ఏంటిది.. మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారు? | YS Jagan Mohan Reddy slams police attitude in vizag airport | Sakshi
Sakshi News home page

ఏంటిది.. మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారు?

Published Thu, Jan 26 2017 5:13 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

ఏంటిది.. మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారు? - Sakshi

ఏంటిది.. మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారు?

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం కొవ్వొత్తుల ర్యాలీ చేసేందుకు వచ్చిన తమను కనీసం డొమెస్టిక్ ఎరైవల్స్ వద్దకు కూడా వెళ్లనివ్వకుండా ఎలా ఆపుతారని పోలీసులను ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిలదీశారు. రన్ వే మీద నుంచి తనను లాక్కెళ్లడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. రన్‌వేకు కొన్ని మీటర్ల దూరం వరకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పోలీసులు దాదాపు అరగంట పాటు ఆయనను అక్కడే అడ్డుకున్నారు. దాంతో, వైఎస్ జగన్ వాళ్ల తీరును నిరసించారు. ఈరోజు పోలీసులు ఇద్దరిని కిడ్నాప్ చేశారని, వాళ్లలో ఒకరు లోక్ సభ సభ్యుడని ఆయన మండిపడ్డారు. అసలు రన్‌వే మీద ఆపడం ఏంటని, వచ్చినవాళ్లు పోలీసులేనా, వాళ్లకు ఒక ఐడీ కార్డు కూడా లేదని.. ఈ వ్యవహారం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేబినెట్ హోదా కలిగిన ప్రతిపక్ష నాయకుడితో ప్రవర్తించాల్సిన విధానాన్ని పోలీసులు పాటించకపోవడంతో అక్కడున్న ప్రతి ఒక్కరూ పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. 
 
పోలీసులు తమను రన్‌వే మీదనే అడ్డుకోవడం, అసలు లాంజ్ వైపు కూడా వెళ్లనివ్వకపోవడంతో.. 'మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారు ఇక్కడ? ఇటువైపు వీఐపీ లాంజ్ ఉంది, అటువైపు అరైవల్ లాంజ్ ఉంది. అక్కడకు వెళ్లండి. అయినా అసలు కేంద్ర ప్రభుత్వ ప్రాంతంలోకి రాష్ట్ర పోలీసులు ఎలా వస్తారు? ఒక ప్రయాణికుడిగా కూడా నన్ను లోపలకు పోనివ్వకుండా ఎందుకు ఆపుతున్నారు? లోపలకు అనుమతించండి, అక్కడ మాట్లాడదాం. ఎంతసేపు ఇక్కడ నిలబెడతారు? మీరు ఇంకా ఎక్కువ చేస్తే ఇక్కడే కూర్చుంటాం, తర్వాతి విమానం వచ్చిన తర్వాతైనా మీరు తలుపులు తీయాల్సిందే '' అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. 
 
తమను ఏం చేయాలని ఆపుతున్నారని, ప్రతిపక్ష నేతతో ఎలా ప్రవర్తించాలో కూడా తెలియకుండా డిపార్టుమెంటులో ఎలా ఉన్నారని అడిగారు. డొమెస్టిక్ ఎరైవల్స్ అని బోర్డు కూడా కనిపించడంలేదా, ప్రయాణికులను అక్కడకు అనుమతించాలని మీకు తెలియదా అంటూ నిలదీశారు. తలుపు తీయాలని.. డొమెస్టిక్ ఎరైవల్స్ వద్దకు కూడా వెళ్లనివ్వకుండా రన్ వే మీద ఆపడం ఏంటని ప్రశ్నించారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement