vizag airport
-
Allu Arjun Vizag Airport Photos: వైజాగ్‌లో బన్నీకి అదిరిపోయే రేంజులో వెల్కమ్ (ఫొటోలు)
-
జగన్ పై హత్యాయత్నం కేసులో ఈనాడు తప్పుడు రాతలు
-
దాడికి కుట్ర చేసిందెవరు ?..సందేహాస్పదంగా ఎన్ఐఏ అఫిడవిట్
-
ఎన్ఐఏ రిపోర్టు ఏంటి? ఎల్లో మీడియా రాసిన రాతలేంటి?
సాక్షి, శ్రీకాకుళం: విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌పై హత్యాహత్నం ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. దీనిపై ఎన్ఐఏ క్షుణ్నంగా విచారణ జరపాలన్నారు. ఈ ఘటనపై ఎల్లో మీడియా అసత్య రాతలు రాస్తోందని బొత్స మండిపడ్డారు. ఒక వ్యక్తే హత్యాహత్నం జరిపించుకున్నాడని రాయడం దారుణమన్నారు. ఎన్ఐఏ రిపోర్టు ఏంటి? మీరు రాసిన రాతలేంటి అని ఫైర్ అయ్యారు. ఎల్లో మీడియా తప్పుడు రాతలు, కూతలను తీవ్రంగా ఖండించారు. '2003లో అలిపిరిలో చంద్రబాబుపై హత్యాయత్నం నిజమేనా? సానుభూతి కోసమే చంద్రబాబు దాడి చేయించుకున్నారా? చంద్రబాబుకు ఉన్నఅలవాట్లు ఎవరికీ ఉండవు. ఈనాడు వార్తలు నీచమైనవి. విశాఖ ఎయిర్‌పోర్టు ఘటన నిందితుడు, ఆయన పనిచేస్తున్న సంస్థ తెలుగు దేశం మద్దతు దారుడు అవునా? కాదా? రాజకీయ స్వలాభం కోసం, డ్రామాల కోసం చంద్రబాబు మాట్లాడుతారు. నేను కూడా రాజకీయం కోసమే అని మీడియా ముసుగు తీసి రామోజీ రావు చెప్పాలి. 2014లో కూడా రామోజీ రావు ఇలాంటి పనులే చేశారు. దేవుడు అనేవాడు వున్నాడు కాబట్టే మేం గెలిచారు. ఎన్ఐఏ నివేదికలో జగనే దాడి చేయించుకున్నారని చెప్పిందా? ఏ ఆధారాలతో రాస్తారు?' అని బొత్స ధ్వజమెత్తారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంపై మాట్లాడుతూ.. 'విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది మా నినాదం. మేము ప్రైవేటీకరణకు వ్యతిరేకం. ప్రైవేటికరణ ఆపాలని ఢిల్లీలో మేము పోరాటం చేస్తున్నాం. బీఆర్ఎస్, జనసేన చేస్తున్నవి తప్పుడు ప్రచారాలు. రాష్ట్రం పట్ల, అభివృద్ధి పట్ల టీడీపీకి చిత్తశుద్ధి లేదు. అందుకే మేమే ఒంటరిగా పోరాటం చేస్తున్నాం. భావనపాడు పోర్ట్‌ను టీడీపీ ఎందుకు నిర్మించలేకపోయింది. మేం చేస్తున్న భావనపాడు పోర్ట్ నిర్మాణాన్ని టీడీపీ అడ్డుకుంటే పుట్టగతులు ఉండవ్.' అని బొత్స హెచ్చరించారు. చదవండి: చంద్రబాబుకు మంత్రి రోజా సవాల్.. -
విశాఖపట్నం ఎయిర్‌పోర్టు.. ప్రయాణికుల రద్దీతో కళకళ
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణికుల తాకిడి అధికమవుతోంది. ఈ ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగించే వారి సంఖ్య ఊపందుకుంటోంది. కోవిడ్ ప్రభావం నుంచి కోలుకుని మళ్లీ పూర్వపు స్థితికి చేరుకుంటోంది. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనివిధంగా ఈనెల 17న ఈ విమానాశ్రయం తొమ్మిది వేల మంది ప్రయాణికుల మైలు రాయిని అధిగమించింది. 2020 మార్చి నుంచి కోవిడ్ తొలి, మలి విడతలో తీవ్ర ప్రతాపం చూపింది. దీంతో దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. కోవిడ్ ఉధృతి తగ్గిన తర్వాత కూడా మునుపటి స్థాయిలో ప్రయాణికులు రాకపోకలు చేయడం లేదు. అందుకనుగుణంగా విమానయాన సంస్థలు కూడా తమ సర్వీసులను కుదించుకున్నాయి. కొన్ని నెలల నుంచి కోవిడ్ ప్రభావం తగ్గి, సాధారణ స్థాయికి వచ్చింది. దీంతో దాదాపు రెండున్నరేళ్ల అనంతరం ఈ విమానాశ్రయం ప్రయాణికుల రద్దీతో కళకళలాడుతోంది. నవంబర్ వరకు వీరి సంఖ్య రోజుకు 6,000–7,000 వరకు ఉండగా డిసెంబరు నుంచి అది మరింత పెరుగుతూ వస్తోంది. ఈ ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగించే చాలా విమానాలు కొన్నాళ్ల నుంచి నూరు శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. ఇలా ఈనెల ఆరంభం నుంచి రోజుకు 7000–9000 మంది ప్రయాణికుల సంఖ్య నమోదవుతోంది. శనివారం 9,183 మంది ఈ ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగించారు. వీరిలో దేశీయ ప్రయాణికులు 8,838 మంది, అంతర్జాతీయ ప్రయాణికులు 345 మంది ఉన్నారు. గత ఏడాది డిసెంబర్లో ఇదే సమయానికి ఒకే రోజు గరిష్టంగా ఎనిమిది వేల మంది ప్రయాణించారు. ఈ విమానాశ్రయం నుంచి సగటున రోజుకు 56 విమాన సర్వీసులు (రానుపోను) రాకపోకలు సాగిస్తున్నాయి. కోవిడ్ రెండో దశ తర్వాత ఈ విమానాశ్రయం నుంచి గత డిసెంబర్ నెల మొత్తమ్మీద 2.5 లక్షల మంది వెళ్లి వచ్చారు. అయితే 2022 జనవరి నుంచి ఒమిక్రాన్ బెడదతో మార్చి వరకు విమాన ప్రయాణాలు నెలకు సగటున ఆరేడు వేలతో రెండు లక్షలలోపే నమోదయ్యాయి. కోవిడ్‌కు ముందు ఇలా.. కోవిడ్‌కు ముందు 2018–19లో ఈ విమానాశ్రయం నుంచి 28 లక్షల మంది, 2019–20లో 27 లక్షల మంది, 2020–21లో 16 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు జరిపారు. ఈ ఏడాది వీరి సంఖ్య 23 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల తాకిడి కోవిడ్‌కు ముందు నాటి పరిస్థితికి వస్తుందని భావిస్తున్నట్టు విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం డైరెక్టర్ కె.శ్రీనివాసరావు ‘సాక్షి’కి చెప్పారు. దేశ, విదేశాల నుంచి విశాఖకు ఈ శీతాకాలం సీజనులో పర్యాటకులు అధికంగా వస్తుండడం, కోవిడ్ తీవ్రత తగ్గడం విమాన ప్రయాణికుల తాకిడి పెరగడానికి దోహదపడుతోందని ఆంధ్రప్రదేశ్ ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డీఎస్ వర్మ ‘సాక్షి’కి తెలిపారు. (క్లిక్ చేయండి: సాధారణ చార్జీలతోనే సంక్రాంతి బస్సులు) -
నోటికి వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదు.. మాటమార్చే తత్వానికి ఐకాన్ పవన్ కళ్యాణ్
-
అందరూ కలిసి వచ్చినా మేం రెడీ.. పవన్‌కు పేర్నినాని సవాల్
సాక్షి, అమరావతి: జనసేన రౌడీలు ఎయిర్‌పోర్టులో బీభత్సం సృష్టించారని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కార్యకర్తల దాడిపై పవన్ కల్యాణ్ ఎందుకు స్పందిచలేదని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ మాటలు, నీటి మీద రాతలు ఒకటేనని అన్నారు. మాటమార్చే తత్వానికి పవన్‌ను ఐకాన్‌గా చూపించవచ్చని ఎద్దేవా చేశారు. విశాఖ గర్జనను జేఏసీ నిర్వహించిందని, ఆ విషయం కూడా పవన్‌కు తెలీదా అని నిలదీశారు. కర్రలతో రౌడీయిజం చేస్తారా అని మండిపడ్డారు. ‘జనసేన అల్లరి మూకలు మంత్రులపై దాడి చేశాయి. మహిళ మంత్రిని పట్టుకొని అసభ్యంగా తిట్టారు. దళిత మంత్రిపై చెప్పులేస్తారా?. పచ్చి బూతులు తిడతారా.. పవన్ ర్యాలీ కారణంగా రోడ్ల మీద జనాలు ఇబ్బంది పడుతున్నారని చెబితే తప్పా?. అడ్డదిడ్డంగా వాగుతూ.. విధానపరమైన విమర్శ మాత్రమే చేస్తున్నా అంటారా. పూటకో మాట, నెలకోమాట తత్వం మీది. ఒళ్లు మరిచి మాట్లాడటం విధానపరమైన విమర్శలా. నోరుందని ఏదైనా మాట్లాతే సహించేది లేదు. మంత్రులపై దాడి చేస్తే పోలీసులు చర్యలు తీసుకోరా.. జనసేన రైడీలు ఏం చేసిన చూస్తూ ఊరుకోవాలా. ఉద్దేశపూర్వకంగానే విశాఖలో రచ్చ చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల గొంతు నొక్కేందుకు ప్రయత్నించారు. చంద్రబాబు, పవన్, బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు అందరూ కలిసి వచ్చినా.. మేం రెడీ. మీరందరూ కలిసి పోటీ చేసినా విజయం మాదే. ’ అని పేర్ని నాని వ్యాఖ్యానించారు. చదవండి: మూడు కాకపోతే ముప్పయ్ పెళ్లిళ్లు చేసుకో.. పవన్‌పై పేర్ని నాని స్ట్రాంగ్ కామెంట్స్ -
పవన్ కల్యాణ్ కు పోలిసుల నోటీసులు
-
ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు : మంత్రి జోగి రమేష్
-
మేము కన్నెర్ర చేస్తే జనసైనికులు రోడ్లపై తిరగలేరు : మంత్రి రోజా
-
జన సైకోలు.. ప్లాన్ ప్రకారమే మంత్రులపై దాడి
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: విశాఖ ఎయిర్‌పోర్టు వద్ద జనసేన కార్యకర్తలు వీరంగంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యే, నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎయిర్‌పోర్టు దగ్గర మంత్రుల కార్లపై జనసేన కార్యకర్తల దాడిని ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పవన్ కల్యాణ్ తక్షణమే స్పందించి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అసలేం జరిగిందంటే.. విశాఖ ఎయిర్‌పోర్టు వద్ద గర్జన సభ నుంచి ఒకే కారులో ఎయిర్‌పోర్టు వెళ్తున్న వైవీ సుబ్బారెడ్డి, జోగి రమేష్‌పై జనసేన కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. కర్రలు, రాళ్లతో దాడి చేశారు. మంత్రి రోజా సహాయకుడికి, జోగిరమేష్ అనుచరులకు గాయాలయ్యాయి. జనసేన కార్యకర్తల విధ్వంసంతో ఎయిర్‌పోర్టులోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. జనసేన చిల్లర రాజకీయాలు చేస్తోంది. గర్జనకు వచ్చిన స్పందనను చూసి ఓర్వలేకపోతున్నారు. పిల్ల సేనలు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు. పవన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మేం కన్నెర్ర చేస్తే.. మీరు రోడ్లపై తిరగలేరు. -మంత్రి ఆర్కే రోజా జనసేన కార్యకర్తలు అల్లరి మూకల్లా ప్రవర్తించారు. జనసేనకు విధి విధానమంటూ లేదు. -వైవీ సుబ్బారెడ్డి ఎయిర్‌పోర్టు వద్ద జరిగిన దాడి ఉన్మాద చర్య.. ఇది రాజకీయ పార్టీనా.. రౌడీ మూకనా?. విశాఖ గర్జన ప్రశాంతంగా జరిగింది. గర్జనకు భారీగా ప్రజలు తరలివచ్చారు. భారీ వర్షాన్ని కూడా జనం లెక్కచేయలేదు. గర్జనకు వచ్చిన స్పందన చూసి ఓర్వలేకపోతున్నారు. మంత్రులపై దాడి కాదు.. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలపై దాడి. దాడిని పవన్ సమర్థిస్తున్నారా?. జనసేనకు లక్ష్యం, సిద్దాంతమంటూ ఏమీ లేదు. జనసేన కార్యకర్తలది సైకో చర్య. -స్పీకర్ తమ్మినేని సీతారాం. చదవండి: ‘జనసేన’ సైకో చర్య.. దాడి ఘటనపై మంత్రి జోగి రమేష్ హెచ్చరిక జన సైనికులుకాదు.. జన సైకోలు.. ఎయిర్‌పోర్టు వద్ద దాడి ఘటనకు పవన్ బాధ్యత వహించాలి. మంత్రులపై కావాలనే దాడి చేశారు. పథకం ప్రకారమే మంత్రులపై దాడులు జరిగాయి. దాడి ఘటనకు బాధ్యత వహించి పవన్ క్షమాపణ చెప్పాలి. గర్జనను పక్కదారి పట్టించేందుకే కుట్రలు. దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.. -మంత్రి గుడివాడ అమర్నాథ్ వీధి రౌడీల్లా దాడికి పాల్పడ్డారు. జనసేన కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. విశాఖ గర్జన విజయవంతం కావడం తట్టుకోలేకపోతున్నారు. ప్రజల నుంచి మద్దతు లేకపోవడంతో మంత్రులపై దాడి చేశారు. ఏదో రకంగా ప్రభుత్వంపై బురదజల్లాలనేది వారి లక్ష్యం. మీడియా ముందు హల్చల్ చేయాలని చూస్తున్నారు. మంత్రులపై దాడి ఘటనకు పవన్ బాధ్యత వహించాలి. జనసేన కార్యకర్తల దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నాం. -హోంమంత్రి తానేటి వనిత జన సైనికులా.. సైకోలా? అసూయా ద్వేషాలకు ప్రతిరూపాలుగా ప్రవర్తిస్తున్న వపన్ కళ్యాణ్ అభిమనులని చెప్పుకునే ఉన్మాదుల దుశ్చర్యలు రోజురోజుకూ హద్దుమీరి పోతున్నాయి. విశాఖలో వైఎస్సార్ సీపీ నాయకుల మీద దాడి హేయమైనది. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలి. -మంత్రి వేణు గోపాల కృష్ణ చెల్లుబోయిన జనసైనికులా? సైకో లా?? అసూయా ద్వేషాలకు ప్రతిరూపాలుగా ప్రవర్తిస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులని చెప్పుకునే ఉన్మాదుల దుశ్చర్యలు రోజురోజుకూ హద్దుమీరి పోతున్నాయి. విశాఖ లో వైఎస్సార్సీపీ నాయకుల మీద దాడి హేయమైనది. దీనిని నేను తీవ్రం గా ఖండిస్తున్నాను. పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. — VenuGopalaKrishna Chelluboina (@chelluboinavenu) October 15, 2022 ఆవు చెన్లో మేస్తే దూడ గట్టున మేస్తుందా?. ఈ పవన్ కల్యాణ్ కనీసం ఒక చోటైనా గెలిచి ఉంటే క్రమశిక్షణ, విలువలు తెలిసుండేది. ఇతనికే క్రమశిక్షణ లేనప్పుడు ఇక ఇతని అభిమానులకు ఉంటుందా? ఎయిర్ పోర్టు దగ్గర జరిగిన ఘటనకు బాధ్యత వహించి పవన్ తక్షణమే సమాధానం చెప్పాలి. -మంత్రి నారాయణ స్వామి ఆవు చెన్లో మేస్తే దూడ గట్టున మేస్తుందా? ఈ @PawanKalyan కనీసం ఒక చోటైనా గెలిచి ఉంటే క్రమశిక్షణ, విలువలు తెలిసుండేది. ఇతనికే క్రమశిక్షణ లేనప్పుడు ఇక ఇతని అభిమానులకు ఉంటుందా? ఎయిర్ పోర్టు దగ్గర ఘటనకు బాధ్యత వహించి పవన్ తక్షణమే క్షమాపణ చెప్పాలి#JanaSenaGoons pic.twitter.com/qp0pVCpJFQ — Narayanaswamy Kalathuru (@NSwamy_Official) October 15, 2022 మొన్న కోనసీమ జిల్లాలో మంత్రి ఇంటిపై దాడికి తెగబడ్డారు. నేడు విశాఖలో అల్లర్లు సృష్టిస్తున్నారు. తమ ఓపికకు ఒక హద్దు ఉంటుంది. అయినా బాధ్యతాయుతమైన అధికార పార్టీగా సంయమనంతో, ఓపికతో ముందుకుపోతున్నాం. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఏమాత్రం చోటులేదు. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి.2/2 — Malladi Vishnu (@malladiysrcp) October 15, 2022 I strongly condemn the attack by @JanaSenaParty goons on @yvsubbareddymp garu, @JogiRameshYSRCP garu & @RojaSelvamaniRK garu in Vizag. This incident clearly Shows the true character of Janasena party today. Such misdemeanour acts are against to democratic values in the country. pic.twitter.com/okztqTdx23 — Maddila Gurumoorthy (@GuruMYSRCP) October 15, 2022 -
జనసేన రాజకీయ పార్టీనా .. రౌడీ మూకనా : స్పీకర్ తమ్మినేని సీతారాం
-
‘జనసేన’ సైకో చర్య.. దాడి ఘటనపై మంత్రి జోగి రమేష్ హెచ్చరిక
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఎయిర్‌పోర్టు వద్ద తనపై దాడి జరిగిందని మంత్రి జోగి రమేష్ తెలిపారు. కర్రలు, రాళ్లతో దాడికి దిగారని, ఈ ఘటనలో తమ వాళ్లకు గాయాలయ్యాయని పేర్కొన్నారు. కాగా విశాఖ ఎయిర్‌పోర్టు వద్ద జనసేన కార్యకర్తలు వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే. గర్జన సభ నుంచి ఎయిర్‌పోర్టు వెళ్తుండగా వైవీ సుబ్బారెడ్డి, జోగి రమేష్ కార్లపై దాడికి తెగబడ్డారు. కర్రలు, రాళ్లతో దాడి చేశారు. జనసేన కార్యకర్తల విధ్వంసంతో ఎయిర్‌పోర్టులోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. జనసేన కార్యకర్త దాడిలో మంత్రి జోగి రమేష్ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. మంత్రి రోజా సహాయకుడితోపాటు పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై మంత్రి జోగి స్పందిస్తూ.. గర్జనను పక్కదారి పట్టించేందుకే తాగుబోతులతో దాడులు జరిపించారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదని హెచ్చరించారు. తమతో పెట్టుకుంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్రంలో తిరగలేడని ధ్వజమెత్తారు. సంబంధిత వార్త: విశాఖ ఎయిర్‌పోర్టు వద్ద జనసేన కార్యకర్తల వీరంగం.. పవన్ సమాధానం చెప్పాలి వైవీ సుబ్బారెడ్డి, జోగి రమేష్‌లపై విశాఖ ఎయిర్‌పోర్టులో జనసైనికుల దాడిపై తక్షణమే పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలని మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. వైజాగ్ ఎయిర్‌పోర్టులు మంత్రులు రోజా, జోగి రమేష్ టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఒక్క ఎమ్మెల్యే లేకపోతేనే ఎంత దౌర్జన్యం చేస్తే.. ఐదారు సీట్లు గెలిస్తే ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తారోనని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి సంబంధించిన విజువల్స్, ఫోటోలు ఉన్నాయని.. దాడి చేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. వై వి సుబ్బారెడ్డి,జోగి రమేష్ లపై విశాఖ ఎయిర్‌పోర్టులో జనసైనికుల దాడిపై తక్షణమే పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి!— Ambati Rambabu (@AmbatiRambabu) October 15, 2022 గర్జనను పక్కదారి పట్టించేందుకే గర్జనను పక్కదారి పట్టించేందుకే జనసేన దాడులు చేసిందని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మండిపడ్డారు. వందమంది రౌడీలతో దాడులు చేశారని తెలిపారు. జనసేన చిల్లర రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పవన్ కల్యాణ్ రౌడీయిజం చేస్తున్నాడా? దాడి ఘటనపై పవన్ తక్షణమే సమాధానం చెప్పాలి. మీకు వందమంది ఉంటే.. మాకు పదివేల మంది ఉన్నారు. పవన్ పిచ్చి వేషాలు వేస్తే చీరెస్తాం’ -ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ -
విశాఖ ఎయిర్‌పోర్టు వద్ద జనసేన కార్యకర్తల వీరంగం..
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం ఎయిర్‌పోర్టు వద్ద జనసేన కార్యకర్తలు వీరంగం సృష్టించారు. కర్రలు, రాళ్లతో దాడులకు తెగబడ్డారు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు రోజా, జోగి రమేష్ కార్లపై దాడులకు దిగి అద్దాలు ధ్వంసం చేశారు. జనసేన కార్యకర్తల తీరుతో ఎయిర్‌పోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గర్జన సభ నుంచి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తుండగా జనసేన కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. మంత్రి రోజా సహాయకుడికి గాయాలయ్యాయి. జనసేన కార్యకర్తలు తనపై రాళ్లు, కర్రలతో దాడి చేశారని, ఈ ఘటనలో తమవారికి గాయాలయ్యాయని జోగి రమేశ్ పేర్కొన్నారు. తన కారు అద్దాలు ధ్వంసమైనట్లు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదన్నారు. గర్జనను పక్కదారి పట్టించేందుకే తాగుబోతులతో తమపై దాడులు చేయించారని ధ్వజమెత్తారు. మాతో పెట్టుకుంటే పవన్ కల్యాణ్ రాష్ట్రంలో తిరగలేరని హెచ్చరించారు. చదవండి: జన సంద్రాన్ని తలపించిన ‘ విశాఖ గర్జన’ -
Vizag Airport: రెక్కలు విచ్చుకున్న విశాఖ విహంగం
ఏపీలో అతి పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయంగా గుర్తింపు పొందిన విశాఖ ఎయిర్‌పోర్టు విస్తరణ పనులు జోరుగా సాగుతున్నాయి. ఓవైపు అంతర్జాతీయ విమానాశ్రయంగా పౌర విమానాలు రాకపోకలు సాగిస్తుండగా.. మరోవైపు నేవల్ కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగానూ ఎయిర్‌పోర్టు సేవలందిస్తోంది. సేవలు విస్తరించేందుకు సరికొత్త ఆలోచనలు అమలు చేస్తున్న ఎయిర్‌పోర్టు.. మరో ఆరు పార్కింగ్ బేస్‌ల నిర్మాణం పూర్తి చేసింది. త్వరలోనే వీటిని ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం.. ఇండియన్ నేవీ విమానాశ్రయం ఐఎన్ఎస్ డేగాలో పౌర విమానయాన సేవలందిస్తోంది. మొత్తం 349.39 ఎకరాల విస్తీర్ణంలో విమానాశ్రయం విస్తరించి ఉంది. దేశంలో ఎక్కడా లేని ఒక ప్రత్యేకమైన గుర్తింపు విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉంది. సాధారణంగా దాదాపు ప్రతి విమానాశ్రయంలోనూ రన్‌వేకు రెండు వైపుల నుంచి టేకాఫ్, ల్యాండింగ్స్ జరుగుతుంటాయి. కానీ విశాఖలో మాత్రం విమానాశ్రయానికి ఓవైపు పెద్ద కొండ ఉండటం వల్ల ఒకవైపు నుంచి మాత్రమే రాకపోకలు సాగుతున్నాయి. 1981లో రోజుకు ఒక విమానం ద్వారా ప్రారంభమైన పౌర సేవలు ప్రస్తుతం సుమారు 70 వరకు చేరుకున్నాయి. అయితే కోవిడ్ కారణంగా కేవలం 14 సర్వీసులు మాత్రమే ప్రస్తుతం నడుస్తున్నాయి. భవిష్యత్తులో రాకపోకలు పెంచేందుకు విస్తరణ పనులు చేపట్టారు. ఏక కాలంలో 16 విమానాల రాకపోకలు బ్రిటిష్ కాలంలో 4 పార్కింగ్ బేస్ ఉండేవి. తరువాత మరో 6 పార్కింగ్ బేస్‌లు నిర్మించారు. గతంలో ఉండే రన్‌వే వినియోగించే అవకాశం లేదు. ఇప్పుడు ఒకే రన్‌వే ఉంది. దాన్ని నేవీతో సంయుక్తంగా వినియోగిస్తున్నారు. రన్‌వేపై వెళ్లేందుకు ఎవరికీ అనుమతి లేదు. నేవీ టవర్ కంట్రోల్ రూమ్‌తో రన్‌వేను అనుసంధానం చేశారు. ఎవరైనా రన్‌వే పైకి వెళ్లాలంటే రక్షణ దళ అనుమతి తప్పనిసరి. యాప్రాన్, హ్యాంగర్స్, టెర్మినల్‌కు రన్‌వేలో ఉన్న విమానంతో అనుసంధానమయ్యేలా ఉండే ట్యాక్సీ వేలు కూడా నేవీ భాగంలోనే ఉన్నాయి. అందుకే ప్రత్యేకంగా మరో కొత్త ట్యాక్సీ ట్రాక్ నిర్మించారు. దీనికితోడు తాజాగా మరో ఆరు పార్కింగ్ బేస్‌ల నిర్మాణం కూడా పూర్తయింది. ఇవి త్వరలోనే ప్రారంభించనున్నారు. ఇవి కూడా అందుబాటులోకి వస్తే మొత్తం 16 విమానాలు ఏక కాలంలో రాకపోకలు సాగించే అవకాశాలున్నాయి. పరిమితి పెంచేందుకు ప్రయత్నాలు అంతర్జాతీయ స్థాయి సదస్సులకు వేదికగా విశాఖ నిలుస్తోంది. దీనికితోడు రాష్ట్ర కార్యనిర్వాహక రాజ«ధానిగా కొత్త రూపుదాల్చనుంది. దీనికితోడు కొత్త రైల్వే జోన్, పోర్టులు, జలరవాణా, జాతీయ రహదారులు ఇలా విశిష్ట సామర్థ్యమున్న విశాఖకు కాలానుగుణంగా కనెక్టివిటీ పెరగాల్సి ఉంది. అయితే నేవీ ఇచ్చిన స్లాట్స్ ప్రకారం 85 విమానాల కంటే ఎక్కువ నడపలేని పరిస్థితి ఉంది. ఈ స్లాట్ పెరగాలంటే.. లిమిటేషన్ పెంచాలి. అది పెరగాలంటే రన్‌వే హ్యాండ్లింగ్ కెపాసిటీ పెంచాలి, ఆక్యుపేషన్ టైమ్ తగ్గించాలి. రన్‌వే ఎఫిషియన్సీ పెంచాలి. ఇది పెరిగితే ప్రస్తుతం ఉన్న గంటకు 10 రాకపోకల స్లాట్‌లో పాసింజర్ విమానాల సామర్థ్యం 16కి పెరుగుతుంది. రన్‌వే హ్యాండ్లింగ్ పెరిగి, ఆక్యుపేషన్సీ తగ్గి 50 శాతం పెరిగితే ప్రస్తుతం ఉన్న 85 విమానాల రాకపోకల కెపాసిటీ 123కు చేరుకుంటుంది. దీనివల్ల ఇతర ప్రాంతాలకూ కనెక్టివిటీ ఫ్లైట్స్ పెరుగుతుంది. అప్పుడు ఇతర నగరాలకు రాకపోకలు విస్తరించవచ్చు. డిమాండ్ ఉన్న సమయాల్లో మరిన్ని ఫ్లైట్స్‌కు స్లాట్స్ కేటాయించవచ్చు. ట్యాక్సీ ట్రాక్‌ల పెంచినప్పుడు ల్యాండింగ్ అయ్యే విమానాలు.. వెంట వెంటనే వచ్చి వెళ్లిపోయే అవకాశముంది. దీని వల్ల రన్‌వేపై ఆక్యుపెన్సీ టైమ్ తగ్గుతుంది. దీనివల్ల స్లాట్ సామర్థ్యం మరింత పెరిగి పాసింజర్ ఫ్లైట్స్ పెరగవచ్చు. కొత్త ట్యాక్సీట్రాక్ నిర్మాణం పూర్తి కావడంతో దీనికి మార్గం సుగమమైంది. సమగ్రాభివృద్ధి దిశగా అడుగులేస్తున్నాం.. విశాఖ విమానాశ్రయ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాం. దీనికి సంబంధించిన ప్లాన్స్ సిద్ధమయ్యాయి. కీలక అడుగులకు సంబంధించిన చర్చలు కూడా జరిగాయి. వాణిజ్య కేంద్రంగా విశాఖ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో టైర్–2, టైర్–3 టైర్–4 దేశీయ ఎయిర్‌పోర్టులకు కనెక్టివిటీ కోసం ఫ్లైట్స్ నడిపేలా చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. కోవిడ్ భయం పూర్తిగా తొలగిపోయాక.. అత్యధిక ఫ్లైట్స్ నడిపేందుకు సన్నద్ధమవుతాం. దీనికి తోడు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్తో పాటు కార్గో సేవలు విస్తరించేందుకు చెయ్యాల్సిన అభివృద్ధిపై ప్రస్తుతం దృష్టి సారించాం. కొత్తగా నిర్మించిన పార్కింగ్ బేస్‌లు, ట్యాక్సీ ట్రాక్లని త్వరలోనే ప్రారంభిస్తాం. ఎయిర్లెన్స్తో పాటు నేవీ నుంచ తేదీ ఖరారు చేసిన తర్వాత వీటిని అందుబాటులోకి తీసుకొస్తాం. – రాజాకిశోర్, విశాఖ ఎయిర్‌పోర్టు డైరెక్టర్ -
హమ్మయ్యా.. మనోళ్లు వచ్చేశారు
సాక్షి, విశాఖపట్నం : కరోనావైరస్ కారణంతో మలేసియా రాజధాని కౌలాలంపూర్ విమానాశ్రయంలో చిక్కుకుపోయి తీవ్ర అవస్థలు పడుతున్న తెలుగు విద్యార్థులను ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవతో తెలుగు విద్యార్థులు విశాఖపట్నంకు చేరుకున్నారు. కౌలాలంపూర్ నుంచి 186 మంది విద్యార్థులతో వచ్చిన ప్రత్యేక విమానం బుధవారం సాయంత్రం విశాఖకు చేరుకుంది. కోవిడ్–19 వల్ల ఫిలిప్పీన్స్ దేశంలోని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో అక్కడ చదువుతున్న తెలుగు విద్యార్థులు సొంతూళ్లకు బయల్దేరారు. ఈ నేపథ్యంలో మలేషియాకు చేరుకున్న తెలుగు విద్యార్థులు స్వదేశానికి రావడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న ఏపీ ప్రభుత్వం.. విద్యార్థులను క్షేమంగా తీసుకువచ్చేందుకు చర్యలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి హుటాహుటిన కేంద్ర విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్‌ను సంప్రదించారు. విద్యార్థులందరినీ తీసుకువచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లుచేయాలని విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేయడంతో కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. కౌలాలంపూర్ నుంచి విశాఖపట్నం, ఢిల్లీకి ఎయిర్ ఏషియా విమానాలు నడిపేందుకు ఆయన అనుమతించారు. దీంతో తెలుగు విద్యార్థులు క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు. (చదవండి : కరోనా ఎఫెక్ట్: 7 ప్రత్యేక రైళ్ల సేవలు రద్దు) ప్రయాణికులందరికీ థర్మల్ స్క్రీనింగ్ తెలుగు విద్యార్థులు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులందరికి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. ప్రయాణికులను పరిక్షీంచేందుకు ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసింది. కరోనా లక్షణాలు ఉన్నవారిని విశాఖ చెస్ట్ ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ చెస్ట్ ఆస్పత్రిలో ఇప్పటికే 100 పడకలను సిద్ధం చేశారు. 50మంది వైద్యులను నియమించారు. విదేశాల నుంచి వచ్చే వారిని విమ్స్‌లోని ఐసోలేషన్ వార్డులకి తరలించేందుకు ఐదు అంబులెన్స్‌లను సిద్ధం చేశారు. ఏ లక్షణాలు లేకున్నా 14 రోజుల పాటు ఇంట్లోనే క్వారంటైన్లో ఉంచనున్నారు. ప్రయాణికులను స్వస్థలాలకు చేర్చడానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. -
కరోనా చైనా టు ఇండియా
-
వైజాగ్ ఎయిర్పోర్ట్ మూసివేయం: ఏఏఐ
హైదరాబాద్: విశాఖపట్నం విమానాశ్రయాన్ని మూసివేసే ఉద్ధేశం లేదని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) స్పష్టం చేసింది. కొత్తగా నిర్మించనున్న భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే విశాఖ ఎయిర్‌పోర్టును మూసివేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ‘వైజాగ్ ఎయిర్‌పోర్టు కొనసాగుతుంది. ఈ విషయాన్ని మా మంత్రి పార్లమెంటులో స్పష్టం చేశారు కూడా. మూసివేత విషయమై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన వచ్చింది. దీనికి మేం స్పందించలేదు. దీనికి కారణం ఈ ప్రతిపాదనను మేం పరిగణలోకి తీసుకోవడం లేదు’ అని ఏఏఐ ఫైనాన్స్ సభ్యులు ఎస్.సురేశ్ వ్యాఖ్యానించారు. ఏఏఐతో తాము చర్చిస్తున్నట్టు ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ తెలిపారు. వైజాగ్ ఎయిర్‌పోర్టులో చేసిన పెట్టుబడిని భర్తీ చేయాలని ఏఏఐ కోరిందని చెప్పారు. ఈ విషయాన్ని తేల్చాల్సిందిగా ఏఏఐ చెబుతోందన్నారు. ఎంత పెట్టుబడి పెట్టారో తెలపాలని, ఆ మొత్తాన్ని తాము చెల్లిస్తామంటూ లేఖ రాశామని ఆయన వివరించారు. ప్రస్తుతమున్న విమానాశ్రయం వైజాగ్ సిటీకి సమీపంలో ఉంది. వైజాగ్ సిటీ నుంచి 45 కిలోమీటర్ల దూరంలో భోగాపురం ఉంది. -
ఎన్ఐఏకు సిట్ సహాయ నిరాకరణ
సాక్షి, అమరావతి బ్యూరో, విజయవాడ లీగల్: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం కేసు విచారణకు సంబంధించి రాష్ట్ర పోలీసులు, సిట్ అధికారులు తమకు ఏమాత్రం సహకరించడం లేదని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) న్యాయస్థానం దృష్టికి తెచ్చింది. ఈ మేరకు ఎన్ఐఏ తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గురువారం విజయవాడ ఎన్ఐఏ న్యాయస్థానంలో మెమో దాఖలు చేశారు. వాదనలను విన్న అనంతరం దీనిపై విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. వైఎస్ జగన్‌పై గత ఏడాది అక్టోబరు 25న జరిగిన హత్యాయత్నం తీవ్ర సంచలనం సృష్టించింది. ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే సీఎం చంద్రబాబు, డీజీపీ ఠాకూర్లు స్పందిస్తూ కేసును తప్పుదారి పట్టించేలా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ కేసు విచారణను స్వతంత్ర దర్యాప్తు సంస్థలతో నిర్వహించేలా ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్సీపీ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం తెలిసిందే. అనంతరం ఈ కేసుపై విచారణను ఎన్ఐఏకు అప్పగిస్తూ ఉత్తర్వులిచ్చినట్లు కేంద్ర హోం శాఖ న్యాయస్థానానికి నివేదించింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు చేపట్టిన విచారణకు సంబంధించిన రికార్డులు, మెటీరియల్, వస్తువులను ఎన్ఐఏకు అప్పగించాలని విశాఖ పోలీసులను కోర్టు ఆదేశించింది. అయితే విశాఖ పోలీసులు కేసుకు సంబంధించిన రికార్డులను ఇంతవరకు తమకు అప్పగించకుండా సహాయ నిరాకరణ చేయడంపై ఎన్ఐఏ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. విశాఖ పోలీసులు కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ తమకు కేసు రికార్డులు, మెటీరియల్, ఆబ్జెక్ట్స్అందించడం లేదని పేర్కొంది. 23లోగా చార్జిషీట్ దాఖలు చేయకుంటే నిందితుడికి బెయిల్! విశాఖ పోలీసు అధికారులు నిందితుడు శ్రీనివాసరావుకు సహకరిస్తున్నారని, తమ విచారణకు మాత్రం సహకరించడం లేదని ఎన్ఐఏ స్పష్టం చేసింది. ఈ కేసులో 90 రోజుల్లోగా అంటే ఈ నెల 23లోగా తాము చార్జ్‌షీట్ దాఖలు చేయాల్సి ఉందని, లేదంటే నిందితుడు శ్రీనివాసరావు బెయిల్‌పై బయటకు వచ్చే అవకాశం ఉందని ఎన్ఐఏ న్యాయస్థానానికి నివేదించింది. ఈ కేసులో తాము ఎఫ్ఐఆర్ దాఖలు చేసి చాలా రోజులైనా రాష్ట్ర పోలీసు అధికారులు విచారణకు ఏ మాత్రం సహకరించడం లేదని తెలిపింది. రికార్డులు లేకుండా చార్జ్‌షీట్ దాఖలు చేయలేమని కోర్టు దృష్టికి తెచ్చింది. కేసుకు సంబంధించిన రికార్డులు, మెటీరియల్, ఆబ్జెక్ట్లను తమకు అప్పగించేలా విశాఖ పోలీసులను ఆదేశించాలని ఎన్ఐఏ తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ న్యాయస్థానాన్ని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఈ కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. మరోవైపు వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు కస్టడీ శుక్రవారంతో ముగియనున్న నేపథ్యంలో నేడు కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉన్నట్లు తెలిసింది. తదుపరి విచారణ నిమిత్తం నిందితుడిని మరో వారం రోజులు పాటు తమ కస్టడీకి అప్పగించాలని ఎన్ఐఏ కోరే అవకాశం ఉంది. కుట్ర కోణం వెలుగులోకి వస్తోందనే... ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలే సూత్రధారులని స్పష్టమవుతోంది. ఈ హత్యాయత్నం కేసులో కుట్ర కోణం వెలుగులోకి వస్తే తమ బండారం బట్టబయలవుతుందని బెంబేలెత్తుతూ రాష్ట్ర పోలీసుల ద్వారా కేసు విచారణను తప్పుదారి పట్టిస్తున్నారు. కోర్టు ఆదేశాలతో ఎన్ఐఏ ఈ కేసు విచారణను చేపట్టడంతో సహాయ నిరాకరణ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేస్తూ రాజ్యాంగ సూత్రాలను కాలరాస్తూ రాష్ట్ర ప్రభుత్వం బరితెగించడం విస్మయపరుస్తోంది. సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసు విచారణను కేంద్ర ప్రభుత్వ సంస్థలు చేపడితే తమ కుట్ర బట్టబయలవుతుందని ప్రభుత్వ పెద్దలు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలోనే సీబీఐ విచారణకు అనుమతిస్తూ గతంలో ఇచ్చిన అనుమతిని రాష్ట్ర ప్రభుత్వం హఠాత్తుగా ఉపసంహరించుకుంది. ఈమేరకు 2018 నవంబరు 8న ప్రత్యేక జీవో జారీ చేసింది. జగన్‌పై హత్యాయత్నం కేసు విచారణను సీబీఐ చేపట్టకుండా అడ్డుకునేందుకే హడావుడిగా ఈ జీవో ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. ‘ఎన్ఐఏ’పై సహాయ నిరాకరణ అస్త్రం న్యాయస్థానం ఆదేశాలతో జగన్‌పై హత్యాయత్నం కేసును విచారిస్తున్న ఎన్ఐఏను సైతం సీఎం చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించడం న్యాయ నిపుణులను విస్మయపరిచింది. ఎన్ఐఏ విచారణను వ్యతిరేకిస్తూ చంద్రబాబు ప్రధాని మోదీకి లేఖ రాయడంపై జాతీయ స్థాయిలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ హత్యాయత్నం సూత్రధారులను రాష్ట్ర ప్రభుత్వం రక్షించేందుకు యత్నిస్తోందన్నది దీనిద్వారా మరింతగా ప్రస్పుటమైంది. రాష్ట్ర పోలీసుల సహాయ నిరాకరణపై ఎన్ఐఏ తాజాగా న్యాయస్థానంలో మెమో దాఖలు చేయడం గమనార్హం. రికార్డులను తారుమారు చేసే అవకాశం? న్యాయస్థానం ఆదేశించిన తరువాత నిబంధనల ప్రకారం జగన్‌పై హత్యాయత్నం కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను రాష్ట్ర పోలీసులు ఎన్ఐఏకు అప్పగించాలి. కానీ విశాఖపట్నం పోలీసులు ఇంతవరకు ఆ పని చేయకపోవడం విస్మయపరుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే ఇలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ రికార్డులను తారుమారు చేసే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. బెయిల్‌పై తరలించి మట్టుబెట్టే కుట్ర? వైఎస్ జగన్‌పై హత్యాయత్నం ఘటన జరిగిన వెంటనే కేసు విచారణ చేపట్టిన విశాఖపట్నం పోలీసులు ఉద్దేశపూర్వకంగానే రెండు నెలలు దాటినప్పటికీ చార్జ్‌షీట్ దాఖలు చేయలేదు. మరోవైపు ఈనెల 9న విచారణ చేపట్టిన ఎన్ఐఏకు రికార్డులు అందించకుండా సహాయ నిరాకరణ చేస్తున్నారు. దీంతో ఎన్ఐఏ చార్జిషీట్ దాఖలు చేయడంలో జాప్యం జరుగుతోంది. ఈ నెల 23 వరకు ఇలాగే వ్యవహరించి నిందితుడు శ్రీనివాసరావుకు బెయిల్ వచ్చేలా చూడాలన్నది ప్రభుత్వ పెద్దల వ్యూహంగా ఉంది. బెయిల్‌పై శ్రీనివాసరావు బయటకు వస్తే తరువాత ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో అంతు చిక్కకుండా ఉంది. తన ప్రాణాలకు ముప్పు ఉందని ఇప్పటికే నిందితుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం తెలిసిందే. భద్రత లేని బాహ్య ప్రపంచంలోకి శ్రీనివాసరావును తరలించి మట్టుబెట్టేందుకు కుట్ర పన్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్ఐఏ దర్యాప్తుపై హైకోర్టుకు సర్కారు! సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణకు ఆదేశిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను న్యాయస్థానంలో సవాల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్ఐఏ దర్యాప్తుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు అంతా సిద్ధం చేసింది. ప్రస్తుతం హైకోర్టుకు సంక్రాంతి సెలవులు కావడంతో శుక్రవారం లేదా శనివారం హౌస్‌మోషన్ (న్యాయమూర్తి ఇంటి వద్ద విచారణ జరపడం) రూపంలో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. హౌస్‌మోషన్ రూపంలో అత్యవసరంగా విచారణ జరిపేందుకు హైకోర్టు నిరాకరిస్తే సోమవారం కోర్టు పునఃప్రారంభమయ్యాక ఈ వ్యవహారంపై వాదనలు వినాలని అభ్యర్థించనుంది. హౌస్‌మోషన్ రూపంలో ఈ వ్యాజ్యంపై విచారణ జరిపే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ఏపీ హైకోర్టు న్యాయమూర్తులంతా శనివారం లేదా ఆదివారం అమరావతి చేరుకునే వీలుంది. ఎన్ఐఏ తన దర్యాప్తును ఎప్పుడో ప్రారంభించినందున హౌస్‌మోషన్ రూపంలో విచారణ జరిపే అవకాశాలు తక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. సీఎంతో డీజీపీ ఠాకూర్ భేటీ ఎన్ఐఏ దర్యాప్తుపై సీఎం చంద్రబాబు గురువారం డీజీపీ ఠాకూర్‌తో ప్రత్యేకంగా సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. ఎన్ఐఏ విచారణను వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖ రాసినా ప్రయోజనం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించి దర్యాప్తును అడ్డుకునే విషయం ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లు తెలిసింది. -
ఎన్ఐఏ విచారణ.. పత్తా లేకుండా పోయిన హర్షవర్ధన్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో కీలకంగా భావిస్తున్న టీడీపీ నాయకుడు, విశాఖ ఎయిర్‌పోర్టులోని ఫ్యూజన్‌ఫుడ్స్ రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ చౌదరి ఎన్ఐఏ విచారణకు గైర్హాజరయ్యారు. కేసు విచారణలో భాగంగా విశాఖలోని కైలాసగిరి పోలీస్ హెడ్‌క్వార్టర్స్ ప్రాంగణంలో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేసుకున్న ఎన్ఐఏ అధికారులు 3 రోజులుగా సాక్షులను విచారిస్తున్నారు. హత్యాయత్నం జరిగిన గతేడాది అక్టోబర్ 25న ఘటనాస్థలంలో ఉన్న వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను కూడా సాక్షులుగా పేర్కొంటూ నోటీసులు పంపగా.. వైఎస్సార్సీపీ కార్యాలయంలో పనిచేసే కృష్ణకాంత్, మాజీ కార్పొరేటర్ జియ్యాని శ్రీధర్ 2 రోజులక్రితం హాజరయ్యారు. నోటీసులందుకున్న మిగతా వైఎస్సార్సీపీ నేతలు సైతం 2 రోజుల్లో విచారణకు హాజరవుతామని సమాచారమిచ్చారు. అయితే ఈ కేసులో కీలకంగా భావిస్తున్న టీడీపీ నేత, ఎయిర్‌పోర్ట్‌లోని ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ చౌదరి మాత్రం పత్తా లేకుండా పోయారు. ఈ నెల 15 తర్వాత విచారణకు హాజరుకావాలంటూ ఎన్ఐఏ అధికారులు ఆయన ఇంటికి నోటీసులు పంపినట్టు సమాచారం. గురువారం ఆయన హాజరుకావొచ్చని భావించారు. నిజానికి ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ కేంద్రంగానే కుట్ర జరిగిందని, హర్షవర్ధన్ చౌదరికి తెలియకుండా శ్రీనివాసరావు.. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం చేసేంతటి ఘాతుకానికి తెగబడడన్న వాదనలు బలంగా వినిపించినా.. పోలీసులు, సిట్ అధికారులు హర్షవర్ధన్ జోలికే పోలేదు. ఈ నేపథ్యంలో ఎన్‌ఐఏవిచారణకు హర్షవర్ధన్ చౌదరి హాజరైతే కీలక సమాచారం రాబట్టవచ్చన్న వాదనలు వినిపించాయి. దీంతో గురువారమే హర్షవర్ధన్ విచారణకు హాజరు కావొచ్చన్న ప్రచారంతో పెద్దఎత్తున మీడియా ఎన్ఐఏ తాత్కాలిక కార్యాలయం వద్ద గుమిగూడింది. అయితే హర్షవర్ధన్ సహా రెస్టారెంట్లో పనిచేసే సిబ్బంది ఎవ్వరూ హాజరుకాలేదు. పైగా హర్షవర్ధన్ ఫోన్ స్విచ్చాఫ్ రావడంతోపాటు కొద్దిరోజులుగా పత్తా లేకుండా పోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల మంత్రి యనమల నగరానికి వచ్చినప్పుడు హల్చల్ చేశాడని, ఆ తర్వాత నుంచి కానరావట్లేదని టీడీపీ నేతలే చెప్పుకొస్తుండడం గమనార్హం. ప్రభుత్వ పెద్దల అండతోనే హర్షవర్ధన్ పత్తా లేకుండా పోయారన్న వాదన వినిపిస్తోంది. దీనిపై ఎన్ఐఏ వర్గాలు మాట్లాడుతూ.. ఒకటి, రెండు రోజులు చూసి అప్పటికీ హర్షవర్ధన్ విచారణకు రాకుంటే ఏం చేయాలో నిర్ణయిస్తామని చెప్పాయి. -
‘వైజాగ్ ఎయిర్పోర్ట్ మూతపడదు’
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖపట్నం సమీపంలోని భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చినప్పటికీ విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో విమానాల రాకపోకలు యధావిధిగానే కొనసాగుతాయని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా స్పష్టం చేశారు. రాజ్యసభలో బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ విషయం వెల్లడించారు. భోగాపురంలో కొత్తగా అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణంపై ఏర్పాటైన స్టీరింగ్ కమిటీ గత నవంబర్ 26న జరిపిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. విశాఖపట్నంలాంటి మేజర్ ఎయిర్‌పోర్ట్‌ను మూసేయడం వలన దానిపై ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) పెట్టిన పెట్టుబడులకు ముప్పు వాటిల్లుతుందని, కాబట్టి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభమైన తర్వాత కూడా విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో విమానాల రాకపోకలను కొనసాగించాలని స్టీరింగ్ కమిటీ సిఫార్సు చేసిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఏఏఐఈ సమాచారాన్నిఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ అథారిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఏడీసీఎల్)కు లేఖ ద్వారా తెలిపినట్లు మంత్రి వెల్లడించారు. కొండపల్లి ఆయిల్ పైపులైన్ నిర్మాణంలో భూములు కోల్పోయిన వారందరికీ చట్టబద్ధంగానే పరిహారం అందిస్తున్నామని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ వెల్లడించారు. ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. వినిమయ హక్కు కింద జరిగే భూసేకరణలో యాజమాన్యం మారదని స్పష్టం చేశారు. భూమి సొంత దారుడే యజమానిగా కొనసాగుతారని చెప్పారు. అలాగే పైప్‌లైన్ నిర్మాణం సందర్భంగా పంటలు, చెట్లు, కట్టడాలకు ఏదైనా నష్టం జరిగిన పక్షంలో సంబంధింత అధికారులు ఆ నష్టాన్ని మదింపు చేసిన తర్వాత పరిహారం చెల్లించడం జరుగుతుందని కూడా వివరించారు. -
నేటితో ముగియనున్న శ్రీనివాసరావు రిమాండ్
సాక్షి, విశాఖపట్నం: ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు రిమాండ్ గడువు శుక్రవారంతో ముగియనుంది. విశాఖ సెంట్రల్ జైలులో ఉన్న నిందితుడ్ని ఎయిర్‌పోర్టు పోలీసులు శుక్రవారం విశాఖ మూడో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు తీసుకురానున్నారు. నిందితుడి తరఫు న్యాయవాది సలీం వేసిన బెయిల్ పిటీషన్‌ను కోర్టు కొట్టేసిన నేపథ్యంలో శ్రీనివాసరావుకు మరో 14 రోజుల పాటు రిమాండ్ పొడిగించే అవకాశాలున్నాయి. -
అనుమానాల్లేవ్.. అంతా కుట్రే
-
పెద్దల అండతోనే కుట్ర ‘కత్తి’కి పదును!
విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం వెనుక ప్రభుత్వ పెద్దల పకడ్బందీ వ్యూహం ఉన్నట్లు స్పష్టమవుతోంది. కుట్ర కోణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జగన్‌పై హత్యాయత్నం కుట్రకు ప్రభుత్వ పెద్దలు పదును పెట్టిన తీరు కరుడుగట్టిన కిరాయి హంతక ముఠాల తీరును తలదన్నుతోంది. ఈ హత్యాయత్నానికి పాల్పడ్డ నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు విశాఖ ఎయిర్‌పోర్టులోని ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్లో ఈ ఏడాది జనవరి నుంచి పని చేస్తున్న సంగతి తెలిసిందే. రెస్టారెంట్ యజమాని, అధికార తెలుగుదేశం పార్టీ నాయకుడు హర్షవర్దన్ ప్రసాద్ చౌదరికి ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఇప్పటికే తేటతెల్లమైంది. హర్షవర్దన్‌ను ఏకంగా రాష్ట్ర ఒలంపిక్ సంఘం అధ్యక్షుడిగా నియమించాలని సాక్షాత్తూ ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) సిఫార్సు చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. రాష్ట్ర ఒలంపిక్ సంఘం ఆఫీస్ బేరర్లు గట్టిగా వ్యతిరేకించడంతో ఆ ప్రయత్నం ఫలించలేదు. కానీ, నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర పాఠశాలల క్రీడలపై పెత్తనాన్ని ఆయనకు కట్టబెట్టినట్లు తాజాగా బయటపడింది. విశాఖపట్నంలోని స్వర్ణ భారతి స్టేడియంలో 16వ నంబర్ గదిని హర్షవర్దన్‌కు కార్యాలయంగా కేటాయించడం గమనార్హం. హర్షవర్దన్‌తో ప్రభుత్వ పెద్దల సాన్నిహిత్యం వెనుక ఇంతటి కుట్ర ఉందా? అని విశాఖ జిల్లా ఒలంపిక్ సంఘం ప్రతినిధులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలల క్రీడలు ఆయన గుప్పిట్లోనే... ప్రభుత్వ పెద్దల అండతోనే విశాఖ ఎయిర్‌పోర్టులో రెస్టారెంట్ లీజును హర్షవర్దన్ ప్రసాద్ చౌదరి దక్కించుకున్నట్ల ఇప్పటికే బయటపడింది. నిబంధనలకు విరుద్ధంగా ఆయనను ఏకంగా రాష్ట్ర ఒలంపిక్ సంఘం అధ్యక్షుడిగా నియమించాలంటూ ముఖ్యమంత్రి కార్యాలయం సిఫార్సు చేయడం సంచలనం సృష్టించింది. రాష్ట్ర ఒలంపిక్ సంఘం ఆఫీస్ బేరర్లు గట్టిగా అడ్డుకోవడంతో ఆ ప్రయత్నం ఫలించలేదు. కానీ, విశాఖపట్నం కేంద్రంగా రాష్ట్ర పాఠశాలల క్రీడలపై పెత్తనాన్ని ప్రభుత్వ పెద్దలు ఆయనకు కట్టబెట్టేశారు. విశాఖపట్నం జిల్లా ఒలంపిక్ అసోసియేషన్‌ను కాదని హర్షవర్థన్ ప్రసాద్ విడిగా ఓ సంఘాన్ని స్థాపించారు. జిల్లాలోని 24 క్రీడా సంఘాల్లో ఒకటి రెండు తప్ప మిగిలినవన్నీ గుర్తింపు పొందిన ఒలంపిక్ సంఘం ఆధ్వర్యంలోనే ఉన్నాయి. ఆ సంఘాలన్నీ హర్షవర్థన్‌ను వ్యతిరేకించాయి. దాంతో ఆయన వ్యూహాత్మకంగా రాష్ట్రస్థాయి పాఠశాల క్రీడా వేడుకలపై కన్నేశారు. పాఠశాల క్రీడల సమాఖ్యపై పెత్తనాన్ని తనకు ఇవ్వాలని పట్టుబట్టారు. ఎందుకంటే ఆ సమాఖ్య ఆధ్వర్యంలోనే రాష్ట్రస్థాయి పాఠశాలల క్రీడలు నిర్వహిస్తారు. సీఎం కప్ పేరిట నిర్వహించే ఆ క్రీడలకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తుంది. నిబంధనల ప్రకారం.. రాష్ట్ర, జిల్లా ఒలంపిక్ సంఘాల గుర్తింపు లేని హర్షవర్థన్ నెలకొల్పిన సంఘానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వకూడదు. కానీ, దీన్ని ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదు. పాఠశాలల క్రీడల సమాఖ్యపై పెత్తనాన్ని హర్షవర్థన్ నిర్వహిస్తున్న సంఘానికి కట్టబెట్టాలని రాష్ట్ర విద్యా శాఖను చినబాబు ఆదేశించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే విశాఖపట్నం జిల్లా విద్యాశాఖ అధికారులకు మౌఖిక ఆదేశాలు అందాయి. దాంతో పాఠశాల క్రీడల సమాఖ్యపై పెత్తనాన్ని హర్షవర్థన్ నిర్వహిస్తున్న సంఘానికి అప్పగించారు. నిధుల వినియోగంలో భారీగా అవకతవకలు పాఠశాల క్రీడల సమాఖ్య నిర్వహణను హర్షవర్థన్ తన చెప్పుచేతల్లోకి తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా విశాఖపట్నంలోని స్వర్ణ భారతి స్టేడియంలో 16వ నంబర్ గదిని ఆయనకు కార్యాలయంగా కేటాయించారు. వాస్తవానికి పాఠశాల క్రీడల సమాఖ్య కార్యాలయాన్ని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేయాలి. క్రీడల నిర్వహణపై డీఈవో అక్కడే సమావేశాలు, సమీక్షలు నిర్వహించాలి. కానీ, పాఠశాల క్రీడల సమాఖ్య కార్యాలయాన్ని స్వర్ణ భారతి స్టేడియంలోని హర్షవర్థన్ కార్యాలయంలోనే ఏర్పాటు చేయడం గమనార్హం. పాఠశాల క్రీడల సమాఖ్యలో కార్యనిర్వాహక కార్యదర్శి పదవి అత్యంత కీలకం. క్రీడల నిర్వహణ, నిధుల వినియోగం అంతా ఆయనే నిర్వర్తించాలి. అందుకే జిల్లాలో అత్యంత సీనియర్ అయిన పీఈటీకి ఆ పదవి ఇవ్వాలని కచ్చితమైన నిబంధన ఉంది. కానీ, హర్షవర్దన్ అదేమీ పట్టించుకోలేదు. సీనియర్లను కాదని తనకు సన్నిహితుడైన జూనియర్ పీఈటీ లలిత్‌కుమార్‌ను కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమించారు. ఈ సమాఖ్య ఈ ఏడాది విశాఖపట్నంలో 12 రాష్ట్రస్థాయి క్రీడలను నిర్వహించింది. ప్రభుత్వం ఇచ్చిన నిధుల వినియోగంలో భారీగా అవకతవకలు జరిగాయని ఒలంపిక్ సంఘం ప్రతినిధులు మొత్తుకున్నా విద్యాశాఖ పట్టించుకోలేదు. ఇంతటి కుట్ర ఉందా? ‘‘నిబంధనలను బేఖాతరు చేస్తూ హర్షవర్థన్ ప్రసాద్ చౌదరికి ప్రభుత్వ పెద్దలు ఇంతటి ప్రాధాన్యం ఇవ్వడం ఏమిటా అని అప్పట్లోనే సందేహం కలిగింది. ఆయన రెస్టారెంట్లో పని చేస్తున్న శ్రీనివాసరావు అనే యువకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నానికి ఒడిగట్టడంతో అసలు విషయం అర్థమవుతోంది. హర్షవర్దన్‌తో ప్రభుత్వ పెద్దల సాన్నిహిత్యం వెనుక ఇంతటి కుట్ర ఉందా?’’ అని విశాఖపట్నం జిల్లా ఒలంపిక్ సంఘం ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. ‘బాస్’ భారీగా డబ్బులిచ్చాడు తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం ఠానేలంకకు చెందిన నిందితుడు శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ అభిమాని అని, అతడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రెండు ఇళ్లు కేటాయించిందని, ఆ ఇళ్ల వద్దకు చేరుకోవడానికి ప్రత్యేకంగా రోడ్డు కూడా వేసిందని గ్రామస్తులు చెబుతున్నారు. రెస్టారెంట్ యజమాని హర్షవర్దన్ ప్రసాద్ చౌదరి కోడిపందేలు నిర్వహిస్తుంటారని సమాచారం. ఈ నేపథ్యంలోనే కోళ్లకు కత్తులు కట్టే శ్రీనివాసరావుతో పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. అతడిని ఈ ఏడాది జనవరిలో విశాఖ విమానాశ్రయంలోని ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్లో చేర్చుకున్నారు. నిందితుడికి హర్షవర్దన్ చౌదరి అందరికంటే ఎక్కువ వేతనం చెల్లించడంతోపాటు ఇంటి అద్దెను కూడా భరించినట్లు ఇప్పటికే బయటపడింది. కుట్రలో భాగంగా అప్పుడే అతడు విమానాశ్రయంలో సీసీ కెమెరాలకు చిక్కకుండా రెస్టారెంట్ యజమాన్యం సహకారంతో ఇతర సరుకులతోపాటు కత్తిని తీసుకొచ్చాడు. రహస్య ప్రదేశంలో దాన్ని దాచిపెట్టాడు. ఇంతలో అసలు సూత్రధారులతో కాస్త విభేదాలు తలెత్తడంతో ఉద్యోగం మానేస్తానని శ్రీనివాసరావు వెళ్లిపోతే బతిమిలాడి మరీ పిలిపించుకున్నారు. ఆ సందర్భంగానే ముందుగా కుదుర్చుకున్న ‘డీల్’ కంటే అదనంగా మరిన్ని డిమాండ్లను శ్రీనివాసరావు తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. దీనికి కూడా కుట్ర సూత్రదారులు ఒప్పుకున్నారని పోలీసు వర్గాలు గుర్తించాయి. ఆ ధీమాతోనే జగన్‌పై హత్యాయత్నానికి 10 రోజుల ముందు శ్రీనివాసరావు తన స్వగ్రామం ఠానేలంకలో స్నేహితులకు ఇచ్చి ఖరీదైన విందు ఇచ్చాడు. కోటి రూపాయలతో నాలుగు ఎకరాల భూమి కొనుగోలు చేసేందుకు బేరసారాలు సైతం సాగించాడు. రెస్టారెంట్లో పనిచేసే సాధారణ వ్యక్తి అంత భారీ మొత్తంతో భూమి కొనుగోలుకు ప్రయత్నించడం ఏమిటన్నది సందేహాస్పదంగా మారింది. ‘బాసే’ తనకు అంత డబ్బు ఇచ్చాడని శ్రీనివాసరావు వ్యాఖ్యానించినట్లు ఠానేలంక గ్రామస్తులు చెబుతున్నారు. అంటే అప్పటికే నిందితుడికి సూత్రధారులు భారీ మొత్తం ముట్టజెప్పినట్లు స్పష్టమవుతోంది. జగన్‌పై హత్యాయత్నం కుట్రలో శ్రీనివాసరావుకు సూత్రదారులు పూర్తిగా సహాయ సహకారాలు అందించారు. -
వైఎస్ జగన్‌పై హత్యాయత్నం : ఎయిర్‌పోర్టు ఆఫీసర్ బదిలీ
-
వైఎస్ జగన్‌పై హత్యాయత్నం : ఎయిర్‌పోర్టు ఆఫీసర్ బదిలీ
సాక్షి, విశాఖపట్నం: ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో హత్యాయత్నం జరగడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సాక్షాత్తు ఓ రాష్ట్ర ప్రతిపక్షనేత అందులోనూ కట్టుదిట్టమైన భద్రత ఉండే విమానాశ్రయంలోనే వైఎస్ జగన్‌పై హత్యాయత్నం చోటుచేసుకోవడంతో విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రముఖుల భద్రతపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో విశాఖపట్నం ఎయిర్‌పోర్టు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌పై బదిలీ వేటు పడింది. వైజాగ్ ఎయిర్ పోర్టు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వేణుగోపాల్‌ను చెన్నై ఎయిర్ పోర్టుకు బదిలీ చేస్తున్నట్టు సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. విమానాశ్రయ భద్రతను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. -
ప్రాణహాని తలపెట్టి అసత్య ప్రచారమా!
వైఎస్ జగన్‌పై ఆయన అభిమానే దాడి చేశాడు, ఇది చాలా చిన్న అంశం అంటూ హత్యాప్రయత్నం జరిగిన వెంటనే ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాష్ట్ర ప్రభుత్వానికి వంతపాడటం నుంచి, ఈ ఘటనపై అసత్య ప్రచార మోత మోగుతూనే ఉంది. అది హత్యాప్రయత్నమేననీ, వైఎస్ జగన్ ఆ దుర్మార్గుడిని తెలివిగా గుర్తించి తోసివేయగలిగారుగానీ లేకుంటే ఆయన ప్రాణాలకే ప్రమాదం జరిగేదని ప్రభుత్వం వారి విచారణ బృందమే వెల్లడించింది. అయితే హత్యాప్రయత్నం చేసిన ఆ శ్రీనివాస్ పాత్రధారే కానీ.. దానికి సూత్రధారులు, వ్యూహకర్తలు ఎవరనే పరిశీలనకు విచారణ బృందం ఇంకా పూనుకోలేదు. ప్రతిపక్ష నేతపై అసత్యప్రచారానికి ఇకనైనా అడ్డుకట్టలు పడాల్సి ఉంది. దేశంలో అత్యవసర పరి స్థితిని ఇందిరాగాంధీ 1975లో ప్రవేశపెట్టిందని తెలియగానే లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ‘వినాశకాలే విపరీత బుద్ధి’ అని స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ పాదయాత్రలో వేల కిలోమీటర్లు నడిచి, ప్రత్యక్షంగా యావదాంధ్ర ప్రజానీకాన్ని స్వయంగా కలుసుకుని వారి బాధలు తెలుసుకుంటూ వారికి తగిన భరోసా కల్పిస్తూ, వారి భవిష్యత్తు కోసం నవరత్నాలను అమలు చేయనున్నానని సవివరంగా వేలాదిమంది హాజరవుతున్న వందలాది బహిరంగ సభల్లో ఇత రత్రా సమావేశాల్లో వివరిస్తున్నారు. ఆయన ప్రకటన లతో ప్రజల మనసులు పులకిస్తున్నాయి. మరోవై పున కుట్రలు, కుతంత్రాలు, నయవంచన, దోపిడీ అణచివేతలే ఆయుధాలుగా గల పాలకులకు, ప్రత్యే కించి ఒక ఆధిపత్య కులం పెత్తందార్లకు గుండెల్లో గుబులు పుడుతోంది. తమ పాలనకు వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని స్పష్టంగా వారికి అర్థం అవుతు న్నది. ఈ పరిస్థితిలో దిక్కుతోచక తప్పుమీద తప్పు చేస్తూ తమ నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంటు న్నారు. అందులో భాగమే ఈ నెల 25న జగన్ మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో భద్రతా వలయంలోనే జరిగిన హత్యాప్రయత్నం. ఈ సంద ర్భంగా జయప్రకాష్ నారాయణ్ చేసిన వ్యాఖ్య మళ్లీ గుర్తుకు వస్తే ఆశ్చర్యం కలుగదు. జగన్మోహన్ రెడ్డిపై హత్యాప్రయత్నం జరిగిన నిమిషాల్లోనే ఇంకా ఆ హంతకుడి వివరాలు విజువల్ మీడియాలో పూర్తిగా రాకుండానే ప్రచారార్భాటం కోసం ఈ దాడి జరిగిందని రాష్ట్ర పోలీసు ఉన్నతా ధికారి ప్రకటించారు. పైగా ఆ దాడి చేసిన వ్యక్తి జగ న్కు వీరాభిమానేననడం మరో అసత్యం. తమ హోదాను దిగజార్చి, పదవీ గౌరవాన్ని మర్చి, తన ప్రియతమ నేతకు పాదాభిషేకమో, పాలాభిషేకమో చేస్తున్న అధికార దాహం కల సభాపతులను చూస్తు న్నాం కానీ, ఇలా అభిమానిని అని చెప్పుకుంటూ హత్యాప్రయత్నం చేసేవాళ్లను చూడ్డం ఇదే మొద టిసారి! నిమిషాల్లోనే పోలీసువారు ఈ దాడి గుట్టు మట్లను ఛేదిస్తే ఇక దర్యాప్తు, విచారణ వగైరా దేనికి? ఏదేమైనా చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన ఆ పోలీసు ఉన్నతాధికారి ప్రభువును మించిన ప్రభు భక్తిని ప్రశంసించకుండా ఉండలేను. వీరాభిమాని చేసినా లేదా వీరాభిమాని ముసుగును ఆ వ్యక్తి మీద కప్పి, ఓటమి భయంతో వణుకుతున్న నేతలెవరైనా అతనితో చేయించినా.. అంతిమంగా అతడి ప్రాణా నికి తనను పురమాయించిన నేతల నుంచే ముప్పు ఉండవచ్చు. కనుక ప్రభువును మించిన సదరు పోలీసు ఉన్నతాధికారులు అతనికి ప్రాణహాని కలి గించకుండా తగు రక్షణ కల్పించాల్సి ఉంది. పైగా, ఇలాంటి సానుభూతి థియరీలకు గతంలో చంద్రబాబు హయాంలోనే కాలం చెల్లింది. చంద్రబాబుపై నక్సలైట్లు అలిపిరి వద్ద బాంబులతో దాడిచేశారు. అదృష్టవశాత్తూ అంతకు మించి ఏడు కొండల వెంకన్న చౌదరి (ఎంపీ మురళీ మోహన్‌కు కృతజ్ఞతలతో, క్షమాపణలతో) దయవలన బాబు గారికి ఏ ప్రమాదమూ జరగలేదు. దానితో తన పట్ల ప్రజల్లో సానుభూతి వెల్లువ పొంగి పొరలుతుందని, ఈ సమయంలో ముందస్తు ఎన్నికలకు వెళితే ప్రజలు నీరాజనం పట్టి తనకు తిరిగి భారీ మెజారిటీతో అందలం ఎక్కిస్తారని చంద్రబాబు ఎన్నికల్లో భ్రమ పడ్డారు. ఢిల్లీలో అప్పుడు అధికారంలో ఉన్న వాజ్ పేయిని కూడా ఒప్పించి ముందస్తు ఎన్నికలకు తెర తీశారు. కానీ చంద్రబాబు అంచనాలు తల్లకిందులై 2004 ఎన్నికల్లో తెలుగుదేశం బొక్కబోర్లాపడింది. పాపం.. ఈయనతో ముడివేసుకున్న ప్రధాని వాజ్ పేయి ప్రభుత్వానికి కూడా కాలం చెల్లిపోయింది. కాబట్టి ఇలాంటి కాకమ్మ కథలను తెలివిమీరిన నేటి ఓటర్లు నమ్మరు కాక నమ్మరు. ఇక బాబుగారి అనుచర బృందం ఇంకో అడుగు ముందుకు వేసి జగన్మోహన్ రెడ్డి తనపై తానే దాడి చేయించుకున్నాడని గొంతులు చించుకుని దుష్ప్ర చారం చేస్తున్నారు. బాబుగారు రాష్ట్రంలో తన ప్రభు త్వాన్ని అస్థిరపరిచి రాష్ట్రపతి పాలన ప్రవేశ పెట్టా లన్న కుట్ర జరుగుతున్నదనీ జనాన్ని భయభ్రాంతు లను చేస్తున్నారు. చంద్రబాబుని చూస్తుంటే జాలే స్తోంది. వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రాగ లమని ఆయన, టీడీపీ కలిసి దింపుడు కళ్లెం ఆశ పెట్టుకుని ఉండవచ్చు. కానీ ఆ పార్టీకి రానున్న ఎన్ని కలే చివరి ఎన్నికలు కావాలని జనం ఎప్పుడో నిర్ణ యించుకున్నారు. అయినా ప్రజానీకం అప్రమ త్తంగా ఉండాలి. సాక్షాత్తు ముఖ్యమంత్రే ప్రార్థనా స్థలాలపై దాడులు, అల్లకల్లోలం, రాష్ట్రంలో అశాంతి పరిస్థితులు వస్తాయని బహిరంగంగా చెబుతున్నా రంటే తమ ప్రభుత్వ రక్షణకు చంద్రన్న పథకాలేవో సిద్ధం చేస్తున్నారన్నమాట! అయితే బాబుగారి సంక్షేమ పథకాల మాదిరే ఈ కుట్ర పథకాలూ నీరుగారిపోయేవే! సందట్లో సడేమియా అన్నట్లుగా కొన్ని బినామీ మీడియా సంస్థలు కూడా బాబుగారి ఈ ప్రయ త్నాలకు, వారి కుతంత్రాలకు తగురీతిలో మసాలా దట్టించి మరీ వడ్డిస్తున్నాయి. ఇంకా హత్యాప్ర యత్నం చేసిన వ్యక్తి వివరాలేమీ రాకముందే హోటల్ సర్వర్ శ్రీనివాస్ ఫోర్కుతో జగన్‌పై దాడి చేశాడని ఒక చానల్ ప్రచారం చేసింది. హత్యా ప్రయత్నం లేదూ.. పాడూ లేదూ.. 0.5 సెంటీమీటర్ల గాయమే నని నోటికొచ్చినట్లు కట్టుకథలు అల్లిన నేతలకు చెంపపెట్టన్నట్లుగా ప్రభుత్వం వారి విచారణ బృందమే.. అది హత్యా ప్రయత్నమేననీ, వైఎస్ జగన్ ఆ దుర్మార్గుడిని గుర్తించి తోసివేయగలిగారు గానీ లేకుంటే అత్యంత పదునైన కత్తివేటు అయన మెడపై పడి ఉంటే ప్రాణాలకే ప్రమాదం జరిగేదని వెల్లడించింది. అయితే హత్యా ప్రయత్నం చేసిన ఆ శ్రీనివాస్ పాత్రధారే కానీ దానికి సూత్రధారులు, వ్యూహకర్తలు ఎవరు అనే పరిశీలనకు విచారణ బృందం ఇంకా పూనుకోలేదు. టీడీపీవారు తల్చు కుని ఉంటే వైఎస్ జగన్‌ని ఎప్పుడో కైమా చేసి ఉండే వారని టీడీపీ నేతలు బాహాటంగా ప్రకటించి తమ వాక్శూరత్వాన్ని నిరూపించుకున్నారు. కానీ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దురాశను, దురాగతా లను ఓట్ల ఆయుధంతో ప్రజలు కైమా చేసే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నది. తాజాగా మరో పల్లవి ఆలాపన జరుగుతోంది. ప్రధాని నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ అస్థిరత సృష్టించేందుకు ఒక పథకం ప్రకారం ఇలాంటి కుట్రలు పన్నుతున్నారట. నిజానికి అసలు కుట్రదారు మోదీ అయితే జగన్ ఆయన జోలికి వెళ్లడం లేదట. అయినా నాలుగేళ్లకు పైగా మోదీతో అంటకాగి సహజీవనం చేసింది చంద్రబాబే. ఆ మోదీని సంతృప్తి పర్చడానికి 2017లో వైఎస్ జగన్‌ని ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొనకుండా విశాఖ విమానాశ్రయంలో నిర్బంధించింది కూడా చంద్ర బాబే. మోదీ దోస్తానాతో దోచుకోవలసినంత దోచు కుని దాచుకోవలసినంత దాచుకున్నాం. ఇక ఈ కంచి గరుడ సేవ దేనికి అని మోదీతో విడాకుల ప్రహసనం మొదలెట్టింది కూడా చంద్రబాబే. ఇకపోతే, శివాజీ అని ఒక సినిమా నటుడు న్నాడు. ఆయన 2017లో ఆపరేషన్ గరుడ పేరుతో ఒక అత్యంత తీవ్రమైన రహస్యాన్ని బయటపెట్టాడు. ప్రతిపక్షనేత జగన్మోహన్రెడ్డికి కూడా తెలీకుండా ఆయనను వాడుకుని ఆంధ్రప్రదేశ్‌ను ధ్వంసం చేసేం దుకు ఆపరేషన్ గరుడ పేరుతో కేంద్రం కుట్ర పన్నిం దట. సాక్షాత్తూ చంద్రబాబే ఢిల్లీలో పత్రికాగోష్టి పెట్టి ‘శివాజీ గతంలో చెబితే తేలిగ్గా కొట్టిపడేశాను. ఇప్పుడు శివాజీ పరిశోధన నిజమని తేలుతోంది’ అని చెప్పారు. నిజానికి ఆ శివాజీనే పోలీసు రక్షణతో ఢిల్లీకి తనతోపాటు తీసుకెళ్లి ఆ పత్రికా గోష్టిలో అతడితోనే చెప్పించి ఉంటే మరింత సాధికారత వచ్చేది కదా. చివరగా.. చంద్రబాబుని వ్యక్తిగత ద్వేషంతో విమర్శించడం నా ఉద్దేశం కాదు. ఇప్పటికైనా ఆయన కాస్త ఆత్మవిమర్శ చేసుకుని మన జాషువా మహాకవి అన్నట్లు ఒక మంచి మనిషిగా మారే కృషి చేస్తే, ఆయనకు ఆంధ్రప్రదేశ్‌కూ ఉపయోగం. జాషువా ‘పిరదౌశి’ అనే ఒక ఖండకావ్యం రచించారు. అరబ్బు దేశంలో పిరదౌసి అనే గొప్ప కవి ఉండేవారట. ఆ దేశ ప్రభువు పిరదౌసి కవిని పిలి పించి నాపై గొప్పగా ఒక కావ్యం రాస్తే నీకు పద్యానికి ఒక బంగారు నాణెం ఇస్తానని వాగ్దానం చేశాడట. పిరదౌసి ఆశపడి ఆయన్ని కీర్తిస్తూ గొప్ప కావ్యం రాశాడట. అక్కర తీరిన ఆ ప్రభువు పద్యానికి ఒక బంగారు నాణెం ఇస్తానన్న వాగ్దానం తుంగలో తొక్కి వెండినాణేలను తన భటులతో ఆ కవి ఇంటికి పంపా డట. పిరదౌసి వాటిని తిరస్కరించగా ప్రభువు ఆగ్రహోదగ్రుడై పిర దౌసిని తీసుకొచ్చి కారాగారంలో నిర్బంధించమని భటులను ఆదేశించాడట. రాజధాని ప్రాంతానికి భూములిచ్చిన అమాయక రైతు, కూలీలు, నిరుద్యోగ భృతికి భ్రమపడ్డ నిరుద్యోగులు, మోసపోయిన డ్వాక్రా మహిళలు, అంగన్వాడీ కార్యకర్తలు, గత ఎన్నికల్లో చంద్రబాబు మాటలు నమ్మి అవన్నీ నేతిబీరలో నెయ్యి చందంగా ఆలస్యంగా గ్రహిం చారు. కానీ పిరదౌసి ప్రభువు కాపట్యాన్ని ముందు గానే గ్రహించి తన ఒక్కగానొక్క కూతురిని తీసుకుని ఆ ప్రాంతం వదలి వెళ్లిపోతూ తనగోడుపై ఒక పద్యం రాశాడట. ‘‘అల్లా తోడని పల్కి నా పసిడి కావ్య ద్రవ్యంబు వెండితొ చెల్లింపగ దొర కన్న టక్కరివి నీచే పూజితుండైనచో అల్లాకున్ సుఖమే...? మహమ్మదు నృపాలా! సత్య వాక్యం బెవం డుల్లంఘింపబోడొ వాడెపో నరుడు, ధన్యుండిద్ధ రామండలిన్.’ ఎవరైతే తానిచ్చిన మాటకు కట్టుబడతాడో వాడే మనిషి, ధన్యుడు అని గ్రహించి చంద్రబాబు కనీసం జాషువా గారి ‘నరుడి’ వలె వ్యవహరించే ప్రయత్నం చేయాలని నా సలహా. వ్యాసకర్త: డాక్టర్ ఏపీ విఠల్, మార్క్సిస్టు విశ్లేషకులు మొబైల్ : 98480 69720 -
చంద్రబాబు తీరు సమంజసమా?
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నాయకుడిపై దాడి జరిగితే ఆయనకు ఏం జరిగిందని ఆరా తీయడం, యోగ క్షేమాలు తెలుసుకోవటం కంటే.. ఆ సంఘటనను ఎలా వాడుకోవాలి అన్న కోణంలోనే ప్రభుత్వం, అధికార తెలుగుదేశం పార్టీ ఆలోచించాయి. సంఘటన జరిగిన గంటలోపు రాష్ట్ర హోంమంత్రి మాట్లాడిన తీరు చూస్తే.. జగన్ పట్ల వారికి ఉన్న అసహనం ఉందో తెలు స్తోంది. అదే తీరున రాష్ట్ర డీజీపీ సైతం మాట్లాడారు. ఇక సీఎం చంద్రబాబు ప్రజలంతా తనపట్ల సానుభూతి చూపాల్సిందే అన్నట్లు వ్యవహరించారు. పదేళ్ల పాటు అధికారానికి దూరమైన తర్వాత ముఖ్యమంత్రి పదవి చేపట్టిన చంద్రబాబు తొలి రోజు నుంచీ ఒకే పనిలో ఉన్నారు. అదేమంటే.. ఈ పదవిని శాశ్వతంగా తాను, తన కుమారుడే అనుభ వించేలా చూసుకోవడం.. ఇదేదో నేను చేస్తున్న ఆరోపణ కాదు. స్వయంగా ఆయనే పార్టీ కార్యక్ర మాలు, ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ పదేపదే ప్రక టించిన వాస్తవం. కానీ, ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతు, ఆశీర్వాదం ఉంటేనే ఎంతటివారైనా అధికా రంలోకి రాగలరు, కొనసాగగలరు. దురదృష్టవ శాత్తూ చంద్రబాబు నాయుడికి, ఆయన ప్రభుత్వా నికి ప్రజల ఆదరాభిమానాలు ఎంత ప్రయత్నించినా దక్కట్లేదు. దీంతో చంద్రబాబు తనకు, తన ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిన వారిపై, వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళుతున్న వారిపై దాడులు చేసేందుకు పూనుకు న్నారు. అక్రమాలను అడ్డుకున్న ఒక మహిళా ఎమ్మా ర్వోపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దారుణంగా దాడి చేశారు. ఈ సంఘటన అప్పట్లో అధికారులనూ, ప్రజలనూ భయభ్రాంతులకు గురి చేసింది. అయి నప్పటికీ.. ఇప్పటికీ ఆ ఎమ్మెల్యేపైన సీఎం చంద్ర బాబు ప్రభుత్వ పరంగా కానీ, పార్టీ పరంగా కానీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. రాజధాని నగరంగా భావిస్తున్న విజయవాడలో ఒక మంత్రి, ఒక ఎంపీ, తెలుగుదేశం నాయకులు పట్టపగలు ఒక రవాణా కమిషనర్‌పై దాడి చేశారు. తాను చేస్తున్న అక్రమాలు, దౌర్జన్యాలు చాలవ న్నట్లు.. న్యాయంగా, నిజాయితీగా వ్యవహరించిన అధికారిపై విరుచుకుపడ్డారు ఆ ఎంపీ. హైకోర్టు జోక్యం చేసుకుందే తప్ప ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఎంపీపైన కానీ, మంత్రిపైన కానీ ప్రజలు ఆశించిన రీతిలో చర్యలు తీసుకోలేదు. అదే నగ రంలో మరొక ఎమ్మెల్యే భూముల్ని ఆక్రమిస్తూ.. అడ్డొచ్చిన వారిపై దాడులు చేస్తూ రచ్చకెక్కారు. అయినా ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. ప్రజలూ, అధికారులే కాదు.. ఒకప్పుడు మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలు, ఆ పార్టీల ముఖ్య నాయకులనూ టీడీపీ వదిలిపెట్టలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అధ్యక్షుడు దైవ దర్శనం కోసం తిరుమలకు వస్తే టీడీపీ నాయ కులు, కార్యకర్తలు అమిత్ షాపై దాడి చేయాలని ప్రయత్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్షీ్మ నారాయణపై టీడీపీ తమ్ముళ్లు బరి తెగించి దాడి చేశారు. ఈ రెండు సందర్భాల్లోనూ తప్పు బీజేపీదే అన్నట్లుగా చిత్రీకరించడానికి బాబు, ఆయనకు బాకాలూదే మీడియా విఫలయత్నాలు చేశాయి. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న, ప్రజల్లో తిరుగుతున్న పవన్ కల్యాణ్ తనకు ప్రాణహాని ఉందని బహిరంగంగా ప్రకటించారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి అధ్యక్షుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు అయిన వైఎస్ జగన్‌పై ఏకంగా హత్యాయత్నమే జరిగింది. ఇన్ని కళ్లముందు జరుగుతున్నా చంద్రబాబు, మంత్రులు, టీడీపీ నాయకులు అంతా తామే బాధి తులమన్నట్లుగా నటించటం, ప్రజ లంతా తమపట్ల సానుభూతి చూపాలన్నట్లుగా మొసలి కన్నీళ్లు కార్చడం, దీన్నంతా వారి అనుకూల మీడియా ప్రజ లపై రుద్దటం ఎంత వరకు సమంజసం? పైన పేర్కొన్న అన్ని దాడుల్లోనూ, అన్ని సంద ర్భాల్లోనూ చర్యలు తీసుకోవాల్సింది ఎవరు? కేసులు నమోదు చేయాల్సింది ఎవరు? దోషుల్ని పట్టుకోవాల్సింది, వారికి శిక్ష పడేలా చేయాల్సింది ఎవరు? దొంగ నాటకాలు ఆడుతోంది ఎవరు? చంద్రబాబు స్టైల్ ప్రకారం కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాన ప్రతిపక్షాన్ని నిందిస్తారు. ఆఖరికి ప్రజల్ని కూడా వదిలిపెట్టరు. తాను వేసిన రోడ్లపై తిరగొద్దం టారు. ఇదంతా ఘనకార్యంలాగా ఆయనకు బాకా లూదే మీడియా ప్రజలపై రుద్దుతుంది. హత్యాప్రయత్నం జరిగిన తరువాత తెలంగాణ ముఖ్యమంత్రి, ఆయన సహచరులు జగన్‌ని పలకరించారు తప్పితే.. ఏపీ సీఎంగానీ, ఆయన సహచ రులుగానీ మర్యాదకైనా జగన్‌తో మాట్లాడలేదు. ఇది ప్రజాస్వామ్యంలో ఎంతవరకు సమంజసం? వ్యాసకర్త: పురిఘళ్ల రఘురామ్, బీజేపీ సమన్వయకర్త, ఢిల్లీ ఈ–మెయిల్ : raghuram.delhi@gmail.com -
అది హత్యాయత్నమే
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై గురువారం విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన కత్తి దాడి ముమ్మాటికీ హత్యాయత్నమేనని పోలీసులు స్పష్టం చేశారు. జగన్ అదృష్టవశాత్తూ యాదృచ్ఛికంగా పక్కకు తిరగడంతో ముప్పు తప్పిందని, ఆ కత్తిపోటు గొంతులో దిగి ఉంటే ప్రాణాలు దక్కేవి కావని తేల్చిచెప్పారు. జగన్‌ను అంతం చేయాలనే ఉద్దేశంతోనే దుండగుడు శ్రీనివాసరావు కత్తితో దాడి చేశాడని వెల్లడించారు. ఎడమ చేతి భుజంపై కత్తి దింపి, వెనక్కి తీసి మరోసారి పొడిచేందుకు యత్నించగా.. పక్కనే ఉన్న వైఎస్సార్సీపీ నేతలు అతడి నుంచి బలవంతంగా కత్తిని స్వాధీనం చేసుకున్నారని వివరించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనపై విశాఖ ఎయిర్‌పోర్టు పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ఈ విషయాలను స్పష్టంగా పేర్కొన్నారు. రిమాండ్ రిపోర్ట్‌లో ఏముందంటే.. అక్టోబర్ 25, మధ్యాహ్నం 12.20 గంటలు: వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయనగరం జిల్లా పార్వతీపురం సమీపంలో ప్రజా సంకల్ప యాత్ర ముగించుకుని, హైదరాబాద్ వెళ్లడానికి విశాఖ పట్నం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఒంటి గంట సమయంలో ఆయన విమానంలో బయల్దేరాల్సి ఉంది. మధ్యాహ్నం 12.22 గంటలకు: ఎయిర్‌పోర్టులోని వీవీఐపీ లాంజ్‌కు జగన్ చేరుకున్నారు. ఆయన వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, అధికారులు ఉన్నారు. కొద్దిసేపు అక్కడ కూర్చున్న తర్వాత వీవీఐపీ లాంజ్‌లో తూర్పు వైపునగల టాయిలెట్‌కు జగన్ వెళ్లారు. రెండు నిమిషాల తరువాత టాయిలెట్ నుండి బయటకు వచ్చి సోఫాలో కూర్చున్నారు. 12.30 గంటలకు: జగన్మోహన్రెడ్డి కోసం పార్టీ నేతలు ఎయిర్పోర్ట్ లాబీలో ఉన్న ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్లో టీ ఆర్డర్ చేశారు. రెస్టారెంట్‌కు చెందిన సర్వీస్ అసిస్టెంట్ రమాదేవి టీ కప్పులతో వస్తుండగా, తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం థానేలంక నివాసి, ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్లో సర్వీస్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న జనుపల్లి శ్రీనివాసరావు మంచినీటి సీసాను అందించే నెపంతో ఆమెను అనుసరించాడు. పార్టీ నేతలు ‘జగన్ సార్ టీ తాగరు. కాఫీ తీసుకుంటారు’ అని చెప్పడంతో కాఫీæ తెచ్చేందుకు రమాదేవి రెస్టారెంట్‌కు తిరిగి వెళ్లారు. శ్రీనివాసరావు మాత్రం అక్కడే ఉండిపోయాడు. 12.38 గంటలు: రమాదేవి కాఫీ తీసుకుని వీవీఐపీ లాంజ్‌కు తిరిగి వచ్చారు. అదే సమయంలో రెవెన్యూ అధికారులు వైఎస్ జగన్‌తో..‘ఫ్లైట్‌కు టైమైంది సార్.. బోర్డింగ్, చెకప్‌కు వెళ్లాలి’ అని అధికారులు సూచించారు. 12.39 గంటలకు: జగన్ కాఫీ సేవించడం ముగించుకుని సెక్యూరిటీ చెకింగ్‌కు బయల్దేరారు. సరిగ్గా అదే సమయంలో శ్రీనివాసరావు సార్‌తో సెల్ఫీ తీసుకుంటానని మాట కలిపి జగన్ ఎడమ చేతి పక్కనే నిలుచున్నాడు. ఇంతలో జగన్‌తో మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ సెల్ఫీ తీసుకుంటుండగా శ్రీనివాసరావు ఒక్క ఉదుటున కత్తితో జగన్‌పై దాడి చేశాడు. నిందితుడికి కుడిపక్కకు జగన్ తిరగడంతో ఎడమపక్క భుజంపై రక్తం కారే బలమైన గాయం తగిలింది. దీంతో జగన్ చిన్నగా అరిచారు. దుండగుడు మళ్లీ పొడిచేందుకు యత్నించడంతో పార్టీ నేతలు బలంవంతంగా అతడి నుంచి కత్తిని లాక్కున్నారు. అతడిని కొట్టవద్దని పార్టీ నేతలను జగన్ వారించారు. అనంతరం ప్రథమ చికిత్స చేయించుకుని షెడ్యూల్ ప్రకారం ఇండిగో విమానంలో హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్లారు. ఆ కత్తి గొంతులో దిగి ఉంటే.. ‘‘కత్తితో దాడి చేయడం వల్ల జగన్‌కు తీవ్రంగా రక్తం కారే గాయమైంది. నిందితుడు హత్యకు ప్రయత్నించినా జగన్మోహన్రెడ్డి అదృష్టవశాత్తూ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఆ కత్తి గొంతుకు తగిలి ఉంటే జగన్ చనిపోయి ఉండేవారు. కాబట్టి నిందితుడు ప్రతిపక్ష నేతను హత్య చేసేందుకు ప్రయత్నించినందున ఐపీసీ సెక్షన్ 307 కింద కేసు నమోదు చేశాం. 10 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నందున బెయిల్ మంజూరు కాకుండా కోర్టుకు పంపించాం. నిందితుడి వద్ద నుంచి 2.5 అంగుళాల కత్తి, గులాబీ రంగు కలిగిన మరో బ్లేడు, లేఖ స్వా«ధీనం చేసుకున్నాం’’ అని పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. నిందితుడు నేరం అంగీకరించాడు ‘‘విచారణలో నిందితుడు నేరం అంగీకరించాడు. మధ్యవర్తుల సమక్షంలో నిందితుడి వాంగ్మూలాన్ని 25వ తేదీ రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య రికార్డు చేశాం. శ్రీనివాసరావుపై తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం పోలీస్ స్టేషన్లో క్రైం నంబరు 48/2017, సెక్షన్ 323, 506 కింద కేసులు నమోదై ఉన్నట్టు తేలింది. అరెస్టు సమయంలో సర్వోన్నత న్యాయస్థానం సూచనలను పాటించాం. కేసు రాజకీయంగా సున్నితమైంది కావడం వల్ల మధురవాడ ఏసీపీ బీవీఎస్ నాగేశ్వరరావు నేతృత్వంలో ప్రత్యేక విచారణ బృందాన్ని(సిట్) ఏర్పాటు చేశాం’’ అని కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో ఎయిర్పోర్ట్ పోలీస్‌స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మళ్ల శేషు తెలియజేశారు. లేఖ పేజీలపై అస్పష్టత మొదటి నుంచీ అనుమానిస్తున్న విధంగానే దుండగుడు శ్రీనివాసరావు నుంచి స్వాధీనం చేసుకున్న లేఖపై రిమాండ్ రిపోర్ట్‌లో అస్పష్టత నెలకొంది. 10 పేజీల లేఖ అని ఓసారి, 11 పేజీల లేఖ అని మరోసారి రిపోర్టులో పేర్కొన్నారు. జగన్మోహన్రెడ్డిని హత్య చేయడానికే శ్రీనివాసరావు కత్తి దూశాడని రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేసిన పోలీసులు అతడు జగన్ అభిమాని అని, వైఎస్సార్సీపీకి గట్టి మద్దతుదారు అని పేర్కొనడం గమనార్హం. -
జగన్‌పై హత్యాయత్నం: దారితప్పిన దర్యాప్తు
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని హత్య చేయడానికి జరిగిన ప్రయత్నానికి సంబంధించి సాగుతున్న దర్యాప్తు తీరుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. జరిగిన సంఘటన, దాని పూర్వాపరాలు, పరిణామ క్రమాన్ని లోతుగా విశ్లేషిస్తే తెరవెనుక పెద్ద కుట్రే జరిగిందనడానికి బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. సంఘటనపై ముఖ్యమంత్రి, మంత్రులు, డీజీపీ స్పందించిన తీరు అనుమానాలు రేకెత్తించగా, గత రెండురోజులుగా జరుగుతున్న పరిణామాలు వారి మాటల ప్రభావం దర్యాప్తుపై పడినట్టు స్పష్టమవుతోంది. ఏదైనా చిన్న సంఘటన (నేరం) జరిగినప్పుడు దానిపై పోలీసులు దర్యాప్తు చేయడానికి అనేక అంశాలను నిశితంగా పరిశీలించిన తర్వాత ఒక నిర్ధారణకు రావడం సహజం. అలా నిర్ధారణకు వచ్చిన తర్వాతే ఆ ఘటనకు సంబంధించిన పూర్వాపరాలను వెల్లడిస్తారు. కీలకమైన లేదా సున్నితమైన కేసుల్లో ఒక్కోసారి ఆధారాలు తారుమారవుతాయని లేదా దర్యాప్తు ప్రభావితమవుతుందన్న కారణంగా చార్జీషీట్ దాఖలు చేసేంతవరకు వివరాలు వెల్లడించరు. కానీ జగన్‌పై హత్యాయత్నం జరిగిన గంట నుంచే పరిణామాలు శరవేగంగా మారాయి. అత్యంత కీలకమైన ఈ కేసులో దర్యాప్తు జరపాల్సిన అనేక కోణాలను అధికారులు విస్మరించడం గమనార్హం. దర్యాప్తు కోణాలను వదిలిపెట్టడమే కాకుండా కీలకమైన ఆధారాలు సేకరించే విషయంలో జరుగుతున్న జాప్యం కూడా కావాలనే చేస్తున్నట్టు కనబడుతోంది. ఈ కేసులో కిందిస్థాయిలో దర్యాప్తును తీవ్ర ప్రభావం చేసే రీతిలో ముఖ్యమంత్రి, మంత్రులు, రాష్ట్ర డీజీపీ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో న్యాయం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. హైకోర్టును ఆశ్రయించిన తర్వాత పోలీసులు కొంత హడావిడి చేయడం ప్రారంభించినట్టు కూడా కనబడుతోంది. ఎయిర్‌పోర్ట్‌లోని వీఐపీ లాంజ్ సమీపంలోని ఫ్యూజన్ ఫుడ్స్ హోటల్లో ఎందుకు తనిఖీ చేయలేదు? హైదరాబాద్‌లో శుక్రవారం కోర్టుకు హాజరుకావడానికి జగన్ మోహన్ రెడ్డి బయలుదేరినప్పుడు విశాఖ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. దాడి చేసిన వ్యక్తి ఎయిర్‌పోర్టులోని ఫ్యూజన్ హోటల్లో పనిచేస్తాడని తెలుసు. అలాంటప్పుడు దాడి జరిగిన వెంటనే అధికారులు సదరు హోటల్లో అనువణువూ శోధించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే.. నిందితుడు ఇంకా ఏమైనా ఆయుధాలు సేకరించాడా? తన పథకాన్ని అమలు చేయడానికి హోటల్‌ను ఏ విధంగా వాడుకున్నాడు? లేదా హోటల్లో మిగతా వారెవరైనా దీనికి సహకరించారా? సేకరించిన ఆయుధాలను హోటల్లో ఎక్కడ భద్రపరిచాడు? అసలు మొత్తంగా ఎన్ని ఆయుధాలు సమకూర్చుకున్నాడు? హోటల్లో రోజూవారి చర్యలేంటి? ఇతర పనివాళ్లతో ఎలా ఉంటాడు? తరుచూ హోటల్‌కు ఎవరెవరు వచ్చేవాళ్లు? ఎవరెవరితో సన్నిహితంగా మెదిలేవాడు? జగన్ ఎయిర్‌పోర్టులో ప్రవేశించడానికి ముందు దాడి చేసిన వ్యక్తి ఎక్కడున్నాడు? ఇలాంటి ఎన్నో అంశాలను దర్యాప్తు అధికారులు పరిగణలోకి తీసుకోవాలి. కీలకమైన కేసుల్లో ఇలాంటి కోణంలో దర్యాప్తు మరింత లోతుగా సాగితే తప్ప నిజాలు బయటకు రావు. అలా జరగాలంటే అవసరమైతే కొంతకాలం వరకు హోటల్‌ను సీజ్ చేయాలి. లేదా ఇతరులెవరూ ప్రవేశించకుండా తమ ఆధీనంలోకి తీసుకుని ముమ్మర తనిఖీలు నిర్వహించాలి? కానీ రిమాండ్ రిపోర్టు పరిశీలిస్తే దర్యాప్తు అధికారులు వీటన్నింటినీ పట్టించుకోలేదని స్పష్టమవుతుంది. కీలకమైన ఇలాంటి అంశాలను ఎవరి కోసం, ఎందుకోసం వదిలిపెట్టినట్టు? రెస్టారెంట్ యజమానిని ఎందుకు వదిలేశారు? కీలకమైన కేసుల్లో నిజాలు కక్కించడానికి పోలీసులు ఎన్నెన్ని మార్గాలు అనుసరిస్తారో అందరికీ తెలిసిందే. ఈ కేసులో కూడా అత్యంత కీలకం రెస్టారెంట్ యజమాని. ఎందుకంటే, విమానాశ్రయమంటే దేశ భద్రతకు సంబంధించిన అంశాలు అనేకం ముడిపడి ఉండటమే కాకుండా వీవీఐపీలు పర్యటించే అత్యంత కీలకమైన ప్రాంతం. అలాంటి చోట వ్యాపారం కొనసాగిస్తున్నందున ఆ వ్యక్తిని తక్షణం విచారించాల్సిన అవసరం ఉంటుంది. దేశ ప్రధానమంత్రి, రక్షణమంత్రి మరెవరైనా విశాఖ రావాలన్నా అదే విమానాశ్రయంలో దిగాల్సిందే. అలాంటి కీలకమైన ప్రాంతంలో నడుస్తున్న హోటల్లో పనిచేస్తున్న వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడినప్పుడు పోలీసులు యజమానిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించకుండా ఎందుకు వదిలిపెట్టినట్టు? వైఎస్సార్ కాంగ్రెస్ నేతలతో పాటు ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెళ్లువెత్తిన తర్వాత యజమానిని అది కూడా రెండ్రోజుల తర్వాత చుట్టపుచూపుగా పోలీస్ స్టేషన్‌కు ఆహ్వానించి తూతూ మంత్రంగా స్టేట్మెంట్ రికార్టు చేస్తారా? అది కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత మాత్రమే పిలవడంలోని మతలబేంటి? హోటల్‌ను తనిఖీ చేయకపోగా, యజమానిని కూడా అంత సులభంగా ఎందుకు వదిలిపెట్టినట్టు? ఆరోజు ఎక్కడున్నారు? విమానాశ్రయంలోని ఫ్యూజన్ రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ టీడీపీకి చెందిన వ్యక్తి అని తెలిసిందే. అయితే ఇంతటి తీవ్రమైన ఘటన జరిగినప్పుడు దర్యాప్తులో భాగంగా హోటల్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు యజమానిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తారు. ఆ పని ఎందుకు చేయలేదు? దాడికి పాల్పడిన వ్యక్తికి సంబంధించి అనేక విషయాలు యజమానికే ఎక్కువగా తెలుస్తాయి. ఎందుకంటే ఆ వ్యక్తిని పనిలో పెట్టుకున్నది ఆ యజమానే కాబట్టి. అయితే, ఆ వ్యక్తి ముఖ్యమంత్రికి సన్నిహితుడు కావడం, విమానాశ్రయంకు వచ్చే టీడీపీ ప్రముఖులకు చాలా మందికి అక్కడ సపర్యలు జరుగుతుండటంతో పాటు ఘటన అనంతరం ముఖ్యమంత్రి, డీజీపీ చేసిన వ్యాఖ్యలే యజమానిని అదుపులోకి తీసుకోకపోవడానికి కారణంగా భావించాల్సి వస్తోంది. హోటల్ యజమాని ఆరోజు ఎక్కడున్నారు? ఎప్పుడెప్పుడు వస్తుంటారు? వచ్చినప్పుడు ఏం చేస్తుంటారు? దాడికి పాల్పడిన వ్యక్తిని ఎక్కడ పరిచయం? ఎలా పరిచయం? ఈ రకంగా ఎన్నో శోధిస్తే తప్ప కొన్ని నిజాలు బయటకు రావు. కానీ ఆ కోణంలో దర్యాప్తు సాగలేదన్నది రిమాండ్ రిపోర్టును బట్టి తెలుస్తోంది. ఎయిర్‌పోర్టు ఎంట్రీ వద్ద ఏం నమోదైంది? విమానాశ్రయం అంతటా సీసీ కెమెరాలున్నాయి. ఎయిర్‌పోర్టులో ప్రవేశించే ప్రధాన ద్వారం నుంచి సెక్యూరిటీ చెక్ ప్రాంతంతో పాటు అంతటా సీసీ కెమెరాలు ఉన్నప్పుడు గడిచిన కొద్ది రోజులుగా నిందితుడి కదలికలకు సంబంధించి సీసీ ఫుటేజీని ఎందుకు పరిశీలించలేదు? సీసీ ఫుటేజీ ఉన్నట్టుగా ఎందుకు ప్రకటించడం లేదు? కేసుకు సంబంధించి ఎన్ని కోణాల్లో వీలైతే అన్ని కోణాల్లో శోధించి నిజాలు వెలికి తీయడానికి అత్యంత కీలకంగా సీసీ ఫుటేజీ ఉపయోగపడుతుంది. సీసీ ఫుటేజీ విషయంలో ఎందుకు దోబూచులాట. ఇంత జాప్యం చేసిన తర్వాత సీసీ ఫుటేజీ ఉంటుందన్న గ్యారెంటీ ఏంటి? జాప్యం చేసినందువల్ల పుటేజీ ఆధారాలు తారుమారు కావన్న గ్యారంటీ ఏంటి? సంఘటన జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలు లేవనీ, దాడికి పాల్పడిన వ్యక్తి సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి కంట బడకుండా విమానాశ్రయంలో తిరుగుతున్నాడని కూడా పోలీసులు చెబుతున్నారంటే... ఇంతకన్నా ఘోరమేమైనా ఉంటుందా? దీన్ని బట్టి విమానాశ్రయం అనువణువూ ఆ వ్యక్తికి తెలిసినట్టే భావించాలి. లేదంటే ఇదంతా ఒక పథకం ప్రకారం జరుగుతుందా? నిజానికి విమానాశ్రయంలోని ఎస్టాబ్లిష్మెంట్స్లో పనిచేసే సిబ్బంది ప్రతి ఒక్కరినీ తనిఖీ చేయకుండా లోనికి వదలరన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటిది ఈ నిందితుడిని ఎందుకు తనిఖీ చేయలేదు? చేసి ఉంటే కత్తులు లోనికి ఎలా వెళ్తాయి? నిజానికి ఆ కత్తులను నిందితుడే లోనికి తీసుకెళ్లాడా? లేక వేరెవరైనా సమకూర్చారా? లోనికి చేరవేయడానికి మరెవరైనా సహకరించారా? అన్న అనుమానంపై పోలీసులు దర్యాప్తు చేయకపోవడానికి కారణాలేంటి? పోలీసులు చెబుతున్న దాన్ని బట్టి దాడికి పాల్పడిన వ్యక్తి ఒక రోజు ముందు మాత్రమే ఆ ఆయుధాలను తెచ్చాడని చెబుతున్నారు. అలా అని ఏ రకంగా పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు? ఆ వ్యక్తి చెప్పిందే వేదంగా భావించడంలోని ఆంతర్యమేంటి? ఇతర మార్గాలతో నిర్ధారణకు రావలసిన అవసరం లేదా? లేఖల లోతుల్లోకి ఎందుకు వెళ్లడం లేదు? హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న తర్వాత పరస్పర విరుద్ధమైన ప్రకటనలు ఎందుకు వెలువడ్డాయి. మొదట పందెం కోళ్లకు వాడే కత్తిని స్వాధీనం చేసుకుని సిబ్బంది లేఖ విషయాన్ని గానీ రెండో ఆయుధం కత్తి ఉన్నట్టు గానీ తొలుత చెప్పలేదు. డీజీపీ స్పందించిన అనంతరం ఒక్కసారిగా లేఖ అంశం బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ వ్యక్తి వద్ద స్వాధీనం చేసుకున్నట్టు చెబుతున్న లేఖలో ఉన్న చేతిరాత ఒకతీరుగా లేదని మీడియా బయటపెట్టిన తర్వాత... నిజమే చేతిరాత వేర్వేరుగా ఉందని మరుసటి రోజు నిర్ధారించడంలోని ఆంతర్యమేంటి? చేతిరాత వేర్వేరుగా ఉన్నప్పుడు పేపర్ (కాగితం) వేర్వేరుగా ఉందా? వేర్వేరు పెన్నులు (సిరా) వాడినట్టు తేలిందా? లేఖలో పేర్కొన్న అంశాలు ఆ వ్యక్తి స్వయంగా డిక్టేట్ చేశాడా? డబ్బులు లేక ఇంటర్మీడియట్ తొలి సంవత్సరంలోనే విద్యను ఆపేసిన వ్యక్తి లేఖలు రాయలేక వేరే వాళ్లతో రాయించాడా? ఆ వ్యక్తి డిక్టేట్ చేస్తుంటే రాశారా? అందులో పేర్కొన్న అంశాలను తిరిగి చెప్పగలడా? ఒక కీలకమైన కేసులో నిజానిజాలు వెల్లడి కావాలంటే ఇలాంటి అంశాలు ఎంతో కీలకంగా మారుతాయి. కానీ దర్యాప్తు అధికారులు ఎందుకో వాటిని పట్టించుకోలేదు. సమాధానాలు దొరకని రిమాండ్ రిపోర్ట్ ఇలాంటి సున్నితమైన కేసుల్లో స్వాధీనం చేసుకున్న ఆయుధాల వివరాలను రాసేప్పుడు అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. చాలా జాగ్రత్తలు పాటించాలి. ఈ రిమాండ్ రిపోర్టులో మాత్రం పోలీసులు ఎందుకనో... హత్యాయత్నానికి వాడిన ఆయుధం చాలా చిన్నదని చెప్పడానికి అనేకసార్లు ప్రయత్నం చేశారు. రిమాండ్ రిపోర్ట్‌లో దాడి చేసిన వ్యక్తి వాడిన ఆయుధం – వెరీ స్మాల్ నైఫ్ (సాధారణంగా ఒక నైఫ్ అని రాసి దాని సైజ్ రాస్తారు) కానీ ఇక్కడ పోలీసులు ఒకటికి రెండుసార్లు వెరీ స్మాల్ నైఫ్ అని రాయడం గమనిస్తే ముఖ్యమంత్రి, డీజీపీ నోట్లోనుంచి వచ్చిన మాటలకు అనుగుణంగానే స్క్రిప్ట్ ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఇకపోతే, రెండో ఆయుధం... వెరీ బ్లేడ్ టైప్ ఇన్స్ట్రుమెంట్ అని రాశారు. హత్యాయత్నం కేసుల్లో సాధారణ బ్లేడ్ సైతం ఆయధమే అవుతుంది తప్ప అదో ఇన్స్ట్రుమెంట్ అని రాయడం మరీ విడ్డూరం. ఎవరైనా బ్లేడ్‌తో దాడి చేశారనుకుంటే... బ్లేడ్‌తో దాడి చేశారనే రాస్తారు తప్ప బ్లేడ్ వంటి ఒక వస్తువును ఉపయోగించారని రాయరు. ఆ రాసిన తీరు కూడా ఎలా ఉందంటే... ఆ వ్యక్తి హోటల్లో పనిచేస్తున్నందున ఆ ఆయుధాన్ని చంపడానికి కాకుండా హోటల్లో పనిచేస్తున్నాడు కాబట్టి రేపటి రోజున కూరగాయలు తరగడానికి పెట్టుకున్నాడన్నా ఆశ్చర్యపోనక్కరలేదు. అందుకు ఆస్కారం కలిగించే రీతిలో పదప్రయోగం ఉండటం విడ్డూరం. ఇంతకు లేఖ ఎన్ని పేజీలు హత్యాయత్నం చేసిన వ్యక్తి నుంచి స్వాధీనం చేసుకున్న లేఖ అంశం మొదటి నుంచి అనుమానాస్పదంగానే ఉంది. 9 పేజీలు, 10, 11, 12 పేజీలు ఇలా రోజుకో రకంగా వార్తలొచ్చాయి. దీనిపై రిమాండ్ రిపోర్ట్ ఏం రాశారంటే... హత్యాయత్నం చేసిన వ్యక్తిని ఆసాంతం తనిఖీ చేశామని, అతడి వద్ద 11 పేజీల లేఖ ఒకటి స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. ఆ తర్వాత క్రమంలో (సరిగ్గా చెప్పాలంటే మరో అయిదు లైన్ల తర్వాత) సదరు వ్యక్తి నుంచి ఏమేమి స్వాధీనం చేసుకున్నామో తెలిపే జాబితా ఒకటి ఇచ్చారు. అందులో 10 పేజీల లేఖ అని పేర్కొన్నారు. రిమాండ్ రిపోర్ట్‌లోని అయిదు లైన్లలోనే ఈ రకమైన వ్యత్యాసం ఉండటం దర్యాప్తు ఎంత తేలికభావంతో కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు. నెల రోజుల ఐడీ కార్డు హత్యాయత్నం చేసిన వ్యక్తి అసలు ఎంతకాలం నుంచి విమానాశ్రయంకు వస్తున్నారు. ఎందుకంటే పోలీసులు పేర్కొన్న రిమాండ్ రిపోర్ట్‌లో అతడి (శ్రీనివాస్) ఐడీ నంబర్ కేవలం నెల రోజులకు మాత్రమే అనుమతి ఉంది. అతని ఐడీ కార్డు ప్రకారం గత సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 29 తో ముగుస్తుంది. (VEP No.VTZ-27645 Valid from 30-9-2018 to 29-10-2018) కార్డు వాలిడిటీ అమలులోకి వచ్చిన రోజు ఆదివారం (సెప్టెంబర్ 30) కావడం గమనార్హం. మరో నాలుగు రోజుల్లో కాలపరిమితి (29 వ తేదీ సోమవారంతో) ముగుస్తుండగా, 25 వ తేదీ హత్యాయత్నం జరిగింది. విమానాశ్రయాల్లో పని చేసే సిబ్బంది వేర్వేరు పేర్లతో ఎయిర్పోర్ట్ ఎంట్రీ పాస్ (ఏఈపీ) లు తయారు చేస్తున్నారన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయాలని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) 2016 లో కొన్ని మార్గదర్శకాలను రూపొందించి, వాటిని అమలు చేయాలని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) ను నిర్ధేశించింది. విమానాశ్రయాల్లో పనిచేసే ఎలాంటి సిబ్బంది అయినా ఆధార్‌తో లింక్ అయి ఉన్న ఎయిర్పోర్ట్ ఎంట్రీ పాస్ (ఏఈపీ) ఐడీ కార్డు (బయోమెట్రిక్స్ పవర్డ్ ఆధార్ నంబర్) ను మాత్రమే జారీ చేయాలి. 2017 జనవరి 1 వ తేదీ నుంచి దీన్ని కచ్చితంగా అమలు చేయాలి. కానీ ఇక్కడ జగన్‌పై హత్యయత్నానికి పాల్పడిన వ్యక్తి ఐడీ కార్డు కేవలం నెల రోజులకు మాత్రమే జారీ చేసినట్టు రిమాండ్ రిపోర్టులో ఉండటం గమనార్హం. ఇకపోతే, ఎయిర్‌పోర్టు లోని వీఐపీ లాంజ్‌లోకి ఫ్యూజన్ ఫుడ్స్ నుంచి ఇద్దరు వ్యక్తులు జగన్ దగ్గరకు వచ్చారని అందులో ఒకరు రమాదేవి కాగా మరొకరు హత్యాయత్నం చేసిన శ్రీనివాస్‌గా పేర్కొన్నారు. రమాదేవి ఐడీ నంబర్ (ఏఈ నం. వీటీజెడ్–276577 ) గా ఆరు అంకెలతో కూడి ఉండగా, జగన్‌పై హత్యాయత్నం చేసిన శ్రీనివాసరావు ఐడీ నంబర్ అయిదు డిజిట్లతో ఉంది. నిబంధనల ప్రకారం శ్రీనివాస్ అనే వ్యక్తిది ఆధార్ లింక్ చేసిన ఐడీ అయినట్టయితే ఆధార్ వివరాలు ఏవి? ఎందుకు వెల్లడించలేదు? అసలు ఇలాంటి గుర్తింపు కార్డు ఎంతకాలం కిందట జారీ అయింది. ఈ కోణంలో వివరాలను ఎందుకు సేకరించలేదు? విచారణలో వీటినెందుకు విస్మరించారు? ఈ వ్యక్తి ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్లో వంటవాడిగా – సర్వీస్ అసిస్టెంట్‌గా ఏడాది కిందటే చేరినట్టు రిమాండ్ రిపోర్టులో చెప్పారు. ఏడాది కింద చేరిన వాడికి నెల రోజులు మాత్రమే అనుమతించే ఐడీ కార్డు ఎందుకు జారీ చేశారు? ప్రతి నెల వేర్వేరు కార్డులు జారీ చేస్తున్నారా? అలా చేయడం ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ నిబంధనలకు అనుగుణంగా జరుగుతుందా? విచిత్రమేమంటే... హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి జగన్ మోహన్‌రెడ్డికి ఒక వినతి పత్రం ఇవ్వాలని అనుకున్నారని, అందుకోసం చిన్న కత్తులు సమకూర్చుకున్నారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. జగన్‌కు వినతిపత్రం ఇవ్వాలంటే కత్తులు సమకూర్చుకోవాలా? ఏమిటీ విడ్డూరం. దుబాయ్‌లో ఎంతకాలం? దాడికి పాల్పడిన వ్యక్తి ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా ఇంటర్ మొదటి సంవత్సరంలోనే ఆపేసినట్టు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. అలాగే కొంతకాలం దుబాయ్ వెళ్లి అక్కడ వెల్డర్ అసిస్టెంట్‌గా పనిచేసినట్టు పేర్కొన్నారు. కొంతకాలం అన్నారే తప్ప ఎంతకాలం? ఎప్పటి నుంచి ఎప్పటివరకు పనిచేశాడు? ఎప్పుడు తిరిగొచ్చాడు? తిరిగొచ్చాక ఏం చేశాడు? అతడి పాస్‌పోర్ట్ ఎక్కడుంది? అందులో వివరాలేంటి? ఎక్కడి నుంచి పాస్‌పోర్టు పొందాడు? వంటి వివరాలేవీ అందులో లేవు. నిష్పాక్షిక విచారణ ఒక్కటే మార్గం విశాఖ విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటనను లోతుగా విశ్లేషించినప్పుడు అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. మంత్రులు, డీజీపీ, ముఖ్యమంత్రి లాంటి వాళ్లు ఈ ఘటనకు సంబంధించి చాలా తేలికగా మాట్లాడిన మాటల ప్రభావం దర్యాప్తుపై తీవ్రంగా ఉన్నట్టు అది సాగుతున్న దిశను బట్టి విధితమవుతోంది. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు రెండో వారంలో విశాఖ జిల్లాలో ప్రవేశించడానికి ముందునుంచి కూడా అనేకసార్లు విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి హైదరాబాద్ వచ్చిన విషయం తెలిసిందే. ఆయన ఎప్పుడెప్పుడు విమానాశ్రయం వస్తారన్న సమాచారం అందరికి తెలిసిందే. గడిచిన మూడు నెలల్లో జగన్ అనేకసార్లు విశాఖ విమానాశ్రయం వచ్చారు. దాన్ని బట్టి హత్యకు చాలా పకడ్బందీ కుట్ర జరిగిందనే ప్రస్తుత పరిస్థితులను బట్టి అర్థమవుతోంది. జగన్‌ను హతమార్చడానికి రెక్కీ కూడా జరిగి ఉంటుందన్న అనుమానాలు పార్టీ నేతల్లో ఉంది. దర్యాప్తు సాగుతున్న తీరు ఈ అనుమానాలను నివృతి చేయలేవని కూడా అంటున్నారు. ఈ మొత్తం ఘటన వెనుక దాగివున్న కుట్ర బయటపడాలంటే సమగ్ర నిష్పాక్షిక విచారణ ఒక్కటే మార్గం. కుట్రదారులెవరు.. సూత్రధారులెక్కడ? అది హత్యాయత్నమే: రిమాండ్ రిపోర్టు దుండగుని తీగలాగితే... ‘దేశం’ డొంక కదులుతోంది శ్రీనివాస్ ఫ్లాట్‌లోని వేరే గదిలో ఇద్దరమ్మాయిలు! -
జగన్‌పై హత్యాయత్నం ప్రభుత్వ కుట్రే
హైదరాబాద్: వైఎస్ఆర్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన హత్యాయత్నం వెనుక అధికార టీడీపీ ప్రభుత్వం కుట్ర ఉందని తెలంగాణ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి కె.శివకుమార్ అన్నారు. జగన్‌పై జరిగిన హత్యాయత్నాన్ని నిరసిస్తూ శనివారం లోయర్ ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్ విగ్రహనికి వినతిపత్రం అందించి నిరసన తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం శివకుమార్ మాట్లాడుతూ, జగన్మోహన్రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేకే హత్యాయత్నం చేశారని అన్నారు. డీజీపీ పూర్తిగా దర్యాప్తు చేయకుండానే చంద్రబాబు మాటలను వల్లె వేస్తున్నారని ఆరోపించారు. ఎయిర్పోర్ట్ సిబ్బంది తనిఖీలు చేసినప్పుడు లేని 10 పేజీల పత్రాలు ఎవరు సృష్టించారో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తక్షణమే ఈ ఘటనపై హైకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో దర్యాప్తు చేయించి నిజానిజాలను తేల్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీఈసీ సభ్యులు ఎస్.భాస్కర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు మాదిరెడ్డి భగవంతరెడ్డి, రాష్ట్ర యూత్ అధ్యక్షులు రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
జగన్ హత్యకు కుట్ర.. బాబే ఏ– వన్!
సాక్షి, అమరావతి: తమ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హత్యకు సాక్షాత్తూ అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వమే ఒక పక్కా ప్రణాళికతో కుట్ర పన్నిందని వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. ఈ కుట్రలో ప్రధాన నిందితుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడైతే... డీజీపీ ఠాకూర్ 2వ నిందితుడని ఆ పార్టీ ఆరోపించింది. జగన్‌పై విశాఖపట్టణం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం వల్ల తమ పార్టీ శ్రేణులకు తగిలిన షాక్ కన్నా... ఆ ఘటన తరువాత డీజీపీ, రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరు, చేస్తున్న వ్యాఖ్యలు మరింత దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయని పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘జగన్‌పై జరిగిన హత్యాయత్నం వెనుక అసలు సూత్రధారి చంద్రబాబే అయినపుడు ఆయన ఆదేశించిన విచారణ నిష్పాక్షికంగా జరుగుతుందని మేమెలా విశ్వసిస్తాం?’’అని వారు ప్రభుత్వం తీరుపై విరుచుకుపడుతున్నారు. సంఘటన జరిగిన గంటలోపే ఈ హత్యాయత్నాన్ని వైఎస్సార్‌సీపీపైకి నెట్టేసి డీజీపీ చేతులు దులిపేసుకోవడం, ఆ తరువాత చంద్రబాబునాయుడు వెకిలిగా మాట్లాడ్డం చూస్తే ఇంకా వీరి విచారణను ఎలా నమ్మాలి? అని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే తాము కేంద్ర దర్యాప్తు సంస్థలచేత నిష్పాక్షిక విచారణను కోరుతున్నామని పార్టీ నేతలు డిమాండ్ చేశారు. అంత ఉన్మాదమా... రాష్ట్ర డీజీపీ ఠాకూర్ ముఖ్యమంత్రి చెబుతున్నట్లు ఆడుతున్నాడని, ముఖ్యమంత్రి వ్యవహారశైలి ప్రజాస్వామ్యంలో ఏ మాత్రం ఆమోదయోగ్యంగా లేదని, ఆయన ఉన్మాదంతో మాట్లాడుతున్నారని పలువురు పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. అసలు ప్రతిపక్ష నేతను ఉద్దేశించి విలేకరుల ముందరే ఆయన వాడిన పదజాలం చూస్తే ముఖ్యమంత్రికి ఎంత అక్కసు ఉందో... కడుపులో జగన్‌పై ఎంతటి విషం దాచుకుని ఉన్నారో అర్థం అవుతోందని వారు ధ్వజమెత్తారు. (వైఎస్ జగన్‌తో కేసీఆర్ మాట్లాడితే...) ఈ ఉదంతంలో చంద్రబాబు ఓ ముఖ్యమంత్రి గా ప్రతిపక్ష నేత పట్ల ప్రదర్శించాల్సిన కనీస మర్యాదను గాని, సంప్రదాయాన్ని గాని పాటించలేదని పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ‘వాడు, వీడు’అని ప్రతిపక్ష నేతను ఉద్దేశించి మాట్లాడ్డం చూస్తే చంద్రబాబుకు ఏ కోశానా మానవత్వం అనేదే లేదని, ఆయన మొహంలో క్రూరత్వమే కనపడుతోందని దుయ్యబట్టారు. విమానాశ్రయంలోకి అసలు కత్తి ఎలా వచ్చిందనే ప్రశ్నను పక్కకు నెట్టేసి చంద్రబాబు హేళనగా మాట్లాడ్డం చూస్తే ఇక ఈ ప్రభుత్వం నియమించే విచారణ ఎలా సాగుతుందో చెప్పకనే చెబుతోందన్నారు. (వైఎస్ జగన్‌పై హత్యాయత్నం) పూర్తిస్థాయి విచారణకు ఆదేశిస్తారని ఆశించాం.. ఈ సంఘటన జరిగినపుడు ప్రభుత్వం వెంటనే స్పందించి పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తుందని, వాస్తవాలు వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుందని తొలుత ఆశించామని, కానీ ప్రతిపక్ష నేతపై జరిగిన హత్యాయత్నంపై ఏ మాత్రం సానుభూతి లేకుండా అదేదో డ్రామా కింద అధికారపక్షం కొట్టి పారేయడం తీవ్ర ఆక్షేపణీయమని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ ఉదంతంపై దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్ బృందం విచారణను ప్రతిపక్ష నేతతో పాటు పార్టీ నేతలు కూడా నిరాకరింనారు. సిట్ బృందాన్ని వెనక్కి పంపారు. రాష్ట్ర పోలీసు యంత్రాంగం అధిపతి అయిన డీజీపీ ఒక వైపు, ముఖ్యమంత్రి మరోవైపు ఈ సంఘటనపై తేలికగా, హేళన పూరితంగా మాట్లాడ్డం చూసిన తరువాత పార్టీ శ్రేణులు టీడీపీ ప్రభుత్వ పాలనలో తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదనే అభిప్రాయానికి వచ్చాయి. నిందితుడు శ్రీనివాస్‌ను జగన్ ఫ్యాన్ (అభిమాని)గా చెప్పడం, పబ్లిసిటీ కోసమే ఈ సంఘటనకు పాల్పడ్డాడని నిర్థారించడం, చంద్రబాబు కూడా అదే పనిగా జగన్‌పైనే నిందలు వేస్తూ మాట్లాడ్డం చూస్తుంటే.. ప్రభుత్వమే జగన్ హత్యకు కుట్ర పన్నిందన్న అనుమానాలు బలపడుతున్నాయని పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు. విశాఖ విమానాశ్రయంలోని క్యాంటీన్ యజమానిని విచారించాలని తాము ఎంత డిమాండ్ చేస్తున్నా పోలీసులు ఎందుకు పెడచెవిన పెడుతున్నారని వారు ప్రశ్నించారు. చదవండి ప్రొఫెషనల్ కిల్లర్లతో శ్రీనివాసరావుకు తర్ఫీదు..! జేబులో మడిచి పెట్టినా నలగని లేఖ! ఆస్పత్రి నుంచి వైఎస్ జగన్ డిశ్చార్జ్ మీ విచారణపై నమ్మకం లేదు -
హైదరాబాద్ చేరుకున్న సిట్ బృందం
సాక్షి, హైదరాబాద్ : ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన హత్యాయత్నం కేసుకు సంబంధించి స్టేట్మెంట్ను రికార్డు చేయడానికి ఏపీ సిట్ అధికారులు హైదరాబాద్ చేరుకున్నారు. అడిషనల్ డీసీపీ మహేంద్ర పాత్రుడి నేతృత్వంలో డీఎస్పీ నాగేశ్వరరావు , మరో ఇద్దరు ఇన్స్పెక్టర్ల బృందం వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నానికి సంబంధించిన వాంగ్మూలాన్ని రికార్డు చేసుకోనున్నారు. విశాఖలో దాడి అనంతరం హైదరాబాద్ చేరుకున్న జగన్.. ప్రస్తుతం సిటీ న్యూరోలో చికిత్స తీసుకుంటున్నారు. వైఎస్ జగన్ హెల్త్ రిపోర్ట్ వచ్చిన తరువాత ఆయన స్టేట్మేంట్ ను సిట్ అధికారులు రికార్డు చేస్తారు. ఇక్కడ చదవండి : వైఎస్ జగన్‌పై హత్యాయత్నం! నిందితుడి జేబులో లెటర్ : పథకం ప్రకారమే దాడి దాడిపై అనుమానాలెన్నో? -
ఇది ఏపీపై దాడే!
-
ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు సిగ్గుచేటు
-
విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో వైఎస్ జగన్‌పై కత్తితో దాడి
-
ఎయిర్‌పోర్టులోకి నిందితుడు కత్తితో ఎలా వచ్చాడు?
-
ప్రజాస్వామ్యంలో మరో చీకటి రోజు..
విశాఖపట్నం ఎయిర్‌పోర్టు వేదికగా ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగింది. అదృష్టవశాత్తూ ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఎయిర్‌పోర్టులోని ఓ రెస్టారెంట్ వెయిటర్ కాఫీ ఇచ్చి.. సెల్ఫీ అడిగి చేరువగావచ్చి పందెంకోళ్లకు ఉపయోగించే పదునైన కత్తితో జగన్‌పై దాడిచేశాడు. గొంతు లక్ష్యంగా దాడి జరిగినా జగన్ అప్రమత్తమై పక్కకు తిరగడంతో ఎడమ భుజంలో కత్తి దిగింది. నిందితుడిని సీఐఎస్ఎఫ్ సిబ్బంది అరెస్టు చేసి ఏపీ పోలీసులకు అప్పగించారు. ఎయిర్‌పోర్టులో ప్రాథమిక చికిత్స అనంతరం జగన్ హైదరాబాద్ పయనమయ్యారు. హైదరాబాద్‌లో ఆయనకు శస్త్రచికిత్స చేసి 9 కుట్లు వేసినట్లు వైద్యులు ప్రకటించారు. ఆ కత్తికి విషపూరిత రసాయనాలు ఏమైనా పూసి ఉంటారా అన్న అనుమానంతో పరీక్షలు జరుపుతున్నారు. అభిమాన నేతకు ఏం జరుగుతుందోనన్న భయంతో పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. దాడి ఘటన జరిగిన గంటలోపే ఏపీ డీజీపీ విలేకరుల ముందుకు వచ్చి నిందితుడి గురించి ఉద్దేశపూర్వక ప్రకటనలు చేయడంతో ఈ వ్యవహారం ఏయే మలుపులు తిరుగుతుందో ముందే వెల్లడయిపోయింది. పబ్లిసిటీ కోసమే నిందితుడు ఆ ప్రయత్నం చేశాడని, వాస్తవానికి అతను జగన్ అభిమాని అని డీజీపీ ప్రకటించేశారు. అదే పల్లవిని మంత్రులు అందుకున్నారు. మధ్యలో హాస్యనటుడు శివాజీ రచించిన ‘గరుడపురాణం’ కూడా వచ్చి చేరింది. నిందితుడి జేబులో ఓ లేఖను సృష్టించారు.. నిందితుడితో వీడియో వాంగ్మూలం ఇప్పించారు. అది మధ్యాహ్నం డీజీపీ చెప్పినట్లే అచ్చుగుద్దినట్లు వచ్చింది. ఇక రాత్రికి ఏపీ ముఖ్యమంత్రి తెర ముందుకు వచ్చారు. తలాతోకా లేని వాదనలతో అందరినీ నిశ్చేష్టులను చేశారు. రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు, ఒక పార్టీ అధినేతపై హత్యాయత్నం జరిగితే పరామర్శించడం కనీస సంప్రదాయం. కానీ ఏపీ ముఖ్యమంత్రి ఆ విషయం వదిలేశారు. పైగా వెకిలిగా నవ్వుతూ ఎద్దేవా చేయడానికి ప్రయత్నించడం శోచనీయం. ఇలాంటి ఘటన జరిగినపుడు భద్రతా లోపాలు సరిదిద్దాల్సిన బాధ్యతను మరచి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఎదురుదాడి చేయడం.. లేనిపోని అబద్దపు సాక్ష్యాలు సృష్టించి ఈ వ్యవహారాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించడం చూసి ప్రజలు నిశ్చేష్టులవుతున్నారు. కాగా, ఢిల్లీ నుంచి గల్లీ వరకు అన్ని పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నేతలు, ప్రజలు ముక్తకంఠంతో ఈ ఘటనను ఖండించారు. -
ఎప్పుడేం జరిగిందంటే
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఉదయం 10 గంటలకు: విజయనగరం జిల్లా చప్పబచ్చమ్మపేటలో ప్రజా సంకల్పయాత్ర ముగించుకున్న వైఎస్సార్సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కారులో విశాఖ బయల్దేరారు. 12.15 విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. 12.20 వీఐపీ లాంజ్‌లోకి వెళ్లారు. అప్పటికే అక్కడ వేచి ఉన్న జిల్లా పార్టీ నేతలను పలకరించిన అనంతరం జగన్ వాష్‌రూమ్‌కు వెళ్లారు. 12.28 వాష్‌రూమ్ నుంచి బయటకు వచ్చి పార్టీ నేతలతో మాట్లాడుతూ సోఫాలో కూర్చున్నారు. 12.32 ఫ్యూజన్ ఫుడ్స్‌కు చెందిన ముగ్గురు వెయిటర్లు లాంజ్‌లోకి ప్రవేశించారు. అందరికీ మంచినీళ్లు, టీ, కాఫీ ఇవ్వడం ప్రారంభించారు. 12.35 వెయిటర్ శ్రీనివాసరావు.. కాఫీ తాగుతున్న జగన్‌ను పలకరించాడు. ‘సార్, ఈసారి మీరు 160 సీట్లు గెలుస్తారు..’ అంటూ మాట కలిపాడు. 12.37 ‘సార్.. మీతో సెల్ఫీ కావాలి’ అని జగన్‌ను శ్రీనివాసరావు అడిగాడు. ఇందుకు జగన్ స్పందిస్తూ.. ‘తప్పకుండా.. దగ్గరికి రా అంటూ’ అతన్ని పిలిచారు. ఇంతలో శ్రీకాళహస్తికి చెందిన పార్టీ నేత మధుసూదన్‌రెడ్డి వీఐపీ లాంజ్‌లోకి వచ్చారు. 12.38 ‘అన్నా.. నమస్తే’ అంటూ మధుసూదన్‌రెడ్డి పలకరిస్తుండగానే.. శ్రీనివాసరావు ఒక చేత్తో.. బేసిక్ ఫోన్ కోడి పందేల కత్తి తీసుకొని ఒక్క ఉదుటున జగన్ మెడపై దాడి చేసేందుకు యత్నించాడు. జగన్.. మధుసూదన్‌రెడ్డి వైపు తిరగడంతో ఆ కత్తి పోటు జన నేత భుజంలో దిగబడింది. 12.39 ‘అమ్మా..’ అంటూ జగన్ తన భుజంపై అయిన గాయాన్ని పట్టుకున్నారు. పక్కనే ఉన్న విశాఖ నగర పార్టీ అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, జగన్ వ్యక్తిగత సహాయకుడు కలసి శ్రీనివాస్‌ను పక్కకు తోసేందుకు ప్రయత్నించారు. అయినా కూడా వెనక్కి తగ్గకుండా మరోసారి దాడి చేసేందుకు కత్తిని బయటకు తీసిన శ్రీనివాస్‌ను.. వారు గట్టిగా వెనక్కి తోసేశారు. దీంతో దుండగుడు కిందపడిపోయాడు. 12.41 జగన్‌కు గాయమైందని తెలుసుకున్న పార్టీ నేతలు, భద్రతా సిబ్బంది ఉలిక్కిపడ్డారు. దుండగుడిని పట్టుకొని దేహశుద్ధి చేసేందుకు యత్నించారు. ఎవరు పంపారంటూ ప్రశ్నించారు. పార్టీనేతలు దుండగుడిని పోలీసులకు అప్పగించారు. 12.44 జగన్ సోఫాలో కూలబడిపోయారు. విషయం తెలుసుకున్న ఎయిర్‌పోర్టు వైద్య సిబ్బంది హుటాహుటిన వీఐపీ లాంజ్‌లోకి వచ్చి జగన్‌కు ప్రాథమిక చికిత్స ప్రారంభించారు. టీటీ ఇంజక్షన్ వేశారు. 12.49 ప్రాథమిక చికిత్స జరుగుతున్నప్పుడే జగన్ చేతి నుంచి రక్తం ధారగా కారుతోంది. దీంతో ఆందోళన చెందిన పార్టీ నేతలంతా ‘ఆస్పత్రికి వెళ్దాం రండన్నా..’ అంటూ జగన్‌ను కోరారు. అయితే తాను హైదరాబాద్ వెళ్లాల్సిన విమానం బయల్దేరే సమయం దగ్గర పడుతోందని, తన వల్ల తోటి ప్రయాణికులు ఇబ్బంది పడకూడదంటూ జగన్ వారికి సర్దిచెప్పారు. 12.55 సోఫాలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం జగన్ వీఐపీ లాంజ్ నుంచి విమానం వైపు కదిలారు. ఎవరూ అధైర్యపడొద్దంటూ పార్టీ శ్రేణులకు అభివాదం చేస్తూ ముందుకెళ్లారు. 1.10 జగన్ ఎక్కిన విమానం హైదరాబాద్ బయలుదేరింది. 2.15 జగన్మోహన్రెడ్డి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగారు. అక్కడ లాంజ్‌లో వైద్యులు గాయాన్ని పరిశీలించి డ్రస్సింగ్ చేశారు. అక్కడి నుంచి నేరుగా ఆస్పత్రికి వెళ్లారు (సుమారు 40 నిమిషాల ప్రయాణం). 3.10 ఆస్పత్రికి చేరుకున్నారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి కుట్లు వేశారు. అనంతరం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. -
ఎడమ చేతి భుజానికి తొమ్మిది కుట్లు
సాక్షి, సిటీబ్యూరో : విశాఖపట్నం విమానాశ్రయంలో కత్తిపోటుకు గురై హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ సిటీ న్యూరో సెంటర్లో చికిత్స పొందుతున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం సాయంత్రం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. కత్తిపోటుకు గురైన జగన్మోహన్రెడ్డి చికిత్స కోసం మధ్యాహ్నం ఆస్పత్రిలో చేరగా డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, డాక్టర్ శివారెడ్డి, డాక్టర్ మధుసూ దన్, డాక్టర్ జ్ఞానేశ్వర్‌లతో కూడిన వైద్య బృందం ఆయనకు సత్వర వైద్య చికిత్సలు అందజేసింది. తొమ్మిది కుట్లు వేశారు. సుమారు మూడున్నర ఇంచుల లోపలికి కత్తిగాటు పడటంతో రక్తం బాగా పోయింది. కత్తిగాటు గాయం నుంచి సేకరించిన రక్తపు నమూనాలను పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపించినట్లు వైద్యులు తెలిపారు. దాడిలో ఉపయోగించిన కత్తికి ఏమైనా విషపూరిత రసాయనాలు ఉపయోగించారా? లేదా అనేది రిపోర్టు వచ్చిన తర్వాత తెలుస్తుందని ప్రకటించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, మరో 24 గంటల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉందని వైద్యులు సూచించారు. దీంతో ఆయన గురు వారం రాత్రి పొద్దుపోయే వరకు ఆస్పత్రిలోనే ఉండిపోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను పరామర్శించేందుకు మాజీ కేంద్ర మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, మాజీ మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దానం నాగేందర్, పార్టీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీసుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆర్కె రోజా, శిల్పామోహన్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, రాంభూపాల్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్ తదితరులు పరామర్శించారు. -
అభిమానులు ప్రాణాలు తీస్తారా?
సాక్షి, అమరావతి: ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో గురువారం జరిగిన హత్యాయత్నంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, అధికారులు, తెలుగుదేశం నేతల తీరు ప్రజల్లో ఏవగింపు కలిగించడంతో పాటు పలు అనుమానాలకు తెరలేపింది. హత్యాయత్నం ఘటన అనంతరం ప్రభుత్వం రాజకీయంగా దాన్ని పక్కదారి పట్టించడానికి అనేక నాటకాలకు, తప్పుడు ప్రచారానికి దిగడం తెలిసిందే. ఘటన జరిగిన మరుక్షణం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ వ్యవహారంపై తమ నాయకులకు, మరోపక్క పోలీసు అధికారులకు ఎలా స్పందించాలో మార్గనిర్దేశం చేశారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీఎంఓ అధికారులు దఫదఫాలుగా ఘటన గురించి చెవిలో చెబుతూ రాగా, సీఎం అక్కడి నుంచే పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేస్తూ రాజకీయాలకు తెరలేపారు. జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనను పక్కదారి పట్టించేలా మంత్రులకు సూచనలు అందించారు. ఎవరు ఎలా ఏయే అంశాలను మాట్లాడి ప్రధాన ప్రతిపక్షంపైనే ఈవ్యవహారాన్ని నెడుతూ పక్కదారి పట్టించేలా వ్యూహానికి తెరలేపారు. తదనుగుణంగా మంత్రులు వైఎస్ జగన్‌పై, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపైనా మీడియా సమావేశాలు పెట్టి ఎదురు దాడికి దిగారు. గవర్నర్, కేంద్ర మంత్రులు వివరాలు తెలుసుకుంటే తప్పేంటి? కేబినెట్ హోదా ఉన్న ప్రధాన ప్రతిపక్ష నేతపై జరిగిన హత్యాయత్నం ఘటన జాతీయ స్థాయిలో తీవ్ర కలకలం రేపగా తీవ్రంగా స్పందించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా రాజకీయాలకు తెరలేపడం ప్రజలకు విస్తుగొలిపింది. రాజకీయంగా ప్రత్యర్థులను అడ్డు తొలగించుకోవడానికి ఇంతదారుణాలకు తెగబడతారా? దాన్ని పక్కదారి పట్టించేందుకు మరీ ఇంత నీచమైన రాజకీయాలకు దిగుతారా? అని జనం చీత్కరించుకుంటున్నారు. (వైఎస్ జగన్ కేసు..దర్యాప్తు ఎలా ఉంటుందో) పోలీసు అధికారులు, మంత్రులు చేసిన ప్రకటనలతోనే ఈ హత్యాయత్నం వెనుక ఎవరున్నారు? పక్కదారి పట్టించేందుకు ఎవరు ప్రయత్నిస్తున్నారన్నది స్పష్టమవుతోందని పలువురు పేర్కొంటున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరగడంపై గవర్నర్ నరసింహన్ డీజీపీ ఠాకూర్ నుంచి వివరాలు తెలుసుకోవడాన్ని కూడా మంత్రులు తప్పుబడుతూ రాజకీయం చేయడంపై ప్రజలు విస్తుపోతున్నారు. ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగితే, ఆ వివరాలు తెలుసుకోవడం గవర్నర్ బాధ్యత అని.. దాన్ని కూడా ముఖ్యమంత్రి, మంత్రులు తప్పుబట్టడం దారుణమని వ్యాఖ్యానిస్తున్నారు. అనుమానాలకు తావిచ్చిన డీజీపీ ప్రకటన ఘటన జరిగిన కొంత సేపటికి డీజీపీ ఆర్పీ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ శ్రీనివాసరావు వైఎస్ జగన్ అభిమాని అని, అతనికి మానసిక పరివర్తన సరిగా లేదని, ప్రచారం కోసమే వైఎస్ జగన్‌పై దాడి చేశాడని చెప్పారు. విచారణ ఇంకా మొదలు కాకుండానే డీజీపీ ఇలా ప్రకటించడం పలు అనుమానాలకు తావిచ్చిందని పలువురు తప్పు పడుతున్నారు. మరోపక్క మంత్రులు.. ఆపరేషన్ గరుడలో భాగంగా ఇది జరిగిందని ఒకసారి, వైఎస్ జగన్ తన అభిమానితో ఇలా దాడి చేయించుకున్నారని మరోసారి పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా సీఎం ప్రెస్మీట్లో ఆయన హావభావాలపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. (వైఎస్ జగన్‌పై దాడి: ఏఏఐ ప్రకటన) అభిమానులు ప్రాణాలు తీస్తారా? పాదయాత్ర చేస్తున్న ప్రధాన ప్రతిపక్ష నేతకు సెక్యూరిటీ పెంచాలని పలుమార్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విన్నవించినా, లేఖలు రాసినా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? వైఎస్ జగన్‌కు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు చెడిపోయాయని, వాటిని మార్చి వేరే వాటిని ఇవ్వాలని కోరినా ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇలాంటి ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి ఇప్పటికీ సమాధానం లేకపోవడంపై అనుమానాలు ఏర్పడుతున్నాయి. ఎవరైనా అభిమాని ప్రాణాలు ఇస్తారు కానీ ప్రాణాలు తీస్తారా? మతి స్థిమితం లేని వ్యక్తిని ఎయిర్పోర్ట్ క్యాంటీన్లో ఎలా చేర్చుకున్నట్లు? వైఎస్సార్సీపీ అభిమానిని టీడీపీ నేత పనిలో పెట్టుకున్నాడా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎయిర్‌పోర్టు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది కనుక అక్కడ ఏం జరిగినా దానికి కేంద్రానిదే బాధ్య త అని చెప్పి తప్పించుకోవడానికి అదే అనువైన స్థలమని ఒక ప్రణాళిక ప్రకారం నిందితుడిని అక్కడ ప్రవేశపెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కాదా? ఎయిర్‌పోర్టు సీఐఎస్ఎఫ్ పరిధిలో ఉంది కనుక అక్కడ జరిగిన ఘటనకు కేంద్రానిదే బాధ్యత అన్నట్లుగా ప్రభుత్వం మాట్లాడడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. ఈ ఘటనపై విచారణ జరపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా అన్న ప్రశ్నలు కూడా పలువురి నుంచి వ్యక్తమవుతున్నాయి. తమ రాజకీయాధికారానికి అడ్డుగా ఉన్న నేతలను భౌతికంగా అంత మొందించాలనుకోవడం దారుణమనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. -
వైఎస్ జగన్‌పై హత్యాయత్నం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అనుక్షణం సీఐఎస్ఎఫ్ బలగాల పహారా ఉండే విశాఖ ఎయిర్‌పోర్టు ఓ దారుణ దాడికి వేదికైంది. ప్రజా సంక్షేమమే వజ్ర సంకల్పంగా పాదయాత్ర సాగిస్తున్న రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై ఎయిర్‌పోర్టు వీఐపీ లాంజ్‌లో హత్యాయత్నం జరగడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అక్కడి రెస్టారెంట్ వెయిటరే ఈ దాడికి తెగబడటం.. పందెంకోళ్లకు కట్టే చిన్నపాటి పదునైన కత్తిని గొంతులోకి దించడానికి ప్రయత్నించడం.. జగన్మోహన్రెడ్డి అప్రమత్తతతో కత్తి ఆయన భుజంలో దిగబడి లోతైన గాయం కావడం క్షణాల్లో జరిగిపోయాయి. ఊహించని ఈ దాడితో అక్కడున్న పార్టీ నేతలు, ప్రయాణికులు నిర్ఘాంతపోయారు. క్షణాల్లో ఈ దాడి వార్త దావానలంలా వ్యాపించడంతో ఎయిర్‌పోర్టుకు పెద్ద సంఖ్యలో చేరుకున్న పార్టీ నేతలు, అభిమానుల ఆగ్రహావేశాలు, ఆందోళనలతో ఎయిర్‌పోర్టుతోపాటు సమీపంలోని జాతీయ రహదారి అట్టుడికిపోయాయి. జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. (వైఎస్ జగన్‌కు కేసీఆర్ ఫోన్) అసలు ఏం జరిగింది? విజయనగరం జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాలూరు నియోజకవర్గం మక్కువ మండల చప్పబచ్చమ్మపేట నుంచి గురువారం ఉదయం 10 గంటలకు కారులో బయల్దేరారు. సరిగ్గా 12.15 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయన నేరుగా వీఐపీ లాంజ్‌లోకి వెళ్లారు. అక్కడ తన కోసం ఉన్న విశాఖ నేతలతో ముచ్చటించి వాష్‌రూమ్‌కు వెళ్లి తిరిగి వచ్చారు. సరిగ్గా 12.32 గంటల సమయంలో ఎయిర్‌పోర్టులోని ప్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్లో పనిచేస్తున్న జనుపల్లి శ్రీనివాసరావు తన సహచర వెయిటర్స్ సురేష్, రమాలతో కలిసి టీ, మంచినీటి బాటిల్స్‌తో వీఐపీ లాంజ్‌లోకి వచ్చారు. అందరికీ టీ సర్వ్ చేయగా, జననేత మాత్రం తనకు కాఫీ కావాలని కోరారు. (వాస్తవాలు చెప్పడం అందరి బాధ్యత: మోహన్‌బాబు) వెయిటర్ రమా తీసుకొచ్చిన కాఫీని సేవిస్తున్న సమయంలో అక్కడే ఉన్న శ్రీనివాసరావు ‘మీరు సూపర్ అన్నా.. ఈసారి మీరు తప్పకుండా 160 సీట్లు గెలుస్తారు. మీదే విజయం’ అని మాటలు కలపడంతో జననేత చిరునవ్వుతో స్పందించారు. అదే అదనుగా శ్రీనివాసరావు ‘సార్.. మీతో సెల్ఫీ కావాలని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను.. అని అనగా, జగన్ చిరునవ్వుతో దగ్గరకు రమ్మన్నారు. అదే సమయంలో శ్రీకాళహస్తి పార్టీ కో ఆర్డినేటర్ మధుసూదనరెడ్డి మరికొంత మంది నేతలు జగన్‌ను కలిసేందుకు వచ్చారు. అప్పటి వరకు వెయిటర్ చెప్పిన మాటలు విన్న జగన్ తనను కలిసేందుకు వచ్చిన నేతలను పలుకరించేందుకు ఎడమ చేతివైపు ఒక్కసారిగా తిరిగారు. అప్పటికే పక్కా పథకంతో వాటర్ బాటిల్ రేపర్స్‌లో దాచి తీసుకొచ్చిన పందెం కోళ్లకు కట్టే కత్తిని సరిగ్గా 12.38 గంటల సమయంలో బయటకు తీసి వెయిటర్ శ్రీనివాసరావు జననేతపై దాడికి తెగపడ్డాడు. మెడపై పొడిచేందుకు యత్నించగా..సరిగ్గా అదే సమయంలో జననేత ఎడమచేతి వైపు తిరగడంతో కత్తి గురితప్పి భుజంలోకి దూసుకెళ్లింది. (‘వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కచ్చితంగా కుట్రే’) ప్రాథమిక చికిత్స అందించిన ఎయిర్‌పోర్టు వైద్యసిబ్బంది ఘటన జరిగిన వెంటనే ఎయిర్‌పోర్టు వైద్య సిబ్బంది హుటాహుటిన వీఐపీ లాంజ్‌లోకి వచ్చి జగన్ మోహన్‌రెడ్డికి ప్రాథమిక చికిత్స ప్రారంభించారు. అన్నా రక్తం ఎక్కువగా పోతోంది.. రండన్నా ఆస్పత్రికి వెళ్దాం అంటూ నేతలు ఎంత ఒత్తిడి చేసినా పర్వాలేదు ప్రజలు, దేవుని ఆశీస్సులున్నాయి. నాకేం కాదు అంటూ ఆయన వారించారు. ఓ వైపు రక్తం కారుతున్నా బాధను పంటికింద అదిమిపెట్టి చిరునవ్వుతోనే కంగారు పడకండి అంటూ నేతలకు ధైర్యం చెప్పారు. అక్కడకు చేరుకున్న ఎయిర్‌పోర్టు వైద్యురాలు లలితా స్వాతి తమ సిబ్బందితో జగన్‌కు ప్రాధమిక వైద్యం చేశారు. రక్తం కారకుండా కట్టడి చేశారు. సెప్టిక్ కాకుండా ముందుజాగ్రత్తగా టీటీ ఇంజక్షన్ చేశారు. (ఎవరూ ఆందోళన చెందొద్దు: వైఎస్ జగన్) ఆస్పత్రికి వెళ్దామన్న నేతలు.. వారించిన జగన్ ఆ తర్వాతైనా పదండన్నా ఆస్పత్రికి వెళ్దాం అని నేతలు ఎంతగా బ్రతిమిలాడినా పర్వాలేదు..నాకేం కాదు.. మీరు ధైర్యంగా ఉండండంటూ వడివడిగా అడుగులేస్తూ ముందుకు సాగారు. తాను హైదరాబాద్ వెళ్లాల్సిన 6ఈ–809 ఇండిగో విమానం బయలుదేరే సమయం (13.05 గంటలు) దగ్గరపడుతోందని, తనవల్ల తోటి ప్రయాణికులు ఇబ్బంది పడకూడదంటూ.. విమానంవైపు కదిలారు. మధ్యాహ్నం 1.10 గంటలకు ప్రయాణికులతో కలిసి జగన్ ఎక్కిన ఇండిగో విమానం హైదరాబాద్ బయలుదేరింది. హత్యాయత్నం అనంతరం తనపై పార్టీ నేతలు దాడి చేస్తారన్న భయంతో నిందితుడు శ్రీనివాసరావు నన్ను అరెస్ట్ చేయండి..నన్ను అరెస్ట్ చేయండి అంటూ బిగ్గరగా కేకలు వేశాడు. జగన్ వారించడంతో నేతలు అతడ్ని సీఐఎస్ఎఫ్ సిబ్బందికి అప్పగించారు. అనంతరం వైద్యురాలు స్వాతి నిందితుడికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు. నిందితుడిని పోలీసులకు అప్పగించేందుకు హైడ్రామా నిందితుడ్ని పోలీసులకు అప్పగించేందుకు ఎయిర్‌పోర్టులో పెద్ద డ్రామాయే నడిచింది. జగన్‌పై దాడి జరిగిందని తెలిసి పెద్ద ఎత్తున చేరుకున్న పార్టీ శ్రేణులు ఎయిర్ పోర్టు ఇన్‌గేట్, అవుట్గేట్ల వద్ద ఆందోళనకు దిగారు. దీంతో నిందితుడిని సుమారు ఐదుగంటల పాటు ఎయిర్‌పోర్టులోనే ఉంచి విచారణ కొనసాగించారు. ఆ తర్వాత వెనుక గేటు నుంచి నిందితుడ్ని ఎవరికీ కన్పించకుండా తరలించారు. అమ్మా అంటూ బిగ్గరగా కేక వేసిన జగన్ ‘అమ్మా’ అంటూ జగన్ బిగ్గరగా కేక వేయడంతో ఏం జరిగిందో తెలియక అక్కడున్న నేతలంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో తెలియక ఆందోళనకు గురయ్యారు. తొలి ప్రయత్నం విఫలమై జగన్ ఎడమ చేతి భుజంలోకి కత్తి దూసుకెళ్లడంతో మరోమారు ప్రయత్నించేందుకు దుండగుడు కత్తితీస్తుండగా జగన్ వ్యక్తిగత సహాయకులు కేఎన్ఆర్ వెంటనే తేరుకుని శ్రీనివాసరావును పక్కకు నెట్టేశారు. జగన్ ఎందుకిలా కేక పెట్టారో తేరుకునే సరికి ఎడమచేయి పూర్తిగా రక్తమోడింది. (వైఎస్ జగన్‌పై దాడి.. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు) శ్రీనివాసరావు పొడిచిన కత్తి ఆయన ఎడమ చేతిలోకి మూడు సెంటిమీటర్ల మేర చొచ్చుకుపోయి ఉండటంతో దాన్ని బయటకు తీశారు. చొక్కా పూర్తిగా రక్తసిక్తమైంది. ఉబికి వస్తున్న రక్తాన్ని అదిమిపట్టి జగన్ ఒక్కసారిగా మళ్లీ సోఫాలో కూర్చుండి పోయారు. ఆ వెంటనే జగన్మోహన్రెడ్డిపై దాడి జరిగిందని గ్రహించిన పార్టీ నేతలు ఒక్కసారిగా ఆగ్రహావేశాలకు గురై దాడి చేసిన శ్రీనివాసరావును చుట్టుముట్టారు. ఓ వైపు రక్తం కారుతోంది.. మరో వైపు బాధను తట్టుకోలేని స్థితి. అయినా సరే ఆ బాధను పంటికింద అదిమిపట్టి తనపై దాడి చేసిన దుండగుడిని ఏమీ చేయొద్దంటూ పార్టీ నేతలను వారించారు. ఎందుకు చేశావ్?..ఎవరు చేయమన్నారు? అని పార్టీనేతలు దుండగుడిని నిలదీశారు. తనపై దాడి చేస్తారన్న భయంతో దండగుడు శ్రీనివాసరావు కేకలు వేయడంతో అక్కడకు చేరుకున్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకొని సెక్యూరిటీ చాంబర్లోకి తీసుకెళ్లిపోయారు. జగన్ అప్రమత్తంగా ఉండకపోతే.. దాడి జరిగిన సమయంలో జననేత ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఆ కత్తి నేరుగా మెడలోకి దూసుకెళ్లేది. నేతలను పలకరించేందుకు కుడిచేతి వైపు తిరగడం, దాడి చేసే సమయంలో అప్రమత్తంగా ఉండడంతో మెడలోకి దూసుకెళ్లాల్సిన కత్తి కాస్తా భుజంలోకి దూసుకెళ్లింది. జగన్ అప్రమత్తంగా ఉండి ఉండక పోతే జరగరాని ఘోరం జరిగేది. పైగా దాడి జరిగిన వెంటనే క్షణాల్లో వ్యక్తిగత సిబ్బంది, పార్టీనేతలు తేరుకుని అతడ్ని పక్కకు నెట్టేయడం వల్ల కూడా పెను ప్రమాదం తప్పినట్టయ్యింది. జగన్‌పై హత్యాయత్నాన్ని అడ్డుకున్న పార్టీ నేతలు మళ్ల విజయప్రసాద్, చిన్న శ్రీనులు నిందితుడి నుంచి వెంటనే కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఆ కత్తిని వెంటనే సీఐఎస్ఎఫ్ అధికారి దినేష్‌కుమార్‌కు అప్పగించారు. -
ఇంత దుర్మార్గం మీకే సాధ్యం
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నమే దారుణమంటే, సదరు భౌతిక దాడి కన్నా ఈ ‘సామూహిక ప్రచారం’ అత్యంత ప్రమాదకర ధోరణికి సంకేతాలిస్తోంది. ఇటు డీజీపీ మాట్లాడిన కొంత వ్యవధిలోనే అటు మంత్రుల బృందగానం ఎంత నోటికొస్తే అంత అన్నట్టే సాగింది. ఇక సాయంత్రం పొద్దుపోయిన తర్వాత ముఖ్యమంత్రి మాట్లాడిన తీరు జుగుప్సాకరం! నిర్హేతుకమైన నిందలతో పాటు అర్థంపర్థం లేని ప్రశ్నలన్నీ సంధించారు. ఎవరికివారుగా పని చేయాల్సిన శాసన, కార్యనిర్వాహక, స్వతంత్ర మీడియా వ్యవస్థలు ఎంతలా కలగలిసి పోయాయో, అన్నింటినీ రాజకీయం చేయడం ఎంత యధేచ్ఛగా సాగుతోందో తేటతెల్లమైంది. విచారణకు పూర్వమే తీర్పి చ్చినట్టుంది ఆంధ్రప్రదేశ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ ఆర్పీ ఠాకూర్ మాట తీరు. ఇక... ఆయన కింది అధికారులు జరిపే దర్యాప్తు, తేల్చే నిజాలు, కేసు ముగింపు ఎలా ఉంటుందో ఇప్పుడే ఊహించవచ్చు! విశాఖ విమా నాశ్రయంలో విపక్షనేత, వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగి గంటలు గడవక ముందే... ‘ఇది ప్రచారం కోసం చేసినట్టుంది’ అనడం, ‘ప్రాథమిక సమాచారాన్ని బట్టి నిందితుడు బాధితుడికి అభిమానిగా తెలుస్తోంద’నడం సాధారణ తెలివితేట లున్న వారికి కూడా విస్మయం కలిగించింది. బాధ్యతా రాహిత్యమే కాకుండా, రాజకీయ వ్యవస్థతో అంటకాగ డానికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తోంది. నిందితుని జేబులో ఓ ఉత్తరం ఉందని చెప్పీ, అయిదు గంటల జాప్యంతో వెలువరించి తదుపరి కథ నడిపే ఎత్తుగడకు ఆయన జీవం పోశారు. కత్తితో దాడి చేసి హత్యాయత్నా నికి తలపడిన వ్యక్తి, గాయపడిన జగన్మోహన్రెడ్డిని కలగలిపి ఫోటోలు సృష్టించి, స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పాలకపక్షీయులు జరిపిన విస్తృత ప్రచారం ‘గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడు ముకున్నట్టుంది’. అదేదో ఆంగ్ల సామెత చెప్పినట్టు, ‘దాడే ఉత్తమ రక్షణ’ అనే సూత్రాన్ని ఏలికలు అక్షరాలా పాటిస్తున్నారు. ఇందులో సీఎం కార్యాలయ సన్నిహిత వ్యవస్థ, మంత్రివర్గ సభ్యులు, ఇతర ముఖ్య నాయ కులు, అనుకూల మీడియా, చివరకు స్వతంత్రంగా దర్యాప్తు జరపాల్సిన పోలీసు బాసు.. అంతా ఒకే మాట, ఒకే బాట అన్నట్టు వ్యవహరించిన తీరు దారు ణం. కొన్ని గంటల వ్యవధిలోనే ఒకటికి తోడుగా మరొ కటి పుట్టుకొచ్చిన పరిణామాల్ని బట్టి ఇదెంత పథకం ప్రకారం జరుగుతోందో ఇట్టే బోధపడింది. హత్యాయ త్నమే దారుణమంటే, సదరు భౌతిక దాడి కన్నా ఈ ‘సామూహిక ప్రచారం’ అత్యంత ప్రమాదకర ధోరణికి సంకేతాలిస్తోంది. ఇటు డీజీపీ మాట్లాడిన కొంత వ్యవధి లోనే అటు మంత్రుల బృందగానం ఎంత నోటికొస్తే అంత అన్నట్టే సాగింది. ఇక సాయంత్రం పొద్దుపోయిన తర్వాత ముఖ్యమంత్రి మాట్లాడిన తీరు జుగుప్సాకరం! నిర్హేతుకమైన నిందలతో పాటు అర్థంపర్థంలేని ప్రశ్న లన్నీ సంధించారు. ఎవరికివారుగా పని చేయాల్సిన శాసన, కార్యనిర్వాహక, స్వతంత్ర మీడియా వ్యవస్థలు ఎంతలా కలగలిసి పోయాయో, అన్నింటినీ రాజకీయం చేయడం ఎంత యధేచ్ఛగా సాగుతోందో తేట తెల్లమైంది. పౌర పోలీసు, ఇంటలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసు, నేర పరిశోధన... వంటి విభాగాలన్నీ కలగాపులగమై రాజకీయ వ్యవస్థకు ఊడిగం చేస్తున్న తీరుకు ఇది పరాకాష్ట! ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకారి! నిలువెల్లా నిస్సిగ్గుతనం తుని రైల్వే దుర్ఘటన కడప జిల్లా రౌడీల పనే అని మొన్న, విశాఖ ఎజెన్సీలో ఎమ్మెల్యేని హతమార్చిన మావోల చర్య వెనుకా ప్రత్యర్థి పార్టీ ప్రమేయముందని నిన్న స్వయానా ముఖ్యమంత్రి పేర్కొన్నా దిక్కులేని పరిస్థితి! అది తప్పని నిర్దారణ అయినా... కనీసం క్షమాపణ కోరకపోవడం సీఎం తెంపరితనం! విపక్ష నేతపై దాడి వారికి వారే జరుపుకున్నారంటూ నేడు నిరాధార నింద మోపడానికైనా వెనుకాడని బాధ్యతా రాహిత్యం ముఖ్యమంత్రిది. దర్యాప్తుకు ముందే, అన్నీ తానే తేల్చి ఇక ఏ దర్యాప్తూ అక్కర్లేదన్న దబాయింపు ఆయనది. ‘సంఘటన ఎక్కడ జరిగింది? సీఐఎస్ఎఫ్ నియంత్రణలో కాదా, మాకేం సంబంధం...?’ అంటూ, ‘ఏయ్ నువ్ చెప్పవయ్యా!’అని విలేకరిని గద్దించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, అదే రన్‌వే అంతటా తన పోలీసు పటాలాన్ని దించి, ఎయిర్ క్రాఫ్ట్ వరకు మోహరించి, ఇదే జగన్మోహన్రెడ్డిని నిర్బంధిచడం ఎలా మరచిపోయారు? ఎంతటి పచ్చి అబద్దాన్నయినా అల వోకగా పలుకొచ్చు. సిగ్గు–బిడియం లేకుండా విస్తృ తంగా ప్రచారం చేయొచ్చు, అందుకనుకూలంగా పాలనా వ్యవస్థలన్నింటినీ దుర్వినియోగ పరచవచ్చ న్నది ఇప్పుడు వారి ధీమా! జరిగిన దారుణాన్ని ఖండించి, పాలనాపరంగానో, నైతికంగానో బాధ్యత తీసుకోవాల్సింది పోయి, ఎదురుదాడులతో దుష్ప్ర చారానికి దిగుతున్న తీరు ఏహ్యంగా ఉంది. ‘ఆపరేషన్ గరుడ’ కూడా ఈ విశాల కుట్రలో భాగమే అనడానికి ఎన్నో ఆధారాలున్నాయి. తమ ప్రచార వ్యూహంలో బాగంగా పాత వీడియోలను ఇప్పుడు మళ్లీ తెరకెక్కిం చారు. ముఖ్యమంత్రితో సహా కీలకమైన, బాధ్యతాయు తమైన స్థానాల్లోని వారు ఎన్ని అబద్దాలు ఆడి అయినా తమ దాష్టికాల నుంచి తప్పుకోవచ్చు! వైఫల్యాల నుంచి వైదొలగొచ్చు! ‘తాన అంటే తందాన’ అనే అనుకూల మీడియా సహకారంతో వాటిని వేయినోళ్లతో ప్రచారం చేయాలంతే! ఇదే వ్యూహంతో రాజకీయ ప్రత్యర్థులపై బురదజల్లడం కూడా ఇప్పుడు వారికి రివాజయింది. దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ ప్రతిష్టను గంగలో కలిపిందీ ఈ ‘రాజకీయ కాలు ష్యమే!’ పొరుగు రాష్ట్రం ఒడిశాలో 17 జిల్లాల్లో తుఫాను ముందు జాగ్రత్త–సహాయక చర్యలు సజావుగా సాగితే, ఏపీలో పావుజిల్లాలోనూ ఎక్కడికక్కడ విఫలమయ్యారు. పట్టుమని రెండొందల గ్రామాల్లోనూ సహాయక చర్యల్ని ఓ కొలిక్కితీసుకు రాలేక ప్రభుత్వం ఘోరంగా విఫల మైంది. ప్రజలు నేటికీ అల్లాడే దుస్థితికి ఈ మితిమీరిన ‘అతి రాజకీయ’ జోక్యమే కారణమని తేటతెల్లమవు తోంది. అధికారుల్ని స్వేచ్ఛగా పనిచేసుకోనీయని అతి జోక్యం వారిదయితే, వారి కనుసన్నల్లో పనిచేస్తూ విధిని ర్వహణకు సంబంధించిన కనీస ‘ప్రోటోకాల్స్’ను మరిచి ఊడిగం చేయడం వీరి పంథా అయింది. ఏ ఎత్తుగడ వెనుక ఎవరున్నారో..! విమానాశ్రయంలో కత్తి దాడి ఏ విధంగా చూసినా భద్రతా వైఫల్యమే! అయితే, అది మాత్రమే ముఖ్యం కాదు. అంతకు మించి, ఈ దాడి వెనుక ఉద్దేశ్యమేమిటి? ఎందుకు జరిగింది? సదరు చర్య వెనుక ఎవరున్నారు? అన్నది చాలా ముఖ్యం. అది తగిన దర్యాప్తుతోనే తేలు తుంది. కానీ, ఆ దర్యాప్తునకు ఆస్కారాన్ని, సానుకూ లతను ముఖ్యమంత్రి స్వయానా పనిగట్టుకొని భగ్నం చేస్తున్నారు. ముందస్తు అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ భవిష్యత్ దర్యాప్తు ప్రక్రియనే దారి మళ్లించే కుట్రను వ్యూహాత్మకంగా చేపట్టారు. ఆయన, ఆయన మను షులు ముందుగానే ఎవరెవరికో ఉద్దేశ్యాలు ఆపాదిస్తు న్నారు. ఇంకెవరెవరినో తప్పించేందుకు యత్నిస్తున్నా యధేచ్చగా తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. దొంగ ఫోటోలు రూపొందిస్తు న్నారు. అంతకు ముందు నుంచే నిందితుడు శ్రీనివాస్, బాధితుడు జగన్మోహన్రెడ్డి కలిసి ఉన్నట్టు ఓ ఫోటోను ‘సాంకేతికత’తో సృష్టించి, స్వయంగా మంత్రులే విలేకరుల సమావేశంలో ప్రద ర్శించారు. అలాంటి సృష్టి ఎవరైనా చేయొచ్చు.... సదరు నిందితునితో చంద్రబాబు ఉన్నట్టు, ఆయన కుమారుడైన మంత్రి లోకేష్ ఉన్నట్టు కూడా సృష్టించడం ఎంత తేలికో సామాజిక మాధ్యమాల్లో నిమిషాల్లోనే ప్రత్యక్షమైంది! దాంతో, పాలకపక్షం నిందల వ్యాప్తి భాగోతం బట్టబ యలైంది. ఇలాంటి ప్రాణహాని లేని హత్యాయత్నం విపక్షనేతపై జరుగుతుందని ‘ఆపరేషన్ గరుడ’లో ఇదివరకే చెప్పారనే ఒక వీడియో క్లిప్పిం గును మళ్లీ ప్రచారంలోకి తెచ్చారు. ‘చూశారా! చెప్పినట్టే జరిగింద’నే వాదనను తెరకెక్కించారు. కానీ, సదరు ‘ఆపరేషన్ గరుడ’లో అంత కీలకమైన విషయాలు అప్పుడే వెలుగు చూస్తే, ప్రభుత్వం ఏం చేసింది? నిజమని భావిస్తే ఆ ‘డ్రామా’ను ముందే ఎండగట్టి ఎందుకు చర్యలు తీసుకోలేదు? తప్పని భావిస్తే, అటువంటి ప్రచారాలకు పాల్పడుతున్న వ్యక్తిపై చట్టపరంగా చర్య తీసుకోకుండా ఎందుకు ఉపేక్షించి చోద్యం చూసింది? ఇది పాలకపక్షం కనుసన్నల్లో జరుగుతున్న విస్తృత కుట్రలో భాగంగా భావించాలా? విమానాశ్రయంలో కత్తి దాడి కూడా ఇందులో భాగ మేనా? దాడి విజయవంతమైతే తామాశించిన భౌతిక నిర్మూలన లక్ష్యం నెరవేరుతుంది. రాజకీయంగా తమ కిక ఎదురుండదు. ఏ పరిస్థితుల్లోనయినా దాడి విఫల మైతే.... ‘అదుగో ఆపరేషన్ గరుడలో మేం ముందే చెప్పాం, ఇది వారికి వారు చేసుకున్న దాడి, మేమన్నట్టే జరిగింది’ అని దుష్ప్రచారం చేయొచ్చన్నది వారి ద్విముఖ వ్యూహమా? అదే నిజమైతే, ఇప్పుడిది తేలాలి. ఇది నిర్దారణ అయితే తప్ప, ‘ఆపరేషన్ గరుడ’కు ముఖ్యమంత్రిది డైరెక్షన్, శివాజీది ‘యాక్షన్’ అని జరుగుతున్న ప్రచారంలోని నిజానిజాలు తేలవు! నిన్నొక నీతి నేడొక రీతి! విమానాశ్రయంలో వ్యక్తుల, వీఐపీల భద్రతకు సంబం ధించి ఎవరి బాధ్యత ఎంత? అనే విషయంలో రాష్ట్ర– కేంద్ర పోలీసు బలగాలు పరస్పరం అవతలివారి వైపు వేలెత్తి చూపుతున్నారు. సాధారణ తనిఖీలు నిర్వహించి, ప్రయాణీకుల గుర్తింపును ఖరారు చేస్తాం, వ్యక్తిగత భద్రత మా బాధ్యత కాదని కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాల (సీఐఎసెఫ్) ఉన్నతాధికారులంటున్నారు. సదరు బలగాల నియంత్రణ, అంటే ఏకంగా కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చెబుతున్నారు. ‘మాకేం సంబంధం..?’ అని దబాయి స్తున్న ముఖ్యమంత్రి, ప్రత్యేక హోదా నిరసన కార్యక్ర మంలో పాల్గొనడానికి హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చిన విపక్షనేతను లోగడ రాష్ట్ర పోలీసులతో అడ్డగించి నపుడేం జరిగిందో మరచిపోయినట్టున్నారు. నగరపో లీసు కమిషనర్‌తో సహా రాష్ట్ర పోలీసు సిబ్బంది విమానాశ్రయం రన్‌వే వరకు మోహరించి, విపక్ష నేతను నిర్భందించారు. విమానాశ్రయం బయటకు రానీకుండా అడ్డగించి, అక్కడ్నుంచే విమానంలో హైద రాబాద్ తిరిగి పంపించారు. అదంతా మరచిపోయి, ఇప్పుడు, మారిన రాజకీయ సమీకరణాల్లో ఫక్తు రాజ కీయంగా మాట్లాడటం ముఖ్యమంత్రి నైజాన్నే వెల్లడి చేస్తోంది. జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నాన్ని చిన్నది చేసి చూపే కుట్రకు పూనుకున్న ఓ వర్గ మీడియా పక్కన పెద్దగీత గీస్తూ తిమ్మరుసు నీతికి దిగింది. రాష్ట్ర ప్రభు త్వాన్ని అస్థిరపరిచే యత్నం జరుగుతోందని నెత్తీనోరూ మొత్తుకుంటూ పాలకపక్షంతో స్వరం కలిపింది. గంపెడు బాధను గుండెలోనే దిగమింగి కూడా వైఎస్సా ర్సీపీ శ్రేణులు, అభిమానులు సంయమనం పాటిం చారు. ఇంత జరిగినా.... ఎదుటివారి కుట్ర సామాన్యు లకూ తెలిసి రావాలనో! తమ నేత పిలుపునకు వారి చ్చిన గౌరవమో! ఎక్కడా ఒక అవాంఛనీయ ఘటనా చొటు చేసుకోలేదు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిని, నలభై ఏళ్ల రాజకీయం అని జబ్బలు చరుచుకోవడం కాకుండా హైకోర్టు న్యాయమూర్తితోనో, తటస్థ దర్యాప్తు సంస్థతోనో ఈ కేసు విచారణ జరిపించి నిజాయితీని నిరూపించుకోవాలి. తాను మోపిన నిందల్ని నిరూ పించాలి. అది జరిగితే సరేసరి! జరక్కపోయినా.... ప్రజాకవి కాళోజీ నారాయణ రావు అన్నట్టు ‘కాలమ్ము రాగానే కాటేసి తీరాలి....’ అని ఏపీ రాష్ట్ర ప్రజలు కాచు కొని ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త! దిలీప్ రెడ్డి, ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
నీచమైన కుట్ర
దాదాపు ఏడాది కాలంగా జనంలో ఉంటూ, పాదయాత్ర చేస్తూ వారి ఆవేదనలను వింటూ, భరోసా కల్పిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయం వీఐపీ లాంజ్‌లో గురువారం జరిగిన హత్యాయత్నం అశేష ప్రజానీకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అదృష్టవశాత్తూ ఈ దాడి నుంచి ఆయన సురక్షితంగా బయటపడగలిగారు. ఈ పాదయాత్రలో ఆయన అడుగులో అడుగేస్తూ వేలాదిమంది కదులు తుంటే... నియోజకవర్గాల్లో ఆయన నిర్వహిస్తున్న సభలకు ఇసుకేస్తే రాలని స్థాయిలో ప్రజలు హాజ రవుతుంటే తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కంట గింపుకావడం ప్రతిరోజూ ప్రత్యక్షంగా కనబడుతూనే ఉంది. ఆయన ప్రసంగించే సభ ఉన్నచోట విద్యుత్ సరఫరా అర్ధాంతరంగా నిలిపేయడం, ఆ సభల ప్రత్యక్ష ప్రసారం ఎవరూ వీక్షించకుండా కేబుల్ ప్రసారాలకు అవాంతరాలు కల్పించడం, మనుషుల్లేని అంబులెన్స్‌ల్ని వేరే మార్గాలున్నా ఆ సభలు జరిగేవైపే పంపడం వంటి చిల్లరపనులకు పాల్పడటం ఏపీలో రివాజుగా మారింది. కానీ ఆ కంటగింపు ఇంత నీచమైన కుట్రలకు పాల్పడే దుస్థితికి దిగజారుతుందని ఎవరూ ఊహించలేదు. దుండగుడు శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్న కాసేపటికే డీజీపీ ఆర్పీ ఠాకూర్‌కు అతగాడి గుట్టుమట్లు సర్వం తెలిసిపోయాయి! అతని కులమేదో, ప్రాంతమేదో, ఎవరి అభిమానో ఆయన ఏకరువు పెట్టారు. ఎందుకు చేసి ఉంటాడో కూడా ఆయన పోలీసు బుర్రకు తట్టింది. అతనికి ‘వేరే ఉద్దేశాలు’ ఏమీ లేవని సైతం ఆయనగారు తేల్చేశారు. కానీ అతగాడు పనిచేస్తున్న కేఫ్టేరియా ఎవరిదో, అతని దగ్గరకు ఈ దుండగుడు ఎలా వచ్చాడో, హోటల్ మేనేజ్మెంట్లో ఏమాత్రం ప్రవేశం లేనివాడికి అక్కడ ఉద్యోగమెలా వచ్చిందో మాత్రం తెలియనట్టుంది!! ఒక ఘటన జరిగినప్పుడు అందులో దర్యాప్తు మొదలుకాకుండానే అతనొక్కడే ఈ పనికి పాల్పడ్డాడని, మరెవరి ప్రమేయమూ లేదని ఎలా నిర్ణయిస్తారు? ఆర్పీ ఠాకూర్ ఒక సాధారణ కానిస్టేబుల్ అయి ఉంటే ఆయన ఒట్టి అమాయకత్వంతో తెలిసీ తెలియక మాట్లాడి ఉంటాడని కొట్టిపారేయొచ్చు. ఆయన తెలుగుదేశం సాధారణ కార్యకర్త అయితే ఆత్మరక్షణ కోసం అవాకులు, చవాకులు మాట్లా డుతున్నాడని ఉపేక్షించవచ్చు. కానీ ఠాకూర్ రాష్ట్ర పోలీసు విభాగానికి నాయకత్వంవహిస్తున్న ఒక ఉన్నతస్థాయి అధికారి. రాష్ట్ర ప్రజలందరి భద్రతకూ, క్షేమానికీ పూచీ పడాల్సిన అధికారి. అటు వంటి అత్యున్నతాధికారి నుంచి ఇంతకంటే మెరుగైన వ్యవహారశైలిని ప్రజలు ఆశించడం సహజం. కానీ ఠాకూర్ మాట్లాడిన మాటలు గమనిస్తే చంద్రబాబును రాజకీయంగా కాపాడటమే తన ఏకైక కర్తవ్యమని ఆయన భావిస్తున్నట్టు కనిపిస్తున్నది. దీని పూర్వాపరాలను అన్ని కోణాల్లోనూ సమ గ్రంగా దర్యాప్తు చేయించి నిగ్గుతేల్చవలసింది పోయి... తమవైపుగా జరిగిన వైఫల్యాలేమిటో ఆరా తీయాల్సింది పోయి జరిగినది అతి సాధారణమైన విషయమన్నట్టు మాట్లాడారు. పైగా వీఐపీ లాంజ్‌లో తమకు ప్రవేశం ఉండదని, అక్కడి భద్రత తమకు సంబంధంలేని విషయమని చెబు తున్నారు. ఇదే విమానాశ్రయంలో రెండేళ్లక్రితం రన్వేపైకొచ్చి పోలీసులు జగన్‌పట్ల దురుసుగా ప్రవర్తించిన సందర్భాన్ని ఠాకూర్ మరిచిపోతున్నారు. ‘అతని కంటె ఘనుడు...’ అన్నట్టు డీజీపీకి ఏమాత్రం తీసిపోని అజ్ఞానాన్ని చంద్రబాబు ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో సెటిల్మెంట్ల రాజ్యం నడుస్తున్నదని, అది మాఫియా పాలనను తలపిస్తున్నదని ఎప్పటినుంచో విమర్శలున్నాయి. అక్కడి ఇంటెలిజెన్స్ విభాగం పక్కనున్న తెలంగాణ అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో ఎవరిని కొనుగోలు చేయొచ్చునో ముఖ్యమంత్రికి ఉప్పందిస్తుంది. వచ్చే ఎన్నికల్లో అక్కడ ఏ ఏ స్థానాల్లో తెలుగుదేశం గెలుస్తుందో సర్వే కూడా జరిపి ఆయన చెవిన వేస్తుంది. కానీ ప్రతిపక్ష నాయకుడి భద్రతకు ముప్పు పొంచి ఉందని మాత్రం ఆ విభాగానికి తెలియదు. మరో పక్క తనకు ఏ పార్టీతో సంబంధం లేదని చెప్పుకునే ఒక మాజీ సినీ నటుడికి మాత్రం రాష్ట్రంలో ఈ హత్యాయత్నం జరుగుతుందని చాలా ముందుగానే తెలిసిపోతుంది. పైగా దాడి జరిగాక ఆ మాజీ నటుడు మీడియా ముందుకొచ్చి ‘ఈ సంగతి ముందే చెప్పాను కదా!’ అంటున్నాడు. ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించాల్సి ఉండగా, మంత్రులంతా కట్టగట్టుకుని అతనేదో అతీంద్రియ శక్తులున్న అసాధారణ వ్యక్తిగా ఆ ‘గరుడ పురాణాన్ని’ వల్లె వేయడం విస్మయం కలిగిస్తుంది. దుండగుడు జగన్ అభిమానంటూ డీజీపీ అలా ప్రకటించారో లేదో... అతను చాన్నాళ్లక్రితం తయారుచేయించిన ఫ్లెక్సీగా పచ్చమీడియా ఒక బొమ్మను ప్రచారంలోకి తీసుకొచ్చింది. ఇటీవలికాలంలో మాజీ నటుడు వినిపిస్తున్న ‘ఆపరేషన్ గరుడ’ నిన్నమొన్నటిది కాగా... ఎన్నడో జనవరిలో నూతన సంవత్సర ఆగమనం సందర్భంగా దుండగుడు పెట్టాడంటున్న ఫ్లెక్సీలో గరుడ పక్షి ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. పైగా అది ఒక ఫ్లెక్సీని ఫొటో తీసినట్టు కాకుండా, ఫొటోషాప్‌లో చేసిన డిజైన్‌గా స్పష్టమవుతోంది. దీన్ని ముఖ్య మంత్రి కనుసన్నల్లో పనిచేసే సోషల్ మీడియా విభాగం రూపొందించిందని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఇవన్నీ ఒక పెద్ద కుట్రకు ముందే అమర్చి పెట్టుకున్న ‘ఎలిబీ’లని మామూలు కంటికి కూడా తెలిసిపోతున్నాయి. ఘటన జరిగిన క్షణం నుంచి చంద్రబాబు, ఆయన మంత్రులు, ఉన్నతాధికారులు మాట్లాడు తున్న మాటలు ఈ విషయంలో ఉన్న అనుమానాలను మరింతగా పెంచుతున్నాయి. దుండగుడు రాశాడంటున్న లేఖ కూడా మరిన్ని సంశయాలను రేకెత్తిస్తోంది. అధికారంలోకి రావడం కోసం సొంత మామకు వెన్నుపోటు పొడిచి ఆయన మనోవ్యాధితో మరణించడానికి కారకుడైన వ్యక్తి... దాన్ని నిలుపుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడన్నది సుస్పష్టం. కనుక హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వ ర్యంలో దీనిపై సమగ్రంగా దర్యాప్తు జరిపించి, దోషులెవరో నిగ్గుతేల్చాల్సిన అవసరం ఉంది. -
వైఎస్ జగన్‌పై దాడి: ఏఏఐ ప్రకటన
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడికి సంబంధించి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఓ ప్రకటన విడుదల చేసింది. రెస్టారెంట్లో వెయిటర్‌గా పనిచేస్తున్న వ్యక్తి వైఎస్ జగన్‌పై దాడికి పాల్పడట్టు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ డైరక్టర్ జి ప్రకాశ్ రెడ్డి ఆ ప్రకటనలో తెలిపారు. ప్రాథమిక చికిత్స అనంతరమే వైఎస్ జగన్ హైదరాబాద్ బయలుదేరినట్టు వెల్లడించారు. ‘వైఎస్ జగన్ మధ్యాహ్నం 1.05 గంటలకు ఇండిగో విమానంలో హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది. అందుకోసం వైఎస్ జగన్ వీఐపీ లాంజ్‌లో వేచి చూస్తుండగా.. 12.40 గంటల ప్రాంతంలో ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్లో పనిచేస్తున్న వెయిటర్ కత్తితో ఆయనపై దాడి చేశాడు. ఈ దాడిలో వైఎస్ జగన్ ఎడమ భుజానికి గాయం కావడంతో పాటు, రక్తస్రావం జరిగింది. దీంతో ఆయనకు వెంటనే ఎయిర్పోర్ట్ డ్యూటీ డాక్టర్ పర్యవేక్షణలో ప్రాథమిక చికిత్స అందించటం జరిగింది. ఆ తర్వాత ఆయన తను వెళ్లాల్సిన ఫ్లైట్‌లో హైదరాబాద్ వెళ్లారు. ఆయనపై దాడి చేసిన నిందితుడిని సీఐఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం పోలీసు శాఖ ఈ విషయంపై విచారణ చేపట్టింది. ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్‌లో పరిస్థితి సాధారణ నెలకొంద’ని ప్రకటనలో పేర్కొన్నారు. -
ఎయిర్‌పోర్టు లోపలికి ఓ వ్యక్తి కత్తి ఎలా తీసుకెళ్లాడు?
-
సెల్ఫీ తీసుకుంటానని నవ్వూతూ వచ్చాడు..
-
వైఎస్ జగన్‌కి ఏమైనా జరిగితే ఊరుకోం : రోజా
సాక్షి, హైదరాబాద్ : విశాఖ ఎయిర్ పోర్టులో అది కూడా వీఐపీ లాంజ్‌లో ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దాడి జరగడం చూస్తుంటే దీని వెనక కుట్రకోణం ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఒక వ్యక్తి చిరునవ్వుతో సెల్ఫీ తీసుకుంటూ వైఎస్ జగన్‌పై దాడి చేయడం చూస్తుంటే ఆవేశంతోనో లేక కక్ష్యపూరితంగానో కాదని, ఒక ప్లాన్ ప్రకారం ఎవరో వెనకుండి చేయించారని స్పష్టంగా అర్థం అవుతోందన్నారు. ఎయిర్‌పోర్టులో ఉండేది స్థానిక పోలీసులు కాదు కాబట్టి తమకు సంబంధం లేదని ప్రభుత్వం తప్పించుకునే అవకాశం ఉందన్నారు. గతంలో కూడా ప్రత్యేక హోదా కోసం క్యాండిల్ ర్యాలీ చేయాలని బయలుదేరిన వైఎస్ జగన్‌ను ఇదే విశాఖ ఎయిర్‌పోర్టులో రన్‌వే మీదే స్థానిక పోలీసులు సివిల్ డ్రెస్సుల్లో వచ్చి నిర్భందించడం అందరం కళ్లారా చూశామన్నారు. వైఎస్ జగన్‌పై దాడి తెలుగు దేశ ప్రభుత్వ వైఫల్యమన్నారు. ప్రతిపక్షనాయకుడికే రక్షణ లేకుంటే సామాన్య ప్రజలు ఎలా బతకాలని ప్రశ్నించారు. ఎయిర్‌పోర్టులో వెయిటర్ కత్తి పట్టుకొని తిరుగుతుంటే గాజులు తొడుక్కొన్నారా? అని మండిపడ్డారు. రక్షణ, నిఘా వ్యవస్థ ఫెయిల్ అయ్యిందన్నారు. వైఎస్ జగన్‌కి ఏం జరిగినా ఊరుకోబోమని రోజా నిప్పులు చెరిగారు. చంద్రబాబును తీవ్రంగా హెచ్చరిస్తున్నామన్నారు. దాడి చేసిన వ్యక్తి వెనక ఎవరున్నారో విచారణ చేసి వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. లేకపోతే చాలా తీవ్ర పరిస్థితులు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. భుజంపైన గాయం అయిన తీరు చూస్తుంటే గోంతు లక్ష్యంగానే ఈ దాడి జరిగిందని అర్థం అవుతోందన్నారు. జగన్ త్వరగా స్పందించడం వల్లే తప్పుంచుకోగలిగారని తెలిపారు. కత్తిని చూస్తుంటే దానికి ఏమైనా విషం పూసి దాడి చేశారో అర్థం కావట్లేదన్నారు. వైఎస్ జగన్ హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో దిగగానే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించి కత్తికి విషం లాంటిది ఏమైనా పూసారో నిర్ధారించాలని రోజా అన్నారు. వైఎస్ జగన్‌పై దాడి చేశారని తెలియడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ తీవ్రదిగ్భ్రాంతికి గురయ్యారన్నారు. -
విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో వైఎస్ జగన్‌పై దాడి
-
వైఎస్ జగన్‌పై హత్యాయత్నం
-
బ్రేకింగ్ న్యూస్: వైఎస్ జగన్‌పై హత్యాయత్నం!
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. విశాఖపట్నం ఎయిర్‌పోర్టు లాంజ్‌లో ఆయనపై ఓ దుండగుడు దాడి చేశాడు. సెల్ఫీ తీసుకుంటానంటూ వచ్చి వైఎస్ జగన్‌పై దుండగుడు దాడి చేశాడు. కోడి పందెలకు ఉపయోగించే కత్తితో అతను దాడికి తెగబడ్డాడు. దీంతో వైఎస్ జగన్ భుజానికి తీవ్రగాయమైంది. దాడి చేసిన వ్యక్తిని ఎయిర్‌పోర్ట్‌లోని ఓ క్యాంటీన్లో పనిచేస్తున్న వెయిటర్ శ్రీనివాస్‌గా గుర్తించారు. దాడి జరిగిన వెంటనే దుండగుడిని సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. 294వ రోజు పాదయాత్ర ముగించుకొని వైఎస్ జగన్ గురువారం హైదరాబాద్ తిరిగి వచ్చేందుకు విశాఖపట్నం విమానాశ్రయం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన వీఐపీ లాంజ్‌లో ఉండగా.. శ్రీనివాస్ అనే వెయిటర్.. సెల్ఫీ తీసుకుంటానంటూ వైఎస్ జగన్ వద్దకు వచ్చారు. అతను వస్తూనే.. వైఎస్ జగన్‌పై కోళ్ల పందెలకు ఉపయోగించే కత్తితో దాడి చేశాడు. ఈ సమయంలో అప్రమత్తంగా ఉన్న వైఎస్ జగన్ సహాయకులు దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ భుజానికి తీవ్ర గాయమైంది. కత్తికి విషపూరిత పదార్థం పూసి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తీవ్ర గాయం కావడంతో ప్రాథమిక చికిత్స అనంతరం వైఎస్ జగన్ హైదరాబాద్ బయలుదేరారు. (వైఎస్ జగన్‌పై దాడి ఫొటోలు) సెల్ఫీ తీసుకుంటానని నవ్వూతూ వచ్చాడు.. హోటల్ వెయిటర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ అనే వ్యక్తి వైఎస్ జగన్‌తో సెల్ఫీ తీసుకుంటాను అన్నాడు. వైఎస్ జగన్ సరేననడంతో.. ‘మీరు కాబోయే ముఖ్యమంత్రి’ అంటూ నవ్వూతూ ఎదురుగా వచ్చిన శ్రీనివాస్ ఒక్కసారిగా ఆయనపై దాడికి దిగాడు. ఊహించని ఘటన ఎదరుకావడంతో వైఎస్ జగన్ ఒక్కసారిగా పక్కకు తిరిగారు. దీంతో కత్తివేటు వైఎస్ జగన్ భుజంపై పడింది. కోడి పందాల్లో ఉపయోంచే కత్తితో ఈ దాడి జరిగింది. ఇది ముమ్మాటికే జగన్‌పైన జరిగిన హత్యాయత్నమే. ఒకవేళ వైఎస్ జగన్ చాకచక్యంగా వ్యవహరించకపోయుంటే ఏం జరిగేదో. -మజ్జి శ్రీనివాసరావు, ప్రత్యక్ష సాక్షి. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం : లైవ్ కవరేజ్ కోసం క్లిక్చేయండి -
‘దొంగ’ స్వామీజీకి చంద్రబాబు ఒంగి ఒంగి దండాలు
-
చుక్కలు చూపించిన ఇండిగో విమానం
విశాఖపట్నం: విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు మంగళవారం ఉదయం వచ్చిన కొందరు ప్రయాణికులు మధ్యాహ్నమైనా అక్కడే ఉన్నారు. ఎక్కాల్సిన విమానం వస్తుందని ఎదురుచూసిన వారికి ఎదురుచూపులే మిగిలాయి. దీంతో ఎయిర్పోర్ట్ అథారిటీపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ నుంచి ఉదయం 7:55 గంటలకు బెంగళూరు బయలుదేరాల్సిన ఇండిగో విమానం మధ్యాహ్నానికి కూడా విమానాశ్రయానికి రాలేదు. ప్రయాణికుల్లో ఓ మహిళ తన తండ్రి అంత్యక్రియలకు వెళ్తుండగా.. ఇలా జరిగిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం అక్కడివారిని కలచివేసింది. ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు మాత్రం ప్రతికూల వాతావరణం వల్ల విమానం రావడం ఆలస్యమైందని చెబుతున్నారు. మరేదో కారణం వల్లే ఆలస్యం జరిగిందని.. అధికారులు మాత్రం ప్రతికూల వాతావరణం అంటూ సర్థిచెబుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
ఆయనవి అసమాన ధైర్యసాహసాలు: వర్మ
-
ఆయనవి అసమాన ధైర్యసాహసాలు: వర్మ
సాధారణంగా ఎవరినైనా విమర్శించడానికి మాత్రమే తన ట్విట్టర్ ఖాతాను ఉపయోగించుకునే దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ప్రత్యేక హోదా ఉద్యమం గురించి స్పందించారు. విశాఖపట్నంలో నిర్వహించదలచిన శాంతియుత ప్రదర్శన విషయంలో వైఎస్ జగన్ అసలైన నిబద్ధతను, అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించారని చెప్పారు. గురువారం విశాఖలో తలపెట్టిన నిరసన ప్రదర్శనలకు తనవంతు మద్దతు ప్రకటించేందుకు వచ్చిన ఆయనకు 'హ్యాట్సాఫ్' అని ట్వీట్ చేశారు. కాగా, రాష్ట్రానికి మేలుచేసే అంశం కోసం శాంతియుతంగా కొవ్వొత్తులతో ప్రదర్శన చేస్తామంటే.. దాన్ని అడ్డుకునేందుకు ఏకంగా అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిని విమానాశ్రయం రన్‌వే మీదనే అరెస్టు చేసిన ఘటన విశాఖపట్నంలో ఎమర్జెన్సీ వాతావరణాన్ని తలపించింది. ఈ సందర్భంగా పోలీసుల తీరును వైఎస్ జగన్ గట్టిగా నిలదీశారు. అసలు వచ్చినవాళ్లు పోలీసులా కాదా.. ఐడీ కార్డులేవని అడిగారు. Y S Jagan showed real determination and exempalary courage in his actions to support today's protest..Hats off to him — Ram Gopal Varma (@RGVzoomin) 26 January 2017 -
మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారు?
-
ఏంటిది.. మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారు?
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం కొవ్వొత్తుల ర్యాలీ చేసేందుకు వచ్చిన తమను కనీసం డొమెస్టిక్ ఎరైవల్స్ వద్దకు కూడా వెళ్లనివ్వకుండా ఎలా ఆపుతారని పోలీసులను ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిలదీశారు. రన్ వే మీద నుంచి తనను లాక్కెళ్లడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. రన్‌వేకు కొన్ని మీటర్ల దూరం వరకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పోలీసులు దాదాపు అరగంట పాటు ఆయనను అక్కడే అడ్డుకున్నారు. దాంతో, వైఎస్ జగన్ వాళ్ల తీరును నిరసించారు. ఈరోజు పోలీసులు ఇద్దరిని కిడ్నాప్ చేశారని, వాళ్లలో ఒకరు లోక్ సభ సభ్యుడని ఆయన మండిపడ్డారు. అసలు రన్‌వే మీద ఆపడం ఏంటని, వచ్చినవాళ్లు పోలీసులేనా, వాళ్లకు ఒక ఐడీ కార్డు కూడా లేదని.. ఈ వ్యవహారం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేబినెట్ హోదా కలిగిన ప్రతిపక్ష నాయకుడితో ప్రవర్తించాల్సిన విధానాన్ని పోలీసులు పాటించకపోవడంతో అక్కడున్న ప్రతి ఒక్కరూ పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. పోలీసులు తమను రన్‌వే మీదనే అడ్డుకోవడం, అసలు లాంజ్ వైపు కూడా వెళ్లనివ్వకపోవడంతో.. 'మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారు ఇక్కడ? ఇటువైపు వీఐపీ లాంజ్ ఉంది, అటువైపు అరైవల్ లాంజ్ ఉంది. అక్కడకు వెళ్లండి. అయినా అసలు కేంద్ర ప్రభుత్వ ప్రాంతంలోకి రాష్ట్ర పోలీసులు ఎలా వస్తారు? ఒక ప్రయాణికుడిగా కూడా నన్ను లోపలకు పోనివ్వకుండా ఎందుకు ఆపుతున్నారు? లోపలకు అనుమతించండి, అక్కడ మాట్లాడదాం. ఎంతసేపు ఇక్కడ నిలబెడతారు? మీరు ఇంకా ఎక్కువ చేస్తే ఇక్కడే కూర్చుంటాం, తర్వాతి విమానం వచ్చిన తర్వాతైనా మీరు తలుపులు తీయాల్సిందే '' అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తమను ఏం చేయాలని ఆపుతున్నారని, ప్రతిపక్ష నేతతో ఎలా ప్రవర్తించాలో కూడా తెలియకుండా డిపార్టుమెంటులో ఎలా ఉన్నారని అడిగారు. డొమెస్టిక్ ఎరైవల్స్ అని బోర్డు కూడా కనిపించడంలేదా, ప్రయాణికులను అక్కడకు అనుమతించాలని మీకు తెలియదా అంటూ నిలదీశారు. తలుపు తీయాలని.. డొమెస్టిక్ ఎరైవల్స్ వద్దకు కూడా వెళ్లనివ్వకుండా రన్ వే మీద ఆపడం ఏంటని ప్రశ్నించారు. -
దేశ చరిత్రలో ఇదే ప్రథమం
-
దేశ చరిత్రలో ఇదే ప్రథమం
తనను నిర్బంధించడం అన్యాయమని, ఒక ప్రతిపక్ష నాయకుడిని అడ్డుకోవడం దేశ చరిత్రలో ఇదే ప్రథమమని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తమను నిర్బంధించడం అన్యాయమని, ప్రతిపక్ష నాయకులకు ఉన్న రాజకీయ హక్కులను కాలరాస్తున్నారని ఆయన మండిపడ్డారు. విశాఖ విమానాశ్రయం రన్‌వే మీద బైఠాయించిన ఆయన.. తనతో సహా పలువురు ఎంపీలు, నాయకులను అదుపులోకి తీసుకోడానికి పోలీసులు చేసిన ప్రయత్నాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రానికి మేలుచేసే అంశం కోసం శాంతియుతంగా కొవ్వొత్తులతో ప్రదర్శన చేస్తామంటే.. దాన్ని అడ్డుకునేందుకు ఏకంగా అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిని విమానాశ్రయం రన్‌వే మీదనే అరెస్టు చేసిన ఘటన విశాఖపట్నంలో ఎమర్జెన్సీ వాతావరణాన్ని తలపించింది. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి పరిశ్రమలు వెల్లువెత్తుతాయని, తద్వారా ఉద్యోగావకాశాలు వస్తాయని భావించి, కేవలం ఒక మౌన ప్రదర్శన చేస్తామంటే విమానాశ్రయం నుంచే నిర్బంధం లోకి తీసుకోడానికి పోలీసులు ప్రయత్నించారు. జర్కిన్లు, ట్రాక్ సూట్లు వేసుకుని ఉన్న కొంతమంది వచ్చి వైఎస్ జగన్ తదితరులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అసలు వాళ్ల వద్ద ఐడీ కార్డులు కూడా లేకపోవడంతో వాళ్లు పోలీసులో కాదో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. అదే విషయమై అడిగినా ఎలాంటి సమాధానం రాకపోవడం గమనార్హం. కాగా, లోపల జగన్‌ను నిర్బంధించే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసి విమానాశ్రయం బయట పెద్ద సంఖ్యలో యువత గుమిగూడారు. పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
170 మంది లోపలే ఉన్నారు... బయట..
రెండున్నర గంటలపాటు నిలిచిపోయిన విమానం ప్రయాణికులు లోపలుండగానే మరమ్మతులు గోపాలపట్నం: విశాఖ విమానాశ్రయంలో స్పైస్ జెట్ విమానానికి సాంకేతిక సమస్య తలెత్తింది. సరిగ్గా విమానంలోకి ప్రయాణికులు ఎక్కాక సమస్య ఎదురవ్వడంతో అప్పటికపుడు ప్రయాణికులను దించడానికి వీల్లేక యుద్ధప్రాతిపదికపై సాంకేతిక నిపుణులు లోపాన్ని సరిచేసి విమానాన్ని కదిలించారు. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. హైదరాబాదు నుంచి విశాఖకు స్పైస్‌జెట్ విమానం సాయంత్రం 6.30కి చేరింది. ఇది ఏడు గంటలకు తిరిగి హైదరాబాదు బయలుదేరాల్సి ఉండగా, దాదాపు 170మంది ప్రయాణికులు విమానంలో కూర్చున్నారు. ఇంతలో విమానానికి సాంకేతిక సమస్య ఎదురవ్వడంతో పెలైట్ అప్రమత్తమయ్యారు. తలుపులు తెరవడానికి కూడా ఆస్కారం లేకపోవడంతో ప్రయాణికులను విమానంలోనే ఉంచి సాంకేతిక నిపుణులను రప్పించారు. ప్రయాణికులకు నూడిల్సు తదితర ఆహారం సరఫరా చేశారు. ఎట్టకేలకు రాత్రి 9.25కి సమస్య పరిష్కారమై విమానం కదిలింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకుని క్షేమంగా వెళ్లారు. -
సీఎం గారికో షెడ్డు!
ఎయిర్‌పోర్టు పరిసరాల్లో నిర్మాణం కలెక్టర్ ఎన్.యువరాజ్ స్థలపరిశీలన విశాఖపట్నం: రాజు తలచుకుంటే.. కాదు కాదు సీఎం తలచుకుంటే ఏదైనా జరుగుతుంది. పగటి పూట వెన్నెల విరులు కురుస్తాయి. రాత్రి సూర్యుడు వెలుగులు చిందిస్తాడు. ఏంటో ఈ విడ్డూరం అనుకోవద్దు. ఎందుకంటే అలాంటి చిత్రాలే ఇప్పుడు జరుగుతున్నాయి. విషయమేమిటంటే సీఎం చంద్రబాబు రాజధాని అమరావతిలో కంటే విశాఖ నగరంలో పర్యటించిందే ఎక్కువ. సగటున వారానికోసారి నగరంలో అడుగుపెడుతున్నారు. ఆయనతో పాటు మంత్రులూ వస్తున్నారు. పైగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు వెళ్లాల్సి వచ్చినపుడు కూడా విశాఖ విమానాశ్రయంలో దిగి వెళుతున్నారు. ఎలా చూసినా సీఎం, మంత్రుల తాకిడి విశాఖకు విపరీతంగా పెరిగింది. వారు వచ్చి నపుడల్లా నగరంలోకి వచ్చి అతిథి గృహంలో విశ్రాంతి తీసుకోవడం, కార్యకర్తలను కలుసుకోవడం వంటి పనులకు సమయం సరిపోవడం లేదంట. దీంతో బాగా ఆలోచించిన పాలకులు ఎయిర్‌పోర్టు వద్దే అలాంటి ఏర్పాట్లు ఉంటే బాగుంటుం దని భావించారు. అధికారం వారిది కాబట్టి వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేసేశారు. వారి ఆదేశాల మేరకు ఎయిర్‌పోర్టులో సీఎం కోసం తాత్కాలిక షెడ్ నిర్మాణానికి కలెక్టర్ ఎన్.యువరాజ్ గురువారం స్థల పరిశీలన జరిపారు. నిజానికి ఈ స్థలం నేవీ ఆధీనంలో ఉంది. వారి నుంచి అనుమతి తీసుకోవాలి. అధికారులు తలుచుకుంటే ఇదేమంత పెద్ద కష్టం కాదులే. అయితే అధికారపార్టీ కార్యకలాపాలకు ఎయిర్‌పోర్టును వేదిక చేసుకోవడమే విడ్డూరంగా ఉంది మరి. గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో త్వరలో నిర్మించనున్న ఈ షెడ్డును అంచెలంచెలుగా విస్తరించి టీడీపీ మినీ కార్యాలయంగా మార్చనున్నట్టు సమాచారం. కార్యకర్తల సమావేశాలు, పార్టీ సమీక్షలంటూ ఎయిర్‌పోర్టులో గందరగోళం సృష్టిస్తే దేశ, విదేశీ విమాన ప్రయాణికులకు ఇబ్బందిగా పరిణమించే అవకాశం ఉంది. -
వైజాగ్ ఎయిర్ పోర్ట్, షార్లను పేల్చేస్తాం..
- టార్గెట్ లో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులూ - వైజాగ్ ఎయిర్ పోర్టుకు దుండగుల బెదిరింపు లేఖ.. నిర్ధారించిన సీపీ అమిత్ గార్గ్ హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను టార్గెట్ చేసుకున్నామని, విశాఖపట్టణం ఎయిర్ పోర్టుతోపాటు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ అంతరీక్ష కేంద్రాన్నీ పేల్చేస్తామని గుర్తుతెలియని దుండగులు బెదిరింపు లేఖలు పంపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆయా సంస్థల వద్ద అదనపు బలగాలను మోహరించారు. అంతేకాక, ఇతర ముఖ్య కార్యాలయాల దగ్గరా భద్రతను పెంచారు. ఈ కలకలానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని విశాఖపట్టణం ఎయిర్ పోర్టుకు కొద్ది రోజుల కిందట ఒక ఉత్తరం వచ్చింది. అందులో సీఎంలను టార్గెట్ చేశామనడం, ఎయిర్ పోర్టు, షార్ లను పేల్చేస్తామంటూ తెలుగులో రాసుంది. ఎయిర్ పోర్టు అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బెదిరింపు లేఖ వచ్చింది వాస్తవమేనని, ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ పట్టణంలో ఈ లెటర్ పోస్ట్ అయినట్లు గుర్తించామని విశాఖ పోలీస్ కమిషనర్ అమిత్ గార్గ్ చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది. -
విశాఖ విమానాశ్రయం రికార్డు
గోపాలపట్నం(విశాఖపట్నం): విశాఖ విమానాశ్రయం అంతర్జాతీయంగా అభివృద్ధి చెందుతున్న నేపధ్యంలో ఎయిర్‌పోర్టు అధారిటీ ఆఫ్ ఇండియా ప్రశంసలందుకునే స్ధితికి చేరింది. తాజాగా మిలియన్ ట్రేడ్ మార్క్‌ని అధిగమించి శభాష్ అనిపించుకుంది. ఈవిమానాశ్రయంలో ఎయిరిండియా, ఎయిర్ఆసియా, ఎయిర్‌కోస్తా, మలిందో, సిల్క్ ఎయిర్వేస్, ఇండిగో, స్పైస్ జెట్ విమానాలు దేశీయ అంతర్జాతీయ విమానసర్వీసులు అందిస్తున్నాయి. హైదరాబాదు, తిరుపతి, విజయవాడ, చెన్నై, కోల్‌కతా, ముంబయ్, బెంగుళూరు, ఢిల్లీ వంటి విమానాశ్రయాలతో పాటు దుబాయ్, కౌలాలంపూర్, సింగపూర్, పోర్టుబ్లెయిర్‌లకూ విమాన సర్వీసులు ఊపందుకున్నాయి. 2012-13 సంవత్సరంలో తొలి సారి ప్రయాణికుల సంఖ్య మిలియన్‌మార్కుకు చేరుకుంది. ఆ ఏడాది ప్రయాణికుల సంఖ్య 10,38,958కు చేరి అప్పట్లో రికార్డు సృష్టించింది. తర్వాత 2013-14 సంవత్పరంలో దీన్ని అధిగమించి ముందుకెళ్తుందని అధికారులు ఆశించినా 10.14 లక్షల మంది మాత్రమే ప్రయాణించారు. రాష్ట్ర విభజన ఉద్యమాలు, సమ్మెలు, హుద్ హుద్ తుపాను ప్రభావం బాగా చూపింది. తర్వాత రాష్ట్రం రెండుగా చీలిన తరుణంలో 2014-15 లో ప్రయాణికుల రద్దీ ఎలా వుంటుందోనని అధికారులు ఆలోచనలోపడ్డారు. అయితే దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు పెరగడంతో అధికారులు ఊహించనంతగా రద్దీ పెరిగింది. తాజాగా ఈసంఖ్య 11 లక్షల ప్రయాణికులను అధిగమించినట్లు రికార్డులు చెబుతున్నాయి. అంతర్జాతీయ గుర్తింపునకుఅవకాశాలు: వినోద్‌కుమార్‌శర్మ విశాఖ విమానాశ్రయం డెరైక్టర్ విశాఖ విమానాశ్రయానికి అంతర్జాతీయ విమానాశ్రయంగా గుర్తింపు రావడానికి అవకాశాలున్నాయని విమానాశ్రయ డెరైక్టర్ వినోద్ కుమార్ శర్మ అన్నారు. -
'విశాఖ ఎయిర్‌పోర్టులో నిఘా పటిష్టం'
విశాఖ: విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో నిఘాను మరింత పటిష్టం చేశామని కస్టమ్స్ కమిషనర్ రాజేంద్రన్ పేర్కొన్నారు. ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి డిటేక్టర్లు, లగేజ్ స్కానర్లను ఉపయోగిస్తున్నామని ఆయన అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఎయిర్ కనక్టవిటీ పెరిగిన తర్వాత గోల్డ్ స్మగ్లింగ్ వంటి సమస్యలు ప్రారంభమయ్యాయని చెప్పారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సంబంధించి కంటైనర్లుపై కూడా నిఘా పెట్టామని రాజేంద్రన్ తెలిపారు. -
విశాఖ విమానాశ్రయంలో బంగారం పట్టివేత
విశాఖపట్నం: విశాఖ విమానాశ్రయంలో 4 కేజీల బంగారు ఆభరణాలతో ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం.. దుబాయ్ నుంచి హైదరాబాద్ మీదుగా విశాఖకు శనివారం రాత్రి వచ్చిన వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో ఆరా తీయగా గుట్టురట్టయింది. సదురు వ్యక్తిని శంషాబద్ విమానాశ్రయంలో నిఘావర్గాలు ముందుగానే అనుమానించినా అప్పటికే విమానం కదిలిపోవడంతో అక్కడి అధికారులు విశాఖ అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో విశాఖ విమానాశ్రయంలో అధికారులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా బాత్రూంలో రూ. 1.2 కోట్లు విలువచేసే 4 కేజీల బంగారం బయటపడింది. అనంతరం అధికారులు నిందితుడిని హైదరాబాద్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డెరైక్టరేట్ (డీఆర్ఐ)కు అప్పగించినట్లు సమాచారం. -
విశాఖకు విమాన రాకపోకలు ప్రారంభం
విశాఖ : హుదూద్ తుఫాను దెబ్బకు దారుణంగా దెబ్బతిన్న విశాఖపట్నం విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు శుక్రవారం ప్రారంభమైయ్యాయి. ఇందు కోసం ఎయిర్పోర్ట్ అథారిటీ తాత్కాలికంగా విమానాశ్రయాన్ని సిద్ధం చేసింది. అయితే కొద్ది సంఖ్యలో మాత్రమే విశాఖ-హైదరాబాద్ మధ్య విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఎయిరిండియా విమాన సర్వీసులు నేటి నుంచి ప్రారంభం కాగా, ప్రయివేట్ విమాన సర్వీసులు శనివారం నుంచి తిరగనున్నాయి. నవంబర్ 1వ తేదీ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. 2009 ఫిబ్రవరిలో నిర్మించిన విమానాశ్రయ భవనం పైకప్పు బాగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. అయితే అదృష్టవశాత్తు రన్‌వే బాగుండటం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ కూడా మరీ ఎక్కువగా దెబ్బ తినకపోవడంతో విమానాలను తిప్పడానికి సమస్య లేదని విమానాశ్రయ అధికారులు తెలిపారు. -
త్వరలో విశాఖ హార్బర్ లో కార్యకలాపాలు
న్యూఢిల్లీ: తుఫాను దెబ్బకు దారుణంగా దెబ్బతిన్న విశాఖ హార్బర్ లో కార్యకలాపాలను త్వరలో పునరుద్ధరిస్తామని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ సృష్టం చేసింది. ఇందుకు సంబంధించి సర్వే చేస్తున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా పౌరవిమానాల రాకపోకలకు సంబంధించి రక్షణశాఖ గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించి బుధవారం పౌరవిమానాయాన శాఖ అధికారులతో రక్షణశాఖ అధికారులు సమావేశమైన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో శుక్రవారం నుంచి విమాన సర్వీసులు యథావిధిగా కొనసాగనున్నాయి. అదృష్టవశాత్తు రన్‌వే బాగుండటం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ కూడా మరీ ఎక్కువగా దెబ్బ తినకపోవడంతో విమానాలను తిప్పడానికి సమస్య లేదని అధికారులు చెప్పారు. హుదూద్ తుపాను ప్రభావంతో వీచిన గాలులు విశాఖపట్నంతో పాటు విమానాశ్రయాన్ని తీవ్రంగా వణికించిన సంగతి తెలిసిందే. తాత్కాలికంగా ప్యాసింజర్ టెర్మినల్ మీద ఓ టార్పాలిన్ షీటును పైకప్పుగా వేసి ఉంచారు. -
రేపట్నుంచే విశాఖలో విమానాలు!
తుఫాను దెబ్బకు దారుణంగా దెబ్బతిన్న విశాఖపట్నం విమానాశ్రయం నుంచి విమానాలు శుక్రవారం నుంచి తిరుగుతాయి. హుదూద్ విలయం సృష్టించిన ఐదు రోజులకు మళ్లీ గాలిమోటార్లు పనిచేయడం ప్రారంభం అవుతోంది. ఎయిరిండియా విమానం ఢిల్లీ నుంచి విశాఖ వచ్చి, ఇక్కడినుంచి మళ్లీ హైదరాబాద్ వెళ్తుంది. 2009 ఫిబ్రవరిలో నిర్మించిన ఈ భవనం పైకప్పు బాగా దెబ్బతింది. అయితే అదృష్టవశాత్తు రన్‌వే బాగుండటం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ కూడా మరీ ఎక్కువగా దెబ్బ తినకపోవడంతో విమానాలను తిప్పడానికి సమస్య లేదని అధికారులు చెప్పారు. గంటకు 180-195 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు విశాఖపట్నంతో పాటు విమానాశ్రయాన్ని తీవ్రంగా వణికించాయి. శనివారం నుంచి మరిన్ని విమానాలు తిరుగుతాయి. తాత్కాలికంగా ప్యాసింజర్ టెర్మినల్ మీద ఓ టార్పాలిన్ షీటును పైకప్పుగా వేశారు. ప్రస్తుతానికి కంప్యూటర్లన్నీ తుఫాను కారణంగా పాడైపోయాయి కాబట్టి, బోర్డింగ్ పాసులు మాత్రం మాన్యువల్‌గానే ఇస్తారు. నెలాఖరుకు విమానాశ్రయం పూర్తిస్థాయిలో పనిచేస్తుందని అధికారులు చెప్పారు. -
విశాఖ ఎయిర్ పోర్ట్ పైకప్పు ధ్వంసం
-
విశాఖ ఎయిర్‌పోర్టులో 'బుల్లెట్' కలకలం
విశాఖపట్నం: స్నేహితుల దినోత్సవం రోజున ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్ ఓ యువతిని జైలు పాల్జేసింది. అనుమానాస్పద వస్తువు ఉందన్న అనుమానంతో గురుప్రీత్ కౌర్(22) అనే యువతిని విశాఖ విమానాశ్రయంలో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద రివాల్వర్ బుల్లెట్ ఉండడంతో అధికారులు అవాక్కయ్యారు. ఆమెను అదుపులోకి విచారించారు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఈ బుల్లెట్ తనకు ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇచ్చిందని ఆమె తెలిపినట్టు పోలీసులు వెల్లడించారు. పూణెలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న కౌర్ మంచి ఉద్యోగం కోసం ఇక్కడికి వచ్చింది. పూణెకు తిరిగి వెళుతూ బుల్లెట్ తో దొరికిపోయింది. ఆమె తండ్రి నావికాదళంలో పనిచేస్తున్నారు. బుల్లెట్ కలిగివున్నందుకు ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం ఆమెను కోర్టులో ప్రవేశపెట్టనుట్టు పోలీసులు తెలిపారు. -
అక్రమార్కులకు..బంగారు బాట
స్మగ్లర్ల అడ్డాగా వైజాగ్ ఎయిర్‌పోర్టు ఏడాదిలో నాలుగుసార్లు రూ.1.80కోట్ల బిస్కెట్ల పట్టివేత తాజాగా శంషాబాద్ విమానాశ్రయంలో పసిడి తరలింపుపై నిఘా పెంపు తప్పించుకునేందుకు విశాఖను కేంద్రంగా ఎంచుకుంటున్న అక్రమార్కులు సాక్షి, విశాఖపట్నం: ప్రశాంత విశాఖ నగరం రకరకాల నేరాలకు అడ్డాగా మారుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వైజాగ్ ఎయిర్‌పోర్టు క్రమక్రమంగా బంగారం అక్రమ రవాణాకు అడ్డాగా మారుతోంది.ఇక్కడి నుంచి దుబాయ్‌కు ఏకైక అంతర్జాతీయ విమాన సర్వీసు ఉండడంతో పసిడి అక్రమార్కులు ఈ విమానం ద్వారా ఎయిర్‌పోర్టు నుంచి సులువుగా బంగారం దారి మళ్లించేస్తున్నారు. చెన్నయ్, హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో నిఘా పెరగడంతో పసిడి దొంగలు ప్రత్యామ్నాయంగా పెద్దగా నిఘా ఉండని వైజాగ్ ఎయిర్‌పోర్టును వ్యాపారానికి కేంద్రంగా ఎంచుకుంటున్నారు. రానురాను ఇక్కడి నుంచి అక్రమ రవాణా పెరిగిపోతోంది. గడిచిన ఏడాదిలో ఇప్పటివరకు నాలుగుసార్లు రూ.1.80 కోట్ల విలువైన బంగారం పట్టుబడింది. విశాఖపట్నం ఎయిర్‌పోర్టు నుంచి విదేశాలకు వెళ్లే విమానాలు చాలా తక్కువ. అందులోనూ దుబాయ్‌కు వెళ్లే ఏకైక సర్వీసు గతేడాది ప్రారంభమైంది. ఇది కూడా నేరుగా కాకుండా విశాఖ-హైదరాబాద్-దుబాయ్ మీదుగా వెళ్తుంది. దీంతో విశాఖ నుంచి నిత్యం అనేకమంది ప్రయాణికులు వచ్చి పోతుంటారు. కొందరు అక్రమార్కుల కన్ను ఈ సర్వీసుపై పడింది. తిరుగు ప్రయాణంలో దుబాయ్ విమానం హైదరాబాద్ మీదుగా వస్తుండడంతో పసిడి అక్రమార్కులకు మంచి వరంగా మారుతోంది. దుబాయ్ విమానం హైదరాబాద్‌లో దిగగానే పసిడి రవాణా చేసే వారి తరఫు వ్యక్తి హైదరాబాద్ నుంచి విశాఖకు రావడానికి దుబాయ్ విమానం టికెట్ తీసుకుంటున్నారు. తీరా ఫ్లైట్ విశాఖకు రాగానే సరకు హైదరాబాద్‌లో విమానం ఎక్కిన వ్యక్తికి కట్టబెడుతున్నారు. విశాఖలో విమానం దిగిన వెంటనే కేవలం దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణిలకులను మాత్రమే కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఎక్కిన ప్రయాణికులపై నిఘా పెద్దగా ఉండడంలేదు. దీన్ని అడ్డంగా పెట్టుకుని పసిడిని విశాఖ ఎయిర్‌పోర్టునుంచి సులువుగా తరలించేస్తున్నారు. విశాఖ నుంచి దుబాయ్ సర్వీసు మొదలైన గతేడాదినుంచి ఇప్పటివరకు మొత్తం నాలుగుసార్లు దఫదఫాలు రూ.25లక్షలు, రూ.32లక్షలు, 2 కేజీల విలువైన రూ.60లక్షలు, 2.15 కేజీల విలువైన 61.02లక్షల సరకును పట్టుకున్నారు.అంటే పట్టుబడని సరకు ఇంకా ఎంతుంటుందో మరి. -
దుబాయి విమానంలో దొంగ బంగారం
విశాఖపట్నం (గోపాలపట్నం), న్యూస్‌లైన్: సుంకం చెల్లించకుండా కేజిన్నర బంగారాన్ని రవాణా చేస్తున్న ఓ ముఠా విశాఖ విమానాశ్రయంలో అధికారులకు చిక్కింది. శ్రీలంకకు చెందిన చెందిన నలుగురు యువకులు దుబాయ్ నుంచి మంగళవారం కేజీన్నర బంగారంతో విశాఖ విమానాశ్రయంలో దిగారు. విమానానికి ఎస్కార్ట్‌గా హైదరాబాదు నుంచి విశాఖ వచ్చిన నిఘా అధికారులు వీరి కదలికలను అనుమానించారు. నిబంధనల ప్రకారం విదేశాల నుంచి 35వేల విలువకు మించి బంగారంతో వస్తే ప్రభుత్వానికి సుంకం చెల్లించాలి. విమానం నుంచి వెంబడిస్తున్న అధికారులు కస్టమ్స్ అధికారులను అప్రమత్తం చేశారు. అధికారులు వారిని గుర్తించి తనిఖీలు జరపడంతో కేజీన్నర బంగారం బయటపడింది. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు పరారైనట్లు తెలిసింది. విమానాశ్రయం బయట ఓ ఏజెంట్ కూడా తప్పించుకున్నట్లు తెలిసింది.