధాని ఈ విషయం ప్రస్తావించారు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ప్రజలు తమ గోడు వినిపిస్తూ ఆందోళన చేస్తుంటారని గుర్తుచేశారు. కానీ విశాఖ ప్రజలు అందుకు భిన్నంగా స్వాగతం పలకడంపట్ల ఆశ్చర్యం వ్యక్తంచేశారు. తుపానుకు ముందు, అనంతరం కేంద్రం, రాష్ట్రం అప్రమత్తంగా ఉండడంతో ప్రజల్లో విశ్వాసం కలిగిందని వెంకయ్య చెప్పారు. ప్రధాని మీద ఉన్న నమ్మకం కూడా వారి మమకారానికి కారణమన్నారు. దీంతో ప్రధాని తిరిగి ‘ఆ విశ్వాసాన్ని, వారి మమకారాన్ని మనం నిలుపుకోవాలి..’ అని వెంకయ్యనాయుడితో చెప్పారు. -
మేము సైతం...
హుదూద్ తుఫాన్ బీభత్సం కారణంగా గోదావరి జిల్లాలు, విశాఖ సహిత ఉత్తరాంధ్ర అతలా కుతలం అయిన సంగతి తెలిసిందే. ఈ ప్రకృతి వైపరీత్యంపై సినీపరిశ్రమ అభినందనీయంగా స్పందించింది. పలువురు సినీ ప్రముఖులు మేము సైతం అంటూ బాధితులకు ఆర్ధిక సహాయాన్ని ప్రకటించారు. బాధితుల సహాయార్థం పవన్‌కల్యాణ్ 50 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్‌కి అందజేయనున్నట్లు ప్రకటించారు. బాధిత ప్రాంతాలలో త్వరలోనే పర్యటించనున్నట్లు ఆయన తెలిపారు. పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా అందరూ స్పందించాలని, అభిమానులు తక్షణమే సహాయక చర్యల్లో పాల్గొనాలని పవన్ పిలుపునిచ్చారు. మహేశ్‌బాబు కూడా ఈ విపత్తు విషయంలో తనదైన శైలిలో స్పందించారు. 25 లక్షల రూపాయలు బాధితుల సహాయార్థం ప్రకటించారు. జరిగిన నష్టం నుంచి త్వరగా కోలుకొని, త్వరగా ఆ ప్రాంతాలు పూర్వవైభవానికి చేరుకోవాలని మహేశ్ ఆకాంక్షించారు. సహాయ కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా అభి మానులకు పిలుపునిచ్చారు. సీనియర్ నటుడు, సూపర్‌స్టార్ కృష్ణ కూడా 15 లక్షల రూపాయల ఆర్థిక సాయం అనౌన్స్ చేశారు. ఆయనతో పాటు ఆయన సతీమణి విజయనిర్మల కూడా 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. ఘట్టమనేని అభిమానులు తక్షణం తుఫాన్ బాధిత ప్రాంతాల్లో సేవాకార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. రామ్‌చరణ్ 15 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. వాటిలో పది లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్‌కి అందిస్తామని, మిగిలిన అయిదు లక్షలు విశాఖకు చెందిన రామకృష్ణ మిషన్ వారికి అందిస్తామని, ఇంకా అయిదువేల పులిహోర పొట్లాలు, పదివేల వాటర్ బాటిల్స్, అయిదు వేల బిస్కెట్ ప్యాకెట్స్ అందిస్తామని రామ్‌చరణ్ మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు. మానవతా దృక్పథంతో అందరూ కలిసి తుఫాన్ బాధితుల్ని ఆదుకోడానికి ముందుకు రావాలని పిలుపునిస్తూ జూనియర్ ఎన్టీఆర్ 20 లక్షల రూపాయల విరాళాన్ని సీఎం సహాయ నిధికి ప్రకటించారు. షూటింగ్ నిమిత్తం కొచ్చీలో ఉన్న అల్లు అర్జున్ కూడా తుఫాన్ బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్‌కి 20 లక్షల రూపాయిల ఆర్థిక సాయం ప్రకటించారు. తుఫాన్ కారణంగా తానెంతో ఇష్టపడే విశాఖ నగరం రూపురేఖలు మారిపోవడం తననెంతో కలచివేసిందనీ, తాను ప్రకటించిన 20 లక్షల ఆర్ధిక సాయంలో ఎక్కువ శాతం మత్స్యకారుల కుటుంబాలకే చెందాలని బన్నీ ప్రభుత్వాన్ని కోరారు. ప్రభాస్ 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నట్లు ఓ ప్రకటన ద్వారా తెలిపారు. రామ్ కూడా సీఎమ్ రిలీఫ్ ఫండ్‌కు 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. అందరూ కలిసి కట్టుగా ఈ విపత్తును ఎదుర్కోవాలని రామ్ పేర్కొన్నారు. ‘హృదయకాలేయం’ ఫేమ్ సంపూర్ణేశ్‌బాబు కూడా లక్ష రూపాయిలు బాధితుల సహాయార్థం అందించడం గమనార్హం. ఇంకా బియ్యం, కూరగాయలు కూడా తుఫాన్ బాధితులకు అందించనున్నట్లు చెప్పారు. తెలుగు చలనచిత్ర నిర్మాత మండలి కూడా మంగళవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ప్రస్తుతానికి 25 లక్షల రూపాయిలు ఇస్తున్నామని, ఇక ముందు కూడా తమ వంతు సహాయ సహకారాలను అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. 3జి లవ్’ చిత్ర నిర్మాత ప్రతాప్ కొలగట్ల ఒక లక్ష రూపాయలు అనౌన్స్ చేశారు. -
తక్షణసాయం ప్రకటించండి: వైఎస్ జగన్
విశాఖపట్నం: తుపాన్ బాధిత కుటుంబాలకు తక్షణసాయంగా రూ. 5వేలు చొప్పున ఇవ్వాలని ప్రభుత్వాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ధ్వంసమైన మత్సకారుల పడవలకు రూ. లక్ష చొప్పున పరిహారం ప్రకటించాలన్నారు. విశాఖ జిల్లాలో హుదూద్ తుపాన్ కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. కాగిత, పూడిమడక, పాలదిబ్బ, దుత్తితూరు గ్రామాలను ఆయన సందర్శించారు. అచ్యుతాపురం, పరవాడ, స్టీల్ ప్లాంట్ మీదుగా తుపాను బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. తుపాన్ బాధితులతో మాట్లాడారు. పంటనష్టపోయిన రైతులను వివరాలు అడిగి వివరాలు తెలుసుకున్నారు. -
మహేశ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ కూడా స్పందించారు!
-
ఉత్తరాంధ్రలో రైళ్ల పునరుద్ధరణ
-
'హుదూద్' విలయ తాండవం
-
ఉత్తరాంధ్రలో రైళ్ల పునరుద్ధరణ
తుఫాను కారణంగా రైల్వేలైన్లు దెబ్బతిన్న కొన్ని ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. యలమంచిలి వద్ద సింగిల్ ట్రాకు మరమ్మతులు చేయడంతో ఇది సాధ్యమైంది. సాయంత్రం 4 గంటలకు విశాఖ నుంచి సింహాద్రి ఎక్స్‌ప్రెస్ బయల్దేరుతుంది. అలాగే హౌరా- యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రాత్రి 11.45 గంటలకు బయల్దేరుతుంది. భువనేశ్వర్ - ముంబై ఎక్స్‌ప్రెస్ బుధవారం ఉదయం 9 గంటలకు బయల్దేరుతుంది. బెంగళూరు - డిబ్రుగఢ్ ఎక్స్‌ప్రెస్ సాయంత్రం 4.30 గంటలకు మొదలవుతుంది. అయితే కొన్ని రైళ్లు మాత్రం రద్దయ్యాయి. సికింద్రాబాద్- భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్ మంగళవారం కూడా రద్దయింది. షాలిమార్ - చెన్నై ఎక్స్‌ప్రెస్ రద్దయింది. సాయంత్రం నాలుగు గంటలకు బయల్దేరాల్సిన తిరుపతి - విశాఖపట్నం స్పెషల్ రైలు రద్దయింది. విజయవాడ - విశాఖ రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను సామర్లకోట వరకే పరిమితం చేశారు. అలాగే విశాఖ- విజయవాడ రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను సామర్లకోట నుంచే నడిపిస్తున్నారు. -
తక్షణ సాయంగా వెయ్యికోట్లు: మోదీ
-
తక్షణ సాయంగా వెయ్యికోట్లు: మోదీ
తుఫాను ఈ ప్రాంతాన్ని అతలాకుతలం చేసిందని, ఈ ఆపద సమయంలో అన్ని విధాలా తాము ఆదుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. విశాఖపట్నంలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ''తుఫాను గమనాన్ని గుర్తించేందుకు టెక్నాలజీని బాగా ఉపయోగించుకున్నారు. ఆరోతేదీ నుంచి ఈ సంకేతాలిచ్చారు. ముందుగా అనుకున్న స్థాయి, దిశ, సమయం అన్నీ సరిగ్గా సరిపోయాయి. ఒకరకంగా ఈ ఆపద నుంచి తప్పించుకోవడంలో టెక్నాలజీ బాగా ఉపయోగపడింది. కేంద్రం, రాష్ట్రం రెండూ సమన్వయంతో పనిచేసి, సరైన దిశలో పనిచేస్తే ఎంత పెద్ద ఆపద అయినా.. దాన్నుంచి బయటపడొచ్చు. ఆంధ్రా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిమిష నిమిషానికీ అద్భుతమైన సమన్వయంతో పనిచేశాయి. స్థానిక ప్రభుత్వాలు కూడా వాటిని అమలుచేశాయి. విశాఖ ప్రజలను అభినందిస్తున్నాను. ఈ ఆపద సమయంలో ప్రభుత్వం చెప్పినట్లే చేశారు. క్రమశిక్షణ కారణంగా ప్రజల ప్రాణాలు కాపాడటంలో మేం విజయం సాధించగలిగాం. తుఫాను భీకరమైనది. దీన్ని మీరంతా స్వయంగా అనుభవించారు. మీరు చూపించిన ధైర్యానికి సెల్యూట్. నేను దారిలో ఇబ్బందులన్నీ గమనించాను. ఒడిషాలో కూడా చూశాను. ఈ ఆపద సమయంలో కేంద్రం మీ అందరికీ వెన్నంటి ఉంటుంది. కోస్ట్‌గార్డ్,నేవీ, రైల్వే, ఎయిర్‌లైన్స్, జాతీయ రహదారులు.. అన్నింటికీ ఎంత నష్టం వచ్చినా కేంద్రం నుంచి పూర్తి సాయం అందిస్తాం. పూర్తి సర్వే చేయిస్తున్నాం. వ్యవసాయ సర్వే, ఆస్తుల సర్వే కూడా చేయిస్తాం. ఎక్కడెక్కడ ఎంత నష్టం వాటిల్లిందో చూస్తాం. ప్రైవేటు బీమా కంపెనీలతో మాట్లాడి, సానుభూతి దృష్టితో పరిహారం ఇప్పించాల్సిందిగా చెబుతాం. ఆంధ్రప్రదేశ్‌కు చాలా పెద్ద ఆపద వచ్చింది. విశాఖపట్నాన్ని స్మార్ట్ సిటీగా చేద్దామని ఇంతకుముందే అనుకున్నాం. అంతలోనే ఈ ఆపద వచ్చింది. అయినా.. వెనకడుగు వేసేది లేదు. విద్యుత్, మంచినీళ్లు, కమ్యూనికేషన్లను ముందుగా పునరుద్ధరిస్తాం. కొంచెం సర్వే ఇంకా చేయాల్సి ఉంది. అయినా.. ఈ ఘోర విపత్తు సమయంలో ముందుగా వెయ్యికోట్ల రూపాయల తక్షణ సాయం ఇస్తున్నాం. భవిష్యత్తులో కూడా మరింత సాయం చేస్తాం. మృతులు, క్షతగాత్రులకు కూడా ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి సాయం అందిస్తాం'' అని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. -
'విద్యుత్'ను పునరుద్ధరించడానికి మరో మూడు రోజులు
విశాఖపట్నం: పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా పునరుద్ధరించడానికి మరో రెండు మూడు రోజులు పట్టే అవకాశం ఉందని విశాఖపట్నం ఎంపి హరిబాబు తెలిపారు. బుధవారం నుంచి తాగునీరు అందించడానికి ప్రయత్నాలు ప్రారంభించామని ఆయన అన్నారు. తుఫాన్ బాధితులకు విజయవాడ నుంచి నిత్యవసర వస్తువులు, కూరగాయలు తెప్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని హరిబాబు తెలిపారు. హదూద్ తుఫాన్ సృష్టించిన బీభత్సం కారణంగా ఉత్తరాంధ్రలో విద్యుత్ సరఫరా, రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. తుఫాన్ బాదితులను పరామర్శించడానికి ప్రధాని నరేంద్రమోడీ విశాఖపట్నం చేరుకున్నారు. విశాఖ ప్రధాన కూడళ్లను మోడీ పరిశీలిస్తున్నారు. -
25కు చేరుకున్న తుఫాను మృతుల సంఖ్య
