హుదూద్ తుఫాను దెబ్బకు దారుణంగా దెబ్బతిన్న విశాఖపట్నం విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు శుక్రవారం ప్రారంభమైయ్యాయి.
విశాఖ : హుదూద్ తుఫాను దెబ్బకు దారుణంగా దెబ్బతిన్న విశాఖపట్నం విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు శుక్రవారం ప్రారంభమైయ్యాయి. ఇందు కోసం ఎయిర్పోర్ట్ అథారిటీ తాత్కాలికంగా విమానాశ్రయాన్ని సిద్ధం చేసింది. అయితే కొద్ది సంఖ్యలో మాత్రమే విశాఖ-హైదరాబాద్ మధ్య విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఎయిరిండియా విమాన సర్వీసులు నేటి నుంచి ప్రారంభం కాగా, ప్రయివేట్ విమాన సర్వీసులు శనివారం నుంచి తిరగనున్నాయి. నవంబర్ 1వ తేదీ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తాయి.
2009 ఫిబ్రవరిలో నిర్మించిన విమానాశ్రయ భవనం పైకప్పు బాగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. అయితే అదృష్టవశాత్తు రన్వే బాగుండటం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ కూడా మరీ ఎక్కువగా దెబ్బ తినకపోవడంతో విమానాలను తిప్పడానికి సమస్య లేదని విమానాశ్రయ అధికారులు తెలిపారు.