హుదూద్ తుఫాను ప్రభావంతో మరణించిన వారి సంఖ్య 25కు చేరుకుంది. మంగళవారం ఉదయం వరకు 21 మంది మాత్రమే మరణించినట్లు అధికారవర్గాలు తెలియజేశాయి. అయితే, మరో నలుగురు కూడా వివిధ కారణాలతో మరణించినట్లు తాజాగా తెలిసింది. దాంతో మొత్తం మృతుల సంఖ్య 25కు చేరుకుంది. కానీ, ఇప్పటికీ విశాఖపట్నంలోని పలు ప్రాంతాలకు ఎవరూ చేరుకోలేని పరిస్థితి ఉండటం, శిథిలాలను ఇప్పటికీ తొలగించలేకపోవడం తదితర కారణాలతో.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అధికార వర్గాలు అంటున్నాయి. కాగా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, గవర్నర్ నరసింహన్, కేంద్ర మంత్రులు మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా తమకు కనీసం తాగడానికి గుక్కెడు నీళ్లు ఇప్పించాలని, విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని ప్లకార్డులతో స్థానికులు కోరారు. -
విశాఖలో కలియదిరుగుతున్న మోదీ
హుదూద్ తుఫానుతో తీవ్రంగా దెబ్బతిన్న విశాఖపట్నంలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటించారు. ముందుగా ఢిల్లీ నుంచి ప్రత్యేక సైనిక విమానంలో విశాఖపట్నం చేరుకున్న మోదీ.. అక్కడ దెబ్బతిన్న విమానాశ్రయాన్ని పరిశీలించారు. అనంతరం తుఫానుతో తీవ్రంగా ప్రభావితమైన ఎంవీపీ కాలనీ, బీచ్ రోడ్డు, ఫిషింగ్ హార్బర్ ప్రాంతాలకు ఆయన చేరుకున్నారు. ప్రధాని నరేంద్రమోదీ వెంట ఆ పర్యటనలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్ గజపతిరాజు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదితరులు ఉన్నారు. ముందుగా తుఫాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన తర్వాత.. కలెక్టరేట్లో ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లతో ప్రధాని సమీక్ష జరుపుతారు. ఆ తర్వాత బయల్దేరి నేరుగా మళ్లీ ఢిల్లీ వెళ్తారు. -
ప్రధాని విశాఖ పర్యటనలో మార్పులు
హుదూద్ తుఫానుతో అల్లకల్లోలంగా మారిన విశాఖపట్నంలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రధాని ఇక్కడ ఏరియల్ సర్వే చేయబోవడంలేదని విశాఖ ఎంపీ, బీజేపీ ఏపీ అధ్యక్షుడు హరిబాబు తెలిపారు. ఢిల్లీలో బయల్దేరిన మోదీ.. మధ్యాహ్నం 1.15 గంటలకు విశాఖ వస్తారన్నారు. విమానాశ్రయంలో దిగిన తర్వాత ఆయన నేరుగా విశాఖ కలెక్టరేట్‌కు వస్తారని, కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించిన తర్వాత మళ్లీ మధ్యాహ్నం 3.20 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారని చెప్పారు. మధ్యాహ్నం 3.25 గంటలకు మోదీ విశాఖ నుంచి బయల్దేరి నేరుగా ఢిల్లీ వెళ్లిపోతారు. వాస్తవానికి అంతకుముందు నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం అయితే ఉత్తరాంధ్ర, ఒడిషా ప్రాంతాల్లో ప్రధాని ఏరియల్ సర్వే చేసి, తర్వాత ఇక్కడినుంచి కర్ణాటక వెళ్తారని కూడా చెప్పారు. అయితే, ఢిల్లీలో అత్యవసరపనులు ఉండటం, రేపు మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ కూడా ఉండటంతో పర్యటనలో మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. -
వారణాసికి 120 కిలోమీటర్ల దూరంలో తుఫాను
ఆంధ్రప్రదేశ్, ఒడిషాలలో తీవ్ర విధ్వంసాన్ని సృష్టించిన హుదూద్.. ఇప్పుడు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల పై ఆవరించింది. విశాఖపట్నంలో తీరాన్ని తాకిన తర్వాత బలహీనపడి వాయుగుండంగా మారిన హుదూద్.. అక్కడినుంచి పయనించి, ఇప్పుడు ఛత్తీస్‌గఢ్ చేరుకుంది. దాంతో పాటు మధ్యప్రదేశ్ మీద కూడా ఆవరించి ఉంది. మధ్యప్రదేశ్‌కు ఈశాన్యంగా, ఉత్తరప్రదేశ్‌కు తూర్పు దిశలో ఈ తుఫాను కదులుతోంది. ప్రస్తుతం వారణాసికి నైరుతి దిశలో 120 కిలోమీటర్ల దూరంలో హుదూద్ ఉన్నట్లు జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది.